శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

4, అక్టోబర్ 2013, శుక్రవారం

కర్కాటక లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

  సూర్యుడు:- కర్కాటక లగ్నానికి సూర్యుడు ధనస్థానాఢిపతి ఔతాడు. కటక  లగ్నస్థ సూర్యుడు వ్యక్తికి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు. రవి దశలో ఆరోగ్య సమస్య లు ఎదుర్కొంటారు.
వీరికి కోపం, స్వాభిమానం ఎక్కువ. వీరికి వ్యాపారం మీద ఆసక్తి , ఉద్యోగం మీద కోరిక ఉంటాయి. ప్రభుత్వం నుండి సమస్యలు ఎదురౌతాయి. తండ్రితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. బంధు మిత్రులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వీరికి నిలకడ ఉండదు. వీరికి భాగస్వామ్యం కలిసి రాదు. కటక లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానమైన మకరం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవితభాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.
 
చంద్రుడు:- కర్కాటక లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి, రాశ్యాధిపతిగా కారక గ్రహమై శుభఫలితం ఇస్తాడు. కటక లగ్నస్థ చంద్రుడు భగవత్భక్తి, పెద్దల ఎడ గౌరవ మర్యాదలు, పరోపకార గుణం కలిగిస్తాడు. వీరిలో మనోబలం ఎక్కువగా ఉంటుంది. స్వప్రయత్నంగా సమాజంలో ఉన్నత స్థానం చేరుకుంటారు. వ్యాపార, కళారంగాలలో సాఫల్యత కలుగుతుంది. జ్ఞానం, ఉన్నత విద్య కలిగి ఉంటారు. సత్య వాక్కే అయినా కఠినంగా మాట్లాడటం వలన వీరు విరోధమును ఎదుర్కొంటారు. లగ్నస్థ చంద్రుడు  పూర్ణ దృష్టిని సప్తమ భావం మీద ప్రసరిస్తాడు కనుక జీవిత భాగస్వామికి  సౌందర్యం ఇస్తాడు. జీవిత భాగస్వామి సహాయసహకారాలు లభిస్తాయి. వీరికి భాగస్వామ్యం కలసి వస్తుంది. భాగస్వాములు సహకరిస్తారు. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. 
 
కుజుడు :- కర్కాటక లగ్నానికి కుజుడు పంచమాధిపతి, దశమాధిపతి ఔతాడు. త్రికోణాధిపతిగా, దశమాధిపతిగా కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. అయినా లగ్నస్థ కుజుడు 
వ్యక్తికి క్రోధగుణం, ఉగ్రస్వభావం కలిగిస్తాడు. వీరికి మహత్వకాంక్ష అధికం. వీరికి రాజకీయాలు లాభిస్తాయి. లగ్నం నుండి కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ భావముల మీద దృష్టిని ప్రసరిస్తాడు కనుక ఆర్ధిక లాభం అలాగే అధిక వ్యయం కలిగిస్తాడు. ధనసంపాదన వీరికి కఠిన విషయం. తెలివి తేటలు పేరాశ వీరికి అవమానాలను ఇస్తుంది. లగ్నస్థ కుజుడు సంతాన ప్రాప్తి కలిగిస్తాడు. కుజుడి సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో మాధుర్యం లోపించి కలహపూరితంగా ఉంటుంది.
 
బుధుడు:- కటక లగ్నానికి బుధుడు తృతీయ, ద్వాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. బుధుడి కటక లగ్నస్థ స్థితి వ్యక్తికి సందేహాస్పద వ్యక్తిత్వం, ఆచరణ, అలవాట్లు కలిగి ఉంటాడు. వీరికి వ్యాపారంలో ఆసక్తి తక్కువ, ఉద్యోగంలో ఆసక్తి ఎక్కువ. కనుక జీవనోపాధికి ఉద్యోగాన్ని ఎన్నుకుంటారు. వీరికి బంధుమిత్రులతో సోదరులతో విశేషమైన ఆప్యాయత ఉండదు. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని ప్రసరిస్తాడు కనుక వైవాహిక జీవితం అశాంతి మయంగా ఉంటుంది,  భాగస్వాముల వలన హాని కలుగుతుంది. శత్రువుల వలన కష్టములు ఎదుర్కొనవలసి ఉంటుంది.
 
గురువు :- కటక లగ్నానికి గురువు షష్టమ, నవమభావాలకు అధిపతి ఔతాడు. లగ్నానికి గురువు త్రికోణాధిపత్యమైన నవమస్థానాధిపతిగా కారక గ్రహమై శుభఫలితాలను ఇస్తాడు. కటక లగ్నంలో గురువు ఉచ్ఛస్థితిని పొందుతాడు కనుక వ్యక్తికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తాడు. గురువు పరి పూర్ణ దృష్టితో మిత్ర స్థానమైన పంచమ స్థానం అయిన వృశ్చికాన్ని,  సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక సంతాన భాగ్యం ఉంటుంది. ఉత్తమమైన జీవితభాగస్వామి లభిస్తుంది. భాగస్వాముల సహాయ సహకారాలు అందుతాయి. నవమ స్థాన దృష్టి ఫలితంగా సంపూర్ణ భాగ్యశాలి ఔతాడు. ధన, ధాన్య సంపదలతో జీవితం పరిపూణ భాగ్యంతో గడుస్తుంది. వ్యాపారంలో ఉదారత, దయాస్వభావం కలిగి ఉంటారు.
 
శుక్రుడు:- కటక లగ్నానికి శుక్రుడు చతుర్ధ, ఏకాదశాధిపతి ఔతాడు. లగ్నస్థ శుక్రుడు వ్యక్తికి పిరికితతనం, భయం కలిగిస్తాడు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగ వఆపారాలలో సఫలత లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ దృష్టి శని స్థానం మిత్ర స్థానమైన మకరం మీద ఉంటుంది కనుక వ్యక్తికి పరిశ్రమించే గుణం ఉంటుంది. స్త్రీల మీద వీరికి విశేష ఆకర్షణ ఉంటుంది. అందమైన శ్రమకు ఓర్చే జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. భాగస్వాములు అనుకూలురై శ్రమిస్తారు.
 
 రాహువు:- కటక లగ్నంలో రాహువు వ్యక్తిని విలాసవంతుడిగా చేసి ష్ఖభోగముల మీద ఆకర్షణ కలుగచేయును. కఠిన పరిశ్ర తరువాత వ్యాపారంలో సఫలత సాధిస్తారు. ఉద్యోగములో అతిత్వరితంగా సఫలత లభిస్తుంది. రాహువు సప్తమ దృష్టి ఫలితంగా వైవాహిక జీవితంలో అశాంతి చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభించవు. భాగస్వామీ  వలన నష్టములు కలుగ వచ్చు.
 
 కేతువు:- కటక లగ్నస్థ కేతువు ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు. కేతుదశా సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. సమాజం నుండి గౌరవ, సన్మానాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. గుప్తమైన శత్రువులు ఉంటారు. వారి వలన సమస్యలను ఎదుర్కొంటారు. కేతువు సప్తమ స్థాన దృష్టి ఆ స్థానకారకత్వమును బాధిస్తుంది. వవాహిక జీవితంలో సుఖం లోపిస్తుంది వివాహేతర సంబంధాలు కలిగే అవకాశం ఉంటుంది.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...