గృహసంభంధ విషయాలు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
గృహప్రవేశము :
కాలామృతం ఆధారంగా వైశాఖంలో గృహప్రవేశం గృహపతికి బహుపుత్రంబు, జ్యేష్ఠమాసం శుభప్రదము. ఫాల్గుణమాసం సంపత్కరము, మాఘం ధాన్య ప్రదము. అయితే ఉత్తరాయంలో కుంభంలో రవి ఉండగా తప్పమిగిలిన అన్నియు శ్రేష్ఠములే. బహుగ్రంధకర్తలు కార్తీక, మార్గశిర, శ్రావన మాసములు శ్రేష్ఠములు అని తెలిపిరి.
వారములు:
ఆదివారము అత్యంత దుఃఖమును క్షీణేందువారము (బహుళసప్తమి తర్వాత సోమవారము) కలహమును, పూర్ణేందు వారము సంపదను, మంగళవారము అగ్నిభయమును, బుధవారము ధాన్యమును గురువారము పశుపుత్రులను, శుక్రవారము శుభసౌఖ్యములోను, శనివారము స్థైర్యమును, చోరభయమును కలుగచేయును.
నక్షత్రములు :
చిత్త, అనూరాధ, ధనిష్ఠ, ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, రేవతి, శతభిషం, రోహిణి, మృగశిర, ఈ నక్షత్రములు ప్రశస్తమైనవి. పుష్యమి మధ్యమము. పునర్వసు, స్రవణం నక్షత్రములలో గృహప్రవేశమైన ఆ ఇల్లు అన్యాక్రాంతమగును. ఆర్ద్ర, కృత్తిక, అగ్నిభయమును కలుగచేయును.
లగ్నములు :
కర్కాటక లగ్నమునందు గృహప్రవేశము నాశనము, తులాలగ్నమునందు గృహప్రవేశమును వ్యాధిని, మకరలగ్నమునందు గృహప్రవేశమును ధాన్య నష్టము, మేషలగ్నము నందు చలనమును కలుగచేయును, వృషభ, సింహ లగ్నములు స్థిరములు అయినకారముగా ఆ లగ్నము నందు గృహప్రవేశము మంచిది. మిధున, కన్యా, ధనుర్మీన లగ్నములు గృహ ప్రవేశమునకు శుభప్రదమైనవే.
విశేషములు :
గృహప్రవేశమునకు 4,8,12 స్థానములు శుద్ధిగా ఉండుట విశేషము. 4 గృహస్థానము, 8 ఆయఃస్థానము, 12 వ్యయస్థానము అయినకారనముగా ఈ స్థానములు శుద్ధిగా వుండవలెను, 3,6,11 ల యందు పాపగ్రహములు, 1,2,4,5,7,9,10,11 లలో శుభగ్రహములుండగా గృహప్రవేశము విశేషము.
ద్వారం ఎత్తుటకు :
పాడ్యమి, విదియ, తదియ, పంచమి, సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ తిధుల యందును, సోమ, బుధ, గురు, శుక్ర, వారముల యందును శుభగ్రహ హోరలయందును ద్వారం ఎత్తుటకు మంచిది. శ్లాబ్ విషయమై కూడా అంతే. వర్జ్య, దుర్ముహుర్త, రాహుకాలములు విడచి సూర్యోదయము మొదలు మధ్యాహ్నం లోపల శ్లాబ్ వేయుట ప్రారంభించాలి అలాగే ద్వారం ఎత్తాలి. దీనినికూడా ఆషాడ, భాద్రపద,పుష్యమాసములు పనికిరావు.
నామ నక్షత్ర వినియోగం
సంగ్రామ, వ్యవహారములకు, ధామార్వణం, నగరార్వణం, మంత్రార్వణం విషయములలోను నామ నక్షత్రము చూడవలెను. ధామార్వణం విషయంలో కాలామృతం సంస్కృత వ్యాఖ్యానంలోక్షేత్రార్వణం అని వివరించిన కారణంగా గృహము ఏదిశలో కట్టుకోవాలి. ఆయాది వివరణల విషయంగా నామనక్షత్రం వాడి ముహూర్త విషయంలో జన్మ నక్షత్రం వాడవలెను.
బోరింగ్ లేదా బావి తీయుటకు ముహూర్తం :
హస్త, పుష్యమి, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి, మఘ.... ఈ నక్షత్రాలు శ్రేష్ఠము. ఆది, మంగళ, శనివారములలో తీయుబావులయంధు నీరు ఎక్కువకాలం వుండదు. మీన, మకర, కర్కాటక, వృషభ, కుంభ లగ్నములందును, లగ్నానికి చతుర్థస్థానముకు పాపగ్రహ సంబంధం లేకుండాను చూచుకొని ముహూర్తం చేయవలెను. జలరాసులు
" మత్స్యే కుళిరే మకరే బహోదకం, కుంభేవృషే చార్థజల ప్రమాణం, అళ్యంచ తౌల్యామ్ మిధునేన పాదం శేషేతు రాశఊ జలనాశంచ"
శంఖుస్థాపన చేయుటకు :మాసములు :
చైత్రమున ధనహాని, వైశాఖం శుభం, జ్యేష్ఠం మరణం, ఆషాఢం పశునాశనం, శ్రావనం భృత్యవృద్ది, భాద్రపదమాసం ప్రజాపీడ, ఆశ్వయుజం కలహప్రధం, కార్తీకం ధనలాభం, మార్గశిరం భయము, పుష్యం అగ్నిభయము, మాఘం అధిక సంపద, ఫాల్గుణం రత్నలాభం.
నక్షత్రములు :
అశ్విని,రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉషా, శ్రవనం ధనిష్ఠ, శతభిషం ఉత్తరాభద్ర,రేవతి.
వారములు:ఆది, మంగల, శని వారములు నిషేధము. అయితే శని ఆదివారములు వాడుకలో ఉన్నవి.లగ్నబలం :వీలైనంతవరకు పాపగ్రహ సంభంధంలేని ఏ లగ్నమైనా, లగ్నము అష్టమముతో పాపగ్రహములు లేని లగ్నము, కుజగురువులు బలంగా వున్న గ్రహములు స్వీకరించాలి.స్థలం రిజిష్ట్రర్ చేయించుకోవడానికి:
చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి, అమావాస్య తిధులు, భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పూర్వాభాధ్ర నక్షత్రములు, మంగళవారం కాకుండాచూచుకొని, స్థలము రిజిస్త్రేషన్ చేయించుకోవాలి. అయితే రిజిష్టర్ చేయించుకొనే సమయానికి వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం వుండకూడదు. వీలైనంతవరకూ శుభగ్రహ హోరల సమయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
ఏక నక్షత్ర వివాహ విషయము :
రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ ఎనిమిది నక్షత్రముల విషయంలో వధూవరులకు ఏక నక్షత్రమైన దోషం లేదు. అశ్వని, భరణి, ఆశ్రేషా, పుబ్బ, స్వాతీ, మూల శతభిషం యివి మధ్యమములు తక్కిన నక్షత్రములు దోషములు.
అయితే 27 నక్షత్రములలో కూడా ఒకే నక్షత్రము అయినప్పటికీ భిన్న పాదములు అయినచో దోషం లేదు.ఏకోధర వివాహము :' పుత్రీ పాణీని పీడనాచ్చ పరతస్పువో ద్వివాహశ్శుభో, న్యాఅన్యత్పుత్ర కరగ్రహత్తునక మప్యుద్వాహ ఏవవ్రతత్'
అనే కాలమృత శ్లోకాధారముగా ఏక కాలమందు పుత్ర పుత్రికా వివాహముల విషయములో పుత్రిక వివాహానంతరము పుత్ర వివాహము ముఖ్యమ్ననియు పుత్ర వివాహానంతరము పుత్రికా వివాహమునకు పుత్ర ఉపనయనము అయిన చేయ కూడదనియు పుత్ర ఉపనయనాంతరము పుత్రికా వివాహము శుభకరమనియు పుత్ర వివాహము చేసిన సంవత్సరమ్మునందు ఆరు నెలల పర్యంతము ఏకోదరులకు ఉపనయనాదులు అశుభకరములు. " ఫాల్గుణే చైత్ర మాసేతు పుత్రోద్వాహోపనయనాయనే అబ్ద భేదాత్ర్పకుర్వీత ఋతుత్రయ విడంబన" అనగా ఫాల్గుణ మాసంలో ఒకరికి చైత్రమాసంలో మరొకరికి సంవత్సరము భేధం ఉన్నందున వివాహ, ఉపనయనాదులు చేయ వచ్చును.
కన్యాదాతల నిర్ణయం :
కన్యాదానము చేయు అధికారము తండ్రికి, త్యండ్రి కానిచో పితామహుడు, సోదరుడు, పిన తండ్రి, పెత్తండ్రి మెదలగు పితృవంశస్థులు వారు కానిచో స్వగోత్రీకులు కానిచో ఎవరైనను చేయ వచ్చును.
కుజదోష నివారణ :పాతాళేపి ధనౌరంధ్రే జామిత్రే చాష్ఠమేకుజేస్థితః కుజః పతింహంతి నచేచ్ఛు భయతేక్షితః ఇందోరప్యుక్త గేహేషు స్థితః భౌమోధవాశనిః పతిహంతాస్త్రియాశ్చైవం వరస్య యది స్త్రీ మృతిః (బృహతృరాశరీరాశాస్త్రం) జన్మలగ్నము -
చంద్రలగ్నముల లగాయతు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు వున్నయెడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం ఇరువురికి వున్నను లేక ఇరువురికి లేకున్నను వివాహం చేసుకొనవచ్చును. ఈ దోషం ఒకరికుండి మరొకరికి లేకున్నను వైవాహిక జీవితం కలహ ప్రదంగా వుంటుంది. కుజుడు కలహ ప్రదుడు. శని ఆయుర్దాయ కారకుడు. కావున పైన చెప్పిన విధానంలో శని దోషం కూడా చూడవలెను అని పరాశర మతం " నచేచ్ఛభయతేక్షితః" అనివున్న కారణంగా కుజునికి శుభగ్రహముల కలయిక (లేదా) శుభగ్రహ వీక్షణ వున్నచో దోషం వుండదు. కేవలం ఆడవారి జాతకంలో వుంటే మగవారికి ఇబ్బంది. కేవలం మగవారి జాతకంలో వుంటే ఆడవారికి ఇబ్బంది.
ద్వితీయ స్థితియే భౌమదోషస్తు యుగ్మ కన్యక యోర్వినా! ద్వాదశే భౌమ దోషస్తు వృషతాళిక యోర్వినా! చతుర్ధేభౌమ దోషస్తు మేష వృశ్చికయోర్వినా! సప్తమే భౌమదోషస్తు నక్రకర్కట యోర్వినా! అష్టమే భౌమదోషస్తు ధనుర్మీనద్వయం వినా! కుంభేసింహేన దోషస్స్యాత్ ప్రత్యక్షం దేవ కేరళే || ద్వితీయ స్థితి కుజదోషం మిధున కన్యలకు లేదు. ద్వాదశ స్థితి కుజదోషం వృషభ తులలకు లేదు. చర్తుర్ధస్థితి కుజదోషం మేషవృశ్చికములకు లేదు. సప్తమ స్థితి కుజదోషం ధనుస్సు, మీనములకు లేదు. కుంభము, సింహముల యందు జననమయినచో కుజదోషం వుండదు. మేష, వృశ్చిక, మకర లగ్నములవిషయంలోను మృగశిర ధనిష్ఠ, చిత్త, నక్షత్రముల విషయంలోను కుజదోషం వుండదు.
