శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

25, ఫిబ్రవరి 2013, సోమవారం

చంద్ర గ్రహ జపము

(Chandra Graha Japam)


ఆవాహనము:
అస్యశ్రీ చంద్రగ్రహ మహామంత్రస్య గౌతమ ఋషిః చంద్రో దేవతా చంద్రగ్రహ ప్రసాదసిద్యర్థే చందర్ గ్రహ మహామంత్రం కరిష్యే|
కరన్యాసము :
ఓం అప్యాయస్య - అంగుష్టాభ్యాం నమః
ఓం సమేతుతే - తర్జనీభ్యాం నమః
ఓం విశ్యతః - మధ్యమాభ్యం నమః
ఓం సోమ వృష్టియం - అనామికాభ్యాం నమః
ఓం భవావాజస్య - కనిష్టి కాభ్యాం నమః
ఓం సంఘథే - కరతల కర పృష్ఠాభ్యం నమః
ఓం అప్యాయస్య – హృదయాయ నమః హృదయాయ నమః
ఓం సమేతుతేక – శిరసే స్వాహా శిరసే స్వాహా
ఓం విశ్వతః - శిఖాయైవషట్
ఓం సంఘథే - అస్త్రాయఫట్
ఓం భూర్భువస్సు వరోమితి దిగ్బంధః ఆది దేవతా :
అప్సుమే సోమో అబ్రవీదంత ర్విశ్వాని భేషజా| అగ్నించ విశ్వశంభువ మాపశ్చ విశ్వభేశ జీః ప్రత్యథి దేవతా :
ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృష్టియం| భావా వాజస్య సంఘధే| చంద్ర కవచ స్తోత్రం
వేద మంత్రము
శశీపాటు శిరోదేశే| ఫాలంపాతు కలానిధిః చక్షుషీ చంద్రమాః పాతు| ముఖం కుముద బాంధవః |
సోమః కరౌతు మే పాతు| స్కందౌపాతు సుధాత్మకః ఉరూ మైత్రీ నిధిః మధ్యం పాతు విశాకరః కటిం
సుధాకరః పాతు| ఉరః పాతు శశంధరః మృగాంకో జానునీపాతు| జంఘేపాత్వ మృతాబ్ధిజం|
పాదౌ హిమకరః పాతు| పాతు చంద్రోభిలంవపుః

ఫలశ్రుతి :
ఏతద్ధి కవచం పుణ్యం భుక్తి ముక్తి ప్రదాయకం యః పఠేచ్చ్రుణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్
చంద్రగ్రహ మంగళాష్టకం చంద్రః కర్కాటక ప్రభు స్సితనిభశ్చాత్రేయ గోత్రోద్భవ|
శ్చాత్రేయ శ్చతురశ్ర వారుణ ముఖ శ్చాపోహ్యుమా ధీశ్వరః
షట్స ప్తాగ్ని దశైకగా శ్యుభకరో నారిర్బుధార్కౌ ప్రియౌ| స్వామీ
యామునవః పలాశన మిధః కుర్యాత్సదా మంగళం |

