శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Social Media Buttons

Follow by Email

Wednesday, September 5, 2012

నవగ్రహచార ఫలములు - శుక్రుడు

శుక్ర గ్రహము

శుక్ర గ్రహ లక్షణములు :
శుక్రుడు స్త్రీగ్రహం. ఇతను రుచులలో పులుపును, రంగులలో తెలుపు రంగును సూచించును. ఇతను బ్రాహ్మణ జాతికి చెందినవాడు. అధిదేవత ఇంద్రాణి, 7 సంవత్సరముల వయస్సు కలవారిని సూచించును. మనోహరమైన శరీరము, నల్లని వెంట్రుకలు కలవారిని, అందమైన వారిని సూచించును. ఇతను శ్లేష్మ, వాత తత్త్వములను సూచించును. జలతత్త్వము కలిగి ఆగ్నేయదిక్కును సూచించును. రత్నములలో వజ్రమును సూచించును. లోహములలో బంగారమును సూచించును. వసంతఋతువును సూచించును. ఈ గ్రహసంఖ్య 9. చతుర్థభావంలో దిగ్బలము పొందును. రజోగుణప్రధానమైన గ్రహము. కృష్ణానది నుండి గోదావరి వరకు ఇతని దేశంగా జాతక పారిజాతం సూచించును.
శుక్రుడు పుబ్బ, పూర్వాషాడ, భరణి నక్షత్రములకు అధిపతి. శరీరావయవములలో మూత్రపిండములు, అండములు, వీర్యము, సంతానోత్పత్తి వ్యవస్థను సూచించును. శుక్రుడు వృషభము, తుల రాశులకు అధిపతి. తులలో 10వ డిగ్రీ వరకు మూలత్రికోణము. ఇతనికి ఉచ్ఛరాశి మీనం. నీచరాశి కన్య. మీనంలో 27వ డిగ్రీ పరమోచ్ఛ. కన్యలో 27 వ డిగ్రీ పరమనీచ. ఇతనికి బుధశనులు స్నేహితులు. రవి, చంద్రులు శత్రువులు. కుజ, గురులు సములు. శుక్రదశ 20 సంవత్సరాలు.
శుక్రుని ప్రభావం :
అందమైనవారు, శరీరసౌష్టవం కలిగినవారు, సామాన్యంగా వీరికి బట్టతల యుండదు. సంగీతం అంటే ఆసక్తి ఎక్కువ. లలితకళలంటే ప్రీతి. జనాకర్షణ ఎక్కువ వీరికి సౌకుమార్యం చేత జనాకర్షణ ఉంటుంది. స్త్రీలోలత్వమును అదుపులో వుంచుకోవాలి. వీరు నటులు, గాయకులు.
వస్త్రములు, అలంకారసామాగ్రి, పూలు వంటి వాణీజ్యమున రాణిస్తారు. రక్తపోటు , రక్తసంబంధమైన వ్యాధులు సుఖవ్యాధులు కలుగవచ్చు.
శుక్రుని కారకత్వములు :
శుక్రుడు కళత్ర కారకుడు. శారీరక సుఖము, యౌవనము, సౌందర్యము, రాజసము, వినోదములు, రతిక్రీడలు, జలవిహారము, స్త్రీ, ఐశ్వర్యము, భూషణములు, నాటకము, మన్మధుడు, భరతనాట్యము, కామము, వీర్యము, కావ్యరచన, సంగీతం, వాహనములు, వస్త్రములు, శయినించు గది, వివాహం, గర్వం, తెల్లని వస్త్రములు, వాద్యముల సమ్మేళనం, సుగంధ ద్రవ్యములు, గౌరి, లక్ష్మీదేవి ఆలయములు, క్రీడాస్థలములు, పాలసరఫరా కేంద్రములు, పాలు, పాలకు సంబంధించిన వస్తువులు విక్రయించువారు, వస్త్రములను తయారు చేయు సంస్థలు, సౌందర్యసాధనములు, అలంకార ద్రవ్యములు, పరిమళద్రవ్యములు, వాటిని తయారు చేయు సంస్థలు, పెట్రోలు వాహనములు, వెండి, రత్నములను సూచించును. చెఱుకురసము, తీయని పానీయములు, బొబ్బర్లు, నిమ్మ, నారింజ, చింత మొదలగు వానిని సూచించును. అతిమూత్రవ్యాధి, చర్మవ్యాధి, కంటిరోగము గొంతుకు సంబంధించిన వ్యాధులు, సుఖవ్యాధులు, చర్మవ్యాధులును సూచించును.
