శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

3, అక్టోబర్ 2014, శుక్రవారం

అమావాస్య - పౌర్ణమి - చంద్రుడు

చాలా మట్టుకు చాలామందికి అపోహలు అనుమానాలు మూడనమ్మకాలు ఉన్నవి.

అమావాస్య - పౌర్ణమి అనగానే చాలా మట్టుకు భయపడుతారు అమావాస్యనా అమ్మో ఆరోజు ఏ పని చేయొద్దు పౌర్నిమనా ఈ రోజు కొన్ని పనులు చేయరాదు అని అమావాస్య నాడు మాంత్రికులు మంత్ర తంత్రాలు నేర్చుకుంటారని భూత ప్రేత పిచచాలు రెచ్చిపోయే రోజని వామాచారములను అనేకము కల్పించి ఏది నిజమో ఏది ఆభద్దమో తేల్చుకోలేక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నవి. అలాగే జ్యోతిష శాస్త్రములో ప్రతీదానికి చంద్రుడు అవసరమని చంద్రబలం ఆవస్యకమని చంద్రుని ముందు తెచ్చి మిగిలిన గ్రహాలను వెనక్కి నెట్టారు.

నక్షత్రము మనిషిపై ప్రభావము చూపుతాయి అని నక్షత్రములే ముక్యమని తారాబలాన్ని తెచ్చి భాగింపు లెక్కల్ని ఎన్నో చెప్పినారు అవి అనుభవ పూర్వకముగా చూపలేక పాయినవి. ఇలా చాలా ఉన్నవి.

సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు. అస్తమించిన మాత్రాన సూర్యుడు లేనట్లా అలాగే చంద్రుడు కూడా అంతే చంద్ర కళలు భూమిపై ప్రసారమవడం లేని రోజులన్నీ చెడ్డరోజులని అనుకోవడం తప్పు.

నేను మీ అందరిని కోరేదేమిటంటే మీకు తెలుసిన సందేహలని నిర్భయంగా ఇక్కడ అడగవచ్చని ఈ చర్చలో ప్రతిసభ్యులు పాల్గొనాలని మంచి మార్గమును వెతకాలని నా కోరిక.


ఇక్కడ ఒకటి గమనించాలి అమావాస్య నాడు చంద్రుడు మనకు కనిపించడు, చంద్ర కాంతులు భూమిపై ప్రసరిన్చవు అంత మాత్రమునే చంద్రుడు లేడనుకోవద్దు. చంద్రుడు సూర్యుని వెనకకి వెళుతాడు  జ్యోతిష గ్రంధకర్తలు ప్రతీవిషయమునకు చంద్ర బలము ఆవశ్యకము అని చంద్రుడిని ముందుకు నెట్టిరి మిగితా గ్రహములను
వెనక్కి నెట్టిరి. దీని వలన జ్యోశ్యము దెబ్బతినుచున్నది, మానవునికి నమ్మకము చెడి ఇది అంత ఉత్తదే అనే వారు తయారవుతున్నారు. గ్రహములలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనునది ఏమీ లేదు అందరు పూజ్యనీయములే.అమావాస్య నాడు సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలోకి వస్తారు. పౌర్ణిమ నాడు సూర్య,చంద్రులు ఒకరికి ఒకరు ఎదురుగ అంటే సప్తమములలో ఉంటారు. శనిపాలిత లగ్నములకు అమావాస్య దగ్గర పడుతున్నకొద్దీ వీరు బలవంతులు ఎందుకనగా రాత్రి బలము కలవారు ఈ శని పాలిత లగ్నములవారు. గురుపాలిత లగ్నములకు అమావాస్య దగ్గర పడుతున్నకొద్దీ వీరు బలహీనులు అవుతారు వీరు పగటి పూట బలవంతులు.

రాశిలో చంద్రుడు బలవంతుడా కాదా చుచుకోవలె కాని అమావాస్య పౌర్ణిమ కాదు. చంద్రుడు బుద్ధి కారకుడు అంత మాత్రమున వాహనములో ప్రయాణించిన ప్రమాదమని తలంచరాదు. వాహనమునకు కారకుడు శుక్రుడు వీరికి తెలియక వీరి స్తానములను చూడక కేవలము చంద్రుడిని వలన ప్రమాదము రాదు. కొన్ని లగ్నములవారికి చంద్రుడు శుభుడు వీరికి చంద్రుడు శుభమే చేస్తాడు మిగిలిన లగ్నములకు కీడు చేస్తాడు.

లగ్నము చెప్పక వీరు శుభులు వారు పాపులు అని విభజన చేసినారు తప్ప, కేవలం చంద్రుని పైనే ఆధారపదరాడు. లగ్నమును అనుసరించిన శుభ శుభములు పొంద వచ్చు.

