శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com
దసరా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దసరా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, అక్టోబర్ 2023, బుధవారం

దసరా 2023

శరన్నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు.. అలంకరణలు.. విశిష్టతలు...!!!
దేవీ నవరాత్రుల్లో ప్రజలు భక్తి నిష్టలతో అమ్మవారిని పూజిస్తారు. 9 రోజలు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 న ప్రారంభమై అక్టోబర్ 24 ముగుస్తున్నాయి...!

👉 *శ్రీ బాల త్రిపుర‌సుందరీ‌ దేవి (15-10-2023) : ఈరోజు అమ్మవారి లేత గులాబీ రంగు లేదా పసుపురంగు చీర కడతారు. అమ్మవారికి ఎరుపు రంగు మందార పూవులతో పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారికి పులిహోర, పరమాన్నం నైవేద్యం పెడతారు. ఈరోజు రవికుల గుడ్డ దానం చేస్తే పుణ్యం కలుగుతుంది. సద్బుద్ధి కార్యసిద్ధి లభిస్తుంది. ఈరోజు పదేళ్ల లోపు వయసున్న బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజించి బట్టలు పెడతారు...!*

👉 *శ్రీ గాయత్రీ దేవి (16-10-2023) : అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ దేవి అమ్మవారు. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. గాయత్రీ మంత్రం జపిస్తే చతుర్వేదాలు చదివిన ఫలితం కలుగుతుందట. అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరలో దర్శనం ఇస్తారు. తామర పూవులతో అమ్మవారిని పూజించాలి. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ఎర్రటి గాజులు దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి తేజస్సు పెంపొందుతుంది...!*

👉 *శ్రీ అన్నపూర్ణా దేవి (17-10-2023) : సకల జీవులకు అన్నం ఆధారం. కాశీ విశ్వేశ్వరుడి ప్రియ పత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతోంది. అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటుండదు. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ఆకలిదప్పులు వంటి బాధలు ఉండవని చెబుతారు. అన్నపూర్ణా దేవి ఈరోజు గంధం రంగు చీరలో దర్శనం ఇస్తారు. తెల్లని పుష్పాలతో పూజిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్ధోజనం నైవేద్యం పెడతారు. ఈరోజు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి...!*

👉 *శ్రీ మహాలక్ష్మి దేవి (18-10-2023) : మహాలక్ష్మీ దేవిని పూజిస్తే ధన ధాన్యాలకు లోటుండదు. విద్యా, సంతానం వరాలుగా పొందుతారు. ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో దర్శనం ఇస్తారు. అమ్మవారికి తెల్ల కలువలతో పూజ చేస్తే మంచిది. క్షీరాన్నం, పూర్ణం బూరెలు నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు దక్షిణ దానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది...!*

👉 *శ్రీ మహా చండీ దేవి (19-10-2023) : మహా చండీ దేవి ఉగ్రరూపంలో దర్శనం ఇస్తుంది. ఈరోజు అమ్మవారిని ఎరుపురంగు చీరలో అలంకరిస్తారు. అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టాలి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ధైర్యం, విజయం సిద్ధిస్తుంది...!*

👉 *శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం – 20-10-2023): ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. గులాబీలు, తెల్ల చామంతులతో అమ్మవారిని పూజిస్తే మంచిది. అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగలి నైవేద్యం పెడతారు. 9 రోజులు పూజ చేయడానికి వీలు లేని వారు ఈరోజు పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈరోజు పుస్తకాలు దానం చేస్తే విద్యా ప్రాప్తి కలుగుతుంది...!*

👉 *శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి (21-10-2023) : ఈరోజు అమ్మవారు బంగారు రంగుచీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి కలువ పూలతో పూజ చేస్తే మంచిది. అమ్మవారికి నైవేద్యంగా దద్ధోజనం, పరమాన్నం పెట్టాలి. సహస్రనామ పుస్తకాలు ఈరోజు దానం చేస్తారు. ఈ రోజు అమ్మవారిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 9 రోజులు అమ్మవారిని పూజ చేయడం వీలు పడని వారు మొదటి మూడు రోజులు లేదా తరువాత మూడు రోజులు లేదా చివరి మూడురోజులు పూజిస్తారు...!*

👉 *శ్రీ దుర్గాదేవి అలంకారం (22-10-2023) : ఈరోజు అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి మందారాలు, గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తారు. కదంబం, శాఖ అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఎరుపురంగు చీరలు దానం చేస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారు శత్రువులపై విజయం సాధిస్తారు...!*

👉 *శ్రీ మహిషాసురమర్దనీ దేవి మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి (23-10-23) : దేవీ నవరాత్రులు చివరి రోజున రెండు అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషాసురమర్దనీ దేవిగా కనిపిస్తారు. నవమి తిథి ఉదయం వరకు మాత్రమే ఉండటం.. మధ్యాహ్నం దశమి తిథి ప్రారంభమవుతుండటంతో ఈరోజు రెండు అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఈరోజు అమ్మవారు ఎరుపురంగు చీరలో దర్శనం ఇస్తారు. పాయసం, చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలి. పూల మాలలు దానం చేస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి అఖండ కీర్తి, సౌభాగ్యం కలుగుతుంది. దశమి రోజు ఆయుధ పూజ చేసేవారు అక్టోబరు 24 మంగళవారం సూర్యోదయానికి దశమి తిథి ఉండడంతో ఆ రోజు చేస్తారు...!!!*

For astrology related services :

https://t.me/telugujyotishanilayam
Telegram Astrology group జ్యోతిష విషయాలు 

Facebook page 
https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM/

https://www.facebook.com/teluguastrology

Contact : 9966455872 
P.V.Radhakrishna or jayamaheswari
parakrijaya@gmail.com

Or
Follow the TeluguAstrology channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12

Our site :
http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.com

@telugujyotishanilayam

 🥥🎋🌻🪔🌻🌾🪙

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...