చన్ద్రాష్టోత్తర శత నామావళిః
ఓం శ్రీమతే నమః ఓం శశిధరాయ నమః ఓం చంద్రాయ నమః ఓం తారాధీశాయ నమః
ఓం నిశాకరాయ నమః ఓం సుథానిధయే నమః ఓం సదారాధ్యాయ నమః
ఓం సత్వతయే నమః ఓం సాధుపూజితాయ నమః ఓం జితేంద్రియాయ నమః
ఓం జగద్యోనయే నమః ఓం జ్యోతిశ్చక్ర ప్రవర్తకాయ నమః ఓం వికర్తనానుజాయ నమః
ఓం వీరాయ నమః ఓం విశ్వేశాయ నమః ఓం విదుషాంపతయే నమః
ఓం దోషాకరాయ నమః ఓం దుష్టదూరాయ నమః ఓం పుష్టిమతే నమః
ఓం శిష్ట పాలయాక నమః ఓం అష్ట మూర్తి ప్రియాయ నమః ఓం అనంతాయ నమః
ఓం కష్టదారుకురారకాయ నమః ఓం స్వప్రకాశాయ నమః ఓం ప్రకాశాత్మనే నమః
ఓం ద్యుచరాయ నమః ఓం దేవభోజనాయ నమః ఓం కళాధరాయ నమః
ఓం కాలహేతవే నమః ఓం కామకృతే నమః ఓం కామదాయకాయ నమః
ఓం మృత్యు సంహారకాయ నమః ఓం అమర్తాయ నమ ఓం నిత్యానుష్టానదాయ నమః
ఓం క్షపాకరాయ నమః ఓం క్షీణపాపాయ నమః ఓం క్షయవృద్ధిసమిన్వితాయ
ఓం జైవా తృ కాయ నమః ఓం శశినే నమః ఓం శుభ్రాయ నమః
ఓం జయినే నమః ఓం జయఫల ప్రదాయ నమః ఓం సుధఆమయాయ నమః
ఓం సురస్వామినే నమః ఓం భక్తానామిష్ట ప్రద ఆయకాయ ఓం భుక్తిదాయ ( ముక్తిదాయ)
ఓం భద్రాయ నమః ఓం భక్త దారిద్ర్యభంజనాయ ఓం సామగాన ప్రియాయ నమః
ఓం సర్వరక్షకాయ నమః ఓం సాగారోద్భవాయ నమః ఓం భయాంతకృతే నమః
ఓం భక్తిగమ్యాయ నమః ఓం భవబంధ విమోచకాయ నమః ఓం జగత్ప్రకాశకిరణాయ నమః
ఓం జగదానందకారణాయ నమః ఓం నిస్వవత్యాయ నమః ఓం నిరాహారాయ నమః
ఓం నిర్వికారాయ నమః ఓం నిరామయాయ నమః ఓం భూచ్చాయాచ్చాదితాయ నమః
ఓం భవ్యాయ నమః ఓం భువనప్రతిపాలకాయ నమః ఓం సకలార్తిహరాయ నమః
ఓం సౌమ్యజనకాయ నమః ఓం సాధువందితాయ నమః ఓం సర్వాగమజ్ఞాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః ఓం సనకాదిమునిస్తుతాయ నమః ఓం సితచహత్రధ్వజోపేతాయ నమః
ఓం శీతాంగాయ నమః ఓం శీతభూషణాయ నమః ఓం శ్వేతమాల్యాంబరధరాయ నమః
ఓం శ్వేత గంధానులేపనాయ నమః ఓం దశాశ్వరథ సంరూధాయ నమః ఓం దండపాణయే నమః
ఓం ధనుర్ధరాయ నమః ఓం కుందపుష్పోజ్జ్వలాకారాయ నమః ఓం నాయనాబ్జసముద్భవాయ నమః
ఓం ఆత్రేయగోత్రజాయ నమః ఓం అత్యంతవినయాయ నమః ఓం ప్రియదాయకాయ నమః
ఓం కరుణారస సంపూర్ణాయ నమః ఓం కర్కటప్రభవే నమః ఓం అవ్యయాయ నమః
ఓం చతురశ్రాసనారూధాయ నమః ఓం చతురాయ నమః ఓం దివ్యవాహనాయ నమః
ఓం వివస్వస్మందలాజ్జేయావాసాయ నమః ఓం వాసు సమృద్ధిదాయ నమః ఓం మహేశ్వర ప్రియాయే నమః
ఓం దాంతాయ నమః ఓం మేరుగోత్ర పదక్షినాయ నమః ఓం గ్రహమందల మధ్యస్థాయ నమః
ఓం గ్రసితార్కాయ నమః ఓం గ్రహాధిపాయ నమః ఓం ద్విజరాజాయ నమః
ఓం ద్యుతిలకాయ నమః ఆన్ ద్విభుజాయ నమః ఓం ద్విజ పూజితాయ నమః
ఓం ఔదుంబరనగావాసయ నమః ఓం ఉదారాయ నమః ఓం రోహిణీపతయే నమః
ఓం నిత్యోదయాయ నమః ఓం మునిస్తుత్యాయ నమః ఓం నిత్యానందఫలప్రదాయ నమః
ఓం సకలాహ్లాదనకరాయ నమః ఓం ఫలాశసమిధ ప్రియాయ నమః ఓం చంద్రమసే నమః

