శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com
జన్మలగ్నఫలములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జన్మలగ్నఫలములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, మార్చి 2014, శనివారం

లగ్నాలకు యోగ,శుభ,పాప గ్రహాలు.......


మనం పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, గ్రహ స్థితిని బట్టి మనం ఏ లగ్నంలో పుట్టా మో తెలుస్తుంది. పన్నెండు రాశుల వలెనే పన్నెండు లగ్నాలు ఉన్నా యి. లగ్నాలకు యోగకారక గ్రహాలు,ఆధిపత్యం వల్ల శుభ పాప గ్రహాలు.

1. మేషం:ఈ జాతకునకు శని, బుధ, శుక్రులు పాపులు, రవి, గురులు శుభులు. శని, గురు సంబంధం కలిసిన గురుడు శుభు డు కానేరడు. అట్లే శని కూడా శుభుడు కాడు. శని మారక గ్రహం.

2. వృషభం:ఈ జాతకునకు గురు, శుక్ర, చంద్రులు పాపులు అవుతారు. రవి, శనులు శుభులు. శని రాజయోగకారకుడు. గురునకు మారక లక్షణాలున్నాయి.

3. మిథునము:ఈ జాతకునకు కుజ, గురువులు పాపులు. శుక్రుడు శుభుడు. శని, గురులు చేరినచో ఫలితమునివ్వరు.

4. కర్కాటకము:ఈ జాతకునకు శుక్ర, శని, బుధ, కు, గురు లు పాపులు. కుజుడు రాజయోగకారకుడు, గురు, కుజులు రాజయోగాన్ని ఇస్తారు. శుక్రుడు మారకాన్ని కలిగిస్తాడు.

5. సింహం:ఈ జాతకునికి శని, బుధ , శుక్రులు పాపులు. అంగారకుడు రాజయోగాన్నిస్తాడు. గురు, శుక్రులు కూడిన ఫలితమివ్వరు. కుజ, గురులు కూడిన శుభయోగమిస్తా రు. ఈ జాతకునకు బుధు డు మారకమునిచ్చును.

6. కన్య:ఈ జాతకునకు గురు, రవి, కుజులు పాపులు, శని, బుధులు శుభులు. శని రాజయోగమునిస్తాడు. చంద్ర, బుధులు కూడా యోగాన్నిస్తారు. గురుడు మారకమునకు కారకుడు.

7. తుల:ఈ జాతకునకు గురు, రవి, కుజులు పాపులు. శని, బుధులు శుభులు. శని రాజయోగాన్నిస్తాడు. చంద్ర బుధులు కూడా రాజయోగాన్నిస్తారు. గురుడు మారకాన్నిస్తాడు.

8. వృశ్చికము:ఈ జాతకునకు బుధ, శుక్ర, శనిలు పాపులు. గురుడు శుభుడు. రవి, చంద్రులు శుభయోగాన్నిస్తారు. బుధుడు ఈ జాతకానికి మారకగ్రహం.

9. ధనస్సు:-ఈ జాతకులకు రవి, కుజులు శుభులు, శుక్రుడు పాపి, రవి, బుధులు రాజయోగకారకులు, శుక్రుడు మారకం చేయును.

10:మకరం:ఈ జాతకులకు కుజ-గురు-చం ద్రులు పాపులు. శుక్ర, బుధులు శుభులు. శు క్రుడు రాజయోగకారకుడు. శుక్రుడు, శని, బుధులతో కూడిన విశేష ఫలాన్ని ఇస్తాడు. ర వి మారకుడు కాదు. కుజుడు మారక గ్రహం.

11. కుంభం:ఈ జాతకునకు కుజ- గురు- చంద్రులు పాపులు. శుక్రుడు శుభుడు. కుజుడు రాజయోగకారకుడు, మారకుడును కూడా అవుతాడు.

12. మీనం:ఈ జాతకునకు రవి, శుక్రులు పాపులు. కుజ-చంద్రులు శుభులు. కుజ, గురులు రాజయోగాన్నిస్తారు. శని మారకగ్రహం.ఈ లగ్న ఫలితాలు, గ్రహములు శుభములైన శుభ ఫలితాన్ని, పాపులు పాప ఫలితాన్ని ఇస్తారు.

12, అక్టోబర్ 2013, శనివారం

మీన లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

మీనలగ్నానికి అధిపతి గురువు. మీనలగ్నానికి  చంద్రుడు, కుజుడు, గురువు కారక గ్రహములు.  కనుక శుభఫలితం ఇస్తాయి.  శుక్రుడు, సూర్యుడు, శని అకారక గ్రహములు.  అశుభఫలితాలు ఇస్తారు.  మీన లగ్నంలో ర్యాది గ్రహములు ఉన్నప్పుడు కలుగు ఫలితములు దిగువున ఉన్నాయి.

సూర్యుడు :- మీన లగ్నానికి సూర్యుడు షష్టాధిపతిగా అకారక గ్రహం ఔతాడు. లగ్నంలో సూర్యుడు ఉన్న కారణంగా పరిశ్రమించే గుణం, సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారు.శత్రువులకు భపడని స్వభావం, ఆత్మవిశ్వాసం, కార్యము నందు మనసు నిలిపి శ్రమించుట వీరి లక్షణాలు.  వైవాహిక జీవితంలో ఓడిదుడుకులు ఉంటాయి. సూర్యుడి సంపూర్ణ దృష్టి కారణంగా వ్యాపారం చేయాలన్న కోరిక ఉన్నా  ఉద్యోగములో సాఫల్యత లభిస్తుంది.


 చంద్రుడు :- మీన లగ్నంలో చంద్రుడు పంచమాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో ఉన్న కారణంగా వ్యక్తి జీవితం శుభప్రదం , సుఖప్రదంగా ఉంటుంది. చంద్రుడు లగ్నంలో ఉన్న కారణంగా సౌందర్యవంతుడుగా, ఆకర్షణీయంగా ఉంటాడు. ఆకర్షణీయమైన మాటలు కలిగి ప్రభావశాలిగా ఉంటాడు. మధుర భాషణ, ఆత్మ విశ్వాసం వీరి సొత్తు.తల్లితో స్నేహభావం, తల్లి సహకారం ఉంటాయి. చంద్రుడు పూర్ణ దృష్టితో బుధుడి రాశి అయిన కన్యను చూస్తున్న కారణంగా జీవిత భాస్వామి , సంతాన సుఖం సంతోషం కలుగుతాయి.


కుజుడు :- మీన లగ్నానికి కుజుడు రెండవ మరియి నవమాధిపతి ఔతాడు. మీనలగ్నస్థ కుజుని కారణంగా వ్యక్తి పరాక్ర వంతుడు, శక్తి శాలిగా ఉంటాడు. మొరటుతనం, ఆధ్యాత్మికతలో ఆసక్తి వీరి స్వంతం. ఇతరులకు సహాయపడే గుణం ఉంటుంది. ధనం కలిగి ఉంటారు. ధనమును వెచ్చించుటలో కడు జాగరూకత వహిస్తారు. లగ్నస్థ కుజుడు నాలుగు, ఏడు, ఎనిమిది స్థానముల మీద దృష్టి సారించడం వలన మిత్రులు భాగస్వాముల వలన లాభపడతారు. తల్లి , తల్లితో సమానులతో స్నేహం సహకారం లభిస్తుంది.


బుధుడు :- మీనలగ్నానికి బుధుడు చతుర్ధ, మరియు సప్తమాధిపతి ఔతాడు. పరుల దూషణకు గురి ఔతారు. పరిశ్రమించే గుణం కలిగి ఉండుట బుద్ధి కుశలతతో ధనం సంపాదించుట వీరి గుణం. పితృ సంపద అంతగా లాభం లేకున్నా స్త్రీకారణంగా వచ్చే సంపద విశేషంగా లాభించగలదు. మీన లగ్నం నుండి స్వస్థానాన్ని చూస్తున్న బుధుడి కారణంగా అనుకూలమైన జీవిత భాగస్వామి లభించి వారి నుండి సహాయ సకారాలు అందుకుంటారు.  వివాహ జీవితం సుఖమయంగా ఉంటుంది.


గురువు :- మీలగ్నానికి గురువు లగ్నాధిపతి మరియు దశమాధిపతి ఔతాడు. లగ్నాధిపతి కనుక రెండు కేంద్రాల ఆధిపత్య దోషం ఉండదు. అందంగా ఆరోగ్యంగా ఉంటారు. దయాస్వభావం వినమ్రత కలిగి అత్యంత భాగ్యవంతుడుగా ఉంటాడు. ధర్మబద్ధత, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు. లగ్నస్థ గురువు పంచమ, మరియు సప్తమ, నవమ భావాల మీద గురువు దృష్టి సారించడం వలన సంతానం తండ్రి సహకారం అందుకుంటారు. సుఖమయమైన  వైవాహిక జీవితం అనుభవిస్తారు.


శుక్రుడు :- మీన లగ్నానికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా అకారక గ్రహంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శుక్రుడి కారణంగా వ్యక్తి అందంగా , ఆకర్షణీయంగా ఉంటాడు. పిత్త వాత ప్రకృతి కలిగిన శరీరం. పనిలో నైపుణ్యం, పరాక్రమం, సాహసం కలిగి ఉంటారు. తల్లి నుండి సంతానం నుండి సహాయ సహకారం తక్కువ. సంతానం వలన కష్టములు కలుగుతాయి. శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూసే కారణంగా వైవాహిక జీవితంలో సాధారణ సుఖం లభిస్తుంది.


శని :- మీన లగ్నానికి శని లాభ వ్యయాధిపతిగా ఉంటాడు. లగ్నంలో శని ఉపస్థితి కారణంగా వ్యక్తి సన్నగా ఉంటాడు. స్వశక్తితో నిర్ణయించుకో లేక ఇతరుల నిర్ణయం మీద ఆధారపడతుంటారు.  శని ప్రభావం కారణంగా నేత్ర రోగస్తుడు అయ్యే అవకాశం ఉంటుంది.  వీరు స్వతంత్ర్య నిర్ణయం చేయ లేక ఇతరుల నిర్ణయం మీద ఆధారపడతాడు. షేర్లు, పందెం, లాటరీలు లాభిస్తాయి. అకస్మాత్తుగా ధనం లభిస్తుంది. లగ్నస్థ శని దృష్టి మూడవ స్థానమైన వృషభం , సప్తమ స్థానమైన కన్య మీద, దశమ స్థానమైన ధనస్సు మీద దృష్టి సారిస్తుంటాడు. మిత్రుల సహకారం లభించదు. జీవిత భాగస్వామి వలన హాని వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి.


రాహువు :- మీన లగ్నస్థ రాహువు వ్యక్తికి కండలు తిరిగిన శరీరం, చక్కని ఆరోగ్యం ఇస్తాడు. చతురత, సమయస్పూర్తి కలిగి ఉంటారు. వారి స్వార్ధం కొరకు  ఇతరులతో  మిత్రుత్వం  వహిస్తారు. సాహసముతో సమయస్పూత్రితో తమ కార్యములను సాధించుకుంటారు. లగ్నస్థ రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారించడం వలన సంతాన విషయంలో కష్టాలు, జీవిత భాగ స్వామికి అనారోగ్యం, గృహస్థ జీవితంలో కష్టాలు కలుగుతాయి.


కేతువు :- మీన లగ్నస్థ కేతువు వ్యక్తికి అనారోగ్యం కలిగిస్తాడు. నడుము నొప్పి వాత రోగములు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం తక్కువైన కారణంగా స్వయంగా నిర్ణయించుకో లేరు. కార్య సిద్ధి కొరకు సామాజిక నియమాలను అధిగమిస్తారు. కేతువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామికి కష్టాలు ప్రాప్తించే అవకాశం ఉంటుంది. వివాహేతర సంబంధాల కారణంగా వైవాహిక జీవితంలో కలతలు ఉంటాయి. ఆర్ధిక స్థితి సాధారణంగానే ఉంటుంది.

11, అక్టోబర్ 2013, శుక్రవారం

కుంభ లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

కుంభ లగ్నానికి సప్తమ స్థానాధిపతి సూర్యుడు, నవమస్థానాధిపతి శుక్రుడు, లగ్నాధిపతి శని శుభగ్రహాలు మరియు కారక గ్రహాలు. తృతీయాధిపతి అయిన కుజుడు, షష్టమాధిపతి చంద్రుడు, అష్టమస్థానాధిపతి బుధుడు అశుభగ్రహాలు అకారక గ్రహాలు. కుంలగ్నస్థ గ్రహాలు వాటి ఫలితాలు.

 సూర్యుడు :- కుంభ లగ్నం సూర్యుడి ఉపస్థితి వలన వ్యక్తికి ఆత్మవిశ్వాసం, అందం ఉంటుంది.  శ్వాస సంబంధ సమస్యలు ఉంటాయి. సామాన్యమైన ఆర్ధిక పరిస్థితి కలిగి ఉంటారు. సప్తమ స్థానం సూర్యుడి స్వస్థానం  అయిన  సింహం కనుక  జీవిత భాగస్వామి  అందంగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయసహకారాలు ఉంటాయి.  వర్తక, వ్యాపారాలలో త్వరగా సఫలత లభిస్తుంది.


