శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

30, ఏప్రిల్ 2012, సోమవారం

ముహూర్త దీపిక

                                                 
                               ముహూర్త దీపిక

పంచాంగం
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు - కాలానికి ఉన్న ఐదు లింగాలు. వీటిని గూర్చి వివరించే గ్రంథాన్ని పంచాగం అంటారు.

పంచాంగ - ముహూర్త శుద్ధి: ప్రతి కార్యానికి ప్రత్యేకంగా విహితములైన తిథి, వార నక్షత్ర, యోగ, రణాలను మాత్రమే వినియోగించుకోవడానికి పంచాంగ శుద్ధి అంటారు. ఒక కార్యానికి విహితమైన తిథి, నక్షత్ర, లగ్నాదులు ముహూర్త సమయానికి ఉంటే అది ముహూర్త శుద్ధి.

తిథి
తిథి శుద్ధి: ఒక తిథిలో ఒక సూర్యుధయం ఉంటే శుద్ధ తిథి.

క్షయ తిథి: ఒక తిథిలో ఒక సూర్యోదయం కూడా కాకుంటే అది క్షయతిథి. (ఉదా: ఒకరోజు సూర్యోదయం ఉ: 5.54. ఆ రాజున ఉ. 6.00 వరకు షష్ట తిథి ఉంది. 6.01 నుండి సప్తమి తిథి మరునాడు ఉదయం 5గం|| వరకే ఉంది. రెండవరోజు సూర్యోదయం గం.5.55 లకు అయింది. సప్తమిలో ఒక సూర్యోదయం కూడా కాలేదు. అది క్షయతిథి అవుతుంది)

అధిక తిథి: ఒక తిథిలో రెండు సూర్యోదయాలు అయితే అది అధిక తిథి. (ఉదా: రెండు రోజుల్లోనూ సూర్యోదయం ఉ. 5.54లకు అయిన సమయంలో మొదటి రోజు ఉ. 5 గం|| ల నుండి రెండోరోజు ఉ.6.30 వరకు ఒకే తిథి ఉంటే అది అధిక తిథి అవుతుంది.

క్షీణ చంద్రుడు - పూర్ణచంద్రుడు: కృష్ణ పక్ష అష్టమి మధ్యభాగం నుండి శుక్ల అష్టమి మధ్యభాగం వరకు క్షీణచంద్రుడు. శుక్ల పక్ష అష్టమి మధ్యభాగం నుండి కృష్ణఅష్టమి మధ్య భాగం వరకు పూర్ణచంద్రుడు.

మతాంతరంలో శుక్లపక్ష ఏకాదశి నుండి కృష్ణపక్ష పంచమి వరకు పూర్ణచంద్రుడు. రెండు పక్షాలలోనూ షష్ఠినం ఉడి దశమి వరకు మధ్యమ చంద్రుడు. కృష్ణపక్ష ఏకాదశి నుండి శుక్ల పక్ష పంచమి వరకు క్షీణచంద్రుడు.


వారాలు - వారాధిపతి - కార్యాలు 

ఆదివారం - రవి బలంగా ఉంటే - రాజదర్శనం
            సోమవారం - చంద్రుడు బలంగా ఉంటే - సకల కార్యాలకు
      మంగళ వారం - కుజుడు బలంగా ఉంటే - యుద్ధానికి
       బుధవారం - బుధుడు బలంగా ఉంటే - విద్యారంభానికి
గురువారం - గురుడు బలంగా ఉంటే - వివాహానికి
  శుక్రవారం - శుక్రుడు బలంగా ఉంటే - ప్రయాణానికి
       శనివారం - శని బలంగా ఉంటే - యజ్ఞదీక్షకు మంచిది.


వారాలు సంజ్ఞకు  తగు  కృత్యాలు
ఆదివారం: స్థిర సంజ్ఞ కలది. రాజ్యాభిషేకం, పదవీ ప్రమాణ స్వీకారం, వాద్య విద్యారంభం, రాజసేవ మొదలైన స్థిర కృత్యాలకు మంచిది.

సోమవారం: చర సంజ్ఞ కలది. భూషణాలు చేయించడం, ధరించడం. అవసరమైన అప్పుచేయడం (త్వరగా తీరుతుంది), సంగీత నృత్యారంభం, పశుక్రయ విక్రయాలు మొదలైన చర కృత్యాలకు మంచిది.

మంగళవారం: ఉగ్రమైనది. శత్రువులను జయించడం, శిక్షలను విధించడం మొదలైన ఉగ్రకృత్యాలకు మంచిది. దీనికే జయవారం అని మరోపేరు. అప్పు తీర్చుటకు మంచిది. మంగళవారం తీరిస్తే త్వరగా అప్పులు తీరుతాయి.

బుధవారం: మిశ్రసంజ్ఞ కలది. సాహిత్యం, సంగీతం, కళలు, లేఖనాలు (ఉత్తరాలు వ్రాయడం, చిత్రలేఖనారంభం), ధాన్యసంగ్రహణం (వస్తువులు కొనడం మొ||)మొదలైన వానికి మంచిది. బుధవారం అప్పులు ఇవ్వరాదు. తీర్చరాదు.

గురువారం: క్షిప్ర సంజ్ఞ లేక లఘు సంజ్ఞ కలది. యజ్ఞాది కృత్యాలు, దేవతాపూజ, ప్రతిష్ట, గ్రహారాధన, విద్యాభ్యాసం, నూతన వస్త్రధారణం, ఔషధ సేవ, అలంకార ధారణ మొదలైనవానికి మంచిది.

శుక్రవారం: మృదుసంజ్ఞ కలది. నూతన వస్త్రాభరణ, వ్యాపార, వ్యవసాయం మొ|| వానికి మంచిది.

శనివారం: దారుణ సంజ్ఞ కలది. దీనికి స్థిరవారమని కూడా పేరున్నది.  క్రూరకృత్యాలకు ఉపయోగపడుతున్నది. నిషేక నామకరణాదులకు మంచిదే. గృహ ప్రవేశం వంటి స్థిర కృత్యాలకు కూడా ఉపయోగించవచ్చని అభిజ్ఞుల కథనం.



వారాలు సంజ్ఞలు కృత్యాలు
ఆదివారం: స్థిర సంజ్ఞ కలది. రాజ్యాభిషేకం, పదవీ ప్రమాణ స్వీకారం, వాద్య విద్యారంభం, రాజసేవ మొదలైన స్థిర కృత్యాలకు మంచిది.

సోమవారం: చర సంజ్ఞ కలది. భూషణాలు చేయించడం, ధరించడం. అవసరమైన అప్పుచేయడం (త్వరగా తీరుతుంది), సంగీత నృత్యారంభం, పశుక్రయ విక్రయాలు మొదలైన చర కృత్యాలకు మంచిది.

మంగళవారం: ఉగ్రమైనది. శత్రువులను జయించడం, శిక్షలను విధించడం మొదలైన ఉగ్రకృత్యాలకు మంచిది. దీనికే జయవారం అని మరోపేరు. అప్పు తీర్చుటకు మంచిది. మంగళవారం తీరిస్తే త్వరగా అప్పులు తీరుతాయి.

బుధవారం: మిశ్రసంజ్ఞ కలది. సాహిత్యం, సంగీతం, కళలు, లేఖనాలు (ఉత్తరాలు వ్రాయడం, చిత్రలేఖనారంభం), ధాన్యసంగ్రహణం (వస్తువులు కొనడం మొ||)మొదలైన వానికి మంచిది. బుధవారం అప్పులు ఇవ్వరాదు. తీర్చరాదు.

గురువారం: క్షిప్ర సంజ్ఞ లేక లఘు సంజ్ఞ కలది. యజ్ఞాది కృత్యాలు, దేవతాపూజ, ప్రతిష్ట, గ్రహారాధన, విద్యాభ్యాసం, నూతన వస్త్రధారణం, ఔషధ సేవ, అలంకార ధారణ మొదలైనవానికి మంచిది.

శుక్రవారం: మృదుసంజ్ఞ కలది. నూతన వస్త్రాభరణ, వ్యాపార, వ్యవసాయం మొ|| వానికి మంచిది.

శనివారం: దారుణ సంజ్ఞ కలది. దీనికి స్థిరవారమని కూడా పేరున్నది.  క్రూరకృత్యాలకు ఉపయోగపడుతున్నది. నిషేక నామకరణాదులకు మంచిదే. గృహ ప్రవేశం వంటి స్థిర కృత్యాలకు కూడా ఉపయోగించవచ్చని అభిజ్ఞుల కథనం.




మూఢమి
గురుడు రవి వలన అస్తంగత్వం చెందితే 'గురుమూఢం', శుక్రుడు అస్తంగత్వం చెందితే 'శుక్రమూఢం' ఏర్పడుతుంది.

చేయకూడని పనులు: బావులు, చెరువు;లు త్రవ్వుట, యజ్ఞము, దేవతాప్రతిష్ట, ఉపనయనం, విద్యారంభం, గృహారంభం, గృహప్రవేశం, దశమహాదానాలు, అన్నప్రస్తాన తరువాత జరుపు సంస్కారాలు చేయరాదు. అంతకు మునుపు దర్శించని పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదు.

చేయదగిన పనులు: జప, హోమాది క్రతువులు, శాంతులు, అభిషేకములు, వ్రతములు చేయవచ్చును.

తారాబలం
జన్మ నక్షత్రం (జాతకంలో చంద్రుడున్న నక్షత్రం) నుండి నిత్య నక్షత్రం (ముహూర్తం రోజున చంద్రుడున్న నక్షత్రం) వరకు లెక్కించి (9 సంఖ్యకు మించినచో 9 చే భాగించి శేషసంఖ్యను స్వీకరించాలి) 9 చే భాగించగా శేష సంఖ్య 1- జన్మతార, 2- సంపత్తార, 3- విపత్తార, 4- క్షేమతార, 5 – ప్రత్యక్తార, 6 – సాధనతార, 7- నైధనతార, 8- మిత్రతార, 9- పరమ మిత్రతార. 2,4,6,8 తారలు శుభప్రదమైనవి. 9 వ తార మాధ్యమం. 'వివాహే ప్రత్యగుత్తమా' అనే వచనాన్ని అనుకరించి వివాహానికి ప్రత్యక్తార తప్పనిసరి అయితే పనికి వస్తుంది.

'జన్మనక్షత్రగ శ్చంద్రః ప్రశస్తః సర్వ కర్మసు
క్షౌరభేషజ వాదాధ్వకర్తనేషుచ వర్జయేత్'

జన్మనక్షత్రంలో ఉ న్న చంద్రుడు క్షౌరం, ఔషధ సేవనం, వివాదాలు (కోర్టు వ్యవహారాలూ మొ||) ప్రయాణం, చెవులు కుట్టడం అనే అంశాలకు తప్ప తక్కిన విషయాలకు ప్రశస్త ఫలితాలనే ఇస్తాడు. ఉపనయనానికి జన్మతార, జన్మలగ్నం, జన్మమాసం మొ|| విశేష శుభ ప్రదాలని విశేష వచనం.

తారాదోషాలు - ఘడియలు విడవడం: మొదటి ఆవృత్తిలో మొత్తం పనికిరాదు. రెండవ ఆ వృత్తిలో విపత్తార మొదటి 20 ఘడియలు, ప్రత్యక్తారలో మధ్య 20 ఘడియలు, నైధన తారలో చివరి 20 ఘడియలు విడవాలి. మూడవ ఆవృత్తిలో దోషం ఉండదు.

ప్రథమ నవకంలో (జన్మ నక్షత్రం నుండి 9 వ నక్షత్రం వరకు), విపత్, ప్రత్యక్, నైధన తారలు అశుభాలు. రెండవ నవకంలో (10 వ నక్షత్రం నుండి 18 వ నక్షత్రం వరకు) విపత్తార 1వ పాదం, ప్రత్యక్తార 4 పాదం నైధన తార 3 వ పాదం అశుభాలు. మూడవ నవకంలో (19నుండి 27 నక్షత్రాలు మూడు) శుభప్రదాలే.

ప్రథమ నవకంలో 1వ తారం, రెండవ నవకంలో 3వ తార, మూడవ నవకంలో 5 వ తార, మూడు నవకాలలో నైధన తార విడువక తప్పని సరి అని మరో అభిప్రాయం.

చంద్రుడు ఉచ్చ న్వక్షేత్రాలలో ఉండగా విపత్తార, ప్రత్యాక్తారలైనా, 1,4 పాదాలు విడిచి తక్కిన పాదాల్లో అన్నీ శుభప్రదాలే. (వివది ప్రత్యగే చైవ చర మంచాద్యకం వినా, స్వోచ్చ స్వర్ క్ష గతశ్చంద్ర శ్శుభదస్సర్వకర్మసు).

తారాబలం (మతాంతరం): జన్మ నక్షత్రం నుండి నిత్యం (చంద్రుడున్న) నక్షత్రం వరకు లెక్కించి 9 చే భాగించగా శేషం 1. గార్ధభం - ధననాశం, 2. అశ్వం - ధనలాభం, 3. హస్తి - లక్ష్మీప్రాప్తి, 4. గేండా - మరణం, 5. జంబుకం - స్వల్పలాభం, 6. సింహం - సర్వ కార్యసిద్ధి, 7. కాకం - నిష్పలం, 8. నెమలి - సుఖప్రాప్తి, 9. హంస – సర్వసిద్ధి (సచిత్ర జ్యోతిష శిక్ష)

చంద్రబల, తారాబల ప్రాధాన్యం: శుక్లపక్షంలో, చంద్రబలం, కృష్ణపక్షంలో తారాబలం ముఖ్యమైనవి.

