శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

5, అక్టోబర్ 2012, శుక్రవారం

పంచాంగ విషయాలు 4-అవయవములు ఆదరుట వలన ఫలము



అవయవములు ఆదరుట వలన ఫలము
 
కుడి ప్రక్కన అదిరిన మేలు,ఎడమప్రక్కన మధ్యమ ఫలము. నడినెత్తిన మృష్టాన్నము , నొసలు మేలు, కుడి చంప రాజ భయం, ఎడమ చేయి ఉద్యోగము, స్త్రీలకు కుడి కన్ను కీడు, ఎడమ కన్ను మేలు, రెండు కన్నులు అదిరిన మేలు. ముక్కు రోగం . ముక్కు రోగం .పై పెదవి కలహము.క్రింద పెదవి భోజన సౌఖ్యము. గడ్డము లాభము. కుడి చెక్కిలి ధనము. ఎడమ చెక్కిలి దొంగల భయము. కుడి భుజము సంభోగము. ఎడమభుజము కీడు. రొమ్ము ధనము. చేతులు వాహన లాభం. అరచేయి సంతానం .కుడి తోడ రాజ జయము. మోకాళ్ళు జాడ్యము. మొగాళ్ళు దాన్యలాభము . అరికాళ్ళు సౌఖ్యము.ప్రక్క ఆభరణ ప్రాప్తి.

4, అక్టోబర్ 2012, గురువారం

పంచాంగ విషయాలు 3- శకున ఫలితములు

పంచాంగ విషయాలు - శకున ఫలితములు
శుభ శకునములు
కన్యలు, ముత్తైదువలు , పువ్వులు, భోగంసాని, పండ్లు ,కుంకుమ ,పసుపు, పాలు, మంగళ వాద్యములు, మండుచున్న కాగడా, గంటాద్వని, విజయ శబ్దములు, గాడిద అరుపు ,వేదనాదము, జంట బ్రాహ్మణులు ,చల్లటి గాలి,గుఱ్ఱములు, ఏనుగులు, ఆవులు, చేపలు, సంతోషవార్తలు, తెల్లని గొడుగు, నీళ్ళ బిందెలు, మద్దెలలు, వీణ, శంఖము, కర్ర పట్టుకొనినవాడు, నీళ్ళ బిందెలతో స్త్రీలు, అనుకూలమైన గాలి ఇవి ఎదురగుట మంచిది.
అశుభ శకునములు
ఎక్కడకు వెళ్తున్నావని అడుగుట , ఎందుకని అడుగుట, నేనూ వచ్చేదననుట , కొంతసేపు ఆగమనుట, ఒక్కడివీ వెల్ల వద్దనుట,భోజనం చేసి వెళ్ళమనుట , వంటివి వినుట మంచిది కాదు. తుమ్ములు వినుట, పొగతో ఉన్న నిప్పు ,గ్రుడ్డివాడు, విధవ, నూనె కుండ, ఆయుధము, గొడ్డళ్ళు, బోడివాడు , ఏడ్చు చున్నవారు, ఒంటి బ్రాహ్మణుడు, దిగంబరుడు , వాన, గాలి, రక్త దర్శనము, కష్టమైన మాటలు వినుట ,పిల్లి, కాకి, పాము, కోళ్ళు ,కోతులు  అడ్డుగా వచ్చుట అశుభ శకునములు.
అశుభ శకునములు ఎదురైన, వెళ్ళుట తప్పని సరియైనప్పుడు ' వాసు దేవాయ మంగళం' అని భగవంతుని స్మరిస్తూ బయలు దేరవలెను.