చంద్రుడు :- కుంభలగ్నానికి చంద్రుడు అకారక గ్రహం. శీతల  ప్రకృతి కలిగిన శరీరం  కలిగి ఉంటారు. లగ్నంలో చంద్రుడు ఉన్న కారణంగా మనస్సు చంచలంగా ఉంటుంది.మనసు అంశాంతితో కూడుకున్నదై ఉంటుంది. కుటుంబంలో వివాదములు, కలహములు కలగడానికి అవకాశం ఉంది. సాహసము, పరాక్రమం ఎక్కువగా ఉంటుంది. కష్టపడి కార్యసాధన చేస్తారు. చంద్రుడి పూర్ణ దృష్టి సప్తమస్థానమైన సింహ రాశి మీద ఉంటుంది కనుక జీవిత భాగస్వామి అందంగా ఉండి మహత్వ కాంక్షతో వ్యవహరిస్తారు.

 కుజుడు :- కుంభ లగ్నస్థ కుజుడు తృతీయ, అష్టమాధిపతిగా అకారక గ్రహముగా అశుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో ఉన్న కుజుడు వ్యకి ధృఢమైన, బలమైన శరీరం కలిగి ఉంటాడు. ధైర్యం, సాహసం, పరాక్రమం అధికంగా ఉంటుంది. కఠిన పరిశ్రమకు ఓర్చి కార్య సాధన చేస్తారు. తండ్రి మరియు తండ్రి  వైపు బంధువుల నుండి తగిన సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటారు. స్వభావంలో ఉన్న ఉగ్రత కారణంగా సమస్యలను వివాదాలను అధికంగా ఎదుర్కొంటారు. లగ్నస్థ కుజుడు నాలగవ స్థానమైన వృషభం, సప్తమ స్థానమైన సింహం, ఎనిమిదవ స్థానమైన కన్యల మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి వ్యవహారిక జ్ఞానం కలిగి గుణవంతుడై ఉంటాడు. వైవాహిక జీవిత సుఖం సామాన్యంగా ఉంటుంది. కుజుడు పీడితుడై పాప సంబంధం ఉన్న ఏడల వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.

 బుధుడు :- కుంభ లగ్నస్థ బుధుడు పంచమాధిపతిగా, అష్టమాధిపతిగా అకారక మరియు అశుభ గ్రహంగా ఉంటాడు. లగ్నంలో బుధుడి ఉపస్థితి కారణంగా వ్యక్తి బుద్ధిమంతుడై జ్ఞానిగా ఉంటాడు. శిక్షారంగంలో సఫలత లభిస్తుంది. వీరి మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. జల ప్రదేశములు పడవ ప్రయాణాలు వీరికి ఆసక్తి కలిగిస్తుంది.
బుధ దశ వీరికి కష్టములు, సమస్యలు తెస్తాయి. ప్రధమంలో ఉన్న బుధుడు సింహరాశి మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామితో వివాదాలకు, అభిప్రాయ బేధాలకు చోటు ఉంటుంది. వివాహేతర సంబంధాలకు అవకాశం ఉంటుంది.


 గురువు :- కుంభ లగ్నానికి గురువు ద్వితీయ స్థానాధిపతిగా, లాభాధిపతిగా అకారక గ్రహంగా ఉంటాడు. లగ్నంలో గురువు ఉపస్థితి కారణంగా వ్యక్తి బుద్ధిమంతుడు, జ్ఞాని ఔతాడు. వీరికి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఉంటాయి. ధనసేకరణలో నైపుణ్యం కలిగి ఉండటం వలన ఆర్ధిక స్థితి స్థిరంగా ఉంటుంది. లగ్నస్థ గురువు పంచమ స్థానమైన మిధునం, సప్తమ స్థానమైన సింహం మీద, నవమ స్థానమైన తుఅ మీద దృష్టి సారిస్తాడు కనుక బంధు మిత్రుల నుండి జీవిత భాగస్వామి నుండి లాభం కలుగుతుంది. జీవితభాగస్వామి నుండి పుత్రుల నుండి సుఖం ప్రాప్తిస్తుంది. తండ్రి పక్షము నుండి సహాయసహకారాలు అందుకుంటారు.


శుక్రుడు :- కుంభలగ్నానికి శుక్రుడు సుఖ స్థానానికి, భాగ్య స్థానానికి అధిపతిగా ఉండి కారక గ్రహమై శుభఫలితాలు ఇవ్వాలి. లగ్నస్థ శుక్రుడి కారణంగా సౌందర్యం, ఆకర్షణ కలిగి ఉంటారు. వీరు బుద్ధి కుశలత, సుగుణ సంపద కలిగి ఉంటారు. వీరికి పూజలు, భజనలు, ధార్మిక కార్యాల యందు ఆసక్తి కలిగి ఉంటారు. తల్లి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. భూమి, భవనం, వాహన ప్రాప్తి కలిగి ఉంటారు. శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమస్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక వైవాహిక జీవితం బాధిస్తుంది. అభిప్రాయ బేధాలు తలెత్తగలవు.


  శని :- కుంభ లగ్నస్థ శని లగ్నాధిపతిగా ద్వాదశాధిపతిగా కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో శని ఉపస్థితి కారణంగా వ్యక్తి అరోగ్యవంతమైన రోగరహిత శరీరం కలిగి ఉంటాడు. శని లగ్నంలో ఉండి పరి పూర్ణ ఆత్మవిశ్వాసానికి కలిగి ఉండి గౌరవ ప్రతిష్టలు పొందుతారు. లగ్నస్థ శని తృతీయమైన మేషరాసిని, సప్తమ స్థానమైన సింహరాశిని, దశమ స్థానమైన వృశ్చికరాశి మీద దృష్టి సారిస్తాడు కనుక సోదరులతో, జీవిత భాగస్వామితో సమస్యలను ఎదుర్కొంటారు.


రాహువు :- కుంభలగ్నంలో రాహువు ఉంటే జీవితంలో ఓడిదుడుకులు ఉంటాయి. వీరికి రాహుదశాకాలంలో ఉదర సంబంధ వ్యాదులు ప్రాప్తిస్తాయి. వర్తక వ్యాపారాలలో సమస్యలు ఎదుర్కొంటారు. వ్యవసాయంలో ఆసక్తి ఉన్నా ఉద్యోగం అనుకూలిస్తుంది. ఆత్మవిశ్వాసం తక్కువ కనుక స్వయం నిర్ణయాలు చేసుకోలేరు. భాగస్వాముల వలన అదాయం తక్కువ. లగ్నస్థ రాహువు పూర్ణదృష్టిని సప్తమ రాశి అయిన సింహం మీద దృష్టిని సారిస్తాడు. కళత్ర స్థానమైన సింహం మీద రాహు దృష్టి ఉంటుంది కనుక జీవితభాస్వామితో అభిప్రాయబేధాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సుఖం తక్కవ.


కేతువు :- కుంభ లగ్నస్థ కేతువు ఉన్న వ్యక్తి జీవితం అస్థిరంగా ఉంటుంది. వీరి మనసు భోగలాలసత్వంతో కూడినదై ఉండుటుంది. తల్లి తండ్రులతో వివాదములు ఉంటాయి.స్త్రీలైన పురుషుల అందు పురుషులైన స్త్రీ ల అందు ఆకర్షితులౌతారు. సప్తమ భామం మీద కేతువు దృష్టి సారిస్తాడు. శత్రు స్థానమైన సింహం మీద కేతువు దృష్టి కార్తణంగాదాంపత్యజీవితం కలతలతో నిండి ఉంటుంది. శుభగ్రహ చేరిక, సంబంధం ఉన్న అశుభ ఫలితాలు తక్కువగా ఉంటాయి.

10, అక్టోబర్ 2013, గురువారం

లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

మకర లగ్న జాతకులు నియమానుసారంగా నడచుటకు ఆసక్తి చూపుతారు. వీరు సన్నగా ఉంటారు, కొంచం మొరటు స్వభావం కలిగి ఉంటారు. వారి స్వ విషయంలో ఇతరుల జోక్యం వీరు సహించరు. వివాహ విషయంలో కొంచం వివాదాలు ఉంటాయి.మకర లగ్నస్థ గ్రహ ఫలితాలను కింద చూడ వచ్చు.

సూర్యుడు :- మకరలగ్నానికి సూర్యుడు అష్టమాధిపతి. అష్టమాధిపతి లగ్నంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుటకు అవకాశం ఉంది. ఎముకల నొప్పి, ఉదర సంబంధ రోగములు కలిగే అవకాశం ఎక్కువ. నేత్ర వ్యాధులలు కలుగుతాయి. పేరాశ, స్వార్ధ చింతన ఎక్కువ. సూర్యుడు తన శత్రు స్థానమున ఉండడం కారణంగా జీవితంలో కఠిన పరిస్తితిని ఎదుద్కో వలసి వస్తుంది. కటిన పరిస్థితులలోఆత్మబలంతో  పరిశ్రమతో విజయం సాధిస్తారు. గృహస్థ జీవితంలో ఓడి దుడుకులు ఉంటాయి. వ్యాపారం చేయాలన్న కోరిక ఉద్యోగం చేయాలన్న ఆసక్తి కలగలుపుగా ఉంటాయి.


చంద్రుడు :- మకర లగ్నంలో చంద్రుడు సప్తమాధిపతి.  శత్రు రాశిలో లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి సౌం దర్యం ఇస్తాడు. కాని చంద్రుడు శత్రు స్థానంలో ఉన్న కారణంగా విచిత్ర మనస్తత్వం ఉంటుంది. నేత్రములు, చెవుల అందు వ్యాధులు ఉంటాయి. చంద్రుడు లగ్నం నుండి సప్తమ స్థామును మీద దృష్టి సారించడం వలన జీవిత భాగస్వామి అందం, గుణం కలిగి ఉండును. జీవిత భాగ స్వామితో అన్యోన్యం అనుకూలత కలిగి ఉంటారు.


కుజుడు :- మకర లగ్నానికి కుజుడు సుఖాధిపతి మరియు లాభాధిపతి ఔతాడు. కుజుడు లగ్నంలో ఉంటే ఆవ్యక్తి క్రోధ స్వభావం కలిగి ఉంటాడు. తండ్రి వైపు బంధువుల సహకారం లభిస్తుంది. తండ్రి వలన పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. శని ప్రభావం  కారణంగా తండ్రి వైపు ఆస్థులు త్యాగం చేయవలసిన పరిస్థితి సంభవించగలదు. లగ్నస్థ కుజుడు నాలుగు, ఏడు, ఎనిమిది స్థానాల మీద దృష్టి సారిస్తాడు కనుక ధార్మికత ఉంటుంది.  కుటుంబ జీవితంలో కలతలు కలుగుతాయి.  మకర లగ్నంలో కుజుడు ఉచ్చ స్థితి కారణంగా వ్యక్తి క్రోధ స్వభావం కలిగి ఉంటారు.  తల్లి కూడా ఉద్రేక స్వభావం కలిగి ఉంటుంది.

బుధుడు :- మకర లగ్నానికి బుధుడు షష్టమాధిపతి మరియు నవమాధిపతి ఔతాడు. మకర లగ్నస్థ బుధుడు వ్యక్తికి జ్ఞానం, బుద్ధికుశలత కలిగి ఉంటాడు. వీరికి దైవ భక్తి, దయా స్వభావం, కళాభిరుచి కలిగి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ధనం ప్రాప్తిస్తాయి.  సప్తమ స్థానం మీద బుధ దృష్టి ఫలితంగా  జీవిత భాగస్వామి అందంగా సామర్ద్యశాలిగా  ఉండును. షష్టామాధిపతి దృష్టి  కారణంగా  భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. సంతానం కలగడానికి జాప్యం కలుగ వచ్చు.


 గురువు :- మకర లగ్నానికి గురువు తృతీయ వ్యయ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక గురువు ఈ లగ్నానికి అకారక గ్రహం ఔతాడు. లగ్నస్థ గురువు వ్యక్తికి జ్ఞానం, సుగుణం కలిగిస్తాడు.  వీరికి  క్షమాగుణం మెండు అయినా వీరు వారి యోగ్యతను గుణమును సద్వినియోగపరచ లేరు. ఇతరుల కలతలు వీరిని ప్రభావితంచేస్తాయి కనుక కొన్ని సమస్యలను ఎదు ర్కొంటారు. లగ్నస్థ గురువు పంచమ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టి సారిస్థాడు కనుక వివాహానంతరం అదృష్టం ప్రాప్తిస్తుంది.


శుక్రుడు :- మకర లగ్నానికి పంచమ, సప్తమ, దశమ స్థానాలకు కారకత్వం వహిస్తాడు. మకర లగ్నానికి శుక్రుడు శుభుడు. మకర లగ్నస్థ శుక్రుడి కారణంగా వ్యక్తి అందం, బుద్ధి కుశలత కలిగి ఉంటాడు. లగ్నస్థ శుక్రుడు వీరిని విలాసవంతులు, స్వార్ధపరులుగా చేస్తుంది. తమ అవసరానికి అనుగుణంగా బుద్ధిని మార్చుకుంటారు. వీరు అవసరార్ధం మిత్రులను కలిగి ఉంటారు. స్త్రీలైన పురుషుల పట్ల పురుషులైన స్త్రీల పట్ల ఆకర్షితులు ఔతారు. సప్తమ స్థానమైన కటక రాశి మీద శుక్రుడి దృష్టి పడటం కారణంగా వీరి మీద జీవిత భాగస్వామి ప్రేమను అప్యాయతను కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి సుఖ దుఃఖంలో సహాయ సహకారలను అందిస్తారు.


