శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com
పూజలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పూజలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, అక్టోబర్ 2016, శనివారం

నవదుర్గ అవతారాలు

                                            ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు సంప్రదాయ పద్ధతి ఆచరించే ఈ నవరాత్రులను దసరా అంటారు. ఈ రోజుల్లోనే అమ్మవారిని వివిధ అలంకారాలతో పూజించి నైవేద్యాలు సమర్పించడం పరిపాటి. వీటితోపాటు ఆదిపరాశక్తి తన అంశలతో భిన్న రూపాలను స్పృశించింది. అవి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సర్వసిద్ధిధాత్రి అనే నవ రూపాలు. వీటినే నవదుర్గలుగా కొలుస్తాం.   

       
      

నవదుర్గా స్తుతి
ప్రథమా శైలపుత్రీచ, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయా చంద్రఘండేతి కూష్మాండేతి చతుర్దశీ
పంచమస్కంధమాతేతీ, షష్ట్యా కాత్యాయనేతి చ
సప్తమా కాలరాత్రిశ్చ, అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చేతి, నవదుర్గాఃప్రకీర్తితాః||


పాడ్యమి - శైలపుత్రి
వందేశాంఛిత లాభాయ చంద్రార్థాకృత శేఖరామ్‌|
వృషారూఢాంశూలాధరం శైలపుత్రీ యశస్వనామ్‌||

దుర్గామాత మొదటి స్వరూపం శైలపుత్రి. పర్వతరాజయిన హిమవంతుడి ఇంట పుత్రికగా అవతరించినందువల్ల శైలపుత్రి అయింది. వృషభ వాహనారూఢి అయిన ఈ తల్లి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలాన్ని ధరిస్తుంది. ఈ తల్లి మహిమలు, శక్తులు అనంతం. మొదటి రోజున ఉపాసనద్వారా తమ మనసులను మూలాధార చక్రంలో స్థిరపరుస్తారు. యోగసాధనను ఆరంభిస్తారు. నైవేద్యంగా కట్టె పొంగలిని సమర్పించాలి.


విదియ - బ్రహ్మచారిణి
ధధానాకర పద్మాఖ్యామక్షమాలా కమండలా|
దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యముత్తమా||

దుర్గామాత రెండవ స్వరూపం బ్రహ్మచారిణి. బ్రహ్మ అంటే తపస్సు. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది అని అర్థం. 'వేదస్తత్వం తపోబ్రహ్మ'. బ్రహ్మ అనగా వేదం, తత్త్వం, తపస్సు. ఈ తల్లి తన కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరిస్తుంది. ఈ తల్లిని పూజించిన సర్వత్రా సిద్ధి, విజయం, సాధకుడికి మనస్సు స్వాధిష్టాన చక్రంలో స్థిరమవుతుంది. కఠిన ఆహార నియమాలు ఆచరించి అపర్ణ అయింది. నైవేద్యంగా పులిహోరను సమర్పించాలి.


తదియ - చంద్రఘంట
పిండజ ప్రవరారూఢా- చండకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతేమహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా|| 

దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట. ఈ తల్లి తన శిరసున అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఈ పేరు సార్థకమైనది. ఈమె తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండికౄరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ తల్లిని ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు అవుతారు. ఇహలోకంలోనేకాక పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది. నైవేద్యం కొబ్బరి అన్నం.


చవితి - కూష్మాండ
దుర్గామాత నాల్గవ స్వరూపం  కూష్మాండం. దరహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని అవలీలగా సృష్టిస్తుంది. కాబట్టి ఈ పేరు వచ్చింది. ఈమె సర్వమండలాంతర్వర్తిని. రవి మండలంలో నివశించే శక్తి సామర్థ్యాలు ఈ తల్లికే ఉన్నాయి. ఈమె ఎనిమిది భుజాలతో ఉంటుంది. తన ఏడు చేతుల్లోనూ కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద ధరిస్తుంది. ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాలను ధరిస్తుంది. ఈమె సింహవాహనం అధిష్టిస్తుంది. సంస్కృతంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఈమెకు గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టం. ఈ దేవిని ఉపాసిస్తే మనసు అనాహతచక్రంలో స్థిరంగా ఉంటుంది. ఉపాసకులకు ఆయురారో గ్యాలను ప్రసాదించటమేగాక, వారి కష్టాలను కూడా పోగొడుతుంది. నైవేద్యంగా చిల్లులేని అల్లం గారెలను సమర్పించాలి.