చంద్రబలం
జన్మరాశి ప్రాధాన్యం: వివాహం మొ|| శుభకార్యాలు, ప్రయాణం, గోచారం మొ|| అంశాలకు జన్మరాశి, జన్మ నక్షత్రాలు ముఖ్యమైనవి. (జన్మరాశి తెలియని వారు, అన్ని విషయాలలో నామ నక్షత్రమే చూసుకోవలసి ఉంటుంది)

యాత్ర, యుద్ధం, వివాహం, గృహప్రవేశం, క్షౌరం అనే అంశాల్లో జన్మచంద్రుడు దోషి, వివాహ విషయంలో "స్త్రీణాం జన్మత్రయం శ్రేష్టం" “పుంవివాహముదితం శుభం బుధైః" అనే అనుకూలవచనాలు జన్మనక్షత్రాన్ని కూడా అంగీకరిస్తున్నాయి. “చంద్రమా జన్మ చంద్రోపి జన్మర్ క్ష పరివర్జితః" మొదలైన వచనాలు జన్మనక్షత్రాన్ని నిషేధిస్తూ జన్మచంద్రుని అంగీకరిస్తున్నాయి.

“కృషి భరన వివాహేన్నాశనౌ మౌంజిబంధే
ప్రథమ యువతి సంగారామ కూపాది కృత్యే
పటవిధి మభిషేకే జన్మ చంద్రః ప్రశస్తుః
ఇతి వదతి వరాహః క్షౌరయాత్రాం విహాయ" – దైవజ్ఞ కల్పద్రుమం

మొదలైన వచనాలు జన్మచంద్రుని అంగీకరిస్తున్నాయి.

నామరాశి ప్రాధాన్యం: దేశ (అర్వణం), గ్రామ (అర్వణం), గృహ (ముఖద్వారార్వణం), యుద్ధ, సేవా (ఉద్యోగం) వ్యవహారాలకు నామరాశి, నామ నక్షత్రం ముఖ్యమైనవి.

స్త్రీ, పురుషుల రాశిప్రాధాన్యం: వివాహం, గర్భాధానం, గృహప్రవేశం, (గృహిణి గృహముచ్యతే) మొదలైన స్త్రీ ప్రాధాన్యం గల కార్యాల్లో స్త్రీ పురుషుల కిరువులకి, తారాబలాదులు చూడక తప్పదు. కుమారునికి ఉపనయనం మొదలైన ఇతర అంశాల్లో (కుమారునికి తండ్రికి తారాబలం చూడాలి) స్త్రీ (తల్లి) నక్షత్రానికి తారాబలం సరిపడకున్నను ఇబ్బంది లేదు.

ద్వాదశ చంద్రుడు: ఉత్సవం, రాజ్యాభిషేకం, జాతకర్మ, వ్రతబంధం, వివాహం, ప్రయాణం మొ|| అంశాలకు ద్వాదశ చంద్రుడు శుభ ప్రదుదే. తక్కిన అన్ని శుభకార్యాలకు ద్వాదశ చంద్రుడు దోషి. సామాన్యంగా 4, 8, 12 స్థానాలలోని చంద్రుడు ఉండడం మంచిది కాదు.

షడ్జన్మ నక్షత్రాలు:జన్మ నక్షత్రం, జన్మ నక్షత్రం నుండి 10 – కర్మ నక్షత్రం, 16 – సంఘాత నక్షత్రం, 18 – సముదాయ నక్షత్రం, 23- వినాశ నక్షత్రం, 25- మానస నక్షత్రాదులు సకల శుభ కర్మలకు విడువదగినవి.

చంద్ర స్థితి: కొందరి అభిప్రాయంలో పూర్ణచంద్రుడు 4,2 స్థానాల్లో గాని, మేఘలగ్నంలో గాని ఉన్నా శుభ ప్రదుడే. చంద్రుడు అశుభడైనా, గురుని యుతి, దృష్టి ఉంటే శుభుడౌతాడు. ఉచ్చ, శుభ నవాంశలలో గాని, అధిమిత్రరాశి, నవాంశలలో గాని ఉంటే శుభుడౌతాడు.

షడష్టరిః చంద్రదోషం: 6,8,12 స్థానాల్లో చంద్రుడుంటే సకల గుణాలు ఉన్న లగ్నమైనా కన్యకు ఆపదనిస్తుంది.

సగ్రహ చంద్ర దోషం: క్రూరగ్రహంతో చంద్రుడు కలిస్తే సగ్రహ చంద్రదోషం.

దోష పరిహార గ్రహ స్థితులు: లగ్నంలో శుక్రుడుంటే వెయ్యి దోషాలు, బుధుడుంటే పదివేల దోషాలు గురుడుంటే లక్షదోషాలు నివారిస్తాయి. సప్తమం తప్ప తక్కిన కేంద్ర (4, 10), కోణాల్లో (5,9) బుధుడుంటే వెయ్యిదోషాలు, శుక్రుడుంటే పదివేల దోషాలు, గురుడుంటే లక్ష దోషాలు నివారిస్తాయి.

లగ్నాధిపతిగాని, లగ్న నవాంశాధిపతిగాని, కేంద్రాల్లో (1,4,7,10) గాని, లాభం (11) లో గాని ఉంటే సకల దోష నివారణ, 11 లో సూర్యుడుంటే సకల దోష నివారణం. కేంద్ర కోణాల్లో గురుడు, శుక్రులుంటే చాలా దోషాలను నివారిస్తాయి.

చంద్రుని శుభత్వ పాపత్వాలు : చంద్రునికి పాపార్గళ (క్రూరగ్రహ మధ్యస్థితి), క్రూర గ్రహ యుతి, దృష్టులు అశుభత్వాన్నిస్తాయి. ఆధిపత్య పాపియైన చంద్రుడు గూడ శుభ గ్రహ నవాంశ, మిత్ర నవాంశలలో ఉండడం, గురు దృష్టి కలిగి ఉండడం వల్ల శుభుడౌతాడు.

చంద్రుని భావ ఫలాలు: లగ్నం- లక్ష్మీప్రదం, ద్వితీయం - మానసికానందం, తృతీయం - ధనసంపత్తి, చతుర్థం - కలహం, పంచమం - జ్ఞానసిద్ధి, షష్ఠి- సంపద, సప్తమం - రాజగౌరవం, అష్టమం - మరణం, నవమం - ధర్మలాభం, దశమం - వాంఛాసిద్ధి, ఏకాదశం - సర్వలాభాలు, ద్వాదశం - హాని.

దోష స్థితి ఉన్న స్వ, మిత్ర, ఉచ్చల్లో ఉండి పూర్ణ చంద్రుడైతే ఆ దోశాలుండవు. శుభగ్రహ, మిత్రగ్రహ నవాంశలలో ఉన్న గురుయుతి, దృష్టులున్నా ఆ దోషాలుండవు.

సంక్రాంతి కాలీన గ్రహస్థితి - బలం: చంద్రుని రాశి సంక్రాంతి కాలంలో తారాబలం బాగుంటే ఆ రాశిలో నివసించే 2 ½ రోజులు శుభ ఫలితాలనిస్తాడు. రవి సంక్రాంతి కాలంలో చంద్రబలం బాగుంటే ఆ నెలరోజులు రవి మేలుచేస్తాడు. కుజ సంక్రాంతి సమయంలో రవి గోచార స్థితి బాగుంటే ఆ రాశిలో కుజుడు సంచరించే 1 ½ మాసం మేలు చేస్తాడు. బుధ సంక్రాంతి సమయంలో రవి గోచర స్థితి బాగుంటే ఆ రాశిలో బుధుడు సంచరించే 1 మాసం మేలు చేస్తాడు.

జన్మ నక్షత్ర విచారణ:

బాలాన్న భుక్తౌవ్రత బంధనేకపి రాజ్యాభిషేకం ఖలు జన్మధిష్య్టం
శుభ త్వ నిష్టం సతతం వివాహే సీమంత యాత్రాధిషు మంగళేషు

జన్మనక్షత్రం అన్నప్రాశన, ఉపనయన, రాజ్యాభిషేకాలకు శుభప్రదం. వివాహ సీమంత యాత్రాదులకు నిషిద్ధం అని ఒక మతం.

జన్మ నక్షత్రగ శ్చంద్రః ప్రశస్తః సర్వ కర్మసు
క్షౌర భేషజ వాదాధ్వ కర్తనేషుచ వర్జయేత్ - ముహూర్త దీపిక

క్షౌరం, మందువాడడం, ప్రయాణం, చెవులు కుట్టడం అనే అంశాల్లో తప్ప తక్కిన విషయాలన్నింటిలో జన్మ నక్షత్రం శుభప్రదమే అని మరో మతం.


లగ్నం - ముహూర్త విశేషాలు
లగ్నాత్తు 11 వ స్థానం అన్ని గ్రహాలకు శుభప్రదమే. 3, 8 స్థానాల్లో సూర్యుడు, 3, 12 స్థానాల్లో చంద్రుడు (వివాహానికి 12వ స్థానంలో చంద్రుడుంటే రిఃఫ చంద్రదోషం), 3, 6 స్థానాల్లో కుజుడు, 2, 3, 4, 5, 6, 9, 10 స్థానాల్లో బుధ, శుక్రుడు, 2,5,6,9,10,12 స్థానాల్లో రాహువు శుభప్రదులు. కేంద్ర (1,4,7,10 స్థానాలు), కోణాల్లో (5, 9), 11 వ స్థానంలోను శుభగ్రహాలుండాలి.  పాపగ్రహాలుండకూడదు. 3,6,11 స్థానాల్లో పాపగ్రహాలుండాలి.

జన్మరాశి నుండి 8, 12 రాశులు లగ్నాలు కాకుండా మిగిలిన రాశులు మాత్రమే లగ్నాలు కావాలి. లగ్నం నుండి కేంద్ర (1, 4, 7, 10 భావాలు) కోణాల (5, 9 భావాలు) సౌమ్య గ్రహాలు, 3, 6, 11 భావాలలో క్రూర గ్రహాలు ఉండాలి. ఈ స్థితిని లగ్నశుద్ధి అంటారు. జన్మరాశి నుండి ఉపచయ భావాలు (3,6, 10, 11) లగ్నాలైతే మిక్కిలి శుభప్రదం.

భావం భావాధిపతిచే చూడబడినా, భావాధిపతితో కలిసి ఉన్నా బలం కలిగినదౌతుంది. పూర్తి శుభ ఫలితాన్నిస్తుంది. పాపగ్రహం ఉన్నా, పాపగ్రహించే చూడబడినా దోష ఫలితాన్నిస్తుంది. లగ్నంలో క్రూర గ్రహం ఉంటే ఆ లగ్నం ఏ శుభకార్యానికి పనికిరాదు. 6 లో శుక్రుడు, 8 లో కుజుడు, 6,8 భావాల్లో చంద్రుడు విశేష దోషకారులు. లగ్నాధిపతి నీచ, శత్రు క్షేత్రాలలోను, అష్టమంలోనూ ఉండరాదు. అస్తంగతుడు కారాదు. వక్రి కారాదు. లగ్నం లాగ్నాధిపతులు శుభయుతి, దృష్టులు కలిగి, పాపయుతి దృష్టులు లేకుంటే లగ్నం బలం కలదౌతుంది. ఈ విధమైన గ్రహ స్థితులున్నప్పుడు లగ్నబలం కలదౌతుంది. దానిని లగ్నసిద్ధి అంటారు.

భావ శుద్ధి: వివాహానికి లగ్నాత్తు 7వ స్థానం (జామిత్ర శుద్ధి), ప్రయాణానికి 8వ స్థానం, గ్రుహారంభానికి 10వ స్థానం, గృహ ప్రవేశానికి 4 వ స్థానం, అన్నప్రాశనకు 10 వ స్థానం - అన్ని కార్యాలకు 8 వ స్థానం శుద్దంగా (గ్రహ రహితంగా) ఉండాలి. ఆయా భావాలకు సంబంధించిన కార్యాలకు, ఆ యా భావాల్లో శుద్దిగా ఉండడం అవసరం.

సంవస్తరం ప్రత్యేక పరిగణన
బార్హస్పత్య మానం ప్రకారం గురుడు మారి సంవత్సర కాలం పర్తిగా ఒకరాశిలో సంచరించే సమయాన్ని శుద్ధ సంవత్సరంగా భావిస్తారు.

గురుని అతిచార: గురుడు ఒక రాశిలో సంవత్సర కాలం పూర్తిగా ఉండకుండా శీఘ్రగతితో ఆ తరువాత రాశిలో ప్రవేశించడాన్ని గురుని అతిచారగా వ్యవహారిస్తారు. అలాంటి సంవత్సరం శుభకార్యాలకు ఉత్తమమైనదిగా కాదు. అది రెండు విధాలు:

1. లఘు అతిచార: అతిచార ద్వారా ఒక రాశినుండి ఆ తరువాతి రాశిలో ప్రవేశించి, వక్రగతితో తిరిగి వెనుక రాశిలో ప్రవేశించిన విధానాన్ని లఘ్వతిచార అంటారు. ఈ స్థితిలో 28 రోజులు శుభకర్మలను పరిత్యజిస్తారు.

2. మహా అతిచార (లేదా క్షయ సంవత్సరం): అతిచార తరువాత వక్రించినా, పూర్వరాశిలోనికి ప్రవేశించక పోవడాన్ని మహా అతిచార అంటారు. ఈ స్థితిలో పూర్వరాశి సంవత్సరానికి లోపం ఏర్పడుతుంది. దాన్ని క్షయ సంవత్సరం లేదా లుప్త సంవత్సరం అని అంటారు.

అధిక సంవత్సరం: గురుని రాశి ప్రవేశం లేని సంవత్సరాన్ని అధిక సంవత్సరం అంటారు.

