శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com
వాస్తు శాస్త్రము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వాస్తు శాస్త్రము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జూన్ 2016, ఆదివారం

ఉచ్చస్థానాలు - నీచస్థానాలు

ఉచ్చస్థానాలు - నీచస్థానాలు

ఖాళీస్థలం, గృహం రెండింటికీ ఉచ్ఛనీచ స్థానాలు ఉంటాయి. గేట్లు, ద్వారాలు కూడా అటు ఇంటికి, ఇటు కాంపౌండ్‌ వాల్స్‌కు ఉచ్ఛస్థానాలలో ఉండాలి. అలా ఉంటే నడక ఉచ్ఛస్థానంలో ఉంటుంది. ఇలా ఉచ్ఛస్థానంలో నడక సాగించడం వలన ఆ గృహంలో నివశించే వారికి ఎంతో మేలు జరుగుతుంది. నీచస్థానంలో ద్వారాలు, గేట్లు, నడక ఉండడం ఏ మాత్రం వాస్తు రీత్యా మంచిది కాదు. ఈ ఇంట నివశించే వారి జీవితాలలో మంచికన్నా కీడు అధికంగా ఉంటుంది. 
కనుక ముందుగా గృహంలో, స్థలంలో ఉచ్ఛ నీచాలు ఏమిటన్నది వివరంగా తెల్సుకుందాం. కాంపౌండ్‌వాల్‌ను కానీ, ఇంటి గోడల్ని కానీ మూడు భాగాలుగా చేయండి. ఈ వివరాలు మరింత వివరంగా తెల్సుకుందాం. 
తూర్పు గోడను తీసుకుందాం. మూడు భాగాలు చేద్దాం. ఉత్తరానికి దగ్గరగా తూర్పు ఈశాన్యాన్ని తాకుతూ ఉండే భాగం ఉచ్ఛస్థానం. అలానే దక్షిణానికి దగ్గరగా తూర్పు ఆగ్నేయాన్ని తాకుతూ ఉండే స్థానం నీచస్థానం. 
ఉత్తరపు గోడ విషయానికొస్తే... దీన్ని మూడు భాగాలుగా చేయండి. ఉత్తర ఈశాన్యాన్ని తాకుతూ తూర్పు దిశగా ఉండే భాగం ఉచ్ఛస్థానం. ఉత్తర వాయువ్యాన్ని తాకుతూ పడమర దిక్కున ఉండే స్థానం నీచస్థానం. 
పడమర గోడ విషయానికొస్తే... మూడు భాగాలతో పడమర వాయువ్యాన్ని తాకుతూ... ఉత్తరంలో ఉండే భాగం ఉచ్ఛస్థానం. అలానే దక్షిణాన్ని తాకుతూ పడమర నైఋతిలో ఉండే భాగం నీచస్థానం. 
దక్షిణం గోడను కూడా ఇలానే మూడు భాగాలు చేయండి. ఈ గోడలో... పడమర దిక్కుగా దక్షిణ నైఋతిని తాకుతూ ఉండే భాగం నీచస్థానం. అలానే తూర్పు దిశగా దక్షిణ ఆగ్నేయాన్ని తాకే భాగం ఉచ్ఛస్థానం. ఈ కారణంగానే.. కాంపౌండ్‌వాల్‌ గేట్లయినా.. ఇంటి గుమ్మాలయినా ఉచ్ఛస్థానాలలో ఉండేలా జాగ్రత్త వహించమంటుంది వాస్తుశాస్త్రం