నిశ్చితార్ధం :
నిశ్చితార్ధమునకు పెండ్లితో సమానమైన, సమాన బలమైన ముహూర్తం చూడవలెను. కారణం నిశ్చితార్ధంతోనే వధూవరులు భంధం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండ జాతక ప్రభావాలు వారిరువురికి ఒకరి ప్రభావం మరొకరి మీద చూపుతుండి. వివాహమునకు సంభంధించిన తిధి వార నక్షత్ర లగ్నములు చూడవలెను. అయితే నిశ్చితార్దం రోజున గణపతి పూజ చేయవలెను. కావున భోజనానంతరం పూజ పనికి రాదు. కావున ఉదయ సమయంలోనే నిశ్చితార్ధం చేయవలెను.
నూతన వధూవాస దోషములు :
" వివాహాత్ప్రమే పౌషే ఆషాఢే చాధి మాసకే. నసా భర్తృగృహే తిష్ఠే చ్ఛైత్రే పితృగృహే తధా" వివాహం అయిన ప్రథమ సంవత్సరం ఆ వధువు అత్తవారింట ఉన్నచో ఆషాఢమాసంలో అత్తగారికి గానీ, అధిక మాసం అందు భర్తకును, పుష్య మాసంలో మామగారికి గానీ గండము. మొదటి సంవత్సరము చైత్ర మాసంలో తండ్రి యింట ఉన్న ఎడల తండ్రికి హాని అని వున్నది కానీ ఈ ఒక్క విషయము ఆచారం లేదు.
పునర్వివాహము :
ప్రమదామృతి వాసరాదితుః పునరుద్వాహ విధిర్వరస్యద విషమే పరివత్సరే శుభోయుగళేచాపి మృతిప్రదోభవేత్" అనగా పూర్వ భార్య మృతి నొందిన దిన ప్రభృతి బేసి సంవత్సరముల యందు పునర్వివాహము చేసుకొనుటకు శుభము. సరిసంవత్సరములందు అశుభము.
" తృతీయా మానుషీకన్యా నోద్వాహ్యా మ్రియతేహిసాః విధవా వాభవేత్తస్మాత్ తృతీయేర్కం సముద్వహేత్" మూడవ వివాహము మనుష్య కన్యకు చేసుకొనుట పనికిరాధు అట్లైనచో భార్యకు మృతి కలుగును, విధవ అయిన అగును. కావున తృతీయము అర్క వివాహము చేయునది.
పెండ్లి చూపులకు :
సోమ, మంగళ వారములు కాకుండాను భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పుర్వాభద్ర, నక్షత్రములు కాకుండా, వ్యర్జ దుర్ముహర్తములు లేకుండాను, చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి, అమావాస్య కాకుండా శుభగ్రహ హోరాలయందు పగటి సమయమున పెండ్లి చూపులఏర్పాటు చేయవలెను.
పెండ్లి పనులు ప్రారంభించుటకు :
సోమ, మంగళ వారములు విడువవలెను అశ్వని, రోహిణి మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉషా, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి, నక్షత్రములయందు విదియ, తదియ, పంచమి సప్తమి, దశమి ఏకాదశి, త్రయోదశి, పౌర్ణిమ, బహుళ పాడ్యమి తిధుల యందు, శుభగ్రహ హోరాల యందు వర్జ్యం దుర్ముహర్తం వదలి పెండ్లి పనులు ప్రారంభించాలి.
వధూప్రవేశము :
" వివాహ మారభ్య వధూప్రవేశో యుగ్మేదినే షోడశవాసంరాంతే" వివాహ దిన ప్రభృతి పదహారు రోజుల లోపల ఎప్పుడైననూ సరిదినముల యందునూతన గృహప్రవేశం చేయవచ్చును.
వధూ ప్రవేశోనది వాప్రశస్తుః
నూతన వధువు అత్తవారింట అడుగు పెట్టవలెను అంటే పగలు పనికి రాదు. సూర్యాస్తమయాత్ పరం, సూర్యోదయాత్ పూర్వము ప్రసస్తము.
షష్ఠేష్టమేవా దశమే దినేవా వివాహ మారభ్య వధూ ప్రవేశః పంచాంగ శుద్ధంచ దినం వినాపి తిధౌన సద్గోచరకేపికార్యః
అనగా వివాహము అయినది మొదలు ఆరు, ఎనిమిది, పది దినములందు వధువు ప్రవేశించిన ఎడల ఆ దినములు తిధి వారనక్షత్ర యోగకరణములచే శుద్ధము కాకపోయినప్పటికీ శుభ ప్రదముగానే వుంటుంది.
ఒక వేళ మొదటి నెలలో వదూ ప్రవేశం జరగనిచో మెదటి సంవత్సరంలో బేసి నెలలో స్థిర, క్షిప్ర, మృదు, శ్రవణ, ధనిష్ఠ, మూల, మఘ, స్వాతీ, నక్షత్రదినములందు రిక్త తిధులను విడచి నూతన వధూ ప్రవేశం చేయ వలెను.
ఎప్పుడు వధూ ప్రవేశం చేసిననూ వర్జ్య దుర్ముహోర్త కాలములు విడువవలెను.వివాహ ప్రయత్నం ఎప్పుడు ప్రారంభించాలి?
వివాహము చేయవలెను అని తలచినప్పుడు ఎవరు వివాహ ప్రయత్నములు చేయదలచారో వారికి నక్షత్రం తారాబలం కుదిరిన రోజున, భరణి, కృత్తి, ఆర్ద్ర, పున, పుష్య, ఆశ్రేష, పుబ్బ, చిత్త, విశాఖ, జేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్రలను విడచి, మంగళ, సోమ వారములు కాకుండా, వర్జ్య దుర్ముహూర్తములు లేని సమయంలో గణపతిని ప్రార్ధించి తదుపరి యిష్టదైవమును ప్రార్ధించి వివాహప్రయత్నము చేయ వలెను.
వివాహం :
భరణి, కృత్తిక, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్ర నక్షత్రములు పనికిరావు. చిత్త పనికి వస్తుంది అని కొందరి వాదన. బుధ, గురు, శుక్ర, శని, ఆది వారములు పనికి వస్తాయి. అయితే అన్ని గ్రంధాలలో శుభగ్రహవారములు అన్ని వున్న కారణముగా క్షీణ చంద్రుడు కాని సమయములో వున్న సోమవారాం పనికి వస్తుంది. "మాసంతే దిన పంచకే పితృతిధౌ" బహుళ ఏకాదశి నుండి అయిదు రోజులు, పితృతిధులు వున్నరోజులలో వివాహం పనికి రాదు. పాపగ్రహ వీక్షణ వున్న సమయంలో సప్తమంలో అష్టమంలో పాపగ్రహములు వున్న లగ్నములు పనికిరావు మాఘ, ఫాల్గుణ, చైత్రం, వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ, ఆశ్వయుజంలో దసరా తర్వాత కార్తికం, మార్గశిరంలో ధనుర్మాసం ముందర వివాహములు చేయుట ఆచారంగా వున్నది. మధ్యాహ్నం 12 లోపల, మరల సూర్యాస్తమయం తర్వాత వివాహం చేయవచ్చు.
వివాహం -ఆబ్దికం :
వివాహమునకు ముందురోజు ఆబ్దికం వున్నచో ఆ ముహుర్తం పనికిరాదు. ఇది కన్యాదాత విషయంలోను వరుడు, వరుని తండ్రి ఆబ్దీకములు పెట్టవలసినవిషయంలో మాత్రమే. వివాహం చేసిన నెలలోపుగా వధూవరుల యిండ్ల వారి పైతలరాలవారి ఆబ్దీకములు రాకుండా చూసుకుని వివాహముహోర్తం నిర్ణయించాలి.
1. ఊర్ధ్వ, అధో, తిర్యజ్మఖ నక్షత్రములు
అశ్వని, మృగశిర, పునర్వసు, హస్త, చిత్త, అనూరాధ, , జ్యేష్ఠ, రేవతి యివి తిర్యజ్ముఖ నక్షత్రములు. భరణి, కృత్త్యిక, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, మూల, పూర్వాషాఢ, పూర్వాభద్ర యివి అధీముఖములు. రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర యివి ఊర్థ్వముఖ నక్షత్రములు.
2.క్షీణ చంద్ర వివరణ
చంద్రుడు, శుక్ల అష్టమి లగాయతు కృష్ణ అష్టమి వరకు పూర్ణ బలవంతుడు. యిది సామాన్య నియమము. యిందలి విశేష పాఠమేమనగా కృష్ణ పక్షంలొ పాడ్యమి నుండి పంచమి వరకు మిక్కిలి పూర్ణుడు. తదాది అయిదు రోజుల మధ్యమం చివరి అయిదు రోజులు అనగా కృష్ణ పక్ష ఏకాదశి నుండి అమావాస్య వరకు చంద్రుడు క్షీణ చంద్రుడు. దీనికి వ్యతిరేకంగా కృష్ణ పక్షం ఊహించవలెను. అనగా శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు క్షీణ చంద్రుడు షష్ఠి ప్రభృతి దశమి వరకు మధ్యం తదుపరి పూర్ణిమ వరకు పూర్ణ చంద్రునిగా పరిగణించాలి. అయితే కృష్ణ పక్షంలోని చివరి అయిదు రోజులు శుభకార్య విషయంగా ప్రాంతీయ ఆచారములను పరిధిలోనికి తీసుకొని నిషేధించుచున్నాము.
3.గండనక్షత్ర విషయం :
ఆశ్రేషా, మూల, విశాఖ, జ్యేష్ఠ నక్షత్రములలో జన్మించిన స్త్రీ విషయంలో వివాహం పొంతనలు చూసేటప్పుడు గండనక్షత్రములుగా పరిగణీంచవచ్చును. అయితే అందులో ఆశ్రేష 4వపాదం మూల 1 పాదము, విశాఖ నాల్గవపాదం, జ్యేష్ఠ 4వ పాదం మాత్రమే దోషం గండరరక్ష జనన దోషాన్ని పరిశీలించిన మీదట ఆశ్రేషా, జ్యేష్ఠ నక్షత్రములు చివరి నాలుగు ఘడియలు మాత్రమే దోషమని మూల 1వ పాదంలో ప్రారంభంలో ప్రారంభ నాలుగు ఘడియల కాలమే దోషం అని తోచుచున్నది.
4.గణకూటమి :
వివాహ విశేషః పట్టికలో చుపిన ప్రకారం వధూవర నక్షత్రం పరస్పర దేవరాక్షస గన్ములైన అధము. మనుష్య రాక్షస గణముల విషయంలో గ్రహమైత్రి కుదిరిన స్వీకరించవచ్చును దేవ - దేవ; దేవ - మనుష్య; మనుష్య - మనుష్య; రాక్షస - రాక్షస విశేషములు.
5.గ్రహ మైత్రి :
నక్షత్ర విశేషములు అనే పట్టికలో నక్షత్రములు పొందిన రాశ్యాధిపుల వివరణ ఇవ్వబడినవి. వాటిని దృష్టిలో వుంచుకొని క్రింద పట్టికద్వారా ఆయా గ్రహముల శతృమిత్రత్వాలు పరిశీలించారు.
