శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

30, జూన్ 2016, గురువారం

ఇంట్లో మెట్లు-వాస్తు నిబంధనలు

ఇంట్లో మెట్లు-వాస్తు నిబంధనలు

1. మెట్లు అంటేనే బరువుతో కూడినవి కనుక మెట్లను ఏర్పాటు చేసుకోనే సమయంలో బరువు 
వేయతగని ప్రాంతంలో మెట్లు నిర్మించకుండా ఎన్నో జాగ్రత్తలు వహించాలి. 
2. దక్షిణ దిశ,పడమర దిశలో మెట్లు ఏర్పాటు చేసుకోవడం వాస్తురీత్యా సముచితం. 
3. ఇంటి బయట ఏర్పాటు చేసుకోనే మెట్లు.... తూర్పున అయితే ఆగ్నేయంలో ఉత్తరంలో అయితే వాయువ్యంలో పడమర అయితే నైయుతిలో, దక్షిణంలో అయితే నైయుతిలో నిర్మించుకోవాలి. 
4. మెట్లు తూర్పు నుంచి పడమరకు ఎక్కేలా, ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కేలా ఉండాలి. మధ్యలో లభించిన ఖాళీకి అనుగుణంగా మెట్లును వేరే దిశకు మళ్ళించవచ్చు. 
5. మెట్లు సంఖ్య ఎప్పుడు బేసి సంఖ్యలోనే ఉండాలి. సంఖ్య చివర జీరో వుండకూడదు. 
6. ఈశాన్యంలో ఇంటి మధ్యలో మెట్లు ఎట్టి పరిస్ధితిలో నిర్మించుకూడదు. ఆర్ధికంగా చాలా వేతలు పడాల్సి వస్తుంది. 
7. స్టెయిర్‌ కేస్‌ దిగువన.... కిచెన్‌,బాత్‌రూమ్‌,పూజ గది వంటివి నిర్మించుకోకుడదు. మెట్లు క్రింద భాగం స్లోరేజ్‌కు ఉపయోగించుకోవచ్చు. 
8. పై అంతస్తుకు వెళ్ళెందుకు దిగువ సెల్లార్‌కు కానీ బేస్‌మెంట్‌కు కానీ వెళ్ళేందుకు ఒకే స్టెయిర్‌ కేస్‌ను ఉపయోగించకండి.సెల్లార్‌కు వెళ్ళేందుకు వేర్‌ స్టెయిర్‌కేస్‌ ఏర్పాటు చేసుకోమని సూచిస్తుంది వాస్తు. 
9. స్టెయిర్‌ కేస్‌లో టర్నింగ్‌లు ఎప్పుడూ క్లాక్‌వైజ్‌ డైరెక్షన్‌లోనే ఉండాలి. యాంటీక్లాక్‌వైజ్‌ డైరెక్షన్‌లో మెట్లు టర్నింగ్‌లు ఉండడం వాస్తు విరుద్ధం. 
10. సాధ్యమైనంత వరకు స్పిరల్‌,సర్క్యులర్‌ కేస్‌లను ఏర్పాటు చేసుకోవద్దు. 
11. పై అంతస్తు లేదా టెర్రాస్‌ పైకి వెళ్ళే స్టెయిర్‌ కేసుకు రూఫ్‌ ఉండి తీరాలి. 
12. స్టెయిర్‌ కేస్‌కు డోర్స్‌ ఉంటే.... లోయర్‌ డోర్‌ కన్నా అప్పర్‌డోర్‌ 10 అంగుళాల వరకు తక్కువ ఎత్తులో ఉండాలి. 
13. స్టెయిర్‌ కేస్‌ దిగువన సేఫ్టీలాకర్స్‌,విలువైన సంపదతో కూడిన అల్‌మైరాలు ఉంచకూడదు. 
14. ఇంటి చుట్టూ తిరిగి వచ్చేలా స్టెయిరకేస్‌ను అమర్చడం బహుళ అంతస్తుల బిల్డింగ్స్‌లో చూస్తుంటాం. వాస్తు శాస్త్ర రీత్యా ఇవి ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది. 
15. దక్షిణం నుండి ఉత్తరానికి, పడమర నుండి తూర్పుకు మేడమెట్లు ఎక్కేలా ఏర్పాటు చేసుకోవడం శాస్త్ర విరుద్ధం. ఇలాంటి గృహంలో అభివృద్ధి లోపిస్తుంది. అనేక రకాల శారీరక మానసిక బాధలు చుట్టుముడతాయి. 
16. పడమర, దక్షిణ గోడలకు ఆనుకుని మెట్లు నిర్మించవచ్చు. తూర్పు, ఉత్తర గోడలకు దూరంగా ఉండేలా మెట్లు నిర్మించుకోవాలి. 
17. మెట్లు వాలు 30 నుండి 45 డిగ్రీల నడుమ ఉండాలి. అంతకు మించి ఉంటే మెట్లు ఎక్కడం శ్రమ అవుతుంది. మోకాళ్ళు నడుం నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది

