శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

14, మార్చి 2013, గురువారం

నవగ్రహ పీడాహర స్తోత్రం

(Navagraha peeda hara stotram)


గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః
విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవి:
రోహిణీ శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాళనః

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా
వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః

ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః

దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః
అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భ్రుగుః

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః

మహాశ్రీరామ మహావక్త్రో దీర్ఘదంస్త్రో మహాబలః
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ

అనేక రూప్వర్వైశ్చ శతశో ధసహస్రశః
ఉత్పాతరుజోజగతాం పీడాం హరతుమే తమః

(ప్రతిరోజూ ఈ నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని ఉదయాన్నే తొమ్మిదిసార్లు పఠిస్తే గ్రహపీడ తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది.)

10, మార్చి 2013, ఆదివారం

శని దోష నివారణకు ఏం చేయాలి ?


(Shani Dosha Nivarana)

మనలో చాలామంది కళ్యాణ దోషం, కాలసర్ప దోషం, దుష్టమానవుల దృష్టి దోషాలు, వాస్తుదోషాలు, నవగ్రహ దోషాలు – ఇలా అనేక రకాల దోషాలతో బాధపడుతుంటారు. గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు. శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి. శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు. నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు, శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది. శనిధ్యానం శ్లోకాలు ఆరు. ఈ శ్లోకాలను మనసారా స్మరించుకోవాలి.
సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని:
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే
నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం
నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే
మనస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
నమస్తే సౌరాయే విభో
నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్ర్రణతస్యచ ||

ఓం, ఐం, హ్రీం, శ్రీం శనైశ్చరాయనమః 

ఈ శని ధ్యాన శ్లోకాలను 19 వేలసార్లు పఠించినట్లయితే ఎలాంటి శని దోషాలైనా నివారణ అవుతాయి.

7, మార్చి 2013, గురువారం

కేతుగ్రహ జపం


(Kethu graha Japam)

