శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com
యంత్రములు / yantras లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
యంత్రములు / yantras లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, మార్చి 2015, సోమవారం

అష్టలక్ష్మీ సమేత సంతోషిమాతా యంత్రం



ముందుగా గణపతి పూజ చేసి, తదుపరి పసుపుతో గౌరీదేవిని చేసి ఆ దేవతను పూజించాలి.
గౌరీపూజ:
మాతాపితాత్వాం – గురుసద్గతి శ్రీ
త్వమేవ సంజీవన హేతుభూతా
ఆవిర్భావాన్ మనోవేగాట్ శీఘ్ర మాగాచ్చ మే పురః
యావచ్చుభైక హేతుభ్యాట్ మమగౌరి వరప్రదే!
గౌరిదేవతను పసుపుకుంకుమలతో పై శ్లోకముచే పూజించవలెను.
సంతోషిమాత పూజ:
ధ్యానం:
శ్లో: జయతు జయతు జననీ జన్మ సాఫల్య దాయిని
జయతు జయతు మాటా సామృత చశాకయుక్త
జయతు జయతు దేవి సంతత తానంద దాత్రీ
జయతు జయతు శక్తే సంతోష దేవి పరాద్యా.
శ్రీ సంతోషిమాతాయై నమః ధ్యానం సమర్పయామి.
ఆవాహనం:
శ్లో: సంతోషిని మహాదేవి సంతతానంద కారిణి
ఆవాహయామి త్వాం దేవి కశ్లోపరి శోభనే.
శ్రీ సంతోషిమాతాయై నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి.
ఆసనం:
శ్లో: నవరత్న సమాయుక్తం సవ్యం హేమ సుఖాసనం
కల్పితం త్వంతదర్దేన స్తిరాభవ సదా ముదా.
శ్రీ సంతోషిమాతాయై నమః దివ్య రత్న సింహాసనం సమర్పయామి.
పాద్యం:
శ్లో: పాద్యం గృహాణ దేవేశి పవిత్రం పంకమోచకం
భక్త్యా సమర్పితం మయా భగవతీ త్వం స్వీ కురుష్వ.
శ్రీ సంతోషిమాతాయై నమః పాద్యం సమర్పయామి.
అర్ఘ్యం:
శ్లో: దేవేశి భక్త సులభే సర్వారిష్ట నివారిణి
సమస్త పాపసంహర్తి గ్రుహారార్ఘ్యం శుభప్రదే.
శ్రీ సంతోషిమాతాయై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.
ఆచమనీయం;
శ్లో: కఫశ్లేష్మాది వార్యం గల శుద్దికరం శుభం
అన్తఃశుద్ద్యర్ధం మప్యంబే ఆచమనీయం వినిర్మితం.
శ్రీ సంతోషిమాతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.
పంచామృతం:
శ్లో: పయోడది ఘ్రుతోపెతం, శర్కరామదు సంయుతం
పంచామృత స్నానమిదం, గృహాణ కమలాలయే.
శ్రీ సంతోషిమాతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి.
స్నానం:
శ్లో: గంగాజల సమానీతం మహాదేవ శిరస్తం
శుద్దోదక మిదం స్నానం గృహాణ జగదీశ్వరి.
శ్రీ సంతోషిమాతాయై నమః శుద్దోదక స్నానం సమర్పయామి.
వస్త్రయుగ్మం:
శ్లో: సురార్చితాంఘ్రి యుగాలేడుకూల పనసప్రియే,
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురవండితే.
శ్రీ సంతోషిమాతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
ఆభరణం:
శ్లో: కేయూర కంకణం దేవీ హరమాపుర మేఖలా
విభూషణా న్యామాల్యాని గృహాణ పరవర్ణిని .
శ్రీ సంతోషిమాతాయై నమః సువర్ణాభరణాని సమర్పయామి.
మాంగళ్యం:
శ్లో: తప్తహెమక్రుతమ్ దివ్యం మాంగళ్యం మంగళప్రదం
మయా సమర్పితం దేవీ గృహాణత్వం శుభప్రదే.
శ్రీ సంతోషిమాతాయై నమః మాంగళ్యం సమర్పయామి.
గంధం:
శ్లో: శ్రీ గంధం చందనోన్మిశ్రమం కుంకుమాగరు సంయుతం
కర్పూరలేఖ సంయుతం, మయా భక్త్యా విలేపితం.
శ్రీ సంతోషిమాతాయై నమః గంధం సమర్పయామి.
అక్షతలు:
శ్లో: అక్షతాన్ దవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్
హరిద్రా కుకుమోపేతాన్ స్వీ కురుష్వ మహేశ్వరి.
శ్రీ సంతోషిమాతాయై నమః అక్షతాన్ సమర్పయామి.
అధాంగ పూజ:
ఓం శ్రీ సంతోశిరూపాయై నమః – పాదౌ పూజయామి
ఓం మహానందాయై నమః – జానునీ పూజయామి
ఓం మహాదేవ్యై నమః – ఊరూం పూజయామి
ఓం సింహ మద్యాయై నమః – కటిం పూజయామి
ఓం ప్రీతి వర్దిన్యై నమః – నాభిం పూజయామి
ఓం మోహన రూపాయి నమః – స్తనౌ పూజయామి
ఓం లలితాన్గ్యై నమః – భుజద్వాయం పూజయామి
ఓం కంబు కంటాయై నమః – కంటం పూజయామి
ఓం శక్తి ప్రియాయై నమః – ముఖం పూజయామి
ఓం భక్తి ప్రియాయై నమః – ఓష్టౌ పూజయామి
ఓం సుశీలాయై నమః – నాసికాం పూజయామి
ఓం సర్వమంగాలాయై నమః – శిరః పూజయామి
ఓం సంతోష్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి.
శ్రీ సంతోషిమాతా అష్ట్తోత్తర శతనామావళి:
ఓం శ్రీ దేవ్యై నమః
ఓం శ్రీ పదారాధ్యాయై నమః
ఓం శివ మంగళ రూపిణ్యై నమః
ఓం శికర్యై నమః
ఓం శివ రాధ్యాయై నమః
ఓం శివ జ్ఞాన ప్రదాయిన్యై నమః
ఓం ఆది లక్ష్మ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం భ్రుగువాసర పూజితాయై నమః
ఓం మధు రాహార సంతుష్టాయై నమః
ఓం మాలా హస్తాయై నమః
ఓం సువేషిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కమలాంత స్థాయై నమః
ఓం కామర రూపాయై నమః
ఓం కుళేశ్వర్యై నమః
ఓం తరుణ్యై నమః
ఓం తాపసారాధ్యాయై నమః
ఓం తరుణార్క నిభాననాయై నమః
ఓం తలోదర్యై నమః
ఓం తటిద్దే హాయై నమః
ఓం తప్త కాంచన సన్నిభాయై నమః
ఓం నళినీ దళ హస్తాడ్యా యై నమః