వాస్తు శాస్త్రము

వీదిశూల విషయంలో విధిగా అప్రమత్తం

వీధిశూల అని వీధి పోటు అని పిలువబడే వీటి విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. స్థలం తీసుకునే తరుణంలోనే ఈ వీధిపోట్లును గుర్తించాలి. వీధి ఫలితాలు తెల్సుకుని స్థలాన్ని కొనడం చేయాలి. మన స్థలానికి ఎదురుగా వీధి ఉంటే దానిని వీధిపోటు అంటాము. ఏ వీధిపోటు ఎలాంటి ఫలితాలనిస్తుందో సవివరంగా తెల్సుకుందాం. 
తూర్పు ఈశాన్య వీధిపోటు : ఇక్కడి చిత్రాన్ని గమనిస్తే చాలు.... ఈ వీధిపోటు ఎలా ఉంటుందో మీరు సులభంగా అర్ధం చేసుకోగల్గుతారు. తూర్పు ఈశాన్య వీధిపోటు ఆ గృహంలో నివశించే పురుషులపై ప్రభావం చూపుతుంది. ఇంటా బయటా వీరిదే పైచేయి అన్నట్లుంటుంది వీరి పరిస్థితి. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మంచి గుర్తింపు, మన్నన వీరికి లభిస్తాయి. సమాజంలో మంచి గౌరవ ప్రతిష్ఠలు పొందగల్గుతారు. ఇది శుభప్రదమైన వీధిశూలే. ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలంలో గృహ నిర్మాణం ఆమోద యోగ్యమే. 
ఉత్తర ఈశాన్యం వీధిపోటు : ఉత్తర ఈశాన్యం వీధిపోటు... ఎంతో శుభప్రదం, లాభదాయకం, ఇంట సిరులు కురిపించే వీధిపోటు ఇది. ఈ ఇంట ధనమే కాదు, ఆరోగ్యం కూడా దండిగా ఉంటుంది. ఈ ఇంటో నివశించే దంపతులు ఎంతో అన్యోన్యంగా దాంపత్యాన్ని సాగిస్తారు. కుటుంబంలో సభ్యుల నడుమ మమతానురాగాలు పెనవేసుకుంటాయి. ఇంటా బయటా స్త్రీ పురుష బేధం లేకుండా ఈ ఇంట నివసించే వారికి మంచి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఇలా ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఉన్న స్థలం లభిస్తే... వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించి అయినా తక్షణం కొనేసుకోండి. 
ఉత్తర వాయువ్యం వీధిపోటు : ఈ వీధిపోటు శుభదాయకం కాదు. ముఖ్యంగా ఈ వీధిపోటు ఆ ఇంట నివశించే మహిళలపై ప్రభావం చూపుతుంది. మనశ్శాంతిగా ఉండలేరు. సంసారంలో సుఖ సౌఖ్యాలు కరువవుతాయి. ఆడపిల్లలకు చదువు అబ్బదు. వివాహాల సమయంలో కూడా ఎన్నోచిక్కులు ఎదురవుతాయి. ఇలాంటి స్థలాన్ని కానీ, ఇంటిని కానీ కొనకూడదు. 
పశ్చిమ వాయువ్యం వీధిపోటు : పశ్చిమ వాయువ్య దిశలో ఇంటికి ఎదురుగా వీధి ఉన్నట్లయితే దాన్ని పశ్చిమ వాయువ్య వీధిపోటుగా పరిగణించాలి. ఈ వీధిపోటు ఉన్న స్థలం కొనదగినది. గృహ నిర్మాణం చేయదగినది. ఈ వీధిపోటు పురుషులపై సత్ప్రభావం చూపుతుంది. రాజపూజ్యం, గౌరవ ప్రతిష్ఠలు, ఎల్లెడలా ఆధిపత్యం, రాజకీయాలలో నాయకులుగాను త్వరగా ఎదుగుతారు. మట్టి ముట్లుకున్నా బంగారం అన్నట్లుంటుంది ఈ ఇంటి నివశించే పురుషుల పరిస్థితి. ఇలాంటి స్థలాన్ని రెండో ఆలోచన లేకుండా కొనేయాలి. 
