శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com
జన్మ నక్షత్రాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జన్మ నక్షత్రాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2015, గురువారం

బాలారిష్ట దోషం

పిల్లలు పుట్టిన వెంటనే జన్మనక్షత్రం ప్రకారం దోషం ఉన్నదా?
 జన్మలగ్నం దశాత్ ఏమైనా దోషములు ఉన్నాయా? 
అనేది పరిశీలించడం ఒక ఆనవాయితీ. అలా ఎందుకు చేయాలి.

జనన కాలమునకు గండ నక్షత్రములు అని పేరుతో కొన్ని నక్షత్రాలు చెప్పారు కదా. ‘అశ్విన్యాది చతుష్కంచ పుష్య ప్రభృతి పంచకం; రాధేంద్ర భాతి త్రితయం పూర్వాభాద్రా చరేవతీ చిత్తార్ర్దా బహు దోషంస్సాత్ పితృ మాతృ హానిం వదేత్’ అని వున్నది. ప్రతి పంచాంగంలోను ఉదహరిస్తున్నారు. ఆ పట్టికను ఆధారంగా ఏ నక్షత్ర పాదంలో పుడితే తల్లికి గండము, ఎందులో పుడితే తండ్రికి గండము అనే అంశాలు మనం తెలుసుకొని నక్షత్ర శాంతి చేయించుకొని ముందుకు వెళ్లాలి.

వైదిక సంప్రదాయంలో ఏ నక్షత్రంలో పిల్లలు పుట్టినా ‘ముభావ లోకనం’ (నూనెలో ముఖం చూచుట) శిశువును ప్రథమతః నూనెలో ముఖం చూచి తరువాతనే ప్రత్యక్షంగా చూడడం శ్రేయస్కరం అని పెద్దల వాదన. శాస్త్రాన్ని అనుసరిద్దాం అనే ఉద్దేశం వున్నప్పుడు వేద విహితమైన వైదిక మార్గానికి పెద్ద పీట వేయవలసిందే.

ఇక జన్మలగ్నాత్ చాంద్రాష్టమంచ ధరణీ సుతస్సప్తమంచ రాహుర్నవంచ శని జన్మ గురున్తృపతీయే అర్కస్తు పంచ భృగుషట్క బుధశ్చతుర్దే కేతో వ్యయోస్తు బాలారిష్టానాం’ అని ఎక్కువ వాడకంలో వున్న సూత్రం. జన్మ లగ్నము నుండి అష్టమంలో చంద్రుడు వున్ననూ, కుజుడు సప్తమంలో వున్ననూ, రాహువు నవమంలో వున్ననూ, జన్మంలో శని వున్ననూ, గురువు తృతీయంలో వున్ననూ, రవి పంచమంలో వున్ననూ, శుక్రుడు ఆరవ యింట వున్ననూ, బుధుడు చతుర్ధంలో వున్ననూ, కేతువు వ్యయంలో వున్ననూ బాలారిష్టములుగా చెబుతారు.

పరాశరుల సిద్ధాంతం ప్రకారం మరియు ఇతర గ్రంథకర్తల వ్యాసములు ఆధారంగా 12వ సంవత్సరం వరకు ఈ బాలారిష్టములు ఉంటాయి. అంతేకాకుండా పితృ మాతృ పూర్వ జన్మల ఫలితంగానే ఈ బాలారిష్టములు కూడా అందిస్తాయి. అష్టమాధిపతి దశ అయినను అష్టమంలో వున్న గ్రహం యొక్క దశ అయినను ప్రారంభంలో వస్తే ప్రమాదమే. అలాగే లగ్నంలో షష్ట్ధాపతి, షష్ఠంలో లగ్నాధిపతి, ఇదే రీతిగా లగ్న వ్యయాధిపతుల విషయంలో కూడా చర్చనీయాంశ ప్రమాదకర అంశాలు ఉంటాయి. అందువలన ఆయా బాలారిష్టముల విషయములు మరియు గండ నక్షత్ర విషయములు ముందుగానే శోధింప చేసుకొని తగిన శాంతి మార్గములు వెదికి చేయించుట శ్రేయస్కరము.