1. మీ దగ్గరలో నున్న పార్వతి లేదా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ప్రతి సోమవారం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు 100 ప్రదక్షిణములు చేయండి.
2. 10 సోమవారములు నవగ్రహములకు 100 ప్రదక్షిణములు చేసి 1.25 కే.జీ. బియ్యం దానం చేయండి.
3. కృష్ణా జిల్లాలోని కనకదుర్గ గుడికి వెళ్ళి సోమవారం ఉదయం 7-30 గంటల నుండి 9 గంటల లోపుగా దర్శించండి.
4. సోమవారం రోజున పేదలకు దద్దోజనం పంచిపెట్టండి.
5. తూర్పు గోదావరి జిల్లాలోని కోటిపల్లిలోని సోమేశ్వరస్వామి, పశ్చిమ గోదావరి జిల్లాలోని గునుపూడిలోని సోమేశ్వరుని దర్శించి, తెల్ల వస్త్రములో బియ్యం దానం చేయండి.
6. ముత్యము లేదా చంద్రకాంతమణితో వెండి ఉంగరం చేయించి కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించండి. తెలుపు వస్త్రములు దానం చేయండి.
7. చంద్రగ్రహ జపము ఒకసారి బ్రాహ్మణుడితో చేయించి, ముత్యాల దండ, బియ్యం, వెండి దానం చేయండి.
8. నవగ్రహములలో చంద్రగ్రహం దగ్గర సోమవారం 10 వత్తులతో దీపారాధాన చేసి తెల్లని వస్త్రములు, వెండి ఉంగరం దానం చేయండి.
9. 10 సోమవారములు ఉపవాసము ఉండి, చివరి సోమవారం పార్వతికి కుంకుమ పూజ మరియు చంద్రుని అష్టోత్తర పూజ చేయండి.
10. తమిళనాడులోని తింగళ్ళూరు దేవస్థానమును దర్శించండి.
11. పార్వతి, దుర్గ, కృష్ణ ఆలయము యందు పేదలకు, సాధువులకు సోమవారం ప్రసాదములు పంచగలరు. అన్నదానం చేయండి.
12. చంద్ర ధ్యాన శ్లోకమును ప్రతిరిజు 100 మార్లు 100 రోజులు పారాయణ చేయండి.
13. చంద్ర గాయత్రీ మంత్రమును 10 సోమవారములు 100 మార్లు పారాయణ చేయండి.
14. చంద్రమంత్రమును 40 రోజులలో 10000 మార్లు జపము చేయవలెను. లేదా ప్రతిరోజూ దుర్గా స్తోత్రము పారాయణ చేయండి.
15. తీరికలేని వారు కనీసం చంద్ర శ్లోకము 10 మార్లుగాని చంద్ర మంత్రము 100 మార్లు పారాయణ చేయండి.
16. శివరాత్రి పర్వదినమున మహన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది.

24, ఫిబ్రవరి 2013, ఆదివారం

గ్రహముల వల్ల వచ్చు వ్యాదులు

                          గ్రహముల వల్ల వచ్చు వ్యాదులు                                    
 రవి -  గుండె,జఠరము,లాలాజలము,తాపము,తలనెప్పి,కడుపుమంట,నేత్రములు,రక్త పోటు, మొదలగు వ్యాదులు.
 చంద్రుడు -  స్తనములు,రుతుక్రమ సంబిదిత,మానసిక,పిచ్చి మొదలగు వ్యాదులు.

