శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Social Media Buttons

Follow by Email

Friday, September 14, 2012

గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలము - రవి

 సూర్య:-

రవి లగ్నమందున్న ఫలము :

రవి లగ్నగతుడయిన అట్టి జాతకుడు అల్పకేశయుతుడు, చిరుపలుకులకే అలసత్వము నొందినవాడు, క్రోధి - ప్రచండస్వభావి - పొడగరి - గర్వి - అల్పదృష్టికలవాడు - ఉద్రేకి - కౄరహృధయుడు - నిర్గుణుడు అగును. అది కర్ణాటక లగ్నమయి అందు రవియున్న కనులయందు పూవులు కలవాడు, మేషము లగ్నమయి అందు రవియున్న నేత్రవ్యాధి పీడితుడు; రవి సింహమందుండి సింహలగ్నమయిన రేచీకటి కలవాడు; తులాలగ్నమయి అందు రవియున్న దారిద్ర్యపీడితుడూ, సంతాననష్టము పొందువాడూ అగును.

రవి ద్వితీయ, తృతీయ, చతుర్థములలో యున్న ఫలములు :

రవి ద్వితీయమునయున్న విద్యాహీనుడు, వినయములేనివాడు, నిర్ధనుడు, దుర్వచనప్రియుడు అగును. రవి తృతీయమునయున్న బలవంతుడు, ధైర్యవంతుడు, ధనవంతుడు, ఉదారుడూ అగును. కానీ, ఆప్తులయందు ద్వేషస్వభావియగును. రవి చతుర్థమునయున్న అట్టిజాతకుడు సుఖహీనుడు, బంధువులు లేనివాడు, క్షేత్రహీనుడు, స్నేహహీనుడు, గృహములేనివాడు అగును. ప్రభుత్వ ఉద్యోగి అగును. పిత్రార్జితమంతయా ఖర్చు పెట్టును.

రవి పంచమ, షష్ట, సప్తమ, అష్టమలయందున్న ఫలము :

రవి పంచమముయందున్న సుఖ, పుత్రహీనుడు, మరియూ అల్పాయుష్మంతుడు, జ్ఞాని, అరణ్యప్రదేశములయందు తిరుగువాడు అగును. రవి ఆరవయింటనున్న జాతకుడు రాజు, ఖ్యాతివంతుడు, ధనవంతుడు, విజయవంతుడు అగును. రవి యెనిమిదవ భావమున యున్న జాతకుడు తన ఆస్తిని పోగొట్టుకొనును. మిత్రనష్టము, అల్పాయుష్మంతుడు దృష్టిలోపము కలవాడగునో - అంధుడగునో యుండును.

రవి భాగ్య, రాజ్య, లాభ, వ్యయ క్షేత్రముల యందున్న ఫలము :

భాగ్యమున రవియున్న తండ్రిలేనివాడు, బంధుమిత్రపుత్రవంతుడు, దేవబ్రాహ్మణ భక్తి కలవాడూ అగును. రాజ్యకేంద్రమున రవియున్న జాతకుడు పుత్రవంతుడు, వాహనయుతుడు, కీర్తియశస్సు, భాగ్యమూకలవాడు, రాజూ అగును. రవి లాభస్థానమునయున్న జాతకుడు బహుధనవంతుడు, చిరంజీవి యగును. రాజు అగును. మరియూ విగశోకవంతుడు అగును. ద్వాదశమున రవియున్న పితృద్వేషి దోషదృష్టి కలవాడు, నిర్ధనుడు, అపుత్రవంతుడు అగును.


Related Posts Plugin for WordPress, Blogger...