వధూ వరుల జన్మ లేదా నామ నక్షత్రాలను వివాహ అనుకూలత కోసం ప్రధానముగా భారతియ
హిందూ జ్యోతిష సాంప్రధాయమునందు 1వర్ణ (కుల) పొంతన, 2వశ్య (ఆకర్షణ) పొంతన,
3తారాపొంతన, 4యోనిపొంతన, 5గ్రహా మైత్రి పొంతన , 6గణపొంతన, 7రాశిపొంతన,
8నాడిపొంతన అను ఎనిమిది రకాలైన పొంతనలను పరిశీలించి నిర్ణయము తీసికుందురు.
ఇందు బ్రాహ్మణ కులస్తులు గ్రహమైత్రిని, క్షత్రియ కులస్తులు గణమైత్రిని,
వైశ్య కులస్తులు రాశిమైత్రిని, ఇతర కులస్తులు యోని మైత్రిని తప్పక
పాటించవలెను. నాడీ మైత్రిని సర్వకులస్తులు పాటించ వలెను. ఆపైన ఇరువురి జన్మ
జాతక చక్రములలో దుష్టగ్రహ ప్రభావములను అందున మంగళ కారకుడైన కుజ గ్రహ
పరిశీలన చేయవలెను.
“ఆద్యే సుత హత: అంత్యే ధన హత: మధ్యే వనితా పతి వియోగ :“
అని చెప్పబడిన కారణము వలన దంపతులు ఇరువురు ఆది నాడికి చెందిన వారైతే సంతాన నష్టము కలుగునని , అంత్య నాడికి చెందిన వారైతే ధనమునకు ఇబ్బంది ఏర్పడుననీ , మధ్యనాడి చెందిన వారైతే దంపతులు మధ్య వియోగము ఏర్పడునని , ఎడబాటు కలుగుననీ చెప్పితిరి . నాడి కూటం సరిగా లేకుంటే మిగిలిన ఏడు కూటాలు గుణాలను కూడా నాశనము చేస్తుంది అందు 1 వ పాదముతో 4 వ పాదం, 2 వ పాదముతో 3 వ పాదం, వేద ఏర్పడుతుంది తప్పక మధ్యఏకనాడిని విడిచి మిగిలిన ఏకనాడుల యందు తప్పనిసరి అయ్యితే అందుకు తగు దోష పరిహారానికి దానాది శాంతికర్మలు జరిపించి వివాహము చేయ వచ్చును.
వర్ణ కూటమి - 1
తారా కూటమి - 3
యోని కూటమి - 4
గ్రహ కూటమి - 5
గణ కూటమి - 6
రాశి కూటమి - 7
నాడీ కూటమి - 8

వశ్య కూటమి - 2
యోని కూటమి - 4
గణ కూటమి - 6
రాశి కూటమి - 7
నాడీ కూటమి - 8
అష్ట కూటములు చూచు విధానం:
ఉదాహరణ:
వధువు - ఆరుద్ర 2వ పాదం(మిథున రాశి)
వరుడు - పూర్వాషాడ 3వ పాదం(ధనుః రాశి)
ఈ కూటములన్నియు వధువు రాశి నుండి వరుని రాశి వరకు చూడవలెను.
వర్ణ కూటమి - 1 (మిథునం - శూద్ర,ధనుః - క్షత్రియ)
వశ్య కూటమి - 2 (మానవ,మానవ)
తారా కూటమి - 3 (ఆరుద్ర నుండి పూ.షా)
యోని కూటమి - 2 (శ్వానము,వానరము)
గ్రహ కూటమి - 1/2 (బుధ,గురు)
గణ కూటమి - 6 (మను,మను)
రాశి కూటమి - 7 (మిథున,ధనుః)
నాడీ కూటమి - 8 (ఆది,మధ్య)
మొత్తం కూడిన - 29 1/2
18 గుణములకు పైన వచ్చిన వివాహము శుభప్రదము.
గుణమేళనచక్రము
(సూక్ష్మంగా గుణములు లెక్కించు పట్టిక)