శని :- మకర లగ్నస్థ శని లగ్నాధిపతి, ద్వితీయ స్థానాలకు ఆధిపత్యం వహిస్తూ కారక గ్రహం ఔతాడు. ఈ కారణంగా ఈ వ్యక్తి భాగ్యశాలి కాగలడు. ఆకర్షణీయమైన బలిష్టమైన శరీరాకృతి కలిగి ఉంటాడు. ఉద్యోగ వ్యాపారాలలో సాఫల్యం లభిస్తుంది. ఆకర్షణీయముగా మాట్లాడ లేరు. ప్రభుత్వ సేవారంగంలో పని చేసే అవకాశాం లభిస్తుంది. తల్లితో చక్కని సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. శని తృతీయ, సప్తమ, దశమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామికి కష్టాలు ప్రాప్తిస్తాయి.  వైవాహిక జీవితంలో కలతలు ఉంటాయి.


 రాహువు :- మకర లగ్నంలో రాహు స్థితి కారణంగా అనవసర తిరుగుడు అధికం. కార్య హాని జరగడానికి అవకాశం ఎక్కువ. అనుకున్న కార్యాలు సాధించడంలో సమయలు తలెత్తుతాయి. వ్యాపారంలో ఆసక్తి ఉన్నా ఉద్యోగమే లాభదాయకంగా ఉంటుది. వ్యవసాయంలో సమస్యలు కష్టములు అధికంగా కలుగుతాయి. లగ్నస్థ రాహువు సప్తమ దృష్టి కారణంగా సంసార జీవితంలో జీవిత భాగస్వామి నుండి మిత్రుల నుండి తగిన సహకారం లభించదు.


 కేతువు :- మకర లగ్నంలో ఉన్న కేతువు ఆరోగ్య సమస్యలకు హేతువు ఔతాడు. అన్ని సమయములలో అన్వేక కష్టములను ఎదుర్కొంటారు. శత్రువుల వలన హాని కలుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టల కొరకు అనుచిత కార్యముల చేసి అపజయం పాలు ఔతారు. లగ్నస్థ కేతువు స్ర్తీలకు పురుషుల అందు పురుషులకు స్త్రీల అందు విపరీత ఆకర్షణ కలిగి ఉంటారు. సప్తమ స్థానం మీద కేతు దృష్టి కారణంగా భాగస్వామికి కష్టాలు కలుగుతాయి. భాస్వామి సహాయ సహకారాలు లభించవు.

9, అక్టోబర్ 2013, బుధవారం

ధనుర్లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

ధనుర్లగ్న జాతకులు మానవత కలిగి ఉంటారు. నిరాడంబరత, దయాగుఇణం కలిగి ఉంటారు. ఈశ్వరభక్తి కలిగిన భాగ్యవంతులుగా ఉంటారు. ధనుర్లగ్నానికి కుజుడు శుభగ్రహంగా ఉంటాడు.

 సూర్యుడు :- ధనుర్లగ్నానికి సూర్యుడు భాగ్యాధి పతిగా శుభ ఫలితాన్ని ఇస్తాడు.ధనుర్లగ్నంలో ఉన్న సూర్యుడు వ్యక్తికి అందం, ఆరోగ్యం, ఆత్మ విశ్వాసం, ఆత్మబలం, జ్ఞానం ఇస్తాడు. ఆకర్షణీయమైన మాటలతో ఎదుటి వారిని ప్రభావితులను చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు రెండూ వీరికి అనుకూల ఫలితాన్ని ఇచ్చినా ఉద్యోగంలో అధిక సఫలత సాధిస్తారు. లేఖనం, పఠనం మూలంగా జనప్రియులౌతారు. చిత్రకళ, శిల్ప కళ అందు అభిరుచి కలిగి ఉంటారు. లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో  బుధుడి స్థానమైన మిధునం మీద దృష్టి సారిస్తాడు కనుక ధనం, ప్రఖ్యాతి, మిత్రుల నుండి సహకారం లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది.  భాగ్యాధి పతి సూర్యుడు లగ్నస్థుడవటం కారణంగా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు లాభిస్తాయి. జీవితభాగస్వామి నుండి, సంతానం నుండి సుఖం లభిస్తుంది.


చంద్రుడు :- ధనుర్లగ్నస్థ చంద్రుడు అష్టమాధిపతి అయినా అనూకల ఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో ఉన్న చంద్రుని వలన మనసు అస్థిరంగా ఉంటుంది. లగ్నస్థ చంద్రుడి కారణంగా అరోగ్య సమస్యలను ఎదుర్కొంటాడు. ప్రాణాలు, జలక్షేత్రములు, ప్రకృతి దృశ్యముల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. అనుసంధానం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు.
కళారంగం, లేఖనం పట్ల అభిరుచి కలిగి ఉంటారు. కళారంగంలో వీరికి సఫలత లభిస్తుంది. ధనుర్లగ్నస్థ  చంద్రుడి దృష్టి మిత్ర రాశి అయిన మిధునం మీద పడుతున్న కారణంగా జీవితభాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సంతాన సుఖం ఆలస్యంగా కలుగుతుంది.


 కుజుడు :- ధనుర్లగ్నానికి పంచమాధిపతిగా, వ్యయాధిపతిగా ఉండి శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో కుజుడున్న కారణంగా చక్కగా పరిశ్రమించి ధనార్జన చేస్తాడు. ధునుస్సు రాశిలో ఉన్న కుజుడు చదువు కొనసాగించుటలో అవరోధాన్ని కలిగిస్తాడు. లగ్నస్థ కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ స్థానాల మీద దృష్టి సారించడం వలన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురౌతాయి. చిన్న చిన్న వివాదములు తలెత్తుతాయి.


బుధుడు:- ధనుర్లగ్నానికి బుధుడు సప్తమ, దశమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. రెండు కేంద్రములకు ఆధిపత్యం వహించి బుధుడు ధనుర్లగ్నానికి అకారక గ్రహం ఔతాడు. అయినా లగ్నస్థ బుధుడు వ్యక్తికి రోగములు లేని అందమైన శరీరాన్ని ఇస్తాడు. తల్లి తండ్రుల నుండి స్నేహ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగం  నుండి లాభం, గౌరవం కలుగుతాయి. లగ్నం నుండి బుధుడు స్వస్థానమైన మిధున రాశి మీద దృష్టిని సారిస్తాడు కనుక సహాయ సహకారాలు అందించే అందమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయ సహకారలు కలుగుతుంది వ్యాపారం అనుకూలిస్తుంది. ఆర్ధిక స్థితి బలంగా ఉంటుంది.

గురువు :- ధనుర్లగ్నంలో లగ్నాధిపతిగా, చతుర్ధ స్థానాధిపతిగా గురువు శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ గురువు అందమైన ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇస్తాడు. పేరు, ప్రతిష్ట, సమాజంలో గౌరవం, బుద్ధి, జ్ఞానం కలిగి ఉంటారు. భూమి, భవనం, మరియు వాహన సౌఖ్యం పొందగలరు. లగ్నస్థ గురువు పంచమ రాశి మిత్ర రాశి అయిన మేషరాశి మీద, సప్తమ రాశి సమరాశి అయిన మిధునం మీద , నవమ భావం మిత్రరాశి అయిన సింహం మీద దృష్టి సారిస్తాడు కనుక సాహసము, దయాహృదయం కలిగి ఉంటాడు. జీవితభాగస్వామి నుండి సహాయ సహకారం ఉంటాయి. సంతానం నుండి సుఖం కలుగుతుంది. జీవితం ఐశ్వర్యం మరియు సుఖంతో కూడిన పరి పూర్ణ జీవితం అనుభవిస్తాడు. వ్యాపార ఉద్యోగాలు ఫలలతనిస్తాయి.  శత్రుభయం ఉన్నా వీరికి వారి నుండి ఆపద కలుగదు.


 శుక్రుడు :- ధనుర్లగ్నానికి ఆరవ, పదకొండవ స్థానాధిపతి అయిన శుక్రుడు అకారక గ్రహంగా అశుభాన్ని ఇస్తాడు. లగ్నంలో ఉన్న శుక్రుడు అందమైన శరీరాన్ని ప్రసాదించినా శుక్రుడు రోగస్థానాధిపతి కనుక లగ్నంలో ఉండి ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. ధనుర్లగ్నానికి ఏకాదశాధిపతి అయిన శుక్రుడు లాభమును  కూడా ప్రసాదిస్తాడు.
శుక్రుడి ప్రభావం వలన ప్రభుత్వోద్యోగావకాశాలు ఎక్కువ. సంగీతం, కళల అందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. లగ్నస్థ శుక్రుడు మిత్ర రాశియిన సప్తమ రాశి మీద సంపూర్ణ దృష్టిని ప్రసరిస్తాడు కనుక జీవిత భాగస్వామి అందంగా ఉండి సహాయసకారాలు అందిస్తారు.  వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది.


  శని :- ధనుర్లగ్నానికి శని ద్వితీయ, తృతీయ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు కనుక వ్యక్తి సన్నంగా ఉంటాడు. శని ప్రభావం వీరికి నేత్ర రోగం ఇస్తుంది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేక ఇతరుల మీద ఆధారపడతారు. ఇతరుల సహకారం అధికంగా ఆశిస్తారు. ధనాన్ని భద్రపరిచే గుణం వీరికి అధికంగా ఉంటుది. షేర్లు, పందాలు, లాటరీలు వీరికి లాభిస్తాయి. లగ్నస్థ శని లగ్నం నుడీ తృతీయ రాశి అయిన కుంభం, సప్తమ రాశి మిత్ర రాశి అయిన మిదునం, దశమరాశి అయిన కన్య మీద శుభదృష్టిని ప్రసరిస్తాడు కనుక సోదరుల నుండి మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయ సహకారాలు లభించవు.  వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురౌతాయి.


 రాహువు :- ధనుర్లగ్నస్థ రాహువు వలన పొడవైన ఆరోగ్యవంతమైన శరీరం లభిస్తుంది. అన్ని పనులను చేపట్టు నైపుణ్యం కలిగి ఉంటారు. స్వహితము వీరి సిద్ధాంతం. రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానమైన రాహువును చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి సహాయసహకారాలు లభించడం కష్టం.


కేతువు:- ధనుర్లగ్నస్థ కేతువు కారణంగా వ్యక్తికి ఆరోగ్య సమస్యలు తలెత్తగలవు. నడుము నొప్పి మొదలైన శరీర భాగాలు బాధింపుకు గురి ఔతాయి. ఆత్మ విశ్వాసం లేని కారణంగా మహత్వపూరిత నిర్ణయాలు సాధ్యం కాదు.

8, అక్టోబర్ 2013, మంగళవారం

వృశ్చిక లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

సూర్యుడు :-  వృశ్చిక లగ్నంలో దశమాధిపతి కారకాధిపతి అయిన సూర్యుడు ఉన్న వ్యక్తి ఆత్మ బల సంపన్నుడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, మహత్వకాంక్ష కలిగిస్తుంది. దశమాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉండి ప్రభుత్వ ఉద్యోగావకాశాలను కలిగిస్తాడు. తండ్రితో చక్కని ఆత్మీయమైన సంబంధాలు ఉంటాయి. కర్మాధిపతి సూర్యుని దృష్టి కారణంగా  వృశ్చిక లగ్నానికి సప్తమ భావం  అయిన వృషభ రాశి ప్రభావితమవడం వలన శృంగార, సౌందర్య రంగాలకు చెందిన వ్యాపారం వీరికి లాభిస్తుంది. అయినా జీవిత భాగస్వామితో కొంత అశాంతి ఉంటుంది కాని తల్లితో సత్సంబంధాలు ఉంటాయి.

చంద్రుడు:- వృశ్చిక లగ్నంలో చంద్రుడు భాగ్యాధి పతి మరియు త్రికోణాధిపతి కనుక శుభ ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు లగ్నంలోమిత్ర స్థానంలో ఉండి కొంత బలం కలిగి ఉంటాడు. ఇలాంటి స్థితి ఉన్న వ్యక్తి సౌందర్యవంతుడు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలవాడుగా ఉంటాడు. ఇతరులను ప్రభావితం చేయగలిగి ధార్మిక చింతన కలిగి ఉంటాడు. తీర్ధాటన అందు ఆసక్తి కలిగి ఉంటారు. దయ, కరుణ గుణములు కలిగి ఉంటారు. భాగ్యస్థానాధిపతి బలం కారణంగా వీరు కార్య సిద్ధి, గౌరవ మర్యాదలు లభించగలవు. సప్తమ భావం మీద చంద్రుని దృష్టి కారణంగా సౌందర్యమూ, సుగుణము కలిగి అనుకూలమైన జీవిత భాగస్వామి లభించ గలదు. ఆరోగ్య పరంగా నడుము నొప్పి, పిత్త సంబంధిత వ్యాధులు రావచ్చు.