బాలారిష్టములు ఇచ్చే గ్రహముల దశలు అంతర్దశలు 12వ సంవత్సరం వయసులోపుగా కనుక వస్తే అది ఇంకా ప్రమాదమే. అప్పుడు బహు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బాలారిష్టములు వున్న శిశువుకు 12వ సంవత్సరం వరకు తరచుగా ఆరోగ్య సమస్యలు రావడం పెద్దల శోధనల వలన వెల్లడి అవుతోంది. గండ నక్షత్ర శాంతి బాలారిష్ట శాంతి విధానములు వైదిక మార్గంలో నిష్ణాతులయిన పండితుల ద్వారా తెలుసుకోవాలి. ఎలాంటి జాతకంలో పుట్టినా నామకరణం రోజు నక్షత్ర హోమం, నవగ్రహ హోమం చేయించడం సర్వదా శ్రేయస్కరం

2, జనవరి 2015, శుక్రవారం

నక్షత్ర మంత్రాలు

                      యజుర్వేదంలోని నక్షత్రేష్టిలో వేరు వేరు నక్షత్రాలకు 27 నక్షత్రాలకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. ఒక్కో నక్షత్రానికి 8 వాక్యాలతో కూడుకున్న మంత్రం ఉంటుంది.వైదిక సాహిత్యంలో అన్ని చోట్ల నక్షత్ర గణన కృత్తిక నక్షత్రం నుండి ప్రారంబమవుతుంది. కృత్తిక నుండి విశాఖ నక్షత్రం వరకు దేవ నక్షత్రాల విభాగంగాను ,అనూరాధ నుండి భరణి నక్షత్రం వరకు యమ నక్షత్రాలుగాను విభజించబడింది.


ఉత్తరాషాడ 4 వ పాదం,శ్రవణా నక్షత్ర 1 వ పాదం కలిసి అభిజిన్నక్షత్రం .జయింప శక్యంకాని పనులు జయింప జేయాలంటే అభిజిత్తులో చేయాలి.

              సూర్యుడు ఉదయించినప్పుడు నక్షత్రం కనపడదు.కనుక సూర్యోదయానికి ముందే నక్షత్రాలు కనపడే సమయంలో నక్షత్ర మంత్రాలను పఠించాలి.ఒక నక్షత్రం సూర్యోదయం కన్నా ముందు తూర్పు ఆకాశంలో ఉదయించినప్పుడు,ఒక నక్షత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు ఆకాశంలో ఉదయించినప్పుడు ఆయా నక్షత్రాలకు ఆయా రోజుల్లో పూజలు చేయాలని వైదిక సాహిత్యం సూచిస్తుంది.
 

అశ్విని

|| ఓం ||
తదశ్వినా’వశ్వయుజోప’యాతామ్ |
శుభంగమి’ష్ఠౌ సుయమే’భిరశ్వై”ః |
స్వం నక్ష’త్రగ్‍మ్ హవిషా యజ’ంతౌ |
మధ్వాసంపృ’క్తౌ యజు’షాసమ’క్తౌ |
యౌ దేవానాం” భిషజౌ” హవ్యవాహౌ |
విశ్వ’స్య దూతావమృత’స్య గోపౌ |
తౌ నక్షత్రం జుజుషాణోప’యాతామ్ |
నమో‌ఉశ్విభ్యాం” కృణుమో‌ఉశ్వయుగ్భ్యా”మ్ ||

భరణి

|| ఓం ||
అప’ పాప్మానం భర’ణీర్భరంతు |
తద్యమో రాజా భగ’వాన్, విచ’ష్టామ్ |
లోకస్య రాజా’ మహతో మహాన్, హి |
సుగం నః పంథామభ’యం కృణోతు |
యస్మిన్నక్ష’త్రే యమ ఏతి రాజా” |
యస్మి’న్నేనమభ్యషిం’చంత దేవాః |
తద’స్య చిత్రగ్‍మ్ హవిషా’ యజామ |
అప’ పాప్మానం భర’ణీర్భరంతు ||

కృత్తిక

|| ఓం ||
అగ్నిర్నః’ పాతు కృత్తి’కాః |
నక్ష’త్రం దేవమి’ఇంద్రియమ్ |
ఇదమా’సాం విచక్షణమ్ |
హవిరాసం జు’హోతన |
యస్య భాంతి’ రశ్మయో యస్య’కేతవః’ |
యస్యేమా విశ్వా భువ’నాని సర్వా” |
స కృత్తి’కాభిరభిసంవసా’నః |
అగ్నిర్నో’ దేవస్సు’వితే ద’ధాతు ||

రోహిణి

|| ఓం ||
ప్రజాప’తే రోహిణీవే’తు పత్నీ” |
సా నో’ యఙ్ఞస్య’ సువితే ద’ధాతు |
రోహిణీదేవ్యుద’గాత్పురస్తా”త్ |
ప్రజాప’తిగ్‍మ్ హవిషా’ వర్ధయ’ంతీ |
విశ్వరూ’పా బృహతీ చిత్రభా’నుః |
యథా జీవే’మ శరదస్సవీ’రాః |
విశ్వా’ రూపాణి’ ప్రతిమోద’మానా |
ప్రియా దేవానాముప’యాతు యఙ్ఞమ్ ||