ఓం నయ రూపాయై నమః
ఓం నర ప్రియాయై నమః
ఓం నర నారాయణప్రీతాయై నమః
ఓం నందిన్యై నమః
ఓం నటన ప్రియాయై నమః
ఓం నాట్య ప్రియాయై నమః
ఓం నాట్య రూపాయై నమః
ఓం నామపారాయణ ప్రియాయై నమః
ఓం పరమాయై నమః
ఓం పర మార్ధైక దాయిన్యై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం ప్రాణరూపాయై నమః
ఓం ప్రాణదాత్ర్యై నమః
ఓం పారాశర్యాది వంది తాయై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహా పూజ్యాయై నమః
ఓం మహా భక్తసు పూజితాయై నమః
ఓం మహామహాది సంపూజ్యాయై నమః
ఓం మహా ప్రాభవ శాలిన్యై నమః
ఓం మహితాయై నమః
ఓం మహిమాంతస్థా యై నమః
ఓం మహా సామ్రాజ్యదాయిన్యై నమః
ఓం మహా మాయాయై నమః
ఓం మహా సత్వా యై నమః
ఓం మహాపాతక నాశిన్యై నమః
ఓం రాజ పూజ్యా యై నమః
ఓం రమణా యై నమః
ఓం రమణలం పటాయై నమః
ఓం లోక ప్రియంకర్యై నమః
ఓం లోలా యై నమః
ఓం లక్ష్మివాణీ సంపూజితాయై నమః
ఓం లలితాయై నమః
ఓం లాభదాయై నమః
ఓం లకారార్దా యై నమః
ఓం లసత్పిరుయాయై నమః
ఓం వరదాయై నమః
ఓం వర రూపాడ్యా యై నమః
ఓం వర్షణ్యై నమః
ఓం వర్ష రూపిణ్యై నమః
ఓం ఆనంద రూపిణ్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సంత తానందదాయిన్యై నమః
ఓం సర్వక్షే మంకర్యై నమః
ఓం శుభాయై నమః
ఓం సంతత ప్రియవాదిన్యై నమః
ఓం సంత తానంద ప్రదాత్యై నమః
ఓం సచ్చిదానంద విద్రహాయై నమః
ఓం సర్వభక్త మనోహర్యై నమః
ఓం సర్వకామ ఫలప్రదాయై నమః
ఓం భుక్తి ముక్తి ప్రదాయై నమః
ఓం సాద్వ్యై నమః
ఓం అష్ట లక్ష్మ్యై నమః
ఓం శుభంకర్యై నమః
ఓం గురుప్రియాయై నమః
ఓం గుణానంద యై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం గుణతోషిణ్యై నమః
ఓం గుడాన్న ప్రీతిసంతుష్టా యై నమః
ఓం మధురాహార భక్షిణ్యై నమః
ఓం చంద్రాననాయై నమః
ఓం చిత్స్వరూపాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హాటకాభ రణోజ్వలాయై నమః
ఓం హరి ప్రియాయై నమః
ఓం హరారాధ్యా యై నమః
ఓం హర్షణ్యై నమః
ఓం హరితోషిన్యై నమః
ఓం హరి బృంద సమారాధ్యా యై నమః
ఓం హార నీహార శోభి తాయై నమః
ఓం సమస్త జన సంతుష్టాయై నమః
ఓం సర్వోపద్రవ నాశిన్యై నమః
ఓం సమస్త జగ దాధారాయై నమః
ఓం సర్వ లోకైక వందితాయై నమః
ఓం సుధాపాత్రసు సంయుక్తాయై నమః
ఓం సర్వానర్ధ నివారణ్యై నమః
ఓం సత్య రూపాయై నమః
ఓం సత్యరతా యై నమః
ఓం సత్యపాలన తత్పరాయై నమః
ఓం సర్వాభ రణ భూషాడ్యా యై నమః
ఓం సంతోషిన్యై నమః
ఓం శ్రీ పరదేవ తాయై నమః
ఓం సంతోషీ మహాదేవ్యై నమః
శ్రీ సంతోషిమాతాయై నమః అష్ట్తోత్తర శతనామావళి సమాప్తం.
ధూపం:
శ్లో: దశాంగులం గగ్గులోపెతం సుగంధంచ సుమనోహరం
ఘూపం దాస్యామి తెదేవి గృహాణ సుగంధ ప్రియే.
శ్రీ సంతోషిమాతాయై నమః దూపమాఘ్రాపయామి
దీపం:
శ్లో: సప్త వింశ ద్వర్తియుక్తం గవ్యాజ్యేన సంయుతం,
దీపం ప్రజ్జ్వలితం దేవి గృహాణ ముదితా భవ.
శ్రీ సంతోషిమాతాయై నమః దీపం దర్శయామి.
నైవేద్యం:
శ్లో: నైవేద్యం మధురాహారం గుడశర్కర సంయుతం
చనకైశ్చ సమాయుక్తం స్వీకురుష్వ మహేశ్వరీ.
శ్రీ సంతోషిమాతాయై నమః నైవేద్యం సమర్పయామి.
తాంబూలం:
శ్లో: ఫూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళ్యైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం
శ్రీ సంతోషిమాతాయై నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం:
శ్లో: నీరాజన సమాయుక్తం కర్పూరేన సమన్వితం,
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యాతాం హరివల్లభే.
శ్రీ సంతోషిమాతాయై నమః కర్పూర నీరాజనం సమర్పయామి.
మంత్రపుష్పం:
శ్లో: పద్మాలయే పద్మకరే పద్మమాలా విభూషితే,
సర్వానందమాయే దేవీ సుప్రీతభవ సర్వదా.
శ్రీ సంతోషిమాతాయై నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.
ప్రదక్షిణం:
శ్లో: పద్మహస్తా వరదపాణి సర్వ్ శ్రీ సర్వమంగాలా
సుదాపాత్రాభి సంయుక్తా రక్ష రక్ష మహేశ్వరీ.
శ్రీ సంతోషిమాతాయై నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
అధః శ్రీ సంతోషిమాతా షోడశోపచార పూజా సమాప్తం.
శ్రీ సంతోషిమాతా వ్రత కథ:
imagesimages
పూర్వము చంపక దేశంలో శోభానగారమనే పెద్ద పట్టణములో ఒక వృద్ద స్త్రీ నివసించేది. ఆమెకు ఏడుగురు కొడుకులు. ఆ ఎడుగురులోను ఆరుగురు ఏదో చక్కటి పనులలోను, ఉద్యోగాలలోనూ కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తున్నారు. ఎదవా వాడిన శ్రీకరుడు ఏ పనీ చేయకుండా సోమరిపోతై , సంపాదన లేకుండా తిరగసాగాడు. అందువలన అతనిని ఎవరు గౌరవించేవారు కాదు. చివరకు కన్నా తల్లి కూడా అతనిని హీనంగా చూసేది.