ఆవాహనము:
అస్యశ్రీ శుక్ర గ్రహ మహా మంత్రస్య యజచ్చంద ఋషిః!
కేతుగ్రహో దేవతా! గాయత్రీచ్చందః (మమ) యజమానస్య
అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత కేతుగ్రహ సిద్ద్యర్దే
కేతుగ్రహ మంత్రజపం కరిష్యే!!
కరన్యాసము:
ఓం కేతుం కృన్యత్ - అంగుష్టాభ్యాసం నమః
ఓం కేతవే - తర్జనీభ్యాం నమః
ఓం పేశోమర్యా - మధ్యమాభ్యాం నమః
ఓం అపేశసే - అనామికాభ్యాం నమః
ఓం సముషద్భి: - కనిష్టికాభ్యాసం నమః
ఓం అజాయుతాః - కరతల కరపృష్టాభ్యాసం నమః
అంగన్యాసము:
ఓం కేతుం కృన్యత్ - హృదయాయ నమః
ఓం కేతవే - శివసేస్వాహా
ఓం పేశోమర్యా - శిఖాయైవషట్
ఓం అపేశసే - కవచాయహు
ఓం సముషద్భి: - నేత్రత్రయాయ వౌషట్
ఓం అజాయుతాః - అస్త్రాయఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధ:
ఆదిదేవతాః
బ్రహ్మ దేవానాం పదవీ: మృషిర్వి
ప్రాణాం మహిషో మృగాణాం!
శ్యోసో గృద్రాణాగ్ స్మధి తిర్వనా నాగ్
సోమః పవిత్ర మత్యేతి రేభన్!!
ప్రత్యథి దేవతా:
సచిత్ర చిత్రం చితయస్త మస్మే చిత్ర క్షత్రం
చిత్రతమావయోధాం చంద్రం రాయింపురు
వీరం బృహస్తం చంద్ర చంద్రాభిర్గ్రణతే దువస్వ!!
వేదమంత్రం
ఓం కేతుం కృన్వన్న కేతవే పేశోమార్యా అపేశసే!
సముషద్భిరజా యధాః కేతు కవచ స్తోత్రం
చిత్రవర్ణ శ్శిరః పాతు! ఫాలంమే ధూమ్ర వర్ణకః!
పాతు నేత్రే పింగళాక్షః! శ్రుతీమే రక్షలోచనః
ఘ్రుణం పాతు సువర్ణాభో! ద్విభుజం సింహికాసుతః!
పాతు కంఠంచ మే కేతు:! స్కంధౌ పాతు గ్రహాధిపః!
బాహుపాత సురశ్రేష్ట:! కుక్షిం మహోరగః పాతు!
సింహసనః కటిం పాతు! మద్యం పాతు మహాసురః!
ఊరు: పాతు మహాశిర్దో! జానునీ ఛ ప్రకోపనః!
పాతు పాదౌచమే రౌద్రః! సర్వాంగం రవిమర్ధకః
ఫలశ్రుతి:
య ఇదం కవచం దివ్యం సర్వరోగ వినాశనః!
సర్వదుఃఖ వినాశనం (చ) సత్యమేత న్నసంశయ:
కేతుగ్రహ మంగళాష్టకం
కేతు ర్జైమిని గోత్రజః కుశసమిద్వాయవ్య కోణేస్థిత:!
చిత్రాంక ధ్వజలాంచనోహి భగావాన్యో దక్షిణౌశాముఖః!
బ్రహ్మచైవచు చిత్రగుప్త అధిప: ప్రత్యాధి దేవస్సదా!
షట్ట్రింశ స్శుభకృచ్చ బర్భర పతి: కుర్యాత్సదా మంగళం!
కేత్వష్టోత్తర శతనామావళి:
ఓం కేతవే నమః ఓం స్థూలశిరసే నమః ఓం శిరసోమాత్రే నమః
ఓం ధ్వజాకృతయే నమః ఓం నవమగ్రహాయ నమః
ఓం సింహికాసురీ సంభూతాయ నమః ఓం మహాభీతికరాయ నమః
ఓం చిత్రవర్ణాయ నమః ఓం పింగళాక్షాయ నమః
ఓం ఫాలధూమ్ర సంకాశాయ నమః ఓం మహోరగాయ నమః
ఓం రక్తలోచనాయ నమః ఓం చిత్రకారిణే నమః ఓం మహాసురాయ నమః
ఓం తీవ్రకోపాయ నమః ఓం క్రోధనిధయే నమః ఓం పాపకంటకాయ నమః
ఓం తీక్ష దంష్ట్రాయ నమః ఓం ఛాయాగ్రహాయ నమః ఓం అంత్యగ్రహాయ నమః
ఓం మహాశీర్షాయ నమః ఓం సూర్యారయే నమః ఓం పుష్పవద్ద్వైరిణే నమః
ఓం వరదహస్తాయ నమః ఓం గదాపాణయే నమః ఓం చిత్రశుభ్రధరాయ నమః
ఓం చిత్రరాథాయ నమః ఓం కుళుత్దభక్షకాయ నమః ఓం వైడూర్యాభరణాయ నమః
ఓం సఉత్పాతజనకాయ నమః ఓం శుక్ర మిత్త్రాయ నమః ఓం మందసఖాయ నమః
ఓం జైమినీగోత్రజాయ నమః ఓం చిత్రగుప్తానే నమః ఓం దక్షిణాభిముఖాయ నమః
ఓం ఘనవర్ణాయ నమః ఓం ఘోరాయ నమః ఓం ముకుందవర ప్రదాయ నమః
ఓం మహాసురకులోద్భవాయ నమః ఓం లంబదేవాయ నమః ఓం శిఖినే నమః
ఓం ఉత్పాతరూపధరాయ నమః ఓం మృత్యుపుత్త్రాయ నమః
ఓం కాలాగ్ని సనిభాయ నమః ఓం నరపీఠకాయ నమః ఓం సర్వోపద్రవకారకాయ నమః
ఓం వ్యాదినాశకరాయ నమః ఓం అనలాయ నమః ఓం గ్రహణకారిణే నమః