 కుజుడు-కోపము,గుదము[మర్మస్థాన]కందరములు,ఎర్రకణములుపోవుట[పాడగుట],పేలుడు[మందుగుండు]సంబదిత,శస్త్ర చికిశ్చ మొదలగు వ్యాదులు.
 భుదుడు -  శ్వాస,మెడ గొంతు,ఫిట్స్,వెన్నెముక,నోరు మొదలగు వ్యాదులు.
 గురుడు  -  క్రొవ్వు,కాలేయము,మూత్రము,లివర్ సంబందిత వ్యాదులు.
 శుక్రుడు  -  మర్మము,మధుమేహము,సుఖ వ్యాదులు,గడవ బిళ్ళలు మొదలగు వ్యాదులు.
  శని  -  మూలవ్యాది,చాల రోజులు నిలిచే వ్యాదులు,పిసాచ బాధలు ,ఎముకలకు సంబందితవ్యాదులు.
 రాహువు -  క్షయ,అపరేషన్,కుష్టు,ప్రేగులు మొదలగు వ్యాదులు.

  కేతువు -  తెలియని జబ్బులు,నత్తి,నరముల పోటు మొదలగు జబ్బులు.
గ్రహస్థితి
జ్యోతిష శాస్త్రమున గ్రహములు దిగ్బలం, స్థానబలం, కాల బలం, చేష్టాబలం అను నాలుగు విధముల బలనిర్ణయం చేస్తారు , లగ్నంలో గురువు, బుధుడు ఉన్న బలవంతులు. నాలుగవ స్థానములో చంద్రుడు, శుక్రుడు ఉన్న బలవంతులు. పదవ స్థానమున సూర్యుడు, కుజుడు బలవంతులు. స్వ స్థానమున, ఉచ్ఛ స్థానమున, త్రికోణమున, మిత్ర స్థానమున, స్వ నవాంశ అందు ఉన్న గ్రహములు, శుభ దృష్టి గ్రహములు బలముకలిగి ఉంటాయి. స్త్రీ క్షేత్రములైన వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనములందు చంద్రుడు, శుక్రుడు బలవంతులు. పురుష రాశులైన మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభములందు సూర్యుడు, కుజుడు, గురువు, బుధుడు, శని బలవంతులు. సూర్యుడు, కుజుడు, శుక్రుడు పగటి అందు బలవంతులు. రాత్రి అందు బుధుడు, శని, గురువు బలవంతులు. సర్వ కాలమందు బుధుడు బలవంతుడు. శుక్ల పక్షమున శుభగ్రహములు, కృష్ణ పక్షమున పాపగ్రహములు బలవంతులు. యుద్ధమున జయించిన వాడు, వక్రగతి కల వాడు, సూర్యుడికి దూరముగా ఉన్న వాడు చేష్టా బలం కలిగిన వాడు. అంటే ఉత్తరాయణమున కుజుడు, గురువు, సూర్యుడు, శుక్రుడు దక్షిణాయనమున చంద్రుడు, శని రెండు ఆయనముల అందు స్వక్షేత్రమున ఉన్న బుధుడు చేష్టా బలము కల వారు. స్త్రీ గ్రహములైన చంద్రుడు, శుక్రుడు రాశి మొదటి స్థానమున ఉన్న బలము కలిగి ఉంటారు. పురుష గ్రహములైన సూర్యుడు, కుజుడు, గురువు రాశి మధ్యమున ఉన్న బలము కలిగి ఉంటాయి. నపుంసక గ్రహములైన బుధుడు, శని రాశి అంతమున ఉన్నచేష్టా బలము కలిగి ఉంటాయి. రాత్రి అందు మొదటి భాగమున చంద్రుడు, అర్ధరాత్రి అందు శుక్రుడు, తెల్లవారు ఝామున కుజుడు, ఉదయకాలమున బుధుడు, మధ్యహ్న కాలమున సూర్యుడు, సాయం కాలమున శని సర్వ కాలమందు గురువు బలవంతులు. శనికంటే కుజుడు, కుజుని కంటే బుధుడు, బుధునికంటే గురువు, గురువుకంటే శుక్రుడు, శుక్రునికంటే చంద్రుడు, చంద్రునికంటే సూర్యుడు బలవంతులు.            

