శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com
రుద్రాక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రుద్రాక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జులై 2013, శనివారం

రుద్రాక్షలు- మోసాలు

 
రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.

భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉపనిషత్తులది చాలా ప్రత్యేకత. వేదములకు చివరి భాగమవటం వలన వీనినే వేదాంతం అంటారు. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచములో మనకు ఎప్పుడూ వినిపించేది "ప్రస్థానత్రయం" అనే పేరు. బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఉపనిషత్తులు ఈ మూడు భగవత్తత్వము వివరిస్తూ ఎక్కడికో చెబుతాయి. ఈమూడు ఆధాత్మికత గురించి తెలుసుకోవాలనే భావం, నిజాయితీగా వుండే వారికి మూలగ్రంధాలు. ఇక ఇతిహాస, పురాణాలు, కావ్యాలు అన్నీ వీటి తరువాతనే. కావ్యాలు, పురాణాలు మానవుడికి ధర్మాన్ని వివరించే కథలే కానీ నిజమైన చరిత్రలు కావనే వాదన వుంది. ఎందుకంటే పరమాత్మ నిర్గుణము, నిరంజనము, అవ్యక్తమూ, నిత్యమూ చెప్పే ప్రస్థానత్రయానికి భిన్నముగా పురాణాలు, కావ్యాలు మూర్తి ఆరాధనకు ప్రాధాన్యమిస్తుంటాయి. ప్రస్థానత్రయం మోక్ష సాధనే మానవ పరమావధి. అంటే పురాణ, కావ్యాలు, పుణ్యము, స్వర్గము, ఇహపరసుఖాలు అంటూ విస్తారంగా చెబుతాయి. ఇందుకోసం సాటిమనిషిని, మనిషే బలిపశువుని చేసి వికృతమైన ఆనందాన్ని పొందే మార్గం వైపు పయనింపచేస్తాయి. అయినా ఫరవాలేదు భగవంతుడు వచ్చి, అంతిమ రక్షణ కలిగిస్తాడు అంటూ మానవ జాతిని నిర్వీర్యపధం వైపు పయనింపచేస్తాయి. పేదరికం అంటే ఆహారలేమి, భద్రతాలేమి, ఏ పని చేసినా కడుపే సరిగా నిండక దరిద్రంలో నలిగిపోతున్న మనిషిని, భయం వద్దు, నీ కోసం నేను జపం చేస్తాను, మూల్యం ఇవ్వు, కష్టాలన్నీ తీరుతాయి, అంటూ ఉన్న గోచీని కూడా లాక్కుని వికృతంగా ఆనందించే వాళ్ళను తయారుచేసే కర్మాగారాలు. అందుకే వైదికులు అంటే వేదాన్ని విశ్వశించేవారు, పురాణాలు వ్యతిరేకించినా కాలక్రమంలో రాజీపడిపోయారు. పురాణదేవతలకు, వైదికదేవతలకు "అస్సలు పొంతనకుదరదు" ఒకప్రక్క ఇలావుంటే మరోప్రక్క విషయమూ, వస్తవునూ వ్యాపారంగా మార్చే ప్రక్రియ కొద్దికాలంగా మరింత పెరిగిపోయింది. వీళ్ళకు భగవంతుడంటే ఏ మాత్రము నమ్మకం లేదు. అందుకే దేవుళ్ళను అమ్మేస్తున్నారు. నా యంత్రం పెట్టుకోండి లక్షాధికారి అవండి. ఫలాన రాయిపెట్టుకోండి మీ కష్టాలుపోయి లక్షాధికారి అవండి. మర్చిపోకండి మా దగ్గర మాత్రమే దేవతలు అమ్మకానికి వున్నారు. మేము దేవతల అమ్మకానికి గుత్తాధిపత్యం కలిగివున్నాము. మీ కోసం అతి తక్కువ ధరకు వీరిని అమ్మేస్తాం. కొనండి బాబు కొనండి అంటూ లక్షల రూపాయలు, ఖర్చుచేసి, వివిధ మాధ్యమికాలలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. అటువంటి ప్రకటనలలో రుద్రాక్షలు ఒకటి. "మా వద్ద ఏకముఖి రుద్రాక్షను మాలగా చేసి మీ సౌలభ్యం కోసం అమ్మకానికి పెట్టాము.ధరించారో సర్వసంపదలు మీ వద్దకు నడిచి వస్తాయి. ఇందులో ఫలానా అతను నిష్ణాతుడు, నేపాల్ దేశం రుద్రాక్షల కోసం సంప్రదించండి, కొనండి అంటూ" వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ, కొన్నవాడేమోకాని అమ్మినవాడు లక్షాధికారి అవుతున్నాడు. రండి ! ఇందులో నిజానిజాలేమిటో చూద్దాము.
మొదటే చెప్పినట్లుగా ఉపనిషత్తుల్లో రుద్రాక్షల గురించి ఏమైనా వున్నదా? మనకు లభిస్తున్న 108 ఉపనిషత్తుల్లో "రుద్రాక్షజాబాలోపనిషత్తు" అనేది ఒకటుంది.అందులో భూషుడు అనే రుషి ఒకప్పుడు కాలాగ్నిరుద్రుడిని అడిగాడు. రుద్రాక్షలు ఎలా పుట్టాయి? వాటిని ధరించడం వల్ల వచ్చు ఫలమేమి?.

"ఒకప్పుడు త్రిపురరాక్షస సంహారమప్పుడు నేను కండ్లుమూసుకుని సమాధిస్థితిలో వున్నాను. అప్పుడు నా కళ్ళనుండి నీటి బిందువులు రాలి నేలపైబడి రుద్రాక్షలయ్యాయి" అని భగవంతుడైన కాలరుద్రుడు చెప్పాడు మరియు మానవులను వుద్దరించుటకై అవి స్థావరములై, వృక్షములుగా నిలిచాయి. వీటిని ధరించడం వలన, పగలు రాత్రులలో భక్తులు చేసే పాపాలు నశిస్తాయి [భక్తి అంటే భగవంతుడు చెప్పిన మార్గాన నడవడం] అలా నడిచేప్పుడు కూడా ఒక్కోసారి చేయవలసినది చేయకపోవటం, చేయకూడనిది చేయటం అనేవి తెలిసీ తెలియక జరిగితే వాటి వలన వచ్చే పాపం అని అర్థం. వీటిని చూడటం వలన, తాకటం వలన వచ్చే ఫలితం కంటే ధరించడం వలన కోటి ఫలం వుంటుంది. ఉసిరికాయంత పరిమాణమున్నది శ్రేష్టమని చెప్పబడింది. రేగుకాయంతది మధ్యము, శనగలంత పరిమాణము కలది అధమము. మంగళ కరమయిన రుద్రాక్షలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రమనే నాలుగు ఛాయలుగా వుంటాయి.