సంపాదించే కొడుకులకు షడ్రసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి, ఎంగిలి పదార్ధాలను శ్రికరుడికి పెట్టేది. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్ది కూడె ఆహారంగా బ్రతుకుతున్నాడు. క్రమముగా అన్నదమ్ములు ఏడుగురికి పెళ్ళిళ్ళు జరిగాయి. పెద్దవాళ్ళు ఆరుగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు. సంపాదన లేనివాడూ, సోమరి అయిన శ్రికరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ, ఆ కూతినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు.
ఆ ముదుసలి చూపిస్తున్న పక్షపాతమంతా శ్రికరుడి భార్యయైన కల్యాణి గమనిస్తుంది. ఒకరోజున శ్రికరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి ఆమె తనకు పెట్టీ ఆహారము గురించి గొప్పలు చెప్పసాగాడు. అది విని కల్యాణి ఉండబట్టలేక “ఓ స్వామి! మీ తల్లి గారు మీకు ఎటువంటి ఆహారము పెడుతున్నారో తెలియక, ఇలా మాట్లాడుతున్నారు. చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది. అని చెప్పింది.
“సరే! చూస్తాను! నువ్వు చెప్పినమాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు” అని భార్యను హెచ్చరించి, శ్రీ కారుడు తతల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్ట సాగాడు. ఒక రోజున పెద్దకొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ ముసలి వారందరికి మదురమైన మిటాయిలూ వగైరా పిండి పదార్ధాలు చేసి పెట్టింది. శ్రికరుడిని పిలువలేదు. శ్రికరుడు చాటుగా అంటా కనిపెడుతున్నాడు. పెద్ద కొడుకులూ కోడళ్ళూ మొత్తం పన్నెండుగురూ భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తళ్ళల్లో పారేసిన పదార్ధాలు ఏరి వేరే విస్తళ్ళ లో పెట్టింది. పిదప ఏమి తెలియని దానిలాగా శ్రిక్రుడి దగ్గరకు వెళ్లి “నాయనా! నీ అన్నయ్యలు వదినలూ భోజనం చేశారు. ఇక నువ్వు, మీ యావిడ మాత్రమె మిగిలారు వచ్చి తినండి అంటూ పిలిచింది. శ్రీ కారుడు విస్తరిదగ్గరకు వెళ్లి అందులోని పదార్ధాలు అన్నీ తన అన్నలూ వదినలూ తిని వదిలివేసినవే అని ఎంగిలి వస్తువులేఅని గుర్తిస్తాడు. అందుకు ఆటను ఏంటో బాధపడ్డాడు. తనకూ తన భార్యకూ ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రికరుడు తన భార్య దగ్గర చాలా భాద పడ్డాడు. కల్యాణి అతనిని ఓదార్చింది.
“ఓ ప్రానేశ్వరా! ధనమూలం ఇదం జగత్, డబ్బులు లేక పోతే అందరు ఇలా చూస్తారు. అన్నింటికీ మూలం ధనం, ఇదే మీరు సంపాదనా పరులైతే మన పరిస్థితి మరోలా వుండేది. అని హితవు చెప్పింది”. భార్య మాటలు శ్రీ కరుడికి నచ్చినవి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు. మరునాడు ఉదయము తల్లి దగ్గరకు వెళ్లి “అమ్మా! డబ్బు సంపాదించడము కోసం పరాయి దేశాలకు వెళ్లాలని ఉంది” అన్నాడు. “చాలా మంచిది నాయనా వెంటనే వెళ్ళిపో అంది.” శ్రికరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు. అప్పుడామే పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతోంది. “నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో” అని చెప్పి తన చేతినున్న ఉంగరము ఆమె చేతికిచ్చి “నా గుర్తుగా ఇది నీదగ్గర ఉంచు అని చెప్పి, మరి నీ గుర్తుగా ఏమైనా ఈయవా! అనిఅదిగినాడు. అందుకు కల్యాణి ఓ ప్రాణ నాదా! మీకు ఇచ్చేందుకు నాదగ్గర ఏమి లేదు. అయినాను ప్రేమగా అడిగారు గనుక కోపగించుకోకండి అంటూ పెదకలుపుతూ తన చేతిని అతని వస్త్రముపై గుర్తుగా వేసింది. అతడు అది పెడగా కాక ఆమె ప్రేమ గా అర్ధం చేసుడున్నాడు. సంతోషముగా పరదేశాములకు ప్రయాణమైనాడు.
కొన్నాళ్ళకతడు పరాయి దేశము చేరి, అందొక పట్టణమునకు వెళ్లి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా వుద్యోగమిప్పించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆవ్యాపారి మనసు కరిగి “జాగ్రత్తగా ఉండవలెను సుమా” అని హెచ్చరించి, శ్రీకరునకు తనవద్ద ఉద్యోగము ఇచ్చెను. శ్రికరుడు ఉద్యోగములో చేరి ఎంతయో నమ్మకముగా పనిచేయసాగెను. అతని పనితనమునకు, విశ్వాసపాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరునకు తన వ్యాపారములో కొంచెము వాటాకూడా ఇచ్చెను. శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారమును వృద్ది చేసెను. అట్లు పంనేడు సంవత్సరములు గడచిపోయినవి. వ్యాపారి ముసలి వాడి పోయెను. అందువలన తనవాటా ధనము మాత్రం తాను తీసుకొని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరునకే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకోసాగెను. శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యేను. అమితమైన ధనవంతుడై సుఖముగా కాలము గడపసాగెను.