23, ఫిబ్రవరి 2013, శనివారం

తాంత్రిక నవార్ణోక్త యంత్రం :-

శ్రీ మహా కాళీ మహా లక్ష్మీ  మహా సరస్వతీ  స్వరూపిణిగా దసరా నవరాత్రుల  యందు కనీసము అష్టమీ , నవమీ , దశిమీ  తిథుల యందు క్రింది యంత్రమను అర్చించిన అనంత ఫల దాయకమగను.



శ్రీ మహా కాళీ స్తోత్రమ్  


శ్లో||   ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ శూలం భుశుండీం  శిరః  
        శఖం సందధతీం  కరైః  త్రిణయనాం సర్వాంగభూషాభృతాం
        నీలాశ్మద్యుతి  మాస్యపాద దశకాం సేవే మహాకాళికాం
        యా మస్తౌత్  స్వపితే హరౌ కమల హంతుం మధుం కైటభం. ||


    శ్రీ మహా లక్ష్మీ  స్తోత్రమ్

శ్లో||   అక్షస్రక్ పరశూ గదేషు కులిశాన్ పద్మం ధనుః కుండికాం
       దండం శక్తి మసించ చర్మ  జలజం  ఘంటాం సురాభాజనం
       శూలం పాశ  సుదర్శనేచ ధధతీం హస్తైః  ప్రవాళ ప్రభాం
       సేవే సైరిభ మర్ధినీం  ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం || 


శ్రీ మహా సరస్వతీ  స్తోత్రమ్

శ్లో||   ఘంటా శూల హలాని శంఖముసలే  చక్రం ధనుః సాయకాన్
        హస్తాబ్జ్తెః ధధతీం ఘనాంత విలసత్ శీతాంశుతుల్య ప్రభాం 
        గౌరీ దేహ  సముద్భవాం త్రిజగతా మాధారభూతాం మహా
        పూర్వా మత్ర సరస్వతీ  మనుభజే  శుంభాది  దైత్యార్దినీం

   ఓం మహకాళీ మహలక్ష్మీ మహ సరస్వతి దేవతాభ్యోం నమః




          



























                           -:  శ్రీ  చాముండా  గాయత్రి :-
   చాముండేశ్వరి   విద్మహే చక్రధారిణి  ధీమహి  తన్నః చాముండా    ప్రచోదయాత్.//




  





























































