శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు
సుప్రభాతం......
ఈరోజు కార్తిక మాస బహుళ పక్ష *త్రయోదశి* తిథి ఉదయం 07.12 వరకూ తదుపరి *చతుర్దశి* తిథి, *స్వాతీ* నక్షత్రం ఈరోజు పూర్తిగా, *ఆయుష్యాన్* యోగం ఉ.07.12 వరకూ తదుపరి *సౌభాగ్య* యోగం, *వణిజ* కరణం ఉ.07.12 వరకూ, *భద్ర(విష్టీ)* కరణం రా.08.27 వరకూ తదుపరి *శకుని* కరణం ఉంటాయి.
ఈరోజు మాస శివరాత్రి బహుళ పక్ష చతుర్దశి తిథి, త్రయోదశి తిథి కలసి ఉన్న రోజు శివ రాత్రి పండుగ జరుపుకోవడానికి అత్యంత అనుకూలం.
ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. మంగళ వారం రోజు బహుళ పక్ష చతుర్దశి ఉన్న రోజు ని కృష్ణ అంగారక చతుర్దశి అని పిలుస్తారు. ఈరోజు సూర్య గ్రహణం పట్టిన రోజంత పుణ్య దినం అనీ, పుణ్య నదులలో కానీ సముద్రంలో కానీ స్నానం చేసి, యమ తర్పణం ఇవ్వడం మిక్కిలి ఫల ప్రదం అని పురాణ వచనం.
తిథి శూన్య నక్షత్రం నిన్న తెల్లవారుఝాము 04.47 నుండి ఈరోజు ఉదయం 07.12 వరకూ ఉంటుంది. ఏ మాసం లో అయినా త్రయోదశి తిథి వ్యాప్తి ఉన్నరోజు, చిత్త స్వాతీ నక్షత్రాలు వచ్చినట్లయితే, చిత్త స్వాతీ నక్షత్రాలను తిథి శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభ కార్యాలు చేయడానికి అనుకూలం కాదు.