కుజుడు:- వృశ్చిక లగ్నంలో కుజుడు వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతిగా శుభుడు కాని షష్టమ స్థానాధి పతి కనుక కొంత బలహీనుడు. అయినా శుభ ఫలితాలే అధికం. లగ్నంలో రాజ్యంలో ఉన్న గ్రహం దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది. వీరికి శరీర మరియు మానసిక బలములు అధికం, తల్లి నుండి వీరికి సంపద లభిస్తుంది, లగ్నస్థ కుజుడు చతుర్ధ, అష్టమ, మరియు సప్తమ భాలను చూస్తాడు కనుక భూమి, భవనములు, వాహన సౌఖ్యము బలహీన పడుతుంది. తల్లితో అభిప్రాయ బేధములు ఉంటాయి. జీవిత భాగస్వామికి కష్టాలు  వైవాహిక జీవితంలో కష్టములు కలుగుతాయి.

గురువు:-  వృశ్చిక లగ్నంలో గురువు శుభఫలితాలను ఇస్తాడు. రెండవ మరియు పుత్ర స్థానాలకు అధిపతి కనుక లగ్నంలో ఉండి పరి పూర్ణ ఆత్మ విశ్వాసం, సౌందర్యము ఇస్తాడు. ఉన్నత విద్యలను అభ్యసించుట, వాక్ప్రభావం, బుద్ధి కుశలత కలిగి ఉంటారు. పొదుపు చేసే గుణం కారణంగా సుఖమయ జీవితాన్ని పొందుతారు. గురువు యొక్క పంచమ, సప్తమ మరియు నవమ దృష్టి కారణంగా పుత్ర సంతానం కలిగి ధన సంపద కలిగి అనికూల జీవిత భాగస్వామిని పొంది యోగకారకమైన జీవితాన్ని అనుభవించగలడు.

శుక్రుడు :- వృశ్చిక లగ్నంలో శుక్రుడు సప్తమ మరియు వ్యయాధిపతి అయిన కారణంగా లగ్నంలో ఉన్న ఎడల అశుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు ఈ లగ్నానికి అకారక గ్రహం.మానసిక అశాంతి, విలాస వంతుడు, కామప్రదుడు ఔతాడు. లగ్నం నుండి శుక్రుడు స్వరాశి అయిన వృషభమును చూస్తున్నాడు కనుక జీవిత భాగస్వామితో అభిప్రాయబేధములు ఉంటాయి. జీవిత భాగస్వామికి ఆనారోగ్యం కలిగి జీవిత బాగస్వామి నుండి హాని కలిగే అవకాశం ఉంది.  వ్యవసాయము, శృంగార సంబంధిత వ్యాపారం, సుగంధ వ్యాపారం వీరికి లాభాన్ని ఇస్తుంది.

శని :- వృశ్చిక లగ్నానికి శని తృతీయ మరియు చతుర్ధాతి పతిగా అకారక గ్రహం. శని లగ్నంలో ఉన్న అరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రభుత్వరంగం నుండి కష్టములు కలుగ గలవు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. శని తృతీయ, దశమ, సప్తమ భావాలను పూర్ణ దృష్టితో చూస్తాడు కనుక స్త్రీలకు అన్నదమ్ముల నుండి, పురుషులకు అక్క చెల్లెళ్ళ నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. జీవితంలో ఒడి దుడుకులు ఉంటాయి.  స్త్రీలకు సంతానానికి కష్టములు కలిగిస్తాడు.

రాహువు:- వృశ్చిక లగ్నంలో రాహువు శారీరక సమస్యలకు ఆరోగ్యహానికి కారకుడౌతాడు. రాహుదశలో ఆరోగ్య హాని కలిగిస్తాడు. ఆత్మవిశ్వాసం కొరవడును. రాహువుకు పంచమ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టిని సారిస్తాడు కనుకవ్యాపార ఉద్యోగాలలో ఓడిదుడుకులు, జీవిత బాగస్వామితో అభిప్రాయ బేదాలు అకస్మాత్తుగా హాని కలుగ గలదు. వైవాహిక జీవితంలో కష్టాలు ప్రాప్తించ గలవు. సమాజం నుండి ప్రశంశలు పొంద గలడు.

కేతువు:- వృశ్చిక లగ్నంలో కేతువు శారీక బలం, మానసిక శక్తి, దృఢమైన శరీరం  కలిగి ఉంటాడు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. తల్లి అభిమానానికి పాత్రుడౌతాడు. తల్లి నుండి సహాయం ఆనుకూల్యం లభిస్తుంది. జీవిత బాగస్వామికి, సంతానముకు  కష్టములు కలుగ గలవు.

7, అక్టోబర్ 2013, సోమవారం

తులా లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

సూర్యుడు :- శత్రురాశి అయిన తులా లగ్నంలో ఉన్న కారణంగా నేత్రవ్యాధికి కారకుడు ఔతాడు. సూర్యుడి లాభాధిపత్యం కారణంగా ఆర్ధిక పరిస్థితిలో ఒడిదుడుకులు ఉంటాయి. లగ్నస్థ సూర్యుడికి పాపగ్రహ సంబంధం కాని , దృష్టి  కాని ఉన్న ఎడల వ్యక్తి ఊగ్ర స్వభావమును కలిగి ఉంటాడు. లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో తన ఉచ్ఛ స్థానమైన మేషం మీద దృష్టి సారిస్తున్న కారణంగా వ్యక్తి సాహసం పరాక్రమం కలిగి ఉంటాడు. వివాహంలో ఆటంకాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అనుకూలం లోపిస్తుంది.

 చంద్రుడు :- తులాలగ్నానికి చంద్రుడు దశమస్థానాధిపతి ఔతాడు. బాల్యం సంఘర్షణతో కూడినదిగా ఉంటుంది. యవ్వనం, వృద్ధాప్యం సుఖమయంగా ఉంటుంది. లగ్నస్థ చంద్రుడు వీరిని సద్గుణ సంపన్నుడిగానూ, విద్వాంసుడిగానూ చేయును. కల్పనా శక్తితో కూడిన అస్థిర మనస్థత్వం కల వారుగా ఉంటారు. లగ్నస్థ చంద్రుని కారణంగా తల్లితో స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. తులాలగ్నానికి చంద్రూడు దశమాధిపతిగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు.  సప్తమ స్థానం మీద చంద్రుని పూర్ణ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి ఉద్రేక పూరిత స్వభావం  కలిగి, సాహసి అయి , మహత్వకాక్ష కలిగి ఉంటారు. లగ్నస్థ చంద్రుడు శుభ గ్రహ సంబంధం దృష్టి ఉన్న ఎడల ఉత్తమ ఫలితాన్ని ఇస్తాడు.


కుజుడు :- తులాలగ్నానికి కుజుడు ద్వితీయ, సప్తమ స్థాలకు ఆధిపత్యం వహిస్తాడు. ధన స్థానమైన ద్వితీయాధిపత్యంలో ఉన్న కుజుడు లగ్నస్థుడైనందున ఆర్ధిక లాభమును కలిగిస్తాడు. వ్యాపార, వర్తకాలలో సాఫల్యత కలిగిస్తాడు. స్వతంత్రముగా పని చేయుట వలన వీరికి లాభము ప్రాప్తిస్తుంది. వీరికి భాగస్వామ్యము అధిక నష్టాలను కలిగిస్తుంది.లగ్నస్థ కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ భావాలను చూస్తున్నాడు కనుక సుఖ భావం మీద కుజుని దృష్టి కారణంగా సోదరుల నుండి సహాయసహకారములు లభించవు.వైవాహిక జీవితంలో కష్టములు ఉంటాయి. కుజుడి దశలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది.


బుధుడు :- తులాలగ్నానికి బుధుడు నవమాధిపతి, ద్వాదశాధిపతిగా  ఔతాడు కనుక బుధుడు తులాలగ్నానికి శుభుడు ఔతాడు. కనుక వ్యక్తికి ధార్మికత, బుద్ధి కుశలత కలిగిస్తాడు. ఉత్తమమైన వ్యక్తుల మీద గౌరవం కలిగి ఉంటాడు.  ప్రభుత్వ,  ప్రభుత్వ రంగం నుండి వీరికి సన్మానం సహకారం లభిస్తుంది. జన్మ స్థలానికి  దూరంగా సుఖజీవితాన్ని సాగిస్తారు. వీరికి తల్లి తండ్రుల నుండి  ప్రేమ సహకారం లభిస్తుంది. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ భావాన్ని చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో సామాన్య సుఖం ఉంటుంది. సంతానం, జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. లగ్నస్థ బుధుడు పాపగ్రహ పీడితుడైనందువలన  ధనలాభం , కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది.


గురువు :- తులాలగ్నానికి తృతీయ, ష్టమస్థానాధిపతిగా గురువు అకారక గ్రహమై అశుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ గురువు వ్యక్తికి ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. లగ్నస్థ గురువు కారణంగా విద్వాంసుడు, సాహసిగా ఉంటాడు. బుద్ధికుశలత వలన ధనం, గౌరవం పొందగలరు. లగ్నంలో ఉన్న గురువు క్షమాగుణం, సంతాన ప్రాప్తి, ఉన్నత విద్యను ప్రసాదిస్తాడు. గురువు లగ్నం నుండి అయిదవ, ఏడవ, తొమ్మిదవ భావముల మీద దృష్టి సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి, తల్లి, తండ్రి నుండి ప్రేమ పూరిత సహకారం లభిస్తుంది.


శుక్రుడు:- తులాలగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి, అష్టమాధిపతి ఔతాడు. కనుక శుక్రుడు తులాలగ్నానికి కారక గ్రహం ఔతాడు. లగ్నస్థ శుక్రుడు స్వస్థానంలో ఉండి శుభుడుగా ఉన్నందున చురుకుదనం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. లగ్నస్థ శుకృడు శుభుడు అయినందున రోగ రహిత ఆరోగ్యం కలిగి ఉంటాడు. సంగీతం, సౌంద్యర్య  సాధన మీద , కళలయందు ఆసక్తి కలిగి ఉంటారు. లగ్నస్థ శుక్రుడు సప్తమ భావం మీద పూర్ణ దృష్టిని సారిస్తాడు కనుక  ప్రేమ వ్యహారాలు అధికంగా ఉంటాయి.  ఈకారణంగా కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. విలాసాలకు , భోగాలకు అధికంగా ఖర్చు చేస్తారు.

శని :- తులాలగ్నానికి శని చతుర్ధ, పంచమ స్థానాలకు కారకత్వం వహిస్తూ ప్రముఖ కారక గ్రహం ఔతాడు.  తులా లగ్నంలో ఉన్న శని కారణంగా తల్లి తండ్రుల నుండి స్నేహపూరిత సహకారం అందుకుంటారు. విద్యావంతులు ఔతారు. వృత్తి విద్యలలో విశేష సాఫల్యం సాధిస్తారు. శని దృష్టి తృతీయ, సప్తమ, దశమ స్థానాల మీద ప్రసరిస్తుంది. కరుణ స్వభావం కలిగి ఉంటారు. భూమి, వాహన సౌఖ్యం కలిగి ఉంటారు. బంధు మిత్రులతో వివాదములు అభిప్రాయ బేధాలు ఉంటాయి.


రాహువు :- తు లాల గ్నంలో ఉన్న రాహువు ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. రాహువు అంత్ముర్ఖముఖ స్వభావాన్ని ఇస్తాడు కనుక వీరు తమ  కార్యాలను రహస్యంగా ఉంచుతారు. లగ్నస్థ రాహువు వలన చదువులో ఆటంకాలు ఉంటాయి. రాహువు భాగ్యహీనం కలిగిస్తాడు. జీవిత భాగస్వామి సహకారం అందదు.


కేతువు :- తులా లగ్నంలో కేతువు వ్యక్తికి సాహసం, పరిశ్రమించే గుణం ఇస్తాడు. పరిశ్రమ, సాహసం కారణంగా కఠిన కార్యాలను కూడా సాధిస్తాడు. శిక్షణలో ఆటంకములు ఉంటాయి. కేతువు ధార్మిక భావనలు కలిగిస్తాడు. పరుల సొమ్ము మీద ఆసక్తి ఉంటుంది. మనసులో అనవసర భయములు ఉంటాయి. జూదం, పందెములలో ధనం అధికంగా ఖర్చు చేస్తారు.


తులాలగ్నానికి అధిపతి శుక్రుడు. సూర్యుడు, ఏకాదశాధిపతిగా అకారక గ్రహంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు అశుభఫలితాన్ని ఇస్తాడు. బుధుడు కారక గ్రహ ఫలితాన్ని ఇస్తాడు. గురువు అకారక గ్రహంగా అశుభఫలితాన్ని ఇస్తాడు.