26, జూన్ 2016, ఆదివారం

లివింగ్‌ రూమ్‌

లివింగ్‌ రూమ్‌

ఇంటికి వచ్చిన అతిధులకు ముందుగా దర్శనమిచ్చేది లివింగ్‌రూమ్‌. లివింగ్‌రూమ్‌ను తూర్పు,ఉత్తర దిశలలో ఏర్పాటు చేసుకోవడం వాస్తురీత్యా శుభకరం. ఆగ్నేయ దిక్కున లివింగ్‌రూమ్‌ నిర్మాణం జరపరాదు. అయితే దక్షిణం 
ఫేసింగ్‌ ఇళ్లకు మాత్రం.... ఆగ్నేయంలో లివింగ్‌రూమ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. 
కుటుంబ సభ్యులంతా కల్సి కూర్చుని మాట్లాడుకునేందుకు, టి.వి, వీక్షించేందుకు, రిలాక్స్‌ అయ్యేందుకు ఈ లివింగ్‌రూమ్‌ ప్రధానంగా 
ఉపయోగపడుతుంది. సహజంగా షాండిలియర్స్‌, క్రిస్టల్‌ లాంప్స్‌ ఏర్పాటు చేస్తారు. లివింగ్‌రూమ్‌లో లైటింగ్‌ ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవాలి. డిమ్‌ లైటింగ్‌ ఉండకూడదు. అందమైన సోపాలు, టీపాయ్‌లు, టి.వి వంటివి అమర్చుకుంటాం కనుక... లివింగ్‌రూమ్‌ ఎంత పెద్దదిగా ఉంటే అంత బాగుంటుంది. 
1. వాస్తురీత్యా లివింగ్‌రూమ్‌లో లేవెట్రీ కానీ, బాత్‌రూమ్‌ కానీ హలుకు నైబుతీ మూల... పడమర, దక్షిణ గోడలకు ఆనుకుని ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.తూర్పు,ఉత్తర గోడలకు అనుకుని ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు, ఉత్తర గోడలకు ఆనుకొని ఉండకుండా గృహ నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు వహించాలి. 
2. లివింగ్‌రూమ్‌ ఇంటకిి ఉత్తర దిక్కుగా ఉండడం ఎంతో శుభప్రదం. 
3. వాయువ్యంలో కూడా లివింగ్‌రూమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 
4. ఉత్తరంలో లివింగ్‌రూమ్‌ ఉంటే ఆ ఇల్లు సుఖశాంతులతో అలరారుతుంది. 
5. నైఋతి దిశలో మాస్టర్‌ బెడ్‌రూమ్‌కు అనువైన స్ధలం. అయితే ఈ దిశలో కూడా లివింగ్‌రూమ్‌ నిర్మాణం వాస్తురీత్యా ఆమోద యోగ్యమే. 
6. లివింగ్‌రూమ్‌లో ఫ్లోరింగ్‌ ఉత్తరం వైపుకు, వాలు కల్గి ఉండాలి. అంటే నీరు పోస్తే... అవి ఉత్తరం, తూర్పు దిశలలో పారాలి తప్ప, పడమరకు, దక్షిణానికి పారకూడదు. 
7. లివింగ్‌రూమ్‌ ఏరియాలో నిర్మితమైన సీలింగ్‌ కూడా... తూర్పు, ఉత్తరాలకు కాస్త దిగి ఉండాలి. 
8. లివింగ్‌రూమ్‌కు డోర్‌ తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పారచుకోవడం వాస్తు నియమాల రీత్యా అదృష్ట ప్రదం. 
9. లివింగ్‌రూమ్‌కు పడమర వైపున ఎంట్రన్స్‌ ఉంటే.... మేథావులు, రీస్చెర్స్‌కు ఎంతో మేలు. 
10. దక్షిణ, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం ఎంట్రర్స్‌లు లివింగ్‌రూమ్‌కు ఉంటే... మంచిదే కానీ జరిగే చాలా లేట్‌గా జరుగుతుంది. 