తెల్లని రుద్రాక్షలు బ్రాహ్మణ వర్గము, ఎర్రనివి క్షత్రియవర్గము, పసుపు రంగువి వైశ్యవర్గము, నల్లనివి శూద్రవర్గమునకు చెందినవి. సరయినవి అనగా గుండ్రముగా, బలముగా, పెద్దవిగా, లావుగా, ప్రకాశముగా, ముళ్ళుముళ్ళుగా వున్నవి శుభమయినవిగా చెప్పబడును. పురుగులు తిన్నవి, పగిలి ముక్కలుగా వున్నవాటిని, ముళ్ళులేనివాటిని, రంధ్రములు కలిగినవి, చూడటానికే బాగాలేనివి అనే ఆరు లక్షణాలు కలిగినవి వదిలి వేయాలి. వాటికవే పైకి క్రిందకూ రంధ్రం కలిగి వున్నవి ఉత్తమ, రంధ్రము వేయవలసినవి మధ్యమము, ఒకదానికొకటి చూడముచ్చటగా వున్నవి బలమయినవీ, లావుగా వున్న రుద్రాక్షలను పట్టుదారంతో ధరించవలెను. అవి అన్నీ ఒకే విధముగా వుండవలెను. పదునుపెట్టే రాయి సానమీద గీస్తే బంగారము రంగు వచ్చేదానిని శివభక్తులు ధరించాలి. శిఖయందు ఒకటి, తలమీద దారముతో గుచ్చి మూడు, మెడలో 36, రెండు భుజముల యందు 16,మణికట్టు వద్ద 12 , భుజాల మీద 15, రుద్రాక్షలు ధరించవలెను. 108 రుద్రాక్షలను మాలగా చేసి జ్యందము వలె ధరించవలెను. రెండు లేదా మూడు, ఐదు లేదా ఏడు వరుసలుగా కంఠ ప్రదేశము నందు ధరించవలెను. ముఖము మీద చెవులకు కూడ ధరించవలెను. మోచేతుల వద్ద, నాభిస్తానము వద్ద అంటే నడుముకు విశేషంగా దారముతో గుచ్చి ధరించవలెను.

నిద్రలో, మెలుకువలో ఎప్పుడూ రుద్రాక్షలు ధరించవలెను. 300 రుద్రాక్షలధారిణి అధమము, 500 మధ్యమము, 1000 రుద్రాక్షలు ఉత్తమమని చెప్పబడినది. వీటికి పాణ ప్రతిష్ట చేసి మూలమంత్రముతో అభిమంత్రించి 3, 5, లేక 7 మాలలు ధరించవలెను. ఒక ముఖ రుద్రాక్ష పరమాత్మ స్వరూపము. దీనిని ధరించినవారు ఇంద్రియములను వశమందుంచుకొని పరమాత్మలో అంతిమంగా లీనమవుతాడు. అంటే ఇంద్రియభోగాలకు దూరంగా, ఇంద్రియములను తన వశమందుంచుకొనుట అనగా ఈ లోకంలో వుండే మానవుడి మోక్షమార్గానికి అవరోధమయిన భౌతిక సుఖాల లాలస నుండి దూరంగా వుండాలనుకునే వారు ధరింపవలనినది. అంతేకాని ఇది ధరిస్తే మానవుడి అన్ని కోరికలు తీరి ధనవంతులు అవుతారనేది ఒక పెద్ద అబద్ధం.

2 ముఖాలు అర్ధనారీశ్వర తత్వమై ధరించినవారిని సర్వదా అర్ధనారీశ్వరునికి ప్రీతి పాత్ర పాత్రమవుతారు. 3 ముఖాల రుద్రాక్ష 3 అగ్నుల స్వరూపమై ధరించిన వారియందు తన ప్రసన్నతను చూపును. 4 ముఖాల రుద్రాక్ష చతుర్ముఖ బ్రహ్మసమానమై సృష్టికర్త ప్రసాదం లభిస్తుంది. 5 ముఖాల రుద్రాక్ష పంచముఖ శివస్వరూపమై ఎల్లప్పుడూ హత్యాదోషము వంటి మహా పాపముల నుండి రక్షిస్తుంది. 6 ముఖముల రుద్రాక్ష కార్తికేయ స్వరూపమై మహాలక్ష్మి ప్రసన్నతను పొందుతారు. అందువలన ఆరోగ్యము, సౌందర్యము పొందుతారు. విద్వాంసులు దీనిని గణేష స్వరూపముగా భావించి బుద్ధి, విద్య, లక్ష్మీవృద్ధి లభిస్తుంది. 7 ముఖాల రుద్రాక్ష ఏడు లోకముల తల్లులయిన సప్తమాతృకా స్వరూపమై ధరించిన వారికి, ఆరోగ్యము, వైభోగ్యము కలుగుతాయి. పవిత్రమైన జీవనం గడిపే వారికి గొప్ప అనుభూతి కలుగుతుంది. 8 ముఖముల రుద్రాక్షలు అష్ట వసువుల ప్రియమైనందున ధరించినవారికి గంగాదేవి అనుగ్రహిస్తుంది. అంతేకాక మూడు స్వరూపముల ప్రసన్నత లభిస్తుంది. 9 మఖముల రుద్రాక్షలు తొమ్మిది శక్తుల దేవతామూర్తియై, ధరించినవారి యందు తొమ్మిది శక్తుల ప్రసన్నమగును. 10 ముఖముల రుద్రాక్ష యమసమానమై, చూడటం వలన శాంతి కలుగుతుంది. ధరించడం వలన మహా శాంతి లభిస్తుంది. ఇందులో సందేహం లేదు. 11 ముఖముల రుద్రాక్ష ఏకాదశ రుద్రసమానమై ధరించినవారికి ఎల్లప్పుడూ సౌభాగ్యము పెంపొందించునదై ఉండును. 12 ముఖముల రుద్రాక్ష మహావిష్ణు స్వరూపమై, 12 మంది ఆచార్యుల సమానమై, వీరి ఉపాసకులకు మరింత ఉపయోగపడుతుంది. 13 ముఖముల రుద్రాక్ష సిద్ధిప్రదాతయై మన్మధుడి ప్రసన్నతను లభింపజేస్తుంది. 14 ముఖముల రుద్రాక్ష అయితే సమస్త రోగాలను పోగొట్టి పరమ ఆరోగ్య ప్రదాయి అవుతుంది.

ఇంతేకాక ఇంకా అనేకముఖముల రుద్రాక్షలు వున్నాయని శాస్త్రముల ద్వారా తెలుస్తోంది. రావణునిచే రచించబడిన ఒకానొక గ్రంథములో 108 ముఖముల రుద్రాక్ష కూడా వున్నట్లు వున్నది.రుద్రాక్షలను ధరించడానికి వివిధ మంత్రప్రయోగాలు చెప్పబడ్దాయి. భస్మము, రుద్రాక్షధారణ, శ్రీశివ పంచాక్షరీ మంత్ర జపము అనే మూడు విడదీయరాని బంధం కలిగి వుంటాయి. వీటిని ధరించిన వారి కోర్కెలు తీరాలంటే ఆహారవిషయంలో పాటించాల్సిన నియమాలు చూద్దాం. సారాయి, మాంసము, వెల్లుల్లి, నీరుల్లి వంటి పధార్దాలు వదిలివేయాలి. శాకాహారంలో కూడా కొన్ని కూరలు వదలవలిసి వుంటుంది [ములగ, విరిగ, వాంగ్వరాహము]. గ్రహణకాలమందు, విషువమందు [సూర్యోదయా సమయములు సమముగా వుండు రోజు. ఇది సంవత్సరములో రెండుసార్లు వస్తుంది. తులా, మేష సంక్రమణములు]. ఆయనములు మార్పు చెందేరోజు, అమావాస్యా, పూర్ణిమా దినములలో రుద్రాక్షలు ధరించాలి.

