శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

8, నవంబర్ 2012, గురువారం

స్త్రీలు నూతనముగా ఆభరణాలు, వస్త్రములు ధరించుటకు

స్త్రీలు నూతనముగా ఆభరణాలు, వస్త్రములు ధరించుటకు

అశ్వని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, ధనిష్ట, రేవతి నక్షత్రములందు,
బుధ, గురు, శుక్రవారములందు, వెండి, బంగారు ఆభరణములు,
నూతన వస్త్రములు ధరించుటకు మంచిది.
సోమ, మంగళ వారములందు సౌభాగ్యవతులైన స్త్రీలు ఆభరణములు నూతనవస్త్రములు ధరించరాదు.

7, నవంబర్ 2012, బుధవారం

నూతనముగా ఉద్యోగములో చేరుటకు

నూతనముగా ఉద్యోగములో చేరుటకు

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు.
అశ్వని, పునర్వసు, పుష్యమి
, హస్త, చిత్త, అనూరాధ, రేవతి, నక్షత్రములు, బుధ, గురు, శుక్రవారములు
,



శుభ లగ్నములలో రవి, కుజులు 10,11 స్థానములలో ఉండుట చాలా యోగము.
ఉద్ద్యోగములలో స్థిరత్వం పొంది క్రమేపి చేయు 
ఉద్యోగంలో అభివృద్ధి సాధించి ప్రమోషనులు పొందెదరు.