లుప్త సంవత్సరం దోషాపవాదం: 1,2, 11, 12 రాశుల్లో ముందు రాశిలోనికి అతిచారం ద్వారా ప్రవేశించి వక్రం ద్వారా మరల పూర్వరాశిలోకి ప్రవేశించని సంవత్సరాన్ని లుప్త సంవత్సరం అంటారు. ఇది వివాహాది శుభకార్యాలకు నిందితం. నర్మదా గంగా నదుల మధ్య ప్రదేశంలో నిందితం కాదు.


గురుబలం
జన్మరాశి నుండి 2, 5, 7, 9, 11 రాశుల్లో గురుడు సంచరిస్తున్న కాలం గురుబలం కలది అవుతుంది.
సింహగురుడు - గురు శుక్రాస్తమయాలు: గురు, శుక్రాస్తమయాలు (గురు, శుక్ర, మూఢాలు), సింహగురుడు, మకర గురుని సమయంలో శుభకార్యాలు చేయరాదు. గురుని వక్ర, అతిచారాల్లో కూడా శుభకార్యాలు చేయరాదని కొందరి అభిప్రాయం. ఏనుగు దంతాలతో, రత్నాలతో చేసిన నూతన ఆభరణాలు గురు శుక్ర మూఢాల్లో ధరించరాదు. మూఢాలలో చేయడగని కార్యాలు ఈ సమయాల్లో చేయరాదు.

సింహగురుని నిషేధావాదం: సింహగురుడు మేశాంశ మొదలు సింహ నవాంశ వరకు ఉన్న కాలం విడిచి తక్కిన సమయంలో, తక్కిన ప్రదేశాలలో వివాహాదులు చేసుకోవచ్చును. సింహరాశిలో గురుడున్నప్పుడు గోదావరికి ఉత్తరాన, గంగానదికి దక్షిణాన గల ప్రదేశంలో వివాహాదులు చేయరాదు. సింహంలో గురుడుండగా మేషంలో సూర్యుడున్న మాసంలో, గురుడు సంచరించే కాలంలో వివాహాదులు చేయవచ్చు.

మేషంలో సూర్యుడుండగా సింహ గురుడున్నప్పుడు గంగా గోదావరీ మధ్యదేశంలో గూడ వివాహాదికం చేయవచ్చు, కళింగ, గౌడ, గూర్జర దేశాల్లో సింహస్థ గురుడు పూర్తిగా విడువదగినవాడు. రేవానదికి తూర్పున, గండకీ నందికి పశ్చిమాన, శోణానదికి ఉత్తర దక్షిణాలలోనూ, మకర గురు దోషం లేదు. కొంకణ, మాగధ. సింధు దేశాల్లో మకర గురుడున్న సమయంలో వివాహాదులు చేయరాదు.

మూఢాల్లో విడువదగిన పనులు: నూతన వ్రతారంభాలు, వధూ ప్రవేశం, మహాదానాలు, యాగారంభం, ప్రత్యేక శ్రాద్ధాలు, అన్నప్రాశన, ప్రథమ రక్షాబంధం, వేద వ్రతాలు, వృషోత్సర్గం, దేవప్రతిష్ట, మంత్రోపదేశం, ఉపనయనం, వివాహం, నూతన తీర్థయాత్రలు. సన్న్యాసం, రాజదర్శనం, పట్టాభిషేకం, చాతుర్మాస్య వ్రతారంభము, కర్ణవేధ మొ|| గురు శుక్రుల వృద్ధాస్తమయ బాల్యాలలో చేయరాదు.


మాసాదుల విశేషాలు
శుద్ధ చాంద్రమాసం: శుద్ధ పాడ్యమి నుండి అమావాస్య వరకు మధ్య ఒక సూర్యసంక్రాంతి ఉన్న చాంద్రమాసాన్ని శుద్ధ చాంద్రమాసం అంటారు.

క్షయమాసం: ఒక చాంద్రమాసం (శుద్ధ పాడ్యమి నుండి అమావాస్య వరకు)లో రెండు సూర్య సంక్రాంతులుంటే అది క్షయమాసం. ఈ క్షయమాసం వచ్చిన సంవత్సరంలో రెండు అధిక మాసాలు వస్తుంటాయి.

అధికమాసం: ఒక చాంద్రమాసం సూర్య సంక్రాంతి లేకపోతే అది అధికమాసం.

వర్జిత పక్షం: త్రయోదశ దినాత్మక పక్షంలో శుభకార్యాలు చేయరాదు.

వర్జిత సమయం: గుర్వాదిత్య యోగంలో 10 రోజులు, సింహ గురువు మూడు మాసాలు, అతిచార వక్రాలలో 28 రోజులు విడువదగిన సమయాలు.

జన్మమాస విశిష్టత:
స్నానం దానం తపోహోమం సర్వ మాంగళ్య వర్ధనం
ఉద్వాహశ్చ కుమారీణాం జన్మమాసే ప్రశస్యతే

స్నానం, దానం, తపస్సు, హోమం, మాంగల్యవర్ధన క్రియలు, కన్యాక వివాహం, జన్మమాసంలో చేయడం మంచిది.

జాతం దినం దూషయతే వశిష్టః అష్టౌర్గోనిచగాయతం దశాత్రిః
జాతస్య పక్షం కిల భాగురిశ్చ శేషాః ప్రశాస్తాః ఖలు జన్మమాసే

పుట్టినరోజు మంగళ కృత్యాలకు మంచిది కాదని వశిష్టుడు, పుట్టిన రోజు నుండి 8 వ రోజు మంచిది కాదని గర్గుడు, 10 రోజు మంచిది కాదని అత్రి, పుట్టిన పక్షం మంచిది కాదని భాగులరి అభిప్రాయం. జన్మమాసంలో మిగిలినవి మంచివే.


ప్రత్యేక నక్షత్రాలు
అంధాక్ష నక్షత్రాలు: రోహిణి, పుష్యమి, ఉత్తర, విశాఖ, పూర్వాషాఢ, ధనిష్ట, రేవతి - ఈ నక్షత్రాలలో పోయిన వస్తువు (ఇంటి నుండి వెళ్ళిపోయిన వ్యక్తి) తూర్పు దిశలో ఉండే అవకాశం, దొరికే అవకాశం ఉంది.

మధ్యాక్ష నక్షత్రాలు: భరణి, మఘ, చిత్త, జ్యేష్ట, అభిజిత్, పూర్వాభాద్ర ఈ నక్షత్రాలలో పోయిన వస్తువు (ఇంటినుండి వెళ్ళిన వ్యక్తి) దక్షిణ దిక్కున ఉండే అవకాశం ఉంది. అతి ప్రయత్నంతో దొరికే అవకాశం ఉంది.

సులోచన నక్షత్రాలు: కృత్తిక, పునర్వసు, పుబ్బ, స్వాతి. మూల, శ్రవణం, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలలో పోయిన వస్తువులు (ఇంటి నుండి వెళ్ళిపోయిన వ్యక్తి) ఉత్తర దిక్కుకు పోతుంది. ఎక్కడ ఉన్నదీ తెలిసే అవకాశం లేదు. తిరిగి దొరికే అవకాశం లేదు.

పుష్యమి విశిష్టత:
“సింహో యధా సర్వ చతుష్ట దానాం తథైవ పుష్యో బలవానుడూనాం
చంద్రే విరుద్ధ్యేప్యథ గోచరేవా సిద్ధ్యన్తి కార్యాణి, కృతాని పుష్యే" - జ్యోతిర్నిబంధం

మృగాలలో సింహ లాగా, నక్షత్రాలలో పుష్యమి బలమైనది. చంద్రబలం తక్కువగా ఉన్నా, గోచార బలం తక్కువైనా, పుష్యమిలో చేసిన పనులు ఫలిసిద్ధి నిస్తాయి.

విహాయ పాణిగ్రహమేవ పుష్యః అని ముహూర్త దీపికాది గ్రంథాలు చెప్పిన ప్రకారం వివాహానికి మాత్రం పుష్యమి నిషిద్దమైన నక్షత్రంగా తేలియజేయబడుతుంది.


గ్రహాలు ప్రత్యేక బలాలు
వివాహాది ఉత్సావాలకు - గురుబలం
రాజదర్శనాదులకు - రవి బలం
యుద్ధానికి - కుజబలం
విద్యారంభానికి - బుధబలం
యాత్రకు - శుక్రబలం
దీక్షా స్వీకరణకు - శనిబలం
సకల కార్యాలకు - చంద్రబలం ముఖ్యమైనవి

తిధ్యాధిక బల పరిమాణం
తిథిరేక గుణా ప్రోక్తా నక్షత్రంతు చతుర్గుణం
వారశ్చాష్టగుణః ప్రోక్తం కరణం షోడశాన్వితం
ద్వాత్రింశద్గుణితో యోగ స్తారా షష్టి గుణాన్వితా
చంద్రః శతగుణః ప్రోక్తః తస్మాచ్చంద్ర బలం బలం" - అధర్వణ వేదాంగ జ్యోతిషం

తిథి 1 గుణం కలది. నక్షత్రం 4 గుణాలు కలది. వారం 8 గుణాలు, కరణం 16 గుణాలు, యోగం 32 గుణాలు, తారాబలం 60 గుణాలు, చంద్రబలం 100 గుణాలు, లగ్నబలం కోటి గుణాలు కలది.

అన్నివిధాల దోషరహితమైన ముహూర్తం దొరకడం కష్టం. స్వల్పబలం కలిగిన దోషాలను విశిష్ట బలం కలిగిన గుణాలు పరిహరిస్తాయి. అందువల్ల గుణాలు అధికంగా గల, తక్కువ దోషాలున్న ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి.

ముహూర్తం శుభ ఫలితాలు
మాసశుద్ది - (అధిక, క్షయ, మాసాలు కాకుండా ఉండడం) సుఖభోగాలను
విహిత తిథి - ధనం ఆరోగ్యాన్ని
విహిత నక్షత్రం (ప్రత్యేక కార్యక్రమానికి అనుకూలమని చెప్పినది)- కార్యసిద్ధిని
కరణం - ధనప్రాప్తిని
శుభ యోగం - ఇష్ట వస్తు ప్రాప్తిని
శుభ చంద్రుడు - అభీష్ట సిద్ధిని
శుభ వారం - సకల సంపత్తులకు
శుభ ముహూర్తం - మానసిక ప్రశాంతిని
శుభ లగ్నం - ఆనందాన్ని
బలం గల లగ్నాధిపతి - పరాక్రమాన్ని (జన సహకారాన్ని)
బలం గల లగ్నం - సకల గుణోదయాన్ని ఇస్తాయి.



ముహూర్తం శుభ ఫలితాలు
మాసశుద్ది - (అధిక, క్షయ, మాసాలు కాకుండా ఉండడం) సుఖభోగాలను
విహిత తిథి - ధనం ఆరోగ్యాన్ని
విహిత నక్షత్రం (ప్రత్యేక కార్యక్రమానికి అనుకూలమని చెప్పినది)- కార్యసిద్ధిని
కరణం - ధనప్రాప్తిని
శుభ యోగం - ఇష్ట వస్తు ప్రాప్తిని
శుభ చంద్రుడు - అభీష్ట సిద్ధిని
శుభ వారం - సకల సంపత్తులకు
శుభ ముహూర్తం - మానసిక ప్రశాంతిని
శుభ లగ్నం - ఆనందాన్ని
బలం గల లగ్నాధిపతి - పరాక్రమాన్ని (జన సహకారాన్ని)
బలం గల లగ్నం - సకల గుణోదయాన్ని ఇస్తాయి.


మాస శూన్య తిథి నక్షత్రాలు లగ్నాలు
మాసం  -        తిథులు                   నక్షత్రాలు                లగ్నాలు
చైత్రం    -    పంచమి, అష్టమి         అశ్విని, రోహిణి            కుంభం
వైశాఖం   -     ద్వాదశి                    చిత్త, స్వాతి                మీనం
జ్యేష్టం  -    బ.చతుర్దశి, శు. త్రయోదశి              పుష్యమి, ఉత్తరాషాఢ               వృషభం
ఆషాడం  -  బ. షష్ఠీ, శు. సప్తమి     పుబ్బ, ధనిష్ట              మిథునం
శ్రావణం  -   విదియ, తదియ     శ్రవణం, ఉత్తరాషాఢ            మేషం
భాద్రపదం - పాడ్యమి, విదియ      రేవతి, శతభిషం               కన్య
ఆశ్వయుజం -  దశమి, ఏకాదశి       పూర్వాభాద్ర              వృశ్చికం
కార్తీకం    -     బ.పంచమి, శు. చతుర్దశి       కృత్తిక, మఘ                 తుల
మార్గశిరం  -    సప్తమి, అష్టమి         చిత్త, విశాఖ               ధనుస్సు
పుష్యం    -     చవితి, పంచమి     ఆర్ర్ధ, ఆశ్విని, హస్త          కర్కాటకం
మాఘం  -      బ.పంచమి, శు. షష్ఠీ         మూల, శ్రవణం               మకరం
ఫాల్గుణం-    బ.చవితి, శు.విదియ    భరణి, జ్యేష్ట                 సింహం

పై మాసాల్లో ఆయా తిథి నక్షత్ర లగ్నాదులు నూతన ఆరంభాలకు పనికిరావు. వంశ, ధన నాశనాన్నిస్తాయి. కావున సంతానోత్పత్తి (గర్భధారణ)కును పనికిరావని భావించబడుతున్నది.

తిథి శూన్య లగ్నాలు: పాడ్యమి - తులామకరాలు, తధియ- సింహ మకారాలు, పంచమి - మిథున కన్యలు, సప్తమి - ధనుః కర్కాటకాలు, నవమి - కర్కాటక సింహాలు, ఏకాదశి - ధనుర్మీనాలు - త్రయోదశి- వృషభ మీనాలు - శుభకార్యాలకు నిషిద్ధాలు.