మృగశిర

|| ఓం ||
సోమో రాజా’ మృగశీర్షేణ ఆగన్న్’ |
శివం నక్ష’త్రం ప్రియమ’స్య ధామ’ |
ఆప్యాయ’మానో బహుధా జనే’షు |
రేతః’ ప్రజాం యజ’మానే దధాతు |
యత్తే నక్ష’త్రం మృగశీర్షమస్తి’ |
ప్రియగ్‍మ్ రా’జన్ ప్రియత’మం ప్రియాణా”మ్ |
తస్మై’ తే సోమ హవిషా’ విధేమ |
శన్న’ ఏధి ద్విపదే శం చతు’ష్పదే ||

ఆరుద్ర

|| ఓం ||
ఆర్ద్రయా’ రుద్రః ప్రథ’మా న ఏతి |
శ్రేష్ఠో’ దేవానాం పతి’రఘ్నియానా”మ్ |
నక్ష’త్రమస్య హవిషా’ విధేమ |
మా నః’ ప్రజాగ్‍మ్ రీ’రిషన్మోత వీరాన్ |
హేతి రుద్రస్య పరి’ణో వృణక్తు |
ఆర్ద్రా నక్ష’త్రం జుషతాగ్‍మ్ హవిర్నః’ |
ప్రముంచమా’నౌ దురితాని విశ్వా” |
అపాఘశగ్‍మ్’ సన్నుదతామరా’తిమ్ ||

పునర్వసు

|| ఓం ||
పున’ర్నో దేవ్యది’తిస్పృణోతు |
పున’ర్వసూనః పునరేతాం” యఙ్ఞమ్ |
పున’ర్నో దేవా అభియ’ంతు సర్వే” |
పునః’ పునర్వో హవిషా’ యజామః |
ఏవా న దేవ్యది’తిరనర్వా |
విశ్వ’స్య భర్త్రీ జగ’తః ప్రతిష్ఠా |
పున’ర్వసూ హవిషా’ వర్ధయ’ంతీ |
ప్రియం దేవానా-మప్యే’తు పాథః’ ||

పుష్యమి

|| ఓం ||
బృహస్పతిః’ ప్రథమం జాయ’మానః |
తిష్యం’ నక్ష’త్రమభి సంబ’భూవ |
శ్రేష్ఠో’ దేవానాం పృత’నాసుజిష్ణుః |
దిశో‌ఉను సర్వా అభ’యన్నో అస్తు |
తిష్యః’ పురస్తా’దుత మ’ధ్యతో నః’ |
బృహస్పతి’ర్నః పరి’పాతు పశ్చాత్ |
బాధే’తాంద్వేషో అభ’యం కృణుతామ్ |
సువీర్య’స్య పత’యస్యామ ||

ఆశ్లేష

|| ఓం ||
ఇదగ్‍మ్ సర్పేభ్యో’ హవిర’స్తు జుష్టమ్” |
ఆశ్రేషా యేషా’మనుయంతి చేతః’ |
యే అంతరి’క్షం పృథివీం క్షియంతి’ |
తే న’స్సర్పాసోహవమాగ’మిష్ఠాః |
యే రో’చనే సూర్యస్యాపి’ సర్పాః |
యే దివం’ దేవీమను’సంచర’ంతి |
యేషా’మశ్రేషా అ’నుయంతి కామమ్” |
తేభ్య’స్సర్పేభ్యో మధు’మజ్జుహోమి || ||

మఘ ( మఖ )

|| ఓం ||
ఉప’హూతాః పితరో యే మఘాసు’ |
మనో’జవసస్సుకృత’స్సుకృత్యాః |
తే నో నక్ష’త్రే హవమాగ’మిష్ఠాః |
స్వధాభి’ర్యఙ్ఞం ప్రయ’తం జుషంతామ్ |
యే అ’గ్నిదగ్ధా యే‌ఉన’గ్నిదగ్ధాః |
యే’‌ఉముల్లోకం పితరః’ క్షియంతి’ |
యాగ్‍శ్చ’ విద్మయాగ్మ్ ఉ’ చ న ప్ర’విద్మ |
మఘాసు’ యఙ్ఞగ్‍మ్ సుకృ’తం జుషంతామ్ ||

