శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
22, మార్చి 2013, శుక్రవారం
గ్రహావస్థలు - శత్రువులు మిత్రులు సములు
గ్రహాలు శత్రువులు మిత్రులు సములు
గ్రహం | మిత్రుడు | శత్రువు | సముడు |
---|---|---|---|
రవి | చంద్రుడు, కుజుడు, గురువు | శని,శుకృడు | బుధుడు |
చంద్రుడు | రవి, బుధుడు | శత్రువులు లేరు | మిగిలిన వారు సములు |
కుజుడు | గురువు, చంద్రుడు, రవి | బుధుడు | శుక్రుడు, శని |
బుధుడు | శుకృడు, రవి | చంద్రుడు | కుజుడు, గురువు, శని |
గురువు | కుజుడు, చంద్రుడు | బుధ, శుకృడు | రవి, శని |
శుకృడు | శని, బుధుడు | రవి, చంద్రుడు | కుజుడు, గురువు |
శని | శుకృడు, బుధుడు | రవి, చంద్రుడు, కుజుడు | గురువు |
రాహువు | శని, శుకృడు | రవి, చంద్రుడు, కుజుడు | గురువు, బుధుడు |
కేతువు | రవి, చంద్రుడు, కుజుడు | శని, శుకృడు | బుధుడు, గురువు |
జన్మలగ్నము
భూమి తనచుట్టూ తాను తిరిగే ఆత్మ ప్రదక్షిణ
కాలంలో ప్రతి రెండు గంటలకు లగ్నం మారుతూ 24 గంటల సమాయాన్ని 12 రాశుల
లగ్నాలుగా విభజిస్తూ జ్యోతిష్య గణన చేస్తారు. చైత్రమాసం పాడ్యమి సూర్యోదయం
మేష లగ్నంతో ఆరంభం ఔతుంది. ఒక రోజుకు నాలుగు నిమిషాల కాలం ముందుకు జరుగుతూ
చేర్చుకొని ఒక మాసకాలంలో 120 నిమిషాలు లగ్న కాలం మారుతూ వైశాఖమాస ప్రారంభం
వృషభ లగ్నంతో ఉదయం ఆరంభం ఔతుంది. ఈ విధంగా లగ్న గణన చేస్తూ జాతకుడు పుట్టిన
లగ్న నిర్ణయం చేస్తారు.
ఛాయాగ్రహాలు
జ్యోతిష్య శాస్రంలో రాహుకేతువులు ఛాయా
గ్రహాలు. వీటికి జ్యోతిష్య శాస్రంలో ఇల్లు లేదు. రాహుకేతువులు అపసవ్య
మార్గంలో ప్రయాణం చేస్తాయి. రాహువు కేతువుకు సరిగ్గా ఏడు రాశులు దూరంలో
ప్రయాణం చేస్తాయి. కనుక ఈ రెండు గ్రాహాలు ప్రయాణకాలం సమమే. రాహువును
కాలసర్పంగా వ్యవహరిస్తారు. రాశి చక్రంలో రాహువు కేతువుకు మద్యలో అన్ని
గ్రహాలు ఉంటే దానిని కాలసర్ప దోషంగా నిర్ణయిస్తారు.
గ్రహస్థితి బలాబలాలు
జ్యోతిష శాస్త్రమున గ్రహములు దిగ్బలం,
స్థానబలం, కాల బలం, చేష్టాబలం అను నాలుగు విధముల బలనిర్ణయం చేస్తారు ,
లగ్నంలో గురువు, బుధుడు ఉన్న బలవంతులు. నాలుగవ స్థానములో చంద్రుడు,
శుక్రుడు ఉన్న బలవంతులు. పదవ స్థానమున సూర్యుడు, కుజుడు బలవంతులు. స్వ
స్థానమున, ఉచ్ఛ స్థానమున, త్రికోణమున, మిత్ర స్థానమున, స్వ నవాంశ అందు ఉన్న
గ్రహములు, శుభ దృష్టి గ్రహములు బలముకలిగి ఉంటాయి. స్త్రీ క్షేత్రములైన
వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనములందు చంద్రుడు, శుక్రుడు
బలవంతులు. పురుష రాశులైన మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభములందు
సూర్యుడు, కుజుడు, గురువు, బుధుడు, శని బలవంతులు. సూర్యుడు, కుజుడు,
శుక్రుడు పగటి అందు బలవంతులు. రాత్రి అందు బుధుడు, శని, గురువు బలవంతులు.