ఇక రుద్రాక్షలను అక్షమాల [అనగా జపమాల] గా ఉపయోగించాలనుకునే వారికి, ముందు చేయవలసిన కార్యక్రమము చాలానే వున్నది.భగవంతుడు నిర్దేశించిన మార్గములో నడవ వలిసి వుంది. అంతేకాని అవి గొప్పవి కనుక ధరించి మనం ఏం చేసినా సరిపొతుంది అనుకుంటే కుదరదు. నిజాయితిగా వుండిన రుద్రాక్షధారిక ఉపయోగమని చెప్పబడింది. అది లేనివారు ధరించడం నిరుపయోగమని తెలుసుకోవడం మంచిది. శ్రీ శివమహా పురాణంలోని విద్వేశ్వర సంహితలో కూడా దాదాపు ఇవే విషయాలు కనిపిస్తాయి. అనేక చోట్ల రుద్రాక్షవృక్షములు వున్నట్లు వుంది. కాని ఫలానిచోట లభించేవి గొప్పవి అనేది "వ్యాపారపురాణం".తమ లాభం కోసం వ్యాపారులు చేస్తున్న మోసంలో పడి డబ్బు వృధా చేసుకోవడం మానాలి.

ఇక ప్రస్తుతం ప్రచారంలో వున్న ఏకముఖి గురించి.

నిజానికి ఇది రుద్రాక్ష ఏం కాదు. రూపాయి విలువ కూడా చేయని భద్రాక్ష. వీటిని గురించి వృక్షశాస్త్రము చదువుకున్నవారు, పీఠాధిపతులుగా వుండేవారు ప్రజలకు చెప్పవలసిన పని వున్నది. పత్రికలు ప్రచార మాధ్యమాలు. డబ్బుకోసం నీతిని వీడి చేస్తున్న మాయ నుండి, అమాయక ప్రజలను రక్షింపవలసిన అవసరం వుందని ఈ వ్యాసం ముందుకు తెస్తున్నాము. ఆయుర్వేధంలో రుద్రాక్ష ఉపయోగం వున్నది. ఆయుర్వేద వైద్యులు కూడా నిజానిజాలు చెప్పాలని మా మనవి. ఈ విషయాలను మీకు తెలిసిన మీ దగ్గరివారికి చెప్పండి. అనవసరంగా డబ్బు పారేసుకోవడం కంటే నిర్భాగ్యులైన వారి జీవితాలను వెలిగించడం కోసం వెచ్చించండి. రుద్రాక్షలు ధరించినవారికంటే భగవంతుని ఆశీర్వాదం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఆధ్యాత్మిక వాక్కు.


రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.

11, జులై 2013, గురువారం

రుద్రాక్ష ముఖాలు : ఫలితాలు

రుద్రాక్ష :-


రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592. 
మన హిందువులలో "రుద్రాక్ష" పేరు విననివారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఐతే ఈ రుద్రాక్షలు ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమీటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. రుద్రాక్ష వృక్షం ప్రపంచంలోని ప్రాచీన వృక్షాలలో ఒకటి. రుద్రాక్ష వృక్షం భారతదేశంలో దిగువ హిమాలయాలలో, నేపాల్ లో మరియూ ఇండోనేషియాలో విరివిగా పెరుగుతాయి. ఈ వృక్షం పెరిగి పుష్పించి ఫలించటానికి కనీసం 15 నుండి 16 సంవత్సరాలు పడుతుంది. పురాణ కథ: "రుద్రాక్ష" అనే పదం రుద్ర + అక్ష అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. రుద్రాక్ష అనగా రుద్రుని అశ్రువులు (కన్నీటి బొట్లు) అని అర్ధం.

రుద్రాక్షల గురించి వాటి ఉపయోగాల గురించి శివపురాణం, దేవీ పురాణం, పద్మ పురాణం, మరియు రుద్రాక్ష జబలోపనిషత్ లలో వివరంగా చర్చింపబడింది. శివపురాణం ప్రకారం రుద్రాక్ష పుట్టుక ఇలా ఉంది. రాక్షసరాజైన త్రిపురాసురుడు వరబలం వలన అత్యంత శక్తివంతుడై, దేవతలకు కంటకుడిగా మారాడు. దేవతలంతా పరమ శివుని వద్దకు వచ్చి తమ బాధలు మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడూ త్రిపురాసుర సంహారం కోసం అత్యంత శక్తిమంతమైన ' అఘోరాస్త్రం ' తయారుచేయదలచి సమాధిలోకి వెళ్ళిపోయాడు. అలా సమాధిలోకి వెళ్ళిన పరమశివుడు చాలా కాలం తరువాత కళ్ళు తెరచినప్పుడు శివుని కన్నుల నుండి కొన్ని ఆశ్రు బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ అశ్రువులే విత్తనాలుగా మారి వాటి నుండి రుద్రాక్ష వృక్షాలు పుట్టాయి. రుద్రాక్ష చెట్టు నుండి వచ్చే ఫలాలలో ఉండే బీజములే మనం రుద్రాక్షలని అంటాము.

పరమశివుని త్రినేత్రములు సూర్య, చంద్ర, అగ్ని రూపాలు. అందులో సూర్యనేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు గోధుమరంగులో ఉంటాయి. ఇవి పన్నెండు రకాలు. చంద్రనేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు లేత ఎరుపురంగులో ఉంటాయి. ఇవి మొత్తం 16 రకాలు. అగ్ని నేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు నల్లగా ఉంటాయి. ఇవి మొత్తం 10 రకాలు. సూర్యనేత్రం నుండిపుట్టిన గోధుమరంగు రుద్రాక్షలను లేత గోధుమరంగు రుద్రాక్షలు, ముదురు గోధుమరంగు రుద్రాక్షలు గా విభజించ వచ్చు. అన్ని రకాల రుద్రాక్షలు కలిపి మొత్తం ముప్పైఎనిమిది రకాల రుద్రాక్షలు మనకు దొరుకుతున్నాయి. ఎవరైతే 108 రుద్రాక్షలను ధరిస్తారో వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుందని, వారి 21 తరాలవారు శివలోక సాయుజ్యం పొందుతారని, ఎవరైతే 1100 రుద్రాక్షలని ధరించినా, 555 రుద్రాక్షలను కిరీటంలా ధరించినా, 320 రుద్రాక్షలను జంధ్యంగా మూడు వరుసలో ధరించినా వారు పరమశివునితో సమానమని పురాణాలు చెప్తున్నాయి.