6, అక్టోబర్ 2013, ఆదివారం

కన్యా లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

సూరుడు :- కన్యాలగ్నానికి సూర్యుడు ద్వాదశాధిపతి ఔతాడు. వ్యయాధిపతిగా సూర్యుడు కన్యాలగ్నానికి అకరక గ్రహం ఔతాడు. కన్యాలగ్నస్థ సూర్యుడి కారణంగా వ్యక్తి  ప్రభావశాలిగా ఉంటాడు. అందమైన, లగ్నస్థ సూర్యుడు ప్రకాశవంతమైన శరీరం ఇస్తాడు. వీరికి దగ్గు, జలుబు, హృదయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. లగ్నస్థ సూర్యుడి కారణంగా వీరికి విదేశీయానం ప్రాప్తించే అవకాశం ఉంది. లగ్నస్థ సూర్యుడు సప్తమ స్థానం మీద దృష్టి ప్రసరిస్తాడు కనుక వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. భాగస్వామ్యం వీరికి అనుకూలించదు. వ్యవసాయం వీరికి అనుకూలిస్తుంది. లగ్నస్థ సూర్యుడికి పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న పరిహారం చేయడం మంచిది.

చంద్రుడు :- కన్యాలగ్నానికి  చంద్రుడు ఏకాదశాధిపతిగా అకారక గ్రహంగా అశుభఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అందం, కల్పనా శక్తి, ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి దయాగుణం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. వీరు జీవితంలో శీఘ్రగతిలో ప్రగతిని సాదిస్తారు. చంద్రుని స్థికారణంగా అస్థిర మనస్తత్వం ఉంటుంది. లగ్నం  నుండి చంద్రుడు పరిపూర్ణ దృష్టిని సప్తమ స్థానం అయిన మీనం మీద ప్రసరిస్తాడు కనుక గురువు ప్రభావం చేత జీవిత భాగస్వామితో ప్రేమ పూరిత సహకారం లభిస్తుంది. వీరికి అకస్మాత్తుగా లాభం కలిగే అవకాశం ఉంది. చంద్రుడికి పాపగ్రహ చేరిక దృష్టి ఉన్న ఎడల శుభ ఫలితము తక్కువగా ఉండును. 

  కుజుడు :- కన్యాగగ్నానికి కుజుడు తృతీయ, షష్టమాధిపతి ఔతాడు. కనుక కుజుడు కన్యాలగ్నానికి అకారక గ్రహంగా అశుభఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ కుజుడి కారణంగా వీరికి  క్రోధస్వభావం కలిగి ఉగ్రుడై ఉంటారు. సోదరులతో సఖ్యత ఉంటుంది. తల్లి తండ్రులతో అభిప్రాయబేధాలు ఉంటాయి. లగ్నస్థ కుజుడి కారణంగా తండ్రికి అనారోగ్యం కలుగుతుంది. కుజుడు అష్టమ భావం మీద దృష్టి సారిస్తాడు కనుక శారీరక కష్టములు అనుభవించవలసి ఉంటుంది. లగ్నస్థ కుజుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి. జీవిత భాగస్వామి వంచనకు గురి కావచ్చు.


బుధుడు :- బుధుడు కన్యా లగ్నానికి లగ్నాధిపతి, దశమాధిపతిగా ప్రముఖ కారక గ్రహముగా ఉంటాడు. లగ్నస్థ బుధుడు స్వస్థానంలో ఉన్నాడు కనుక వ్యక్తి అందం, ఆకర్షణ, ఆరోగ్యం కలిగి ఉంటాడు. కన్యా లగ్నస్థ బుధుడు వ్యక్తికి పరి పూర్ణ ఆత్మవిశ్వాసం, దీర్గాయుషు ఇస్తాడు. వీరి ఆత్మ బలం కారణంగా వ్యక్తి వ్యవసాయ, వ్యాపార రంగాలలో అత్యున్నత ప్రగతి సాధిస్తారు. వీరికి సమాజంలో గౌరవం, ఆదరం లభిస్తుంది. లగ్నస్థ బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక జీవిత  గుణసంపన్నుడైన జీవిత భాగస్వామి లభిస్తాడు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం సుఖమయముగా, ఆనందమయముగా  ఉంటుంది. వీరికి భాగస్వామ్యం లాభిస్తుంది.


 గురువు :- కన్యాలగ్నానికి గురువు కారక గ్రహం. కన్యాలగ్నానికి గురువు చతుర్ధ, సప్తమ స్థానాలకు అధిపతి ఔతాడు. లగ్నస్థ గురువు కారణంగా వ్యక్తికి తండ్రి వలన పేరు ప్రతిష్టలు కలుగుతాయి. బంధు మిత్రులతో అభిప్రాయ బేధములు కలుగుతాయి.  పుత్రుల నుండి ఆదరణ సహకారం లభిస్తుంది. పుత్ర సంపద వీరికి లభిస్తుంది. గురువు లగ్నం నుండి పంచమ, సప్తమ, నవమ స్థానముల మీద దృష్టిని సారిస్తాడు. కనుక దీర్గాయువు, పుత్రసంతతి, ఖ్యాతి  కలుగుతుంది. గురువు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న శుభ ఫలితాలు తగ్గుతాయి.


 శుక్రుడు :- కన్యాలగ్నానికి శుక్రుడు ధానాధిపతిగా, నవమాధిపతిగా కారక గ్రహంగా శుభఫలితాలు ఇస్తాడు. మిత్ర స్థానంలో ఉన్న కన్యా లగ్నస్థ శుక్రుడు వ్యక్తిని ప్రగతి పధంలోకి తీసుకు వెడతాడు. లగ్నస్థ శుక్రుని కారణంగా వ్యక్తి కళాభిరుచి కలిగి ఉంటాడు. వీరికి ధార్మిక భావములు అధికం. వీరికి వ్యవసాయ రంగంలో సాఫల్యం లభిస్తుంది.
ప్రభుత్వం నుండి ప్రభుత్వ రంగం నుండి సహాయసహకారం లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ స్థానమైన మీనం మీద దృష్టి సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది.


శని :- కన్యాలగ్నానికి శని పంచమాధిపతిగా, షష్టమాధిపతిగా ఉండి త్రికోణాధిపత్య  గ్రహంగా కారకమై శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శని వ్యక్తిని బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రామికుడిగా చేస్తాడు. లగ్నస్థ శని వ్యక్తికి శరీర దారుఢ్యం ఇస్తాడు. వీరి పరి వారిక జీవితం అశాంతికరం.  సంతానంతో సత్సంబంధాలు ఉండక పోవచ్చు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టిని సారిస్తాడు కనుక సోదరులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అందం , ఆధ్యాత్మికత కలిగి ఉంటారు.  కాని మొండి తనం, క్రోధ స్వభావం కలిగి ఉంటాడు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.


రాహువు :- కన్యాలగ్నమున ఉన్న రాహువు వ్యక్తికి పొడవైన, ఆరోగ్య వంతమైన శరీరం ఇస్తాడు. వీరిలో చతురత్వం స్వార్ధం ఉంటుంది. కనుక వారి కార్యం ఎలాగైనా సాధించుకుంటారు. లగ్న నుండి రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాస్వామితో కలహం అశాంతి కలిగి ఉంటారు. వీరికి భాగస్వామ్యం కలసి రాదు. జీవిత భాగస్వామికి కష్టములు ప్రాప్తించే అవకాశం ఉంటుంది.


కేతువు :- కన్యా లగ్నస్థ కేతువు వ్యక్తిని స్వార్ధ పూరితుడిని చేస్తుంది. గూఢాచారిగా సాఫల్యత సాధిస్తారు. వీరికి వాత రోగం, నడుము నొప్పి  కలిగే అవకాశం కలుగుతుంది.లగ్నస్థ కేతువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామికి రోగపీడను కలిగిస్తుంది. కేతువు శుభ గ్రహ దృష్టి చేరిక కలిగి ఉన్న వైవాహేతర సంబంధాలకు అవకాశం ఉంటుంది.

5, అక్టోబర్ 2013, శనివారం

సింహ లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

 సూర్యుడు :- సింహలగ్నంలో సూర్యుడు లగ్నాధిపత్యం వహిస్తూ కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. సింహగ్నంలో సూర్యుడున్న స్వత్షానమున ఉన్న కారణంగా వ్కక్తికి ఆత్మవిశ్వాసం, పరిపూర్ణత కలిగించును. సింహ లగ్నస్థ సూర్యుని కారణంగా గా వ్యక్తి విద్యాంసుడిగా, గుణవంతుడికా ఉంటాడు. వీరి కార్యశూరత ప్రతిభ కారణంగా సన్మానాలను అందుకుంటారు.వీరు ఏకార్యమైనా మనస్పూర్తిగా చేపడతారు. త్వరిత గతి మార్పులకు వీరు వ్యతిరేకులు. పరాక్రమం, ఉదారస్వభావం వీరి సొత్తు. ఇతరులకు సహకరించే గుణం, పరాక్రమం  కలిగి ఉంటారు. లగ్నస్థ సూర్యుడు సప్తమ స్థానం అయిన శత్రస్థానం కుంభం మీద దృష్టిని సారిస్తాడు కనుక వైవాహిక జీవితం శాంతి మయం ఔతుంది. మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయ సహకారం లభించదు.

చంద్రుడు :- సింహలగ్నానికి చంద్రుడు వ్యయస్థానాధిపతిగా అకారక గ్రహమై అశుభఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అధైర్య  మనస్థత్వాన్ని, నిలకడ లేని జీవితాన్ని ఇస్తాడు. నిస్వార్ధంగా ఇతరులకు సహకరిస్తారు. స్వభావికంగా వీరు మంచి వారు. వీరికి తల్లి తండ్రుల నుండి సహాయ సహారాలు అందుతాయి. రాజాకీయాలలో సఫలత సాధిస్తారు. చంద్రుడు లగ్నస్థంలో ఉండి సప్తమ స్థానం అయిన కుంభం మీద దృష్టి సారిస్తాడు కనుక వైవాహిక జీవితంలో ఒడి దుడుకులు ఉంటాయి. చంద్రుడికి పాపగ్రహ చేరిక, దృష్టి ఉన్న అశుభఫలితాలు తగ్గుతాయి.


 కుజుడు :- సింహలగ్నానికి కుజుడు చతుర్ధాధిపతి, నవమభావాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక కారక గ్రహమై శుభఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ కుజుడు పరి పూర్ణ ఆత్మవిశ్వాసం, సాహసం, నిర్భయత్వం ఇస్తాడు. వీరికి అనేక విధముల ధనాగమనం ఉంటుంది. లగ్నస్థ కుజుడు చతుర్ధ స్థానమైన మిద , సప్తమ అష్టమ స్థానముల
మీద దృష్టి సారిస్తాడు. కనుక తల్లితో విబేధాలు, జీవితభ్గస్వామితో అభిప్రాయబేధాలు ఉంటాయి. మిత్రుల, భాస్వాముల సహాయసహకారాలు లోపిస్తాయి. శత్రు పీడ ఉంటుంది.


బుధుడు:- సింహ లగ్నస్థ బుధుడు ద్వితీయ, ఏకాదశ స్థానాధిపత్యం వహిస్తాడు కనుక ఈ లగ్ననముకు బుధుడు ధన కారకుడు. లగ్నస్థ బుధుడు అధిక ధనాదాయాన్ని ఇస్తాడు. వీరికి కళారంగ సంబంధములు ఉంటాయి. వీరికి శత్రుభయం అధికం. బుధుడు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన కుంభం మీద దృష్టి సారిస్తాడు కనుక వీరికి జీవిత భాగస్వామి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. కాని జీవితభాగస్వామి సహాయసహకారాలు వీరికి అందదు. సంతాన సుఖం వీరికి తక్కువ. బుధుడు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న అశుభ ఫలితాలను ఇస్తాడు. భాగస్వామ్యం వీరికి కలసి రాదు.

గురువు:- సింహ లగ్నానికి గురువు పంచమ, అష్టమాధిపధిపత్యం వహిస్తాడు. త్రికోణాధిపత్యం కారణంగా గురువు కారక గ్రహమై శుభఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ గురువు అందమైన, ఆకర్షణీయమైన శరీరాన్ని ఇస్తాడు. బుద్ధి కుశలత, జ్ఞానం, వీరి సొత్తు. దయాస్వభావం కలిగి ఉంటారు. ధనం బధ్రపరచు గుణం కలిగి ఉంటారు. బుద్ధికుశలత, జ్ఞానం వీరిని ఉన్నత పదవులను అధిరోహింప చేస్తుంది. ఉద్యోగవ్యాపారాలు రెండింటిలో వీరికి సాఫల్యత లభిస్తుంది. సంఘములో గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. గురువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుండి, పంచమ దృష్టి కారణంగా పుత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మిత్రుల, భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. అదృష్టం వీరిని వెన్నంటి ఉంటుంది.

 శుక్రుడు :- శుక్రుడు సింహ లగ్నానికి తృతీయ, దశమాధిపతి ఔతాడు. సింహలగ్న శుక్రుడికి కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. లగ్నస్థ  శుక్రుడి కారణంగా అందమైన శరీరం కలిగి  ఉంటారు. వీరికి భౌతిక సుఖముల మీద ఆసక్తి అధికం. మెట్టింటి నుండి సమయానుకూల సహాయం లభిస్తుంది. పూర్ణ దృష్టితో శుక్రుడు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక ధనమును అనవసరంగా అదుపు లేకుండా వ్యయం చేస్తారు. వివాహేతర సంబంధాలకు ధనవ్యయం చేస్తారు. సప్తమ  భావంలో ఉన్న శుభగ్రహం శుభుల చేరిక సంబంధాలు కల్గి ఉన్న జీవిత బాగస్వామికి విశ్వాసపాత్రులుగా ఉంటారు.