11. లివింగ్‌రూమ్‌లో బరువైన ఫర్నిచర్‌ ఎప్పుడూ... దక్షిణ గోడలను ఆనుకుని, పడమర గోడలకు ఆనుకోని ఉండేలా తగు జాగ్రత్త వహించాలి. బరువైన సోఫాలు, దివాన్‌ సెట్స్‌ లాంటివి ఉత్తరపు గోడకు ఆనుకొని ఉండకుడదు. ఈ జాగ్రత్త లివింగ్‌రూమ్‌లో తప్పక పాటించాలి. 
12. లివింగ్‌రూమ్‌లో ఇంటి యజమాని ఎప్పుడూ... తూర్పు లేదా ఉత్తర వైపు తిరిగి కూర్చోవాలి. అప్పుడే కుటుంబంలో ఆయన ఆథిపత్యంకు గౌరవం లభిస్తుంది.
13. టివిని ఎట్టి పరిస్ధితిలో ఈశాన్యం మూల ఉంచరాదు. టివి ఎప్పుడూ ఆగ్నేయ మూల ఉండడం వాస్తురీత్యా సమజసం. 
14 నైఋతిలో టివి ఉంచితే దాని ప్రభావం గృహంలో నివశించే వారి మీదే కాదు.... టివి మీద కూడా ఉంటుంది. తరుచు అది రిపెరిగ్‌కు వస్తుంది. 
15. లివింరూమ్‌లో ఫోన్‌ను తూర్పు, ఉత్తరం, ఆగ్నేయంలో ఉండేలా చూడండి. 
16. ఎయిర్‌కూలర్‌, ఎయిర్‌ కండీషనర్లను లివింగ్‌రూమ్‌లలో పడమర, వాయువ్యం, తూర్పు దిశలలో ఏర్పాటు చేయండి. పొరపాటు కూడా ఆగ్నేయంలో ఉంచరాదు. 
17 లివింగ్‌రూమ్‌ ఈశాన్యం మూల దేవుని చిత్రాపటాలు హేంగ్‌ చేయండి. 
18. లివింగ్‌రూమ్‌లో వార్‌, క్త్రెమ్‌, బాథాకరమైన, మరణించిన పెద్దల పటాలను ఉంచరాదు. 
19. లివింగ్‌రూమ్‌లో రెడ్‌ కలర్‌ను వాల్స్‌కు వేయకండి. వైట్‌, లైట్‌ ఎల్లో, బ్లూ, గ్రీన్‌ రంగులు లివింగ్‌రూమ్‌లో వాల్స్‌కు వేసుకోవచ్చు. 
20. లివింగ్‌రూమ్‌లో చతురస్త్రకారం, దీర్ఘచతురస్రాకార ఫర్నిచర్సనే వాడండి.రౌండ్‌, ఓవల్‌ ఇతరత్రా ఏ షేప్‌ ఫర్నీచర్స వాడకండి. 
21. డూప్లేక్స్‌ అయితే మెట్లు హలు నుండి ఏర్పటు చేసుకోవలసి వస్తే దక్షణ దిశలో , పడమరలో నైఋతి మూలా ఏర్పటు చేసుకోవచ్చు. 
22. ఈశన్యం మూలన ఉన్న విండోస్‌కు ఎప్పూడు లైటు వెయాట్‌ కర్టన్స్‌ మాత్రమే వాడలి.డోర్‌ కర్టన్స్‌ విషయంలో కూడా ఈ నియమం పాటించండి.ఇతరత్ర ఏ విండో అయినా డోర్‌ అయినా హెవీ కర్టన్స్‌ వాడవచ్చు. 
23. లివింగ్‌రూమ్‌లో ఈశన్యం మూలన ఖాళీగా ఉంచండి. 
24. లివింగ్‌రూమ్‌లో ఆర్టిఫిషీయల్‌ ఫ్లవర్స్‌, ఎండిపోయిన పూలు, సూదులుగా ఉండే ఆకులు గల చెట్లు, బోనసాయ్‌గా పిలువబడే మరుగుఙూ మొక్కలు ఉంచకూడాదు. వాస్తూరీత్యా ఇది శుభకరం కాదు. 
25. లివింగ్‌రూమ్‌ ఏరియాలో ..పడమర లేదా, దక్షణంకు దగ్గరగా షాండీలియర్‌ వ్రేలాడ తీయవచ్చు.షాండిలియర్‌ను లివింగ్‌రూమ్‌ మధ్యలో వ్రేలాడ తీయకూడదు. 
24. లివింగ్‌రూమ్‌ ఉత్తర దిశలో వాటర్‌ ఫౌంటెయిన్‌ ఏర్పటు చేసూకోవాలి. 
25. ఉత్తరం, తూర్పు, ఈశన్య దిశలో అక్వేరియం ఉంచడం ఎంతో శుభదాయకం.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...