శుభ కార్యములకు పౌర్ణిమ మంచిదే అంటున్నారు కాని ఇది శాస్త్రము వోప్పుకోదు. పౌర్ణిమ రోజు సూర్య చంద్రులు సమసప్తకములలో ఉంటారు. కొన్ని లగ్నముల వారికి రవి శుభుడు కొన్ని లగ్నముల వారికి చంద్రుడు శుభుడు
అటువంటప్పుడు పౌర్ణిమ అందరికి మంచిది కాదు అందరికి శుభము కాదు కొందరికే మంచిది.

15, సెప్టెంబర్ 2014, సోమవారం

కాల సర్ప దోషం/ యోగం















కాల సర్ప దోషం/ యోగం:
జాతకుని జన్మ కుండలి లో రాహు కేతువుల మద్య మిగిలిన అన్ని గ్రహాలు వచ్చిన చొ దానిని కాల సర్ప యోగం అని అంటారు. దీనిలో చాల రకాలు వున్నాయి. వాటి వాటి స్తితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయం చెయ్యటం జరుగుతుంది దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే ఫలితం కూడా నిర్ణయం చెయ్య బడుతుంది.

కాలసర్ప దోషం: రాహువు-రవి ,చంద్ర ,కుజ ,బుధ ,గురు ,శుక్ర, శని- కేతువు.
ఫలితాలు: కుటుంభ సమస్యలు, దీర్గ రోగాలు.
అపసవ్య కాలసర్ప దోషం: కేతువు - రాహువు మద్య మిగలిన ఏడు గ్రహాలూ రావటం.

గుళిక కాల సర్ప దోషం: మాములుగా ఇది జాతక చక్రం లో మొదటి ఇంట ప్రారంభం అయ్యి తొమ్మిదొవ ఇంట సంమప్తం అవుతుంది.
ఫలితాలు:ఆర్ధిక మరియు కుటుంభ ఇబ్బందులు.

వాసుకి  కాల  సర్ప  దోషం: రెండోవ ఇంట మొదలయి పడవ ఇంట సమాప్తం.
ఫలితాలు:అన్నదమ్ముల కలహాలు, సమస్యలు.

సంకాపాల కాలసర్ప దోషం: మూడోవ ఇంట మొదలయి ప్దకొందవైంట సమాప్తం.
ఫలితాలు:తల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గన్డం, నివాస స్తల సమస్యలు.

పద్మ కాలసర్ప దోషం: నాలుగోవ ఇంట ప్రారంభమయి పన్నెండోవ ఇంట సంమాప్త.
ఫలితాలు: జీవిత భాగస్వామి తో కాని పిల్లలతో కాని సమస్యలు.

మహా పద్మ కాలసర్ప దోషం: అయిదోవ ఇంట ప్రారంభం అయ్యి ఒకటవ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆరోగ్య సమస్య, అప్పుల బాధ, శత్రు బాధ.

తక్షక కాలసర్ప దోషం: ఆరవ ఇంట  ప్రారంభం రెండోవ ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార నష్టాలు, వివాహ జీవతం లో ఇబ్బందులు.

కర్కోటక కాలసర్ప దోషం: యేడవ  ఇంట  ప్రారంభం మూడో వ ఇంట సమాప్తం.
ఫలితాలు: బార్య తో ఇబ్బందులు , అనుకోని సంఘటనలు.

శంఖచూడ కాలసర్ప దోషం: ఎనిమిదొవ  ఇంట  ప్రారంభం నాలుగో వ ఇంట సమాప్తం.
ఫలితాలు: తండ్రి వాళ్ళ ఇబ్బందులు, అత్యంత దురదృష్ట  స్తితి.

ఘటక కాలసర్ప దోషం: తొమ్మిదొవ  ఇంట  ప్రారంభం అయిదోవ వ ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార మరియు ఉద్యోగ సమస్యలు.

విషాధార కాలసర్ప దోషం: పదవ ఇంట  ప్రారంభం ఆరోవ వ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆర్ధిక మరియు వ్యాపార కష్టాలు.

శేషనాగ కాలసర్ప దోషం: పదకొండవ  ఇంట  ప్రారంభం యేడవ  ఇంట సమాప్తం.
ఫలితాలు: ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు.

అపసవ్య కాలసర్ప దోషం: పన్నెండవ  ఇంట  ప్రారంభం ఎనిమిదొవ  ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆలస్య వివాహం.

దోష పరిహారం :
కాళహస్తి లో కాని వేరే ఇతర రాహు కేతువులకు ప్రాముఖ్యం వున్నా ప్రదేశాలలో కాల సర్ప దోష నివారణ పూజ లు చేయున్చికుంటే ఉపసమనం కలుగుతుంది.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...