  శని :- సింహ లగ్నానికి శని అష్టమ, సప్తమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు.  సింహ లగ్నస్థ శని అకారక గ్రహంగా అశుభ ఫలితం ఇస్తుంది. సింహ లగ్నస్థ శని వ్యక్తిని సమాజ విరోధ కార్యాలకు ప్రోత్సహిస్తుంది. లగ్నస్థ శని వీరికి అపకీర్తిని, కపట స్వభావాన్ని  కలిగిస్తుంది. లగ్నస్థ శని తృతీయ దృష్టి కారణంగా కనిష్ట సోదరుల సహకారం అందదు. సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుండి కష్టములు ప్రాప్తిస్తాయి. వీరి కపట వృత్తి కారణంగా మిత్రుల నుండి సహకారం అందదు. వీరికి పేరాశ అధికం. లగ్నస్థ శని శుభ గ్రహ చేరిక శుభగ్రహ దృష్టి కలిగి ఉన్న అశుభ ఫలితాలు తగ్గవచ్చు.


రాహువు :- సింహ లగ్నస్థ రాహువు అశుభఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ రాహువు వీరికి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని క్షీణింపచేస్తుంది. ఆ కారణంగా స్వయం నిర్ణయం చేసుకునే శక్తి లోపిస్తుంది. వీరు సంఘంలో గౌరవ మర్యాదలను కాపాడు కోవడానికి శ్రమించవలసి వస్తుంది. వీరికి మంత్ర తంత్రములు గుప్త విద్యల అందు ఆసక్తి అధికం. లగ్నస్థ రాహువు వలన వీరికి రాజనీతి అందు ప్రావీణ్యం కలిగి ఉంటారు. రాహువు సప్తమ దృష్టి కారణంగా మిత్రుల నుండి భాస్వాముల నుండి విశేష సహాయ సహకారం లభించదు. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు.


 కేతువు :- శత్రురాశి అయిన సింహరాశిలో ఉన్న కేతువు అశుభ ఫలితాలను ఇస్తాడు. లసింహ లగ్నస్థ కేతువు అనారోగ్యం కలిగిస్తాడు. కేతు దశాకాలంలో వీరికి ఆరోగ్య సమస్యలు తలెత్త గలవు. వీరికి తల్లి తండ్రుల మీద అధికమైన ప్రేమాభిమానాలు ఉండవు. ఎల్ల వేళలా మానసిక చింత వీరిని బాధిస్తుంది. సప్తమ భావం మీద కేతువు దృష్టి  కారణంగా వైవాహిక జీవితంలో ఓడిదుడుకులు ఉంటాయి. జీవిత భాస్వామి అనారోగ్యానికి గురి కాగలరు.

4, అక్టోబర్ 2013, శుక్రవారం

కర్కాటక లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

  సూర్యుడు:- కర్కాటక లగ్నానికి సూర్యుడు ధనస్థానాఢిపతి ఔతాడు. కటక  లగ్నస్థ సూర్యుడు వ్యక్తికి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు. రవి దశలో ఆరోగ్య సమస్య లు ఎదుర్కొంటారు.
వీరికి కోపం, స్వాభిమానం ఎక్కువ. వీరికి వ్యాపారం మీద ఆసక్తి , ఉద్యోగం మీద కోరిక ఉంటాయి. ప్రభుత్వం నుండి సమస్యలు ఎదురౌతాయి. తండ్రితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. బంధు మిత్రులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వీరికి నిలకడ ఉండదు. వీరికి భాగస్వామ్యం కలిసి రాదు. కటక లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానమైన మకరం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవితభాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.
 
చంద్రుడు:- కర్కాటక లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి, రాశ్యాధిపతిగా కారక గ్రహమై శుభఫలితం ఇస్తాడు. కటక లగ్నస్థ చంద్రుడు భగవత్భక్తి, పెద్దల ఎడ గౌరవ మర్యాదలు, పరోపకార గుణం కలిగిస్తాడు. వీరిలో మనోబలం ఎక్కువగా ఉంటుంది. స్వప్రయత్నంగా సమాజంలో ఉన్నత స్థానం చేరుకుంటారు. వ్యాపార, కళారంగాలలో సాఫల్యత కలుగుతుంది. జ్ఞానం, ఉన్నత విద్య కలిగి ఉంటారు. సత్య వాక్కే అయినా కఠినంగా మాట్లాడటం వలన వీరు విరోధమును ఎదుర్కొంటారు. లగ్నస్థ చంద్రుడు  పూర్ణ దృష్టిని సప్తమ భావం మీద ప్రసరిస్తాడు కనుక జీవిత భాగస్వామికి  సౌందర్యం ఇస్తాడు. జీవిత భాగస్వామి సహాయసహకారాలు లభిస్తాయి. వీరికి భాగస్వామ్యం కలసి వస్తుంది. భాగస్వాములు సహకరిస్తారు. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. 
 
కుజుడు :- కర్కాటక లగ్నానికి కుజుడు పంచమాధిపతి, దశమాధిపతి ఔతాడు. త్రికోణాధిపతిగా, దశమాధిపతిగా కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. అయినా లగ్నస్థ కుజుడు 
వ్యక్తికి క్రోధగుణం, ఉగ్రస్వభావం కలిగిస్తాడు. వీరికి మహత్వకాంక్ష అధికం. వీరికి రాజకీయాలు లాభిస్తాయి. లగ్నం నుండి కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ భావముల మీద దృష్టిని ప్రసరిస్తాడు కనుక ఆర్ధిక లాభం అలాగే అధిక వ్యయం కలిగిస్తాడు. ధనసంపాదన వీరికి కఠిన విషయం. తెలివి తేటలు పేరాశ వీరికి అవమానాలను ఇస్తుంది. లగ్నస్థ కుజుడు సంతాన ప్రాప్తి కలిగిస్తాడు. కుజుడి సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో మాధుర్యం లోపించి కలహపూరితంగా ఉంటుంది.
 
బుధుడు:- కటక లగ్నానికి బుధుడు తృతీయ, ద్వాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. బుధుడి కటక లగ్నస్థ స్థితి వ్యక్తికి సందేహాస్పద వ్యక్తిత్వం, ఆచరణ, అలవాట్లు కలిగి ఉంటాడు. వీరికి వ్యాపారంలో ఆసక్తి తక్కువ, ఉద్యోగంలో ఆసక్తి ఎక్కువ. కనుక జీవనోపాధికి ఉద్యోగాన్ని ఎన్నుకుంటారు. వీరికి బంధుమిత్రులతో సోదరులతో విశేషమైన ఆప్యాయత ఉండదు. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని ప్రసరిస్తాడు కనుక వైవాహిక జీవితం అశాంతి మయంగా ఉంటుంది,  భాగస్వాముల వలన హాని కలుగుతుంది. శత్రువుల వలన కష్టములు ఎదుర్కొనవలసి ఉంటుంది.
 
గురువు :- కటక లగ్నానికి గురువు షష్టమ, నవమభావాలకు అధిపతి ఔతాడు. లగ్నానికి గురువు త్రికోణాధిపత్యమైన నవమస్థానాధిపతిగా కారక గ్రహమై శుభఫలితాలను ఇస్తాడు. కటక లగ్నంలో గురువు ఉచ్ఛస్థితిని పొందుతాడు కనుక వ్యక్తికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తాడు. గురువు పరి పూర్ణ దృష్టితో మిత్ర స్థానమైన పంచమ స్థానం అయిన వృశ్చికాన్ని,  సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక సంతాన భాగ్యం ఉంటుంది. ఉత్తమమైన జీవితభాగస్వామి లభిస్తుంది. భాగస్వాముల సహాయ సహకారాలు అందుతాయి. నవమ స్థాన దృష్టి ఫలితంగా సంపూర్ణ భాగ్యశాలి ఔతాడు. ధన, ధాన్య సంపదలతో జీవితం పరిపూణ భాగ్యంతో గడుస్తుంది. వ్యాపారంలో ఉదారత, దయాస్వభావం కలిగి ఉంటారు.
 
శుక్రుడు:- కటక లగ్నానికి శుక్రుడు చతుర్ధ, ఏకాదశాధిపతి ఔతాడు. లగ్నస్థ శుక్రుడు వ్యక్తికి పిరికితతనం, భయం కలిగిస్తాడు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగ వఆపారాలలో సఫలత లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ దృష్టి శని స్థానం మిత్ర స్థానమైన మకరం మీద ఉంటుంది కనుక వ్యక్తికి పరిశ్రమించే గుణం ఉంటుంది. స్త్రీల మీద వీరికి విశేష ఆకర్షణ ఉంటుంది. అందమైన శ్రమకు ఓర్చే జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. భాగస్వాములు అనుకూలురై శ్రమిస్తారు.
 
 రాహువు:- కటక లగ్నంలో రాహువు వ్యక్తిని విలాసవంతుడిగా చేసి ష్ఖభోగముల మీద ఆకర్షణ కలుగచేయును. కఠిన పరిశ్ర తరువాత వ్యాపారంలో సఫలత సాధిస్తారు. ఉద్యోగములో అతిత్వరితంగా సఫలత లభిస్తుంది. రాహువు సప్తమ దృష్టి ఫలితంగా వైవాహిక జీవితంలో అశాంతి చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభించవు. భాగస్వామీ  వలన నష్టములు కలుగ వచ్చు.
 
 కేతువు:- కటక లగ్నస్థ కేతువు ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు. కేతుదశా సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. సమాజం నుండి గౌరవ, సన్మానాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. గుప్తమైన శత్రువులు ఉంటారు. వారి వలన సమస్యలను ఎదుర్కొంటారు. కేతువు సప్తమ స్థాన దృష్టి ఆ స్థానకారకత్వమును బాధిస్తుంది. వవాహిక జీవితంలో సుఖం లోపిస్తుంది వివాహేతర సంబంధాలు కలిగే అవకాశం ఉంటుంది.

3, అక్టోబర్ 2013, గురువారం

మిధునలగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

సూర్యుడు ;- మిధున లగ్నానికి సూర్యుడు తృతీయ స్థానాధిపతి ఔతాడు. సూర్యుడు లగ్నంలో ఉన్న కారణంగా ముఖవర్ఛస్సు ఉంటుంది. అందం, ఆకర్షణ, ఉదారస్వభావం కలిగి ఉంటారు. సాహసము, ధైర్యము, పురుషలక్షణం అధికంగా ఉండును.

చంద్రుడు :- మిధున లగ్నానికి చంద్రుడు ధనాధిపతి. కుంటుంబ అధిపతి. కనుక చంద్రుడు మిధున లగ్నానికి శుభం ధనాధిపతి లగ్నంలో  ఉండడం కారణంగా చంద్రుడు మిధున  లగ్నం వారికి  శుభం కలిగిస్తాడు. వీరికి   తల్లి సహకారం ఉంటుంది. చంద్రుడు లగ్నంలో ఉంటే ఆకర్షణ కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత స్వభావం కలిగి ఉంటారు. లగ్నం నుండి కళత్ర స్థానమైన దృష్టి  సారిస్తాడు కనుక ఆకర్షణీయమైన జీవిత భాగస్వామి లభిస్తారు. ఆకర్షణీయంగా మాట్లాడతారు. కుటుంబం వీరికి సహకరిస్తుంది. సంపన్న జీవితం గడపగలుగుతారు.


కుజుడు :- మిధున లగ్నానికి కుజుడు షష్టమ, ఏకాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక అకారక గ్రహంగా అశుభఫలితాలను ఇస్తాడు. మిధున లగ్నములో కుజుడు ఉంటే వ్యక్తి పరాక్రమవంతుడు, శక్తివంతుడుగా ఉంటాడు. అస్థిర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఎదురౌతుంది. యాత్రచేయుటలో ఆసక్తి ఉంటుంది. రక్షణవ్యవస్థలో రాణిస్తారు. తల్లి తండ్రుల నుండి సహకారం లభించదు.శత్రువుల వలన కష్టాలను చవి చూస్తారు. లగ్నస్థ కుజుని దృష్టి సప్తమ భావం మీద ఉంటుంది కనుక వైవాహిక జీవితంలో కష్టములు ఎదురౌతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యసమస్యలు ఉంటాయి.


బుధుడు :-  మిధున లగ్నానికి లగ్నాధిపతి అయిన బుధుడు శుభఫలితాన్ని ఇస్తాడు. మిధునలగ్నంలో ఉన్న బుధుడు వ్యక్తికి వాక్ధాటి, మంచి జ్ఞాపక శక్తి కలవారై ఉంటారు. వీరు సహజంగానే వ్యాపార మేళుకువలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు ధనసంపాదనా మార్గాలను మార్చుతుంటారు కనుక అర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వీరు రచయితగా, లేఖకునిగా, సంపాదకునిగా సఫలతను పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ప్రసన్నత సహకారం లభించును.