పంచమి - స్కంధ మాత 
సింహాసనాగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు సదాదేవి స్కంధమాతా యశస్వినీ||

దుర్గామాత ఐదవ స్వరూపం స్కంధమాత. స్కంధుడనగా కుమారస్వామి. శక్తిధరుడు. దేవసేనల అధిపతి. నెమలి వాహనుడు. ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు 'స్కంధమాత' అనే పేరు వచ్చింది. ఈ తల్లి నాలుగు చేతులతో ఉంటుంది. స్కంధుడిని పట్టుకొని పద్మం ధరించి, ఎడమచేతిలో అభయముద్రను, కమలాన్ని ధరిస్తుంది. కమలవాసిని. శ్వేతవర్ణం కలిగి ఉంటుంది. సింహవాహనాన్ని అధిష్టిస్తుంది. ఈమెను ఉపాసించిన విశుద్ధచక్రంలో మనసు స్థిరమవుతుంది, భవసాగరాలనుంచి విముక్తులై మోక్షాన్ని సులభంగా పొందవచ్చును. నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించాలి.


షష్టి - కాత్యాయని
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా|
కాత్యాయనీ శుభం దద్వాద్దేవీ దానవఘాతినీ||

పూర్వం 'కతి' అనే పేరుగల ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్య గోత్రీకుడే కాత్యాయన మహర్షి. ఇతడు ఈ దేవి తనకు కుమార్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. తపస్సు ఫలించింది. మహిషాసురుడిని సంహరించటంకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో దేవిని సృష్టించారు. మొదట కాత్యాయని మహర్షి తల్లిని పూజించాడు. కాబట్టే 'కాత్యాయని' అనే పేరు వచ్చింది. కాత్యాయని మహర్షి ఇంటిలో పుట్టింది. కాబట్టి కాత్యాయని అయింది అనే కథకూడా ఉంది. ఈమె చతుర్భుజి. ఎడమచేతిలో ఖడ్గం, పద్మాన్ని ధరిస్తుంది. కుడిచేయి అభయముద్రను, వరముద్రను కలిగి ఉంటుంది. ఉపాసించిన సాధకుడి మనసు ఆజ్ఞాచక్రంలో స్థిరమవుతుంది. తన సర్వస్వమునూ ఈ తల్లి చరణాలలో పరిపూర్ణంగా సమర్పించాలి. అప్పుడు ఆమె  అనుగ్రహించి రోగాలనూ, శోకాలనూ, భయాలనూ పోగొడుతుంది. ధర్మార్థకామమోక్షాలను ప్రసాదిస్తుంది. నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పించాలి.


సప్తమి - కాళరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా
లంబోష్టి కర్ణికాకర్ణితైలాభ్యక్త శరీరిణి|
వామపాదోల్ల సల్లోహ లతాకంటకభూషణా
వరమూర్థధ్వజాకృష్టా కాళరాత్రీర్భయంకరీ||

ఈ తల్లి శరీర వర్ణం గాఢాంధకారంవలె నల్లనిది. తలపై కేశాలు విరబోసుకొని, మెడలో హారం విద్యుత్‌కాంతితో వెలుగుతుంది. ఈమె నాసిక నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడుతుంటాయి. ఈమె వాహనం గాడిద. కుడిచేతిలో అభయముద్ర, వరముద్ర కలిగి ఉంటుంది. ఎడమచేతిలో ముళ్ళ ఇనుప ఆయుధం, ఖడ్గం ధరిస్తుంది. చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులపాలిటి కల్పతరువు. ఈ తల్లిని గనక ఉపాసిస్తే మనస్సు సహస్రార చక్రంలో స్థిరంగా ఉంటుంది. సమస్త పాపాలు, విఘ్నాలు తొలగుతాయి. గ్రహబాధలు ఉండవు. అగ్ని, జల, జంతు, శత్రు, రాత్రి భయాలు ఉండవు. నైవేద్యంగా కూరగాయలతో అన్నాన్ని సమర్పించాలి.