వధూవర రాశ్యాధిపులు పరస్పర శతృవులైనచో విడువదగినది.6.స్త్రీ దీర్ఘము :
వధూనక్షత్రం నుండి వరుని నక్షత్రం లెక్కింపగా 9 నక్షత్రముల లోపు వున్నయెడల అధమము. 9 తర్వాత 18 లోపు వున్న మధ్యమము. 18 తర్వాత 27 లోపు వున్న యెడల ఉత్తమము.
గ్రహముల స్వభావములు
శని, రాహు, కేతు, కుజులు క్రూర స్వభావ గ్రహములు. శుక్ర, గురు, బుధ, చంద్రులు సౌమ్య స్వభావ గ్రహములు. అయితే " బుధః పాపాయుతః పాపః క్షీణచంద్రస్తధైవచ" అనగా పాపగ్రహములతో కలసిన బుధుడు పాపగ్రహముగాను, క్షీణ చంద్రుని పాపగ్రహముగాను చెప్పబడినది. కుజ, రవి, గురువులు పురుష స్వభావ గ్రహములు రాహు, చంద్ర, శుక్రులు స్త్రీ స్వభావం కలిగిన గ్రహాలు. శని, బుధ, కేతువులు నపుంసక స్వభావగ్రహములు, గురు, శుక్రులు, బ్రాహ్మణ గ్రహములు; రవి, కుజులు క్షాత్ర గ్రహములు. చంద్ర, బుదులు వైశ్యులు, శని శూద్ర కులాధిపతి.
7.కుజదోష విచారణ
పాతాళేపి ధనౌరంధ్రే జామిత్రే చాష్టమేకుజే
స్ధితః కుజః పతింహంతి నచేచ్చు భయుతేక్షితః ఇందోరప్యుక్త గేహేషు స్ధితఃఅ భౌమోధవాశనిః పతిహంత్రౌస్త్రియాశ్చైవం వరస్య యది స్త్రీ మృతిః (బృహతృరాశరీరాశాస్త్రం)
జన్మలగ్నము- చంద్రలగ్నముల లగాయితు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు వున్నఎడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం యిరువురికీ వున్ననూ లేదా యిరువురికీ దోషం లేకున్ననూ వివాహం చేయవచ్చును. ఈ దోషం ఒకరికి వుండి మరొకరికి లేని ఎడల వైవాహిక జీవితం కలహప్రదంగా వుంటుంది. కుజుడు కలహ ప్రదుడు. శని ఆయుర్దాయకారకుడు కావున పైన చెప్పిన విధానంలోనే శనిదోషం కూడా చూడవలెను అని పరాశర మతం. "నచేచ్చభయుతేక్షితః" అని ఉన కారణంగా కుజునికి శుభగ్రహముల కలయిక (లేదా) శుభగ్రహవీక్షణ వునచో దోఆషం వుండదు. కేవలం ఆడవరై జాతకంలో దోషం వుంటే మగవారికి యిబ్బంది. కేవలం మగవారి జాతకంలో వుంటే ఆడవరైకి యిబ్బంది.
ద్వితీయ భౌమరోషస్తు యుగ్న కన్యక యోర్వినా| ద్వాదశే భౌమ దోషస్తు వృషతాళిక యోర్వినా| చతుర్ధే భౌమదోషస్తు మేష వృశ్చికయోర్వినా| సప్తమే భౌమదోషస్తు నక్రకర్కట యోర్వినా| అష్టమే భౌమదోషస్తు ధనుర్మీనద్వయం వినా| కుంభేసింహేన దోషస్స్యాత్ ప్రత్యక్షం దేవ కేరళే|
ద్వితీయ స్ధితి కుజదోషం మిధున కన్యకలకు లేదు. ద్వాదశ స్ధితి కుజదోషం వృషభ తులలకు లేకు. చతుర్ధస్ధితి కుజదోషం మేషవృశ్చికములకు లేకు. సప్తమస్ధితి కుజదోషం మకర కర్కాటకములకు లేదు. అష్టమ స్ధితి కుజదోషం ధనస్సు, మీనములకు లేదు. కుంభము, సింహముల యందు జననమయనలో కుజదోషం వుండదు. మేష, వృశ్చిక, మకర లగ్నముల విషయంలోను మృగశిర ధనిష్ఠ, చిత్త నక్షత్రముల విషయంలోను కుజదోషం వుండదు.
8.తారాబలఫలమ్
సంపత తార సంపదలను, విపత్ తార కార్య నాశనమును క్షేమతారా క్షేమమును, ప్రత్యక్ తార కార్య నాశనమును సాధన తార కార్య సాధనమును నైధవ తార హీనత్వమును మిత్రతారా సుఖమును, పరమమైత్ర తార సుఖసంపదలను కలుగచేస్తుంది. అయితే అత్యవసర పరిస్థితిలో ప్రథమ నవకములో ప్రత్యక్ తారను విడచి మూడు నవకములలో నైథవ తారను విడచి మిగిలిన నక్షత్రములలో ముహూర్తము చేయవచ్చును.
ఒకవేళ కర్కాటక రాశికి వృషభరాశికి చెందు నక్షత్రములు తారాబల విష్యములో విపత్, ప్రత్యక్ తారలు అయినప్పటికీ శుభకార్యములు చేయవచ్చును. జన్మ నక్షత్రములో నక్షత్రము ప్రారంభమునుండి ఏడు ఘడియలు విపత్తార యందు ప్రారంభ 3 ఘడియలు ప్రత్యక్ నైథవ తారల యందు ప్రారంభ 8 ఘడియలు విడువవలెను. మిగిలిన ఘడియలు గ్రాహ్యము.
9.తారాబలము
జన్మ నక్షత్రము నుండిన లెక్కింపగా వరుసగా ఇరవై ఏడు నక్షత్రములకు జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధవ, మిత్ర, పరమైత్ర అనబడే తొమ్మిది సంజ్ఞలు ఉంటాయి. యివే సంజ్ఞలు మరలా 10వ నక్షత్రమునుండి 18 వరకు మరలా 19 నక్షత్రం నుండి 27 వ నక్షత్రము వరకు ఉంటాయి.
10.త్రిజ్యేష్ఠ స్వరూపం :" అధ్యగర్భప్రసూతాయాః కన్యకాయా పరస్యచ; జ్యేష్ఠమాసే నకుర్విత కదాచిదపి మంగళమ్"
ప్రధమ గర్భంలో జన్మించిన వధూవరుల విషయంలో జ్యేష్ఠమాసంలో వివాహం చేస్తే త్రిజ్యేష్ఠ అవుతుంది. అలాగే ఆ వధూవరులు ఒకరు జ్యేష్ఠమాసంలో జన్మించిన మరొకరు జ్యేష్ఠులైతే వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయ కూడదు. మిగిలిన మాసంలో చేయుటకు అభ్యంతరంలేదు. ఎటువంటి త్రిజ్యేష్ఠా స్వరూపం అయినా జ్యేష్ఠమసంలో మాత్రమే వివాహం నిషేధం మిగిలిన మాసంలో దోషంలేదు.
11.నక్షత్ర భేధములు
అశ్వని, హస్త, పుష్యమి నక్షత్రములు క్షీప్ర ( శీఘ్ర) సంజ్ఞ నక్షత్రములు, మూల, ఆర్ద్ర, జ్యేష్ఠ, ఆశ్రేష నక్షత్రములు దారుణ నక్షత్రములు. చిత్త, రేవతి, మృగశిర, అనూరాధ నక్షత్రములు మృదు (సౌమ్య) నక్షత్రములు. భరణి, మఘ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభద్రలు స్థిర (ధృవ) నక్షత్రములు. భరణి, మఘ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభద్రలు ఉగరనక్షత్రములు. కృత్తిక, విశాఖ సాధారణ నక్Sధత్రములు. స్వాతి, పునర్వసు, శ్రవణం ధనిష్ఠ, శతభిషం నక్షత్రములు చర నక్షత్రములు
12.నక్షత్ర విచారణ :
జన్మ నక్షత్రములు తీసుకొన్నతర్వాత వాటి ద్వారా గ్రహమైత్రి, గణకూటమి, యోనికూటమి, రాశికూటమి, స్త్రీ దీర్గము, నాడికూటమి ముఖ్యంగా పరిశీలించాలి. యివి ఆరు కూటములు మహేంద్రకూటమి, వశ్యకూటమి, దినకూటమి, వేదాకూటమి, రజ్జుకూటమి, వర్నకూటమి యివి ఆరు కూటములు సామాస్యకూటములు. సామాన్యకూటములు ఈ పన్నెండు కూటములు కలిపి ద్వాదశ వర్గులు అంటారు. అందు ముఖ్య ఆరు వర్గులను సూక్ష్మంగా పరిశీలించగా
13.నాడీకూటమి :
వధూవర నక్షత్రములు యిరువురివీ ఒకే నాడీ నక్షత్రములు కాకూడదు. వేరువేరు నాడులైన విశేషము. నాడీ వివరములు పట్టికలో వున్నవి. పట్టికలో ఇచ్చినవి త్రినాడీ స్వరూపము.
14.యోని కూటమి :
పట్టికలో చూపిన నక్షత్ర జంతువులకు పరస్పర శతృత్వం వున్నటువంటివి గో - వ్యాగ్రములు;
అశ్వ - మహిషములు; గజ –సింహములు ; కుక్క - లేడి; పాము -ముంగీస; కపి -ఎనుములు; మార్జాల - మూషికములు పరస్పర శతృత్వ జంతువులు కావున అవికాక మిగిలిన నక్షత్రములు స్వీకరించాలి. 15.రాశికూటమి :
అమ్మాయి రాశి లగాయతు అబ్బాయి రాశి రెండు, మూడు, నాలుగు, అయిదోది. ఆరు రాశులు కాకపోయినా శుభము. గ్రహమైత్రి కుదిరినప్పుడు రాశికూటమి, నాడీకూటమి, స్త్రీ దీర్ఘములు కుదరకపోయిననూ దోషం వుండదు.
తేనెపట్టు,అరటిగెల, మొండిచేయి - దిశాఫలితాలుతేనెపట్టు :
తూర్పున యజమానికి ధనలాభం, ఆగ్నేయమున అగ్నిభయం, దక్షిణమున మరణము, నైఋతి ధాన్య నాశనము, పడమర మనోపీడ, వాయువ్యం ధననష్టం, ఉత్తరం పుత్రలాభం, ఈశాన్యం బంధుమిత్రలాభం.
అరటిగెల :
తూర్పు శుభం; ఆగ్నేయం శతృవృద్ధి, దక్షిణం బంధుమిత్ర నాశనం, నైఋతి పుత్రలాభం, పడమర విపత్తు, వాయువ్యం నేత్రహాని, ఉత్తరం ఐశ్వర్యం, ఈశాన్యం కీర్తిలాభం
మొండిచేయ్యి :
తూర్పు యజమానికి, నైఋతి పుత్రులకు, వాయువ్యం పశువులకు, ఉత్తరం, ఈశాన్యం భార్యకు కీడు, ఆగ్నేయం అగ్నిభయం, పడమర మరణం కలుగును.