ఓం చిత్రప్రసూతాయ నమః ఓం అదృశ్యాయ నమః ఓం అపసవ్యప్రచారిణే నమః
ఓం నవమేపాపదాయ నమః ఓం ఉపరాగగోచరాయ నమః
ఓం పంచామేశోకదాయ నమః ఓం పురుషకర్మణే నమః
ఓం తురీయస్తేసుఖ ప్రదాయ నమః ఓం తృతీయేవై రదాయ నమః ఓం పాపగ్రహాయ నమః
ఓం స్పోటకారకాయ నమః ఓం ప్రాణనాథాయ నమః ఓం పంచమేశ్రమకరాయ నమః
ఓం ద్వితీయేస్ఫుటవత్ప్రదాయ నమః ఓం విశాకులితవక్త్రాయ నమః
ఓం కామరూపిణే నమః ఓం చతుర్దేమాతృనాశకాయ నమః
ఓం నవమేపితృనాశకాయ నమః ఓం అంతేవైర ప్రదాయ నమః ఓం సింహదంతాయ నమః ఓం సత్యే అసృతపతే నమః ఓం సుతానందబంధకాయ నమః ఓం సర్పాక్షిజాతాయ నమః
ఓం కర్మరాశ్యుద్భవాయ నమః ఓం ఉపాంతేకీర్తిదాయ నమ
ఓం సప్తమేకలహప్రదాయ నమః ఓం పంచమేశ్రమకరాయ నమః
ఓం ఊర్ద్వమూర్ధజాయ నమః ఓం అనంగాయ నమః ఓం అష్టమే వ్యాధికర్త్రే నమః
ఓం ధనేబాహుసుఖ ప్రదాయ నమః ఓం జననేరోగదాయ నమః ఓం గ్రుహోత్తంసాయ నమః
ఓం అశేషజనపూజితాయాయ నమః ఓం పాపద్రుష్టయే నమః ఓం ఖేచరాయ నమః
ఓం శాంభనాయ నమః ఓం నటాయ నమః ఓం నశాశ్వాతాయ నమః ఓం ప్రాణనాథాయ నమః
ఓం శుభాశుభఫల ప్రదాయ నమః ఓం సుథాపయినే నమః ఓం ధూమ్రాయ నమః
ఓం సింహాసనాయ నమః ఓం రవీందుద్యుతిశమనయ నమః ఓం అజితాయ నమః
ఓం విచిత్రకపోలస్యందనాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భక్తరక్షకాయ నమః
ఓం భక్తాభీష్టకాయ నమః ఓం కేతుమూర్తయే నమః
కేతు స్తోత్రమ్
ఓం అస్యశ్రీ కేతు స్తోత్ర మహామంత్రస్య వామదేవఋషి: అనుష్టమ్ చంద!
కేతుర్దేవతా కేతుగ్రహప్రసాద సిద్ద్యర్దే జపే వినియోగః
గౌతమ ఉవాచ
మునీంద్ర సూత తత్వజ్ఞ సర్వశాస్త్ర విశారద
కేతుగ్రహోపతప్తానాం బ్రహ్మణా కీర్తితం పురా.
ఏకః కరాళవదనో ద్వితీయో రక్తలోచనః
తృతీయ: పింగళాక్షశ్చ చతుర్థోపి విదాహకః
పంచమః కపిలాక్షశ్చ షష్ట: కాలాగ్ని సన్నిభ:
సప్తమో హిమగర్భశ్చ దూమ్రవర్ణోష్టమస్తథా.
నవమః పాపకంఠశ్చ దశామో నరపీడకః
ఏకాదశస్తు శ్రీకంఠో వనమాలావిభూషణ:
ద్వాదేశైతే మహాక్రూరాః సర్వోపద్రవకారకాః
పీడ్యేతే సర్వకాలేషు దివాకరనిశాకరౌ
కలశే నీలవర్ణాభే ప్రభాక్రవిశాకరౌ నిక్షిష్య యే తు
షట్కోణే పద్మే చాష్టదళే క్రమాత్ కేతుం కరాళవదనం
సర్వలోకభయంకరం ప్రతిమాం వస్త్రసంయుక్తాం
చిత్రాం చైవ ప్రదాపయేత్ దానేనానేన సుప్రీతో భావేయు:
సుఖదాయినః వత్సరం ప్రయతాభూత్యా పూజయంతి సర్వోత్తమా:
మూలమష్టోత్తర శతం యే జపంతి సర్వోత్తమా:
తేషాం కేతుప్రసాదేన న కదాచిద్భయం భవేత్ ఇతీ శ్రీ బ్రహ్మాండ పురాణేవ
వాసుదేవసంవాదే కేతు స్తోత్రం సంపూర్ణమ్.
కేతు మహర్దశలో చేయవలసిన దానములు:
1. కేతు మహర్దశలో కేతు అంతర్దశలో ఉమామహేశ్వర దానం చేయండి.
2. కేతు మహర్దశలో శుక్ర అంతర్దశలో దుర్గా దానం చేయండి.
3. కేతు మహర్దశలో రవి అంతర్దశలో భాగ దానం చేయండి.
4. కేతు మహర్దశలో చంద్ర అంతర్దశలో వెండి గుర్రం దానం చేయండి.
5. కేతు మహర్దశలో కుజ అంతర్దశలో నూనె ఘటం దానం చేయండి.
6. కేతు మహర్దశలో రాహు అంతర్దశలో గుమ్మడిపండు దానం చేయండి.
7. కేతు మహర్దశలో గురు అంతర్దశలో తిల దానం చేయండి.
8. కేతు మహర్దశలో శని అంతర్దశలో గేదె దానం చేయండి.
9. కేతు మహర్దశలో బుధ అంతర్దశలో లేడి దానం చేయండి. గమనిక: కొన్ని వస్తువులు దొరకనప్పుడు వాటికి మారుగా ధనమిచ్చుట కంటెను ఆ వస్తువు ఆకారంలో వెండితో ప్రతిమ చేయించి దక్షిణతో ధారపోయవచ్చును.