22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

వాస్తు - గాలి, వెల్తుర్లు

వాస్తు - గాలి, వెల్తుర్లు
Vastu wind and lightning
మనం మళ్ళీమళ్ళీ చెప్పుకుంటున్నట్లుగా వాస్తు అంటే కేవలం వంటిల్లు ఎటువైపు ఉండాలి, పూజ గది ఏ దిక్కున ఉండాలి లాంటి అంశాలు మాత్రమే కాదు. వాస్తులో పిల్లర్లు, నీళ్ళ సంపుల దగ్గరనుంచి గోడకు వేసే రంగుల వరకూ అనేక విషయాలను ప్రస్తావించారు.
ఇప్పుడు మనం వాస్తులో గాలి, వెల్తుర్ల గురించి తెలుసుకుందాం. వాస్తు శాస్త్రంలో గాలీ వెల్తుర్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నిజమే మరి, ఇంట్లోకి గాలీ వెల్తురు లేకపోతే అసలది ఇల్లెలా అవుతుంది?! చెట్టు తొర్రలోనో, కొండ గుహలోనో ఉన్నట్లు ఉండదూ?! ఇంట్లోకి గాలీ వెల్తురు గనుక రాకపోతే తాజాదనం ఉండదు. ఊపిరాడదు. విసుగు, చిరాకు, అసహనం కలుగుతాయి. గాలి ప్రాణాన్ని కాపాడుతుంది. తాజా గాలి లేకుంటే అనారోగ్యాల బారిన పడతాము. కనుక కిటికీలు, దర్వాజాలు తగినన్ని ఉండటము, అవి సరైన దిశలో ఉండటం వల్ల బయటి నుండి స్వచ్చమైన గాలి లోనికి, లోపలి గాలి బయటకు వెళ్ళి ఇంటి వాతావరణం తేటగా, పరిశుభ్రంగా ఉంటుంది.
వాస్తు శాస్త్రం పరిపూర్ణంగా తెలిసినవారు ఇంటిని ఖచ్చితంగా రోడ్డు కంటే ఎత్తులో నిర్మిస్తారు. ఇల్లు కనుక రోడ్డు కంటే మెరకలో లేకుండా పల్లంలో ఉంటే వర్షం పడినప్పుడు ఇంట్లోకి నీళ్ళు రాకుండా ఉండటమే కాకుండా గాలీ వెల్తురూ మెరుగ్గా లోనికి వస్తాయి.
కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ఇళ్ళను గమనించినట్లయితే చిన్న కిటికీ కూడా కనిపించదు. అలాంటి గదుల్లో పట్టపగలు కూడా చిమ్మచీకటి తాండవిస్తుంది. ఏ వస్తువు ఎక్కడ ఉన్నదో కనిపించకపోవడమే కాదు, అసలు కాసేపు కూడా ఉండలేము. పొదుపు పేరుతో వాస్తు విరుద్ధంగా నిర్మిస్తున్న కొన్ని ఆధునిక గృహాల్లో సైతం లైటు వేస్తేనే వెలుగు, ఫాను ఉంటేనే గాలి చందంగా ఉంటున్నాయి. ఇవి ఆరోగ్యకరమైన ఇళ్ళు కావని గుర్తించాలి. అందుకే వాస్తు శాస్త్రకారులు పుష్కలంగా గాలీవెల్తురూ వచ్చేందుకు వీలుగా పెద్ద కిటికీలను ఏర్పాటు చేస్తారు.
పూర్తిగా చెక్క అమర్చిన కిటికీల కంటే చెక్క ఫ్రేముకు అద్దాలు బిగించిన తలుపులు అమర్చుకోవడం శ్రేష్ఠం. వర్షం పడుతున్నప్పుడు లేదా గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు కిటికీలు మూసి ఉంచినా వెల్తురు వచ్చే అవకాశం ఉంటుంది.
గాలీ వెల్తురు వచ్చే అవకాశం లేకుంటే, తాజా గాలి రాదు, లోపలి కలుషిత గాలి బయటకు పోదు. దాంతో విసుగ్గా, అసహనంగా ఉంటుంది. త్వరగా అలసిపోయినట్లు అవుతుంది. చీటికిమాటికి కోపం ముంచుకొస్తుంది. శారీరక ఆరోగ్యం పాడవుతుంది. మానసిక అశాంతి కలుగుతుంది.
ఇంట్లోకి గాలీ వెల్తురూ పుష్కలంగా రాకుంటే నీరసం ఆవరించినట్లుగా ఉంటుంది. ఇల్లు కళ తప్పుతుంది. అందుకే చీకటి గదుల్ని జైళ్ళ తో పోలుస్తారు. స్వేచ్చ లేనట్లుగా, నిరాశానిస్పృహలు ఆవరించినట్లుగా ఉంటుంది. పెద్ద కిటికీలు ఉండటం వల్ల బయటి ప్రపంచం కూడా తెలుస్తుంది.
వాస్తు శాస్త్రీయం Vastu is Scientific
వాస్తు గురించి అనేక తర్జనభర్జనలు ఉన్నాయి. "ఈ వాకిలి ఇటువైపే ఎందుకు ఉండాలి, మరోవైపు ఎందుకు ఎండకూడదు..", "వంటిల్లు ఆగ్నేయం దిశలో లేకపోతే ఏమౌతుంది" - లాంటి వాదాలు అనేకం వింటూ ఉంటాం. "ఇండిపెండెంట్ ఇల్లయితే, సరే కావలసినట్లు కట్టించుకోవచ్చు, కానీ ఫ్లాట్స్ లో వాస్తు ఎలా సాధ్యం?!" అని తల పంకించేవాళ్ళు, "ఆఫీసుల్లో చెప్పిన చోట కూర్చుని పని చేయడం లేదూ.. అక్కడ కూడా వాస్తు గురించి మాట్లాడితే ఉద్యోగం ఊడుతుంది" - అని ఛలోక్తులు విసిరేవాళ్ళు, "ఇంకా నయం, రైల్లో కూడా ఈ డైరెక్షన్లోనే వెళ్తాను అంటారేమో" - అంటూ జోకులు వేసేవాళ్ళు ఎదురౌతుంటారు.
రోజంతా పనుల వత్తిడితో నలిగిపోయి, విసిగిపోయిన మనం, ఏదో వంకన కాసేపు కులాసాగా నవ్వుకోడానికి చూస్తాం. అలాంటి చతురోక్తులకు వాస్తు కూడా ఒక టాపిక్ అయితే పరవాలేదు. కానీ వాస్తును చప్పరించి, తీసిపారేస్తే, ఆనక మనమే బాధపడాల్సి వస్తుంది. ఏది ఎటువైపు ఉండాలో, అది అటువైపే గనుక ఉంటే మేలు జరుగుతుంది. ఉండకూడని వైపు కిటికీలు, దర్వాజాలు గట్రా వాస్తు విరుద్ధంగా ఉంటే ఫలితాలు నెగెటివ్ గానే ఉంటాయి.
భూమికి ఆకర్షణ శక్తి ఉంది. భూమి తనచుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఈ నేపథ్యంలో భూమి చుట్టూ ఉండే గ్రహాలూ, నక్షత్రాల ప్రభావం భూమి మీద పడుతుంటుంది. అందుకే ప్రతిదానికీ "ఇదిలా ఉండాలి" అంటూ నియమాలు నిర్దేశించారు. ఆ నియమాలను పాటిస్తే సత్ఫలితాలు ఉంటాయి.