పుట్టు మచ్చల ఫలితములు
బల్లి పడుట వలన కలుగు శుభాశుభములుపురుషులకు
స్త్రీలకు
రసజ్వలా విషయములురసజ్వలకు నక్షత్ర ఫలములుఅశ్వని: భోగభాగ్యములు పొందును. మొదటి సంతానం నష్టం.భరణి :అనారోగ్యము, భీతి, అల్పాయువు. కృత్తిక: కష్టనష్టములు అల్పసంతానం కలది చంచలము. రోహిణి : ధనధాన్యవృద్ధి, పుత్ర సంతావంతురాలు. మృగశిర : సుఖసౌఖ్యాదులు, దైవభక్తి కలది, యోగ్యురాలు. ఆర్ద్ర : నీతినియమములు లేనిది, దురదృష్టవంతురాలు. పునర్వసు : స్వగృహమును విడిచిపెట్టునది. పుష్యమి : పతిభక్తి గలది, సంతానం కలది యోగ్యురాలు. ఆశ్రేష : దుష్టసంతానం కలది పతి సౌఖ్యము తక్కువ కలిగినది. మఘ : తండ్రి యింటి వద్ద ఉండునది, భర్తకు కష్టం తెచ్చునది. పుబ్బ : గర్భస్రావం కలది దీనురాలు అనారోగ్యం కలది. ఉత్తర : సంతానం కలది. మంచిసౌఖ్యముగలది. హస్త : మంచిపుత్రికలు కలది. బందువులను ఆదరించునది. చిత్త : పతిభక్తిగలది. లలితకళల యందు ఆశక్తికలది. స్వాతి : పుత్రసంతానంగలది, పతివ్రత, భోగి. విశాఖ : ధనధాన్యములు లది విలాసవమ్తురాలు, భోగి. అనూరాధ : పుత్రసంతానంకలది పవిత్రురాలు. జ్యేష్ఠ : దుష్ఠ ప్రవర్తనకలది. పతినిపోగొట్టుకొనునది. మూల : పుణ్యక్షేత్రసంచారి, ధర్మంచేయుట యదిష్టతకలది. పూర్వాషాడ : వైధ్యవ్యము పొందునది. హంతకురాలు అగును. ఉతరాషాడ : పుణ్యకార్యములు చేయునది. సంపదలు గలది, భోగి శ్రవణం : దీర్ఘాయుర్దాయం కలది. పుత్రసంతానం కలది. ధనిష్ఠ : ధనధాన్యములు స్త్రీ సంతానం కలది. శతబిషం : సుఖ సౌఖ్యములు, ధన వృద్ధి కలది. పూర్వాభాద్ర : మూర్ఖత్వము కలది. అనారోగ్యము గల భర్త కలది. ఉత్తరాభాద్ర : జ్ఞానము కలది. బంధువర్గము కలది. పవిత్రురాలు. రేవతి : ధనవంతురాలు. పుణ్యకార్యములు చేయునది. మంచిజీవనము చేయునది శుభస్వప్నములు
ఇష్టదేవతను చూచుట, పుష్పములు, పండ్లు, పశుపు, కుంకుమ, నిధినిక్షేపములు, మంగళకరమగు వస్తువులను చూచుట, పశుపు పచ్చని వనములు మొదలగునవి. గుఱ్ఱములు, ఏనుగులు లేదా పల్లకి మొదలగు వాహనములు ఎక్కినటులయ, తాను ఏదోఒక భాధకు గురైనట్లు, రక్తము చూచినట్లు వేదము చదువుతున్నట్లు, పరస్త్రీని సంభోగించుచున్నట్లు, పాలు పెరుగు పుచ్చుకున్నట్లు, నూత్యన వస్తు, వస్త్ర భూషణములు ధరించినట్లు కలగాంచుట శుభఫలదాయకము.
సుశకునములు
మనఃశ్శాంతి లేని సమయమున ప్రయాణము చేయ రాదు. బ్రాహ్మణులు. అశ్వములు, గజములు, ఫలములు, అన్నము, క్షీరము, గోవు, తెల్ల ఆవులు, పద్మములు, శుభవస్త్రములు, వేశ్యలు, మృదంగాది వాద్యములు, నెమళ్ళు, పాల పక్షి, బద్ధైక పశువు, మాంసము, శుభకార్యము వినుట, పుష్పములు చెరకు, పూర్ణకలశములు, ఛత్రములు, మృత్తిక, కన్య, రత్నములు, తల గుడ్డలు, తెల్లగుడ్డలు, పుత్రసహిత స్త్రీ, అద్దము, రజకులు, మత్స్యములు, నెయ్యి, సింహాసనము, ద్వజము, మేక, తేనె, అస్త్రములు, గోరోచనము, వేదధ్వని, మంగళగానములు యివి ఎదురుగా వచ్చిన సుశకునములని భావించి వెంటనే ప్రయాణము చేయ వలెను.
సంఖ్యా జ్యోతిష రహస్యముసంఖ్యల ద్వారా ఫలితములు తెలుసుకొనుట :సంఖ్యా జ్యోతిష శాస్త్రములో ఫలితములు తెలుసుకొనుట 2 విధములు1 వారి వారి జన్మ తేదీని బట్టి ఫలితములు చూచుట.2 పుట్టిన తేదీ లేనిచో వారిపేరులోని అక్షరముల సంఖ్యల ప్రకారం చూచుట. జన్మతేది ప్రకారం ఫలితములు :ఉదా :
ఎన్.టి.రామారావు గారి జన్మతేదీని చూద్దాం. 28-5-1923 జననం. యిందు జననతేదీని ఏక సంఖ్యచేయుట ఒకపద్దతి, ఏక సంఖ్య చేయుట ఒకపద్దతి . ఏకసంఖ్యచేయగా 2+8+5+1+9+2+3=30,3+0=3 యిరిత్యా 3. దీని అధిపతి గురుడు అనగా ఉన్నత కీర్తి ప్రతిష్టలకు, లోకపూజ్యత నొందుటకు, ప్రజాకర్షణకు నవగ్రహములలో ఈ గురుడే పరిపూర్ణ శుభగ్రహమని శాస్త్రము.
పేరు బట్టి ఫలితములు :యిది ఎక్కువ ఇంగ్లీషు అక్షరములతోనే చూడబడుతుంది
సంఖ్యలకు గ్రహముల నిర్ణయం :1 రవి 4 రాహువు 7 కేతువు 2 చంద్రుడు 5 బుధుడు 8 శని 3 గురుడు 6 శుక్రుడు 9 కుజఇంగ్లీషు అక్షరములకు అంకెలు :
దీనిని బట్టి ప్రతివారి పేర్లు ఫలితములను, మిగిలిన విషయములో సులభముగా తెలిసికొనవచ్చును. ఏ సంఖ్యకు ఏ గ్రహమో తెలిసికొనవలెను. వాటి కారకత్వమును కూడా తెలిసికొనుట యుక్తము.
1వ సంఖ్య
1 సంఖ్య అధిపతి రవి. ఏమాసములో నైనా 1, 10, 19, 28 తేదీలలో జన్మించినచో జన్మ సంఖ్య 1 అగును. వీరికి ఒకటి అదృష్ట సంఖ్య అగును. ఆది, సోమవారములు అదృష్టదినములు అవి 1, 10, 19, 28 తేది అయినచో విశేష అదృష్ట దినములగును వీరికి 2, 4, 7 సంఖ్యలు తేదీలు అదృష్టదినములు. వీరికి ఏక సంఖ్య 2, 4, 7, మరియు 11, 13, 16, 20, 22, 25, 29, 31 తేదీలు మరియు ఆసంఖ్యలు గలవి అనుకూలములైనవి అగును. వీరు కెంపును ధరించవలెను.
2వ సంఖ్య
ఏమాసంలో నైనను 2,11,20, 29 తేదీలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 2 అగును. అధిపతి చంద్రుడు. వీరికి 1, 4, 7 తేదీలు మరియు రెండు అంకెలు సంఖ్యలు వచ్చు 10, 13, 16, 22, 25, 31 తేదీలు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి. వీరికి ఆది, సోమ, శుక్రవారములు అనుకూలమైనవి. ఆ వారములు 2, 11 20, 29 అయినచో విశేష అదృష్టము. వీరు ముత్యము ధరించవలెను.
3వ సంఖ్య
ఏ మాసములో నైనను 3, 12, 21 30 తేదీలలో జన్మించినచో అదృష్ట సంఖ్య 3 అగును. వీరికి 3,6,9 తేదీలు ఆ సంఖ్యగల వాహనములు, లాటరీ టిక్కట్లు అనుకూల ఫలితాలనిస్తాయి. వీరికి మంగళ, గురు, శుక్రవారములు అనుకూలమైనవి. ఆవారములు 3, 12, 21, 30 తేదీలు అయినచో యింకను విశేష అదృష్ట ప్రదములైనవి. ఆసంఖ్యకు అధిపతి గురుడు. 6, 9, 15, 18, 24, 27 తేదీలు మరియు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి. మీరు కనకపుష్యరాగము ధరించవలెను.
4వ సంఖ్య
ఈ సంఖ్యకు అధిపతి రాహువు. ఏ మాసములోనైనను 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారికి జన్మసంఖ్య అనగా అదృష్ట సంఖ్య 4 అగును వీరికి సోమ, ఆది, శనివారములు అనుకూలము. ఆ వారములు 4, 13, 22, 31 తేది అయినచో యింకను విశేష శుభప్రదములు. వీరికి 1, 2, 7, 10, 11, 16,19, 20, 25, 28, 29 తేదీలు కూడ శుభప్రదములు. విరికి 1,2,7,10,11,16,19,20,25,28,29 తేదిలు కూడా అనుకూలమైనవి. వీరు ఉంగరములో గోమేధికము అను రత్నము ధరించవలెను.
5వ సంఖ్య
ఏ మాసంలోనైనను 5, 14, 23 తేదీలలో జన్మించిన వారి అదృష్ట సంఖ్య 5 అగును. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. వీరికి బుధ, శుక్రవారములు అదృష్టదినములు. ఆది, బుధ, శుక్రవారములు 5, 14, 23 తేదిలు అయినచో ఆ దినములు విశేష అదృష్ట దినములగును వీరు వుంగరములో పచ్చ ధరించుట మంచిది. ఈ అంకెలు గల లాటరీ టిక్కెట్లు బుధ, శుక్రవారములలో కొనుట మంచిది.
6వ సంఖ్య
ఏ మాసములో నైనను 6, 15, 24 తేదీలలో జన్మించిన వారికి అదృష్టసంఖ్య 6 అగును. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. వీరు యితరుల అభిమానమును సులభముగా పొందగలరు. వీరు నలుపురంగు వస్త్రములు ధరించుట మంచిదికాదు. మంగళ, గురు, శుక్రవారములు అయినప్పుడు అట్టి తేదీలు గల దినములు విశేష అదృష్టదినములగును. వీరు వజ్రం ధరించుట మంచిది.
7వ సంఖ్య
ఏ మాసం లోనైనను 7, 16, 25 తేదీలలో జన్మించిన వారికి జన్మ సంఖ్య 7 అగును. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. ఈ సంఖ్య గల వారికి 2వ సంఖ్య గలవారితో సర్వవిషయములందును పొత్తుగాకుదురును. వీరికి ఆదివారము, సోమవారము 7, 16, 25, 29 తేదీలతో కూడి యున్నచో వ్యాపారము చేసి ధనసంపాదన చేయుటలో శక్తి యుక్తుల గలవారుగ యుందురు. మరియు వీరికి 1, 2, 4, 10, 11, 13, 19, 22, 28, 29, 31 తేదీలు సామాన్యముగ ఉండును వీరు ఉంగరములలో వైఢూర్యము ధరించుట మంచిది.