రుద్రాక్షలు - రకాలు
ముందుగా చెప్పినట్టు మనకు మొత్తం 38 రకాల రుద్రాక్షలు దొరుకుతున్నాయి. రుద్రాక్షల విలువ వాటీ ప్రమాణాన్ని బట్టి ఉంటుంది. మినుము గింజప్రమాణం గల రుద్రాక్షలకు చాలా రోగనిరోధక శక్తులున్నాయని, ఆధ్యాత్మిక చింతనకు శ్రేష్ఠమైనవని శాస్త్రం. భారతదేశంలో దిగువ హిమాలయాలలో లభించే రుద్రాక్షలు పరిమాణంలో చిన్నవి. నేపాల్ లో లభించే రుద్రాక్షలు పెద్దవిగా ఉంటాయి. "పత్రి" అనే రుద్రాక్ష చదునుగా ఉండే ఒక విషేషమైన రుద్రాక్ష. ఈ రుద్రాక్ష ప్రస్తుతం అంత విరివిగ లభించటంలేదు.


ప్రత్యేకమైన రుద్రాక్షలలో చెప్పుకోదగినవి "గౌరీ-శంకర రుద్రాక్ష", "గణేష రుద్రాక్ష"


వివిధ రుద్రాక్షలను వాటి ' ముఖాల ' ద్వారా గుర్తించవచ్చు. ఒక రుద్రాక్ష ఎన్ని ముఖాలదో తెలుకోవాటానికి సులభమైన మార్గం ఏమిటంటే ! ఆ రుద్రాక్షమీద ఎన్ని గీతలున్నాయో అది అన్ని ముఖాల రుద్రాక్ష.

పురాణాలు వివిధ రుద్రాక్షలను వివిధ దేవతలతో పోల్చారు.
ముఖాలు - దేవత - సంబంధిత గ్రహం
1 ముఖి - శివుడు / సూర్యుడు - సూర్యుడు
2 ముఖి - అర్ధనారీశ్వరుడు - చంద్రుడు
3 ముఖి - అగ్ని - కుజుడు
4 ముఖి - బ్రహ్మ - బుధుడు
5 ముఖి - కాలాగ్ని రుద్ర - గురుడు
6 ముఖి - కార్తికేయుడు - శుక్రుడు
7 ముఖి - అనంగ - శని
8 ముఖి - గణేష - రాహు
9 ముఖి - భైరవుడు - కేతు
10 ముఖి - విష్ణుమూర్తి - బుధుడు
11 ముఖి - ఏకాదశ రుద్రులు - కుజుడు/గురుడు
12 ముఖి - ఆదిత్యుడు - సూర్యుడు
13 ముఖి - కార్తికేయుడు - కుజుడు
14 ముఖి - శివుడు / హనుమంతుడు శని
21 ముఖి - కుబేరుడు
గమనించవలసింది ఏమిటంటే రుద్రాక్షలు ధరించటం వలన ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు.

ముఖాలు : ఫలితాలు
1 ముఖి : సర్వతోముఖ అభివృద్ధి. అన్ని పాపాలను హరించి అన్ని కోరికలను సిద్ధింపచేస్తుంది.
2 ముఖి : సౌభాగ్య ప్రదాయని, సర్వపాపహారిణి. ఈ రుద్రాక్ష ఏకత్వాన్ని సూచిస్తుంది. దుష్ట ఆలోచనలు అదుపుచేస్తుంది. వైవాహిక సంబంధాలను మెరుగు పరుస్తుంది.
3 ముఖి : సకల సౌభాగ్య దాయని. తరచుగా వచ్చే జ్వరం వంటి వ్యాదులనుండి ఉపశమనం
4 ముఖి : ధర్మార్ధ కామ మోక్ష ప్రదాయని. మానవుడు హత్య ద్వారా చేసిన పాపాన్ని హరిస్తుంది. జ్ఞాపకశక్తి ని, తెలివితేటలను పెంపొందిస్తుంది. నరాలకు సంబంధించిన వ్యాధులకు మంచిది
5 ముఖి : కోపాన్ని అదుపుచేసి మనసుకు శాంతిని కలగ చేస్తుంది. రక్తపోటు, చక్కెర వ్యాధి, పంటి నొప్పులు మూల వంటి వ్యాదులను నివారిస్తుంది.
6 ముఖి : కుడి చేతికి కట్టుకుంటే లోబిపి తగ్గుతుంది. బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి
7 ముఖి : ధన మరియు అభివృద్ధిని ప్రసాదిస్తుంది
8 ముఖి : ప్రమాదాల నుండి, ఆపదల నుండి రక్షణ
9 ముఖి : వివాహ సంబంధిత సమస్యల నుండి విముక్తి. ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది
10 ముఖి : నరాలకు సంబంధించిన వ్యాధులకు, జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది
11 ముఖి : సంతాన ఆరోగ్య సమస్యలకు మంచిది
12 ముఖి : రక్త, హృదయ సంబంధిత వ్యాధులకు మంచిది. ధైర్యాన్ని పెంచి శత్రువుల నుండి రక్షణ కలిగిస్తుంది
13 ముఖి : అభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది
14 ముఖి : శని సంబంధిత సమస్యలకు మంచిది. 



రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.

9, జులై 2013, మంగళవారం

మహిమాన్విత రుద్రాక్షలు



రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.

    మన సంస్కృతి, సంప్రదాయాలు కొన్ని నమ్మకాలను అలవాటు చేసింది.అటువంటి వాటిలో ఒకటి రుద్రాక్ష. దీనిని ధరిస్తే అందులోని శక్తి ప్రభావితం చేస్తుందన్నది కొంతమంది నమ్మకం. ఆ నమ్మకమే మాకు రక్షని ఆస్తికులు చెబుతుంటారు. యువత కూడా వీటిని ధరించడానికి ఇష్టపడుతున్నారు.యువకులు ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని రుద్రాక్షని కొనుగోలు చేస్తున్నారు.విద్యార్థులు తల్లిదండ్రుల కోరిక మేరకు వీటిని ధరిస్తున్నారు. రుద్రాక్షకి శక్తులు ఉన్నాయని, అరుదైన రుద్రాక్షలు మానసిక ఆందోళన నుంచి విముక్తి కలిగిండంతో పాటు చక్కని ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని రుద్రాక్ష థెరపిస్ట్‌లు అంటున్నారు.


రుద్రాక్షలను చూసినా సరే.. తాకినా సరే..ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ‘శ్రీమద్‌ దేవీ భాగవతంలో పేర్కొన్నారు. రుద్రాక్ష ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినట్లు సాక్ష్యాలూ ఉన్నాయి. మానవ జీవితంలో రుద్రాక్షల వల్ల కలిగే ప్రయోజనాలు వర్ణించలేనివని ఇంగ్లాండ్‌కు చెందిన పాల్‌హ్యామ్‌ తన పరిశోధనలో పేర్కొన్నారంటే వీటి ప్రాధాన్యతను ఊహించుకోవచ్చు.హిమాలయాలలోని ‘ఇలా ఓకార్పస్‌ గని ట్రస్‌’ అనే చెట్ల పండ్లు సేకరించి వాటిలోంచి రుద్రాక్షలను అందిస్తు న్నారు. రుద్రాక్షల్లోని శక్తి వాటిని ధరించిన వారిని ప్రభావితం చేస్తాయన్న నమ్మకంతో యువ తరం కూడా వాటిని ధరించేం దుకు ఆసక్తి చూపుతోంది. వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని చక్కగా తీర్చిదిద్దడంలో వివిధ రకాల రుద్రా క్షలు శక్తి స్వరూపిణిలుగా, శివుని మూడో కన్నుగా అద్భు తమైన ఫలితాలనిస్తాయి.