4, నవంబర్ 2012, ఆదివారం

నక్షత్రాలు అధిదేతలు వర్ణం రతం

నక్షత్రాలు అధిదేతలు వర్ణం రతం

నక్షత్రం అధిదేవత వర్ణం రత్నం నామం గణం జంతువు నాడి 
 వృక్షం గ్రహం
అశ్విని
అర్ధనారీశ్వరుడు  
పసుపు వైడూర్యం చూ,చే,చో,ల దేవగణం గుర్రం ఆది
  అడ్డరస కేతువు
భరణి
రవి ఆకాశనీలం వజ్రం లీ,లూ,లే,లో మానవగణం ఏనుగు మధ్య 
 దేవదారు శుక్రుడు
కృత్తిక
అగ్ని కావి మాణిక్యం ఆ,ఈ,ఊ,ఏ రాక్షసగణం మేక అంత్య
ఔదంబర సూర్యుడు
రోహిణి
చంద్రుడు తెలుపు ముత్యం ఒ,వా,వృ,వో మానవగణం పాము అంత్య
జంబు చంద్రుడు
మృగశిర
దుర్గ ఎరుపు పగడం వే,వో,కా,కి దేవగణం పాము మధ్య
చంఢ్ర కుజుడు
ఆర్ద్ర
కాళి ఎరుపు గోమేధికం కూ,ఘ,బ,చ మానవగణం కుక్క ఆది
రేల రాహువు
పునర్వసు
రాముడు పసుపు పుష్పరాగం కే,కో,హా,హీ దేవగణం పిల్లి ఆది
వెదురు గురువు
పుష్యమి
దక్షిణామూర్తి పసుపు,ఎరుపు నీలం హూ,హే,హో,డా దేవగణం మేక మధ్య
పిప్పిలి శని
శ్లేష
చక్రత్తాళ్వార్ కావి మరకతం డి,డూ,డె,డొ రాక్షసగణం పిల్లి అంత్య
నాగకేసరి బుధుడు
మఖ
ఇంద్రుడు లేతపచ్చ వైడూర్యం మా,మి,మూ,మే రాక్షసగణం ఎలుక అంత్య
మర్రి కేతువు
పుబ్బ
రుద్రుడు శ్వేతపట్టు పచ్చ మో,టా,టి,టూ మానవగణం ఎలుక మధ్య
మోదుగ శుక్రుడు
ఉత్తర
బృహస్పతి లేతపచ్చ మాణిక్యం టే,టో,పా,పీ మానవగణం గోవు ఆది
జువ్వి సూర్యుడు
హస్త
అయ్యప్ప ముదురునీలం ముత్యం పూ,ష,ణ,డ దేవగణం దున్న ఆద
కుంకుడు చంద్రుడు
చిత్త
విశ్వకర్మ ఎరుపు పగడం పే,పో,రా,రీ రాక్షసగణం పులి మధ్య
తాటి కుజుడు
స్వాతి
వాయువు తెలుపు గోమేధికం రూ,రే,రో,త దేవగణం దున్న అంత్య
మద్ది రాహువు
విశాఖ మురుగన్ పచ్చ పుష్పరాగం తీ,తూ,తే,తో రాక్షసగణం పులి అంత్య
నాగకేసరి గురువు
అనురాధ
మహాలక్ష్మి పసుపు నీలం నా,నీ,నూ,నే దేవగణం లేడి మధ్య
పొగడ శని
జ్యేష్ట
ఇంద్రుడు శ్వేతపట్టు మరకతం నో,యా,యీ,యూ రాక్షసగణం లేడి ఆది
విష్టి బుధుడు
మూల
నిరుతి ముదురుపచ్చ వైడూర్యం యే,యో,బా,బీ రాక్షసగణం కుక్క ఆది
వేగిస కేతువు
పూర్వాషాడ     
వరుణుడు బూడిద వజ్రం బూ,దా,థా,ఢా మానవగణం కోతి మధ్య
నెమ్మి శుక్రుడు
ఉత్తరాషాడ
గణపతి తెలుపు మాణిక్యం బే,బో,జా,జీ మానవగణం ముంగిస అంత్య
పనస రవి
శ్రవణం
మహావిష్ణు కావి ముత్తు ఖీ,ఖూ,ఖే,ఖో దేవగణం కోతి అంత్య
జిల్లేడు చంద్రుడు
ధనిష్ఠ
చిత్రగుప్తుడు పసుపుపట్టు పగడం గా,గీ,గూ,గే రాక్షసగణం గుర్రం మధ్య
జమ్మి కుజుడు
శతభిష
భద్రకాళి కాఫి గోమేదికం గో,సా,సీ,సూ రాక్షసగణం గుర్రం ఆది
అరటి రాహువు
పూర్వాభాద్ర
కుబేరుడు ముదురుపసుపు పూస సే,సో,దా,దీ మానవగణం సింహం ఆది
మామిడి గురువు
ఉత్తరాభాద్ర
కామధేను గులాబి నల్లపూస దు,శం,ఛా,దా మానవగణం గోవు మధ్య
వేప శని
రేవతి
అయ్యప్ప ముదురునీలం ముత్యం దే,దో,చా,చీ దేవగణం ఏనుగు అంత్య
విప్ప బుధుడు