సర్వ కాలమందు బుధుడు బలవంతుడు. శుక్ల పక్షమున శుభగ్రహములు, కృష్ణ పక్షమున
పాపగ్రహములు బలవంతులు. యుద్ధమున జయించిన వాడు, వక్రగతి కల వాడు, సూర్యుడికి
దూరముగా ఉన్న వాడు చేష్టా బలం కలిగిన వాడు. అంటే ఉత్తరాయణమున కుజుడు,
గురువు, సూర్యుడు, శుక్రుడు దక్షిణాయనమున చంద్రుడు, శని రెండు ఆయనముల అందు
స్వక్షేత్రమున ఉన్న బుధుడు చేష్టా బలము కల వారు. స్త్రీ గ్రహములైన
చంద్రుడు, శుక్రుడు రాశి మొదటి స్థానమున ఉన్న బలము కలిగి ఉంటారు. పురుష
గ్రహములైన సూర్యుడు, కుజుడు, గురువు రాశి మధ్యమున ఉన్న బలము కలిగి ఉంటాయి.
నపుంసక గ్రహములైన బుధుడు, శని రాశి అంతమున ఉన్నచేష్టా బలము కలిగి ఉంటాయి.
రాత్రి అందు మొదటి భాగమున చంద్రుడు, అర్ధరాత్రి అందు శుక్రుడు, తెల్లవారు
ఝామున కుజుడు, ఉదయకాలమున బుధుడు, మధ్యహ్న కాలమున సూర్యుడు, సాయం కాలమున శని
సర్వ కాలమందు గురువు బలవంతులు. శనికంటే కుజుడు, కుజుని కంటే బుధుడు,
బుధునికంటే గురువు, గురువుకంటే శుక్రుడు, శుక్రునికంటే చంద్రుడు,
చంద్రునికంటే సూర్యుడు బలవంతులు.
గ్రహావస్థలు
గ్రహావస్థలు పది రకాలు. (1) స్వస్థము, (2)
దీప్తము, (3) ముదితము, (4) శాంతము, (5) శక్తము, (6) పీడితము, (7) దీనము,
(8) వికలము, (9) ఖల, (10) భీతము అనేవి ఆ అవస్థలు.
- స్వస్థము: స్వక్షేత్ర మందున్న గ్రహము స్వప్నావస్తను పొందును.
- దీప్తము: ఉచ్ఛక్షేత్ర మందున్న గ్రహము దీప్తావస్త నందుండును.
- ముదితము: మిత్ర క్షేత్ర మందున్న గ్రహము ముదితావస్తను పొందును.
- శాంతము: సమ క్షేత్ర మందున్న గ్రహము శాంతావస్తను పొందును.
- శక్తము: వక్రించి యున్న గ్రహము శక్త్యావస్తను పొందును.
- పీడితము: రాశి అంతమున 9 సక్షత్ర పాదములలో చివరి పాదము నందున్న గ్రహము పీడావస్థను పొందును.
- దీనము: శత్రు క్షేత్ర మందున్న గ్రహము దీనావస్థను పొందును.
- వికలము: అస్తంగత మయిన గ్రహము వికలావస్థను పొందును.
- ఖల: నీచ యందున్న గ్రహము ఖలావస్థను పొందును.
- భీతము: అతిచారము యందున్న గ్రహము భీత్యావస్థను పొందును.
ఉచ్ఛ స్థానమున ఉన్న దీప్తుడు,
స్వక్షేత్రమున ఉన్న స్వస్థుడు, మిత్రక్షేత్రమున ఉన్న ముదితుడు, శుభవర్గమున
ఉన్న శాంతుడు, సూర్యునకు దూరమున ఉన్న శక్తుడు, అస్తంగతుడైన వికలుడు,
యుద్ధమున పరాజితుడైన పీడితుడు, పాప వర్గమున ఉన్న ఖలుడు, నీచ అందు ఉన్న
భీతుడు అని అంటారు. అలాగే సూర్యుడి సామీప్యాన్ని ఆధారంగా చేసుకుని
గ్రహగతులను నిర్ణయిస్తారు. సూర్యునితో చేరి ఉన్న గ్రహము అస్తంగత గ్రహం
అంటారు.సూర్యునికి రెండవ స్థానంలో ఉన్నశీఘ్రగతిని పొందిన గ్రహం అంటారు.
సూర్యుని నాల్గవ స్థానమున ఉన్న గ్రహాన్ని మందుడు అంటారు. సూర్యునికి అయిదు
ఆరు రాశులలో ఉన్న గ్రహం వక్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యునికి ఏడు
ఎనిమిది స్థానాలలో ఉన్న గ్రహం అతి వక్రగతిని పొందిన గ్రహం
అంటారు.సూర్యునికి తొమ్మిది, పది స్థానాలలో ఉన్న గ్రహం కుటిలగతి పొందిన
గ్రహం అంటారు. సూర్యునికి పదకొండు, పన్నెండు స్థానాలలో ఉన్న గ్రహాన్ని
అత్యంత శీఘ్రగతిన ఉన్న గ్రహం అంటారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)