రుద్రాక్షల ప్రభావం...
ఒక్కో రుద్రాక్షకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. వివిధ రకాల దేవతలు, గ్రహాల పరిస్థితులు, ప్రభావాలకు అనుగుణంగా ఒక్కొక్క రుద్రాక్ష పనిచేస్తుంది. తాము అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు వీటిని వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. రుద్రాక్షల ప్రభావంపైనా, ఫలితాలపైనా రుద్రా లైఫ్‌ అనేక రకాల ప్రయో గాలు చేసి ప్రపంచంలోనే అత్యుత్తమ రుద్రాక్ష సంస్థగా గుర్తింపు పొందింది. నేపాల్‌లో ఉండే రుద్రాక్ష చెట్లను పోలిన త్రయంబకేశ్వర్‌ ప్రాంతం లోని రుద్రాక్ష చెట్లను రుద్రా లైఫ్‌ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే అక్కడి చెట్లపై రుద్రాలైఫ్‌ పరిశోధనలు చేస్తోంది. ఏక ముఖి, ద్విముఖ, త్రిముఖ, చతుర్ముఖ, పంచముఖ, షణ్ముఖ, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి, ఏకాదశముఖి, ద్వాదశ ముఖి, త్రయోదశముఖ, చతర్ధశ ముఖ, గణేష్‌, గౌరీశంకర రుద్రాక్షలు ఉన్నాయి. అన్ని రకాల రుద్రాక్షలతో కలిసి రూపొందించే ఇంద్రమాల శక్తి ప్రభావం అధికంగా ఉంటుంది.

విద్యార్ధుల కోసం ప్రత్యేక మాలలు...
నేడు విద్యార్ధుల కోసం వివిధ రకాల రుద్రాక్ష మాలలు లభిస్తుండడం విశేషం. వీటిలో సరస్వతీ బంద్‌ ,గణేష్‌-లక్ష్మీ బంద్‌, వస్తు బంద్‌, రక్షా బంద్‌, దుర్గా శక్తినిచ్చే బ్రేస్‌లెట్‌, ధ్యానయోగమాల, సిద్ధమాల, ఇంద్రమాలలు లభ్యమవు తున్నాయి. సిద్ధమాల ధర్మ, అర్థ, కామ, మోక్ష అంశాలకు ప్రతిబింబంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇందులో ఏకముఖి, 14 ముఖి రుద్రాక్షలను పొందుపరిచారు. సాధారణంగా చతుర్ధశముఖి రుద్రాక్షలే లభిస్తుంటాయి. ఈ ప్రదర్శనలో ఏకముఖి నుంచి ద్విఏకాదశముఖి రుద్రాక్షలు కలిగిన ఇంద్రమాల ఉన్నాయి. రుద్రాక్ష అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది.రుద్రాక్ష ధరించాలని చాలామంది కోరుకుంటారు.కానీ నాణ్యమైన రుద్రాక్షలను ధరిస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయన్న విషయాన్ని ప్రజలు గమనించాలి.

మానసిక ఆందోళన నుంచి విముక్తి
అరుదైన రుద్రాక్షలు మానసిక ఆందోళన నుంచి విముక్తి కలిగించడంతో పాటు చక్కని ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.సుఖమైన జీవనాన్ని ప్రసాదించే రుద్రాక్షను శివుడు మూడో కన్నుగా భావిస్తారు. ఇక ఈ రుద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి. ఏక ముఖి నుంచి ద్వి ఏకాదశముఖి రుద్రాక్షల వరకే గాకుండా గౌరీ శంకర, గణేష్‌, త్రిజుటి తదితర రకాలు కూడా నేడు లభిస్తు న్నాయి. ఇవేగాకుండా క్రిస్టల్‌తో రూపొందించిన శ్రీ యంత్ర, శివలింగ్‌ సంబంధిత మాలలకు సైతం ఎన్నో మహిమలు ఉన్నాయి. నేపాల్‌లోని హిమాలయ శ్రేణుల్లో, ఇండోనేషియా, శ్రీలంక, మలేషియా ప్రాంతాలలో లభ్యమయ్యే ఒకో రుద్రాక్షకు ఒకో ప్రాధాన్యత ఉండడం విశేషం.



రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.

7, జులై 2013, ఆదివారం

రుద్రుని ప్రతిరూపాలు రుద్రాక్షలు


రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.

రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.

తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు. అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది. నొసటన విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది.

రుద్రాక్షలను సర్వపాపములనూ నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు మునులు. మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షలపై ఉండే ముఖాల ఆధారంగా రుద్రాక్షలను ఇరవయ్యొక్క రకాలుగా విభజించారు. రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి,

1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.
3. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.
5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.
6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.

రుద్రాక్షమాల ధారణవిధి:-
సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించిన వెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుతెన్నులు చూస్తే ఫలితం ఉండదు. సత్వర ఫలితాన్ని ఆశించేవారు, రుద్రాక్షల పూర్తి సమాచారాన్ని సేకరించి, సిసలైన పద్ధతి ప్రకారం, గురువు సమక్షంలో ధరించి, సాధన చేయాలి.

రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు:-
పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం మహాశ్రేష్టం. రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయి. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాందపూరాణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనేషియా, నేపాల్ మొదలైన చోట్ల, ఇండియాలో చాలా కొద్ది ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.

జన్మనక్షత్ర రీత్యా  ధరించవలసిన రుద్రాక్షలు:-

నక్షత్రము      ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని           నవముఖి
భరణి             షణ్ముఖి
కృత్తిక            ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి           ద్విముఖి
మృగశిర        త్రిముఖి
ఆరుద్ర           అష్టముఖి
పునర్వసు      పంచముఖి
పుష్యమి        సప్తముఖి
ఆశ్లేష            చతుర్ముఖి
మఖ            నవముఖి
పుబ్బ          షణ్ముఖి
ఉత్తర           ఏకముఖి, ద్వాదశముఖి
హస్త           ద్విముఖి
చిత్త            త్రిముఖి
స్వాతి         అష్టముఖి
విశాఖ        పంచముఖి
అనురాధ    సప్తముఖి
జ్యేష్ఠ          చతుర్ముఖి
మూల       నవముఖి
పూర్వాషాఢ     షణ్ముఖి
ఉత్తరాషాఢ       ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం            ద్విముఖి
ధనిష్ట             త్రిముఖి
శతభిషం         అష్టముఖి
పూర్వాభాద్ర     పంచముఖి
ఉత్తరాభాద్ర      సప్తముఖి
రేవతి             చతుర్ముఖి


రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.