ఇచ్చట అత్తవారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగెను. అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచుండెను. ఇంటి పనింతయు చేయించుకొని, కనీసము కొద్దిగా అన్నము కూడా పెట్టదాయెను . అందువలన కల్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి, అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారము గడుపుచుండెను. ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వచ్చునా? తన కష్టములు ఎప్పుడు తీరునా అని ఆమె ఎంతయో ఎదురు చూడసాగింది. ఇట్లుండగా ఒకనాడు కల్యాణి కట్టెలు కట్టుకొని, తలపై పెట్టుకొని వచ్చుచుండగా మద్యలో ఆమెకు దాహము వేసినది. చేరువ గ్రామము వచ్చు వరకు ఓపికతో నడిచినది. ఆ గ్రామము లోనికి రాగానే ఒకరి ఇంటికి వెళ్లి మంచినీళ్ళు అడగబోయినది. ఆ సమయముననే ఇంటివారు సంతోషిమాత వ్రతము చేసుకొనుచున్నారు. ఆ వ్రత మహిమ చూచుచు ఆమె దాహము మాటే మరచిపోయెను. ఆ పూజ మొత్తము పూర్తి అయిన తరువాత చివరలో కథను విని ప్రసాదము తీసుకున్నది. తనకు కూడా ఆ వ్రతము చేయవలెనని కోరిక కలిగినది. ఆ వ్రత విధానము అంతయు వారిని అడగి తెలుసుకున్నది.
అందుకా ఇల్లాలు కల్యాణిని చూసి “ఓ సౌభాగ్యవతీ! ఇది సంతోషిమాతా వ్రతము. దీనిని ప్రతి శుక్రవారము నాడును శ్రద్దాభక్తులతో చేయవలేయును. అల్ 40 శుక్రవారములు వ్రతము చేసి 41 శుక్రవారమునాడు వుద్యాపనము చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహమువలన కోరిన కోరికలన్నీ తీరి నిత్యసంతోషుగా జీవించగాలుగుతారు. ఈ వ్రతము చేసే వారు శుక్రవారమునాడు పులుపు పదార్ధమును మాత్రం తినరాదు”. అంటూ నియమాలను, వుద్యాపనా విధానమును తెలిపినది.
కల్యాణి ఆవిషయములన్నింటిని పూర్తిగా అర్ధము చేసుకొని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరినది. మార్గ మధ్యలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టేలమోపును కొనుక్కొని, ఆమెకు కొంత ధనము అందించింది. అది చూసిన కల్యాణి ఎంతో సంతోషముతో అదేరోజు సంతోషిమాత పూజ జరుపుకొన నిర్ణయించుకొని ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకొని బయలుదేరినది. మార్గ మధ్యలో ఆమెకు ఒక దేవాలయము కనిపించినది. అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయము ఏ దైవానిది అని అడుగగా, అక్కడివారు అది సంతోషిమాత దేవాలయము అని బడులిచ్చిరి. వెంటనే కల్యాణి అమితమైన సంతోషముతో ఆ గుడిలోనికి వెళ్లి అమ్మవారిని దర్శనము చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్ధించి తాను తెచ్చిన పదార్ధములన్నియు అమ్మవారికి నివేదన గావించి, ప్రసాదము తీసుకొని ఇంటికి వెళ్ళినది.
అది మొదలు ఆమె ఎంతో నియమముగా ప్రతి శుక్రవారమునాడు సంతోషిమాతను పూజించుచూ వ్రత నియమములను తూచా తప్పకుండ పాటిస్తూ కాలము గడపసాగినది. ఇలా కొన్ని రోజులు గడుపగా ఒక శుక్ర వారము రాత్రి సంతోషిమాత కళ్యాణికి కలలో కనిపించి “అమ్మాయి! ఇదిగో నీభర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది”. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితము తన పక్కలో పడియున్నది. ఆ అమ్మవారి దయకు, మహాత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామా లో వున్న విధముగానే తన భర్తకు చిరునామా వ్రాసింది.
అట్లు కల్యాణి ఉత్తరము వ్రాసిన అనతికాలములోనే శ్రీకరుని వద్దనుండి ఆమెకు కొంచెము ధనము ఉత్తరము వచ్చినది. భర్త నుండి ఉత్తరము వచ్చుట తోడనే తన కష్టములు తీరినవని కల్యాణి ఎంతగానో ఆనందించినది. ఇది ఇట్లుండగా తన కోడలగు కళ్యాణికి ఎక్కడనుదియో డబ్బులు, ఉత్తరములు వచ్చుచున్న సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయమును తన పెద్ద కోడళ్ళ తో కూడబలుకుకొని అవి ఎచ్చాతనుంది వచ్చుచున్నవో ఆరా తీయమని పిల్లలను పంపినారు. పిల్లలు కల్యాణి వద్దకు వెళ్లి “పిన్నీ! నీకు ఉత్తరాలు, డబ్బులు ఎక్కడనుండి వస్తున్నాయి”? అని అడుగగా, కల్యాణి మీ పినతండ్రి గారి నుండియే వస్తున్నాయి” అని నిజముచేప్పినది. అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్ద కు వెళ్లి కల్యాణి చెప్పిన సంగతి చెప్పారు.