2, నవంబర్ 2012, శుక్రవారం

పనికి అనుకూల నక్షత్రాలు

పనికి అనుకూల నక్షత్రాలు

అశ్విని        : నామకరణ, అన్నప్రాసన, గృహరంబ,గృహప్రవేశ,వివాహములకు. 
భరణి         : గయాది ప్రదేశాల్లో శ్రాద్ధాలకు, మంత్ర శాస్త్ర అధ్యాయానికి.
కృతిక        : విత్తనాలు చల్లడానికి,మొక్కలు నాటడానికి.
రోహిణి       : పెళ్ళిళ్ళు,ఇంటి పనులు, ఇతర అన్ని పనులకు. 
మృగశిర     : అన్ని పనులకు మంచిది
ఆర్ధ           : నూతులు త్రవ్వడానికి,మంత్ర ప్రయోగాలకు, శివ పూజకు. 
పునర్వసు   : అన్నప్రాసన,చౌలది సర్వ కార్యాలకు శుబం. పెళ్లిళ్లకు మాధ్యమం.
పుష్యమి     : పెళ్లిళ్లకు,గృహ ప్రవేశాలకు
ఆశ్లేష         : యంత్ర పనిముట్ల ప్రారంబానికి 
మఖ         : ప్రయాణ శుబకార్యలకు 
పుబ్బ        :  నూతులు త్రవ్వడానికి, విత్తనాలు చల్లడానికి.
ఉత్తర         : పెళ్ళిళ్ళు,ఇతర అన్ని పనులకు.  
హస్త          : గృహ ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు
చిత్త           : వివాహాలు,విద్య ప్రారంబం,గృహ  ప్రవేశం  వంటికి మంచిది
స్వాతి         : పెళ్ళిళ్ళు వంటి అన్ని పనులకు.
విశాక         : నూతులు త్రవ్వడానికి,మంత్ర ప్రయోగాలకు.
అనురాధ     : పెళ్ళిళ్ళు,ఉపనయనాలకు,ఇతర అన్ని శుబకార్యలకు
జేష్ఠ           : నూతులు త్రవ్వడానికి,ప్రయాణాలకు
మూల       : పెళ్ళిళ్ళు,ఉపనయనాలకు,ప్రయాణాలు
పూర్వాషాడ : నూతులు త్రవ్వడానికి
ఉత్తరాషాడ  : అన్ని పనులకు మంచిది
శ్రవణం       : గృహ ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు
ధనిష్ఠ        : వ్యాపార పనులకు,యంత్రాలకు, పెళ్లిళ్లకు
శతబీశ       : నూతులు త్రవ్వడానికి, అన్ని పనులకు
పూర్వాభాద్ర : విద్య ఆరంబనికి , నూతులు త్రవ్వడానికి
ఉత్తరాభాద్ర  : అన్ని పనులకు
రేవతి        :  పెళ్ళిళ్ళు,ఉపనయనములు,యాత్రలు.

29, అక్టోబర్ 2012, సోమవారం

గృహారంభము (శంకు స్థాపనం ) ప్రవేశం

గృహారంభము (శంకు స్థాపనం )

తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, తిథులు,
సోమ,బుధ,గురు,శుక్రవారము
లందును,
రోహిణి,మృగశిర,పుష్యమి,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం,  ఉత్తరాభాద్ర,రేవతి నక్షత్రములయం
దు


వృషభ, సింహ, వృశ్చిక, కుంభ లగ్నములు మంచివి.
మేష,కర్కాటక తుల,మకర లగ్నములు మధ్యమం
లగ్నమునకు చతుర్ద అష్టమ శుద్ధి వుండాలి.
ఉదయం 12 గంటల లోపునే శంకుస్థాపనకు మంచిది.
వృషభ,కలశ చక్ర శుద్దులు కా
వలయును
గృహప్రవేశం

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ, తిథులు. బుధ, గురు, శుక్రవారములు
రోహిణి, మృగశిర, ఉత్తర, చిత్త, అనూరాధ, ఉత్తరాషాడ, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు,


వృషభ, మిధున, కన్య, ధనుస్సు, మీన లగ్నములు మంచివి.
స్థిర లగ్నమైన అత్యంత బలీయం,
చతుర్ధ,అష్టమ శుద్ధి అవసరం. వృషభ,కలశచక్రశుద్ధి ఉండాలి