పుర్వా ఫల్గుని ( పుబ్బ )

|| ఓం ||
గవాం పతిః ఫల్గు’నీనామసి త్వమ్ |
తద’ర్యమన్ వరుణమిత్ర చారు’ |
తం త్వా’ వయగ్‍మ్ స’నితారగ్‍మ్’ సనీనామ్ |
జీవా జీవ’ంతముపసంవి’శేమ |
యేనేమా విశ్వా భువ’నాని సంజి’తా |
యస్య’ దేవా అ’నుసంయంతి చేతః’ |
అర్యమా రాజా‌ఉజరస్తు వి’ష్మాన్ |
ఫల్గు’నీనామృషభో రో’రవీతి ||

ఉత్తర ఫల్గుని ( ఉత్తర )

|| ఓం ||
శ్రేష్ఠో’ దేవానాం” భగవో భగాసి |
తత్త్వా’ విదుః ఫల్గు’నీస్తస్య’ విత్తాత్ |
అస్మభ్యం’ క్షత్రమజరగ్‍మ్’ సువీర్యమ్” |
గోమదశ్వ’వదుపసన్ను’దేహ |
భగో’హ దాతా భగ ఇత్ప్ర’దాతా |
భగో’ దేవీః ఫల్గు’నీరావి’వేశ |
భగస్యేత్తం ప్ర’సవం గ’మేమ |
యత్ర’ దేవైస్స’ధమాదం’ మదేమ ||

హస్త

|| ఓం ||
ఆయాతు దేవస్స’వితోప’యాతు |
హిరణ్యయే’న సువృతా రథే’న |
వహన్, హస్తగ్‍మ్’ సుభగ్‍మ్’ విద్మనాప’సమ్ |
ప్రయచ్ఛ’ంతం పపు’రింపుణ్యమచ్ఛ’ |
హస్తః ప్రయ’చ్ఛ త్వమృతం వసీ’యః |
దక్షి’ణేన ప్రతి’గృభ్ణీమ ఏనత్ |
దాతార’మద్య స’వితా వి’దేయ |
యో నో హస్తా’య ప్రసువాతి’యఙ్ఞమ్ ||

చిత్ర ( చిత్త )

|| ఓం ||
త్వష్టా నక్ష’త్రమభ్యే’తి చిత్రామ్ |
సుభగ్‍మ్ స’సంయువతిగ్‍మ్ రాచ’మానామ్ |
నివేశయ’న్నమృతాన్మర్త్యాగ్’శ్చ |
రూపాణి’ పిగ్ంశన్ భువ’నానివిశ్వా” |
తన్నస్త్వష్టా తదు’ చిత్రా విచ’ష్టామ్ |
తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” |
తన్నః’ ప్రజాం వీరవ’తీగ్‍మ్ సనోతు |
గోభి’ర్నోఅశ్వైస్సమ’నక్తు యఙ్ఞమ్ ||

స్వాతి

|| ఓం ||
వాయుర్నక్ష’త్రమభ్యే’తి నిష్ట్యా”మ్ |
తిగ్మశృం’గో వృషభో రోరు’వాణః |
సమీరయన్ భువ’నా మాతరిశ్వా” |
అప ద్వేషాగ్‍మ్’సి నుదతామరా’తీః |
తన్నో’ వాయస్తదు నిష్ట్యా’ శృణోతు |
తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” |
తన్నో’ దేవాసో అను’జానంతు కామమ్” |
యథా తరే’మ దురితానివిశ్వా” ||

విశాఖ

|| ఓం ||
దూరమస్మచ్ఛత్ర’వో యంతు భీతాః |
తదిం’ ద్రాగ్నీ కృ’ణుతాం తద్విశా’ఖే |
తన్నో’ దేవా అను’మదంతు యఙ్ఞమ్ |
పశ్చాత్ పురస్తాదభ’యన్నో అస్తు |
నక్ష’త్రాణామధి’పత్నీ విశా’ఖే |
శ్రేష్ఠా’వింద్రాగ్నీ భువ’నస్య గోపౌ |
విషూ’చశ్శత్రూ’నపబాధ’మానౌ |
అపక్షుధ’న్నుదతామరా’తిమ్ ||

అనూరాధ

|| ఓం ||
ఋద్ధ్యాస్మ’ హవ్యైర్నమ’సోపసద్య’ |
మిత్రం దేవం మి’త్రధేయం’ నో అస్తు |
అనూరాధాన్, హవిషా’ వర్ధయ’ంతః |
శతం జీ’వేమ శరదః సవీ’రాః |
చిత్రం నక్ష’త్రముద’గాత్పురస్తా”త్ |
అనూరాధా స ఇతి యద్వద’ంతి |
తన్మిత్ర ఏ’తి పథిభి’ర్దేవయానై”ః |
హిరణ్యయైర్విత’తైరంతరి’క్షే ||