పంగు లగ్నాలు: పగలు కుంభం, రాత్రి మీనం.
అంధ లగ్నాలు: పగలు మేష వృషభ సింహాలు, రాత్రి మిథున, కర్కాటక, కన్యలు.
బధిర లగ్నాలు: పగలు తూల వృశ్చికాలు, రాత్రి ధనుర్మకరాలు.
వంగు, అంధ, బాధిరాది లగ్నాలు శుభకార్యాలకు నిషిద్ధాలు.


తిథి వార నక్షత్ర వర్జ్య యోగాదులు
ఆదివారం                    పంచమి                            హస్త
సోమవారం                    షష్ఠీ                             మృగశిర
మంగళవారం               సప్తమి                            అశ్విని
బుధవారం                   అష్టమి                           అనూరాధ
గురువారం                  నవమి                             పుష్యమి
శుక్రవారం                   దశమి                               రేవతి
శనివారం                   ఏకాదశి                             రోహిణి
                       -   శుభకార్యాల్లో నిషిద్ధాలు   -

హాలాహాల యోగాలు: (వశిష్టుని ప్రకారం)
ఆదివారం                    కృత్తిక                          పంచమి
సోమవారం                   చిత్త                              విదియ            
మంగళవారం               రోహిణి                            పూర్ణిమ
బుధవారం                   భరణి                             సప్తమి
గురువారం                 అనూరాధ                       త్రయోదశి
శుక్రవారం                     శ్రవణం                            షష్ఠీ
శనివారం                      రేవతి                            అష్టమి

ఇవి శత్రువులపై విజయానికి వినియోగించవచ్చు. శుభకార్యాలకు పనికిరావు.

ప్రత్యేక కార్యాలకు నిషిద్ధాలు:
మంగళవారం               అశ్విని                         గృహప్రవేశం చేయరాదు
శనివారం                     రోహిణి                           ప్రయాణం చేయరాదు
గురువారం                  పుష్యమి                        వివాహం  చేయరాదు

గల గ్రహాలు: శుక్ల పక్షంలో త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, కృష్ణపక్షంలో పాడ్యమి, చవితి, సప్తమి, అష్టమి, నవమి, అమావాస్య గల గ్రహ సంజ్ఞ కలవి. ఇందు ఉపనయనాదులు చేయరాదు.


ఉత్పాతాది యోగాలు  
                    ఉత్పాత            మృత్యు               కాణ          సిద్ధి
ఆదివారం      విశాఖ           అనూరాధ            జ్యేష్ట,        మూల
సోమవారం  పూర్వాషాఢ      ఉత్తరాషాఢ        శ్రవణం            ధనిష్ట
మంగళవారం    ధనిష్ట           శతభిషం    పూర్వాభాద్ర     ఉత్తరాభాద్ర
    బుధవారం       రేవతి          అశ్విని              భరణి           కృత్తిక       గురువారం        రోహిణి             మృగశిర            ఆర్ర్ధ         పునర్వసు
శుక్రవారం       పుష్యమి             ఆశ్లేష               మఘ          పుబ్బ
   శనివారం         ఉత్తర              హస్త                  చిత్త            స్వాతి    
                     దోషప్రదాలు     దోష ప్రదాలు    దోషప్రదాలు    దోషప్రదాలు
ఆదివారం విశాఖతో ఆరంభమై నాల్గు నక్షత్రాలు ఉత్పాత, మృత్యు, కాణ, సిద్ధి యోగాలు అవుతాయి. ఇదే క్రమంలో సోమవారం నాడు పూర్వాషాఢ నుండి ధనిష్ట వరకు నాల్గు నక్షత్రాలు పై సంజ్ఞలను పొందుతాయి.


సకల శుభకార్యాలకు నిషిద్ధాంతాలు
చంద్రుడు లేదా పాపగ్రహం ఉన్న లగ్నం, నవాంశ,
మధ్యాహ్నం మరియు అర్ధరాత్రి 8 నిమిషాలు (11. 56ని|| నుండి 12.04ని|| వరకు)
క్రూర గ్రహ నవాంశ.
గ్రహణానికి ముందు 3 రోజులు,
ఉత్పాతాలకు గ్రహణాలకు తరువాత 7 రోజులు,
ఉత్పాత, గ్రహయుద్ధ నక్షత్రాలు 6 మాసాల పర్యంతం,
సంపూర్ణ గ్రహణ నక్షత్రం 6మాసాల వరకు,
అర్థ గ్రహణ నక్షత్రం 3 మాసాల వరకు,
పాద గ్రహణ నక్షత్రం 1 మాసం వరకు శుభ కార్యాలలో వదిలి పెట్టాలి.
జన్మతిథి, జన్మమాసం, జన్మ నక్షత్రం (ఉపనయనానికి మాత్రం ఉపయోగిస్తాయి).
వ్యతీపాత, వైధృతి, అమావాస్య, శ్రాద్ధదినాదులు,
తిథిక్షయం (సూర్యోదయ సమయానికి రెండు రోజుల్లోనూ లేని తిథి. ఉదా:సూ. ఉ. 6గం. అయినప్పుడు ఈ రోజు 6.30 నుండి రేపు ఉ.5.30 వరకు ఉన్న తిథి)
తిథి వృద్ధి (రెండు రోజుల్లో సూర్యోదయానికి తిథి ఉన్నప్పుడు)
క్షయమాసం (రెండు సూర్యసంక్రాంతులున్న చంద్రామాసం)
అధికమాసం (సూర్య సంక్రాంతి లేని చాంద్రమాసం)

గుళిక, ఆర్థప్రహారి, మహాపాత, యోగాలు, వజ్ర, విష్కంభ యోగాలలో మొదటి 3 ఘడియలు (గం;1.12ని||లు) పరిఘ యోగంలో పూర్వార్ధం, శూల యోగంలో మొదటి 5 ఘడియలు (గం. 2.00) గండ, అతిగండ యోగాలలో మొదటి 6 ఘడియలు (గం.2.24ని||లు), వ్యాఘాత యోగంలో 9 ఘడియలు (గం.3.36ని||లు) శుభకార్యాలు చేయకూడదు.

గుళిక కాలవేళాదులు
పగటి ప్రమాణాన్ని 8 భాగాలు, రాత్రి ప్రమాణాన్ని 8 భాగాలు చేయాలి. ఆదివారం నుండి శనివారం వరకు పగలు వారాధిపతి మొదలు, రాత్రి పంచామాధిపతి మొదలు ఆ సమయాలకు అధిపతులవుతారు. 8వ భాగం అధిపతి లేనిది అవుతుంది. అందులో రవిఖండం కాలవేళ, కుజఖండం, మృత్యువు, బుధఖండం, అర్థప్రహర, గురుఖండం యమఘంట, శని ఖండం గుళిక అని పిలువబడుతుంది ఇవి త్యాజ్య సమయాలు. పగలు 12 గంటలు రాత్రి 12 గంటలు అయినప్పుడు సూర్యోదయం గం.6, సూర్యాస్తమయం గం.6 అయితే.

                    6-7.30     7.30-9      9-10.30      10.30-12     12-1.30    1.30-3       3-4.30   4.30-6
ఆది-పగలు   రవి   చంద్ర    కుజ      బుధ    గురు   శుక్ర    శని   నిరీశ  
               కాలవేళ      మృత్యు  ఆర్థప్రహారి    యమఘంట     గుళిక
ఆది -రాత్రి   గురు    శుక్ర    శని     రవి    చంద్ర    కుజ    బుధ   నిరీశ
              యమఘంట    గుళిక      కాలవేళ   మృత్యువు     అర్ధప్రహార

సోమ-పగలు  చంద్ర   కుజ   బుధ   గురు     శుక్ర    శని     రవి   నిరీశ
                   మృత్యు      అర్థప్రహార   యమఘంట   గుళిక     కాలవేళ
 
సోమ-రాత్రి   శుక్ర   శని   రవి    చంద్ర    కుజ    బుధ   గురు     నిరీశ
                    గుళిక      కా.వే      మృత్యు      అ.ప్ర    యమఘంట

మంగ -పగలు  కుజ   బుధ    గురు    శుక్ర     శని  రవి    చంద్ర    నిరీశ
                        మృత్యు     అ.ప్ర    య.ఘం      గుళిక      కా.వే.
 
మంగ-రాత్రి    శని    రవి    చంద్ర    కుజ   బుధ   గురు    శుక్ర   నిరీశ
                      గుళిక      కా.వే.       మృత్యు     అ.ప్ర         య.ఘం.

బుధ-పగలు    బుధ   గురు    శుక్ర    శని    రవి   చంద్ర   కుజ   నిరీశ
                       అ.ప్ర     య.ఘం     గుళిక     కా.వే           మృత్యు

బుధ-రాత్రి   రవి    చంద్ర    కుజ   బుధ    గురు    శుక్ర   శని     నిరీశ
                    కా.వే.    మృత్యు      అ.ప్ర     య.ఘం           గుళిక
 
గురు-పగలు  గురు   శుక్ర     శని    రవి     చంద్ర    కుజ    బుధ    నిరీశ
                    య.ఘం    గుళిక    కా.వే       మృత్యు      అ.ప్ర
 
గురు-రాత్రి   చంద్ర   కుజ   బుధ    గురు    శుక్ర    శని   రవి    నిరీశ
                   మృత్యు    అ.ప్ర     య.ఘం      గుళిక        కా.వే
 
శుక్ర- పగలు    శుక్ర    శని   రవి   చంద్ర    కుజ    బుధ    గురు   నిరీశ
                      గుళిక     కా.వే     మృత్యు      అ.ప్ర       య.ఘం

శుక్ర-రాత్రి    కుజ   బుధ     గురు     శుక్ర    శని    రవి    చంద్ర    నిరీశ
                 మృత్యు   అ.ప్ర      య.ఘం        గుళిక           కా.వే

శని-పగలు    శని    రవి    చంద్ర    కుజ   బుధ     గురు   శుక్ర     నిరీశ
                    గుళిక     కా.వే         మృత్యు       అ.ప్ర     య.ఘం

శని-రాత్రి   బుధ     గురు    శుక్ర     శని      రవి    చంద్ర    కుజ    నిరీశ
                అ.ప్ర      య.ఘం       గుళిక       కా.వే       మృత్యు

ఇది పరాశర మతం. గుళికారంభ కాలం నుండి 24 నిమిషాలు అన్ని పనులకు విడువదగినవి నారాయణుని వచనం. మొత్తం గుళిక కాలాన్ని విడువడం పరాశరమతం. యమఘంట, గుళిక కాలాలను విడిచి పెట్టడం సంప్రదాయం.

కాలవేళ, మృత్యు, అర్థ ప్రహార, యమఘంట, గుళిక కాలాలను విడవవలెననుట శాస్త్రీయం కాని ఎక్కువ సమయం త్యాజ్య సమయం గానే గుర్తించబడినందువల్ల శుభ సమయం దొరకడం కష్టం, కాబట్టి యమఘంట, గుళిక కాలాలను విడుచుట సంప్రదాయంగా వచ్చినదని తోస్తోంది.


సకల శుభకార్యాలకు నిషిద్ధాంతాలు
చంద్రుడు లేదా పాపగ్రహం ఉన్న లగ్నం, నవాంశ,
మధ్యాహ్నం మరియు అర్ధరాత్రి 8 నిమిషాలు (11. 56ని|| నుండి 12.04ని|| వరకు)
క్రూర గ్రహ నవాంశ.
గ్రహణానికి ముందు 3 రోజులు,
ఉత్పాతాలకు గ్రహణాలకు తరువాత 7 రోజులు,
ఉత్పాత, గ్రహయుద్ధ నక్షత్రాలు 6 మాసాల పర్యంతం,
సంపూర్ణ గ్రహణ నక్షత్రం 6మాసాల వరకు,
అర్థ గ్రహణ నక్షత్రం 3 మాసాల వరకు,
పాద గ్రహణ నక్షత్రం 1 మాసం వరకు శుభ కార్యాలలో వదిలి పెట్టాలి.
జన్మతిథి, జన్మమాసం, జన్మ నక్షత్రం (ఉపనయనానికి మాత్రం ఉపయోగిస్తాయి).
వ్యతీపాత, వైధృతి, అమావాస్య, శ్రాద్ధదినాదులు,
తిథిక్షయం (సూర్యోదయ సమయానికి రెండు రోజుల్లోనూ లేని తిథి. ఉదా:సూ. ఉ. 6గం. అయినప్పుడు ఈ రోజు 6.30 నుండి రేపు ఉ.5.30 వరకు ఉన్న తిథి)
తిథి వృద్ధి (రెండు రోజుల్లో సూర్యోదయానికి తిథి ఉన్నప్పుడు)
క్షయమాసం (రెండు సూర్యసంక్రాంతులున్న చంద్రామాసం)
అధికమాసం (సూర్య సంక్రాంతి లేని చాంద్రమాసం)

గుళిక, ఆర్థప్రహారి, మహాపాత, యోగాలు, వజ్ర, విష్కంభ యోగాలలో మొదటి 3 ఘడియలు (గం;1.12ని||లు) పరిఘ యోగంలో పూర్వార్ధం, శూల యోగంలో మొదటి 5 ఘడియలు (గం. 2.00) గండ, అతిగండ యోగాలలో మొదటి 6 ఘడియలు (గం.2.24ని||లు), వ్యాఘాత యోగంలో 9 ఘడియలు (గం.3.36ని||లు) శుభకార్యాలు చేయకూడదు.


