శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
16, మే 2012, బుధవారం
కాలసర్ప దోష యంత్రము
కాలసర్ప దోష యంత్రము
|
-: మంత్రము :-
మంత్ర పూర్వం పసుపతి: పాతు | దక్షిణేతు శంకరః | పశ్చిమే పాతు విశ్వేశో | నీలకంఠ స్తదుత్తరే |
ఈశాన్యాం పాతు మీశ్వర: | ఆగ్నేయాం పార్వతీ పతిః | నైరుత్యాం పాతుమే రుద్రః| వాయువ్యాం నీలలోహితః | ఊర్ధ్వే త్రిలోచనః పాతు అధరాయాం మహేశ్వరః| ఏతాభ్యోదిశ దిగ్భ్యస్తు సర్వతఃపాతు శంకరః | |
కాలసర్ప దోష యంత్రమునునలభై రోజుల పాటు 1,24,000 సార్లు జపం చేసిన దోష నివృత్తి అగును. జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య గ్రహములుండుటను కాలసర్ప దోషముగా భావింతురు. అట్లే ఇది అశుభ యోగమైనప్పటికీ సుమారు పన్నెండు యోగములుగా విభజించి చెప్పుచున్నారు. అవి
1. అనంత కాల సర్ప యోగము
2. కులిక లేక గుళిక కాల సర్ప యోగము
3.వాసుకి కాల సర్ప యోగం
4.శంఖ పాల కాల సర్ప యోగం
5.పద్మ కాల సర్ప యోగం
6.మహా పద్మ కాల సర్ప యోగం
7.తక్షక లేక షట్ కాల సర్పయోగం
8.కర్కోటక కాల సర్ప యోగం
9.శంఖచూడ లేఖ శంఖనంద లేక షన్ చాచూడ్ కాల సర్ప యోగం
10.ఘటక లేక పాతక కాల సర్ప యోగము
11.విషక్త లేక విషదావ కాల సర్పయోగం
12. శేష నాగ కాల సర్ప యోగము
కాల సర్ప దోషమనునది వ్యక్తీ గతం కాదనీ , సామూహిక విలక్షనాంశమని రాహు,కేతువులు ఇతర గ్రహములతో కూడి యుండుటను యోగమని కొందరి అభిమతము , ఏది ఏమైనా అశుభ యోగమని భావించుటను బట్టి మరియు అన్ని గ్రహములు రాహు కేతువుల మధ్య యుండుటను నిష్ప్రయోజనాంశముగా నెంచి కాల సర్ప దోష శాంతి విధానములనుసరించుటయే శ్రేయస్కరం.
కావున పై యంత్రమును ప్రాణ ప్రతిష్ఠ చేసి నాగుల చవితి , సుబ్రమణ్య షష్టి , మాస శివరాత్రి పర్వదినములందు ౧౦౮ సార్లు మంత్ర జపము చేయుట మంచిది. అట్లే మహా శివ రాత్రి నాడు ఈ జపమును ౧౦౦౮ సార్లు చేసిన తప్పక దోష నివృత్తి యగును.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)