6, మార్చి 2013, బుధవారం

గ్రహముల గోచార ఫలములు

సూర్యడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే జాతకుడు కుటుంబానికి దూరంగా ఉంటాడు. పనులకు ఆటంకాలు కలుగుతాయి. అనవసరశ్రమ, అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనవసరశ్రమ, అనారోగ్యం, అశాంతి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారం, ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభం, సుఖశాంతులు లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే కుటుంబంలో కలహాలు, ఋణబాధ కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే బంధువియోగం , దుఃఖము, అశాంతి కలుగును.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ధనలాభం, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే అధికప్రయాణాలు, అనారోగ్యం, దాంపత్యసుఖం లేకపోవుట, ఆందోళన కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఎనిమిదవరాశిలో ఉంటే కుటుంబకలహాలు, అనారోగ్యం, అశాంతి, ధననష్టం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు తొమ్మిదవరాశిలో ఉంటే అనవసర కలహాలు, మనశ్శాంతి లేకపోవుట, ధనవ్యయం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. మిత్రులతో విందులు చేసుకుంటారు.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే వృత్తిలో అభివృద్ధి, కుటుంబంలో ఆనందం, ధనలాభం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే మితులకు దూరంగా ఉంటారు. ఆందోళన, ధననష్టం కలుగుతుంది.
  • రవి శుభస్థానములు 3,6,10,11
  • రవి వేధాస్థానములు 9,12,4,3
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు. 
 చంద్రడు:-