పశ్చిమ నైఋతి వీధిపోటు : ఈ వీధిపోటు ఆ ఇంట నివశించే పురుషులపై ప్రధానంగా ప్రభావం చూపుతుంది. జీవితం గొర్రెకు తోక బెత్తెడే అన్నట్లుంటుంది. కష్టానికి తగ్గ ఫలితం లభించదు. నిరాశా నిస్పృహలకు గురిచేస్తుంది. మనశ్శాంతిని హరిస్తుంది. జీవితం ఆపజయాల జాతర అన్నట్లు మారుతుంది. ఆపవాదులు, నిందలు, ఈ ఇంట మగవారిని బాధించి వేధిస్తాయి. విజయం చేతికందినట్లే అంది పరాజయాన్ని మిగులుస్తుంది. మగవారి పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీరే అలోచించండి. 
దక్షిణ నైఋతి వీధిపోటు : దక్షిణ నైఋతికి ఎదురుగా వీధి ఉంటే.. దాన్ని దక్షిణ నైఋతి వీధిపోటుగా భావించాలి. ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలాన్ని, ఇంటిని కొనకూడదు. ప్రత్యేకించి ఈ వీధిపోటు ప్రభావవం ఆ ఇంట గృహిణిపైన ఉంటుంది. కాపురం కలతల కల్లోలంగా ఉంటుంది. దాంపత్యంలో అనురాగం కొరవడుతుంది. ఇంటి యజమానురాలి ఆరోగ్యం బాగుండదు. ఏ కార్యం తలపెట్టినా ఎదురుతిరుగుతుంది. మనసు ఎప్పుడూ కల్లోల సాగరంలా ఉంటుంది. ఊరకే కృంగిపోతుంటారు. ఇంటా బయటా అవమానాలే. 
దక్షిణ ఆగ్నేయ వీధిపోటు : ఇలాంటి వీధిపోటు... ఉన్న స్థలాన్ని, ఇంటినీ నిశ్చింతగా కొనవచ్చు. ఈ ఇంట నివసించేవారు.. ఆనందప్రదమైన జీవితాన్ని అనుభవిస్తారు. డబ్బుకు కొదవే ఉండదు. అలానే ఈ ఇంట నివసించే వారికి ఆరోగ్యానికీ కొదవ ఉండదు. ఎప్పుడూ ఈ ఇల్లు ధన ధాన్యాలతో తులతూగుతుంటుంది. బంధుమిత్రులతో కళకళలాడుతుంటుంది. ఈ ఇంట నివశించే ఆడవారు, ఆడపిల్లల చదువుల్లో సరస్వతుల్లా రాణిస్తారు. మంచి ఉద్యోగాలను పొందగల్గుతారు. మంచి ఖ్యాతి విఖ్యాతులు సొంతం చేసుకుంటారు. 
తూర్పు ఆగ్నేయ వీధిపోటు : తూర్పు ఆగ్నేయ దిశలో వీధిపోటు ఉందంటే... ఆ ఇంట నివశించే వారి జీవితం... నిత్యం అల్లకల్లోలం అన్నట్లుంటుంది. జయాలు శూన్యం. అపజయాలు అపారం. జీవితంలో కష్టాలు కోకొల్లలు. సుఖాలు కోటి దివిటీలతో వెతికినా కన్పించవు. మనసు సునామీ నాటి సంద్రంటా ఉంటుంది. వేయి ప్రయత్నాలు చేస్తే 999 విఫలం అన్నట్లుంటుంది జీవితం. అటు వృత్తిలో అయినా, ఇటు వ్యాపారంలో అయినా విజయం ఎండమావే అవుతుంటుంది. తూర్పు ఆగ్నేయ వీధిపోటున్న ఇంటిని, స్థలాన్ని కొనకూడదు. 
వీధిపోట్లు పట్ల నిర్లక్ష్యం : వాస్తుశాస్త్రం రీత్యా వీధిపోట్లు విషయంలో చాలాచాలా అప్రమత్తంగా ఉండాలి. సుఖశాంతుల్ని, జీవితంలో సెక్సెస్‌లను మింగేసి... అశాంతిని మిగిలించే వీధిపోట్లు ఉన్నా ఇళ్ళు, స్థలాలు, వ్యాపార దుకాణాలు... వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శాస్త్రాన్ని, శాస్త్ర సూచనలను నిర్లక్ష్యం చేసి... కోరి కలతల్ని కొనితెచ్చుకోవలన్నదే మా విన్నపం. 
దిక్కులు పెరిగినా, మూలల చెదిరినా కరెక్టు చేసుకోవాల్సిందే... 
