శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Social Media Buttons

Follow by Email

Tuesday, September 4, 2012

నవగ్రహచార ఫలములు - గురుడు

గురు గ్రహము

గురుడు లక్షణములు :
గురుడు పురుష గ్రహము. ఇతను రుచులలో తీపిని, రంగులలో పసుపుపచ్చను సూచించును. ఇతను బ్రాహ్మణజాతికి చెందినవాడు. అధిదేవత బ్రహ్మ. గురుడు 30 సంవత్సరముల వయస్సు కలవారిని సూచించును. ఇతను స్థూలకాయులు, కపిల వర్ణపు వెంట్రుకలు,కండ్లు కలవారిని సూచించును. ఇతను కఫతత్త్వము కలవాడు. హేమంత ఋతువును సూచించును. ఆకాశతత్త్వము కలిగి ఈశాన్యదిశను సూచించును. లోహములలో బంగారమును, రత్నములలో పుష్యరాగమును సూచించును. ఈ గ్రహసంఖ్య 3. లగ్నములో దిగ్బలమును పొందును.
గోదావరి నుండి వింధ్యపర్వతం వరకు ఇతని దేశంగా జాతకపారిజాతం తెలుపుతున్నది. గురుడు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రములకు అధిపతి. శరీరావయవములలో కాలేయము, గాల్ బ్లాడర్, పేంక్రియాస్ లను సూచించును. గురుడు ధనస్సు, మీనరాశులకు అధిపతి. ఇతనికి ఉచ్ఛరాశి కర్కాటకం. నీచరాశి మకరం. కర్కాటకంలో 5వ డిగ్రీ పరమనీచ. ఇతనికి రవి, చంద్ర, కుజులు స్నేహితులు. బుధ, శుక్రులు శత్రువులు శని సముడు. గురుగ్రహదశ 16 సంవత్సరములు.
గురుడు ప్రభావం :
లావుకు తగ్గ పొడవును కలిగి మంచి ఆకారము కలిగినవారై వుంటారు. వీరికి ఆహారము, వస్త్రము, సౌఖ్యములకు కొదువ వుండదు. సంప్రదాయముల పట్ల నమ్మకము, దైవభక్తి వుంటాయి. పండితులు, చట్టము, ధర్మము అంటే గౌరవము. విద్యా సంస్థలతో సంబంధము కలిగియుంటారు. కంఠధ్వని చక్కగా వుంటుంది. విశాలమైన కనులు, నుదురు కలిగి యుంటారు.
అజీర్ణవ్యాధులు, శరీరము బరువుపెరుగుట వంటి అనారోగ్యములు కలుగవచ్చును.
దేవాలయములు, L.I.C బ్యాంకు, వంటి సంస్థలలో రాణిస్తారు. న్యాయశాస్త్రంలో ప్రవీణులు కాగలరు.
గురు కారకత్వములు :
గురుడు ధనకారకుడు, జ్యేష్ట సోదరుడు, పుత్రులు, సంతానం, ముత్తాత, విశేష బంధువులు, మంత్రి, యజ్ఞము, గౌరవము, దైవభక్తి, వేదములు, శాస్త్రములు, వేదాంతము, దానధర్మములు, బుద్ది, సత్యము, ఆచారము కలిగియుండుట, బంగారము, వైఢూర్యము సంస్కృత భాష, శబ్దములను సూచించును. బ్యాంకులు, ఖజానాలు, న్యాయస్థానములు, న్యాయమూర్తులు, దేవాలయములు, విద్యాలయములు, అధ్యాపకులు, బోధకులు, మతాధికారులు, మతసంస్థలు, ఆర్థికవ్యవహారములను సూచించును. కాలేయము, కాలేయమునకు సంబంధించిన వ్యాధులు, కాన్సర్ వ్యాధులను సూచించును. నెయ్యి, నూనె, క్రొవ్వు, వెన్న, శనగలు, దబ్బకాయలు, పనసకాయలను సూచించును. పావురము, హంసలు, గుర్రములు, ఏనుగులను సూచించును.
పుస్తకములు, కళాశాలలు, వైద్యులు, లాయర్లు, బిషప్ లు, చర్చి, పదవి, కరుణ, సంతోషము, పెట్టుబడి, అభివృద్ధి, ఐశ్వర్యము, పూజారులు, ఉపాసన, విదేశీయులు, భవిష్యత్తు, బహుమతులు, ఆచారాలు, బ్యాంకులు, ధనుర్విద్య, రేసులు, టైటిల్స్, వేదాంతము, చెల్లింపులు, నిజాయితీ, క్రమబద్దము ఉన్మాదములను సూచించును.
గురుడు సూచించు విద్యలు :
గురుడు బోధించేవారిని అనగా ఉపాధ్యాయులనుండి ప్రొఫెసర్ల వరకు సూచించును. బ్యాంకులు, ఆర్థికశస్త్రము, ధనము, బంగారము, సంస్కృతభాష, పురాణాలు, నోట్లముద్రణ వేదాంతములను సూచించును.
గురుడు సూచించు వ్యాధులు :
మధుమేహవ్యాధి, కాలేయము, గాల్ బ్లాడర్ కు సంబంధించిన వ్యాధులు, బోదకాలు, శరీరంలో నీరు చేరుట, నిస్సంతానం, కాన్సర్ లను గురువు సూచించును. గురుడు చంద్రునితో కలసి గర్భాశయముకు సంబంధించిన ఇబ్బందులు, గర్భాశయ కాన్సర్ శుక్రునితో కలసి మధుమేహవ్యాధి, విచిత్రమైన సెక్సు కోరికలు, అసహజంగా పెరిగే శరీరాంగములను సూచించును. రవితో కలసి లుకేమియా, విపరీతంగా కొలొస్టరాల్ ఏర్పడుట, మూత్రపిండముల వ్యాధి, లివర్ కు సంబంధించిన వ్యాధులు, పచ్చకామెర్లు, కఫంచేయుట, అతిమూత్రవ్యాధిని సూచించును. విపరీతమైన ఆకలి, అజీర్ణము, అతికాయములను కూడ గురుడు సూచించును.
గురుడు సూచించు వృత్తి వ్యాపారాలు :
న్యాయవాదులు, న్యాయమూర్తులు, బోధకులు, ఉపాధ్యాయులు, సామాజిక రచయితలు, మతప్రవక్తలు, పురోహితులు, ప్రభుత్వోద్యోగులలో ఉన్నత స్థానంలో పేరు పొందువారు, మతప్రచారకులు, రవి లేదా చంద్రులతో కూడిన రాజకీయాలు, బ్యాంకు వ్యవహారములు, అధ్యక్షులు, మేయరు, కౌన్సిలర్, పార్లమెంటు మెంబరు, మేనేజరు, మేనేజింగ్ డైరెక్టర్ లను సూచించును. బుధునితో కలసి విదేశీభాషలు, ఎగుమతులు, దిగుమతులు, సివిల్ ఇంజినీరింగ్ లను సూచించును.
గురువు నకు మిత్రులు: సూర్య చంద్ర మంగళ
గురువు నకు శత్రువులు : బుధ శుక్ర
గురువు నకు సములు: శని రాహు కేతు


Related Posts Plugin for WordPress, Blogger...