జ్యేష్ఠ

|| ఓం ||
ఇంద్రో” జ్యేష్ఠామను నక్ష’త్రమేతి |
యస్మి’న్ వృత్రం వృ’త్ర తూర్యే’ తతార’ |
తస్మి’న్వయ-మమృతం దుహా’నాః |
క్షుధ’ంతరేమ దురి’తిం దురి’ష్టిమ్ |
పురందరాయ’ వృషభాయ’ ధృష్ణవే” |
అషా’ఢాయ సహ’మానాయ మీఢుషే” |
ఇంద్రా’య జ్యేష్ఠా మధు’మద్దుహా’నా |
ఉరుం కృ’ణోతుయజ’మానాయ లోకమ్ ||

మూల

|| ఓం ||
మూలం’ ప్రజాం వీరవ’తీం విదేయ |
పరా”చ్యేతు నిరృ’తిః పరాచా |
గోభిర్నక్ష’త్రం పశుభిస్సమ’క్తమ్ |
అహ’ర్భూయాద్యజ’మానాయ మహ్యమ్” |
అహ’ర్నో అద్య సు’వితే ద’దాతు |
మూలం నక్ష’త్రమితి యద్వద’ంతి |
పరా’చీం వాచా నిరృ’తిం నుదామి |
శివం ప్రజాయై’ శివమ’స్తు మహ్యమ్” ||

పూర్వాషాఢ

|| ఓం ||
యా దివ్యా ఆపః పయ’సా సంబభూవుః |
యా అంతరి’క్ష ఉత పార్థి’వీర్యాః |
యాసా’మషాఢా అ’నుయంతి కామమ్” |
తా న ఆపః శగ్గ్ స్యోనా భ’వంతు |
యాశ్చ కూప్యా యాశ్చ’ నాద్యా”స్సముద్రియా”ః |
యాశ్చ’ వైశంతీరుత ప్రా’సచీర్యాః |
యాసా’మషాఢా మధు’ భక్షయ’ంతి |
తా నఆపః శగ్గ్ స్యోనా భ’వంతు ||

ఉత్తరాషాఢ

|| ఓం ||
తన్నో విశ్వే ఉప’ శృణ్వంతు దేవాః |
తద’షాఢా అభిసంయ’ంతు యఙ్ఞమ్ |
తన్నక్ష’త్రం ప్రథతాం పశుభ్యః’ |
కృషిర్వృష్టిర్యజ’మానాయ కల్పతామ్ |
శుభ్రాః కన్యా’ యువతయ’స్సుపేశ’సః |
కర్మకృత’స్సుకృతో’ వీర్యా’వతీః |
విశ్వా”న్ దేవాన్, హవిషా’ వర్ధయ’ంతీః |
అషాఢాః కామముపా’యంతు యఙ్ఞమ్ ||

అభిజిత్

|| ఓం ||
యస్మిన్ బ్రహ్మాభ్యజ’యత్సర్వ’మేతత్ |
అముంచ’ లోకమిదమూ’చ సర్వమ్” |
తన్నో నక్ష’త్రమభిజిద్విజిత్య’ |
శ్రియం’ దధాత్వహృ’ణీయమానమ్ |
ఉభౌ లోకౌ బ్రహ్మ’ణా సంజి’తేమౌ |
తన్నో నక్ష’త్రమభిజిద్విచ’ష్టామ్ |
తస్మి’న్వయం పృత’నాస్సంజ’యేమ |
తన్నో’ దేవాసో అను’జానంతుకామమ్” ||

శ్రవణ

|| ఓం ||
శృణ్వన్తి’ శ్రోణామమృత’స్య గోపామ్ |
పుణ్యా’మస్యా ఉప’శృణోమి వాచమ్” |
మహీం దేవీం విష్ణు’పత్నీమజూర్యామ్ |
ప్రతీచీ’ మేనాగ్‍మ్ హవిషా’ యజామః |
త్రేధా విష్ణు’రురుగాయో విచ’క్రమే |
మహీం దివం’ పృథివీమంతరి’క్షమ్ |
తచ్ఛ్రోణైతిశ్రవ’-ఇచ్ఛమా’నా |
పుణ్యగ్గ్ శ్లోకం యజ’మానాయ కృణ్వతీ ||
ధనిష్ఠ