వాస్తుశాస్త్ర విరుద్ధంగా మూలలు పెరిగిన స్థలాలను వాస్తు నియమాల రీత్యా సరిచేసుకుని అప్పుడు గృహనిర్మాణం చేసుకుంటే.. ఆ ఇల్లు సుఖశాంతుల నిలయం అవుతుంది. పారిజాతపు వనంలా సంతసంతో ప్రకాశిస్తుంది. ఇక పెరిగిన మూలలు వాటిని సరిచేసుకునే విధానం తెల్సుకుందామా? 
తూర్పు ఆగ్నేయం : ఈ మూల పెరగడం ఏ మాత్రం క్షేమదాయకం కాదు. ఆ మూలను సరిచేసుకున్నాకనే గృహ నిర్మాణం చేపట్టాలి. పెరిగిన మూలలో వున్న స్థలాన్ని కట్‌చేసి... గృహ నిర్మాణ స్థలంలో కలపకుండా వేరుగా ఉంచాలి. ఈ స్థలాన్ని మొక్కలు పెంచుకునేందుకు ఉపయోగించండే తప్ప... నిత్యం వాడుకునే విధంగా మాత్రం మలచుకోవద్దు. ఇక్కడి చిత్రంలో ఉన్న భాగాన్ని కట్‌చేసి వదిలివేయాలి. 
తూర్పు ఈశాన్యం : తూర్పు ఈశాన్యం స్థలం పెరిగితే... తొలగించాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థలం అదృష్టదాయకం. ఆయురారోగ్య ధనధాన్యాభివృద్ధికి నిలయం అవుతుందీ స్థలం. ఎంత అదనపు సొమ్ము చెల్లించి అయినా ఇలాంటి స్థలాన్ని నిశ్చింతగా కానండి. 
ఉత్తర ఈశాన్యం : ఇలా ఉత్తర ఈశాన్యం పెరిగి వున్న స్థలాన్ని కూడా మరో ఆలోచన చేయకుండా కొనుక్కోవచ్చు. ఇలా ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కట్‌చేసి తొలగించాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉంచుకోవచ్చు. ఈ ప్రదేశంలో బరువైన నిర్మాణాలు చేయకూడదు. ఈ స్థలాన్ని వదిలేస్తేనే వాస్తురీత్యా శుభప్రదం. 
ఉత్తర వాయువ్యం : మీరు కొనే స్థలం ఉత్తర వాయువ్యం పెరిగి ఉంటే... పెరిగిన మేర కట్‌చేసి దానిని నిర్మాణాలకు ఏమాత్రం వినియోగించకుండా... మిగిలిన స్థలంలో గృహ నిర్మాణం చేసుకోవాలి. 
పశ్చిమ వాయువ్యం: పశ్చిమ వాయువ్యం పెరిగి ఉండడం కూడా వాస్తు శాస్త్ర రీత్యా శుభ సూచకంకాదు. కనుక పశ్చిమ వాయువ్యంలో పెరిగి వున్న స్థలాన్ని కట్‌ చేసి తొలగించి... మిగిలిన స్థలంలో గృహ నిర్మాణం చేయాలి.
పశ్చిమ నైఋతి : పశ్చిమ నైఋతి పెరిగి ఉండటం కూడా వాస్తురీత్యా ఆమోదనీయం కాదు. జాగ్రత్తగా పెరిగిన పశ్చిమ నైఋతీ భాగాన్ని కట్‌చేసి, స్థలాన్ని చతురస్ర లేదా దీర్ఘ చతురస్రాకారంగా తయారు చేసుకుని ఆ స్థలంలో గృహ నిర్మాణం చేయాలి. 
దక్షిణ నైఋతి : ఇక్కడి చిత్రాన్ని గమనిస్తే దక్షిణ నైఋతి పెరిగినట్లు అర్ధం అవుతుంది. దక్షిణ నైఋతి పెరిగి ఉండకూడదు. పెరిగిన మేర కట్‌ చేయాల్సిందే. తూర్పు, పడమర భుజాలు సమంగా ఉండేలా చూసుకుని దక్షిణ నైఋతిని కట్‌ చేయాలి. 
దక్షిణ ఆగ్నేయం : దక్షిణ ఆగ్నేయం పెరగడం కూడా వాస్తు శాస్త్ర రీత్యా సమ్మతమైన విషయం కాదు. పెరిగిన దక్షిణ ఆగ్నేయాన్ని తప్పకుండా కట్‌చేసి తొలగించాల్సిందే. దక్షిణ ఆగ్నేయం పెరగటం అంటే.. నైఋతి తగ్గటం అన్నమాట. నైఋతి పెరిగినా, తగ్గినా అది శుభప్రదం కాదు. 