8వ సంఖ్య
ఏ మాసంలో నైనను 8, 17, 26 తేదీలలో జన్మించినవారి అదృష్టసంఖ్య 8 అగును. దీనికి అధిపతి శని అందుచేత ఉంగరములో ఇంద్రనీలం అనే రాయి ధరించుట మంచిది. అదృష్ట దినములు 8, 17, 26 తేదీలు. వీరికి శనివారము, సోమవారము, ఆదివారము కూడ అనుకూలమైనదినములు. వీరు ఏ కార్యమునైననూ 8, 17, 26 తేదీలలో ప్రారంభించుట మంచిది. నూతన వ్యాపారము కూడ యీ తేదీలలో ప్రారంభించుట మంచిది.8, 17, 26 తేదీలు అదృష్ట సంఖ్యలు
9వ సంఖ్య
ఏ మాసంలో నైనను 9, 18, 27 తేదీలలో జన్మించిన వారికి అదృష్టసంఖ్య 9 అగును. దీనికి అధిపతి కుజుడు. వీరు కుజవ్యక్తులు. వీరు తరచుగ సైనికులుగా వ్యవహరిస్తారు. జీవితంలో 30సంవత్సరాల వయస్సు వచ్చేవరకు కష్టములుగయున్నను. తరువాత స్వయంకృషితో ఉన్నతస్థాయికి చేరుకొంటారు. వీరికి మంగళ, గురు, శుక్ర వారములు 3, 6, 12,15, 18, 21, 24, 27, 30, తేదీలు అనుకూలము. వీరు ఉంగరములో పగడము ధరించుట మంచిది. ఏ సంఖ్యనైనను 9 చే గుణించగా వచ్చిన సంఖ్యలు గల అంకెలన్నింటిని కలుపగా మరల తొమ్మిది వచ్చును. 12*9 = 108 మరల యీ మూడు సంఖ్యలు కలిపి ఒక సంఖ్య చేసినచో 9 వచ్చును.
అధిక మాస క్షయమాసములందు విడువతగినవి :
సోమయాగాది కర్మాణి నిత్యాన్యపి మలిమ్లుచే, తదైవాగ్రయణాధాన చాతుర్మాయాది కాన్యపి|| మహాలయాష్టకా శ్రాద్ధోపాకర్మాద్యపికర్మయత్, స్పష్టమాస విశేషాఖ్య విహితం వర్జయేన్మలే || "అగ్న్యాధనం ప్రతిష్ఠాంచ యజ్ఞదాన వ్రతానిచ, వేద వ్రత వృషోత్సర్గ చూడాకర్మణి మేఖలాః|| మాంగల్య మభిషేకంచ మలమాసే వివర్జయేత్, గృహ ప్రవేశ గోదాన స్థానాశ్రమ మహోత్సవం|| వాపీ కూప తడాకాది ప్రతిష్ఠాం యజ్ఞ కర్మచ, న కుర్యాన్మల మాసేతు సంనర్పాహస్పతౌ తధా" || ఈ విధమైన ఆధారములు పరిశీలించగా మూలమాసమందు క్షయమాసము నందును మౌఢ్యకాలమునందువలెనే (పైన చెప్ప బడిన) కార్యములను విడువవలెను.
ఋణ విషయం :
ఋణములు ఇవ్వవలెను అన్నచో స్వాతీ పునర్వసు, విశాఖ, పుష్యమి, శ్రవణం, ధనిష్ఠ, శతబిషం, అశ్వనిల యందు చిత్త, రేవతి, అనూరాధ, మృగశిర, చర, లగ్నములందు లగ్నాత్ కోణ స్థానమందు శుభగ్రహములు ఉండగాను లగ్నాత్ అష్టమ స్థానమందు గ్రహములు లేకుండా చూసి ఋణములు ఈయవలెను. మంగళ, బుధ వారముల యందు సంక్రమణము లందును హస్తా నక్షత్రముతో కూడిన ఆదివారమునందు ఋణములు తీసుకొన్నయెడల ఆరుణము తీసుకొన్నయెడల ఆ ఋణము తీర్చుట కష్టము. వృద్ధినామ యోగము వున్నరోజున అప్పు తీసుకోకూడదు. త్రిపుష్కరము అనగా శని, ఆది, మంగళ వారములలో ఒక రోజు త్రిపాద నక్షత్రము, భద్రతిధిని కలిపి ద్విపుష్కరం అంటారు. ఈ పై రెండు విశేషములలోను ఋణములు పుచ్చుకొనకూడదు. మంగళ వారం ఋణం తీర్చుట విశేషము. దారుణ, ఉగ్ర, సాధారణ, స్థిర నక్షత్రములందు భద్రకరణము నందు, పాతలమందు వృద్ధికోసం యిచ్చే ధనం తిరిగి పొందబడదు.
ఏకవింశతి మహాదోషములు1 పంచాంగశుద్ది 11 సగ్రహ చంద్ర2 సంక్రాంతి దోషం 12 దుర్ముహూర్తం 3 పాపార్గళం 13 ఖర్జూరి చక్రం 4 కునవాంశ 14 గ్రహణభ దోషం 5 కుజాష్టమం 15 ఉత్పాతభం దోషం 6 భృగషట్కం 16 క్రూరయగ్ధిష్ణి 7 కర్తరీ దోషం 17 అశుభ విద్ధ 8 అష్టమ లగ్నం 18 విషఘటిక 9 అష్టమచంద్రుడు 19 లగ్నాస్త దోషం 10 గండాస్త దోషం 20. 6,8,12 స్థిత చంద్ర, 21వ్యతీపాత వైధృతి ఔషధసేవ :
హస్తత్రయే పుష్య పునర్వసౌచ విష్ణుత్రయే చాశ్వినీ పౌషణ భేషు | మిత్రేందు మూలేషుచ సూర్యవారే భైషజ్యముక్తం శుభ వావాసరేపి|| హస్త చిత్త స్వాతి, పుష్యమి, పునర్వసు, శ్రవణ, ధనిష్ఠ, శతభీషం, అశ్వనీ, రేవతి, అనూరాధ, మృగశిర, మూలా నక్షత్ర దినములయందును " శుద్ధేరిః ఫద్యున మృతిగృహే నత్తిధౌనోజనేర్ క్షే" లగ్నాత్ పన్నెండు సప్తమ, అషటమ స్థానములందు గ్రహములు లేకుండగాను ఔషధసేవ ప్రారంభం చేయ వలెను. జన్మనక్షత్రంలో ఔషధసేవ చేయకూడదు.
కొన్ని సాధారణ నియమాలుమౌనం పాటించవలసిన కాలము.ప్రభాతే మైధునేచైవ ప్రసావే దంతధావనేస్నానేన భోజనేకాలే మౌనంషట్స విధేయతే ||
ప్రభాత కాలమునందు, మైదాన కాలంలోను, మల మూత్ర విసర్జన సమయంలోను, దమ్తావఏధాన సమయంలోను, స్నానము చేయునప్పుడు, భోజనం చేయునప్పుడు మౌనంగా వుండాలి.
" కుర్యాన్మాత్ర పురేషేతు రౌత్రౌచే ద్దక్షిణాముఖః దినా ఉదజ్మఖ!"
మూత్రపురీషాదులు రాత్రి సమయంలో దక్షిణ ముఖంగా కూర్చొని పగటికాలంలో ఉత్తరముఖంగా కూర్చొని విసర్జించవలెను. అయితే ఉత్తర, దక్షిణ ముఖములుగా మలమూత్ర విసర్జించవలెనని వాస్తు శాస్త్రం చెబుతుంది.
జన్మ నక్షత్రము లో చేయదగిన కార్యములు
జన్మ నక్షత్రము నిషేకము, యాగము, చౌలకర్మ, అన్నప్రాసన, వ్యవసాయము, ఉపనయనం, రాజ్యపట్టాభిషేకం, భూసంపాదన, అక్షరాభ్యాసం నందు శుభప్రధము. పుంసవనం, సీమంతం, యుద్ధము, గర్భదానం, శ్రౌద్ధము, క్షౌరము, ఔషధ సేవ, ప్రయాణముల అందు అశుభప్రధం. స్త్రీలకు వివాహ విషయమై శ్రేష్ఠము.
దోషం - శాంతి మంత్రంఆరోగ్య సమస్యలు వున్ననూ || పిల్లలకు దృష్టిలోపం వున్ననూ, గర్భిణీలకు గర్భరక్షణ కోసం మానసిక అశాంతి ఎక్కువగా వున్ననూ విభూధి చేతపట్టుకొని 41 సార్లు పారాయణం చేసి విభూధి ముఖమున ధరించిన శాంతి లభించును. శ్రీమద నృశింహ విభవే గరుడ ధ్వజాయ తాపత్రయో శమనామ భవౌషధాయ తృష్నాది వృశ్చికజలగ్ని భజంగరోగ క్లేశ వ్యయాయ హరయే గురవేనమస్తే పిల్లలకు మాటలు రాగానే ఈ శ్లోకం నేర్పి వారి చేత నిత్యం పారాయణం చేయిస్తే, దృష్టి దోషం, నరఘోష, భూత బాధ దగ్గరకు రావు ఆరోగ్యంగా వుంటారు. నవరత్నములు ధరించవలసినవారి నక్షత్రములువైఢూర్యం :అశ్విని, మఘ, మూలపుష్యరాగం : పునర్వసు,విశాఖ,పూర్వాభాద్ర పచ్చ: ఆశ్రేష,రేవతి,జ్యేష్ఠ నీలం: పుష్యమి,ఉత్తరాభాధ్ర,అనూరాధ కెంపు: కృత్తిక,ఉత్తర,ఉత్తరాషాడ వజ్రం: భరణి,పుబ్బ,పూర్వాషాఢ గోమేధికం: ఆర్ద్ర,స్వాతి,శతభిషం పగడం: మృగశిర,చిత్త,ధనిష్ఠ ముత్యం: రోహిణి,శ్రవణం,హస్త నవవస్త్రాభరణధారణ :
విప్రాజ్ఞయందు, ఉత్సవముల యందు ఈ క్రింద చెప్పిన తిధివార నక్షత్ర సంభంధం లేకుండా వస్త్రభూషణం చేయవచ్చును. రేవతి, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, ధనిష్ఠ, పునర్వసు, పుష్యమి యందు రిక్తేతర తిదుల యందు, ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారముల యందును నూతన వస్త్రధారణ మాంచిది. మంగళవారం ఎర్రని వస్త్రములు ధరించుటకు మంచిది. పునర్వసు, పుష్యమి నక్షత్రములందు దృవనక్షత్రములయందును, మంగళవారము నందును సౌభాగ్యవతియగు స్త్రీ నూతన వస్త్రాభరణధారణ చేయకూడదు.
మౌఢ్యమునందు విడువవలసిన కార్యములు
వ్యాపారం, తటాక, కూప, గృహారంభ, గృహప్రవేశములు, వ్రతారంభ, వ్రతోద్యాపన, వధూప్రవేశ, మహాదాన సోమయాగాష్టకా శ్రాద్ధములు సంచయన, ప్రధమో పాకర్మ వేధవ్రతములు, కామ్య వృషోత్సర్గ వివాహాదుల, దేవతా ప్రతిష్ఠలు, దీక్షోపనయన, చూడా కర్మలు, కర్మలు, అపూర్వ దేవతీర్ధ దర్శనము, సన్యాగ్రహణము, అగ్నిస్వీకారము, రాజ దర్శనము, రాజ్యాభిషేకము, యాత్ర, సమావర్తనము, కర్ణవేధనలు చేయకూడదు. అయితే మాస ప్రాధాన్యములైన సీమంతము పుంసవనం, నామకరణం, అన్నప్రాశన వంటివి చేయవచ్చును.