5, జులై 2013, శుక్రవారం

సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు

రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.
మమూలుగా మనం రుద్రాక్షని మెడలో లేదా మనికట్టుదగ్గర ధరిస్తాము. రుద్రాక్ష ద్వార నీరు శరీరం పై పడితే మంచిది.శివ భక్తులు రుద్రాక్ష ధారణ తప్పనిసరి. ఈ రుద్రాక్షల గురించి తెల్సుకొందాం.

సాధారణంగా 5ముఖాలనుండి 16ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి. పాలలో కాని, నీటిలో కాని రుద్రాక్షలను వేస్తే అవి మునుగుతాయి. బరువులేని, లేతరంగు రుద్రాక్షలను ధరించకూడదు. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నలిపి, అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదిక్షణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలు అని గమనించాలి. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షణంగా తిరుగుతాయి, అటువంటి రుద్రాక్షలను గృహస్థులు ఉపయొగించరాదు.

ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం, ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం, త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రరూపం, షన్ముఖి రుద్రాక్ష కార్తికేయస్వరూపం, సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం, అష్టముఖి రుద్రాక్ష రుద్రభైరవ రూపం, నవముఖి రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం, ఇది దొరకడం చాల కష్టం. దీనిలో విద్యా, ఙ్ఞాన, క్రియా, శాంత, వామ, జ్యేష్టా, రౌద్రా, అంగ, పశ్యంతీ అను నవ శక్తులు ఉంటాయి. అందుకే నవముఖి రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపం. దశముఖి రుద్రాక్ష విష్ణు స్వరూపం, ఏకాదశముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశరూపం, ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్యరూపం. ఈ విధంగా రుద్రాక్షలకు దేవతా స్వరూపములకు దగ్గర సంబందం ఉంది.
      
             ధనం, శాంతి , కోరికలు, విజయాలను సిద్దింపజేయటానికి రుద్రాక్ష ధారణ ఉత్తమ మార్గమని శివ పురాణం చెపుతోంది. ఈ రుద్రాక్షల్లో ప్రధానంగా నాలుగు రకాలున్నాయి. మొదటిది రుద్రాక్ష, రెండోది భద్రాక్ష, మూడోది సాద్రాక్ష, నాలుగోది రౌద్రాక్ష. వీటిలో ఒక ముఖం నుండి 14 ముఖాలు కలిగినవి సాధారణంగా ఉంటాయి. అయితే అంతకన్నా ఎక్కువ ముఖాలు కలిగినవి కూడా ఉండవచ్చు. రుద్రాక్ష ముఖాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి.

ఏకముఖి రుద్రాక్షను చూడటం వల్లే పాపాలు నశించి లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. ద్విముఖిని ధరిస్తే పాపనాశనం కలిగి కోరికలు నెరవేరతాయి. త్రిముఖి రుద్రాక్షను పూజించినా ధరించిన సర్వ కార్యాలు సిద్దిస్తాయి. చతుర్ముఖి రుద్రాక్షను తాకినా చూసినా సకల పాపాలు నశిస్తాయి. పంచముఖిని ధరిస్తే పాపనాశనం జరిగి మోక్షం కలుగుతుంది. షణ్ముఖి రుద్రాక్షను కుడి భుజాన ధరిస్తే సర్వ పాపాలు నశించి శుభం చేకూరుతుంది. సప్తముఖి ధరిస్తే దరిద్రం నశించి ధనవంతులవుతారు.

        అష్ట ముఖి రుద్రాక్షను ధరించటం వల్ల దీర్ఘాయుష్కులవుతారు. నవముఖి రుద్రాక్ష నవ దుర్గ రూపి. ఎడమ చేతిన ధరిస్తే శివతుల్యత్వం వస్తుంది. దశముఖి రుద్రాక్షను ధరించినవారికి సకల కోరికలు నెరవేరతాయి. ఏకాదశముఖి రుద్రాక్ష వల్ల అనుకున్నవి అన్నీ నెరవేరతాయి. ద్వాదశ ముఖి రుద్రాక్షను ధరించటం వల్ల తేజస్సు కలుగుతుంది. త్రయోదశముఖి, చతుర్థముఖి రుద్రాక్షల వల్ల సకల కోరికలు నెరవేరతాయి. ఇక రుద్రాక్షలున్న మాలతో జపం చేసే వారికి మాలలో రుద్రాక్ష సంఖ్యను బట్టి ఫలితాలు చేకూరతాయి.

25 రుద్రాక్షలున్న జపమాలతో జపం చేస్తే ముక్తి వస్తుంది. 27 రుద్రాక్షలున్న జపమాలతో జపం చేసిన వారికి పుష్టి కలుగుతుంది. 54 రుద్రాక్షలున్న జపం చేస్తే హృదయానికి మంచిది. 108 రుద్రాక్షలు గల జపమాలతో జపం చేస్తే అనుకున్నవన్నీ జరుగుతాయి. రుద్రాక్షను మెడలోగానీ, చేతికి గానీ , నడుముకు గానీ కట్టుకోవాలి. పిల్లలకు ధరింప చేస్తే బాలారిష్ట దోషాలు పోవటమే కాక అనారోగ్యాలు పోయి ఆరోగ్యవంతులవుతారు. 



రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.

28, ఏప్రిల్ 2013, ఆదివారం

రుద్రాక్ష - ఉపయోగాలు - ధారణానియమాలు



రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.
ఓం నమ: శివాయ: 
రుద్రాక్షమాలయా మంత్రోజప్త్యోనంత ఫలప్రద:
 యస్యాన్గే నాస్తి రుద్రాక్ష ఏక్యోపి
 బహుపుణ్యపద: తస్య జన్మ నిరర్ధక: 

 ఆధ్యాత్మికతతో, ప్రేమపూరకమైన భక్తితో, భక్తి వైరాగ్యంతో నిండిపోయుండే భారతీయుడి హృదయానికీ, రుద్రాక్షకూ అవినాభావ సంబంధం ఉంది. ఈ సంబంధం భక్తుడికీ, భగవంతునికీ ఉన్న సంబంధంవంటిది. రుద్రాక్షను భగవంతునికి ప్రతిరూపంగా భావించే సంప్రదాయం ఆది కాలంనుండీ మనకు వస్తూనే ఉంది. ఇది కేవలం సంప్రదాయంగానే కాక అనేక విశ్వాసాలకు ప్రతిరూపంగా కూడా ఉండడంతో కుల మత ప్రమేయం లేకుండా వీటిని భారతీయులు ధరిస్తుంటారు. ఇవి అత్యంత శక్తివంతమైనవనీ, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదనే భావన ఉండడంతో వీటికి గిరాకీ ఎక్కువ. చాలా అరుదుగా లభించే రుద్రాక్షలంటే ఎవరైనా ఆరాటపడుతూనే వుంటారు. ఎక్కడ రుద్రాక్షల అమ్మకాలు జరుగుతున్నా వాటికోసం ఎగబడుతుంటారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులుపడుతున్నవారు, వ్యాపారపరంగా కలసిరానివాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారే కాక అద్భుత భవిష్యత్తును ఆశించేవారు కూడా ముందుచూపుగా ఈ రుద్రాక్షలను ధరిస్తుంటారు.