కొన్ని స్థలాలు.. ఒకమూలే కాకుండా... రెండు మూలలు కూడా పెరిగి ఉంటాయి. వాటిని సరిచేసుకున్నాకనే గృహ నిర్మాణం కావించాలి. ముఖ్యంగా ఇలా మూలలు పెరిగిన వాటిని కరెక్టు చేయకుండా నిర్మాణాలు చేపట్టి ఉంటే.. ఒకవేళ అలాంటి నిర్మాణాలు మీరు కొనుగోలు చేయవలసి వస్తే... ఆ నిర్మాణం గావించబడిన స్థలం.. ఏ మూల పెరిగిందో తెల్సుకోండి. ఒకవేళ ఆ పెరుగుదల అశుభ సూచకం అయినట్లయితే.. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ మూలలలో అదనంగా ఉన్న స్థలాన్ని కట్‌ చేయడానికి అనువుగా గృహ నిర్మాణం జరిగి ఉంటే... మీరా ఇంటిని కొన్నాక అయినా.. ఇంటి స్థలంలో పెరిగిన భాగాన్ని కట్‌ చేయండి. దాన్ని ఏ మాత్రం వాడుకలో ఉండకుండా పూర్తి జాగ్రత్తలు వహించండి. ఒకవేళ పెరిగిన మూలలు సరిచేసేందుకు వీలుగా గృహ నిర్మాణం లేకపోయినట్లయితే ఆ గృహాన్ని కొనకుండా వదిలేయండి. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం పెరిగి వున్న స్థలాన్ని అలాంటి స్థలంలో నిర్మించబడిన గృహాలను నిశ్చింతగా కొనేయండి. 
కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం : ముందుగా వాస్తుపరంగా మన ఇంటి ప్రహారీ ఎలా నిర్మంచుకోవాలో తెల్సుకుందాం. ప్రధానంగా ప్రహారిగోడ ఎత్తు విషయంలో వాస్తు నియమాలు తప్పని సరిగా పాటించాలి. తూర్పు ప్రహారీ గోడ కన్నా ఉత్తరం వైపు ప్రహారీగోడ తప్పకుండా కొంత ఎత్తుగా ఉండాలి. ఉత్తరం ప్రహారీ గోడకన్నా పడమర ప్రహారీగోడ కొంత ఎత్తుగానే ఉండాలి. ఇక పడమర ప్రహారీగోడకన్నా దక్షిణం ప్రహారీగోడ ఇంకొంత ఎత్తుగా ఉండాలి. అన్నింటికన్నా తక్కువ ఎత్తులో తూర్పు ప్రహారీగోడ, అన్నింటికన్నా ఎక్కువ ఎత్తులో దక్షిణ ప్రహారీగోడ ఉండాలి. అలానే తూర్పుకన్నా పడమర... ఉత్తరం కన్నా దక్షిణం ప్రహారి గోడలు పోల్చి చూసినపుడు ఎత్తుగా ఉండి తీరాల్సిందే. 
ప్రహారిగోడకు గేట్లు నిర్ణయం : కాంపౌండ్‌ వాల్‌కు గేట్లు అమర్చుకునే విషయంలో వాస్తు చక్కని నియమాలను సూచించింది. ఆ నియమాలకు అనుగుణంగా ప్రహారీగోడకు గేట్లు ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు వైపు కాంపౌండ్‌ వాల్‌కు ఎక్కడ గేటు అరేంజ్‌ చేసుకోవాలో ముందుగా తెల్సుకుందాం. సహజంగా దక్షిణం కన్నా ఉత్తరం వైపు గృహ నిర్మాణ సమయంలో ఎక్కువ జాగా వదులుతాం. ఆ స్థలాన్ని కొలచి.. ఖచ్చితంగా దానికి మధ్యలో ఉంచేలా తూర్పు ఈశాన్యంలో కాంపౌండ్‌ వాట్‌ గేటు అమర్చుకోవాలి. ఇది సులవైన విధానం. ఇలానే తూర్పు కాంపౌండ్‌ వాల్‌ పొడవుఉ 9 భాగాలుగా విభజించి, ఉత్తరం నుండి మూడు నాల్గు భాగాలలో కూడా కాంపౌండ్‌ వాట్‌ గేటు అమర్చుకోవచ్చు. అలానే స్థలంలో