శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

14, జనవరి 2016, గురువారం

Bhoogi


14-Jan-2016
ముహూర్తం: సూర్యోదయం: 6.53 గంటలకు
సూర్యాస్తమయం: 5.57 గంటలకు
శ్రీమన్మథ నామ సంవత్సరం-పుష్యమాసం
దక్షిణాయనం-హేమంతరుతువు
శుక్లపక్షం
పంచమి రాత్రి 10.00 వరకు
నక్షత్రం: పూర్వాభాద్ర రాత్రి 3.54 వరకు
వర్జ్యం: ఉదయం 11.19 నుంచి 12.49 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 10.34 నుంచి 11.19 వరకు
తిరిగి మధ్యాహ్నం 3.00 నుంచి 3.44 వరకు
అమృతఘడియలు: రాత్రి 8.22 నుంచి 9.52 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు.

మేషం

స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మీ రాక బంధువులకు ఎంతో సంతోషాన్నిస్తుంది. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం.

వృషభం

పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.

మిథునం

కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. మిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

కర్కాటకం

ఆకస్మిక ఖర్చులు, ధనం సమయానికి అందక పోవడం వంటి చికాకులు ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలోసందడి కానవస్తుంది. స్త్రీల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు అనుకూలిస్తాయి.

సింహం

వాణిజ్య ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ వహించండి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారుల పురోభివృద్ధి. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. స్త్రీలకు టీవీ చానెళ్లు, కళాత్మక పోటీలకు సంబంధించిన సమాచారం అందుతుంది.

కన్య

బంధువుల రాకతో మీ పనులు వాయిదాపడతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. రావలసిన ధనం సరైన సమయానికి అందుతుంది. రాజకీయ నాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.

తుల

పంతాలకు పోకుండా బంధువులతో కలిసి మెలిసి మెలగండి. విలువైన కానుకలు అందించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. గృహంలో ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి.

వృశ్చికం

బంధు మిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కొంటారు.

ధనస్సు

ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, పనిభారం తప్పదు. మీ మిత్రుల కోసం బంధువుల కోసం అదనపు బరువు బాధ్యతలను స్వీకరిస్తారు. స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచడం మంచిది.

మకరం

స్త్రీలకు చుట్టుపక్కల వారితో సమస్యలు తలెత్తుతాయి. అనుకోకుండా కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. విందులలో పరిమితి పాటించండి.

కుంభం

మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబీకుల కోసం ధనం విరివిగా వెచ్చిస్తారు. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మీ మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.

మీనం

బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి స్నేహితుల మీకు కొత్తగా పరిచయం అవుతారు. రాజకీయ నాయకులకు కొన్ని సమస్యలు, అవమానాలు తలెత్తుతాయి. ఏదైనా అమ్మకానికైనా ఆలోచన వాయిదా వేయడం మంచిది.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...