శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Social Media Buttons

Follow by Email

Saturday, September 1, 2012

నవగ్రహచార ఫలములు-చంద్రుడు

చంద్ర గ్రహము

చంద్ర గ్రహ లక్షణాలు :
చంద్రుడు స్త్రీగ్రహము. రుచులలో ఉప్పును, రంగులలో తెలుపు రంగును సూచించును. వైశ్యజాతికి చెందినవాడు. అధిదేవత వరుణుడు. పొట్టిగా ఉండి, స్థూలశరీరం కలవారిని సూచించును. 70 సంవత్సరముల వయసు కలవారిని సూచించును. జలతత్త్వము కలిగి వాయువ్యదిశను సూచించును. వాత, శ్లేష్మ ప్రకృతి కలదు. చంద్రుడు వర్శఋతువును సూచించును. లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. ఈ గ్రహసంఖ్య 7. చతుర్దభావంలో దిగ్బలము పొందును. ఇతను సత్వగుణప్రధానుడు. శుక్ల పక్షదశమి నుండి బహుళ పక్షపంచమి వరకు పూర్ణచంద్రుడని, బహుళపక్షచంద్రునినుండి అమావాస్య వరకు క్షీణచంద్రుడని, శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు మధ్యమ కారకత్వములు. చంద్రుడని జాతక పారిజాతం తెలుపుతున్నది.
చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రములకు అధిపతి. శరీరావయవములలో మగవారి ఎడమకన్ను, స్త్రీల కుడికన్ను, స్తనములు, గర్భసంచి, లింపులను సూచించును. చంద్రుడు కర్కాటకరాశికి అధిపతి. వృషభం లో 3వ డిగ్రీ నుండి 27 వ డిగ్రీ వరకు మూలత్రికోణం. ఇతనికి ఉచ్ఛరాశి వృషభం. నీచరాశి వృశ్చికం. వృషభంలో 3వడిగ్రీ ఇతనికి పరమోచ్ఛ. అలాగే వృశ్చికంలో 3వడిగ్రీ పరమనీచ. బుధ, రవి ఇతనికి స్నేహితులు. మిగిలినవారు సములు. చంద్రునికి శత్రువులు లేరు.
చంద్ర గ్రహ ప్రభావం :
చంద్రుని ప్రభావం కలిగినవారు చిన్నవయసులోనే శ్లేష్మవ్యాధులతో బాధపడుతారు. వీరికి నీటిగండం వున్నది. వీరు కొంతకాలం ధైర్యముగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు.మరికొంతకాలం పిరికితనంతో, నిరాశతో నీరసంగా ఉంటారు. స్నేహితులు, అభిప్రాయాలు తరచుగా మారుచుండును. వివాహం తరువాత పెద్ద పొట్ట కలిగి ఉంటారు. కొంతకాలం దనవంతులుగా కొంతకాలం దరిద్రులుగా జీవిస్తారు. భోజనప్రియులు. స్వతంత్రించి ఏ పనిని చేయలేరు. నీటిపారుదలన, పబ్లిక్ వర్క్స్, వస్త్రములు, బియ్యము వ్యాపారము పానీయాల వ్యాపారములో రాణించగలరు. పాండురోగము, మధుమేహము, శ్వాసకోశవ్యాధులు,క్షయ కలుగవచ్చును.
చంద్రుడు మనస్సుకు కారకుడు. తల్లి, స్త్రీ, పూలు, నీరు, నీరుగల ప్రాంతములు అనగా సముద్రము, నది, నీటిగుంట మొదలగునవి, ముఖము, ఎడమకన్ను, పొట్ట, మహిళాసంఘములు, స్త్రీ సంక్షేమశాఖ, నౌకావ్యాపారము, ఓడరేవులు, వంతెనలు, ప్రాజెక్టులు, చేపల పెంపకం, వెండి, ముత్యము, చలిజ్వరము, రక్తహీనత, అతిమూత్రము, స్త్రీలకు వచ్చు వ్యాదులు, శ్వాసకోశ సంభందమైన వ్యాధులు, వరిబీజము, డయారియా, క్యాన్సర్ మొదలైన వ్యాధులను