గృహ నిర్మాణం జరిగినపుడు... ఇంటి సింహద్వారం ఎక్కడయితే వస్తుందో... దానికి ఎదురుగా కూడా తూర్పు కాంపౌండ్‌ వాల్‌కు మరో గేటు... వాహనాల రాకపోకలకు అనువుగా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఉత్తరం కాంపౌండ్‌ వాల్‌కు గేట్లు విషయంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలి. గృహ నిర్మాణానికి ఉపయోగించే స్థలం పోగా తూర్పున ఎంత స్థలం అయితే వదిలారో... ఆ స్థలానికి మధ్యలో వచ్చేలా ఉత్తర ఈశాన్యంలో గేటు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరం కాంపౌండ్‌ వాల్‌ను 9 భాగాలు చేసి తూర్పు నుండి 3,4 భాగాలలో కూడా గేట్‌ను అమర్చుకోవచ్చు. 
పడమర కాంపౌండ్‌ వాల్‌కు గేటు అమర్చుకోవాలంటే కూడా ఇలాంటి నిబంధనలనే పాటించండి. సహజంగా దక్షిణం కన్నా ఉత్తర దిశలో ఇంటిని ఎక్కువ స్థలం వదులుతాము కనుక... ఈ ఖాళీ స్థలానికి మధ్యభాగంలో ఉండేలా పడమర కాంపౌండ్‌ వాల్‌కు పడమర వాయువ్యంలో గేట్‌ అమర్చుకోవాలి. అలానే పడమర కాంపౌండ్‌ వాల్‌ను తొమ్మిది భాగాలుగా విభజించి... మూడు, నాల్గవ భాగాలలో వచ్చేలా గేట్‌ను నిర్మించుకోవచ్చు. 
ఇక దక్షిణ కాంపౌండ్‌ వాల్‌ విషయానికొస్తే... గృహ నిర్మాణానికి వినియోగించే స్థలం పోగా తూర్పున ఎలాగూ ఎక్కువ జాగా వదలడం జరిగి తీరుతుంది కనుక... ఈ తూర్పున ఉన్న ఖాళీ స్థలానికి మధ్యలో వచ్చేల దక్షిణ ఆగ్నేయంలో కాంపౌండ్‌వాలో గేటు అమర్చుకోవాలి. అలానే దక్షిణ కాంపౌండ్‌ వాల్‌ను 9 భాగాలుగా విభజించి తూర్పు వైపు నుండి 3,4 భాగాలలో కూడా కాంపౌండ్‌ వాల్‌గేట్‌ను అమర్చుకోవచ్చు. 
1. కాంపౌండ్‌ వాల్‌కు అమర్చిన గేట్‌ పరికరాలు ఎప్పుడూ కాంతివంతంగా ఉండాలి. ఈ గేటు ఉన్న ప్రాంతంలో చీకటిగా ఉండకూడదు. 
2. గేట్‌ను లోపలకు తెరిచే విధంగా అమర్చుకోవాలన్న నిబంధనను తప్పక పాటించండి. 
3. కాంపౌండ్‌వాల్‌ గేటుకు ఎదురుగా కరెంటు స్తంభాలు, కరెంటు ట్రాన్స్‌ఫార్మర్స్‌ ఉండకూడదు. 
4. కాంపౌండ్‌వాల్‌ గేటుకు ఎదురుగా చెట్లు ఉండడం, గోతులు, గుట్టలు ఉండడం, పాడుబడిన ఇళ్ళు ఉండడం కూడా వాస్తుశాస్త్ర విరుద్ధమే. 
5. కాంపౌండ్‌వాల్‌ గేటు ఇంటి ప్రధాన సింహద్వారం కన్నా తక్కువ ఎత్తులో ఉండి తీరాలి. ఈ నిబంధనను కూడా విధిగా పాటిచాలి. 
6. కాంపౌండ్‌వాల్‌ గేటుకు ఎదురుగా చెత్తాచెదారం కుప్పలు, చెత్త కుండీలు, మురికినీరు నిల్వ ఉండడం వంటివి లేకుండా తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. 
7. కాంపౌండ్‌వాల్‌కు అమర్చే గేటు ఇంట్లోని అన్ని తలుపుల కన్నా స్ట్రాంగ్‌గా, హెవీగా, పెద్దదిగా ఉండాలి. 
8. కాంపౌండ్‌వాల్‌ గేటు తీసే సమయంలో వేసే సమయంలో శబ్దం చేయకూడదు. 
9. మెయిన్‌గేట్‌కు ఎదురుగా దేవాలయం ఉండకూడదు