 ''స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్
 భక్తానాం ధారణత్పాపం దివారాత్రికృతం హరేత్
 లక్షం తు దర్శనాత్పుణ్యం కోటిస్తద్ధారణాద్భవేత్" 
  అని రుద్రాక్షమాల గురించి "జాబాలోపనిషత్"లో పేర్కొనబడింది. 
అంటే 'భక్తులను అనుగ్రహించేందుకు రుద్రాక్షలు స్థావరాలుగా అవతరించాయి. వీటిని ధరించినటువంటి భక్తులు ఏరోజు చేసిన పాపాలు ఆ రోజే నశిస్తాయి. రుద్రాక్షలను దర్శించడం వల్ల లక్ష జన్మల పుణ్యం, ధరించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందీ అని అర్ధం.

  రుద్రాక్ష చెట్టు "ఎలయో కార్పస్" వర్గానికి చెందినది. రుద్రాక్షలకు నేపాల్ పుట్టినిల్లు. నేపాల్‌లోని పంచక్రోశి సమీపంలోని రుద్రాక్షారణ్యంలో మొదటిసారిగా రుద్రాక్ష జన్మించినట్లు చెప్పబడుతూ ఉంది. సంహరించడంతో నేపాల్, బెంగాల్, అస్సాం, మధ్య ప్రదేశ్, ముంబై ప్రాంతాల్లో ఈ చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఈ చెట్టు 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పూలు తెల్లగా ఉండి ఆకులకన్నా చిన్నవిగా ఉంటాయి. ఈ చెట్టు ఫిబ్రవరిలో పూతకు వస్తుంది.  

రుద్రాక్షకు ఆ పేరు ఎలా వచ్చింది? 
 రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో ఫోరాడి, మూడు పురములను భస్మం చేసినపుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటినుంచి నుంచి పుట్టినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్ధము. శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు. తంత్ర శాస్త్ర ప్రకారం రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవి.  

"ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేతదుదాహృతం
 బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే బుధై:
 అధమం చణమాత్రం స్యాత్ప్రక్రియైష మయోచ్యతే"

  అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా పేర్కొనబడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణమును కూడా గమనించాల్సివుంటుంది. రుద్రాక్షలు రకరకాల పరిమాణాల్లో ఉన్నట్లే రకరకలైన రంగుల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా తెలుపు, తేనె, నలుపు రంగులతోపాటు మిశ్రమ రంగుల్లో ఇవి లభ్యమవుతాయి. సాధారణంగా తేనె రంగులోని రుద్రాక్షలు ఎక్కువగా లభిస్తాయి.  

రుద్రాక్షలలో వివిధ ముఖాలు కలిగినవి లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొనబడినప్పటికీ, పండితులు మాత్రం 21 ముఖాలు వున్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది. వాటి వివరాలు, ఉపయోగాలు : 

 1) ఏకముఖి రుద్రాక్ష : ఇది శివుని ప్రతిరూపం. ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి. 
 2) ద్విముఖి : అర్ధనారీస్వర తత్వానికి సంకేతం. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.
  3) త్రిముఖి : ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.
  4) చతుర్ముఖి : బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. విద్యార్ధులకు బాగా ఉపకరిస్తుంది. 
 5) పంచముఖి : గుండె జబ్బులున్నవారికి మంచిది. శతృవులను సులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.
  6) షణ్ముఖి : కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి. 
 7) సప్తముఖి : కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించద 
 8) అష్టముఖి : విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది. 
 9) నవముఖి : భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి. 
 10) దశముఖి : జనార్ధనుడికి పరీక్ష. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. 
 11) ఏకాదశముఖి : 11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తులనుంచి కాపాడుతుంది. 
 12) ద్వాదశముఖి : 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.  
13) త్రయోదశముఖి : కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.  14) చతుర్దశముఖి : 14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను. 
 15) పంచదశముఖి : పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది. 
 16) షోడశముఖి : 16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక. 
 17) సప్తదశముఖి : విశ్వకర్మకు ప్రతీక. దీని వలన సంపద కలుగుతుంది. 
 18) అష్టాదశముఖి : 18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.  
19) ఏకోన్నవింశతిముఖి : 19 ముఖాలు. ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం. 
 20) వింశతిముఖి : 20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం. 
 21) ఏకవింశతిముఖి : 21 ముఖాలుగల రుద్రాక్ష. ఇది కుబేరునికి ప్రతీక. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు. జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి. 

 రుద్రాక్షలు ధరించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వేటినిబడితే వాటిని ధరించకూడదు. ఎందుకంటే వీటిలో నకిలీవే ఎక్కువుంటాయి. ప్రజల మానసిక దౌర్బల్యాన్ని తమ స్వార్ధం కోసం వినియోగించుకునేవారే నేడు ఎక్కువ. నకిలీ రుద్రాక్షలనే అసలు రుద్రాక్షలుగా చిత్రీకరించి అమ్మే బూటకపు సిద్ధాంతులు, వ్యాపారస్తులపట్ల ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి.

  నిజమైన రుద్రాక్షలను గుర్తించడానికి కొన్ని పద్ధతులున్నాయి. అవి: 
 1) ఏకముఖి రుద్రాక్షలు ప్లాస్టిక్ లో వస్తాయి జాగ్రత్త వహించాలి. 
 2)ఏకముఖి రుద్రాక్షలు కెమికల్స్ తో కూడ వస్తాయి జాగ్రత్త వహించాలి.
  3)"7"ముఖాల రుద్రాక్ష దగ్గర నుండి పెద్ద ముఖాల రుధ్రాక్షలు గీతలు చెక్కుతారు గమనించాలి.
  4)రుధ్రాక్షకు ఏటువంటి పరీక్షలు గాని ఉండవు అనుభవంతో మాత్రమే గమనించాలి.  పై పరీక్షలను చేయడం ద్వారా నిజమైన రుద్రాక్షను నిర్ధారించడం ఉత్తమం. 

 రుద్రాక్ష ధారణా నియమాలు :  
   సరైన రూపంలో లేని రుద్రాక్షలను, ముల్లులేని రుద్రాక్షలను, పురుగులు తిన్న, పాడైపోయిన రుద్రాక్షలను ధరించరాదు. వీటిని అన్ని జాతుల, కులాలవారు ధరించవచ్చు. వీటిని బంగారం, వెండి, రాగి తీగెలతోగానీ, సిల్కు దారముతోగూర్చిగానీ ధరించాలి. రుద్రాక్ష్లను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.  
  సంభోగ సమయంలో వీటిని ధరించకూడదు. ఒకవేళ ఆ సమయంలో పొరపాటున ధరించిన యెడల తరువాత వాటిని ఆవు పాలతో శుద్ధి చేయాలి. రుద్రాక్షను ధరించేముందు "ఓం నమశ్శివాయ" శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి.   

 సంవత్సరానికి ఒక్కసారైనా మాలకు 'మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం' చేయడం మంచిది. వీలైనంత వరకు శివరాత్రి చేయడం మంచిది. రుద్రాక్షలు ధరించిన వారు ధూమపానం, మద్యపానం చేయరాదు. వెల్లుల్లి, మాంసాహారమును మానివేయడం మంచిది.  