శిల్పి, దర్జీ, స్త్రీ, బ్యుటీషియన్, స్వీట్లు తయారు చేయువారు, స్నేహితులు, బహుమతులు, హనీమూన్, విలాసాలు, వినోదాలు, శృంగారము, ప్రేమ, ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులు, పంచదార, ఆనందమును అనుభవించుట, కాస్మెటిక్స్, పూలు, అలంకరణ, గృహాలంకరణ సాదనాలు, లౌక్యము, స్నేహము, లాభము, ఒప్పందము, ప్రేమ, అనురాగము, అమమ్కారము, లలితకళలు, అందము, ఆకర్షణ, కేశాలంకరణ, సంగీతము, సాంస్కృతిక కార్యక్రమాలు, దానములు, పొగడ్తలు, పెళ్ళి, తెలివితేటలను సూచించును.
శుక్రుడు సూచించు విద్యలు :
శుక్రుడు లలితకళలు, కావ్యములు, రసాయనశాస్త్రము, ఫొటోగ్రఫీ, సెక్స్ సైన్స్ లను సూచించును. గురుబుధులతో కలసి రేడియో, ట్రాన్సిస్టర్, టేపురికార్డర్, వైర్ లెస్ లు వాటికి సంబంధించిన కోర్సులు, టెక్స్ టైల్స్, సుగంధ ద్రవ్యములు, అలంకార సామాగ్రి, వాటి తయారీకి సంబంధించిన నైపుణ్యము, టైలరింగ్, పెయింటింగ్ లను సూచించును. శుక్రుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు కలసి ఆటోమొబైల్ ఇంజినీరింగ్, గోల్డ్ స్మిత్ లను సూచించును.
శుక్రుడు సుచించు వ్యాధులు :
సుఖరోగాలు, కంటిజబ్బులు, మూత్రంలో అల్బుమిన్ పోవుట, స్త్రీలకు సంబంధించిన తెల్లబట్ట, పసుపుబట్ట, ఋతుక్రమం సరిగాలేకపోవుట, అండము అండాశయములకు కలిగే జబ్బులు మొదలగు అన్నిరకాల వ్యాధులను శుక్రుడు సూచించును. కుజునితో కలసి గొంతునొప్పి, గొంతువాపు, టాన్సిల్స్, గొంతు కాన్సర్ మొదలగు గొంతుకు సంబంధించిన వ్యాధులను, శనితో కలసి మితిమీరిన సంభోఅం వల్ల కలిగే వ్యాధులను, బుధునితో కలసి నపుంసకత్వం, కొజ్జాలతో సంభోగం, అసహజమైన శృంగార చేష్టలు, చర్మవ్యాధులు, మధుమేహం లను సూచించును. శుక్రుడు రాహువుతో కలసి సెక్స్ వలన కలిగే అంటురోగాలను, కేతువుతో కలసి అసహజమైన సెక్స్ వలన కలిగే ఇబ్బందులను నిస్సంతానాన్ని, శని, రాహువుతో కలసి ఎయిడ్స్ వ్యాధిని, గురువు, రాహువుతో కలసి యుటిరస్ కాన్సర్, సెర్విక్స్ కాన్సర్ ను సూచించును.
శుక్రుడు సూచించు వృత్తి వ్యాపారాలు :
సుగంధద్రవ్యములు, పట్టు వస్త్రములు అమ్మువారు, చాక్లెట్లు తయారు చేయువారు, హోటల్ వ్యాపారం, వాహనములు, పంచదార, ఉప్పులను అమ్మువారు, పాలు, నెయ్యి, రాగి, అభ్రకం, గాజు, ఫాన్సీవస్తువులు, గంధపునూనె, ర్టసాయనాలు, ప్లాస్టిక్, కలప, రబ్బరులతో కూడిన వ్యాపారాలు చేయ్వారిని శుక్రుడు సూచించును. సినిమా డైరెక్టర్, మేకప్ మేన్, నటులు, పాటలు పాడువారు, సంగీత విద్వాంసులు, చిత్రకారులు, ఫొటోగ్రాఫర్లు, నిర్మాతలను సూచించును. పెట్రోలు బంకు, కార్లు, విమానాలు, లారీలు, రైలు, టాక్సీ, ఆటోమొబైల్, సినిమా, పశువులు, ఆహారములకు సంబంధించిన సంస్థలను, వాటిలో పనిచేయువారిని సూచించును.
శుక్రునకు మిత్రులు : బుధ శని రాహు కేతు
శుక్రునకు శత్రువులు : సూర్య చంద్ర
శుక్రునకు సములు: మంగళ గురు


Related Posts Plugin for WordPress, Blogger...