30, సెప్టెంబర్ 2012, ఆదివారం

పంచాంగ విషయాలు 2

పంచాంగ విషయాలు 2

వర్జ్యం : ' వర్జింపుట ' అనగా వదలివేయుట అని అర్ధము. ప్రతి దినము కాలెండరు నందు చెప్పబడు రాహుకాల, దుర్ముహూర్త వర్జ్యాదులలో ఏ కార్యము తల పెట్టినను అది సంపూర్ణ ఫల మందించదు. కావున అట్టి సమయములలో ఏ శుభ కార్యమును ప్రారంబించరాదని ఆర్యుల అభిప్రాయము. మన ఆంధ్ర రాష్ట్రములో ఎక్కువగ పాడిలో నున్నది . వర్జ్యము ( దక్షినాది రాష్ట్రాల వారు రాహు కాలము, యమగండము వంటివి పాటించెదరు ). ప్రతి శని వారము సూర్యోదయంతో ప్రారంబమగునది దుర్ముహూర్తం . సూర్యోదయంతో మొదలయ్యే 5  ఘడియలు అనగా  1 గం . 40 ని .పాటు ఈ దుర్ముహూర్తముండును. కాన ఆ సమయమందును  ఏ శుభ కార్యము తల పెట్ట రాదు. రాహు కాల యమగండ కాలములు నిత్యము నిర్దిష్ట సమయములలో ఉండును. అవి చూచుకొని ఆయా సమయములలో కాక మిగిలిన శుభ ఘడియలలో కార్యములు తల పెట్టిన అవి నిర్విఘ్నముగా  నెరవేరును.
ఏలినాటి శని : ప్రతి మానవుని జీవిత కాలమందు ముప్పది ఏండ్ల కోక మారు ఏలినాటి శని ప్రవేశించును. జన్మ రాశికి - నామ రాశికి - ద్వాదశమునందు - లగ్నము నందు , ద్వితీయము నందు - శని యున్నచో ఎల్నాటి శని యందురు. శని గ్రహము ఒక్కొక్క రాశి యందు 2 1/2 సంవత్సరముల కాలము సంచారము -మొత్తము కలిపి ఏడున్నర సంవత్సర కాలము ఎల్నాటి శనియున్నదన్నమాట .
ఫలితము: ద్వాదశ  రాశి యందున్నప్పుడు  -ధన వ్యయము , మానసిక భాద , అందోళనములు , కుటుంబ సమస్యలు, వ్యాపార, వృత్తులందు వ్యతిరేకములు కలుగును.
జన్మరాశి యందున్నప్పుడు - బంధు మిత్ర ద్వేషములు, ధన నష్టము - కుటుంబ స్థితి తారుమారుగా ఉండును. కొన్ని శుభ గ్రహ వీక్షణచే ప్తయత్న పూర్వక ధనాదాయము , మిశ్రమ ఫలితములు ఉండవచ్చును. కళత్ర పీడ, మతి బ్రమణం, దీర్ఘ వ్యాదులు కలుగ వచ్చును .
ద్వితీయము నందున్నప్పుడు - ఆశా జీవి యగును . నిందలు పడుట, నిత్య దు : ఖము కలుగును. మానసికముగా క్రుంగదీయును .పై కాలములందు మాస శివ రాత్రి రోజున శని పూజలు చేయుట మంచిది.
సం    నె    రో
ముఖము నందు         0  3  10 శరీర పీడ - ధన నష్టాదులు
దక్షిణ భుజము           1  1   00 ఉద్యోగ వృత్తులందు లాభాదులు
పాదములందు            1  8  10  అశాంతి - దిగులు - అవమానములు
హృదయస్థానము        1  4  20  ధన ప్రాప్తి - గౌరవము - కీర్తి
వామ భుజము           1  1  10  వ్యాధి పీడ - ధన వ్యయము

29, సెప్టెంబర్ 2012, శనివారం

పంచాంగ విషయాలు 1

 పంచాంగ విషయాలు:-
                తిధి, వార, నక్షత్ర  వివరములతో  గ్రహ గమనాలతో , శుభ దినములతో , పండుగలతో, శుభాశుభ ముహూర్తములతో సూర్యోదయ ,అస్తమయ సమయములతో, వర్జ్య , దుర్ముహూర్త సమయములతో ప్రతిరోజూ మీ ముందుండెడిదే ఈ పంచాంగము.
 