|| ఓం ||
అష్టౌ దేవా వస’వస్సోమ్యాసః’ |
చత’స్రో దేవీరజరాః శ్రవి’ష్ఠాః |
తే యఙ్ఞం పా”ంతు రజ’సః పురస్తా”త్ |
సంవత్సరీణ’మమృతగ్గ్’ స్వస్తి |
యఙ్ఞం నః’ పాంతు వస’వః పురస్తా”త్ |
దక్షిణతో’‌ఉభియ’ంతు శ్రవి’ష్ఠాః |
పుణ్యన్నక్ష’త్రమభి సంవి’శామ |
మా నో అరా’తిరఘశగ్ంసా‌ఉగన్న్’ ||
శతభిషం

|| ఓం ||
క్షత్రస్య రాజా వరు’ణో‌ఉధిరాజః |
నక్ష’త్రాణాగ్‍మ్ శతభి’షగ్వసి’ష్ఠః |
తౌ దేవేభ్యః’ కృణుతో దీర్ఘమాయుః’ |
శతగ్‍మ్ సహస్రా’ భేషజాని’ ధత్తః |
యఙ్ఞన్నోరాజా వరు’ణ ఉప’యాతు |
తన్నో విశ్వే’ అభి సంయ’ంతు దేవాః |
తన్నో నక్ష’త్రగ్‍మ్ శతభి’షగ్జుషాణమ్ |
దీర్ఘమాయుః ప్రతి’రద్భేషజాని’ ||
పూర్వాభాద్ర

|| ఓం ||
అజ ఏక’పాదుద’గాత్పురస్తా”త్ |
విశ్వా’ భూతాని’ ప్రతి మోద’మానః |
తస్య’ దేవాః ప్ర’సవం య’ంతి సర్వే” |
ప్రోష్ఠపదాసో’ అమృత’స్య గోపాః |
విభ్రాజ’మానస్సమిధా న ఉగ్రః |
ఆ‌ఉంతరి’క్షమరుహదగంద్యామ్ |
తగ్‍మ్ సూర్యం’ దేవమజమేక’పాదమ్ |
ప్రోష్ఠపదాసో అను’యంతి సర్వే” ||

ఉత్తరాభాద్ర

|| ఓం ||
అహి’ర్బుధ్నియః ప్రథ’మా న ఏతి |
శ్రేష్ఠో’ దేవానా’ముత మాను’షాణామ్ |
తం బ్రా”హ్మణాస్సో’మపాస్సోమ్యాసః’ |
ప్రోష్ఠపదాసో’ అభిర’క్షంతిసర్వే” |
చత్వార ఏక’మభి కర్మ’ దేవాః |
ప్రోష్ఠపదా స ఇతి యాన్, వద’ంతి |
తే బుధ్నియం’ పరిషద్యగ్గ్’ స్తువంతః’ |
అహిగ్‍మ్’ రక్షంతినమ’సోపసద్య’ ||

రేవతీ

|| ఓం ||
పూషా రేవత్యన్వే’తి పంథా”మ్ |
పుష్టిపతీ’ పశుపా వాజ’బస్త్యౌ |
ఇమాని’ హవ్యా ప్రయ’తా జుషాణా |
సుగైర్నో యానైరుప’యాతాం యఙ్ఞమ్ |
క్షుద్రాన్ పశూన్ ర’క్షతు రేవతీ’ నః |
గావో’ నో అశ్వాగ్మ్ అన్వే’తు పూషా |
అన్నగ్ం రక్ష’ంతౌ బహుధా విరూ’పమ్ |
వాజగ్‍మ్’ సనుతాంయజ’మానాయ యఙ్ఞమ్ ||
 

31, ఆగస్టు 2014, ఆదివారం

రాశ్యాభి వర్ణనము

ఉచ్ఛ నీచ రాశులు

  1. సూర్యునకు ఉచ్ఛ రాశి మేషము. అలాగే నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న తులారాశి.
  2. చంద్రుడికి ఉచ్ఛ రాశి వృషభము. నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న వృశ్చికము.
  3. కుజుడికి ఉచ్ఛ రాశి మకరము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కటకము.
  4. బుధుడికి ఉచ్ఛరాశి కన్య. నీచ రాశి దానికి ఏడవ స్థానం ఉన్న మీనము.
  5. గురువుకు ఉచ్ఛ రాశి కటకము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మకరము.
  6. శుక్రుడికి ఉచ్ఛ రాశి మీనము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కన్య.
  7. శనికి ఉచ్ఛ రాశి తుల. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మేషము.
పురుష రాశులు :- మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభము.
స్త్రీరాశులు :- వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము.