  • చంద్రలగ్నంలోనే ఉంటే కుటుంబసౌఖ్యం, ఆరోగ్యం, గౌరవం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ధనవ్యయం, కార్యహాని, అపనిందలు, ఇతరులతో విభేదాలు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారమ్, ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభం, కుటుంబసౌఖ్యం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే బంధువులతో విభేదాలు, కార్యహాని, ఆందోళన కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. అనారోగ్యము ఏర్పడుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే నూతన వస్తువులు సమకుర్చుకుంటారు. బంధుమిత్రులతో వినోద కాలక్షేపం చేస్తారు. స్త్రీ సాంగత్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే బంధువుల సమాగమం, విలాస యాత్రలు చేయుట, స్త్రీసౌఖ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే మానసిక ఒత్తిడి, అనారోగ్యం కలుగుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే మానసిక ఆందోళన, నిరాశ, బలహీనత ఏర్పడుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే అధికారంలో అభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు, ఆర్థికాభివృద్ధి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే నూతన వ్యక్తులతో పరిచయాలు, స్త్రీ సాంగత్యం, కుటుంబాభివృద్ధి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే మిత్రులతో విభేదిస్తారు. పనులు నెరవేరవు.
  • చంద్రుడు శుభస్థానములు1,3,6,7,10,11
  • వేధాస్థానములు 5,9,12,2,4,8
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
కుజుడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే బంధువులతో తగాదాలు, ధననష్టం, కార్యహాని, కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అధికారుల వలన భయం, అనవసరశ్రమ కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. సంతానసుఖము, ఆరోగ్యం, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ఇతరులను నమ్మిమోసపోతాడు. అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుమారునివలన మనశ్శాంతి కోల్పోవుదురు. కోపము, బలహీనత కలుగును.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే బంధుమిత్రులతో విభేదాలు, అశాంతి కలుగుతుంది.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే నిరాశ, అశాంతి, అనారోగ్యం కలుగుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే ప్రయాణాలు, ధననష్టం, అవమానము, ఆందోళన కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ప్రయాణాలు, ధననష్టం, అవమానము, ఆందోళన కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే అనుకున్న పనులు జరుగుతాయి. భూ, ధనలాభం, స్త్రీసౌఖ్యం పొందుతారు.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే అధిక ధనవ్యయం, స్త్రీలతో వైఅరం కలుగుతాయి.
  • కుజుడు శుభస్థానములు 3,6,11
  • కుజుడు వేధాస్థానములు12,9,5
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
 బుధుడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటేనీచులతో స్నేహం, బంధువులతో విరోధం, ఆస్తినష్టం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ధనలాభం కలుగుతుంది. కాని అవమానం పొందుతారు.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారం లభిస్తుంది. బంధువులతో, అధికారులతో విభేదాలు కలుగుతాయి. ధనవ్యయం జరుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే బంధు, మిత్రుల సహకారం, దనము, సుఖము లభించును.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుటుంబం లో కలహాలు, అశాంతి ఏర్పడుతాయి. సుఖసంతోషాలు లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే నాయకుడు అవుతాడు. ధనవృద్ధి కలుగుతుంది. సుఖ సంతోషాలు లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే కార్యహాని, కలహాలు, ధనవ్యయం, అశాంతి కలుగుతాయి.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే అధికారుల అండ లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరును. ఆనందం పొందుతారు.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే బద్దకం పెరుగుతుంది. నీచకార్యాలపై ఆసక్తి కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ఉద్యోగాభివృద్ది, కీర్తి, ధనము లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే నూతన వ్యక్తుల పరిచయం, సంఘం లో గౌరవం ఏర్పడుతాయి. అనుకున్న పనులు సాధిస్తారు.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే కుటుంబంలో సమస్యలు, శత్రువుల వలన బాధలు, అపజయము కలుగుతాయి.
  • బుధుడు శుభస్థానములు 2,4,6,8,10,11
  • బుధుడు వేధాస్థానములు 5,3,9,1,7,12
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు. 
 గురుడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే ప్రయాణాలు, ధనవ్యయం, ఆందోళన, బంధువులతో విభేదాలు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే స్త్రీసౌఖ్యం, అధికారం లభిస్తాయి. ధనార్జన ఉంటుంది.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే స్థానచలనము, పనులకు ఆటంకాలు ఏర్పడుతాయి
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు, అధికారం కోల్పోవుట, ఆందోళన కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే మిత్రుల సహకారం, ధనము, అదికారము లభించును. శుభకార్యములు నెరవేర్చుదురు.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో వుంటే శ్రమపడినా ఫలితం దక్కదు. దాంపత్యసుఖం లభించదు.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే సమాజంలో గౌరవం, కుటుంబ సుఖం, ధనలాభం కలుగుతాయి.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే ప్రయాణాలు, అనవసర శ్రమ, ధననష్టం కలుగుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే అనుకున్న పనులు జరుగుతాయి. కుటుంబసఖము, అధికారము లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే వృత్తిపరంగా, కుటుంబపరంగా ఇబ్బందులు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే ఉద్యోగం, అధికారం, దనము, సుఖము లభిస్తాయి.
  • గురుడు శుభస్థానములు 2,5,7,9,11
  • గురుడు వేధాస్థానములు 12,4,3,10,8
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
 శుక్రుడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే కుటుంబసుఖం, విద్యాభివృద్ధి, ఉద్యోగం లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే కుటుంబంలో ఆనందం, ధనలాభం, సుఖశాంతులు లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే నూతన పరిచయాలు, సంఘంలో గౌరవం కలుగుతాయి. అధికారం లభిస్తుంది.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే మిత్రులతో వినోదయాత్రలు చేస్తారు. ధాన్యలాభం, సుఖశాంతులు పొందుతారు.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే మిత్రుల సహకారంతో అనుకున్న పనులు నెరవేరుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ధనవ్యయము అవుతుంది. ఋణము చేస్తారు.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే స్త్రీల వలన సమస్యలు, ఇబ్బందులు ఏర్పడుతాయి.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే మిత్రుల కలయిక, ధనము, స్త్రీసౌఖ్యం, ఆరోగ్యం లభిస్తాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. సుఖశాంతులు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. ఉద్యోగరీత్యా శుభప్రదం. వ్యసనాల వలన అవమానాలు పొందుతారు.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే స్త్రీలతో పరిచయాలు, అధికవ్యయం కలుగుతుంది. అనుకున్న పనులు జరగవు.
  • శుక్రుడు శుభస్థానములు 1,2,3,4,5,8,9,10,12
  • శుక్రుడు వేధాస్థానములు 8,7,1,10,9,5,11
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
 మందుడు(శని):-
  • చంద్రలగ్నంలోనే ఉంటే దూరప్రయాణాలు, అనారోగ్యం, పనులకు ఆటంకాలు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్యం, అశాంతి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇతరులవలన తన పనులు జరుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే పనులకు ఆటంకాలు ఏర్పడును. అనవసరంగా ధనవ్యయం జరుగును.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే భార్యకు అనారోగ్యం కలుగుతుంది. అనవసరంగా ధనం వ్యయమవుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ఆరోగ్యం, ధనలాభం, కుటుంబసౌఖ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే ప్రయాణాలు, అలసట, అనారోగ్యం కలుగుతాయి.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే కుటుంబ సమస్యలు ఏర్పడుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే అధికారుల వలన బాధలు అనవసర ప్రయాణాలు, అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ఉద్యోగం లభిస్తుంది. నీచకార్యాలపై ఆసక్తి కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, గౌరవము, ధనము లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే అనవసర శ్రమ, అనారోగ్యం, ధననష్టం కలుగుతాయి.
  • శని శుభస్థానములు 3,6,11
  • శని వేధాస్థానములు 12,9,5
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
రాహువు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే అనారోగ్యం, ప్రాణాపాయం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ధననష్టం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే సుఖశాంతులు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే కష్టములు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే ధననష్టము కలుగును.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో వుంటే కుటుంబ సుఖము, సంతోషము కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. ధననష్టం జరుగుతుంది.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే అనారోగ్యం, ఆపద కలుగుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. ధననష్టం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, స్త్రీ సాంగత్యం లభిస్తుంది.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. అనవసర శ్రమ, ధనవ్యయం కలుగుతాయి.
 కేతువు:-
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనారోగ్యము, ధనవ్యయము కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ధనము, సుఖము లభించును.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుటుంబ సుఖము, ధనము, ఆరోగ్యము లభించును.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ధనవ్యయం కలుగును.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే అనారోగ్యం, ఆపద కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఎనిమిదవరాశిలో ఉంటే ధననష్టం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు తొమ్మిదవరాశిలో ఉంటే బంధుమిత్రులు సహకారం లభిస్తుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ధనవ్యయం , బాధలు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, ధనార్జన ఉంటుంది.