వివిధ రకాలైన సమస్యలతో బాధపడేవారు, వివిధ నక్షత్రాలు, రాసులవారు పండితుల సలహా మేరకు ఆయా ముఖాల రుద్రాక్షలను ధరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఇవి వివిధ వ్యాధులను నయం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ప్రధానంగా రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, మూర్చ, జలుబు, గొంతు వాపు అజీర్ణం, శ్వాసకోశ వ్యాధులు మొదలైన వ్యాధులకు రుద్రాక్ష ఉపయోగపడుతుంది.

  భారతీయ ఆధ్యాత్మిక సంపదలో భాగమైన రుద్రాక్షలు ధరిస్తే పునర్జన్మ ఉండదని భారతీయులు విశ్వసిస్తారు. ఆత్మ నిగ్రహానికీ, ఆత్మ సౌందర్యానికీ, మానసిక ప్రశాంతతకూ శక్తి వాహకాలైన వీటి ధారణ యోగ శక్తి పెంపొందించుకునేందుకూ, నిర్మలమైన, నిశ్చలమైన జీవితాన్ని సాగించేందుకూ తోడ్పడుతాయి. 

రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.

3, జనవరి 2013, గురువారం

రుద్రాక్షలు


రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.
 శివుని అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమి మీదకు జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారి వాటికి కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి.ఋషులు,మునులు,రాక్షసులు మరియు దేవతలు అందరూ వీటిని ధరించువాఋ అనీ పురాణాది ఇతిహాసములలో తెలుయుచున్నది.. ఇప్పటికీ స్వాములు,బ్రాహ్మణులూ,పూజారులు,దైవజ్ఞులు,గురువులు మొదలగువారు వారు వీటిని ధరిస్తూవుంటారు.మరయు పుజగ్రుహములలో కూడా వీటిని పెట్టి పూజిస్తూ వుంటారు. 
  వీటిలో చాల రకముల రుద్రాక్షలు వున్నాయి ఒకొక్కటి ఒకొక్క విశిష్టతను కలిగి వుంటాయి. ఇవి ఒకటి నుంచి పదిహేను పద్దెనిమిది రకముల వరకూ వుండు అవకాశమున్నది. 

1. ఏఖ ముఖి ఇది అత్యంత విలువ కలిగినది దీనిని ప్రత్యక్ష శివుని రూపముగా భావించుతారు. 

2. ద్విముఖి  ఇది అర్ధనారిస్వరులు [శివ పార్వతులు] గా భావిస్తారు. 3.త్రి ముఖి దీనిని శివ,విస్ట్నుభ్రహ్మ, రూపముగా భావిస్తారు. 
4. చతుర్ ముఖి దీనిని బ్రహ్మ స్వరూపమని కొందరు చతుర్ వేదాల స్వరూపమని కొందరు భావిస్తారు.
 5. పంచ ముఖి దీనిని పచముఖ రూపముగా లక్ష్మి స్వరూపముగా భావిస్తారు.
 6. షణ్ముఖి ఇది ప్రత్యక్ష కుమారస్వామి [కార్తికేయ] రూపముగా భావిస్తారు.
 7. సప్త ముఖి కామధేను స్వరూపము గా భావిస్తారు. 
8. అష్ట ముఖి గణనాధుని[విఘ్నేశ్వర] స్వరూపముగా భావిస్తారు. 
9. నవముఖి నవగ్రహస్వరూపముగానె కాక ఉపాసకులకు మంచిదని భావిస్తారు. 
10.దస ముఖి దీనిని దశావతార రూపముగా విశేసించి స్త్రీలు వీటిని ధరిచుట మంచిదని భావించుట జరుగుతున్నది.
 

మేష లగ్నం,మేష రాశి వారికి,మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి "3"ముఖాల రుద్రాక్ష గాని,"1","3","5"ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును."పగడంస్టోన్"ధరించవచ్చును.
 

వృషభ లగ్నం వారికి,రాశి వారికి ,భరణి,పుబ్బ ,పూర్వాషాడ నక్షత్రాల వారికి "6" ముఖాల రుధ్రాక్ష గాని, "4","6","7" ముఖాలు కలిగిన రుధ్రాక్షలు గాని కవచం లాగ థరించ వచ్చును."డైమండ్ స్టోన్"ధరించ వచ్చును.
 

మిథున లగ్నం వారికి ,రాశి వారికి ,ఆశ్లేష ,జ్యేష్ట ,రేవతి నక్షత్రాల వారికి "4" ముఖాల రుధ్రాక్ష గాని,"4',"6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచం లాగ గాని థరించ వచ్చును."ఆకుపచ్చ స్టోన్"ధరించ వచ్చును. 

కర్కాటక లగ్నం వారికి ,రాశి వారికి, రోహిణి,హస్తా ,శ్రవణం, నక్షత్రాల వారికి "2"ముఖాల రుధ్రాక్ష గాని ,"2","3","5", ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచంలాగ గాని ధరించ వచ్చును."ముత్యం స్టోన్"ధరించ వచ్చును.

 సింహా లగ్నం వారికి,రాశి వారికి, కృత్తిక,ఉత్తర ,ఉత్తరాషాడ నక్షత్రాల వారికి "1"ముఖం గాని, "1","3","5", ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."కెంపు స్టోన్"ధరించ వచ్చును.
 

కన్య లగ్నం వారికి,రాశి వారికి ,ఆశ్లేష,జ్యేష్ట, రేవతి,నక్షత్రాల వారికి "4"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."ఆకుపచ్చ స్టోన్"ధరించ వచ్చును. 

తులా లగ్నం వారికి, రాశి వారికి,భరణి,పుబ్బ,పూర్వషాడ,నక్షత్రాల వారికి"6"ముఖాల రుధ్రాక్ష గాని ,"4','6","7"ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును.."డైమండ్ స్టోన్"ధరించ వచ్చును.
 

వృశ్చిక లగ్నం వారికి, రాశి వారికి, మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి "3"ముఖాల రుధ్రాక్ష గాని,"2","3","5"ముఖాల రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.."పగడంస్టోన్"ధరించవచ్చును. 

థనస్సు లగ్నం వారికి, రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాధ్ర, నక్షత్రాల వారికి "5"ముఖాల రుధ్రాక్ష గాని "1",'3","5"ముఖాల రుధ్రక్షలను కవచం లాగ థరించ వచ్చును."కనక పుష్యరాగం స్టోన్"ధరించ వచ్చును.

 మకర లగ్నం వారికి,రాశి వారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి "7"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."నీలం స్టోన్"ధరించ వచ్చును.
 

కుంభ లగ్నం వారికి, రాశివారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి"7"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7"ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."నీలం స్టోన్"ధరించ వచ్చును.

 మీన లగ్నం వారికి,రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాథ్ర నక్షత్రాల వారికి"5"ముఖాల రుధ్రాక్ష గాని,"2","3","5"రుధ్రాక్షలను కవచం లాగ ధరించ వచ్చును. "కనక పుష్యరాగం స్టోన్"ధరించ వచ్చును.


రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.
 

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...