ప్రయాణ శుభ శకునములు
ప్రయాణమయివెళ్ళునప్పుడు వీణ, మద్దెల, సన్నాయి, తప్పెట, తాళములు, పుష్పములు, ముత్తయిదువలు, ఇద్దరు, నలుగురు బ్రాహ్మణులూ ,కర్ర పటుకోనిన శూద్రుడు, ఊరేగింపు, ఏనుగు, గుఱ్ఱము, ఏడ్చువారు లేక పీనుగ, ఆబోతు, అక్షతలు, బియ్యము, జొన్నలు, గోధుమలు, అన్నము , పిండివంటలు, కళ్ళు కావిళ్ళు,తేనే, గాజుల మలారము, పెరుగు, ఆహార పదార్దములు, మాంసము మొదలగు మంగళ ద్రవ్యములు కనిపించినచో ధనలాభము, శుభము, కళ్యాణము, వ్యాపార జయము అందు లాభము ఉద్యోగ లాభము జయము కల్గును. ప్రయాణమయి పోవునపుడు గ్రద్ద నోట ఆహరముంచుకొని 'కృష్ణా' యని యరిచినచో సకల శుభములు,సౌఖ్యము కలుగును. శుభ కార్యములు చేయుటకు ప్రారంభించునపుడును, గొప్ప పనులను గూర్చి ఆలోచించునప్పుడును గాడిద కూసిన యెడల శుభము కలుగును.
ప్రయాణమునకు దుశ్శకునములు
ప్రయనమాయిపోవునప్పుడు కర్ర,గొడుగు, పూల మూట జారిపదినాను, దెబ్బ తగిలినను, భోజనము చేసిపోవలయును, రేపు, పొండి నేను కూడా వచ్చెదనని అనుటయు, బహిష్టుయిన స్త్రీ యు, విధవ,కట్టెల మోపు,వట్టి కుండలు, కొత్త కుండలు, బొగ్గులు,పిల్లులు, బేసి సంఖ్య బ్రాహ్మణులూ, సరి సంఖ్య శూద్రులు, సాతానులు, జంగము, పెద్ద పొగ, మొండివాడు, కుష్టువాడు, ముక్కు లేని వాడు, గర్బిణీ స్త్రీ యార్తరవము, పెద్ద గాలి దుమ్ము,వాన చినుకులు, చమురు తలతో నున్నవాడు, ఎదురుగా తుమ్ముతున్నవాడు ఇత్యాదులు కనుపించిన ఆ ప్రయాణము మానుకొనుట మంచిది.
శుభ శకునములు | |||
ఒక
రాజు, ఇద్దరు బ్రాహ్మణులూ, వేశ్య స్త్రీ, పుత్రులతో స్త్రీ, కన్యకా,
ఏనుగు, గోవు, ఎద్దు, దంపతులు, నూతన వస్త్రాలు, చాకళ్ళు, నిండు కుండలు,
పాత్రలు, కల్లు, సారాయి లాంటి
మత్తు
పదార్థాలు, మాంసం, చెరకు, వీణ, మద్దెల లాంటి వాయిద్యాలు, సామాన్లు,
తెల్లని పూలు, తెల్లని ధాన్యం ఎదురు రావటం, మిత్ర వాక్యాలు పలకడం మంచిది.
|