గురువు :- మిధున లగ్నంలో గురువు సప్తమ, దశమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. ద్వకేంద్రాధిపత్య కారణంగా గురువు అకారక గ్రహంగా అశుభ ఫలితాలను ఇస్తాడు.
లగ్నంలో గురువుతో బుధుడి చేరి ఉన్న అశుభ ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి. గురువు లగ్నంలో ఉండి వ్యక్తికి అందమైన శ్వేత వర్ణం కలిగిన శరీరాన్ని ప్రసాదిస్తాడు.దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. స్తయ వాక్కు, జ్ఞానం, చాతుర్యం కలిగిన వ్యక్తిగా ఉంటారు. సమాజంలో గౌరవం మర్యాద లభించును. గురువు తాను కాకత్వం వహించే విషయాలలో శుభఫలితాలు ఇస్తాడు. పుత్ర స్థానం, పంచమ స్థానం అయిన తుల, సప్తమ స్థానమైన ధనసు, నవమ స్థానమైన కుంభం మీద దృష్టిని సారిస్తాడు కనుక పుత్రులు, జీవిత భాగస్వామి, తండ్రి నుండి అనుకూలత లభిస్తుంది.


శుక్రుడు:-  మిధున లగ్నానికి శుక్రుడు పంచమ, ద్వాదశాధిపతి ఔతాడు. త్రికోణాధిపత్యం వహిస్తాడు కనుక శుభఫలితాన్ని ఇస్తాడు. మిధున లగ్నంలో మిత్ర స్థానమున ఉన్న శుక్రుడు శుభఫలితాన్ని ఇస్తాడు. మిధున లగ్నంలో శుక్రుడు ఉన్న వ్యక్తి సన్నగా నాజూకుగా అందంగా ఉంటాడు. భౌతిక సుఖాలపట్ల వీరు అత్యంత ఆసక్తులుగా ఉంటారు. సుఖంగా ఉండడానికి ధనవ్యయం అధికంగా చేస్తారు. సమాజంలో గౌరవం ప్రాప్తిస్తుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి మీద ప్రేమ కలిగి ఉంటారు. వివాహేతర సంబంధాలు ఉండవచ్చు.

 శని :- మిధున లగ్నానికి శని అష్టమ, నవమ స్థానాధిపత్యం వహిస్తాడు. త్రికోణ స్థానాధిపత్యం వలన అష్టమ స్థానాధిపత్య దోషం ఉండదు. అందువలన శని మిధున లగ్నకారులకు శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శని ఆరోగ్య సమస్యలకు గురి చేస్తాడు. వాత, పిత్త, చర్మ రోగములు కలిగిస్తాడు. శని భాగ్య స్థానాధిపతి కనుక శనీశ్వరుడి మీద భక్తి కలుగుతుంది. లగ్నస్థ శని తృతీయ స్థానం శతృ స్థానం అయిన సింహం మీద, సప్తమ స్థానం అయిన ధనసు మీద, దశమ స్థానం అయిన మీనం మీద దృష్టిని సారిస్తాడు కనుక కామం కనిష్ట సోదరులతో విరోధం, కామం అధికంగా ఉండుట,  ప్రభుత్వ పరమైన దండన అనుభవించుట కలుగవచ్చు. తల్లి తండ్రులతో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండవు. పరిశ్రమించగల గుణం ఉంటుంది.


 రాహువు :- రాహువుకు మిధునం  మిత్ర స్థానం. ఈ కారణంగా వ్యక్తి మేధావిగా, కార్యకుశలత కలిగి ఉంటారు. కుశలతతో కార్యాలను చేపడతారు. ఆరోగ్యం, ఆకర్షణ కలిగిన శరీరం కలుగుతుంది. సాహసం అధికంగా ఉంటుంది. మిధున లగ్న జాతక స్త్రీలకు సంతానం పొందుటలో సమస్యలను  ఎదుర్కొంటారు. రాహువు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం మీద సారిస్తాడు కనుక వైవాహిక జీవితంలో కలహాలు చోటు చేసుకుంటాయి.


 కేతువు :- మిధున లగ్నంలో కేతువు వ్యక్తికి స్వాభిమానం కలిగిస్తాడు. స్వతంత్రంగా పని చేసే సామర్ధ్యం ఉండదు. ఇతరులతో చేరి పని చేయుటలో ఆసక్తి కలుగి ఉంటారు.వ్యాపారం చేయుటలో కోరిక ఉంటుంది. అలాగే ఉద్యోగం అందు ఆసక్తి ఉంటుంది. స్వార్ధం అధికంగా ఉంటుంది. వాత పిత్త రోగములు బాధిస్తాయి. కామం ఎక్కువ, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి.  వివాహానంతరం కూడా వివాహేతర సంబంధాలు కొనసాగుతాయి.

2, అక్టోబర్ 2013, బుధవారం

వృషభ లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

సూర్యుడు:- సూర్యుడు వృషభరాశికి చతుర్ధాధిపత్యం వహిస్తాడు. కేంద్రాధిపతి కనుక సూర్యుడు వృషభ లగ్నానికి శుభ కారక గ్రహమై ఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ సూర్యుడు వ్యక్తికి ఆత్మవిశ్వాసం, ప్రకాశవంతమైన ముఖ వర్చస్సు ఇస్తాడు. ఆకర్షణీయమైన వీరి మాటలు ఇతరుల మీద ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ సహకారం అందుకుంటారు. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం వీరికి అనుకూలమే. పంచమాధి పతి లగ్నంలో ఉన్న కారణంగా సంతానంతో సత్సంబంధాలు ఉంటాయి. సంతానం నుండి సహాయ సహకారాలు ఉంటాయి. మనోధైర్యం అధికం. సూర్యుడి పూర్ణదృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన వృశ్చిక లగ్నం మీద ఉంటుంది కనుక జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. జీవిత భాగస్వమి కోపస్వభావం కలిగి ఉంటారు. భాగస్వాముల, మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. భాగస్వాములతో ఉద్రేక పూరిత వాతావరణం ఏర్పడినా విశ్వాస పాత్రులుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. 
 

చంద్రుడు :- వృషభ లగ్నానికి చంద్రుడు తృతీయాధి పతి ఔతాడు. కాని చంద్రుడు వృషభంలో ఉచ్ఛస్థితిని పొందుతాడు కనుక చంద్రుడు వృషభ లగ్న జాతకులకు శుభ ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వీరికి అందమైన శరీరాన్ని ఇస్తాడు. జల కారకుడైన శుక్రుడు ఆధిపత్యం వహించే వృషభ లగ్నంలో శీతల స్వభావం ఉన్న చంద్రుడు ఉన్నందున శీతల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉంటారు. వీరికి జలుబు, దగ్గు, ఆయాస సంబంధిత వ్యాధులు రావచ్చు. మానసిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది. గుణవంతులుగా, దయాస్వభావులుగా ఉంటారు. విలాసవంతమైన జీవితం అంటే మక్కువ చూపుతారు. తల్లితో సత్సంబంధాలు ఉంటాయి. మాతృ వర్గ బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. తల్లి తండ్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. కళలంటే ఆసక్తి ఎక్కువ. కల్పనా శక్తి అధికం. ప్రకృతి సౌందర్యానికి ఆకర్షితులు ఔతారు. జలం, నౌకాప్రయాణం, జలప్రదేశాలు వీరిని ఆకర్షిస్తాయి. వీరికి కళాభిమానం ఎక్కువ. కళారంగ సంబంధ వృత్తులలో వీరు రాణిస్తారు.చంద్రుడి పూర్ణ దృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానమైన వృశ్చికం మీద సారిస్తాడు కనుక వీరికి అందమైన ప్రేమ పూరితమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. వీరికి భాగస్వామ్యం అనుకూలిస్తుంది. భాగస్వాములు స్నేహపూరిత సహకారం అందిస్తారు.

కుజుడు :- వృషభ లగ్నానికి కుజుడు సప్తమ, ద్వాదశాధిపతి ఔతాడు. కేంద్రాధిపత్యం వహిస్తాడు కనుక కుజుడు వీరికి కారక గ్రహమై శుభఫలితాలు అందిస్తాడు. వృషభ లగ్నంలో లగ్నాధిపతిగా కుజుడు ఉన్న కారణంగా వ్యక్తి ఆకర్షణీయం బలిష్టం అయిన శరీరం ఇస్తాడు. విలాసవంతమైన జీవితం పట్ల ఆకర్షితులౌతారు. కోపస్వభావం కనబరుస్తారు. వ్యవసాయ రంగం మీద మక్కువ చూపుతారు. భూములు కొనుగోలు చేయడం పట్ల ఆసక్తి చూపుతారు. సాహసవంతమైన వృత్తులలో రాణిస్తారు. వ్యాపారంలో రాణించడం కష్టం. రక్షణ వ్యవస్థలో ఉద్యోగం చేయడం పట్ల ఆసక్తి చూపుతారు. లగ్నస్థ కుజుడు చతుర్ధ దృష్టిని మిత్ర స్థానం అయిన సింహం మీద ప్రసరిస్తాడు కనుక తల్లి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. తల్లి కోపస్వభావం కలిగి ఉంటుంది. లగ్నస్థ కుజుని సప్తమ దృష్టిని వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక కోపస్వభావం కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. కాని జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. లగ్నస్థ కుజుని అష్టమ స్థాన దృష్టి మిత్ర్ స్థానమైన ధనస్సు మీద ప్రసరిస్తాడు కనుక ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భాగస్వాములతో వీరికి అభిప్రాయ బేదాలు తలెత్తుతాయి. భాగస్వామ్యం వీరికి సాధారణంగా ఉంటుంది. మిత్రులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి.

బుధుడు :- వృషభ లగ్నానికి బుధుడు ధనాధిపత్యం, పంచమాధిపత్యం వహిస్తాడు. త్రికోణాధిపతి లగ్నస్థుడు ఔతాడు కనుక బుధుడు వృషభ లగ్నానికి కారక గ్రహమై శుభ ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ బుధుని కారణంగా వ్యక్తి బుద్ధికుశలత, సాహసం కలిగి ఉంటాడు. వీరికి వ్యాపారం అనుకూలిస్తుంది. ధైర్యం అధికం. స్వంత నిర్ణయాలు మనోబలంతో తీసుకుని విజయం సాధిస్తారు. సాహసవంతమైన వృత్తులను స్వీకరించి నైపుణ్యం చూపించగలరు. శిక్షణకు సంబంధించిన ఉపాద్యాయ వృత్తిలోరాణిస్తారు. బుధుని పూర్ణ దృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన వృషభం మీద ఉంటుంది కనుక మీత్రుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి. స్నేపూరితమైన అందమైన ప్రేమను చూపించే జీవితభాస్వామి లభిస్థుంది. జీవిత భాగస్వామి సహాయ సహకాతారు అందుకుంటారు. భాగస్వామ్యం వీరికి అనుకూలం. వీరికి భాగస్వాములు స్నేహపూరిత సహకారం అందిస్తారు.

గురువు :- వృషభ లగ్నానికి గురువు అష్టమ, ఏకాదశ స్థానములకు ఆధిపత్యం వహిస్తాడు. లగ్నత్ష గురువు ఆకర్షణీయమైన, సౌందర్యం ఇస్తాడు.కనుక వృషభలగ్నానికి  అకారక గ్రహమై అశుభ ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ గురువు వ్యక్తికి జ్ఞానం, సుగుణం ఇస్తాడు. ఆత్మబలం, ఆత్మ విశ్వాసం ఇస్తాడు. వ్యాపార రంగం కంటే ఉద్యోగంలో రాణిస్తారు. ధర్మగుణం, దయాగుణం కలిగి ఉంటారు. ధర్మకార్యాల పట్ల ఆసక్తులై ఉంటారు. గురువు పంచమ దృష్టి కన్యారాశి మీద ప్రసరిస్తాడు కనుక బుద్ధి కుశలత కలిగి సహాయ సహకారాలు అందించి గౌరాభిమానం చూపించే సంతానం కలిగి ఉంటాడు. లగ్నస్థ గురువు సప్తమ స్థానమైన వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక గురువు మిత్రస్థాన దృష్టి జ్ఞానం కలిగిన గౌరవ అభిమానం చూపించి సహాయసహకారాలు చూపించే జీవిత భాగస్వామి లభిస్తుంది. భాస్వామ్యం వీరికి కలిసి వస్తుంది. భాగస్వాలు వీరికి సంపూర్ణ సహకారం అందిస్తారు. గురువు నవమ స్థాన దృష్టి మకరం మీద ప్రసరిస్తాడు కనుక తండ్రితో సాధారణ సంబంధాలు ఉంటాయి. పిత్రార్జితం స్వల్పంగా సంక్రమిస్తుంది.