పిల్ల అల్లరి అనందం చూశాక తమకు గూడా బిద్దలుంటే బాగుండునని అనుకుంది. ఒకనాడు గుడికి వెళ్లి అమ్మవారి దర్శనము చేసుకుని “నన్ను కటిక దరిద్రమునుంది తప్పించావు. నీ దయవల్ల సుఖముగానే వున్నాను. కాని స్త్రీకి మాత్రుత్వమే కదా ప్రధానమైనది. కాని నాకు పిల్లలు లేరు. కావున తల్లేఎ, నన్ను నాభర్త చెంతకు చేర్చు, మా కాపురం నిలబెట్టు, నాకు కడుపు పండేలా చేయి తల్లీ! అని మరీ మరీ ప్రార్ధించింది. ఆ భాక్తులాలి ధర్మ బద్దమైన కోరికను నెరవేర్చేందుకు సంతిశిమాట ఒకనాటి రాత్రి శ్రీకరునకు బ్రామ్హన ముత్తైదువ రూపములో కలలో కనిపించి “శ్రీకరుడా! నీవు వివాహితుడవు, నీకు యోగ్యురాలగు భార్యను నీ స్వగ్రామమునందు విడచివచ్చినావనియు మరచిపోయినావు. ధన సంపాదన ఒక్కటే జీవితముగా కాలము గడుపుచున్టివి. ఇట్లయినచో పెండ్లి ఎలా చేసుకొంటివి? నీ చెంతనే వుండవలేయునని, చిలకా గోరింక వలె కాపురం చేసుకోవలెనని ఆ పిల్లకు మాత్రము కోరికవుందడా? కావున నీవు వెంటనే నీ స్వగ్రామమునకు ప్రయాణము కమ్ము. ఆమెనుకూడి సుఖముగా సంసారము చేసుకొనుము. నీను చెప్పినట్లు చేయక నామాటను త్రునీకరించిన నా ఆగ్రహమునకు గురి అయ్యేడవు సుమా” అని హెచ్చరించింది.
దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిడురలేవగానే కలలో కనిపించినదేవరో దేవతాయని భావించి, చేతులు జోడించి అమ్మవారిని ప్రార్ధించి “తల్లీ అన్నీ తెలిసిన అమ్మవు. నా కష్టములు మాత్రము ఎరుగవా తల్లీ! ఈ వ్యాపారములో ఏర్పడిన ఇబ్బండులవలన ఇంతకాలము కాలు కడుపలేకపోతున్నాను. నా మీద దయవుంచి నా చిక్కులు యెంత త్వరగా తోఅల్గిస్తే అంట త్వరగా నేను నా గ్రామమునకు బయలుదేరుతారు. భారము నీదే అమ్మా! అని మ్రోక్కుకున్నాడు. అతని మొర విన్న ఆ తల్లి అతనిని కరునిచింది. ఆమె అనుగ్రహమువలన వ్యాపారములో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయాయి. రావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది. ఆ ధనమంతా మూటకట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమైనాడు.
ఇక్క శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలో కనిపించి “అమ్మాయి! నీభర్త నీకోసం బయలుదేరాడు. సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగములుగా చేసి. ఒకటి నదీ తీరమున, మరొకటి నా గుడిలో పెట్టు, మూడవది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ యింటి వద్దకు రాగానే అతనికి వినబదేతట్లు మీ అత్తగారితో, “ఓ అత్తా! నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగావుంది, నా చిప్పనీల్లు నాకు పొయ్యి, త్వరగా వచ్చి మోపు దింపుకో మెడ నొప్పిగా ఉంది, అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైనారు.
శ్రీ కరుడు నదీతీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కల్యాణి వదిలి వెళ్ళిన కట్టెలమోపు కనబడింది. శ్రీకరుడు ఆ కట్టెలను మంటవేసి చలిపోగోట్టుకున్నాడు. అక్కడ నుండి తన పట్టణమునకు బయలుదేరినాడు. మార్గ మధ్యలో అతడికి ఆకలి వేసింది. చేరువలో సంతోషిమాత గుడి కనిపించింది. అక్కడ కల్యాణి వదిలి వెళ్ళిన రెండవ కట్టెలమోపు కనిపించింది. శ్రీ కరుడు సంతోషించి ఆ కట్టెలతో వంటచేసి భోజనము చేశాడు. కొంత సేపు విశ్రాంతి తీసుకొని యిటికి బయలుదేరాడు.
శ్రీ కరుడు గుమ్మమువద్దకు వచ్చేసరికి కల్యాణి కట్టేలమోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కీకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి బాధపడ్డాడు. ఆమెమాతలను బట్టి తన తల్లీ, అన్నలూ, వదినలూ కలిసి ఆమెను యెంత కష్టపెడుతున్నారో అర్ధం చేసుకున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి, ఆమెను ఓదార్చాడు. కల్యాణిని బాధలు పెట్టిన ఆ యింట్లో ఉండటము ఇష్టములేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కల్యాణి అతనూ అందులో కాపురం పెట్టినారు. ప్రతి శుకరవారమునాడు సంతోషిమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందముగా జీవించసాగారు. అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయము వచ్చినది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయ్యాలనుకుంది కల్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగైని, ఆరుగురు తోదికోదల్లను కూడా వుద్యాపనకు రమ్మనమని పిలిచింది.
అయితే తోడి కోడళ్ళకి, అత్తగారికి మాత్రం కల్యాణి మీద కోపం పోలేదు. ఎలాగో అలాగా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్ధాలను వండిన వంటలో కలిపినారు. అంతటితో కల్యాణికి వ్రతం భంగామయింది. వ్రత నియమాలము విరుద్దంగా ఆ యింత పులుపు తిన్నందువల్ల సంతోషి మాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరున్ని బంధించి తీసుకవేల్లారు. కల్యాణి సంతోషిమాత పాదాలపై బడి విలపించింది. తన భర్తను రక్షించమని ప్రార్ధించింది. పరమ కరుణామయి అయిన ఆ తల్లి కల్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధవిముక్తుడై యింటికి చేరాడు. తిరిగి ఆదంపతులు ఆనందముగా కాపురం చేసుకోసాగారు.