శూన్యమాస విచారణ
మీనములో రవి ఉండగా చైత్ర మాసము, మిధునంలో వుండగా ఆషాడమాసము, కన్యలో రవి ఉండగా భాద్రపద మాసము, ధనుస్సులో ఉండగా పుష్యమాసము శూన్యమాసములు.
సముద్ర స్నానంసముద్రే పర్వసు స్నాయా దయాయాంచ విశేషతః|పాపైర్విముచ్యతే సర్వై రమాయాం స్నానమాచరన్||
సముద్రమందు పూర్ణమ, అమావాస్య మొదలగు పర్వములందే స్నానం చేయవలెను. శుక్ర, మంగళ వారములు నిషేధము. "ఆకామావై పౌర్ణిమ" గా పిలువబడు ఆషాఢపౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణీమలు సముద్రస్నానమునకు విశేషమైనపర్వములు. "అశ్వత్థ సాగరౌసేవ్యౌ సస్పర్శస్తు కదాచన. అశ్వత్థం మందవారేచ సముద్ర పర్వణి స్పృశేత్" అశ్వత్థ వృక్షమును సముద్రమును సర్వదా సేవించవలెను కాని స్పృశించకూడదు. శనివారం అశ్వత్థ వృక్షమును పర్వములందు సముద్రమును స్పృశించ వచ్చును. వ్రతాచరణ నిమిత్తంగా అశ్వత్థ (రావి) వృక్షమును స్పృశింపవచ్చును.
సేవకా సయ్యాది విషయము :
పాదుకలు, ఆసనములు, మంచములు వాడుక విషయంలో దృవ, క్షిప్ర, మృదునక్షత్రములను శ్రవణం, భరణి, పునర్వసు నక్షత్రములయందును, మంచితిధుల యందును వాడకం ప్రారంభించుట మంచిది. క్షిప్ర, దృవ నక్షత్రముల యందును, అనూరాధ పుష్యమి నక్షత్రముల యందును, బుధ, గురు, శుక్ర, ఆదివారముల యందును, సేవాకార్యం నౌకరీ ప్రారంభించవలెను. శుభలగ్నమందును దశమ ఏకాదశస్ఠః ఆనములందును రవి లేక కుజుడు వుండగా ప్రారంభించవలెను.
అధిక మాస క్షయమాసములందు విడువతగినవి :
సోమయాగాది కర్మాణి నిత్యాన్యపి మలిమ్లుచే, తదైవాగ్రయణాధాన చాతుర్మాయాది కాన్యపి|| మహాలయాష్టకా శ్రాద్ధోపాకర్మాద్యపికర్మయత్, స్పష్టమాస విశేషాఖ్య విహితం వర్జయేన్మలే || "అగ్న్యాధనం ప్రతిష్ఠాంచ యజ్ఞదాన వ్రతానిచ, వేద వ్రత వృషోత్సర్గ చూడాకర్మణి మేఖలాః|| మాంగల్య మభిషేకంచ మలమాసే వివర్జయేత్, గృహ ప్రవేశ గోదాన స్థానాశ్రమ మహోత్సవం|| వాపీ కూప తడాకాది ప్రతిష్ఠాం యజ్ఞ కర్మచ, న కుర్యాన్మల మాసేతు సంనర్పాహస్పతౌ తధా" || ఈ విధమైన ఆధారములు పరిశీలించగా మూలమాసమందు క్షయమాసము నందును మౌఢ్యకాలమునందువలెనే (పైన చెప్ప బడిన) కార్యములను విడువవలెను.
ఋణ విషయం :
ఋణములు ఇవ్వవలెను అన్నచో స్వాతీ పునర్వసు, విశాఖ, పుష్యమి, శ్రవణం, ధనిష్ఠ, శతబిషం, అశ్వనిల యందు చిత్త, రేవతి, అనూరాధ, మృగశిర, చర, లగ్నములందు లగ్నాత్ కోణ స్థానమందు శుభగ్రహములు ఉండగాను లగ్నాత్ అష్టమ స్థానమందు గ్రహములు లేకుండా చూసి ఋణములు ఈయవలెను. మంగళ, బుధ వారముల యందు సంక్రమణము లందును హస్తా నక్షత్రముతో కూడిన ఆదివారమునందు ఋణములు తీసుకొన్నయెడల ఆరుణము తీసుకొన్నయెడల ఆ ఋణము తీర్చుట కష్టము. వృద్ధినామ యోగము వున్నరోజున అప్పు తీసుకోకూడదు. త్రిపుష్కరము అనగా శని, ఆది, మంగళ వారములలో ఒక రోజు త్రిపాద నక్షత్రము, భద్రతిధిని కలిపి ద్విపుష్కరం అంటారు. ఈ పై రెండు విశేషములలోను ఋణములు పుచ్చుకొనకూడదు. మంగళ వారం ఋణం తీర్చుట విశేషము. దారుణ, ఉగ్ర, సాధారణ, స్థిర నక్షత్రములందు భద్రకరణము నందు, పాతలమందు వృద్ధికోసం యిచ్చే ధనం తిరిగి పొందబడదు.
ఏకవింశతి మహాదోషములు1 పంచాంగశుద్ది 11 సగ్రహ చంద్ర2 సంక్రాంతి దోషం 12 దుర్ముహూర్తం 3 పాపార్గళం 13 ఖర్జూరి చక్రం 4 కునవాంశ 14 గ్రహణభ దోషం 5 కుజాష్టమం 15 ఉత్పాతభం దోషం 6 భృగషట్కం 16 క్రూరయగ్ధిష్ణి 7 కర్తరీ దోషం 17 అశుభ విద్ధ 8 అష్టమ లగ్నం 18 విషఘటిక 9 అష్టమచంద్రుడు 19 లగ్నాస్త దోషం 10 గండాస్త దోషం 20. 6,8,12 స్థిత చంద్ర, 21వ్యతీపాత వైధృతి ఔషధసేవ :
హస్తత్రయే పుష్య పునర్వసౌచ విష్ణుత్రయే చాశ్వినీ పౌషణ భేషు | మిత్రేందు మూలేషుచ సూర్యవారే భైషజ్యముక్తం శుభ వావాసరేపి|| హస్త చిత్త స్వాతి, పుష్యమి, పునర్వసు, శ్రవణ, ధనిష్ఠ, శతభీషం, అశ్వనీ, రేవతి, అనూరాధ, మృగశిర, మూలా నక్షత్ర దినములయందును " శుద్ధేరిః ఫద్యున మృతిగృహే నత్తిధౌనోజనేర్ క్షే" లగ్నాత్ పన్నెండు సప్తమ, అషటమ స్థానములందు గ్రహములు లేకుండగాను ఔషధసేవ ప్రారంభం చేయ వలెను. జన్మనక్షత్రంలో ఔషధసేవ చేయకూడదు.
కొన్ని సాధారణ నియమాలుమౌనం పాటించవలసిన కాలము.ప్రభాతే మైధునేచైవ ప్రసావే దంతధావనేస్నానేన భోజనేకాలే మౌనంషట్స విధేయతే ||
ప్రభాత కాలమునందు, మైదాన కాలంలోను, మల మూత్ర విసర్జన సమయంలోను, దమ్తావఏధాన సమయంలోను, స్నానము చేయునప్పుడు, భోజనం చేయునప్పుడు మౌనంగా వుండాలి.
" కుర్యాన్మాత్ర పురేషేతు రౌత్రౌచే ద్దక్షిణాముఖః దినా ఉదజ్మఖ!"
మూత్రపురీషాదులు రాత్రి సమయంలో దక్షిణ ముఖంగా కూర్చొని పగటికాలంలో ఉత్తరముఖంగా కూర్చొని విసర్జించవలెను. అయితే ఉత్తర, దక్షిణ ముఖములుగా మలమూత్ర విసర్జించవలెనని వాస్తు శాస్త్రం చెబుతుంది.
జన్మ నక్షత్రము లో చేయదగిన కార్యములు
జన్మ నక్షత్రము నిషేకము, యాగము, చౌలకర్మ, అన్నప్రాసన, వ్యవసాయము, ఉపనయనం, రాజ్యపట్టాభిషేకం, భూసంపాదన, అక్షరాభ్యాసం నందు శుభప్రధము. పుంసవనం, సీమంతం, యుద్ధము, గర్భదానం, శ్రౌద్ధము, క్షౌరము, ఔషధ సేవ, ప్రయాణముల అందు అశుభప్రధం. స్త్రీలకు వివాహ విషయమై శ్రేష్ఠము.
దోషం - శాంతి మంత్రంఆరోగ్య సమస్యలు వున్ననూ || పిల్లలకు దృష్టిలోపం వున్ననూ, గర్భిణీలకు గర్భరక్షణ కోసం మానసిక అశాంతి ఎక్కువగా వున్ననూ విభూధి చేతపట్టుకొని 41 సార్లు పారాయణం చేసి విభూధి ముఖమున ధరించిన శాంతి లభించును. శ్రీమద నృశింహ విభవే గరుడ ధ్వజాయ తాపత్రయో శమనామ భవౌషధాయ తృష్నాది వృశ్చికజలగ్ని భజంగరోగ క్లేశ వ్యయాయ హరయే గురవేనమస్తే పిల్లలకు మాటలు రాగానే ఈ శ్లోకం నేర్పి వారి చేత నిత్యం పారాయణం చేయిస్తే, దృష్టి దోషం, నరఘోష, భూత బాధ దగ్గరకు రావు ఆరోగ్యంగా వుంటారు. నవరత్నములు ధరించవలసినవారి నక్షత్రములువైఢూర్యం :అశ్విని, మఘ, మూలపుష్యరాగం : పునర్వసు,విశాఖ,పూర్వాభాద్ర పచ్చ: ఆశ్రేష,రేవతి,జ్యేష్ఠ నీలం: పుష్యమి,ఉత్తరాభాధ్ర,అనూరాధ కెంపు: కృత్తిక,ఉత్తర,ఉత్తరాషాడ వజ్రం: భరణి,పుబ్బ,పూర్వాషాఢ గోమేధికం: ఆర్ద్ర,స్వాతి,శతభిషం పగడం: మృగశిర,చిత్త,ధనిష్ఠ ముత్యం: రోహిణి,శ్రవణం,హస్త నవవస్త్రాభరణధారణ :
విప్రాజ్ఞయందు, ఉత్సవముల యందు ఈ క్రింద చెప్పిన తిధివార నక్షత్ర సంభంధం లేకుండా వస్త్రభూషణం చేయవచ్చును. రేవతి, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, ధనిష్ఠ, పునర్వసు, పుష్యమి యందు రిక్తేతర తిదుల యందు, ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారముల యందును నూతన వస్త్రధారణ మాంచిది. మంగళవారం ఎర్రని వస్త్రములు ధరించుటకు మంచిది. పునర్వసు, పుష్యమి నక్షత్రములందు దృవనక్షత్రములయందును, మంగళవారము నందును సౌభాగ్యవతియగు స్త్రీ నూతన వస్త్రాభరణధారణ చేయకూడదు.
మౌఢ్యమునందు విడువవలసిన కార్యములు
వ్యాపారం, తటాక, కూప, గృహారంభ, గృహప్రవేశములు, వ్రతారంభ, వ్రతోద్యాపన, వధూప్రవేశ, మహాదాన సోమయాగాష్టకా శ్రాద్ధములు సంచయన, ప్రధమో పాకర్మ వేధవ్రతములు, కామ్య వృషోత్సర్గ వివాహాదుల, దేవతా ప్రతిష్ఠలు, దీక్షోపనయన, చూడా కర్మలు, కర్మలు, అపూర్వ దేవతీర్ధ దర్శనము, సన్యాగ్రహణము, అగ్నిస్వీకారము, రాజ దర్శనము, రాజ్యాభిషేకము, యాత్ర, సమావర్తనము, కర్ణవేధనలు చేయకూడదు. అయితే మాస ప్రాధాన్యములైన సీమంతము పుంసవనం, నామకరణం, అన్నప్రాశన వంటివి చేయవచ్చును.