సూచించును. చెఱకు, తేనె, పాలు, పెరుగు, భోజనము, జొన్న, గోధుమలు, చేపలు, పంచదార, నెయ్యి, అరటిపండ్లు, దోసకాయలు, తమలపాకులు, గుమ్మడి, కేబేజీ, కాలీ ప్లవర్, కర్బూజా ఫలము, కుక్కగొడుగులు తాబేలు, బాతు, గుడ్లగూబ, గబ్బిలము, పిల్లి, నీటి గుర్రం, తిమింగలము, షార్క్ చేపలు, కర్పూరము, నికెలు, జర్మన్ సిల్వర్ సూచించును. సంగీతం, కవిత్వం, నాట్యం మొదలగు లలిత కళలు, పూలతోటలు, స్విమ్మింగ్ పూల్, వ్యవసాయం, వర్షం, వరద, వ్యాపారులను సూచించును.
పొత్తికడుపు, గుడ్లు, క్షీరదాలు, చేపలు, ఆవులు, పుట్టగొడుగులు, కాఫీవ్యాపారం, కుటుంబం, ఉతికే నీరు, చెట్లు, కోళ్ళ పరిశ్రమ, జీర్ణము, తరగతి, జున్ను, పొలములు, పంటలు, వంట, హోటళ్ళు, కాలువలు, బీరు, బ్రాందీ వంటి మత్తుపానీయాలు, సీసాలు, తూములు, డైరీ, అలవాట్లు, కోళ్ళ పరిశ్రమ, ముత్యాలు, అజీర్ణము, జీర్ణము, జున్ను, చదువు, చెట్లు, స్త్రీలు, ఎండదెబ్బ, సముద్రయానం, నౌకాయానములను సూచించును.
చంద్రుడు సూచించు విద్యలు :
చంద్రుడు చరిత్ర, మనస్తత్వశాస్త్రము, నీటిసరఫరా, నావికాశికషణా, కవిత్వమును సూచించును. చంద్రుడు శుక్రునితో కలసి పాలపరిశ్రమ, కుజ, శుక్రులతో కలసి పశువైద్యము, పౌరశాస్త్రము, మంత్రసానికి సంబందించిన విషయములను సూచించును.
చంద్రుడు సూచించు వ్యాధులు :
మానసిక ఆందోళన, ఎడమకంటికి సంబందించిన వ్యాధులు, పిచ్చి, గర్భాశయవ్యాధులను చంద్రుడు శుక్రునితో కలసి షుగర్ వ్యాధి ( మధుమేహము ) కుజునితో కలసి గర్భాశయం తీసివేయుటను సూచించును. గురునితో కలసి కడుపుకు సంబంధించిన వ్యాధులు, రొమ్ము క్యాన్సర్, శనిత్ కలసి అమీబియాస్ , దగ్గు, జలుబు, ఆస్త్మా, డిసెంట్రీ, ఋతుక్రమముకు సంబంధించిన వ్యాధులు, గర్భాశయ క్యాన్సర్, డ్రగ్ ఎడిక్ట్, బుధునితో కలసి మానసికరోగాలు, రాహువుతో కలసి మతి చాంచల్యం, ఇతరులను చంపాలనే ఆలోఛన, కేతువుతో కలసి బాలారిష్ట శిశుమరణాలు, ఊపిరితిత్తులలో జలుబు, శ్వాసకోశ సంబందమైన ఇబ్బందులు చంద్రుడు సూచించును.
చంద్రుడు సూచించు వృత్తి, వ్యాపారాలు :
నావికులు, మంత్రసానులు, నర్సులు, చేపలు పట్టువారు, హోటల్ కీపర్స్ మట్టితో బొమ్మలు చేయువారు, కుమ్మరులను సూచించును. బత్తాయి, అరటి, తాటిచెట్టు, కర్బూజాపండు, చెరకు, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తమలపాకులు, కర్పూరము, చేపలు, వెండి, పండిన ఆహారముకు సంబంధించిన వ్యాపారములను సూచించును. చంద్రుడు కుజునితో సంబంధముంటే బాయిలర్ లతో వ్యాపారం, శనితో సంబంధముంటే శంఖువు వంటి సముద్ర గర్భంలోని వస్తువులతో వ్యాపారం, గురు, బుధులతో కలసి ఆడిటర్స్ ను, సేల్స్ మన్ లను వీధిలో వస్తువులను అమ్మువారిని సూచించును.
చంద్రునకు మిత్రులు: సూర్య బుధ
చంద్రునకు శత్రువులు
చంద్రునకు సములు: మంగళ గురు శుక్ర శని రాహు కేతు


Related Posts Plugin for WordPress, Blogger...