వాస్తు శాస్త్రము

స్థలం - దాని ఆకారం

అన్ని స్థలాలు చక్కగా చతురస్రంగానో, దీర్ఘ చతురస్రంగానో ఉంటాయనుకోవడం పొరపాటే రకరకాల ఆకారాల్లో స్థలాలు ఉంటాయి. ఆ స్థలం ఏ ఆకారంలో ఉంటే ఆ స్థలం నివాస యోగం అవుతుందో తెల్సుకుందాం. ఘటాకార స్థలం... ఇది కుండను పోలి ఉంటుంది. విసనకర్ర ఆకారంలో ఉండే స్థలం అర్ధవృత్తాకారంలో ఉండే స్థలం, రోకలి ఆకారంలో ఉండే స్థలం, మద్దెల ఆకారం గల స్థలం, ఢమరుకాకార స్థలం, అండాకార స్థలం ఇలాంటి ఆకారాలలో ఉండే స్థలాలు గృహ నిర్మాణానికి యోగ్యమైనవి కావు, ఖచ్చితంగా వృత్తాకారంలో ఉన్నస్థలం అయితే ఇది వ్యాపార సంస్థల నిర్మాణానికి అనువైన స్థలం.

వాస్తు శాస్త్రము

.

గృహ నిర్మాణ స్థల వైశిష్ట్యం

గృహ నిర్మాణ సమయంలోనే వాస్తు నియమాలు పాటిస్తే సరిపోదు. గృహ నిర్మాణ నిమిత్తం స్తలాన్ని చేసుకునే తరుణంలో కూడా హండ్రెడ్‌ పర్సెంట్‌ ఆ స్థలం విషయంలో వాస్తు నియమాలు పాటించాలి. ఏ మాత్రం వాస్తుకు వ్యతిరేకంగా లేని స్థలాన్ని మాత్రమే సెలక్టు చేసుకుని... ఆ స్థలంలోనే పూజాది కార్యక్రమాలు నిర్వహించి వాస్తు పూజ విధిగా చేసి... అప్పుడు గృహ నిర్మాణం ప్రారంభించాలన్నది శాస్త్రం చేస్తున్న సూచన. 
1. మీరు తీసుకునే స్థలం బల్లపరుపుగా చదునుగా ఉండాలి. 
2. మీ స్థలానికి పడమర దిశలో కానీ, దక్షిణ దిశలో కానీ తటాకాలు, కాలువలు, జలాశయాలు, పెద్ద పెద్ద గోతులు ఏ మాత్రం ఉండకూడదు. 
3. పడమర, దక్షిణ దిశలలో స్థలం ఎత్తుగా ఉండవచ్చు. ఆనుకుని ఉన్నస్థలం మెరకగా ఉండవచ్చు. ఎత్తయిన కొండలు, గుట్టలు ఏవయినా ఉండవచ్చు. ఇది గృహ నిర్మాణానికి అనువైన స్థలంగా వాస్తు చెబుతుంది. 
4. మీరు సెలక్టు చేసుకున్న స్థలం... ఉత్తరం పల్లంగా ఉండవచ్చు... ఉత్తర భాగాన జలాశయాలు, కాలువలు ఉండవచ్చు. 
5. అలాగే తూర్పు దిశలో కూడా ఎలాంటి మెరలు, గుట్టలు లేకుండా మీ తూర్పుదిక్కున స్థలం పల్లంగా ఉండాలి. స్థలానికి తూర్పున తటాకం, జలాశయం, బావి, గొయ్యి, కాలువ ఇలాంటివి ఏవి ఉన్నా దాన్ని శుభప్రదమైన స్థలంగా పరిగణించాలి. 
6. మీరు నిర్ణయించుకున్న స్థలానికి నైఋతి దిశలో ఎంత ఎత్తయిన కట్టడాలువ ఉంటేవ మీకు అంత శుభప్రదం, నైఋతిలో మెరక, కొండలు, గుట్టలు ఉన్నా అది శుభాదయకమే. 
7. నైఋతి, ఆగ్నేయం, వాయువ్య దిక్కులతో పోల్చినపుడు... ఈశాన్య దిక్కు పల్లంగా ఉంటే అది ఎంతో మంచిది. 
8. ఒకవేళ ఇలా లేకున్నా.... ఈశాన్యాన్ని పల్లంగా చేసుకుంటే ఉత్తమం. పొరపాటున కూడా ఈశాన్యం కన్నా ఇతర మూడు మూలలు పల్లంగా ఉండరాదు. 
9. స్థలాన్ని సెలక్టు చేసుకునే సమయంలో... మీ స్థలానికి అతి చేరువలో స్మశానం, కర్మాగారాలు, అధిక ధ్వనిని కల్గించే రైల్వే మార్గాలు, స్టేషన్‌లు, విమానాశ్రయాలు లేకుండా తగు జాగ్రత్త పాటించాలి. ధ్వని కాలుష్యం మీరు నివశించే చోటుకు అతి చేరువగా ఉంటే... మీ ఆరోగ్యం పై ఈ ధ్వని కాలుష్యం ప్రభావం చూపుతుంది. 
10. స్థలానికి అతి చేరువలో మురుగు ప్రవహించే కాలువలు లేకుండా చూసుకోవాలి. అలానే నీరు నిలిచిపోయే గోతులు లేకుండా జాగ్రత్త వహించాలి. 
11. స్థలాన్ని త్రవ్వినపుడు ఎముకలు, దంతాలు బయటపడినా, పాము పుట్టలు, దిబ్బలు బయటపడినా అది నివాసయోగ్యం కాని స్థలంగా భావించి దాన్ని వదిలివేయాలి. 
12. ఉత్తరం కన్నా దక్షిణం మెరకగా అంటే ఎత్తుగా ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే... ఆ గృహంలో నివశించే వారి ఆర్ధిక పరిస్థితి ఉన్నతంగా ఉంటుంది. 
13. ఇలా కాకుండా దక్షిణం పల్లం ఉత్తరం మెరకగా ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా పలురకాల సమస్యలు ఈ గృహంలో నివశించే వార్ని వేధిస్తాయి. 
14. తూర్పు కన్నా, పడమర ఎత్తుగా ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేశారంటే... ఈ గృహంలో నివసించే వారికి చక్కని మనశ్శాంతి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ప్రశాంతంగా జీవించ గల్గుతారు. 
15. తూర్పు ఎత్తుగాను, పడమర పల్లంగాను ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే.. మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, పలురకాల ఇబ్బందులు వీర్ని వెన్నాడుతూనే ఉంటాయి. 
16. నైఋతి దిక్కుకన్నా ఈశాన్య దిక్కులో స్థలం పల్లంగా ఉన్నట్లయితే.. ఈ స్థలం గృహ నిర్మాణానికి ఎంతో శుభప్రదమైనదిగా వాస్తుశాస్త్రం చెబుతుంది. మంచి ఆరోగ్యం, మంచి గౌరవ ప్రతిష్ఠలు, పదుగురు అభినందించే సంతతి ఇలాంటి గృహంలో నివశించే వారికి లభ్యమవుతాయి. 
17. ఆగ్నేయం కన్నా వాయువ్యం పల్లంగా ఉండాలి. ఇలాంటి స్థలంలో గృహనిర్మాణం వాస్తు నియమానుసారం చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సమాజంలో మాంచి గౌరవ ప్రతిష్ఠలు పొందగల్గుతారు. 
18. వాయువ్యం ఎత్తుగా ఉండి... వాయువ్య కన్నా ఆగ్నేయం తక్కువ ఎత్తులో ఉండే స్థలంలో గృహ నిర్మాణం చేయరాదు. 
19. నైఋతి మూలకన్నా ఈశాన్యం మూల ఎత్తుగా ఉన్న స్థలంలో కూడా గృహనిర్మాణం చేయరాదు.