వార దుర్ముహూర్తాలు
పగటి భాగాన్ని 15 సమభాగాలుగా చేసినప్పుడు
ఆదివారం - 6, 7, 8, 10, 14
సోమవారం - 4, 6, 8, 9, 12, 13, 14
మంగళవారం - 2, 3, 4, 6, 10
బుధవారం - 2, 4, 8, 9, 10, 14
గురువారం - 2, 6, 12, 14, 15, 16
శుక్రవారం - 4, 5, 6, 9, 10, 12, 14
శనివారం - 1, 2, 8, 10, 11, 12 ముహూర్తాలు నింద్యాలు.

ఆదివారం - 14, సోమవారం -9, 12, మంగళవారం-4, బుధవారం - 8, గురువారం - 6, 12, శుక్రవారం- 4, 9, శనివారం - 1, 2 భాగాలు ఎక్కువ దోష ప్రదమైనవి. మంగళవారం రాత్రి 7వ భాగం కూడా నింద్యమైనదే.

దోషాపపాదాలు:
“క్రకచో మృత్యు యోగాఖ్యో దినం దగ్ధం తథై వచ
చంద్రే శుభే క్షయ యాన్తి వృక్షా వజ్రా హతా ఇవ
ఉత్పాతే యమఘంటేచ కాణే చక్ర కచే తథా
తిథౌ దగ్దేచ కాలేచ ప్రాగ్యామాత్ పరతః శుభం" - రాజమార్తాండుడు

క్రకచ యోగాలు, మృత్యు యోగాలు, దగ్ధ యోగాలు, చంద్రుడు శుభప్రడుడైతే నశిస్తాయి. ఉత్పాతం, యమఘంటం, కాణ యోగాలు, దగ్ధ తిథులు మొదటి 3 గంటలు గడిచిన తరువాత దోషం ఉండదు.

వారర్ క్ష తిథి యోగేషు యాత్రామేవ వివర్జయేత్
వివాహాదీని కుర్వీత గర్గాదీనామిదం వచః
అయోగే సుయోగోపి చేత్ స్యాత్తదానీ
మమోగం నిహంత్త్యై ష సిద్ధిం తనోతి
పరే లగ్న శుద్ధ్యా కుయోగాది నాశం
దినార్దోత్తరం విష్టి పూర్వం చ శస్తం - లల్లాచార్యుడు

వారం, తిథి, నక్షత్రం - వానికి సంబంధించిన యోగాలు యాత్రకు మాత్రమే నిషిద్దాలు. వివాహాదులకు దోషం లేదు. ఒక దుర్యోగం, ఒక సుయోగం కలిసినప్పుడు దుర్యోగాన్ని సుయోగం నశింపచేస్తుంది. లగ్నశుద్ధి ఉన్నా, దుర్యోగ బలం నశిస్తుంది. మధ్యాహ్నమందు భద్రాది దోషాలుండవు.

విష్టి రంగార కశ్చ్తెవ వ్యతీపాతః స వైధృతిః
ప్రత్యరిర్జన్మ నక్షత్రం మధ్యాహ్నాత్ పరతః శుభం

భద్ర, అంగారకుడు, వ్యతీపాత, వైధృతి, ప్రత్యక్తార, జన్మనక్షత్రం, మధ్యాహ్నం తరువాత శుభప్రదాలే.
దేశ భేదం: నారదుని వచనం ప్రకారం మాస శూన్యతిథి, నక్షత్రాదులు, మాస శూన్య లగ్నాలు మధ్యదేశంలో వాడరాదు. తక్కిన ప్రదేశాల్లో వాడవచ్చు. పంగు, అంధ కాణ లగ్నాలు, మాస శూన్య రాశులు, గౌడ మాళవ దేశాల్లో విడిచిపెట్టాలి. తక్కిన దేశాల్లో నిషేధం లేదు తిథి, వారం, నక్షత్రం - వీని యోగం వల్ల కలిగే దోషాలు హూణ, వంగ, ఉత్తర దేశాల్లో నిషిద్ధాలు. ఇతర ప్రదేశాల్లో దుష్టమైనవి కావు.

చంద్ర బలం బాగుంటే మృత్యు, క్రకచ, దగ్ధ, విష, హుతాశన యోగాల దోషం లేదని కొందరు, యాత్రలలోనే పై వాని దోషమని మరికొందరు, ఒక జాము విడచినచో దోషం పోవునని కొందరు, ఒక పధ్ధతి ప్రకారం దుర్యోగం, మరో లెక్కన సుయోగం సంభవిస్తే ఆ దోషం పోతుందని మరికొందరు. లగ్నశుద్ధి దోష పరిహారక మగునని మరికొందరు అభిప్రాయపడినారు.



సర్వసిద్ది యోగాలు
ఆదివారం: ఉత్తరాత్రయం (ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర), అశ్విని, పుష్యమి, హస్త, మూల
సోమవారం: రోహిణి, మృగశిర, పుష్యమి, అనురాధ, శ్రవణం
మంగళవారం: అశ్విని. కృత్తిక, ఆశ్లేష, ఉత్తరాభాద్ర
బుధవారం: కృత్తిక, రోహిణి, మృగశిర, హస్త, అనురాధ.
గురువారం: అశ్విని. పునర్వసు, పుష్యమి, అనురాధ, రేవతి.
శుక్రవారం: అశ్విని, పునర్వసు, అనురాధ, శ్రవణం, రేవతి
శనివారం: రోహిణి, స్వాతి, శ్రవణం.
ఇవన్నీ సర్వార్థ సిద్ధి యోగాలు, సర్వాకార్యాలకు శుభప్రదాలు.

రవి యోగం: రవి నక్షత్రం నుండి 4, 5, 6, 10, 11, 20 నక్షత్రాల్లో చంద్రుడుంటే రవి యోగం సకల దోషాలకు నాశనం. మతాంతరంలో రవి నక్షత్రం నుండి చంద్రుడు 4, 6, 9, 10, 13, 20 నక్షత్రాల్లో ఉంటే రవి యోగం దగ్దాది దుష్ట యోగాలను హరిస్తుంది. శుభప్రదం.

సిద్ధ యోగాలు: శుక్రవారం నందతిథులు, బుధవారం భద్రతిథులు, మంగళవారం జయ తిథులు, ఆదివారం రిక్త తిథులు, గురువారం పూర్ణతిథులు సిద్ధయోగం కలవి అవుతాయి.




ఏకవింశతి మహాదోషాలు
ఏకవింశతి మహాదోషాలు అనగా 21 ప్రత్యేక దోషాలు.వివాహాది కార్యక్రమాల విషయంలో వీనిని గమనిస్తారు.

“ఆద్యః పంచాంగ శుద్ధి స్స్యాద్ద్వితీయ స్సూర్య సంక్రమః
తృతీయః కర్తరీ దోషశ్చంద్ర షాష్టాష్టరిఫగః
ఉదయాస్తాంశ మోశ్సుద్ధిరహితా దుర్ముహుర్తజః
గండాంతాం పాపషడ్వర్గ భ్రుగుషట్కం కుజాష్టమం
దాంపత్యోరష్టమం లగ్నం రాశేర్విషఘటీ భవేత్
కునవాంశో వారదోషః ఖర్జూరిక సమాంగఘ్రిభమ్
గ్రహణోత్పాతభం క్రూరవిద్ధిర్ క్షం క్రూర సంయుతమ్
అకాల గర్జితం వృష్టిర్మహాపాత స్సవై ధృతిః
మహాదోషాం అమీచైషాం ఫలం వక్ష్యే పృథక్ పృథక్ " (ముహూర్త దర్పణం)

1. పంచాంగ శుద్ధి 2. సూర్యసంక్రమణం ౩. కర్తరీ దోషం 4. చంద్రుడు 6, 8, 12 భావాలలో ఉండుట 5. ఉదయ అస్తమయ దోషం 6. వారజనిత దుర్ముహూర్తం 7. గండాంత దోషం 8. పాపషడ్వర్గలు 9. భ్రుగు (శుక్ర) షట్కం (6వ భావంలో ఉండుట) 10. కుజాష్టమం (కుజుడు 8వ భావంలో ఉండుట) 11. దంపతుల లగ్నమునకు అష్టమ లగ్నం 12. రాశి విషఘటికాదోషం 13. కునవాంశ 14. వారదోషం 15. ఖర్జూర చక్ర సమాంఘ్రిక 16. గ్రహణోత్పాత 17. క్రూర గ్రహవిద్ద నక్షత్రం 18. క్రూర సంయుతం 19. అకాల గర్జిత వృష్టి 20. మహాపాత దోషం 21. వైధృత దోషం


పంచాంగ శుద్ధి దోషం
ముహూర్త లగ్నానికి శుభతిథి, శుభవార, శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణాలు లేకుంటే దానిని పంచాంగ శుద్ధి దోషము అంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల శుభత్వం గల పాఠాల్లో ప్రస్తావించబడింది.


సూర్య సంక్రమణ దోషం
మేష, కర్కాటక, తులా, మకర సంక్రమాణాలలో అంటే ఈ రాశుల్లో సూర్యుడు ప్రవేశించిన దినము, పూర్వదినము, తరువాత దినము వివాహాది శుభకర్మలకు యోగ్యాలు కావు. మిగిలిన రాశుల్లో సూర్యుడు ప్రవేశించిన కాలానికి పూర్వం, తరువాత గం.6.24ని.లు విడిచిపెట్టి శుభకార్యక్రమాలు చేసుకోవచ్చు, ఇది సూర్య సంక్రమణ దోషం. రవి కాక ఇతర గ్రహాలు వేరు వేరు రాశుల్లో సంక్రమణ కాలాలలో విడిచిపెట్టాల్సిన సమయాలు: రవికి ప్రవేశ కాలానికి ముందు వెనుక గం. 12.48. ని.లు; చంద్ర – గం. 0.48ని.లు; కుజుడు - గం. 3.36ని.లు; బుధుడు - గం. 2.24 ని.లు; గురుడు గం. 35.12 ని.లు; శుక్రుడు గం. 3.36ని.లు; శని -రెండు రోజుల 16 గంటలు;

కర్తరీ దోషం
లగ్నానికి 2, 12 రాశులు రెండింటిలోనూ పాపగ్రహాలుంటే కర్తరీ దోషం. లగ్నానికి 12వ స్థానంలో ఋజు పాపగ్రహం, రెండింటి వక్రగత పాపగ్రహ ఉంటే కర్తరీ దోషం. ఈ కర్తరీ యోగంలో వివాహాది శుభకార్యాల వల్ల దారిద్ర్యం, మరణం, దుఖాలు కలుగుతాయి.

“లగ్నాభిముఖయోః పాప గ్రహయో ఋజువక్రయోః
సా కర్తరీతి విజ్ఞేయా దంపత్యోర్గళ కర్తరీ"

ఈ ముహూర్త కర్తరిని 'గళకర్తరి' అని అంటారు. లగ్నానికి 1, 12 రాశుల్లో పాపగ్రహాలు లేక, ద్వితీయంలో ఋజుగతి కలిగిన పాపగ్రహం, 12వ స్థానంలో వక్రగత కలిగిన పాపగ్రహం ఉన్నప్పటికీ సామాన్య కర్తరిగా భావిస్తారు. లగ్నానికి లాగా చంద్రునికి కూడా కర్తరీ దోషాన్ని చూడాలని కొందరి అభిప్రాయం.

కర్తరీ దోషాపవాదం:
1. ద్వాదశ స్థానంలో గురుడు ఉంటే కర్తరీ దోషం భంగం, 2. లగ్నంలో శుభ గ్రహం ఉన్నప్పుడు 3. ద్వితీయంలో చంద్రుడున్నా 4. ద్వితీయంలో శుభగ్రహం ఉన్నా 5. గురు, బుధ, శుక్రుడు కేంద్ర కోణాల్లో ఉన్నా 6. కర్తరికి మూలమైన గ్రహాలు నీచ, శత్రు క్షేత్రాల్లో ఉన్నా, అస్తంగతులైనా కర్త దోషం భంగం అవుతుంది.

షష్ఠాష్ట రిఃఫ చంద్రదోషం
ముహూర్త లగ్నానికి 6, 8, 12 స్థానాల్లో చంద్రుడుంటే షష్ఠాష్ట రిఃఫ చంద్రదోషం అవుతుంది.
దోషాపవాదం:
1. చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఎక్కడైనా ఉన్నప్పుడు ఆ రాశి చంద్రునికి నీచమైన వృశ్చికమైనా, నీచ నవాంశయైనా దోషం తొలగుతుంది. 2. చంద్రుడు శుభ వర్గాల్లో ఉన్నా, శుభ దృష్టిని పొందినా, శుభగ్రహాలతో కూడినా దోషముండదు.. 3. లగ్నంలో గురుడుగాని, శుక్రుడు గాని బలంగా ఉండి, చంద్రుడు శుక్ల పక్షంలో శుభ వర్గాలను పొందినా, శుభదృష్టిని పొందినా దోషం ఉండదు.


ఉదయాస్త శుద్ధి దోషం
లగ్నానికి, సప్తమానికి శుద్ధి ఉండడం అనగా ఈ రెండు స్థానాలు దోష రహితాలైన వివాహాదులకు ప్రశస్తం. (ఉదయం = లగ్నం, అస్త = సప్తమం)

1. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నా, చూసినా, నవాంశ లగ్నాధిపతి నవాంశ లగ్నంలో ఉన్నా, చూసినా
2. లగ్నంలో నవాంశాదిపతి ఉన్నా, చూసినా, లగ్నాధిపతి నవాంశ లగ్నంలో ఉన్నా, చూసినా ఉదయ శుద్ధి అవుతుంది. ఇది వరునకు ప్రశస్తం.
3. సప్తమ భావాదిపతి సప్తమంలో ఉన్నా, చూడినా, సప్తమ నవాంశాధిపతి సప్తమ నవాంశలో ఉన్నా, చూసిన సప్తమ భావాధిపతి సప్తమ నవాంశలో ఉన్నా, చూసినా, సప్తమ నవాంశాధిపతి సప్తమ భావంలో ఉన్నా, చూసినా సప్తమ శుద్ధి అవుతుంది. ఇది కన్యకకు శుభప్రదం.
4. నవాంశ లగ్నాధిపతి యొక్క శుభమిత్ర గ్రహం నవాంశ లగ్నాన్నిగాని, లగ్నాన్ని గాని చూసిన సందర్భంలో వరునకు శాస్త్రోక్త శుభఫలానిస్తుంది. సప్తమ నవాంశాధిపతి యొక్క శుభ మిత్ర గ్రహం సప్తమాంశం గాని, లగ్నానికి సప్తమరాశిని గాని చూసినప్పుడు వధువుకు అత్యంత శుభప్రదం.


