శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

23, జులై 2017, ఆదివారం

SrAvaNamAsaMpaMDugalu

శ్రావణ మాసం - పండుగలు

శ్రావణ మాసం 

సృష్టి,స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు,దుష్టశిక్షకుడు,శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం "శ్రావణ మాసం" 

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం "శ్రవణా నక్షత్రం" అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం. 

శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ,శుక్ర,శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం. 

పాడ్యమి - బ్రహ్మదేవుడు
 విదియ - శ్రీయఃపతి 
 తదియ - పార్వతీదేవి
 చవితి - వినాయకుడు
 పంచమి - శశి
 షష్టి - నాగదేవతలు
 సప్తమి - సూర్యుడు
 అష్టమి - దుర్గాదేవి
 నవమి - మాతృదేవతలు
 దశమి - ధర్మరాజు
 ఏకాదశి - మహర్షులు
 ద్వాదశి - శ్రీమహావిష్ణువు
 త్రయోదశి - అనంగుడు
 చతుర్దశి - పరమశివుడు
 పూర్ణిమ - పితృదేవతలు

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు 

శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని,సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది. 

మంగళగౌరీ వ్రతం
 శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను. 

వరలక్ష్మీ వ్రతం
 మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.

శ్రావణమాసంలో వచ్చే పండగలు

శుక్లచవితి-నాగులచవితి
 మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.

శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి 
 ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది. 

శ్రావణ పూర్ణిమ - రాఖీపూర్ణిమ
 సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.

పూర్ణిమ - హయగ్రీవ జయంతి
 వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం.హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు,ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు. 

కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి 
 క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు. 

కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి

శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణపక్ష ఏకాదశి - కామిక ఏకాదశి
 ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది.ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య - పోలాల అమావాస్య
 ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

శ్రావణ సోమవారాలు
1). 24౼7౼2017
2). 31౼7౼2017
3). 07౼08౼2017
4). 14౼08౼2017
5). 21౼08౼2017
*(5 సోమవారాలు)*

శ్రావణ శనివారాలు
1). 29౼07౼2017
2). 05౼08౼2017
3). 12౼08౼2017
4). 19౼08౼2017
*(4 శనివారాలు)*
శ్రావణ మాసం పండుగలు
*27౼07౼2017౼గురువారం౼నాగుల చవితి (ఉపవాసం)*
*28౼07౼2017౼శుక్రవారం౼నాగుల పంచమి*
*04౼08౼2017౼శుక్రవారం౼వరలక్ష్మీ వ్రతం*
*05౼08౼2017౼శనివారం౼శని త్రయోదశి*
*07౼08౼2017౼సోమవారం౼రాఖీ పౌర్ణమి (చంద్ర గ్రహణం)*
*15౼08౼2017౼మంగళవారం౼గోకులాష్టమి*
*19౼08౼2017౼శనివారం౼శని త్రయోదశి*
*25౼08౼2017౼శుక్రవారం౼శ్రీ వినాయక చవితి*

ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. అందుకే.. ఈ నాలుగువారాలు.. చాలా భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. అలాగే ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాన్నిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్థోమతను, సమయాన్ని బట్టి ఏదో ఒక పూజాకార్యక్రమాల్లో పాల్గొనడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ పవిత్రమైన, శక్తివంతమైన శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల విశేష ఫలితాలు, అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. 

 ఈ శ్రావణ మాసంలో కొన్ని పనులు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ శ్రావణ మాసంలో చాలా మంది శివుడికి ప్రత్యేకమైన సోమవారం ఉపవాసాలు ఉండి.. అభిషేకాలు చేస్తారు. ఇలా చేయడాన్ని శ్రావణ సోమవారం వ్రతం అని పిలుస్తారు. అలాగే మంగళవారం చేస్తే.. మంగళగౌరీ వ్రతం అని పిలుస్తారు. పెళ్లికాని స్త్రీలు ఈ వ్రతం చేస్తే.. శివుడి లాంటి భర్తను పొందుతారు.
హిందూ వేదాలు, పురాణాల ప్రకారం శ్రావణమాసం... శివుడిని పూజించడానికి ప్రత్యేకమని చెబుతాయి. అలాగే వివాహం, సంపద పొందడానికి కూడా ఈ నెలలో పూజలు నిర్వహించాలని సూచిస్తారు.
శ్రావణమాసం చాలా విశిష్టమైనది కావడం వల్ల అనేక పండుగలు ఈ నెలలోనే వస్తాయి. శ్రీకృష్ణ జన్మాస్టమి, రక్షాబంధన్, నాగ పంచమి, తేజ్ వంటి పండుగలు జరుపుకుంటారు. అలాగే.. పెళ్లిళ్లు చేయడానికి ఈ నెల చాలా పవిత్రమైనది.
శ్రావణ మాసం శివుడు భక్తులకు వరాలు కురిపిస్తారు. వాళ్ల తప్పులు క్షమించమని పశ్చాత్తాపంతోపూజలు నిర్వహిస్తే.. వాటిని మన్నించి.. విజయం సాధిస్తారు. అలాగే నెగటివ్ ఎనర్జీ తొలగించి, అదృష్టం ఆశీర్వదిస్తారు. ఈనెలలో శివపార్వతుల ఆశీర్వాదాలు పొందవచ్చు.
ఈ శ్రావణ మాసం అంతా.. గోమూత్రం తీసుకువచ్చి ఇల్లు మొత్తం చల్లుకుంటూ ఉండాలి. ప్రతి మూల చల్లుకుంటే.. పాజిటివ్ ఎనర్జీ పొందుతారు.
శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రుద్రాభిషేకం లేదా సాధారణ అభిషేకం నిర్వహించడం వల్ల అన్ని రకాల మంగళ దోషాలు నివారించబడతాయి.
రుద్రాక్ష ధరించాలని భావిస్తే.. శ్రావణమాసంలో వేసుకోవడం చాలా పవిత్రమైనది. ఈ నెలలో రుద్రాక్షలు వేసుకుంటే.. చాలా ఫలితాలు పొందుతారు.
బిల్వపత్రాలు ఎప్పుడు పీకరాదు శివుడికి బిల్వపత్రాలు సమర్పించడం విశిష్టమైనదే కానీ.. అష్టమి, చతుర్ధసి, నవమి, అమావాస్య, సోమవారం వీటిని పీకరాదు.
శ్రావణమాసంలో సాయంత్రం పూట శివపార్వతుల హారతి ఇస్తే.. శివుడి అనుగ్రహం పొందుతారు. మంచి భాగస్వామిని పొందుతారు.
శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయకపోవడం వల్ల ప్రశాంతత కోల్పోకుండా, సంపద తరిగిపోకుండా ఉంటుంది.
శ్రావణ మాసంలో ఎట్టిపరిస్థితుల్లో పాములను చంపకూడదు. శివుడిని చాలా ప్రీతికరమైనది కాబట్టి పాములను పూజించాలి. చంపకూడదు..


*గమనిక:*
●  తేదీ 07౼08౼2017 సోమవారం రోజున రాఖీ పౌర్ణమి చంద్ర గ్రహణం కలదు.
● ఈ గ్రహణం రాత్రి 10:56 నిముషాల నుండి తెల్లవారు జామున 1:05 నిముషాల వరకు ఉండును.
● ఈ గ్రహణంను శ్రావణ నక్షత్రం మరియు మకర రాశి వారు చూడరాదు.
*మార్పులు ఏమైనా ఉంటే, గమనించగలరు*

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...