శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

18, సెప్టెంబర్ 2013, బుధవారం

సంఖ్యా జ్యోతిష రహస్యము



సంఖ్యల ద్వారా ఫలితములు తెలుసుకొనుట :

సంఖ్యా జ్యోతిష శాస్త్రములో ఫలితములు తెలుసుకొనుట 2 విధములు

1 వారి వారి జన్మ తేదీని బట్టి ఫలితములు చూచుట.
2 పుట్టిన తేదీ లేనిచో వారిపేరులోని అక్షరముల సంఖ్యల ప్రకారం చూచుట.

జన్మతేది ప్రకారం ఫలితములు :

ఉదా :

ఎన్.టి.రామారావు గారి జన్మతేదీని చూద్దాం. 28-5-1923 జననం. యిందు జననతేదీని ఏక సంఖ్యచేయుట ఒకపద్దతి, ఏక సంఖ్య చేయుట ఒకపద్దతి . ఏకసంఖ్యచేయగా 2+8+5+1+9+2+3=30,3+0=3 యిరిత్యా 3. దీని అధిపతి గురుడు అనగా ఉన్నత కీర్తి ప్రతిష్టలకు, లోకపూజ్యత నొందుటకు, ప్రజాకర్షణకు నవగ్రహములలో ఈ గురుడే పరిపూర్ణ శుభగ్రహమని శాస్త్రము.

పేరు బట్టి ఫలితములు :

యిది ఎక్కువ ఇంగ్లీషు అక్షరములతోనే చూడబడుతుంది
T A R A K A R A M A R A O
4 1 2 1 1 1 2 1 3 1 2 1 7
4+1+2+1+1+1+2+1+3+1+2+1+7=27,2+7=9 అనగా కుజుడు 9కి అధిపతి కుజుడు. నవగ్రహములలో కుజుని శక్తి అమోఘము. పట్టుదలకు మారుపేరు కుజుడు. తానుఅనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలిగి యుండును.

సంఖ్యలకు గ్రహముల నిర్ణయం :

1 రవి 4 రాహువు 7 కేతువు 2 చంద్రుడు 5 బుధుడు 8 శని 3 గురుడు 6 శుక్రుడు 9 కుజ

ఇంగ్లీషు అక్షరములకు అంకెలు :

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
12345678912345678912345678


దీనిని బట్టి ప్రతివారి పేర్లు ఫలితములను, మిగిలిన విషయములో సులభముగా తెలిసికొనవచ్చును. ఏ సంఖ్యకు ఏ గ్రహమో తెలిసికొనవలెను. వాటి కారకత్వమును కూడా తెలిసికొనుట యుక్తము.

1వ సంఖ్య వారు

1 సంఖ్య అధిపతి రవి. ఏమాసములో నైనా 1, 10, 19, 28 తేదీలలో జన్మించినచో జన్మ సంఖ్య 1 అగును. వీరికి ఒకటి అదృష్ట సంఖ్య అగును. ఆది, సోమవారములు అదృష్టదినములు అవి 1, 10, 19, 28 తేది అయినచో విశేష అదృష్ట దినములగును వీరికి 2, 4, 7 సంఖ్యలు తేదీలు అదృష్టదినములు. వీరికి ఏక సంఖ్య 2, 4, 7, మరియు 11, 13, 16, 20, 22, 25, 29, 31 తేదీలు మరియు ఆసంఖ్యలు గలవి అనుకూలములైనవి అగును. వీరు కెంపును ధరించవలెను.

2వ సంఖ్య వారు

ఏమాసంలో నైనను 2,11,20, 29 తేదీలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 2 అగును. అధిపతి చంద్రుడు. వీరికి 1, 4, 7 తేదీలు మరియు రెండు అంకెలు సంఖ్యలు వచ్చు 10, 13, 16, 22, 25, 31 తేదీలు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి. వీరికి ఆది, సోమ, శుక్రవారములు అనుకూలమైనవి. ఆ వారములు 2, 11 20, 29 అయినచో విశేష అదృష్టము. వీరు ముత్యము ధరించవలెను.

3వ సంఖ్య వారు

ఏ మాసములో నైనను 3, 12, 21 30 తేదీలలో జన్మించినచో అదృష్ట సంఖ్య 3 అగును. వీరికి 3,6,9 తేదీలు ఆ సంఖ్యగల వాహనములు, లాటరీ టిక్కట్లు అనుకూల ఫలితాలనిస్తాయి. వీరికి మంగళ, గురు, శుక్రవారములు అనుకూలమైనవి. ఆవారములు 3, 12, 21, 30 తేదీలు అయినచో యింకను విశేష అదృష్ట ప్రదములైనవి. ఆసంఖ్యకు అధిపతి గురుడు. 6, 9, 15, 18, 24, 27 తేదీలు మరియు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి. మీరు కనకపుష్యరాగము ధరించవలెను.