శుక్రుడు:- వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి ష్టమాధిపతి ఔతాడు. లగ్నాధిపతిగా శుక్రుడు కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నాధిపతిగా శుక్రుడు అందమైన శరీరం ఇస్తాడు. అరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. జలుబు, దగ్గు, ఆయాసం లాంటి వ్యాధులు ఉంటాయి. మనోబలం అధికం. జనాకర్షణ కలిగిఉంటారు. కళారంలో వీరు ప్రతిభ చూపగలరు. కళాసంబంధిత వృత్తులలో రాణిస్తారు. వలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తి చూపుతారు. సుఖజీవితం కొరకు ఎక్కువగాఖర్చు చేస్తారు. సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలను చేపడతారు. ఆర్ధిక పరిస్థితిబాదా ఉంటుండీ. ధనార్జన బాగా చేస్తారు. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం అయిన వృశ్చికం మీద సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి విలాసాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కోపస్వభావం కలిగిన అందమైన ప్రేమించే జీవిత భాగస్వామి లభిస్తుంది. వైవాహిక జీవిత సుఖం సాదారణం. మిత్రులు, భాగస్వాములు ఉద్రేక పూరిత గుణం కలిగి ఉంటారు. భాగస్వామ్యం వీరికి సాదారణ ఫలితాన్ని ఇస్తుంది.
శని :- వృషభ లగ్నానికి శని నవమ, దశమ స్థానాధిపత్యం వహిస్తాడు. ధర్మకర్మాధిపత్యం చేసే శని మిత్ర స్థానమైన వృషభ లగ్నానికి శుభుడై శుభ ఫలితాలు ఇస్తాడు. శని లగ్నాధిపత్యం వలన సన్నని ఆకర్షణీయమైన శరీరం కలిగి ఉంటాడు. పరిశ్రమించి ఉన్నత కార్య సాధన చేస్తాడు. ఆర్ధిక స్థితి సాధారణం. తల్లితో వీరికి సఖ్యత సాదారణం. సోదరులతో సఖ్యత ఉండదు. కఠిన స్వభావం కారణంగా ఇతరుల అసహనానికి గురి ఔతారు.  శని తృతీయ దృష్టి కారణంగా సోదరులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి. సోదరుల సహాయ సహకారం ఉండదు. లగ్నష శని పూర్ణ దృష్టి సప్తమ స్థానమైన వృశ్చికము మీద ప్రసరిస్థాడు కనుక పరుష వాక్కులు పలికి క్రోధ స్వభావం కలిగి, శ్రమించే గుణం కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయసహకారాలు అందవు. భాగస్వామ్యం వీరికి అనుకూలించదు. భాగస్వాముల సహకారం లభించదు. మిత్రుల సహకారం ఉండదు. లగ్నస్థ శని నవమ స్థాన దృష్టి కారణంగా తండ్రితో సత్సంబంధాలు ఉండవు. తల్లి తండ్రుల ప్రేమాభిమానాలకు, సహాయసహకారాలకు దూరం ఔతారు.

రాహువు :- వృషభ లగ్నస్థ రాహువు వ్యక్తికి రోగరహిత శరీరాన్ని ఇస్తాడు. కపట స్వభావం ఉంటుంది. రాహువు సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితం బాధిస్తుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సుఖం ఉండదు. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. 

కేతువు:- వృషభ లగ్నస్థ కేతువు వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఇస్తాడు. స్త్రీ పురుషుల మద్య మీద ఆకర్షణ ఉంటుంది. వివాహేతర సంబంధాల వలన వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి.

1, అక్టోబర్ 2013, మంగళవారం

మేష లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

మేష లగ్న   గ్రహముల  వలన కలిగే ఫలితాలు

సూర్యుడు :- మేషలగ్నానికి సుర్యుడు పంచమాధిపతి కనుక సూర్యుడు మేషలగ్నానికి శుభుడు. పంచమాధిపతి లగ్నములో ఉచ్ఛస్థితిలో ఉపస్థితమై ఉన్న కారణముగా వ్యక్తి అందము ఆకర్షణ కలిగి ఉంటాడు. విద్యావంతుడు ఔతాడు. జీవిత సరళిలో తండ్రితో విభెదాలు తల ఎత్త వచ్చు. ఆర్ధిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. సూర్యుడు పాపగ్రహ పీడితుడు కాక ఉన్న ప్రభుత్వపక్షము నుండి సహాయము అందుతుంది. సుర్యుడి ప్రభావము వలన సంతానప్రాప్తి కలుగుతుంది. సూర్యుడు తన పూర్ణదృష్టితో సప్తమ భావమైన తులారాశిని చూస్తాడు కనుక తులారాశి అధిపతి సూర్యుడు కనుక జీవితభాగస్వామి అందముగా ఉంటారు. జీవిత భగస్వామి సంయోగము లభిస్తుంది. కాని వివాహ జీవితములో ఒడి దుడుకులు ఉంటాయి.

  చంద్రుడు :- చంద్రుడు మేషలగ్నానికి సుఖస్థానాధిపతి కనుక జాతకుడు శాంత స్వభావుడైనా కొంటె తనము కలిగి ఉంటారు. కల్పనాశక్తి, మరియు భోగలాలస కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితము మీద ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి తల్లి నుండి తల్లి పక్షము నుండి సహాయము లభిస్తుంది. భూమి, భవనము, వాహన ప్రాప్తి కలిగి ఉంటారు. ప్రకృతి ఆరాధన, సౌందర్యపిపాస కలిగిఉంటారు. చలి వలన కలిగే జలుబు, దగ్గుల వలన బాధలు ఉంటాయి. చలి సంభందిత రోగములకు అవకాశము ఉంది. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వము, ప్రభుత్వ పక్షము నుండి ప్రయోజనము ఉంటుంది. సప్తమంలో తులారాశి మీద చంద్రుడి దృష్టి పూర్ణముగా ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామి కళాదృష్టి కలిగి, గుణసంపద కలిగి, సహాయసహకారాలు  అందించే వారుగా ఉంటారు.


కుజుడు :- కుజుడు మేషలగ్నానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి ఔతాడు. లగ్నాధిపత్యము వలన అష్టమాధిపత్య దోషం పోతుంది. కుజుడు లగ్నస్థుడు కనుక జాతకుడు కండలు తిరిగిన శరీరముతో సాహసవంతుడు, పరాక్రశాలిగా ఉంటాడు. కోపము, మొరటుదనము ఎక్కువ. కఠినమైన పనులను కూడా ఆత్మబలముతో చేయకలిగిన సామర్ధ్యము కలిగి ఉంటారు. సమాజములో  పేరు, ప్రతిష్ఠలు కలిగి ఉంటారు. బలహీనుల పట్ల వీరి హృదయములో సానుభూతి ఉంటుంది. కుజుడు చతుర్ధ స్థానమును, సప్తమ స్థానమును, అష్టమస్థానమును చూస్తాడు. దీని కారణముగా భూమి, వాహన సౌఖ్యము లభిస్తుంది. దుర్ఘటనలు జరగడానికి అవకాశము ఉంది. భార్యా భర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి కనుక వైవ్వహిక జీవితము బాధించ బడుతుంది.


 బుధుడు :- బుధుడు మేషలగ్నానికి తృతీయ మరియు షష్టమభఅవాధిపతిగా అశుభము కలిగించును. లగ్నములో ఉన్న బుధుడు వ్యక్తిని జ్ఞానిగా, బుద్ధిమంతుడిగా చేయును. కళాక్షేత్రములో, లేఖకుడిగా అవకాశములు లభిస్తాయి. బుధ దశలలో బంధుమిత్రులతో వివాదములు, అశాంతి ఉంటాయి. షష్థమ స్థానాధిపతిగా బుధుడు ఉదర సంబంధమైన వ్యాదులు, మూర్చ వ్యాధి, ఆజన్మ రోగములు,  మతిమరుపు కలిగిస్తాడు. వ్యాపారములో వీరికి సఫలత లభిస్తుంది.  బుదుడి సప్తమ దృష్టికారణముగా సంతాన సంబంధాలలో సమస్యలు ఎదురౌతాయి. జీవితభాగస్వామికి ఆరోగ్యసమస్యలు ఉంటాయి. సప్తమమైన తులారాశి మీద బుధుడి దృష్టి కారణముగా జీవితభాగస్వామి గుణవంతుడుగా ఉంటాడు. వైవాహిక జీవితము సాధారణముగా ఉంటుంది. 


  గురువు :- మేషలగ్నానికి గురువు భాగ్యాధిపతి వ్యయాధిపతి ఔతాడు. ద్వాదశస్థానాధిపత్యము కారణముగా గురువు మేషలగ్నానికి అకారణమైన అసుభఫలములు ఇస్తాడు. అయినా త్రికోణాధిపత్యముతో అశుభము తొలగి పోతుంది. మేషలగ్న గురువు కారణముగా జాతకుడు మేధావి మరియు  జ్ఞాని ఔతాడు. ఉజ్వలమైన ప్రభావవంతమైన వాక్కు వీరి స్వంతము. వీరికి ప్రజా సన్మానము, ప్రతిష్థ కలుగుతాయి. లగ్నస్థ గురువు పంచమ, సప్తమ, నవమ భావమును చూస్తాడు కనుక సంతాన భాగ్యము ఉంటుంది. శత్రు స్థానమైన తులారాశి మీద గురువు దృష్టి ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామికి మనోకలతలు ఉంటాయి. నమస్థానమైన ధనసు మీద గురువు దృష్టికి కారణముగా తండ్రికి శుభములు కలుగుతాయి.


శుక్రుడు :- శుక్రుడు మేష లగ్నానికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి ఔతాడు. శుక్రుడు లగ్నస్థముగా కష్టములు, రోగములు కలిగిస్తాడు. జాతకుడు అందంగా కనిపించినా ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటాడు. శుక్రదశలో వీరు అధికముగా కష్టములను ఎదుర్కొంటారు. లగ్నస్థ శుక్రుడి కారణముగా స్త్రీ పురుషల మద్య ఆకర్షణ అధికము.


  శని :- లగ్నస్థ శని మేషలగ్నముకు దశమాధిపతిగా శుభములను, ఏకాదశాధిపతిగా అశుభమును కలిగిస్తాడు. లగ్నస్థ శని కారణముగా జాతకుడు సన్నముగా పొడవుగా ఉంటాడు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, దశమ స్థానాలపై దృష్టి సాగిస్తాడు. కనుక జాతకుడికి బంధుమిత్రుల సహకారము లభించుట కష్టము. ఉద్యోగ వ్యాపారములలో నిలకడ ఉండదు. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి.


 రాహువు :- మేషలగ్నములో రాహువు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. జీవితములో చాలా సంఘర్షణ ఉంటుంది. ఉదర సంబంధిత వ్యాదులు ఉంటాయి. ఉద్యోగవ్యాపారాలలో అతి కష్టము మీద సఫలత సాధిస్తారు. వ్య్యాపారము చేయాలన్న కోరిక ఉన్నా ఉద్యోగము అధిక సఫలత ఇస్తుంది. రాహువు సప్తమదృష్టి కారణముగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. వైవాహిక జీవితము బాధిస్తుంది. మిత్రులు, సహోదరులు సహకరిస్తారు.


  కేతువు :- మేషలగ్నస్థ కేతువు కారణముగా శారీరక బలము కలిగిఉంటారు. వీరి దరికి రోగములు చేరవు. ఆత్మవిశ్వాసము , ధైర్య సాహసములు కలిగి ఉంటారు. కనుక శత్రువులు భయభక్తులతో ఉంటారు. సమాజములో గౌరవము, ఖ్యాతి లభిస్తుంది. రాజనీతి, చతురత కలిగి ఉంటారు. మాతృ వర్గము నుండి సఫలత లభిస్తుంది. జీవిత భాగస్వామి నుండి సంతానము నుండి సమస్యలను ఎదుర్కొంటారు.

30, సెప్టెంబర్ 2013, సోమవారం

లగ్న సూచనలు

జ్యోతిష పరంగా లగ్నాన్ని  శిశువు జన్మించిన కాలాన్ని అనుసరించి గణించబడుతుంది. లగ్నం అంటే జాతక చక్రంలో మొదటి స్థానం. లగ్నం అంటే జాతకుని శిరోస్థానాన్ని సూచిస్తుంది. గుణగణాలు రూపు రేఖలు లగ్నం అందు ఉన్న గ్రహాలను అనుసరించి పండితులు నిర్ణయిస్తారు. దశమ స్థానం మరియు కేంద్ర స్థానానమైన దశమాధిపతి సూర్యుడు, ధనస్థానమైన రెండవ మరియు పుత్ర స్థానం త్రికోణ స్థానం అయిన పంచమ స్థానాధిపతి గురువు, యోగకారకుడు మరియు త్రికోణ స్థానాధిపతి అయిన చంద్రుడు వృశ్చిక లగ్నానానికి శుభం కలిగిస్తారు. సప్తమ స్థానాధిపతి మరియు వ్యయ స్థానమైన ద్వాదశ స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు, అష్టమ స్థానాధిపతి మరియు లాభాధిపతి అయిన బుధుడు ఈ లగ్నానికి అశుభం కలిగిస్తారు.శిశువు వృశ్చిక లగ్నంలో జన్మించినపుడు లగ్నంలో ఉపస్థితమైన గ్రహాలను అనుసరించి పండితులచేత చెప్పబడిన కొన్ని ఫలితాలను క్రింది జాబితాలో పరిశీలించ వచ్చు.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...