5, మార్చి 2013, మంగళవారం

వివిధ - శని శాంతి మంత్రాలు - స్తుతి



(Shani Shanti Mantra Stuti)

ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే

ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.
ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.



శని పత్నీ నామ స్తుతి

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతని పత్ని నామాలను నిత్యం పారాయణ చేస్తుండాలి.
ద్వజనీ దామనీ చైవ కంకాళీ కలహప్రియ
కంటకీ కలహీ చాథ తురంగీ మహిషీ
అజాశ నేర్మామాని పత్నీనామేతాని
సజ్జపన్ పుమాన్ దు: ఖాని నాశ్యేత్యం

సౌభాగ్యం వర్ధతే సుఖమ్



శనికి సమర్పించవలసిన ద్రవ్యాలేమిటి ?

శనైశ్వర స్తుతి
నమః కృష్ణాయ నీలాయ
శిశిఖండ నిభాయచః
నమో నీల మధూకాయ
నీలోత్పల నిభాయచ!!
కృష్ణ స్వరూపుడు నీలవర్ణుడు, నిప్పు తునకతో సమానుడు నల్లని ఇప్పపూవువంటివాడైన శనీశ్వరునికి మనస్కారం. త్వష్ట ప్రజాపతి తన కూతురు సంజ్ఞాదేవిని సూర్యునికిచ్చి వివాహం చేయగా, సూర్యుని కిరణాల వేడిమిని భరించలేక తన ఛాయ అనగా నీడకు ప్రాణం పోసి భర్త వద్ద వదిలి తాను తన తండ్రివద్దకు వెళ్ళిపోతుంది. ఈ ఛాయాదేవి, సూర్యు భగవానుల కుమారుడే శనీశ్వరుడు. ఈయన విభవ నామ సంవత్సరం, మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథియందు ధనిష్టా నక్షత్రంలో జన్మించాడు. ఈయన కుడిచేతిలో దండం, ఎడమ చేతిలో కమండలాలు ఉంటాయి.
హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్పుడు, పురూరవుడు, సాగరుడు, కార్త్య వీర్యార్జునుడు వీరంతా శని మహిమ వల్ల అనేక కష్టనష్టాలను పొంది చివరకు శని కృపాదృష్టితో ఆనందాన్ని పొందారు. శనీశ్వరుడు విష్ణుమూర్తికి తోడల్లుడు, సూర్యుని కుమారుడు, యమధర్మ రాజుకి, యమునా నదికి సోదరుడు. గ్రహాలకు యువరాజు వంటివాడు. ఆంధ్రప్రదేశ్ లోని మందపల్లి, మహారాష్ట్రలో శని శింగనాపూర్, తమిళనాడులో తిరునళ్ళార్ శని క్షేత్రములు. అయితే పూర్తి వాస్తుతో అతిశక్తివంతమైన 7వ శతాబ్దం నాటి క్షేత్రం పాండిచ్చేరిలోని తిరువళ్ళార్ లో వుంది. శని ప్రభావం వల్ల నల మహారాజు వస్త్రాలను పక్షి ఎగురవేసుకుపోయే దృశ్యాలు ఈ క్షేత్రంలో కన్పిస్తాయి. నలమహారాజు శని విముక్తి చేసే చిత్రాలు అక్కడ కన్పిస్తాయి. భక్తులు నూనెతో స్నానం చేసి ఆ తర్వాత అక్కడి చెరువులో స్నానం చేస్తే చాలు ఎంతమాత్రం జిడ్డు కనిపించదు. లక్షలాదిమంది స్నానం చేసే ఆ చెరువులో జిడ్డు కనిపించకపోవడమే అక్కడి విశేషం.
ఈ పవిత్ర క్షేత్రంలో బంగారు కాకిపై శనీశ్వర దేవునికి ఊరేగింపును చేస్తారు. ఈ స్వామి వారి భార్యల పేర్లు నీలాదేవి, మంగాదేవి. ఈ స్వామి పడమర దిక్కుగా వుంటాడు. శంగణాపూర్, మందవల్లి, నర్సింగ్ ల్ , విజయవాడ, జాల్నా, పాపగడ్, వైదీశ్వరన్ కోయిల్లలోని దేవాలయాలన్నీ శనీశ్వర దేవాలయాలలో ప్రఖ్యాతిగాంచినవి. శని త్రయోదశి పర్వదినాలలో మండవల్లిలోని శ్రీమందేశ్వర స్వామివారికి శని దోష పరిహారార్ధం తైలాభిషేకాలు చేసుకుంటే శని దేవుని వలన కలిగే సమస్త దోషాలు నివారించబడతాయని స్కంద పురాణంలో లిఖితమై ఉంది.
శనికి ఏం సమర్పించాలి ?
నల్ల వస్త్రం. నూనెదీపం, అగరవత్తులు, నువ్వులనూనె, స్వీట్లు, పండ్లు, దండ, జిల్లేడు ఆకులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, గుర్రపు నాడా, చిన్న దిష్టిబొమ్మ. ఇవి సమర్పించలేనివారు పావు లేదా అరలీటరు నూనెతో తైలాభిషేకం చేయొచ్చు.
శని శింగణాపూర్:
జీవితంలో కష్టనష్టాలకు లోనై మరే దేవుడు రక్షించని తరుణంలో చివరగా గుర్తుకు వచ్చేది శని శింగణాపూర్ లోని శనీశ్వరుడు. ఇటీవల కాలంలో తిరుపతి వెళ్ళేవారు ఏ విధంగా కాణిపాకం విఘ్నేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారో అదేవిధంగా షిర్డీ సాయి బాబాను దర్శించుకోవడానికి వెళ్ళినవారు శని శింగణాపూర్ క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా నెవాసా తాలూకాకు చెందిన ఆ గ్రామం గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఏ ఇంటికీ గుమ్మాలు లేకపోవడం ఆ గ్రామం ప్రత్యేకత. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఆ గ్రామ జనాభా 3000 కాగా ఇళ్ళు దాదాపు 450 వరకూ ఉంటాయి, గ్రామ కట్టుబాటు, పూర్వపు ఆచారం నూతన గృహాలకు కూడా తలుపులు ఉండవు. గ్రామంలో పోలీస్ స్టేషన్ లేదు. పోలీసులకు దొంగతనాలు, ఇతర నేరాల గురించి ఫిర్యాదులు ఉండవు. ఇంటువంటి సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కారమవుతాయి. అందుకే వారు ‘మాకు దేవుడు ఉన్నాడు కానీ మా దేవుడికి గుడిలేదు. ఎండకు ఎండుతాడు వానకు తడుస్తాడు. మాకు ఇళ్ళు ఉన్నాయి కాని వాటికి గుమ్మాలు, తలుపులు లేవు. మా సూర్యపుత్రుడు శనీశ్వరుడే మా ఇళ్ళకు రక్షగా ఉంటాడు’ అంటారు. సాధారణంగా అందరూ శని పేరు ఎత్తటానికి భయపడుతుంటారు. కాని ఆ గ్రామస్థులు శనీశ్వరుణ్ణి తమ ఆప్తదేవుడుగా నిత్యం కొలుస్తారు. అన్ని కార్యక్రమాలకు ఆయన్నే నమ్ముకుంటారు. ప్రతీదానికి వినాయకునితోపాటు శనీశ్వరుణ్ణి తలచుకుంటారు. ప్రతీ నెలా అమావాస్య మర్నాడు చంద్రోదయం రోజున లక్షలాదిమంది భక్తులు శనిదేవుని దర్శిస్తారు. శని త్రయోదశి సోమవారాలనాడు అధికసంఖ్యలో భక్తులు వస్తారు. సాధారణ రోజులలో కూడా భక్తుల సంఖ్య గణనీయంగానే ఉంటుంది. దేవాలయంలోకి అందరికీ ప్రవేశం ఉన్నా మగవారు మాత్రమే శనిదేవుని పూజాకార్యక్రమం నిర్వహించాలి. వారు విధిగా తలస్నానం చేసి కాషాయరంగు లుంగీ లేదా పంచె మాత్రమే ధరించాలి, ఈ వస్త్రాలు ఇక్కడ లభ్యమవుతాయి. పూజ తర్వాత వదిలివేయాలి. ముఖ్యమైన రోజులలో కాషాయవస్త్రధారులతో శని శింగణాపూర్ శోభాయమనంగా ఉంటుంది. ఆరోజు దృశ్యం చూడముచ్చటగా, ఆలయప్రాంగణం సుందరంగా ఉంటుంది. సదుపాయాలు. పెద్ద ఎత్తున విసృతపరుస్తున్నారు. ఇది కేవలం విరాళాలవల్లే సాధ్యపడుతోంది. గ్రామప్రవేశానికి రెండు రూపాయల పంచాయితీ ప్రత్యేక టోల్ ఫీజు మాత్రం వసూలు చేస్తున్నారు. ఈ దేవాలయానికి అనుబంధంగా మరొక పాఠశాలను, గోసంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వసతి ఏర్పాట్లు ఉన్నాయి. లగ్జరీ గదులతోపాటు సాధారణ గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆలయ నిర్వహణ ఆహ్లాదకరంగా ఉంది.
శని విగ్రహ ప్రత్యేకత
ఇక్కడ శని విగ్రహాన్ని 16 అడుగుల 16 అంగుళాల పొడవు, వెడల్పు గల 3 అడుగుల ఎత్తుగల సమచతుర్భుజ ప్లాట్ ఫాంపై ప్రతిష్టించారు. విగ్రహం శివలింగం ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇనుములా తలపించే నల్లరాతి విగ్రహం ఎత్తు ఐదున్నర అడుగులు, వెడల్పు ఒకటిన్నర అడుగులు. శనిపీడితులు కాషాయ వస్త్రధారులై అర్చకుని సహాయంతో ఈ విగ్రహంపైనే తైలాభిషేకం చేసి దోషనివారణ పొందుతారు. ఈ ప్లాట్ ఫాంపై గల శనీశ్వరుణ్ణి అందరూ వీక్షీంచవచ్చు. అయితే ప్లాట్ ఫారాన్ని ఆడవాళ్ళు తాకరాదనే నియమం వుంది. 

