శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

19, సెప్టెంబర్ 2012, బుధవారం

గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలములు - శుక్రుడు

శుక్ర:-

శుక్రుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్ధములయందున్న ఫలము :

శుక్రుడు లగ్నమునందున్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందర శరీరుడు, సుఖీ, చిరంజీవి అగును. శుక్రుడు ద్వితీయమునందున్న జాతకుడు కవి - బహువిధములుగా ఆస్తులు కలవాడు అగును. శుక్రుడు తృతీయమందున్న భార్యాహీనుడు కష్టవంతుడు, బీదవాడు, దుఃఖి, అవిఖ్యాతుడు అగును. శుక్రుడు చతుర్ధమునయున్న జాతకుడు మంచి వాహనములు కలవాడు, మంచి గృహము కలవాడు, నగలు, వస్త్రములు, సుగంధద్రవ్యములు గలవాడుగనూ యుండును.

శుక్రుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ స్థానములయందున్న ఫలము :

శుక్రుడు పంచమమునయున్న జాతకుడు అపారధనవంతుడు, పరరక్షకుడు, బహుమేధావి, పుత్రులతో ఆశీర్వదింపబడినవాడు అగును. శుక్రుడు షష్టమమునయున్న జాతకుడు శతృవులు లేనివాడు, నిర్ధని, యువతీజనముచేత మోసగించబడినవాడు, విచారగ్రస్తుడు అగును. శుక్రుడు సప్తమమునయున్న జాతకుడు సత్కళత్ర సంపన్నుడు అయిననూ పరస్త్రీరతుడు, విగతకళత్రుడు. ధనవంతుడూ అగును. శుక్రుడు అష్టమమున యున్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడూ, రాజూ అగును.

శుక్రుడు భాగ్య, రాజ్య, లాభ, రిఃఫ స్థానములయందున్న ఫలము :

శుక్రుడు భాగ్యమునందున్న జాతకుడు భార్యా, సంతతీ, ఆప్తులూ కలిగి మరియూ రాజాశ్రయముచేత అభివృద్ధి చెందువాడునూ అగును. శుక్రుడు రాజ్యకేంద్రమునయున్న జాతకుడు మిక్కిలి ప్రఖ్యాతవంతుడు, మిత్రులు కలిగి ప్రభువుగనూ యుండును. సంతోషకరమగు వుద్యోగిగనూ యుండును. శుక్రుడు యేకాదశమునందున్న జాతకుడు పరాంగనాపరుడూ, బహుసుఖీ యగును. శుక్రుడు ద్వాదశమునందున్న జాతకుడు సురతసౌఖ్యప్రదుడు, ధనవంతుడూ యగును.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...