ఎరుపు వర్ణ రాశులు :- మేషము, సింహము, ధనస్సు.
నలుపు :- మకరము, కన్య, మిధునము.
పసుపు :- వృశ్చికము, కుంభము, మీనము.
తెలుపు :- వృషభము, కటకము, తుల.

బ్రాహ్మణ జాతి :- వృషభము, తులా, వృశ్చికము, మీనము.
క్షత్రియ జాతి :- మేషము, సింహము, ధనస్సు.
వైశ్యజాతి :- ముధునము, కుంభము.
శూద్రజాతి :- కటకము, కన్య, మకరములు.రాశులు 

దిక్కులు :-
తూర్పు దిక్కు :- మేషం, వృషభం, మిధునములు.
దక్షిణం దిక్కు :- కటకం, సింహం, కన్య.
ఉత్తర దిక్కు :- తులా, వృశ్చికం, ధనస్సులు.
పడమర దిక్కు :- మకరం, కుంభం, మీనం.

చరరాశులు:- మేషము, కటకము, తులా, మకరములు.
సమరాశూలను ఓజ రాశులు అంటారు.

5, జూన్ 2014, గురువారం

నక్షత్ర - వృక్షాలు - వాటి ప్రయోజనాలు

జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు


జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. మరికొందరు చెట్లని పెంచడం లో వాటిని కాపాడడం లో ఎంతో ఆసక్తి ని చూపుతుంటారు, తెలిసో తెలియకో వారు, వారి నక్షత్రాలకి సంబందించిన చెట్లని పెంచడం వలన, ఆరోగ్య, ఆర్దిక మరియు ఎన్నో అంశాలను చక్కగా ఆనందిస్తుంటారు. దీన్ని తెలుసుకొని వారికి సంబందించిన వృక్షాల/చెట్లు ను పెంచడం ద్వారా, వృక్షాలు/చెట్లలో దాగిన గొప్ప శక్తుల వలన , ఆరోగ్య, ఆర్దిక పరిస్థితులను మెరుగు పరుచుకోవడమే కాకుండా ,అనుకోని సమస్యల నుండి బయటపడడానికి ఎంతో ఉపకరిస్తాయి . మరియు ఇతరులకు వారికి సంబందించిన వృక్షాలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా, వారు అబివృద్ది చెందడమే గాక పర్యావరణాన్ని కూడా ఎంతో మేలుచేసిన వారవుతారు.

భారతీయ సంస్కృతి లో పూజించడానికి అర్హతగలిగినవేన్నో ఉన్నాయి. ప్రతి సంస్కృతీ లోను వారి నమ్మకాలని బట్టి వాటిని ఆచరిస్తుంటారు . వాటిలో ముఖ్యమైనవి చెట్లు. చెట్ల వలన ఉపయోగాలని ప్రత్యేకం గా వివరించాల్సిన అవసరం లేదు. పర్యావరణ రక్షణ లో ఇవి ఎంతో కీలకమైనవి, ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు, పర్యావరణపరిరక్షణవేత్తలు స్పష్టం గా ధృవీకరించారు. మనం పుట్టినప్పుడు , గ్రహాలూ, నక్షత్రాలు, రాశులు వాటి మహార్దశల, దశల ప్రభావం వలన ఆయా కర్మలను మనం మంచి చెడ్డల రూపం లో అనుభవిస్తుంటాం. మనకి కేవలం మంచి మటుకే జరిగితే ఇవన్ని పెద్దగా పట్టించుకోమేమో , అదే మనకి ఏదైనా తట్టుకోలేని, పరిష్కరించుకోలేని, భరించలేని సమస్యలు వస్తే వాటి నుండి బయటపడడానికి జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఎన్నో విధానాలను, మార్గాలను వెతుక్కొంటాం. వాటిని అనుసరించే విధానం లో ఆర్దిక విషయాలతో ముడిపడినదైతే అందరికి అనుసరించడానికి కొంచం కష్టతరమనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో మన పరిధి లో ఉన్నది మనకే కాక, భూమి కి పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేయగలిగినటువంటి పరిష్కార మార్గమే, జ్యోతిష్యశాస్త్రాన్ని అనుసరించి నక్షత్ర చెట్లని పెంచడం.

జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు తెలుసుకుందాం :

అశ్వని నక్షత్రం - వారు విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కలుగుతుంది. అలాగే, అన్ని విషయాలలోనూ సూటి గా వ్యవహరించడం, సమయాన్ని వృదా చేయకుండా అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.

భరణి నక్షత్రం - వారు ఉసిరి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యము , పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువ గా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది

కృత్తిక నక్షత్రం - వారు అత్తి/మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు, అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.