శూన్యమాస విచారణ
మీనములో రవి ఉండగా చైత్ర మాసము, మిధునంలో వుండగా ఆషాడమాసము, కన్యలో రవి ఉండగా భాద్రపద మాసము, ధనుస్సులో ఉండగా పుష్యమాసము శూన్యమాసములు.
సముద్ర స్నానంసముద్రే పర్వసు స్నాయా దయాయాంచ విశేషతః|పాపైర్విముచ్యతే సర్వై రమాయాం స్నానమాచరన్||
సముద్రమందు పూర్ణమ, అమావాస్య మొదలగు పర్వములందే స్నానం చేయవలెను. శుక్ర, మంగళ వారములు నిషేధము. "ఆకామావై పౌర్ణిమ" గా పిలువబడు ఆషాఢపౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణీమలు సముద్రస్నానమునకు విశేషమైనపర్వములు. "అశ్వత్థ సాగరౌసేవ్యౌ సస్పర్శస్తు కదాచన. అశ్వత్థం మందవారేచ సముద్ర పర్వణి స్పృశేత్" అశ్వత్థ వృక్షమును సముద్రమును సర్వదా సేవించవలెను కాని స్పృశించకూడదు. శనివారం అశ్వత్థ వృక్షమును పర్వములందు సముద్రమును స్పృశించ వచ్చును. వ్రతాచరణ నిమిత్తంగా అశ్వత్థ (రావి) వృక్షమును స్పృశింపవచ్చును.
సేవకా సయ్యాది విషయము :
పాదుకలు, ఆసనములు, మంచములు వాడుక విషయంలో దృవ, క్షిప్ర, మృదునక్షత్రములను శ్రవణం, భరణి, పునర్వసు నక్షత్రములయందును, మంచితిధుల యందును వాడకం ప్రారంభించుట మంచిది. క్షిప్ర, దృవ నక్షత్రముల యందును, అనూరాధ పుష్యమి నక్షత్రముల యందును, బుధ, గురు, శుక్ర, ఆదివారముల యందును, సేవాకార్యం నౌకరీ ప్రారంభించవలెను. శుభలగ్నమందును దశమ ఏకాదశస్ఠః ఆనములందును రవి లేక కుజుడు వుండగా ప్రారంభించవలెను.
కొత్తకాపురం :
ఆడపిల్లలను క్రొత్తగా కాపురమునకు పంపుటకు ఆది, మంగళ, శుక్రవారములు పనికిరావు, ఉగ్రదారుణ నక్షత్రములు దోష భూయిష్ఠము.
నిర్ఘ్య విషయము :
నిషిద్ధ కాలమందు తప్పనిసరి ప్రయాణమైనచో ఆదివారము బంగారమును, సోమవారము- వస్త్రం, మంగళ - ఆయుధం, బుధ-పుస్తకం, గురు- గొడుగు,టోపి, తలపాగాలలో ఒకటి, శుక్ర - చెప్పులు లేదా వాహనం, శని - కంఠమున ధరించువస్తువులను - ప్రయాణ మార్గమందలి ఎవరియింటనైనా నిర్ఘ్యముంచుకొని - అవసరవేళ శుభ శకునమున ప్రయాణమై వెళ్ళవచ్చును.
శుభతారలు :
అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, మూల, శ్రవణం, ధనిష్ఠ, రేవతి, నక్షత్రములు శ్రేష్టము. రోహిణి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాధ్ర, శతభిషం, మధ్యమములు. తక్కిన తారలు నిషిద్దములు మంచి నక్షత్రములందు వార శూలాలూ, ఆనందాది యోగాలు చూచుకొని ప్రయాణించవలెను. ఉభయ పక్షములందలి 2, 3, 5, 7, 10, 11, 13 తిధులు మరియు కృష్ణ 1 మంచిది.
శుభవారములు :
తూర్పునకు మంగళవారము, దక్షిణమునకు సోమ, శని వారములు, పడమరకు బుధ, గురు వారములు, ఉత్తరమునకు ఆది, శుక్ర వారములు మంచివి.
|
శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
పంచాంగ విషయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పంచాంగ విషయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
28, ఫిబ్రవరి 2016, ఆదివారం
జ్యోతిష సంబంధ ముఖ్య విషయములు
11, మే 2015, సోమవారం
గ్రహాలు పరిహారాలు
రవి గ్రహం:-‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది. ఉదయాన సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఉదయకాలపు నడక ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు. సూర్యుని కాంతిని ప్రత్యేక అద్దం ద్వారా అనారోగ్య ప్రదేశంలో ప్రసరింపజేసి ఆనారోగ్యాన్ని నివారించే పద్ధతిని రష్యన్ శాస్తవ్రేత్తలు నిరూపించారు. వేర్వేరు రోగాలకు వేర్వేరు రంగుటద్దాల ద్వారా సూర్యకాంతిని ప్రసరింపజేసి అనారోగ్యాలను నివారింపచేసే కలర్ థెరపీ ప్రసిద్ధి చెందుతోంది. రవికి సంబంధించిన రాగి జావ,క్యారెట్,ధాన్యం, గోధుమలు, గోధుమ పాలు, గోధుమ గడ్డి రసం పలువిధాలైన అనారోగ్యాలను నివారిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు వక్కాణించారు. ఎముకలకు అధిపతి రవి. ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్ శాస్తజ్ఞ్రుల కృషి ఫలితం. కంటి సమస్యలు ఉన్నవారు క్యారెట్ తినటం మంచిది. ఇలా రవి లక్షణాలు గల పదార్ధలు రవి ప్రభావం వలన జనించిన రోగాలన్నీ నయం చేస్తున్నాయి.
చంద్రుడు:-కాల్షియంకు ముత్యపు చిప్పలకు, ముత్యాలకు, మంచి గంధానికి, లవణానికి అధిపతి చంద్రుడు. మనస్సు కు చంద్రుడధి దేవత. రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. శరీరంలోని కాల్షి యం లోపించినపుడు ముత్యపు భస్మం ముం దుగా తీసుకోవాలంటుంది ఆయుర్వేదం. పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది. ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉం ది. ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్) ముం దుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తోం ది. మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇ స్తుంది. వెన్నెల ఆ లక్షణం కలదే. ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని జ్యోతిశ్వాస్త్ర సాంప్రదాయం.
కుజుడు:-ఎర్ర రక్త కణాలకు, రక్త చందనానికి, ఎముకలలోని మజ్జ కు, తుప్పుగల ఇనుముకు, వ్రణాలకు, దెబ్బ సెప్టిక్ అవ్వడానికి, బెల్లంలోని ఐరన్‌కు అధిపతి కుజుడే.కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద తుపపుపై సూర్యకాంతి పడటమే. శరీరంలో ఐరన్ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్ అవుతుంది. బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుం ది. ఎములలో ని మజ్జలో పగడం కలిసిపోతుందని ఫ్రాన్స్ వైజ్ఞానికుల అభిప్రాయం. పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. అతనికి ధాన్యమైన కందిపప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే.
బుదుడు:-బుధుడు నరాలకు సంబం ధించిన గ్రహం. అతని రాశులు మిథున, కన్యలు. ధాన్యం పెసలు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. బుధుడు వ్యాపారస్థుడు. అతని రంగు ఆకుపచ్చ. ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రా యం. పెసల రంగూ ఆకుపచ్చేనని, అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం. బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. అది లోపించడం బుద్ధి మాంద్యం. పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.
గురుడు:- గురుడు పసుపుకు, పంచదారకు, షుగర్ వ్యాధికి, శనగలకు సంబంధించిన గ్రహం. పంచదారను జీర్ణించుకుంటే షుగర్ వ్యాధి రాదు. అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్పడే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి. గురుడు మేధావి. మేధావులు ఆలోచనలు చేస్తారు. వ్యాయామం చేయరు. ఆ రెండు లక్షణాలే షుగర్ వ్యాధిని పుట్టిస్తాయి. పసుపు షుగర్ వ్యాధి తగ్గిస్తుందని, వ్యాయామం షుగర్ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది. చంద్రుడిచ్చే జబ్బులకు శనిచ్చే వాతానికి పసుపు మంచి మందు. టి.బి.కి కూడా చంద్రుడే అధిపతి. దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది.
శుక్రుడు:-శుక్రుడు సౌందర్యానికీ, నిమ్మపండుకు, తేనెకు, చింతపండుకు, చర్మానికి అధిపతి. సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. అది పుష్పాల నుండే వస్తుంది. పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు.
శని- వాత లక్షణం కలవాడు. చర్మం లోని మాలిన్యాలను వెలువరించే శక్తికి ఇతడు అధిపతి. నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతే. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. వాతం అంటే వాయు దోషమే కదా! మాలిన్యాలను వెలువరించే లక్షణం, ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది. నువ్వుల నూనె శరీరానికి పట్టించి అభ్యంగనం చేస్తే రోమకూపాలు శక్తివంతమై చర్మంలోని మాలిన్యాలను తొలగిస్తాయి.
ఇలా గ్రహాలకు చెందిన లేదా పొంత ఉన్న వస్తువులు గ్రహాల వల్ల కలిగే అనారోగ్యాలను తొలగిస్తున్నాయి. విశేషించి ఆయా గ్రహాలు ఉచ్ఛ స్వక్షేత్రాదులలో బలంగా ఉన్నప్పుడు ఆయా పంటలు ఎక్కువగా పండి దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి.వంశపారంపర్యంగా రోగాలుండేవి ఏడు తరాలు. శరీరంలోని కణాలన్నీ మారడానికి పట్టే కాలం ఏడు సంవత్సరాలే.
Like FB page : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM,
#Jyothishyam #astrologypredictions #teluguastrology #astrologyintelugu #onlineteluguastrology #onlinejyothishamtelugu #telugujyothisham #onlineteluguastrology #rasiphalalu2015 #telugurasiphalalu #Parakrijayarasiphalalu #panchangamtelugu #panchangam2015-16 #yearlypredictions #horoscopeprediction #TeluguPanchangam2015 #UgadiPanchangam2015-16 #Manmadhanamasamvatsararasiphalalu #Jyothishyam #VaaraPhalalu #telugujatakam #Jatakamintelugu #telugujathakam #teluguhoroscope #horoscopetelugu #నక్షత్రం #జ్యోతిష #జాతకం #మేషరాశి #వృషభరాశి #మిథునరాశి #కర్కాటకరాశి #సింహరాశి #కన్యరాశి #తులారాశి #వృశ్చికరాశి #ధనస్సురాశి #మకరరాశి #కుంభరాశి #మీనరాశి #రవి గ్రహం #చంద్రుడు #బుదుడు #గురుడు #కుజుడు #శుక్రుడు #శని #రాశులు #శ్రీమేధాదక్షిణమూర్తిజ్యోతిషనిలయం #SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM
8, మే 2015, శుక్రవారం
18, మార్చి 2014, మంగళవారం
కాల సర్ప దోషం/ యోగం
జాతకుని జన్మ కుండలి లో రాహు కేతువుల మద్య మిగిలిన అన్ని గ్రహాలు వచ్చిన చొ దానిని కాల సర్ప యోగం అని అంటారు. దీనిలో చాల రకాలు వున్నాయి. వాటి వాటి స్తితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయం చెయ్యటం జరుగుతుంది దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే ఫలితం కూడా నిర్ణయం చెయ్య బడుతుంది.