28, అక్టోబర్ 2012, ఆదివారం

ప్రయాణ శుభ శకునములు


ప్రయాణ శుభ శకునములు

        ప్రయాణమయివెళ్ళునప్పుడు వీణ, మద్దెల, సన్నాయి, తప్పెట, తాళములు, పుష్పములు, ముత్తయిదువలు, ఇద్దరు, నలుగురు బ్రాహ్మణులూ ,కర్ర పటుకోనిన శూద్రుడు, ఊరేగింపు, ఏనుగు, గుఱ్ఱము, ఏడ్చువారు లేక పీనుగ, ఆబోతు, అక్షతలు, బియ్యము, జొన్నలు, గోధుమలు, అన్నము , పిండివంటలు, కళ్ళు కావిళ్ళు,తేనే, గాజుల మలారము, పెరుగు, ఆహార పదార్దములు, మాంసము మొదలగు మంగళ ద్రవ్యములు కనిపించినచో ధనలాభము,  శుభము, కళ్యాణము, వ్యాపార జయము అందు లాభము ఉద్యోగ లాభము జయము కల్గును. ప్రయాణమయి పోవునపుడు గ్రద్ద నోట ఆహరముంచుకొని 'కృష్ణా' యని యరిచినచో సకల శుభములు,సౌఖ్యము కలుగును. శుభ కార్యములు చేయుటకు ప్రారంభించునపుడును, గొప్ప పనులను గూర్చి ఆలోచించునప్పుడును గాడిద కూసిన యెడల  శుభము కలుగును.


ప్రయాణమునకు  దుశ్శకునములు


  ప్రయనమాయిపోవునప్పుడు కర్ర,గొడుగు, పూల మూట జారిపదినాను, దెబ్బ తగిలినను, భోజనము చేసిపోవలయును, రేపు, పొండి నేను కూడా వచ్చెదనని అనుటయు, బహిష్టుయిన స్త్రీ యు, విధవ,కట్టెల మోపు,వట్టి కుండలు, కొత్త కుండలు, బొగ్గులు,పిల్లులు, బేసి సంఖ్య బ్రాహ్మణులూ, సరి సంఖ్య శూద్రులు, సాతానులు, జంగము, పెద్ద పొగ, మొండివాడు, కుష్టువాడు, ముక్కు లేని వాడు, గర్బిణీ స్త్రీ యార్తరవము, పెద్ద గాలి దుమ్ము,వాన చినుకులు, చమురు తలతో నున్నవాడు, ఎదురుగా తుమ్ముతున్నవాడు ఇత్యాదులు కనుపించిన ఆ ప్రయాణము మానుకొనుట మంచిది.



శుభ శకునములు


ఒక రాజు, ఇద్దరు బ్రాహ్మణులూ, వేశ్య స్త్రీ, పుత్రులతో స్త్రీ, కన్యకా, ఏనుగు, గోవు, ఎద్దు, దంపతులు, నూతన వస్త్రాలు, చాకళ్ళు, నిండు కుండలు, పాత్రలు, కల్లు, సారాయి లాంటి

మత్తు పదార్థాలు, మాంసం, చెరకు, వీణ, మద్దెల లాంటి వాయిద్యాలు, సామాన్లు, తెల్లని పూలు, తెల్లని ధాన్యం ఎదురు రావటం, మిత్ర వాక్యాలు పలకడం మంచిది.


దుశ్శకునములు:



పిచ్చివాడు, శత్రువు, రోగి, దిగంబరుడు, సన్యాసి, దొంగ, మలినుడు, జాతి బ్రష్టుడు, ఆయుధం, గర్బిని స్త్రీ, వంద్య స్త్రీ, నల్లని ఎద్దు, నపుంసకుడు, పిల్లి, సర్పం, పండి, తోడేలు, భస్మం, బొగ్గులు,
ఉప్పు, ఎముకలు, ఊక, నువ్వులు, మినుములు, మజ్జిగ, పొగ,అగ్ని, పత్తి, బెల్లం, ఎర్రని పుష్పాలు, కలశం, చెడు వార్తలు వినడం, ఎక్కడికి, ఎందుకు అని ప్రశ్నించడం, కొద్ది సేపు ఆగితే నేను 
వస్తా అనడం మంచిది కాదు. సేతు పిట్ట అరుపు దుశ్శకునమే.
దుశ్శకునము అని అనిపించినా వెళ్ళవలసి వస్తే, 
''వాసుదేవాయ మంగళం'' అని 108 సార్లు స్మరించడం మంచిది.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...