వాస్తులో కిటికీల నియమాలు Vastu and Windows
ఇంటికి ముఖద్వారం, ప్రహరీ గేటులు ఎంత ముఖ్యమో కిటికీలు కూడా అంతే ముఖ్యం. ఇంటి సైజు, గదుల సంఖ్యను బట్టి కిటికీలు ఏర్పాటు చెసుకోవాల్సి ఉంటుంది. ఒకే గది ఉన్న ఇల్లు అయితే ఒకే ఒక్క కిటికీ ఉండొచ్చు. అలా ఒక్క కిటికీ మాత్రమే ఉంచడంలో దోషం ఏమీ లేదు. ఇల్లు కాస్త పెద్దది అయినప్పుడు 14 కిటికీలు అవసరం కావచ్చు. కనుక అవసరాన్ని బట్టి ద్వారాలు, కిటికీల సంఖ్య ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అయితే, వాస్తులో ఎన్ని కిటికీలు ఉండాలి, ఎటువైపు ఉండకూడదు అనే అంశాలకు సంబంధించి కొన్ని నియామాలు ఉన్నాయి. ఆ నియమాలను ఉల్లంఘించకుండా గృహ నిర్మాణం చేసుకోవాలి.
వాస్తు ప్రకారం ఇంటికి 1, 2, 4, 8, 12, 14 చొప్పున కిటికీలు ఉండాలి.
కిటికీలు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ – ఇలా ఏ దిక్కున అయినా ఉండవచ్చు. అయితే నైరుతి వైపు మాత్రం కిటికీలు ఏర్పాటు చేయకూడదు.
నైరుతి వైపు గనుక కిటికీలు ఉంటే కుటుంబసభ్యులకు, ముఖ్యంగా ఇంటి యజమానికి ఆందోళన తప్పదు.
నైరుతిలో గనుక కిటికీ ఉంటే నడుంనొప్పి, మెడనొప్పి లాంటి అనారోగ్యాలు వస్తాయి.
కీళ్ళవాతం వచ్చే అవకాశం ఉంది.
ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయి.
వృత్తి వ్యాపారాల్ల్లో లాభాలు ఆర్జించినప్పటికీ ఏదో నెపాన వచ్చిన సొమ్మంతా పోతుంది.
సాఫీగా జరిగిపోవాల్సిన విషయాలు కూడా సమస్యాత్మకంగా, బాధాకరంగా మారతాయి.