దుర్ముహూర్త దోషం
ఆదివారం అర్యమ (ఉత్తర ఫల్గుని) - సోమవారం బ్రహ్మ, అసుర (రోహిణి, మూల)-మంగళవారం పగలు పితృ (మఖ) రాత్రి అగ్ని (కృత్తిక) -బుధవారం అభిజిత్ - గురువారం తోయః (పూర్వాషాఢ) దైత్య (మూల)- శుక్రవారం బ్రహ్మ (రోహిణి) పితృ (మఖ)-శనివారం రుద్ర (ఆర్ర్ధ) అహి (ఆశ్లేష) ముహూర్తాలు దుష్టమైనవి. కాబట్టి వివాహాది శుభకార్యాల్లో విడిచిపెట్టాలి.

ఆది పగలు - 14, సోమ – పగలు 9, 12 రాత్రి 8, మంగళ పగలు - 4 రాత్రి 7, బుధ పగలు - 8, గురు పగలు - 6, 12, శుక్ర పగలు - 4, 9, రాత్రి 8, శని పగలు 1, 2 రాత్రి 1 సంఖ్యగల ముహూర్తాలు దుర్ముహూర్తాలవుతాయి.


గండాంత దోషం
గండాంత దోషాలు మూడు రకాలు.
1. తిథి గండాంతం 2. నక్షత్ర గండాంతం 3. రాశి గండాంతం

1. తిథి గండాంత దోషం: నంద తిథులైన పాడ్యమి, షష్ఠీ, ఏకాదశీ తిథుల మొదటి గడియలు, పూర్ణ తిథులైన పంచమి, దశమి, పూర్ణిమల చివరి రెండు ఘడియలు తిథి గండాంతములు.

2. నక్షత్ర గండాంత దోషం: ఆశ్లేష చివరి 4 ఘడియలు, మఖ మొదటి నాలుగు ఘడియలు; జ్యేష్ట చివరి 4 ఘడియలు, మూల మొదటి 4 ఘడియలు; రేవతి చివరి 4 ఘడియలు, అశ్విని మొదటి 4 ఘడియలు మొత్తం ఈ మూడు నక్షత్ర కాలంలో 8ఘడియల కాలం నక్షత్ర గండాంతములు.

3. రాశి గండాంత దోషం: సింహం,ధనుస్సు, మేష రాశుల మొదటి అర్థ ఘడియ (12ని.లు,) కర్కాటక, వృశ్చిక, మీనా రాశుల చివరి అర్థ ఘడియ (12ని.లు)లు రాశిగండాంతములు.

గండాంత దోషాపవాదం:
చంద్రుడు బలంగా ఉంటే తిథి గండాంత దోషం పరిహారమవుతుంది. గురువు బలంగా ఉంటే లగ్న గండాంత దోషం పరిహారం. అభిజిన్ముహూర్తంలో తిథి, లగ్న, నక్షత్ర గండాంత దోషాలు మూడు పరిహారమవుతాయి.

“గండాంత దోష మఖిలం ముహుర్తోకభిజిదాహ్వయః
హంతి యద్వాన్మ్రగ వ్యాధః పక్షి సంఘాది వాఖిలమ్"

పాప షడ్వర్గ దోషం
లగ్నం పాప షడ్వర్గాలలో ఉండడం దోషం. లగ్నం, హోర, ద్రేక్కాణ, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ అనే వర్గషట్కానికి షడ్వర్గమని పేరు. షడ్వర్గాధిపతులు పాపగ్రహాలైతే పాప షడ్వర్గమని, శుభ గ్రహాలైతే శుభ షడ్వర్గమని అంటారు. 'షడ్వర్గః శుభదః శ్రేష్టః వివాహ స్తాపనాదిశు" అనే వచనం ప్రకారం శుభ షడ్వర్గం ప్రశస్తం. షడ్వర్గాధిపతుల్లో నలుగురు శుభులైనా మంచిదే. “ముహూర్త లగ్న షడ్వర్గ కునవాంశ గ్రహోద్భవాః యే దోషాన్తాన్నిహంత్యేవ యత్రైకాదశగః శశీ" అనేది కశ్యప వచనం ప్రకారం ఏకాదశంలో ఉంటే పాప షడ్వర్గ దోషం తొలగుతుంది.

భ్రుగు షట్క దోషం
శుక్రుడు ముహూర్త లగ్నానికి 6వ స్థానంలో ఉండడం 'భ్రుగు షట్క దోషం' అవుతుంది.

దోషాపవాదం: షష్ఠ స్థానంలో ఉన్నప్పటికీ ఆ స్థానం శుక్రునికి నీచ రాశి అయిన కన్య అయినా, శత్రు క్షేత్రాలైన కర్కాటక, సింహ, ధనుస్సు రాశులైన దోషం కాదు.

'శత్రు నీచర్షగః శుక్రో నదూష్యోహ్యరి సంస్థితః'
'నీచగేతు తురీయేవా శత్రు క్షేత్ర గతోపివా
భృగు షష్ఠోద్భవో దోషోనాస్తీ త్యత్ర న సంశయః!!'

భ్రుగు షట్క దోషం
శుక్రుడు ముహూర్త లగ్నానికి 6వ స్థానంలో ఉండడం 'భ్రుగు షట్క దోషం' అవుతుంది.

దోషాపవాదం: షష్ఠ స్థానంలో ఉన్నప్పటికీ ఆ స్థానం శుక్రునికి నీచ రాశి అయిన కన్య అయినా, శత్రు క్షేత్రాలైన కర్కాటక, సింహ, ధనుస్సు రాశులైన దోషం కాదు.

'శత్రు నీచర్షగః శుక్రో నదూష్యోహ్యరి సంస్థితః'
'నీచగేతు తురీయేవా శత్రు క్షేత్ర గతోపివా
భృగు షష్ఠోద్భవో దోషోనాస్తీ త్యత్ర న సంశయః!!'


అష్టమ లగ్న దోషం
వధూవరుల జన్మలగ్నాలకు గాని, జన్మరాశులకు గాని 8 వ లగ్నం వివాహ ముహూర్త లగ్నం కావడం దోషం.

దోషాపవాదం:
'జన్మ లగ్న భయోర్మత్యు రాశౌ నేష్ట కరగ్రహః
ఏకాధిపత్యే రాశీశ మైత్ర్యేవా నైవ దోషకృత్'

జన్మలగ్నానికి గాని, జన్మరాశికి గాని 8 వ లగ్నం ముహూర్త లగ్నమైనా, జన్మలగ్నాధిపతి లేక జన్మరాశ్యధిపతి, మరియు ముహూర్త లగ్నాధిపతి ఒకే గ్రహమైనా లేక పరస్పర మైత్రి కలిగి ఉన్నా అష్టమ లగ్న దోష పరిహారం అవుతుంది.

వధూవరుల జన్మరాశి, జన్మ లగ్నాలకు అష్టమ లగ్నాలు మీనం, వృషభం, కర్కాటక, వృశ్చికం, మకరం, కన్యా లగ్నాలు ముహూర్త లగ్నాలైతే స్త్రీ, పుత్ర, గృహ, సౌఖ్య భోగాలను అనుభవింపజేస్తాయి.

సింహానికి 8 వ లగ్నం మీనం - రవి గురులకు మైత్రి
తులకు 8వ లగ్నం వృషభం - ఏకాదిపతి, శుక్రుడు
ధనుస్సుకు అష్టమ లగ్నం కర్కాటకం - గురు, చంద్రులకు మైత్రి
మేషానికి అష్టమ లగ్నం వృశ్చికం - ఏకాధిపతి, కుజుడు
మిథునానికి అష్టమ లగ్నం మకరం - బుధ, శానులకు మైత్రి 

కుంభానికి అష్టమ లగ్నం కన్య – శని, బుధులకు మైత్రి - కాబట్టి ఈ ఆరు లగ్నాలు వధూవరుల జన్మ రాశి, జన్మ లగ్నాలకు అష్టమ లగ్నాలైనను దోషము లేదు.

అష్టమాధిపతి కేంద్రాలలో ఉండి శుభగ్రహాలతో చూడబడినా, ఆస్తమాధిపతి స్వనవాంశలోగాని శుభ గ్రహ నవాంశలోగాని, ఉచ్చలోగాని, స్వ క్షేత్రంలోగాని, మిత్రక్షేత్రంలో గాని ఉన్నప్పుడు అష్టమలగ్న దోష పరిహారం అవుతుంది.

విషఘటీ దోషం
విషఘటీ దోషం 3 రకాలు: 1. నక్షత్ర విషఘటీ దోషం 2. తిథి విషఘటీ దోషం 3. వార విషఘటీ దోషం.

“వివాహా వ్రత చూడాసు గృహారంభ ప్రవేశయోః
యాత్రాది శుభ కార్యేషు విఘ్నదా విషనాడికాః "

అనడం వల్ల శుభకార్యాల్లో పై మూడు రకాలైన దోష కాలాలు విఘ్నాలను కలిగిస్తాయి.

1. నక్షత్ర విష ఘటికలు: నక్షత్ర ప్రమాణం 60 ఘడియలు అయినప్పుడు విష ఘడియలు 4 అవుతాయి. (గం. 1.36ని.లు) ప్రమాణంలో మార్పులుంటే దానిని బట్టి లెక్కించుకోవాలి.

రేవతి, పునర్వసు, మాఘ నక్షత్రాలకు 30 ఘడియల తరువాత, రోహిణికి 40 ఘడియల తర్వాత, ఆశ్రేషకు 32 ఘడియల తర్వాత, అశ్వినికి 50 ఘడియల తర్వాత, ఉత్తర, శతభిషాలలో 18 ఘడియల తర్వాత, పుబ్బ, చిత్ర, ఉత్తరాషాఢ, పుష్యమి నక్షత్రాలలో 20 ఘడియల తర్వాత, విశాఖ, స్వాతి, మృగశిర, జ్యేష్ట నక్షత్రాలకు 14 ఘడియల తర్వాత, ఆర్ర్ధ, హస్తలకు 21 ఘడియల తర్వాత, పూర్వాభాద్రకు 16 ఘడియల తర్వాత, ఉత్తరాభాద్ర పూర్వాషాడ, భరణీ నక్షత్రాలకు 24 ఘడియల తర్వాత, అనురాధ, ధనిష్ట, శ్రవణాలకు 10 ఘడియల తర్వాత, మూలకు 56 ఘడియల తర్వాత 4 ఘడియలు విషఘటికలు అవుతాయి. ఇవి వివాహాదులకు వర్జ్యాలు.

2. తిథి విషఘటికలు: పాడ్యమికి 14, విదియకు 5, తదియకు 8, చవితికి 7, పంచమికి 7, షష్ఠీకి 5, సప్తమికి 4, అస్తమికు 8, నవమికి 7, దశమికి 10, ఏకాదశికి 3, ద్వాదశికి 10, త్రయోదశికి 12, చతుర్దశికి 7, పూర్ణిమకు 8, ఘటికల తర్వాత 4 ఘడియలు తిథి విషఘడియలు.

3. వార విషఘటికలు: ఆదివారం 20, సోమవారం 2, మంగళవారం 12, బుధవారం 10, గురువారం 7, శుక్రవారం 5, శనివారం 25 ఘడియల తర్వాత 4 ఘడియలు వార విషఘటికలు.

దోషాపవాదము:
లగ్నానికి చంద్రుడు త్రికోణాల్లో ఉన్నా, లగ్నాధిపతి కేంద్రాల్లో ఉండి శుభ గ్రహాలచే చూడబడినా, విషఘటీ దోష పరిహారం అవుతుంది.

చంద్రో విషఘటీ దోషం హంతి కేంద్ర త్రికోణగః
లగ్నం వినా శుభైః దృష్టః కేంద్రావా లగ్నవన్తధా" - బృహస్పతి వాక్యం

అనగా చంద్రుడు లగ్నానికి కేంద్రాల్లో (అంటే 4, 7, 10 స్థానాలు)లో ఉండి శుభగ్రహాలచే చూడబడినా, విషఘటీ దోష పరిహారమవుతుంది.

ఇక్కడ లగ్న చంద్రుడు దోషం కాబట్టి లగ్నేతర కేంద్రాలని చెప్పబడింది. మిగిలిన కేంద్రాలు చతుర్థ, సప్తమ, దశమ స్థానాలు. కాని సప్తమ స్థానంలో గ్రహం ఉంటే జామిత్ర దోషం. ఈ దోషం వివాహానికి అవశ్యం నింద్యం. కాబట్టి వివాహానికి తప్ప అన్య శుభకార్యాలకు సంప్తమ కేంద్రాన్ని గ్రహించవచ్చు. వివాహానికి జామిత్ర దోషపవాదం కలిగితే సప్తమ కేంద్రాన్ని కూడా గ్రహించవచ్చు.