కాలసర్ప దోషం: రాహువు-రవి ,చంద్ర ,కుజ ,బుధ ,గురు ,శుక్ర, శని- కేతువు.
Parakrijaya |
ఫలితాలు: కుటుంభ సమస్యలు, దీర్గ రోగాలు.
అపసవ్య కాలసర్ప దోషం: కేతువు - రాహువు మద్య మిగలిన ఏడు గ్రహాలూ రావటం.
గుళిక కాల సర్ప దోషం: మాములుగా ఇది జాతక చక్రం లో మొదటి ఇంట ప్రారంభం అయ్యి తొమ్మిదొవ ఇంట సంమప్తం అవుతుంది.
ఫలితాలు:ఆర్ధిక మరియు కుటుంభ ఇబ్బందులు.
వాసుకి కాల సర్ప దోషం: రెండోవ ఇంట మొదలయి పడవ ఇంట సమాప్తం.
ఫలితాలు:అన్నదమ్ముల కలహాలు, సమస్యలు.
సంకాపాల కాలసర్ప దోషం: మూడోవ ఇంట మొదలయి ప్దకొందవైంట సమాప్తం.
ఫలితాలు:తల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గన్డం, నివాస స్తల సమస్యలు.
పద్మ కాలసర్ప దోషం: నాలుగోవ ఇంట ప్రారంభమయి పన్నెండోవ ఇంట సంమాప్త.
ఫలితాలు: జీవిత భాగస్వామి తో కాని పిల్లలతో కాని సమస్యలు.
మహా పద్మ కాలసర్ప దోషం: అయిదోవ ఇంట ప్రారంభం అయ్యి ఒకటవ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆరోగ్య సమస్య, అప్పుల బాధ, శత్రు బాధ.
తక్షక కాలసర్ప దోషం: ఆరవ ఇంట ప్రారంభం రెండోవ ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార నష్టాలు, వివాహ జీవతం లో ఇబ్బందులు.
కర్కోటక కాలసర్ప దోషం: యేడవ ఇంట ప్రారంభం మూడో వ ఇంట సమాప్తం.
ఫలితాలు: బార్య తో ఇబ్బందులు , అనుకోని సంఘటనలు.
శంఖచూడ కాలసర్ప దోషం: ఎనిమిదొవ ఇంట ప్రారంభం నాలుగో వ ఇంట సమాప్తం.
ఫలితాలు: తండ్రి వాళ్ళ ఇబ్బందులు, అత్యంత దురదృష్ట స్తితి.
ఘటక కాలసర్ప దోషం: తొమ్మిదొవ ఇంట ప్రారంభం అయిదోవ వ ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార మరియు ఉద్యోగ సమస్యలు.
విషాధార కాలసర్ప దోషం: పదవ ఇంట ప్రారంభం ఆరోవ వ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆర్ధిక మరియు వ్యాపార కష్టాలు.
శేషనాగ కాలసర్ప దోషం: పదకొండవ ఇంట ప్రారంభం యేడవ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు.
అపసవ్య కాలసర్ప దోషం: పన్నెండవ ఇంట ప్రారంభం ఎనిమిదొవ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆలస్య వివాహం.
దోష పరిహారం :
కాళహస్తి లో కాని వేరే ఇతర రాహు కేతువులకు ప్రాముఖ్యం వున్నా ప్రదేశాలలో కాల సర్ప దోష నివారణ పూజ లు చేయున్చికుంటే ఉపసమనం కలుగుతుంది
15, మార్చి 2014, శనివారం
లగ్నాలకు యోగ,శుభ,పాప గ్రహాలు.......
మనం పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, గ్రహ స్థితిని బట్టి మనం ఏ లగ్నంలో పుట్టా మో తెలుస్తుంది. పన్నెండు రాశుల వలెనే పన్నెండు లగ్నాలు ఉన్నా యి. లగ్నాలకు యోగకారక గ్రహాలు,ఆధిపత్యం వల్ల శుభ పాప గ్రహాలు.
1. మేషం:ఈ జాతకునకు శని, బుధ, శుక్రులు పాపులు, రవి, గురులు శుభులు. శని, గురు సంబంధం కలిసిన గురుడు శుభు డు కానేరడు. అట్లే శని కూడా శుభుడు కాడు. శని మారక గ్రహం.
2. వృషభం:ఈ జాతకునకు గురు, శుక్ర, చంద్రులు పాపులు అవుతారు. రవి, శనులు శుభులు. శని రాజయోగకారకుడు. గురునకు మారక లక్షణాలున్నాయి.
3. మిథునము:ఈ జాతకునకు కుజ, గురువులు పాపులు. శుక్రుడు శుభుడు. శని, గురులు చేరినచో ఫలితమునివ్వరు.
4. కర్కాటకము:ఈ జాతకునకు శుక్ర, శని, బుధ, కు, గురు లు పాపులు. కుజుడు రాజయోగకారకుడు, గురు, కుజులు రాజయోగాన్ని ఇస్తారు. శుక్రుడు మారకాన్ని కలిగిస్తాడు.
5. సింహం:ఈ జాతకునికి శని, బుధ , శుక్రులు పాపులు. అంగారకుడు రాజయోగాన్నిస్తాడు. గురు, శుక్రులు కూడిన ఫలితమివ్వరు. కుజ, గురులు కూడిన శుభయోగమిస్తా రు. ఈ జాతకునకు బుధు డు మారకమునిచ్చును.
6. కన్య:ఈ జాతకునకు గురు, రవి, కుజులు పాపులు, శని, బుధులు శుభులు. శని రాజయోగమునిస్తాడు. చంద్ర, బుధులు కూడా యోగాన్నిస్తారు. గురుడు మారకమునకు కారకుడు.
7. తుల:ఈ జాతకునకు గురు, రవి, కుజులు పాపులు. శని, బుధులు శుభులు. శని రాజయోగాన్నిస్తాడు. చంద్ర బుధులు కూడా రాజయోగాన్నిస్తారు. గురుడు మారకాన్నిస్తాడు.
8. వృశ్చికము:ఈ జాతకునకు బుధ, శుక్ర, శనిలు పాపులు. గురుడు శుభుడు. రవి, చంద్రులు శుభయోగాన్నిస్తారు. బుధుడు ఈ జాతకానికి మారకగ్రహం.
9. ధనస్సు:-ఈ జాతకులకు రవి, కుజులు శుభులు, శుక్రుడు పాపి, రవి, బుధులు రాజయోగకారకులు, శుక్రుడు మారకం చేయును.
10:మకరం:ఈ జాతకులకు కుజ-గురు-చం ద్రులు పాపులు. శుక్ర, బుధులు శుభులు. శు క్రుడు రాజయోగకారకుడు. శుక్రుడు, శని, బుధులతో కూడిన విశేష ఫలాన్ని ఇస్తాడు. ర వి మారకుడు కాదు. కుజుడు మారక గ్రహం.
11. కుంభం:ఈ జాతకునకు కుజ- గురు- చంద్రులు పాపులు. శుక్రుడు శుభుడు. కుజుడు రాజయోగకారకుడు, మారకుడును కూడా అవుతాడు.
12. మీనం:ఈ జాతకునకు రవి, శుక్రులు పాపులు. కుజ-చంద్రులు శుభులు. కుజ, గురులు రాజయోగాన్నిస్తారు. శని మారకగ్రహం.ఈ లగ్న ఫలితాలు, గ్రహములు శుభములైన శుభ ఫలితాన్ని, పాపులు పాప ఫలితాన్ని ఇస్తారు.
19, డిసెంబర్ 2013, గురువారం
పంచాంగం - డిసెంబర్ 19, 2013, గురువారం
సంవత్సరము : విజయ
మాసము : మార్గశిరము, పక్షము : కృష్ణపక్షం, వారం : గురువారం
తిథి : విదియ 7:47 pm
నక్షత్రము : పునర్వసు Full Night
యోగము : బ్రహ్మ 11:06 pm
కరణము : గరజ 7:49 pm, వనిజ Full Night
సూర్యరాశి : ధనుస్సు, చంద్రరాశి : మిథునము
సూర్యోదయము : 6:40 am, సూర్యాస్తమయము : 5:42 pm, చంద్రోదయం : 7:28 pm
రాహుకాలము : 1:39 pm-3:01 pm
వర్జ్యం : 5:33 pm-7:16 pm
17, డిసెంబర్ 2013, మంగళవారం
after the general elections Telangana is inevitable - PV Radhakrishna
V Kamalakara Rao, TNN | Sep 15, 2013, 04.34 AM IST
refer Times of India 15-09-2013 Visakhapatnam edition.
VISAKHAPATNAM: Even as the people of Seemandhra rally to keep the state united, the stars may have something else in store. If astrologers are to be believed, bifurcation of Andhra Pradesh is inevitable and Telangana will become the 29th state of the country in 2014.
According to Ravviji, the alignment of the stars was not right when Andhra Pradesh was carved out of Madras Presidency. "It was Navami by tithi and Krishna Paksha on October 1, 1953, which was an inauspicious period. Because of this, Andhra Pradesh is presently passing through Kuja Mahadasa, which causes protests, fights between groups, differences among people's ideologies etc," he explains.
Agreeing with Ravvji, PV Radhakrishna of Sri Medha Dakshina Murthy Jyothisha Nilayam at Visakhapatnam district said that Telangana state would be formed after the general elections in 2014 and the current protests or differences among the people of the state would continue till the completion of general elections, but because of the shadow of 'Maalika Yogam' on the state.
Maalika Yogam is formed when all the planets are placed in seven Raasis. "Maalika Yogam has a good or bad effect, depending on the birth timing of a person or an entity, in this case the state of Andhra Pradesh.
P.V.RADHAKRISHNA,
CELL : +91 9966680542, +91 9966455872, +917659931592
Email : parakrijaya@gmail.com
refer Times of India 15-09-2013 Visakhapatnam edition.
VISAKHAPATNAM: Even as the people of Seemandhra rally to keep the state united, the stars may have something else in store. If astrologers are to be believed, bifurcation of Andhra Pradesh is inevitable and Telangana will become the 29th state of the country in 2014.
According to Ravviji, the alignment of the stars was not right when Andhra Pradesh was carved out of Madras Presidency. "It was Navami by tithi and Krishna Paksha on October 1, 1953, which was an inauspicious period. Because of this, Andhra Pradesh is presently passing through Kuja Mahadasa, which causes protests, fights between groups, differences among people's ideologies etc," he explains.
Agreeing with Ravvji, PV Radhakrishna of Sri Medha Dakshina Murthy Jyothisha Nilayam at Visakhapatnam district said that Telangana state would be formed after the general elections in 2014 and the current protests or differences among the people of the state would continue till the completion of general elections, but because of the shadow of 'Maalika Yogam' on the state.
Maalika Yogam is formed when all the planets are placed in seven Raasis. "Maalika Yogam has a good or bad effect, depending on the birth timing of a person or an entity, in this case the state of Andhra Pradesh.
like my fb page :https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM?ref=hl
P.V.RADHAKRISHNA,
CELL : +91 9966680542, +91 9966455872, +917659931592
Email : parakrijaya@gmail.com
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)