రోహిణి నక్షత్రం - వారు నేరేడు చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం , సత్ప్రవర్తన ఎక్కువ గా కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది

మృగశిర నక్షత్రం - వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

ఆరుద్ర నక్షత్రం - వారు చింత చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు, అంతే కాకుండా విషజంతువుల బాధ కుడా వీరికి కలగదు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది

పునర్వసు నక్షత్రం - వారు వెదురు లేదా గన్నేరు చెట్టు ను పెంచడం , మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తుల కి సంబందించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుండి, మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యం గా పాల కి లోటు ఉండదని చెప్పవచ్చు. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా , చక్కటి చాకచక్యం తో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.

పుష్యమి నక్షత్రం - వారు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం, పూజించడం వలన నరాల సంబంధిత బాధలు నుండి విముక్తి పొందుతారు. అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది. రోగ, రుణ భాధల నుండి విముక్తి లభిస్తుంది . స్త్రీలు సంతానవతులవుతారు.

ఆశ్లేష నక్షత్రం - వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం , పూజించడం వల్ల శ్వేతకుష్ఠు మరియు చర్మ సంబంధిత వ్యాదుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందు చూపు తో వ్యవహరించి జీవితం లో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైన తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

మఖ నక్షత్రం - వారు మర్రి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాదుల నుండి రక్షింపబడతారు. అలాగే భార్య భర్తలు ఎంతో అన్యోన్యం గా ఉండడానికి, తల్లితండ్రులకు, సంతానానికి కూడా మేలు జరుగుతుంది. జీవితం లో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి

పుబ్బ నక్షత్రం - వారు మోదుగ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు .ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తర నక్షత్రం – వారు జువ్వి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలని వారి చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

హస్త నక్షత్రం - వారు సన్నజాజి , కుంకుడు చెట్లను పెంచడం, పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి . దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

చిత్త నక్షత్రం - వారు మారేడు లేదా తాళ చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా పేగులు, అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు. ఎవరిని నొప్పించకుండా వారి తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది.

స్వాతి నక్షత్రం - వారు మద్ది చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయట పడగలరు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. అన్ని రకములైన విద్యలలోను రాణిస్తారు, ఆత్మవిశ్వాసం అధికం గా ఉంటుంది. భావోద్వేగాలు అధికం గా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

విశాఖ నక్షత్రం - వారు వెలగ , మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణసంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

అనురాధ నక్షత్రం - వారు పొగడ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. పదిమంది లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

జ్యేష్ఠ నక్షత్రం - వారు విష్టి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు భాద్యతలు సమర్దవంతం గా మొయగలగడానికి. ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది.

మూల నక్షత్రం - వారు వేగి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా పళ్ళ కి సంబంధించిన , మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణ లో ఉంటుంది. శాస్త్ర ప్రవీణం, మంచి వ్యక్తిత్వము, ఔన్నత్యం కలగడానికి, సంతానం వల్ల జీవితం లో ఆనందాన్ని ఆనందం పొందడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాషాడ నక్షత్రం - వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం, పూజించడం ద్వారా కీళ్ళు, సెగగడ్డలు , వాతపు నొప్పులు మరియు జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ది . వినయవిదేతలు కలగడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాషాడ నక్షత్రం - వారు పనస చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరి చేరవు. అలాగే ఆర్దికం గా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు. భూముల కి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అబివృద్ది లోకి రావడానికి ఉపయోగపడుతుంది.

శ్రవణం నక్షత్రం - వారు జిల్లేడు చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ధనపరమైన సమస్యలు తొలగుతాయి న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

ధనిష్ఠ నక్షత్రం - వారు జమ్మి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మెదడు కి సంబంధించిన సమస్యలు రావు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాబివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

శతభిషం నక్షత్రం - వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టు ను పెంచడం ద్వారా శరీర పెరుగుదల కి సంబంధిచిన , మోకాళ్ళ సమస్యల నుండి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం , చక్కటి ఉద్యోగం కొరకు, జీవితం లో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాభాద్ర నక్షత్రం - వారు మామిడి చెట్టు ని పెంచడం ద్వారా కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితి ని పొందడానికి . కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాల లో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాల లో రాణించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రం - వారు వేప చెట్టు ని పెంచడం ద్వారా శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యల ను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందం గా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

రేవతి నక్షత్రం - వారు విప్ప చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితం లో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...