“విషనాడ్యుత్థితం దోషం హంతి సౌమ్యర్ క్షగః శశీ
మిత్ర దృష్ఠోకధవా స్వీయ వర్గస్థో లగ్నతపోకపివా" - ఫలప్రదీపం

చంద్రుడు కాని, లగ్నాధిపతి గాని శుభారాశిలో ఉండి లేక స్వీయవర్గాల్లో ఉండి మిత్ర గ్రహంతో చూడబడినా, విషఘటీ దోష పరిహారం అవుతుంది.


కునవాంశ దోషం
ముహూర్త లగ్నం పాపగ్రహ నవాంశలలో ఉండడం కునవాంశ దోషం

దోషాపవాదం:
“ముహూర్త లగ్న షడ్వర్గ కునవాంశ గ్రహోద్భవాః
యే దోషాన్నిహంత్యేవ యత్ర్యై కాదశగ శ్శీశీ"

ముహూర్త లగ్న, షడ్వర్గ, కునాంశ దోషాలు ఏకాదశంలో చంద్రుడుంటే పరిహారమవుతాయి.

సగ్రహ చంద్ర దోషం
వివాహ సమయంలో చంద్రుడు ఇతర గ్రహాలతో కలిసి ఉన్న సగ్రహ చంద్ర దోషం అనబడుతుంది. చంద్రుడు శుభ గ్రహాలతో కలిసిన దోషం లేదని కొందరి అభిప్రాయం.

చంద్రుడు రవితో కలిస్తే దరిద్రం, కుజునితో కలిస్తే మరణం, బుధునితో కలిస్తే శుభం, గురునితో కలిస్తే సౌఖ్యం, శుక్రునితో కలిస్తే సపత్ని (సవతి), శనితో కలిస్తే వైరాగ్యం కలుగుతుంది.

చంద్రుడు రెండు పాప గ్రహాలతో ముహూర్త చక్రంలో కలిస్తే మరణం కలుగుతుంది. కాని కాలామృతానుసారం - రవితో దరిద్రం, కుజునితో మరణం, బుధునితో సంతానహీనత, గురునితో దౌర్భాగ్యం, శుక్రునితో సవతి, శనితో యతిభావం, రాహువుతో కలహం, కేతువుతో చంద్రుడు కలిసిన దుఖం కలుగుతుంది, కాని చంద్రుడు సూర్యాదిగ్రహాలతో రాశిలో కలిసినట్లున్నా, వేరు వేరు నక్షత్రాల్లో ఉంటే దోషం లేదని కొందరి అభిప్రాయం.

దోషాపవాదం: చంద్రుడు స్వక్షేత్రమైన కర్కాటకంలో ఉన్నా, స్వోచ్చయైనవృషభంలో ఉన్నా, మిత్ర క్షేత్రమైన సింహ, మిథున, కన్యల్లో ఉన్నా యుతిదోషం లేదు.

ఖర్జూరికా సమాంఘ్రిభ దోషం
విష్కంభం, అతిగండం, శూల, గండ, వ్యాఘాత, వజ్ర, వ్యతీపాత, పరిఘ, వైధృతి అనేవి తొమ్మిది దుష్ట యోగాలు. ఈ 9 దుష్ట యోగాలలో ఏదైనా ఒక దుష్ట యోగం ఉన్నప్పుడు, సూర్యుడున్న నక్షత్రం నుండి చంద్రుడున్న నక్షత్రం వరకు లెక్కిస్తే విషమ సంఖ్య వస్తే ఖర్జూరికా లేక ఏకార్గళ దోషం కలుగుతుంది. ఈ గణనలో అభిజిత్ నక్షత్రాన్ని కూడా తీసుకోవాలి. నారద సంహిత అభిజిత్ ను తీసుకోవడం లేదు.
 


1. విష్కంభం - అశ్విని
2. అతిగండం - అనురాధ
3. శూల – మృగశిర
4. గండ – మూల
5. వ్యాఘాత – పునర్వసు
6. వజ్ర – పుష్యమి
7. వ్యతీపాత – ఆశ్లేష
8. పరిఘ – మఖ
9. వైధృతి - చిత్ర

ఏకార్గళాదోషాన్ని గమనించడానికి ఒక నిలువురేఖ, 13 అడ్డురేఖలు గీస్తే 27 రేఖలున్న పట్టిక తయారవుతుంది. పైన చెప్పిన తొమ్మిది యోగాలు, నక్షత్రాలు వ్రాసి ఏ యోగానికి ఏ నక్షత్రం చెప్పబడిందో ఆ నక్షత్రం నుండి 27 నక్షత్రాలను అపసవ్యంగా వ్రాయాలి. సూర్య చంద్ర నక్షత్రాలు ఒకే రేఖలో ఉంటే ఖర్జూరికా దోషం లేక ఏకార్గాళా దోషం అని తెలుసుకోవాలి.

ఉదాహరణ ప్రకారం వివాహము రోజున అతిగండ యోగం ఉంటే, అనురాధ నుండి ఒక నిలువుగీతను గీయాలి. జ్యేష్టా నక్షత్రం నుండి అప్రదక్షిణంగా విశాఖ వరకు అడ్డ గీతలపై వ్రాసినప్పుడు సూర్యుడు మూల నక్షత్రం, చంద్రుడు స్వాతీ నక్షత్రంలో ఉంటే ఏకార్గాళా దోషంగానిర్ణయించాలి. రవి ఉన్న నక్షత్రం, చంద్రుడున్న నక్షత్రం ఈ క్రమంలో ఒకే రేఖపై ఉంటే ఖర్జూరికా సమాంఘ్రిభ దోషం.

దోష పరిహారం:
'ఏకార్గ లోప గ్రహ పాత లత్తా జామిత్ర కర్తర్యుదయాన దోషాః
నశ్యంతి చంద్రార్క బలోపపన్నే లగ్నే యధార్కాభ్యుదయేంధకారః'

రవి చంద్రులు బలంగా ఉంటే ఏకార్గళ, పాపగ్రహ, పాత, లత్తా, జామిత్ర, కర్తరీ, ఉదాయాస్త దోషాలు సూర్యోదయం వల్ల అంధకారం తొలగినట్లు నశిస్తాయి.

గ్రహణోత్పాతభ దోషం
భూకంపం, ధూమకేతువు, గ్రహణాలు మొదలైన ఉత్పాలుకలిగిన 7 రోజుల వరకు శుభకర్మలు చేయకూడదు. ఏ నక్షత్రంలో ఉత్పాతం జరుగుతుందో ఆ నక్షత్రాన్ని 6 మాసాల వరకు అన్ని రకాల ముహూర్తాలకు వదిలిపెట్టాలి. అర్థగ్రహణమైనా, గ్రస్తాస్తమైన సమయానికి ముందు మూడున్నర రోజులు, తరువాత మూడున్నర రోజులు, పూర్ణ గ్రస్తామైతే ముందు 7 రోజులు, తరువాత 7 రోజులు శుభకార్యాలకు పనికిరాదు. సంపూర్ణ గ్రహణమైన నక్షత్రం 6 నెలలు, అర్థగ్రహణమైన నక్షత్రాన్ని 3 మాసాలు విడవాలి.


క్రూర గ్రహవిద్ధ దోషం
పాపగ్రహాలతో నక్షత్రవేధ కలగడం. నక్షత్రవేధ రెండు రకాలు. 1. పంచశలాక వేధ 2. సప్తశలాక వేధ

పంచశలాక వేధ:  దక్షిణోత్తరాలుగా 5 గీతలు, పూర్వపరాలుగా 5 గీతలు, విదిదిక్కులలో రెండి రేఖలు వ్రాసి, అందులో విదిక్కునందైన ద్వితీయ రేఖయందు కృత్తికా నక్షత్రాన్ని వ్రాసి క్రమంగా రోహిణ్యాది నక్షత్రాలను అభిజిత్ సహితంగా రేఖాగ్రాలలో వ్రాయాలి. అందులో ఏ నక్షత్రంలో గ్రహం ఉంటుందో ఆ రేఖాగ్రంలో ఉండే నక్షత్రాన్ని వేధిస్తుంది. పాపగ్రహవేధ అయితే స్త్రీ పురుషుల ఆయుర్దాయాన్ని హరిస్తుంది. శుభగ్రహవేధ అయితే సుఖాన్ని హరిస్తుంది.

పంచశలాక చక్రం




కృత్తిక – విశాఖ, రోహిణి- అభిజిత్, మృగశిర – ఉత్తరాషాఢ, ఆర్ర్ధ – పూర్వాషాఢ, పునర్వసు - మూల, పుష్యమి- జ్యేష్ట, ఆశ్రేష – ధనిష్ట, మఖ – శ్రవణం, పుబ్బ – అశ్విని, ఉత్తర – రేవతి, హస్త – ఉత్తరాభాద్ర, చిత్త – పూర్వాభాద్ర, స్వాతి - శతభిషం, అనురాధ – భరణి. ఈ 14 జంట నక్షత్రాలు పరస్పరం, వేధ కలిగి ఉంటాయి. అనగా ఈ జంట నక్షత్రాలలో ఏదైనా ఒక నక్షత్రంలో గ్రహం ఉంటే అందులోని రెండవ నక్షత్రానికి ఆ గ్రహం యొక్క వేధ కలుగుతుంది. ఈ జంట నక్షత్రాల్లో గ్రహం ఏదైనా నక్షత్రం యొక్క ప్రథమ పాదంలో ఉంటే, ద్వితీయ నక్షత్రం చతుర్థ పాదంలో ఉంటే రెండో గ్రహం ప్రాతం పాదాన్ని, తృతీయ పాదంలో ఉంటే గ్రహం ద్వితీయ పాదాన్ని వేధ యుక్తంగా చేస్తుంది.

పాపగ్రహ వేధగల నక్షత్రాన్ని శుభకర్మల్లో విడవాలి. పరిశుద్దమైన మరో నక్షత్రం లేకుంటే శుభ గ్రహ వేధిత నక్షత్ర పాదాన్ని విడచి తక్కిన మూడు పాదాల్లో శుభకర్మలు చేయవచ్చు. మరో అభిప్రాయం ప్రకారం క్రూర గ్రహ వేధ అయినా ఆపాదాన్ని తక్కిన పాదాల్లో శుభకర్మలు చేయవచ్చు.

“వధూ ప్రవేశనే దానే వరణే పాణి పీడనే
వేధః పంచశలాకాఖ్యేకన్యత్ర సప్త శలాకకః"

అనడం వల్ల వధూ ప్రవేశానికి, కన్యాదానాది మహాదానాలకు, కన్యావరణకు, పాణి గ్రహణానికి, పంచ శలాక వేధ అవశ్యం విచారణం చేయాలి. ఇతర శుభకర్మలకు సప్త శలాక వేధను విచారణ చేయాలి. కాబట్టి వివాహ యోగ్య నక్షత్రాలైన మూల, రేవతి, హస్త, మఘ, రోహిణి ఉత్తరాత్రయం, మృగశిర, స్వాతి, అనురాధ, అశ్విని, చిత్ర, శ్రవణం, ధనిష్టలలో మరల పంచకలాక వేధ చెప్పబడుచున్నది. మృగశిర – ఉత్తరాషాఢ, భరణి - అనురాధ, రోహిణి - అభిజిత్, మఖ – శ్రవణం, రేవతి - ఉత్తర, పునర్వసు - మూల, శతభిషం - స్వాతి, ఉత్తరాభాద్ర -హస్త, ఈ జంట నక్షత్రాలు పరస్పరం వేధ కలిగిస్తాయి. ఉదా. వివాహ నక్షత్రం మృగశిర అయితే, ఏదేని మరో గ్రహం ఉత్తరాషాఢలో ఉంటే వేధ కలుగుతుంది. ఈ గ్రహం పాపగ్రహమైతే మృగశిరా నక్షత్రం వివాహానికి పనికిరాదు. ఆ గ్రహం శుభగ్రహమైతే ఆ పాదాన్ని వదిలి మిగిలిన పాదాల్లో వివాహం చేయవచ్చు. ఆ గ్రహం ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటే మృగశిర 4వ పాదాన్ని వదిలి 1, 2, 3 పాదాల్లో వివాహం చేయవచ్చు. ఈ విధంగా పాదవేధ విచారణ చేసి మిగిలిన పాదాల్లో వివాహం చేయవచ్చు. ఇదేవిధంగా వివాహ నక్షత్రం ఉత్తరాషాఢ అయి ఒక గ్రహం మృగశిరయందున్నను విచారణ చేయాలి.

సప్తశలాక వేధ: దీనిలో నిలువుగా, అడ్డంగా ఏడు రేఖలు గీసి కృత్తిక మొదలు క్రమంగా అభిజిత్ సహితంగా భరణి వరకు నక్షత్రాలను రేఖాగ్రాలలో వ్రాయాలి.

సప్త శలాక చక్రం:



జ్యేష్ట – పుష్యమి, శతభిషం - స్వాతి, పూర్వాషాఢ – అర్ర్ధ, రేవతి - ఉత్తర, ధనిష్ట – విశాఖ, ఉత్తరాషాఢ – మృగశిర, అశ్విని - పుబ్బ, ఆశ్రేష – అనురాధ, హస్త – ఉత్తరాభాద్ర, రోహిణి - అభిజిత్, మూల – పునర్వసు, చిత్ర – పూర్వాభాద్ర, భరణి - మఖ, కృత్తిక – శ్రవణం... ఈ జంట నక్షత్రాలు పరస్పరం సప్తశలాక వేధ పరిశీలన అవసరం.

పాప, గ్రహ, వేధతో కూడిన నక్షత్రం, పాపగ్రహమున్న నక్షత్రాన్ని విడిచిపెట్టాలి. సప్త శలాక వేధ నక్షత్రంలో వివాహం చేస్తే స్త్రీ వైధవ్యాన్ని పొందుతుంది.