అష్టమి - మహాగౌరి
శ్వేతేవృషే సమారూఢా శ్వేతాంబరధరాశుచిః|
మహాగౌరిశుభం దద్వాత్‌, మహాదేవ ప్రమోధరా||

ఈమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు తెల్లని కాంతులతో మెరుస్తుంటాయి. ఈమె వృషభ వాహనంపై ఉంటుంది. చతుర్భుజి. కుడిచేతుల్లో  అభయముద్రను, త్రిశూలాన్ని ధరిస్తుంది. ఎడమచేతుల్లో  ఢమరుకాన్ని, వరముద్రనూ కలిగిఉంటుంది. శివుడిని పరిణయమాడాలని కఠోరంగా తపస్సు చేసింది. అందువల్ల ఈమె శరీరం నల్లగా అయిపోయింది. ఆమె తపస్సుకు సంతోషపడిన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరాన్ని గంగాజలంతో పరిశుద్దంచేశాడు. ఆ కారణంగా ఈమె శ్వేతవర్ణశోభిత అయింది. మహాగౌరిగా విలసిల్లింది. ఈ మాతను ఉపాసిస్తే కల్మషాలన్నీ పోతాయి. సంచితపాపం నశిస్తుంది. భవిష్యత్తులో పాపాలు, ధైన్యాలు దరిచేరవు. ఈ తల్లిని ధ్యానించి, స్మరించి, పూజించి ఆరాధించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. నైవేద్యంగా చక్కెర పొంగలి (గుడాన్నం) సమర్పించాలి.


నవమి - సర్వసిద్ధి ధాత్రి
సిద్ధం గంథర్వయక్షాద్వైః అసురైరమరైరపి|
సేవ్యమానా సదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ||

మార్కండేయ పురాణంలో అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈశిత్వ, వశిత్వ, సర్వకామావసాయిత, సర్వజ్ఞత, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వ, సృష్టిసంహరీకరణ, అమరత్వం, సర్వనాయకత్వం, భావసిద్ధి అని అష్టసిద్ధులు చెప్పబడ్డాయి.

ఈ తల్లి పరమశివుడితో కలసి అర్థనారీశ్వరుడిగా  అవతరించింది. చతుర్భుజి. సింహవాహనాన్ని అధిరోహించింది. కమలవాసిని. కుడిచేతుల్లో గదను, చక్రాన్ని, ఎడమచేతుల్లో శంఖాన్ని, కమలాన్ని ధరించింది. ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. లౌకిక, పారలౌకిక మనోరథాలు నెరవేరతాయి. నైవేద్యంగా పాయసాన్నం సమర్పించాలి.


ఈ పండుగను పదిరోజులు చేసినా రాత్రులు మాత్రం తొమ్మిదే. దశమి రోజున అమ్మవారు  రాక్షససంహారం చేసింది. ఎంతో ప్రశాంతతతో, చిరునవ్వుతో  సకల విజయాలు ప్రసాదిస్తుంది. నైవేద్యంగా చిత్రాన్నం, లడ్డూలు సమర్పించాలి.

4, ఆగస్టు 2014, సోమవారం

నవగ్రహ దీపాల నోము ఎలా, ఎప్పుడు చేయాలి?

నవగ్రహ దీపాల నోముః-
నవగ్రహ దీపాల నోము ఎలా చేయాలి. నవగ్రహాల అనుగ్రహం కోసం, ఐశ్వర్యం పొందేందుకు కార్తీక పౌర్ణమి రోజున ఈ నోము నోచుకుంటారు.
 