వాస్తు శాస్త్రము

స్థలంలో దిక్కుల గురించి....

స్థలంలో దిక్సూచినుపయోగించి ఉత్తర దక్షిణాలకు నిర్ధారించాకే తూర్పు, పడమరలను తదనుగుణంగా నిర్ణయించడం సులవవుతుంది. స్థలానికి నాలుగు దిక్కులే కాదు. నాలుగు మూలలు కూడా ఉంటాయి. వాటిని నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా, గ్రంథస్తంగా అందుతున్న పరిజ్ఞానాను సారంగా అయితే.... ఒక దిక్కును తొమ్మిది భాగాలుగా విభజించి, అటుపై మూలల నిర్ణయం చేయాలి. ఆ వివరాలు వివరంగా తెల్సుకుందాం. తూర్పు దిక్కును '9' భాగాలు చేయండి. మీరు తూర్పుకు తిరిగి నిలబడినపుడు తూర్పు దిక్కులో మీ కుడిచేతి వైపు ఉన్న రెండు భాగాలు తూర్పు ఆగ్నేయంగా భావించాలి. అలాగే మీ ఎడమ చేతివైపు ఉన్న చివరి రెండు భాగాలు తూర్పు ఈశాన్యంగా.. ఈ రెంటి నడుమ ఉన్న అయిదు భాగాలను తూర్పు దిక్కుగా భావించాలి. ఒక ఉత్తరం విషయానికొస్తే... మీరు ఉత్తరదిశగా తిరిగితే... మీ కుడిచేతి వైపున ఉండే చివరి రెండు భాగాలు ఉత్తర ఈశాన్యం, ఎడమచేతి చివరగా ఉండే రెండు భాగాలు ఉత్తర వాయువ్యం, వీటి నడుమ ఉన్న అయిదు భాగాలు ఉత్తర దిక్కుగా భావించాలి. ఇక పడమర వియానికొస్తే... మీరు పడమర దిక్కుగా నిలబడినపుడు పడమర దిక్కులోని 9 భాగాలలో మీ కుడిచేతివైపు చివరగా ఉండే రెండు భాగాలు పశ్చిమ వాయువ్యంగాను, మీ ఎడమ చేతివైపు చివరగా ఉండే రెండు భాగాలు పశ్చిమ నైఋతిగాను వీటి నడుమ ఉండే అయిదు భాగాలు పశ్చిమ దిశగా గ్రహించాలి. దక్షిణాన్ని కూడా ఇలానే గమనిస్తే.. మీరు దక్షిణ దిశగా తిరిగి నిలబడినపుడు.. మీకుడి చేతి చివరన ఉన్న రెండు భాగాలు... దక్షిణ నైఋతి. అలానే ఎడమచేతి వైపు చివరగా ఉండే రెండు భాగాలు దక్షిణ ఆగ్నేయం అని గ్రహించాలి. స్థలం ఏదయినా సరే దిక్కులు, మూలల్ని ఇలా నిర్ణయించుకోవాలి.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...