        ఈ పంచాంగము  నక్షత్రముల , రాశుల దిన ,వార , మాస ,సంవత్సరాల వారీ ఫలితాలతో,గ్రహ దోషాలు, వాటి నివారణలతో  సామాన్యులకు కూడ అర్ధ మగు రీతిలో మీ కందించబడుతుంది . ఈ అనంత మైన  విశ్వములో మనము నివసించు చున్న భూమీ ఒక గుండ్రని గోళము.అటువంటి  గోళములో విశ్వములో లెక్కలేనన్ని ఉన్నవి  మనకు పెద్దవిగా కనబడి  ఎక్కువగా చలనము ఉన్న వాటిని గ్రహములని,చిన్నవాటిని నక్షత్రములని అనుచున్నాము. ఈ గ్రహములు ముఖ్యముగా తొమ్మిది . సూర్యుడు ,చంద్రుడు ,అంగారకుడు ,బుధుడు ,గురుడు ,శుక్రుడు ,శని , రాఃహుడు ,కేతువు . సూర్యుడు ప్రధాన గోళముగా ఈ గోళములన్నియు సూర్యునిచుట్టు తిరుగు చున్నవి. వీనిలో కొన్ని ఒక దాని చుట్టూ మరియొకటి తిరుగుచూ ,ఒక దానినొకటి ఆకర్షించు కొనుచున్నవి . ఉదా : భూమి తన చుట్టూ తాను తిరుగుచూ ,సూర్యుని చుట్టూ గూడా తిరుగు చున్నది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగు చున్నాడు.
                     భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన సూర్యుని వెలుతురు ఒక భూభాగము నుండి  మరియొక భూభాగమునకు మారుటచే రాత్రి , పగలు ఏర్పడుచున్నవి. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరుగుటను ఒక రోజు అనియు , చంద్రుడు భూమి చుట్టూ ఒక ప్రదక్షిణము చేయుటను ఒక నెల అనియు , భూమి సూర్యునిచుట్టు ఒక ప్రదక్షిణము చేయుటను ఒక సంవత్సరము అనియు ప్రపంచము లోని అన్ని దేశములవారు లెక్కించుచున్నారు . గ్రహములు సంచరించుచున్న  మార్గమును మన పూర్వీకులు జ్యోతిశ్చక్రముగా ఊహ చేసి , దానిని 12  భాగములు (రాశులు ) గా భాగించినారు. ఒక్కొక్క భాగములో నున్న నక్షత్రముల రాశులకు ఒక్కొక్క పేరు పెట్టినారు. నక్షత్రములు మొత్తము 27 . ఒక్కొక్క నక్షత్రమునకు 4 భాగములు (పాదములు) ఊహించి అటువంటి నక్షత్ర భాగములను 9 ని ఒక రాశిగా నిర్దారించినారు. వాని రూపములను ఊహించి ఆ ప్రకారము రకరకముల పేర్లు పెట్టినారు. ఒక్కొక్క నక్షత్రమునకు 4  భాగముల వంతున 27 నక్షత్రములకు 108 భాగములకు 12  రాశులు అయినవి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుట వలన మనకు రోజుకొక నక్షత్ర మండలము నుండి కనపడుచున్నాడు . ఏ నక్షత్ర మండలములో చంద్రుడు మనకు కనబడు చున్నాడో ఆ నక్షత్రమును మన పంచాంగపు వ్యవహారములలో ఆనాటి నక్షత్రముగా పరిగణించుచున్నాము .