నవ శని క్షేత్రాలు
మనం చెప్పుకుంటున్న శనిశింగణాపూర్ తో పాటు మరో ఎనిమిది క్షేత్రాలు ఉన్నాయి. వాటినే నవ శనిక్షేత్రాలు అంటారు.
1. మహారాష్ట్రలోని నాసిక్ సమీపానగల నందగావ్.
2. మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ దగ్గర శనిబాధేశ్వర్
3. మధ్యప్రదేశ్ లో జబల్పూర్ దగ్గర పిపాల్ గావ్.
4. తమిళనాడులోని తరునల్లార్.
5. ఉత్తరప్రదేశ్ లోని మధుర సమీపాన కొకిల్వన్.
6. ఉత్తరప్రదేశ్ లోని నిర్లాపూర్ సమీపాన శనితీర్థ.
7. మహారాష్ట్రలోని ఔరంగబాద్ జిల్లాలో శనిభగవాన్ తీర్థం.
8. చత్తీస్ ఘట్ రాష్ట్రంలోని థమ్ ప్రాంతంలో శనిదేవక్షేత్రం. భరతఖండంలో గుజరాత్, సౌరాష్ట్రల్లో శని ఆవిర్భవించాడనే నమ్మకం ఉంది. ఇదీ శని కుటుంబం:
తండ్రి: సూర్యభగవానుడు
తల్లి: ఛాయాదేవి
సోదరుడు: యమధర్మరాజు
సోదరి: యమున
స్నేహితులు: హనుమాన్, కాలభైరవుడు
ఇతర పేర్లు: కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర
గోత్రం: కాశ్యపన.

4, మార్చి 2013, సోమవారం

వాస్తులో ప్రభావం చూపే రంగు బల్బులు

వాస్తులో ప్రభావం చూపే రంగు బల్బులు
Colour Bulbs Influence on Vastu


వాస్తులో ద్వారాలు, గోడలు, కిటికీలు, స్తంభాలు మాత్రమే కాదు, ఇంకా అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. వాస్తు మహా విస్తృతమైన శాస్త్రం. ఇంటిముందు పూలమొక్కలు, ఇంటి గోడలకు వేసే సున్నపు రంగులు మొదలైనవెన్నో వాస్తు పరిగణనలోకి వస్తాయి. ఆఖరికి ఇళ్ళలో లైట్లు కూడా వాస్తు కిందికి వస్తాయి. ఏ రకమైన లైట్లు వాడుతున్నామో, ఆ ప్రభావం ఉంటుందని గ్రహించుకోవాలి.


మార్కెట్లో వివిధ రంగుల బల్బులు దొరుకుతాయి. మనం సాధారణంగా తెల్లటి కాంతివంతమైన బల్బులు లేదా ట్యూబ్ లైట్లు ఉపయోగిస్తాం. లైట్ల రంగులను బట్టి వాస్తు ప్రభావం ఉంటుందని తెలిసింది కనుక ఇకపై ఆయా రంగుల లైట్లను అమర్చుకుందాం. ఇంటికి ఏ దిక్కునున్న గదుల్లో ఏ రంగుల బల్బులను ఉపయోగిస్తే మంచిదో ఇస్తున్నాం, చూడండి. 

తూర్పు - ఎరుపు రంగు లైట్లు

పశ్చిమం - నీలం రంగు లైట్లు

ఉత్తరం - ఆకుపచ్చ బల్బు

దక్షిణం - డార్క్ రెడ్ లైట్లు

ఈశాన్యం - పసుపు రంగు బల్బులు

ఆగ్నేయం - టొమేటో రంగు బల్బులు

వాయువ్యం - తెలుపు రంగు లైట్లు

నైరుతి - తెలుపు రంగు బల్బులు

చూశారు కదండీ.. ఆయా దిక్కుల్లో ఉన్న గదుల్లో పైన చెప్పిన ప్రకారం అనుకూలమైన రంగుల బల్బులను అమర్చడం వలన సత్ఫలితాలు ఉంటాయి. ఆయా రంగుల బల్బులను మంచి కాంతివంతమైనవి అమర్చాలి. పడుకునే సమయంలో మాత్రమే జీరో వాట్ బల్బులను ఉపయోగించాలి. మెలకువగా ఉన్న సమయంలో ఎక్కువ వాట్స్ ఉన్న బల్బులను మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయడంవల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఎంతో అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో అనారోగ్యాలు తలెత్తవు.