తొమ్మిది ప్రమిదలు, తొమ్మిది ఒత్తుల చొప్పున వెలిగించి, ఒక్కొక్క ప్రమిద వద్ద నవధాన్యాలలో ఒక్కొక్క రకం ధాన్యం కొద్దిగా ఉంచి, ఒక్కొక్క ప్రమిదను (ధాన్యం సహా) ఒక్కొక్క బ్రాహ్మణునికి దానమివ్వాలి.
నవగ్రహ శాంతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసేవారు ఆయా ప్రత్యేక వస్తువులతో పూజని నిర్వహించాలి. పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారకి దోష నివారణ జరిగి సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయి.

 సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు.

చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు బాధ తొలగుతుంది.

 బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చల ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.

శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. వజ్రం, పగడము ధరించిటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

 రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది.

 కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక దైవశక్తి పెరుగుతుంది.

 శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతరత్రా కష్టాలు తొలగిపోతాయి. ఇంకా ప్రతి శనివారం నవగ్రహాలకు దీపమెలిగించినా ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావాలంటే కార్తీక పౌర్ణమిన శివాలయంలో అభిషేకం చేయించాలని పురోహితులు అంటున్నారు.






31, మే 2014, శనివారం

శంఖుస్థాపన చేసే విధానం

 



ఇంటి పొడవును 9 భాగాలుగా చేసి ఇందులో పాదాల నుంచి 3 భాగాలు విడిచిపెట్టాలి. మిగిలిన 3 భాగాలలో వాస్తుపురుషుడి పాదాలు వున్న నాభిస్థానం. ఈ నాభిస్థానంలో తవ్వి నవధాన్యాలతో శంఖువును స్థాపించాలి.


ముందు శంఖువును ధాన్యరాశిపై వుంచి వాస్తుపూజ చేసినాక శంఖుస్థాపన చేయాలి. గంధపు చెక్కతోకాని, మారేడు, అత్తి, మద్ది, వేప, చండ్రకొయ్యతో కాని శంఖువును తయారు చేస్తారు. శంఖుస్థాపనకు మొదటి జాము ప్రశస్తం. రెండవ, మూడవ జామున, రాత్రులందు, శంఖుస్థాపన చేయకూడదు. ఇల్లు కట్టుకునే ముందు శంఖుస్థాపన చేయడం మంచిది. దీని వల్ల కొన్ని దోషాలు నివారణ అవుతాయి.


బ్రాహ్మడి జాబితా ప్రకారము అన్ని తెచ్చుకొనవలెను. ముందు రోజురాత్రి గుంట తీయించవలెను. జంపకనాలు, కుర్చీలు, పీటలు, మంచినీళ్ళు, గ్లాసులు మొదలగునవి. వచ్చిన అతిధులకు టిఫిన్లు, టీ ఇచ్చి, బొట్టు, పండు తాంబూలము ఇచ్చి పంపవలెను.

ఆ విధముగా చేసిన గృహము నందుండు వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్య కలుగ చేస్తుంది .
  
గృహ ఆరంభము చేయుటకు మాస ఫలితములు ఈ విధముగా ఉన్నాయి .

శ్లోకం : చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం , వైశాఖం శుభదంచైవ , జ్యేష్టాయమరణం
        ఆషాడం కలహం భవేత్ , శ్రావణం శుభదం , భాద్రపదే సదా రోగీ,
        ఆశ్వీయుజం కలహం, కార్తీకే శుభదం ప్రోక్తం , మార్గశిర్షే మహాద్భయం
        పుష్యేచా అగ్ని భయంచ ,మాఘేస సంపదా , పాల్ఘునే రత్న లాభః
అని చెప్పితిరి