ఒక సారి కల్యాణిని ఆ అమ్మవారు అరీక్షించ దలచి పిచ్చి బిచ్చగత్తెవలె మారు వేషం ధరించి, ఓ చేత్తో బెల్లమూ ఓ చేత్తో శనగలు తింటూ, నోటివెంట చొంగ కార్చుకుంటూ రాసాగింది. ఆమె నోటిపైన, చేతులపైన ఈగలు ముసురుతూ వున్నాయి. వికృతరూపంలో ఆమె కల్యాణి వున్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి “తాక్షసి”, దెయ్యం అని కేకలువేస్తూ రాళ్ళు రువ్వసాగారు. పిల్లలామే మీదకు విసిరినా రాళ్ళన్నీ వెళ్లి కల్యాణి వాళ్ళ బావాలకు, తోడి కోడళ్ళకు తగలసాగాయి. దాంతో వాళ్ళు కంగారుపడి “అమ్మో! ఇదెవరో మాయలమారిది” లేకుంటే దానిమీదకు విసిరినా రాళ్ళు మనమీద ఎందుకు పడతాయి? మనకెందుకు దెబ్బలు తగులుతాయి? అని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసివేసారు.
అది గమనించిన సంతోషిమాత ఆ ద్వారలకేసి ఒక్క సారి చూసింది. ఒక్క సారిగా ప్రలయమారుతంలా వచ్చిన గాలితో ఇంటి తలుపులు భళ్ళున తెరచుకున్నాయి. ఇంటిమీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లోవాళ్ళు ఆ గాలి విసురికి సరిగా నిలబడలేక అటూ ఇటూ తూలిపదిపోయారు. ఈ దృశ్యం అంటా చూసిన కల్యాణి వెంటనే అక్కడ బిచ్చాగాట్టే రూపంలో వున్న ఆవిడను పరీక్షగా చూసినది. ఆమె సంతోశిమాతయే అని అనిపించింది. వెంటనే కల్యాణి ఆమె కాళ్ళపై బడి “జగన్మాతా! నువ్వు నా ఆరాధ్య దైవమయిన సంతోషిమాతవే. అమాయకులైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లీ! అంటూ సవినయముగా ప్రార్దిన్చాదముతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యం అయినది.
ఇంట జరిగినా కూడా కల్యాణి తోదికోదల్లకు అమ్మవారిమీద నమ్మకము కలగలేదు. ఎలాగో అలా శ్రీకరుడిని, కల్యాణిని సర్వ నాశనము చేయాలనే ఆనోచన మానుకోలేకపోయారు. చివరకు ఓ రోజున పాలల్లో విషము కలిపి కళ్యాణికి యిచ్చారు. అమాయకురాలైన కల్యాణి తోడికోడళ్ళు ఇచ్చిన పాలను త్రాగుదాం అనిఅనుకుంది. అంతలో అమ్మవారి దయవలన శ్రీకరుడు కల్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడే వుంచి భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయములో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్నకొడుకు ఆకలిగా ఉంది అక్కడవున్న పాలన్నీ గబగబా తాగేశాడు. త్రాగిన వెంటనే ఆ పిల్లవాడు గావుకేకలు పెడుతూ వెంటనే నేలపై బడి చనిపోయాడు. కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడకు వచ్చింది. “కల్యానే పాలల్లో విషము కలిపి తన కొడుకుకు ఇచ్చి చంపివేసింది అంటూ ఊరూ వాడా వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ కల్యాణి శ్రీకరునిని నానా మాటలు అనసాగారు.
అనుకోకుండా మీదపడిన ఈ హత్యానేరానికి అపనిండకి ఆ దంపతులు ఎంతగానో పరితంపించారు. అయినా సరే, “అన్నింటికీ ఆ తల్లే ఉంది” అన్న ధైర్యముతో మనసారా ఆ తల్లినే స్మరించాసాగారు. భక్తులను రక్షించాదములో ఆ అమ్మవారిని మించినవారు లేరుకదా! తన భక్తులు కంటతడి పెడితే ఆతల్లి భరించాడు. అమ్మవారు వెంటనే విశాపాలను తాగిన పిల్లవానిని బ్రతికించారు. ఆ కుర్రవాడు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నాడు. అంటా కలిసి కల్యాణిని, శ్రీకరుడిని తిద్దదము విన్న ఆ పిల్లవాడు “అమ్మా! పిన్నినీ, బాబాయిని తిట్టకండి, ఆకలిగా ఉంది ఆ పాలను నేనే స్వయముగా త్రాగాను. అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. దానితో కల్యాణి శ్రీకరులు నిర్దోషులని తేలిపోయింది. అయితే కల్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు.
దానితో విషం కలిపినా తోటికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కల్యాణి కాళ్ళమీదపడి క్షమాపణ కోరుకుంది. అప్పుడు కల్యాణి తన తోడికోడలును క్షమించినది. “నేను క్షమించినంత మాత్రం చేత ఏంలాభం, అంటా అమ్మవారి చలవే, వెళ్లి ఆ సంతోషిమాతను క్షమాపణ వేడుకొంది” అని చెప్పింది. అందరు కలిసి ఆ తల్లిని ప్రార్ధించారు.
ఆనాటినుండి అందరూ కలిసిమెలిసి వుంటూ వచారు. ఓ శుక్రవారమునాడు ఏడుగురు కోడళ్ళూ కలిసి సంతోషిమాతా వ్రతం చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం వలన కల్యాణి గర్భవతి అయింది. చక్కటి ముహూర్తములో కుమారున్ని కన్నది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషిమాతా పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు, కల్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తులతూగారు.
ఈ కథ విన్నవారికి, చదివినవారికి కూడా ఆ సంతోషిమాత అనుగ్రహం వాళ్ళ సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు.