21, ఫిబ్రవరి 2013, గురువారం

లక్ష్మీ గణేశ యంత్రం


-: మూల  మంత్రం :-
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరదవరద సర్వజనమే వశమానాయ స్వాహాః || 
 శ్రీ లక్ష్మీ గణేశ యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్న అన్ని విఘ్నములు తొలగి విజయము ఐశ్వర్య  వృద్ధి  సంతతి గౌరవమును కూడా పొందగలరు.
                           
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.

                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.
          


























                      -: శ్రీ  లక్ష్మీ గణేశ గాయత్రి :-
          తత్పురుషాయ విద్మహే  శక్తియుతాయ  ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//                దశభుజాయ   విద్మహే  వల్లభేశాయ  ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

20, ఫిబ్రవరి 2013, బుధవారం

నవగ్రహ శ్లోకములు



జపాకుసుమ సంకాశం ! కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం ! ప్రణతోస్మి దివాకరమ్ !!


దధిశంఖ తుషారాభం ! క్షీరోదార్ణవ సంభవం
నమామి నశినం సోమం ! శంభోర్మకుటభూషణమ్ !!


ధరణీ గర్భ సంభూతం ! విద్యుత్కాంతి సమ ప్రభం
కుమారం శక్తి హస్తం తం ! మంగళం ప్రణమామ్యహమ్ !!

ప్రియంగుకలికా శ్యామం ! రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్త్వగుణోపేతం ! తం బుధం ప్రణమామ్యహమ్ !!


దేవానాం చ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంత్రం త్రిలోకేశం ! తం నమామి బృహస్పతిమ్ !!

హిమకుంద మృణాళాభం ! దైత్యానాం పరమం గురుం
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ !!


నీలాంజన సమాభాసం ! రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం ! తం నమామి శనైశ్చరమ్ !!

అర్ధకాయం మహావీరం ! చంద్రాదిత్య విమర్దనం
సింహికా గర్భసంభూతం ! తం రాహుం ప్రణమామ్యహమ్ !!


ఫలాశ పుష్ప సంకాశం ! తారకా గ్రహ మస్తకం
రౌద్రం రౌద్రత్మకం ఘోరం ! తం కేతు ప్రణమామ్యహమ్ !!

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

సంపూర్ణ సరస్వతీ యంత్రం

-: మూల  మంత్రం :-
ఓం  హ్రీం హ్ర్సైం హ్రీం ఓం ఐం థీం  క్లీం సౌః సరస్వత్య్తే  స్వాహాః || 

శ్రీ మహా సరస్వతి యంత్రమును అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్న  గొప్ప  గద్య  పద్య రచన వాక్సుద్ధి , విద్య ప్రాప్తి , మేథా ధారణా  శక్తి తప్పక  కలుగును.
                           
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.

                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.

          



























                      -: శ్రీ సరస్వతీ  గాయత్రి :-
      వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యైచ ధీమహితన్నోవాణీః ప్రచోదయాత్.//

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...