తాత్పర్యము : చైత్ర మాసమున గృహారంభము చేసినచో ధన నష్టము జరుగును ,వైశాఖ మాసము శుభము , జ్యేష్ట మాసము మరణమును కలుగ జేయును , ఆషాడ మాసమునందు తగవులు ఏర్పడును , శ్రావణము సకల శుభములు ప్రసాదించును , బాద్రపద మాసమునందు అనారోగ్యము కలుగును .,, ఆశ్వీయుజం కలహములు , గృహమునందు ఉండువారికి మనస్సుకు శాంతి కరవగును . కార్తీకము మంచిది . మార్గశిర మాసము భయమును కల్గిస్తుంది . పుష్య మాసము న గృహా రంభము చేయుట వలన అగ్నిచే దహించ బడును . మాఘ మాసము సకల సంపదలు , ఐశ్వర్యము , కలుగుతాయి . ఫాల్గుణ మాసమున చేయుట వలన అనేక విధములుగా అభివృద్ధి కలుగుతుంది .

శంఖు స్థాపనకు పనికి వచ్చే నక్షత్రములు .
ఉత్తర , ఉత్తరాషాడ , ఉత్తరాభాద్ర , రోహిణి , మృగశిర ,చిత్త , ధనిష్ఠ అనూరాధ , రేవతి , స్వాతి , శతభిషం గ్రుహారంభామునకు ప్రశస్తమైన నక్షత్రములు .

బుధ , గురు , శుక్ర వారముల యందు సూర్యోదయమునకు ముందు ౩ నుండి 6 గంటల లోపల గానీ , సూర్యోదయము తరువాత ఉదయం 11 గంటల లోపల గానీ శంఖు స్థాపన ముహూర్తము ఏర్పాటు చేసుకోవలెను

ఈ ముహూర్తము సకల సుగుణములు కలది 4 , 8 , 12 స్థానముల శుద్ది కలిగి వృషభ చక్రశుద్ది, తారాబలము , చంద్రబలము , పంచకరహితములు బాగుగా యున్నది అయి ఉండాలి .

4, , 8 , 12 స్థానములను గురించి ఇంతకుముందు కూడా ప్రస్తావించాను . వీటి గురించి కొంత వివరణ .
4 వ స్థానము సుఖాన్ని సూచిస్తుంది . ఇట్టి ఈ స్థానములో పాప గ్రహములు ఉండుట వలన  గృహము నిర్మాణమైన తరువాత గృహమందు ఉండువారికి సుఖములు లేక అనేక రకాల కష్ట నష్టములు కల్గును .
8 . ఇది ఆయుస్సు ను సూచిస్తుంది . ఇక్కడ శుద్ది లేకపోతె గృహమునందు మరణము కల్గును .
12 ఇది ఖర్చులను , నష్టములను , అపజయములను సూచిస్తుంది . ఈ స్థానము శుద్ది గా ఉండక పొతే గృహ యజమానికి గానీ అందుండు వారికి గానీ అన్నింటా అపజయములు కల్గును.


శంఖుస్థాపనకు సామాగ్రి పట్టిక

పసుపు     100 gr.
కుంకుమ     100 gr.
విడిపూలు     3 kg.
పూలమూరలు     10
తమలపాకులు     100
వక్కలు     100 gr.
అగరుబత్తీలు     1 packet
హరతికర్పూరం     100 gr.
గంధం           1 bottle
ఖర్జూరపండ్లు    150 gr.

పండ్లు         5 types
పసుపుకొమ్ములు     150 gr.
టవల్స్               2
జాకెట్ ముక్కలు     2

చెక్క శంఖు     1
బియ్యము     5 kg.
కొబ్బరికాయలు     15
చిల్లరడబ్బులు     21
దారపుబంతి     1
ఆవు పాలు     1/2 lt.
నవధాన్యాలు     1/2kg.
దీపారాధన కుందులు     1 set
వత్తులు        1 packet

నెయ్యి           1/2 kg.
కలశం చెంబు     1
దేవునిపటాలు    
నిమ్మకాయలు     10
నవరత్నాలు     1 set
గ్రానయిట్ రాళ్ళు     5
పంచెల చాపు       1
కొత్త ఇటికలు       10
వరిపిండి         1/2 కేజి





ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...