18, మార్చి 2014, మంగళవారం

కాల సర్ప దోషం/ యోగం


 జాతకుని జన్మ కుండలి లో రాహు కేతువుల మద్య మిగిలిన అన్ని గ్రహాలు వచ్చిన చొ దానిని కాల సర్ప యోగం అని అంటారు. దీనిలో చాల రకాలు వున్నాయి. వాటి వాటి స్తితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయం చెయ్యటం జరుగుతుంది దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే ఫలితం కూడా నిర్ణయం చెయ్య బడుతుంది.
కాలసర్ప దోషం: రాహువు-రవి ,చంద్ర ,కుజ ,బుధ ,గురు ,శుక్ర, శని- కేతువు.
Parakrijaya

ఫలితాలు: కుటుంభ సమస్యలు, దీర్గ రోగాలు.
అపసవ్య కాలసర్ప దోషం: కేతువు - రాహువు మద్య మిగలిన ఏడు గ్రహాలూ రావటం.
గుళిక కాల సర్ప దోషం: మాములుగా ఇది జాతక చక్రం లో మొదటి ఇంట ప్రారంభం అయ్యి తొమ్మిదొవ ఇంట సంమప్తం అవుతుంది.
ఫలితాలు:ఆర్ధిక మరియు కుటుంభ ఇబ్బందులు.
వాసుకి  కాల  సర్ప  దోషం: రెండోవ ఇంట మొదలయి పడవ ఇంట సమాప్తం.
ఫలితాలు:అన్నదమ్ముల కలహాలు, సమస్యలు.
సంకాపాల కాలసర్ప దోషం: మూడోవ ఇంట మొదలయి ప్దకొందవైంట సమాప్తం.
ఫలితాలు:తల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గన్డం, నివాస స్తల సమస్యలు.
పద్మ కాలసర్ప దోషం: నాలుగోవ ఇంట ప్రారంభమయి పన్నెండోవ ఇంట సంమాప్త.
ఫలితాలు: జీవిత భాగస్వామి తో కాని పిల్లలతో కాని సమస్యలు.
మహా పద్మ కాలసర్ప దోషం: అయిదోవ ఇంట ప్రారంభం అయ్యి ఒకటవ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆరోగ్య సమస్య, అప్పుల బాధ, శత్రు బాధ.
తక్షక కాలసర్ప దోషం: ఆరవ ఇంట  ప్రారంభం రెండోవ ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార నష్టాలు, వివాహ జీవతం లో ఇబ్బందులు.
కర్కోటక కాలసర్ప దోషం: యేడవ  ఇంట  ప్రారంభం మూడో వ ఇంట సమాప్తం.
ఫలితాలు: బార్య తో ఇబ్బందులు , అనుకోని సంఘటనలు.
శంఖచూడ కాలసర్ప దోషం: ఎనిమిదొవ  ఇంట  ప్రారంభం నాలుగో వ ఇంట సమాప్తం.
ఫలితాలు: తండ్రి వాళ్ళ ఇబ్బందులు, అత్యంత దురదృష్ట  స్తితి.
ఘటక కాలసర్ప దోషం: తొమ్మిదొవ  ఇంట  ప్రారంభం అయిదోవ వ ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార మరియు ఉద్యోగ సమస్యలు.
విషాధార కాలసర్ప దోషం: పదవ ఇంట  ప్రారంభం ఆరోవ వ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆర్ధిక మరియు వ్యాపార కష్టాలు.
శేషనాగ కాలసర్ప దోషం: పదకొండవ  ఇంట  ప్రారంభం యేడవ  ఇంట సమాప్తం.
ఫలితాలు: ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు.
అపసవ్య కాలసర్ప దోషం: పన్నెండవ  ఇంట  ప్రారంభం ఎనిమిదొవ  ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆలస్య వివాహం.

దోష పరిహారం :
కాళహస్తి లో కాని వేరే ఇతర రాహు కేతువులకు ప్రాముఖ్యం వున్నా ప్రదేశాలలో కాల సర్ప దోష నివారణ పూజ లు చేయున్చికుంటే ఉపసమనం కలుగుతుంది

10, నవంబర్ 2013, ఆదివారం

శ్రీ ధన్వంతరీ యంత్రము(doctor's special)



ఈ యంత్రమును వైద్యులు తప్పక నిత్యము పూజించుచున్న తాము చేయు వృత్తి యందు మంచి నిష్ణాతులై పేరు ప్రఖ్యాతులను పొందగలరు. 
మీ పేరు , గోత్రము పోష్టల్ చిరునామా పంపుచు రూ. 6000/- మా SBI ACCOUNT కు జమచేసిన పంపగలము. 
:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
P.V.RADHAKRISHNA
CELL : +91 9966455872
Email : parakrijaya@gmail.com

31, అక్టోబర్ 2013, గురువారం

కుబేరయంత్రం



-: మూల  మంత్రం :-
ఓం యక్షాయ కుబేరాయ వ్యైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ   స్వాహాః ||
 -: వేరొక మూల  మంత్రం :-
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః ||
                                                                     - మంత్ర మహోదధి


 శ్రీ  కుబేర యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్న  సర్వ కార్య   విజయము ఐశ్వర్య ధన ధాన్య వృద్ధి మనో వాంఛా సిద్ధియు కూడా పొందగలరు.
                           