3, మార్చి 2013, ఆదివారం

దశరథ కృత శని స్తోత్రం

(Dasarathakruta Shani Stotram)

దశరథుడు రచించిన శని స్తోత్రం గురించి పురాణ గాథ ఇలా ఉన్నది. దశరథుని తపస్సుకు మెచ్చిన శనైశ్చరుడు దశరథుడు కోరిన వరం ప్రసాదించి, మరో వరం కోరుకోమన్నాడు. అప్పుడు దశరథుడు “శనిదేవా! నేటి నుండీ మానవులను ఎవ్వరినీ మీరు బాధించవద్దు” అని వరం కోరుకున్నాడు. అప్పుడు శనిదేవుడు ''అది సాధ్యం కాదు.. నువ్వు నన్ను స్తుతిస్తూ స్తోత్రం రచించు. అది పఠించినవారిని నేను బాధించను'' అని వరమిచ్చాడు. ఆ వరానికి అనుగుణంగా దశరథుడు రచించినదే ఈ శని స్తోత్రం.
కుడిచేతిలోకి నీరు అక్షింతలు తీసుకుని ఓం అస్యశ్రీ శనిస్తోత్ర మహామంత్రస్య నుండీ జపే వినియోగః వరకు చెప్పిన తర్వాత నీరు వదిలేయాలి.
అథః వినియోగ:
ఓం అస్య శ్రీ శనిస్తోత్ర మంత్రస్య కశ్యప ఋషిః త్రిచ్చంద్ర: సౌరిర్దేవతా, శం బీజమ్, ని: శక్తి: కృష్ణ వర్ణేతి కీలకమ్, ధర్మార్థ కామ మోక్షాత్మ కచతుర్విధ – పురుషార్ధసిద్ద్యర్ధం జపేవినియోగః
అథ కరన్యాసం:
ఈ న్యాసం చెప్పేటప్పుడు పేరును బట్టి ఆ వేళ్లను స్పృశించాలి.
శనైశ్చరాయ అంగుష్టాభ్యాసం నమః
మందగతయే తర్జనీభ్యాం నమః
అధోక్షజాయ మధ్యమాభ్యాం నమ: కృష్ణాంగాయ అనామికాభ్యాం నమః
శుశ్కోదరాయ కనిష్టాంగాయ అనామికాభ్యాం నమః
శుష్కోదరాయ కనిష్టకాభ్యాం నమః చాయాత్మజాయ
కరతల కరపృష్టాభ్యాం నమః. అథ హృదయాది న్యాసః
అస్త్రాయ ఫట్ అనేటప్పుడు ఎడమ అరచేతిపై కుడిచేతితో చప్పట్లు కొట్టి ఫట్ అనే ధ్వని చేయాలి.
శనైశ్చరాయ హృదయాయ నమః మందగతయే శిరసే స్వాహా
అథోజాయ శిఖాయై వషట్ కృష్ణాంగాయ కవచాయ హుమ్
శుష్కోదరాయ నేత్రత్రాయ వౌషట్ ఛాయాత్మజాయ
అస్త్రాయ ఫట్ అథ దిగ్భంధనమ్ ఓం భూర్భవ: స్వః
అంటూ నాలుగు వైపులా చిటికెలు వేయాలి.
అథః ధ్యానమ్ నీదు ద్యుతిమ్ శూలధరమ్ కిరీటినం
గ్రథస్థితం త్రాసకరం ధనుర్ధరమ్ చతుర్భుజం
సూర్యసుతం ప్రశాంతం వందే సదాభీష్టకరం
వరేణ్యమ్ శని స్తోత్ర్రం ప్రారంభం నమః
కృష్ణాయ నీలాయ శితికంఠనిభాయ చ నమః
కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః
నమో నిర్మాసదేహాయ దీర్ఘశ్మశ్రు జటాయ చ నమో విశాల నేత్రాయ
శుష్కోధర భయాకృతే నమః పుష్కలగాత్రాయ స్థూలరోమ్ణ్థ వై నమః
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే నమస్తే
కోట రక్షాయ దుర్నిరీక్ష్యాయ వై నమః నమో ఘోరాయ
రౌద్రాయ భీషణాయ కపాలినే నమస్తే సర్వభక్షాయ బలీముఖే నమోస్తుతే
సూర్య పుత్ర నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే
తుభ్యం నిస్త్రీంశాయ నమోస్తుతే తపసా దగ్ధదేహాయ నిత్యం
యోగరతాయ చ నమో నిత్యం క్షుధార్తాయ అతృప్తాయ చ వై నమః
జ్ఞాన చక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజసూనవే తుష్టో దదాసి వై రాజ్యం రుష్టో
హరసి తత్క్షణాత్ దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విధ్యాధరోరగా:
తవ్యా విలోకితా: సర్వే నాశం యాన్తి సమూలతః ప్రసాదం కురు
సౌరే వరదీ భవ భాస్కరే ఏవం స్తుతస్తదా సారిగ్రహరాజో మహాబలః
అవ్రవీచ్చ శనిర్వాక్యం హృష్టరోమా చ పార్దివః తుష్టోహం
తవ రాజేంద్ర స్తోత్రేనానేన సువ్రత ఏవం వరం ప్రదాస్యామి యన్తే మనసి వర్తతే
దశరథ ఉవాచ పసన్నో యది మే సౌరే వరం దేహి మమేప్సితమ్
అద్య ప్రభ్రుతిప్పింగాక్ష పీడా దేవా న కస్యచిత్ ప్రసాదం కురు మే సౌరే వరోయం
మే మహేప్సితః శని ఉవాచ అదేయస్తు వరౌస్మాకం తుష్టోకం చ
దదామి తే త్వచాప్రోక్తం చ మే స్తోత్రం యే పఠిష్యంతి మానవాః
దేవాసుర మనుష్యాశ్చ సిద్ద విద్యాధరోరగా న తేషా బాధతే పీడా మత్క్రుచా వై
కదావన మృత్యుస్థానే చతుర్థే వా జన్మ వ్యయ ద్వితీయగే గోచరే జన్మకాలే
వా దశాస్వన్తర్దశాసు చ యః పఠేత్ ద్వి త్రి సంధ్యం వా శుచిర్భూత్వా సమాహితః
న తస్య జాయతే పీడా కృత వై మమనిశ్చితమ్ శని శాంత మంత్ర స్తుతి

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...