గణపతి ఏకవింశతి పత్రాలు పూజ విధానం
బ్రహ్మండ, బ్రహ్మవైవర్త, స్కాంద, గణేశ, ముద్దల పురాణాల్లో గణపతి లీలా విలాస వైభవం వర్ణించబడింది.
గణపతి ఏకవింశతి పత్రపూజ కల్పములో విధించబడి, పవింశతి నామములతో కీర్తింప బడుతున్నాడు. పంచభూతము, పంచ తన్మత్రలు, దశేంద్రియములు,మనస్సు అను 21. ఏకవిం శతి తత్త్వముపై గణపతికి అధికారము గలదు. కనుక ఏక వింశతి నామములు వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి ఓం సుముఖా యనమః, మాచీపత్రం పూజాయామి, అని మాచీ పత్రిని,బృహతీపత్రం పూజాయామి అని బృహతీపత్రిని ఇలా 21 పత్రాలతో స్వామి వారిని పూజిస్తే మనకి శారీరకంగా చాలా ఆరోగ్యం కలుగుతుంది
"ఏక వింశతి పత్రి పూజ"
గణేశుని పూజ చేసేటప్పుడు ఒక్కొక్క నామం చదువుతూ ఆయా పత్రిని సమర్పిస్తాము. ఆయా ఆకుల సంస్కృతము మరియు తెలుగు పేర్లు దిగువ పట్టికలో చూడగలరు.
సం. | వినాయకుని నామము | పత్రి పూజయామి | తెలుగు పేరు |
1. | ఓం సుముఖాయ నమః | మాచీ పత్రం పూజయామి | మాచిపత్రి |
2. | ఓం గణాధిపాయ నమః | బృహతీ పత్రం పూజయామి | వాకుడు |
3. | ఓం ఉమాపుత్రాయ నమః | బిల్వ పత్రం పూజయామి | మారేడు |
4. | ఓం గజాననాయ నమః | దూర్వాయుగ్మం పూజయామి | గరిక |
5. | ఓం హరసూనవే నమః | దత్తూర పత్రం పూజయామి | ఉమ్మెత్త |
6. | ఓం లంబోదరాయ నమః | బదరీ పత్రం పూజయామి | రేగు |
7. | ఓం గుహాగ్రజాయ నమః | ఆపామార్గ పత్రం పూజయామి | ఉత్తరేణి |
8. | ఓం గజకర్ణాయ నమః | తులసీ పత్రం పూజయామి | తులసి |
9. | ఓం ఏకదంతాయ నమః | చూత పత్రం పూజయామి | మామిడి |
10. | ఓం వికటాయ నమః | కరవీర పత్రం పూజయామి | ఎర్ర గన్నేరు |
11. | ఓం భిన్నదంతాయ నమః | విష్ణుక్రాంత పత్రం పూజయామి | విష్ణుకాంత |
12. | ఓం వటవే నమః | దాడిమీ పత్రం పూజయామి | దానిమ్మ |
13. | ఓం సర్వేశ్వరాయ నమః | దేవదారు పత్రం పూజయామి | దేవదారు |
14. | ఓం ఫాలచంద్రాయ నమః | మరువక పత్రం పూజయామి | మరువం |
15. | ఓం హేరంబాయ నమః | సింధువార పత్రం పూజయామి | వావిలి |
16. | ఓం శూర్పకర్ణాయ నమః | జాజీ పత్రం పూజయామి | జాజి |
17. | ఓం సురాగ్రజాయ నమః | గండకీ పత్రం పూజయామి | దేవకాంచనం |
18. | ఓం ఇభ వక్త్రాయ నమః | శమీ పత్రం పూజయామి | జమ్మి |
19. | ఓం వినాయకాయ నమః | అశ్వత్థ పత్రం పూజయామి | రావి |
20. | ఓం సురసేవితాయ నమః | అర్జున పత్రం పూజయామి | తెల్ల మద్ది |
21. | ఓం కపిలాయ నమః | ఆర్క పత్రం పూజయామి | జిల్లేడు |
వినాయకుని పూజలో ఉపయోగించే రకరకాల ఆకులలో చాల విశేషమైన ఔషధ గుణాలున్నాయి. అవి నేత్ర సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులకు, చర్మ రోగాలకు, మరి కొన్ని ఇతర వ్యాధులకు మంచి మందుగా పని చేస్తాయి. అంటే కాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. ఈ పత్రిలో గల వృక్ష సంబంధమైన రసాయన పదార్థాలు (phytochemicals), పత్రిని మనం చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరం లోకి శోషణం (absorb) చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వినాయకుని పూజ వలన మనకు విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. అందుకే వినాయకుని పూజ అంటే అందరికీ ఇష్టం.
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకమ్ || ౨ ||
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్ || ౪ ||మూషకోత్తమమారుహ్యదేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్ || ౫ ||యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకమ్ || ౮ ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||
నారదౌవాచ :
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.
ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః .
ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.