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.

                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.

-: శ్రీ కుబేర గాయత్రి :-
       యంత్రరాజాయ  విద్మహే మహాయంత్రాయ  ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//
      
:మరిన్నివివరములకుసంప్రదింపుడు:

See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872,

See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872, 9966680542

Like the face book page శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM

పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in/

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/,

సాధన ఆరాధన : http://sadhanaaradhana.blogspot.in/ ,

తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in/


జాతకం- ప్రశ్న- ముహూర్తం-వాస్తు-యంత్రం-రక్షాకవచాదులు-పొందగోరువారు సంప్రదించండి.

Contact Us :
Email:  parakrijaya@gmail.com  
Note: call me 6AM to 9AM & 6PM to 9PM GMT +5:30 ,INDIA

Consultation Timings :
      Everyday 06:00AM to 09:00 AM(With appointemnt )
     Everyday 05:30PM to 09:00PM (Without appointemnt)
Sunday (or)Any public & govt holidays we are available full day 06:00 AM To 8:00 PM (With appointemnt )

30, అక్టోబర్ 2013, బుధవారం

శ్రీ హయగ్రీవ మహా యంత్రం



-: మూల  మంత్రం :-
వాగీశ్వరాయ విద్మహే  హయగ్రీవాయ  ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//


 శ్రీ హయగ్రీవ మహా  యంత్రం ను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్నగొప్ప యశస్సు కలవాడు అగును. యంత్ర పూజ వలన సులభముగా  విద్యలను పొందవచ్చును.                      

:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
P.V.RADHAKRISHNA
CELL : +91 9966455872
Email : parakrijaya@gmail.com
       :మరిన్నివివరములకుసంప్రదింపుడు:
See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872,

See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872, 9966680542

Like the face book page శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM

పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in/

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/,

సాధన ఆరాధన : http://sadhanaaradhana.blogspot.in/ ,

తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in/


జాతకం- ప్రశ్న- ముహూర్తం-వాస్తు-యంత్రం-రక్షాకవచాదులు-పొందగోరువారు సంప్రదించండి.

Contact Us :
Email:  parakrijaya@gmail.com  
Note: call me 6AM to 9AM & 6PM to 9PM GMT +5:30 ,INDIA

Consultation Timings :
      Everyday 06:00AM to 09:00 AM(With appointemnt )
     Everyday 05:30PM to 09:00PM (Without appointemnt)
Sunday (or)Any public & govt holidays we are available full day 06:00 AM To 8:00 PM (With appointemnt )

29, అక్టోబర్ 2013, మంగళవారం

శ్రీ లక్ష్మీ నారాయణ యంత్రం



-: మూల  మంత్రం :-
లక్ష్మీనాధాయ   విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//


 శ్రీ లక్ష్మీ నారాయణ యంత్రం ను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్నగొప్ప యశస్సు కలవాడు అగును. యంత్ర పూజ వలన సులభముగా ఐశ్వర్యమును పొందవచ్చును.                      

:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
P.V.RADHAKRISHNA
CELL : +91 9966455872
Email : parakrijaya@gmail.com
       :మరిన్నివివరములకుసంప్రదింపుడు:
See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872,

See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872, 9966680542

Like the face book page శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM

పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in/

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/,

సాధన ఆరాధన : http://sadhanaaradhana.blogspot.in/ ,

తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in/


జాతకం- ప్రశ్న- ముహూర్తం-వాస్తు-యంత్రం-రక్షాకవచాదులు-పొందగోరువారు సంప్రదించండి.

Contact Us :
Email:  parakrijaya@gmail.com  
Note: call me 6AM to 9AM & 6PM to 9PM GMT +5:30 ,INDIA

Consultation Timings :
      Everyday 06:00AM to 09:00 AM(With appointemnt )
     Everyday 05:30PM to 09:00PM (Without appointemnt)
Sunday (or)Any public & govt holidays we are available full day 06:00 AM To 8:00 PM (With appointemnt )

20, అక్టోబర్ 2013, ఆదివారం

దక్షిణామూర్తి యంత్రం


   
-: మూల  మంత్రం :-
ఓం నమో   భగవతే దక్షిణా మూర్తయే మహ్యం మేథాం  ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా  ||



 శ్రీ దక్షిణామూర్తి  యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్నఐశ్వర్య వంతులు , మేథావి , విద్యా వంతుడు , గొప్ప యశస్సు కలవాడు అగును. యంత్ర పూజ వలన సులభముగా ఐశ్వర్య విద్యలను పొందవచ్చును.                      
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.
                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.

-: శ్రీ దక్షిణామూర్తి  గాయత్రి :-
     తత్పురుషాయ విద్మహే విద్యాభాసాయ ధీమహి తన్నో దక్షిణామూర్తిః ప్రచోధయాత్ ||

:మరిన్నివివరములకుసంప్రదింపుడు:

P.V.RADHAKRISHNA
CELL : +91 9966455872
Email : parakrijaya@gmail.com
       :మరిన్నివివరములకుసంప్రదింపుడు:
See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872,

See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872, 9966680542

Like the face book page శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM

పరాక్రి పదనిసలు : http://jayaparakri.blogspot.in/

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/,

సాధన ఆరాధన : http://sadhanaaradhana.blogspot.in/ ,

తెలుగు పండిత దర్శిని : http://teluguteachers-parakri.blogspot.in/


జాతకం- ప్రశ్న- ముహూర్తం-వాస్తు-యంత్రం-రక్షాకవచాదులు-పొందగోరువారు సంప్రదించండి.

Contact Us :
Email:  parakrijaya@gmail.com  
Note: call me 6AM to 9AM & 6PM to 9PM GMT +5:30 ,INDIA

Consultation Timings :
      Everyday 06:00AM to 09:00 AM(With appointemnt )
     Everyday 05:30PM to 09:00PM (Without appointemnt)
Sunday (or)Any public & govt holidays we are available full day 06:00 AM To 8:00 PM (With appointemnt )

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...