దోషాపవాదం:
1. లగ్నాధిపతి లగ్నానికి ఏకాదశంలో ఉన్నా, 
2. చంద్రుడు తప్ప ఇతర శుభ గ్రహాలు (బుధ, గురు, శుక్ర) లగ్నంలో ఉన్నా,
3. చంద్రుడు శుభగ్రహాలతో చూడబడినా,
4. శుభగ్రహ సంబంధమైన హోర అయినా ఈ వేధా దోషం పరిహారం అవుతుంది.

క్రూర సంయుత దోషం
రవి ఉన్న నక్షత్రం, దాని ముందు నక్షత్రం, తరువాత నక్షత్రం శుభకర్మలకు దూషితాలు. పాపగ్రహంతో కూడిన నక్షత్రాన్ని జ్వలితమనీ, పాపగ్రహం అధిష్టించిన నక్షత్రానికి ముందున్న నక్షత్రాన్ని భూమితమనీ, పాప గ్రహం అధిష్టించిన నక్షత్రానికి తరువాతి నక్షత్రం దగ్ధమని కాలామృతాది గ్రంథాల్లో చెప్పబడింది. ఈ నక్షత్రాలు వివాహాది శుభకర్మలకు దూషితాలు.

అకాల అర్జిత వృష్టి దోషం
ఆకాలంలో వర్షం, ఉరుములు సంభవించిన రోజును శుభకర్మల్లో విడిచిపెట్టాలి.

మహాపాత దోషం
మహాపాత రెండు విధాలు: 1. వ్యతీపాత మహాపాత, 2. వైధృతి మహాపాత. క్రాంతి సామ్యాన్ని బట్టి మహాపాతదోషం సంభవిస్తుంది. రవి చంద్రుల స్పష్టక్రాంతులు సమంగా ప్రాప్తించునప్పుడు క్రాంతి సామ్యంగా పిలువబడుతుంది. ఇది గణిత సాధ్యం. సామాన్య క్రాంతి సామ్యం రవిచంద్రుల విశిష్ట రాశి స్థితిని బట్టి గ్రహించవచ్చు రవి చంద్రులు ఒకే ఆయనంలో ఉన్నప్పుడు, రవి చంద్రులున్న రాశుల మొత్తం సంఖ్య 12 అయితే వైధృతి మహాపాత.

ఉదా: వృషభ మకారాలు, మిథున ధనుస్సులు, కర్కాటక వృశ్చికాలు, సింహతులలు, మేషకుంభాలు. రవి చంద్రుడు భిన్న ఆయనాల్లో ఉన్నప్పుడు రాశుల మొత్తం సంఖ్య 6 అయితే వ్యతీపాత. ఉదా: మేష సింహాలు, వృషభ కన్యలు మొదలగునవి.

“క్రాంతే సౌమ్యం నో శుభం మంగళేషు, యస్మిన్ దినే మహాపాతం, తద్దినం వర్జయేత్ శుభే" అనే వాక్యం వల్ల మహాపాత దోషం శుభకార్యాలకు నింద్యం. గణితాగత క్రాంతి సామ్యం నింద్యం.సామాన్య క్రాంతి సామ్యం మధ్యమ ఫలం.


వైధృతి వ్యతీపాత దోషాలు
విష్కంభాది 27 యోగాలలో 9 దుష్ట యోగాలున్న రోజుల్లో శుభకార్య క్రమాలకు పనికిరాదు.

ఈ విధంగా ఏకవింశతి మహాదోషాలను వివాహాది శుభకార్యాలకు విచారణ చేసి, 'దోషాస్స్వల్పం గుణాధిక్యము' భావనతో దోషాలను గమనించి, ఉన్నంతలో గుణయుతమైనదాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. సంపూర్ణ దోషరహితమైన ముహూర్త నిర్ణయం బ్రహ్మకైనా సాధ్యం కాదు కాబట్టి అధిక గుణాలు, స్వల్ప దోదాలున్న ముహూర్తాన్ని దైవజ్ఞులు విచారణ చేసి నిర్ణయించాలి.

దశవిధ దోషాలు
వివాహానికి ముఖ్యంగా ఈ క్రింది దశవిధ దోషాలను విచారణ చేయాలని ఉంది.

“వేధః వాతోయుతిః క్రాంతి ర్లతైకార్గళ పంచకమ్
దగ్దోప గ్రహ జామిత్రం దోషా స్త్యాజ్యా ఇమే దశా"

అనగా 1. వేధ 2. పాత, 3. యుతి, 4. క్రాంతి, 5. లత్త, 6. ఏకార్గళ, 7. పంచక, 8. దగ్ధతిథి, 9. ఉపగ్రహ, 10. జామ్రిత – ఈ పది దోషాల్లో వేధ, యుతి, క్రాంతి, ఏకార్గళ, దగ్ధ, పంచక దోషాలు ఏకవింశతి దోషాల్లో పరిశీలించబడినాయి.


పాత దోషం
పాత దోషానికి 'చండాయుధ' దోషమని నామాంతరమున్నది. అనగా శూల, హర్షణ, సాధ్య, వైధృతి, వ్యతీపాత, గండ, అనే ఆరు యోగాల చివరల్లో ఆ రోజు నక్షత్రం ఉంటే 'పాత' అనే చండా యుధ దోషం కలుగుతుంది. నారద వశిష్టాదుల ననుసరించి వేరే విధంగా విచారణ చేయబడుతుంది. సూర్యుడున్న నక్షత్రం నుండి ఆశ్లేష, మఖ, అనురాధ, చిత్ర, శ్రవణం, రేవతి నక్షత్రాల వరకు లెక్కిస్తే యే సంఖ్యలు వస్తాయో అవే సంఖ్యలు అశ్విని నుండి చంద్ర నక్షత్రం వరకు లెక్కించగా వస్తే దూషితాలు.

ఉదా: సూర్యుడు స్వాతీ నక్షత్రంలో ఉంటే స్వాతి నుండి ఆశ్లేష, మఖ, అనురాధ, చిత్ర, శ్రవణం, రేవతి వరకు లెక్కిస్తే వరుసగా 22, 23, 3, 27, 8, 13 సంఖ్యలు వస్తాయి. అశ్విని నుండి దిన నక్షత్రం వరకు పై సంఖ్యలను లెక్కిస్తే వచ్చే శ్రవణం, ధనిష్ట, కృత్తిక, రేవతి, పుష్యమి, హస్త, పాత దూషితాలు

లత్తా దోషం
బుధుడున్న నక్షత్రం నుండి వెనుకటి 7 వ నక్షత్ర, రాహువున్న నక్షత్రం నుండి క్రమంగా 9వ నక్షత్రం పూర్ణచంద్రుడున్న నక్షత్రం వెనుక 22 నక్షత్రం, శుక్రుడున్న నక్షత్రం నుండి వెనుక 5 వ నక్షత్రం, సూర్యుడున్న నక్షత్రం నుండి క్రమంగా 12వ నక్షత్రం, శని ఉన్న నక్షత్రం నుండి క్రమంగా 8వ నక్షత్రం, గురుడున్న నక్షత్రం నుండి క్రమంగా 6 నక్షత్రం. కుజుడున్న నక్షత్రం నుండి 3 వ నక్షత్రం లత్తితమౌతాయి. ఈ లత్తిత నక్షత్రాలు వివాహానికి దూషితాలు.

“రవి లత్తా విత్తహారీ నిత్యం కౌజీ వినిర్దిశేన్మరణమ్
చాంద్రీ నాశం కుర్యాత్ బౌధీ నాశం వదత్యేవ"
“సౌరే మరణం కధయతి బంధు వినాశం బృహస్పతేర్లత్తా
మరణం లత్తా రాహోః కార్య వినాశం భ్రుగోర్వదతి"

సూర్యుని లత్త వల్ల మరణం / విత్తహరణం, గురులత్త వల్ల బంధువినాశం, రాహులత్త మరణాన్ని, లత్త కార్యనాశనాదులను తెలియజేస్తున్నాయి. కాబట్టి ఏగ్రహంతో లత్తితమైనా, ఆ నక్షత్రం లత్తా దూషితం కాబట్టి వదిలివేయడం మంచిది.

ఉపగ్రహదోషం
సూర్య నక్షత్రం నుండి 5, 8, 10, 14, 7, 19, 15, 18, 21, 22, 23, 24, 25 వ నక్షత్రాలు చంద్రుడుంటే ఉపగ్రహ దోషం.

ఈ దోషాన్ని కురు, కాష్మీర దేశాల్లో తప్ప ఇతర ప్రదేశాల్లో పాటించాల్సిన అవసరం లేదు

దోషాపవాదాలు: పాత. ఉపగ్రహ, లత్తా దోషాలను సంపూర్ణ నక్షత్రాల్లో పాటించాల్సిన అవసరం లేదు. ఏ పాదాలు దూషితాలవుతాయో ఆ పాదాలను వదిలి తక్కిన పాదాలలో వివాహాది శుభకర్మలు చేయవచ్చు. మరో అభిప్రాయం ప్రకారం లత్తా దోషాన్ని మాళవ దేశంలో, పాత దోషాన్ని కోసల దేశంలో ఏకార్గళా దోషాన్ని కాశ్మీరదేశంలో మాత్రమే పాటించవలసి ఉంటుంది. ఇతర ప్రాంతాలవారికి అవసరం లేదు.


జామిత్ర దోషం
వివాహ ముహూర్త లగ్నానికి గాని, చంద్రునికి గాని సప్తమి స్థానంలో గ్రహముంటే జామిత్ర దోషం వివాహానికి ముఖ్యంగా జామిత్ర శుద్ధి ఉండాలి. సప్తమ స్థానం గ్రహవర్జితమై ఉండాలి. కాలామృతానుసార సప్తమంలో రవి ఉంటే వైధవ్యం. చంద్రుడుంటే సపత్నీ వృద్ధి, కుజుడుంటే మరణం, బుదుడుంటే పుత్రహాని గురుడుంటే నాశనం, శుక్రుడుంటే వ్యాధి, శని ఉంటే మరణం. రాహువుంటే బంధనం కలుగుతుంది.

దోషాపవాదం:
1. ఒక శుభగ్రహం శుభ, మిత్ర, ఉచ్చ, స్వనావాంశలలో గాని. రాశిలో గాని ఉంటే సప్తమ స్థానాన్ని పూర్ణదృష్టితో చూస్తే జామిత్ర దోషం పరిహారం అవుతుంది.
2. రవి లగ్నానికి గాని, చంద్రునికి గాని 3, 6, 11 స్థానాల్లో ఉన్నా
3. శుభగ్రహం 10, 4, 1, 5, 9స్థానాల్లో ఉండి చంద్రుని పూర్ణ దృష్టితో చూస్తే జామిత్ర దోష భంగం అవుతుంది.
4. చంద్రుడు స్వోచ్చలో గాని, స్వక్షేత్రంలో గాని, మిత్రక్షేత్రంలో గాని, శుభవర్గుల్లో గాని ఉంటే జామిత్ర దోషం ఉండదు.


ముగింపు
ఏకవింశతి మహాదోషాలను తెలుసుకోవడం ద్వారా అన్నీ లేని ముహూర్తాలు నిర్ణయించగలమని కాదు కాని, సాధ్యమైనంత వరకు మంచి ముహూర్త నిర్ణయం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేరు వేరు అంశాల్లో లోపాల నివారణను తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీని అధ్యయనం ద్వారా సరియైనది.

ముహూర్త నిర్ణయంలో ఎన్నో జాగ్రత్తలు అవసరమౌతాయి. వేరు వేరు తిథి, నక్షత్ర, వారాదులు కలయికల వల్ల వైవిధ్యమైన ఫలితాలుంటాయి. యోగామంటే కలయిక కావడం వల్ల వీనినే సుయోగాలు, దుర్యోగాలు అనే పేర్లతో సూచించడం జరిగింది. వీటన్నింటి ఉద్దేశం మంచి సమయంలో కార్యక్రమాలను నిర్వహించుకోవాలనే. అయితే అన్ని విధాలుగా దోషం లేని ముహూర్తం మనకు లభించక పోయినప్పటికీ తక్కువ దోషాలు, ఎక్కువ గుణాలు కలిగిన ముహూర్తాన్ని ఎంచుకోవడం అవసరం. దానికోసం ప్రత్యేకాంశాలను వేరు వేరు గ్రంథాల ద్వారా పరిచయం చేసుకుంటూ, సాధ్యమైనంత పరిధిలో ఉత్తమ ముహూర్తాన్ని నిర్ణయించాలి. ఆ ప్రయోజనం నెరవేర్చడంలో ఈ పాఠం కొంతవరకు వినియోగపడుతుంది.





9 కామెంట్‌లు:

  1. శతకోటి ధన్యవాదాలు. చాలా చక్కని explanation

    రిప్లయితొలగించండి
  2. మీలాంటి మహానుభావులు ఉన్నందున ఇంకా జ్యోతిష్యం గురించి అందరికీ తెలుస్తుంది

    రిప్లయితొలగించండి
  3. మంచి విషయాలు తెలిపారు

    రిప్లయితొలగించండి
  4. oka chinna contaduction..7 lo gurudu undaradu ani oka daggara, unte manchidi ani inko daggara rasi unnaru

    రిప్లయితొలగించండి
  5. మా లాంటి సామాన్యులకు ఈ విషయం సులభగ్రాహ్యంగాలేదు. మీ వివరణలో ఏలోపమూ లేదు. కొంతవరకు అర్థమయ్యింది ఆర్యా!💐🙏🙏

    రిప్లయితొలగించండి
  6. చాలా అత్యంత అరుదైన అద్భుతంగా వివరించారు గురువు గారు, వివరణ అద్బుతం

    రిప్లయితొలగించండి
  7. గురువుగారు మంచి విషయాలు తెలిపారు. నమస్కారం.

    రిప్లయితొలగించండి

parakrijaya@gmail.com

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...