శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Social Media Buttons

Follow by Email

Saturday, September 29, 2012

పంచాంగ విషయాలు 1

 పంచాంగ విషయాలు:-
                తిధి, వార, నక్షత్ర  వివరములతో  గ్రహ గమనాలతో , శుభ దినములతో , పండుగలతో, శుభాశుభ ముహూర్తములతో సూర్యోదయ ,అస్తమయ సమయములతో, వర్జ్య , దుర్ముహూర్త సమయములతో ప్రతిరోజూ మీ ముందుండెడిదే ఈ పంచాంగము.
 
        ఈ పంచాంగము  నక్షత్రముల , రాశుల దిన ,వార , మాస ,సంవత్సరాల వారీ ఫలితాలతో,గ్రహ దోషాలు, వాటి నివారణలతో  సామాన్యులకు కూడ అర్ధ మగు రీతిలో మీ కందించబడుతుంది . ఈ అనంత మైన  విశ్వములో మనము నివసించు చున్న భూమీ ఒక గుండ్రని గోళము.అటువంటి  గోళములో విశ్వములో లెక్కలేనన్ని ఉన్నవి  మనకు పెద్దవిగా కనబడి  ఎక్కువగా చలనము ఉన్న వాటిని గ్రహములని,చిన్నవాటిని నక్షత్రములని అనుచున్నాము. ఈ గ్రహములు ముఖ్యముగా తొమ్మిది . సూర్యుడు ,చంద్రుడు ,అంగారకుడు ,బుధుడు ,గురుడు ,శుక్రుడు ,శని , రాఃహుడు ,కేతువు . సూర్యుడు ప్రధాన గోళముగా ఈ గోళములన్నియు సూర్యునిచుట్టు తిరుగు చున్నవి. వీనిలో కొన్ని ఒక దాని చుట్టూ మరియొకటి తిరుగుచూ ,ఒక దానినొకటి ఆకర్షించు కొనుచున్నవి . ఉదా : భూమి తన చుట్టూ తాను తిరుగుచూ ,సూర్యుని చుట్టూ గూడా తిరుగు చున్నది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగు చున్నాడు.
                     భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన సూర్యుని వెలుతురు ఒక భూభాగము నుండి  మరియొక భూభాగమునకు మారుటచే రాత్రి , పగలు ఏర్పడుచున్నవి. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరుగుటను ఒక రోజు అనియు , చంద్రుడు భూమి చుట్టూ ఒక ప్రదక్షిణము చేయుటను ఒక నెల అనియు , భూమి సూర్యునిచుట్టు ఒక ప్రదక్షిణము చేయుటను ఒక సంవత్సరము అనియు ప్రపంచము లోని అన్ని దేశములవారు లెక్కించుచున్నారు . గ్రహములు సంచరించుచున్న  మార్గమును మన పూర్వీకులు జ్యోతిశ్చక్రముగా ఊహ చేసి , దానిని 12  భాగములు (రాశులు ) గా భాగించినారు. ఒక్కొక్క భాగములో నున్న నక్షత్రముల రాశులకు ఒక్కొక్క పేరు పెట్టినారు. నక్షత్రములు మొత్తము 27 . ఒక్కొక్క నక్షత్రమునకు 4 భాగములు (పాదములు) ఊహించి అటువంటి నక్షత్ర భాగములను 9 ని ఒక రాశిగా నిర్దారించినారు. వాని రూపములను ఊహించి ఆ ప్రకారము రకరకముల పేర్లు పెట్టినారు. ఒక్కొక్క నక్షత్రమునకు 4  భాగముల వంతున 27 నక్షత్రములకు 108 భాగములకు 12  రాశులు అయినవి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుట వలన మనకు రోజుకొక నక్షత్ర మండలము నుండి కనపడుచున్నాడు . ఏ నక్షత్ర మండలములో చంద్రుడు మనకు కనబడు చున్నాడో ఆ నక్షత్రమును మన పంచాంగపు వ్యవహారములలో ఆనాటి నక్షత్రముగా పరిగణించుచున్నాము .

 
                    పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్ర మండలములో కనపడునో ఆ నక్షత్రము పేరు ఆ నెలగా వాడుచున్నాము. చిత్తా నక్షత్ర మండలములో చంద్రుడు పౌర్ణమినాడు కనపడు మాసమునకు చైత్రమాసము అని పేరు పెట్టబడినది. ఈ ప్రకారము విశాఖ - వైశాఖ , జ్యేష్ట -జ్యేష్టము , పూర్వాషాడ - ఆషాడము , శ్రవణము - శ్రావణము , ఉత్తరాభాద్ర - భాద్రపదము, అశ్వని - ఆశ్వయుజము, కృత్తిక - కార్తీకము , మృగశిర - మార్గశిరము, పుష్యమి - పుష్యము, మఖ - మాఘము, ఉత్తర ఫల్గుణి - పాల్గుణము అని మనము ఆ నెలలును పిలుచుచున్నాము .

 
                    పై అన్ని విషయములను గూర్చి తెలుపునది పంచాంగము. పంచాంగము ముఖ్యముగా మనకు 5  విషయములను తెలుపును. 1 . తిధి , 2 . వారము , 3 . నక్షత్రము , 4 . యోగము , 5 . కరణము .కనుకనే దానికి పంచాంగము అని పేరు వచ్చినది .


Related Posts Plugin for WordPress, Blogger...