 
                    పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్ర మండలములో కనపడునో ఆ నక్షత్రము పేరు ఆ నెలగా వాడుచున్నాము. చిత్తా నక్షత్ర మండలములో చంద్రుడు పౌర్ణమినాడు కనపడు మాసమునకు చైత్రమాసము అని పేరు పెట్టబడినది. ఈ ప్రకారము విశాఖ - వైశాఖ , జ్యేష్ట -జ్యేష్టము , పూర్వాషాడ - ఆషాడము , శ్రవణము - శ్రావణము , ఉత్తరాభాద్ర - భాద్రపదము, అశ్వని - ఆశ్వయుజము, కృత్తిక - కార్తీకము , మృగశిర - మార్గశిరము, పుష్యమి - పుష్యము, మఖ - మాఘము, ఉత్తర ఫల్గుణి - పాల్గుణము అని మనము ఆ నెలలును పిలుచుచున్నాము .

 
                    పై అన్ని విషయములను గూర్చి తెలుపునది పంచాంగము. పంచాంగము ముఖ్యముగా మనకు 5  విషయములను తెలుపును. 1 . తిధి , 2 . వారము , 3 . నక్షత్రము , 4 . యోగము , 5 . కరణము .కనుకనే దానికి పంచాంగము అని పేరు వచ్చినది .

28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

వాస్తు సార సంగ్రహం 19 - ఆంధ్ర ప్రదేశ్

వాస్తు సార సంగ్రహం -  ఆంధ్ర ప్రదేశ్
 
            హిందూ దేశము భౌగోళీకంగా రెండు భాగాలుగా ఉంది. అవి వింధ్యకు ఉత్తరాన హిమాలయాల మధ్య ప్రాంతం. ఇదే ఉత్తర హిందూ స్ధానము. వింధ్యకు దక్షిణాన హిందూ మహాసముద్రంకు మధ్యగల భూమి దక్షిణ భారతదేశము. ఈ దక్షిణ భారతదేశము దక్కను, ద్రావిడ దేశం అని రెండు భాగాలుగా ఉంది. గోదావరి పైనుండి నర్మదా పైభాగం వరకు విస్తరించి ఉన్నదే ఆంధ్ర దేశము. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారి ఆత్మాహుతి ఫలితంగా 1 - 10 - 1953వ తేదీన కర్నూలు ముఖ్య పట్టణముగా ఆంధ్ర రాష్ట్రము అవతరించినది. తరువాత 1 - 11 - 1956వ తేదీన హైదరాబాదు ముఖ్య పట్టణముగా ఆంధ్రప్రదేశ్ అవతరించినది. చిత్తూరు నుండి శ్రీకాకుళం, ఆదిలాబాదు నుండి అనంతపురం వరకు 2 ,76,754 చ.కి. వైశాల్యంతో దేశంలో 5వ పెద్ద రాష్ట్రంగా ఉంది.
సరిహద్దులు : 12 డిగ్రీల14' - 19 డిగ్రీల 15' ఉత్తర అక్షాంశములు 76 డిగ్రీల 50' - 84 డిగ్రీల 44' తూర్పు రేఖాంశాల మధ్యలో ఉన్నది. అంటే తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్నాటక రాష్ట్రం, ఉత్తరాన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. 600 మైళ్ల కోస్తాతో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వారధి. హిందీ ప్రాంతాలతో ప్రత్యక్షంగా సబంధం కలిగిన రాష్ట్రము. రాజకీయంగా విభజించబడింది. అవి :
1 కోస్తా : శ్రీకాకుళం నుండి నెల్లూరు - 9 జిల్లాలు.
2 రాయలసీమ : కృష్ణా తుంగభద్రల మధ్య ప్రాంతం - 4 జిల్లాలు.
3 తెలంగాణ : కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతము - 10 జిల్లాలు. నైసర్గిక స్థితిని బట్టి మన రాష్ట్రమును మూడు సహజ భాగములుగా విభజింపవచ్చును. అవి 1. తూర్పు కనుములు - కొండ ప్రాంతములు. 2. పీటభూమి ప్రాంతము. 3. తూర్పు తీర మైదానము. మన రాష్ట్రమునందు తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, మంత్రాలయం, బాసర, పుట్టపర్తి మొదలగు పుణ్య క్షేత్రాలు, వరంగల్ కోట, లేపాక్షి, హైటెక్ సిటీ మొదలగు చూడదగిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...