4వ సంఖ్య వారు

ఈ సంఖ్యకు అధిపతి రాహువు. ఏ మాసములోనైనను 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారికి జన్మసంఖ్య అనగా అదృష్ట సంఖ్య 4 అగును వీరికి సోమ, ఆది, శనివారములు అనుకూలము. ఆ వారములు 4, 13, 22, 31 తేది అయినచో యింకను విశేష శుభప్రదములు. వీరికి 1, 2, 7, 10, 11, 16,19, 20, 25, 28, 29 తేదీలు కూడ శుభప్రదములు. విరికి 1,2,7,10,11,16,19,20,25,28,29 తేదిలు కూడా అనుకూలమైనవి. వీరు ఉంగరములో గోమేధికము అను రత్నము ధరించవలెను.

5వ సంఖ్య వారు

ఏ మాసంలోనైనను 5, 14, 23 తేదీలలో జన్మించిన వారి అదృష్ట సంఖ్య 5 అగును. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. వీరికి బుధ, శుక్రవారములు అదృష్టదినములు. ఆది, బుధ, శుక్రవారములు 5, 14, 23 తేదిలు అయినచో ఆ దినములు విశేష అదృష్ట దినములగును వీరు వుంగరములో పచ్చ ధరించుట మంచిది. ఈ అంకెలు గల లాటరీ టిక్కెట్లు బుధ, శుక్రవారములలో కొనుట మంచిది.

6వ సంఖ్య వారు

ఏ మాసములో నైనను 6, 15, 24 తేదీలలో జన్మించిన వారికి అదృష్టసంఖ్య 6 అగును. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. వీరు యితరుల అభిమానమును సులభముగా పొందగలరు. వీరు నలుపురంగు వస్త్రములు ధరించుట మంచిదికాదు. మంగళ, గురు, శుక్రవారములు అయినప్పుడు అట్టి తేదీలు గల దినములు విశేష అదృష్టదినములగును. వీరు వజ్రం ధరించుట మంచిది.

7వ సంఖ్యవారు

ఏ మాసం లోనైనను 7, 16, 25 తేదీలలో జన్మించిన వారికి జన్మ సంఖ్య 7 అగును. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. ఈ సంఖ్య గల వారికి 2వ సంఖ్య గలవారితో సర్వవిషయములందును పొత్తుగాకుదురును. వీరికి ఆదివారము, సోమవారము 7, 16, 25, 29 తేదీలతో కూడి యున్నచో వ్యాపారము చేసి ధనసంపాదన చేయుటలో శక్తి యుక్తుల గలవారుగ యుందురు. మరియు వీరికి 1, 2, 4, 10, 11, 13, 19, 22, 28, 29, 31 తేదీలు సామాన్యముగ ఉండును వీరు ఉంగరములలో వైఢూర్యము ధరించుట మంచిది.

8వ సంఖ్య వారు

ఏ మాసంలో నైనను 8, 17, 26 తేదీలలో జన్మించినవారి అదృష్టసంఖ్య 8 అగును. దీనికి అధిపతి శని అందుచేత ఉంగరములో ఇంద్రనీలం అనే రాయి ధరించుట మంచిది. అదృష్ట దినములు 8, 17, 26 తేదీలు. వీరికి శనివారము, సోమవారము, ఆదివారము కూడ అనుకూలమైనదినములు. వీరు ఏ కార్యమునైననూ 8, 17, 26 తేదీలలో ప్రారంభించుట మంచిది. నూతన వ్యాపారము కూడ యీ తేదీలలో ప్రారంభించుట మంచిది.8, 17, 26 తేదీలు అదృష్ట సంఖ్యలు

9వ సంఖ్య వారు

ఏ మాసంలో నైనను 9, 18, 27 తేదీలలో జన్మించిన వారికి అదృష్టసంఖ్య 9 అగును. దీనికి అధిపతి కుజుడు. వీరు కుజవ్యక్తులు. వీరు తరచుగ సైనికులుగా వ్యవహరిస్తారు. జీవితంలో 30సంవత్సరాల వయస్సు వచ్చేవరకు కష్టములుగయున్నను. తరువాత స్వయంకృషితో ఉన్నతస్థాయికి చేరుకొంటారు. వీరికి మంగళ, గురు, శుక్ర వారములు 3, 6, 12,15, 18, 21, 24, 27, 30, తేదీలు అనుకూలము. వీరు ఉంగరములో పగడము ధరించుట మంచిది. ఏ సంఖ్యనైనను 9 చే గుణించగా వచ్చిన సంఖ్యలు గల అంకెలన్నింటిని కలుపగా మరల తొమ్మిది వచ్చును. 12*9 = 108 మరల యీ మూడు సంఖ్యలు కలిపి ఒక సంఖ్య చేసినచో 9 వచ్చును.
 

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...