శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
17, నవంబర్ 2025, సోమవారం
కృష్ణ అంగారక చతుర్దశి
24, అక్టోబర్ 2025, శుక్రవారం
నాగులచవితి విశిష్టత
21, అక్టోబర్ 2025, మంగళవారం
కార్తీక మాస నియమాలు
6, మే 2025, మంగళవారం
మే నెలలో గ్రహాల మార్పుతో వ్యక్తిగత జాతకాలపై ప్రభావం
30, మే 2024, గురువారం
జూన్ నెలలో పర్వదినాలు -Parvadinalu june
18, అక్టోబర్ 2023, బుధవారం
దసరా 2023
28, అక్టోబర్ 2022, శుక్రవారం
నాగుల చవితి విశిష్టత
దీపావళి తరువాత వెంటనే వచ్చే చక్కటి పండుగ ‘నాగుల చవితి’. నాగుల చవితి నాడు ప్రొద్దున్నే లేచి, మా గ్రామం లో పిల్లలూ పెద్దలు అందరూ వూరి చివర గరువులో ఉన్న పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరు పుట్టకి పూజ చేసి, పాలు, అరటి పళ్ళు, పుట్ట కలుగు లో వేసేవారు. కొందరు కోడి గ్రుడ్లు కూడా వేసే వారు. పుట్ట మన్ను భక్తిగా చెవులకు పెట్టుకునే వాళ్ళం. ఇంటి దగ్గర మా అమ్మగారు, పూజ గది గోడకు చలిమిడి, చిమిలి తో నాగేంద్రులను తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేసేవారు.
కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చును. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసం లోని శుద్ద చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును ‘నాగుల చవితి’, ‘మహా చతుర్ధి’అంటారు. ఈ రోజు పచ్చి చలిమిడి, చిమిలి చేసుకుని, ఆవు పాలు, పూలు, పళ్ళు కూడా తీసుకుని, పాము పుట్ట దగ్గరకు వెళ్లి, నాగదేవతకు దీపారాధన చేసి, పూజ చేసి, పుట్ట కన్నులలో ఆవు పాలు పోసి, చలిమిడి, చిమిలి కూడా వేసి, రెండు మతాబులు, కారపువ్వులు లాంటివి వెలిగించుకుంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు [ ఆచారం ]లేని వారు ఇంట్లోనే పూజా ప్రదేశం లో గోడకి చిమిలి నాగేంద్రుడు, చలిమిడి నాగేంద్రుడు ని పెట్టుకుని, పూజ చేసుకుని, పాలు పోసి, చలిమిడి, చిమిలి, పాలు, పళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. ఇలా గోడ మీద నాగేంద్రుడిని ‘గద్దె నాగన్న’ అని భక్తి తో పిలుచుకుంటారు. సంతానం కోసం ప్రార్ధన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామినే వేడుకోవాలి. ఎందుకంటే వినాయకుడు విఘ్నాధిపతి వలెనే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామియే అని భక్తుల నమ్మకం!
దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!
“పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా!సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా !అనంతాది మహానాగరూపాయ వరదాయచ!తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం!
నాగుల చవితిని భక్తిశ్రద్ధలతో చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి. అంతే కాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కానీ కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్ర వివాహం జరుగుతుందని నమ్ముతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలిగి, ఆరోగ్య వంతులవుతారనీ, చెవి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తొలిగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారనీ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజు పుట్ట మన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు.యోగసాధన ద్వారా కుండలనీశక్తి ని ఆరాధించడమే నాగులచవితి !ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు
ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే!🙏🌼🌿
🌿🌼🙏కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా. పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం. తైత్తిరీయసంహిత నాగపూజావిధానాన్ని వివరించింది. వేపచెట్టు / రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం🙏🌼🌿
🌿🌼🙏నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము(కుండలనీశక్తి) కామోధ్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు, అనేది ఈ నాగులచవితిలోని అంతర్ అర్ధం. కార్తీకమాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం🙏🌼🌿
🌿🌼🙏నవ నాగ స్తోత్రం🙏🌼🌿
అనంతం వాసుకిం శేష
పద్మనాభంచ కంబలం
శంఖుపాలం ధృతరాష్ట్రంచ
తక్షకం కాళీయం తథా
ఫలశ్రుతి
ఏతాని నవ నామాని నాగానాంచ మాహాత్మనాం
సాయంకాలే పఠనేనిత్యం ప్రాతః కాలే విశేషతః
తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్|
సర్పసూక్తం - సుబ్రహ్మణ్య సూక్తం
@teluguastrology
తైత్తిరీయ సంహితా - ౪.౨.౮
ఋగ్వేదము
నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను | యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః | యే ౭ దో రోచసే దివో యే వా సూర్యస్య రశ్మిషు | యేషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః | యా ఇషవో యాతుధానానాం యే వా వనస్పతీగ్ంరను | యే వా ౭ పటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః ||
ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టం | ఆశ్రేషా యేషామనుయంతి చేతః | యే అంతరిక్షం పృథివీం క్షియంతి | తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః | యే రోచసే సూర్యస్స్యాపి సర్పాః | యే దివం దేవీమనుసంచరంతి | యేషామాశ్రేషా అనుయంతి కామం | తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జుహోమి ||
నిఘృష్వైరసమాయుతైః | కాలైర్హరిత్వమాపన్నైః | ఇంద్రాయాహి సహస్రయుక్ | అగ్నిర్విభ్రాష్టివసనః | వాయుశ్చేతసికద్రుకః | సంవథ్సరో విషూవర్ణైః | నిత్యాస్తే ౭ నుచరాస్తవ | సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం ||
🌿🌼🙏 ఇతి సర్ప సూక్తం 🙏🌼🌿
భుజంగేషాయ విద్మహే
క్షక్షు శివాయ ధీమహి
తన్నో సర్ప ప్రచోదయాత్!
వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలని, అందరికీ ఆ భగవంతుని అనుగ్రహము కలగాలని ఆకాంక్షిస్తూ ...
https://www.facebook.com/teluguastrology
ఓం నమో భగవతే నాగరాజాయ
29, ఆగస్టు 2022, సోమవారం
ఏకవింశతి పత్రాలు పూజ విధానం
గణపతి ఏకవింశతి పత్రాలు పూజ విధానం
బ్రహ్మండ, బ్రహ్మవైవర్త, స్కాంద, గణేశ, ముద్దల పురాణాల్లో గణపతి లీలా విలాస వైభవం వర్ణించబడింది.
గణపతి ఏకవింశతి పత్రపూజ కల్పములో విధించబడి, పవింశతి నామములతో కీర్తింప బడుతున్నాడు. పంచభూతము, పంచ తన్మత్రలు, దశేంద్రియములు,మనస్సు అను 21. ఏకవిం శతి తత్త్వముపై గణపతికి అధికారము గలదు. కనుక ఏక వింశతి నామములు వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి ఓం సుముఖా యనమః, మాచీపత్రం పూజాయామి, అని మాచీ పత్రిని,బృహతీపత్రం పూజాయామి అని బృహతీపత్రిని ఇలా 21 పత్రాలతో స్వామి వారిని పూజిస్తే మనకి శారీరకంగా చాలా ఆరోగ్యం కలుగుతుంది
"ఏక వింశతి పత్రి పూజ"
గణేశుని పూజ చేసేటప్పుడు ఒక్కొక్క నామం చదువుతూ ఆయా పత్రిని సమర్పిస్తాము. ఆయా ఆకుల సంస్కృతము మరియు తెలుగు పేర్లు దిగువ పట్టికలో చూడగలరు.
| సం. | వినాయకుని నామము | పత్రి పూజయామి | తెలుగు పేరు |
| 1. | ఓం సుముఖాయ నమః | మాచీ పత్రం పూజయామి | మాచిపత్రి |
| 2. | ఓం గణాధిపాయ నమః | బృహతీ పత్రం పూజయామి | వాకుడు |
| 3. | ఓం ఉమాపుత్రాయ నమః | బిల్వ పత్రం పూజయామి | మారేడు |
| 4. | ఓం గజాననాయ నమః | దూర్వాయుగ్మం పూజయామి | గరిక |
| 5. | ఓం హరసూనవే నమః | దత్తూర పత్రం పూజయామి | ఉమ్మెత్త |
| 6. | ఓం లంబోదరాయ నమః | బదరీ పత్రం పూజయామి | రేగు |
| 7. | ఓం గుహాగ్రజాయ నమః | ఆపామార్గ పత్రం పూజయామి | ఉత్తరేణి |
| 8. | ఓం గజకర్ణాయ నమః | తులసీ పత్రం పూజయామి | తులసి |
| 9. | ఓం ఏకదంతాయ నమః | చూత పత్రం పూజయామి | మామిడి |
| 10. | ఓం వికటాయ నమః | కరవీర పత్రం పూజయామి | ఎర్ర గన్నేరు |
| 11. | ఓం భిన్నదంతాయ నమః | విష్ణుక్రాంత పత్రం పూజయామి | విష్ణుకాంత |
| 12. | ఓం వటవే నమః | దాడిమీ పత్రం పూజయామి | దానిమ్మ |
| 13. | ఓం సర్వేశ్వరాయ నమః | దేవదారు పత్రం పూజయామి | దేవదారు |
| 14. | ఓం ఫాలచంద్రాయ నమః | మరువక పత్రం పూజయామి | మరువం |
| 15. | ఓం హేరంబాయ నమః | సింధువార పత్రం పూజయామి | వావిలి |
| 16. | ఓం శూర్పకర్ణాయ నమః | జాజీ పత్రం పూజయామి | జాజి |
| 17. | ఓం సురాగ్రజాయ నమః | గండకీ పత్రం పూజయామి | దేవకాంచనం |
| 18. | ఓం ఇభ వక్త్రాయ నమః | శమీ పత్రం పూజయామి | జమ్మి |
| 19. | ఓం వినాయకాయ నమః | అశ్వత్థ పత్రం పూజయామి | రావి |
| 20. | ఓం సురసేవితాయ నమః | అర్జున పత్రం పూజయామి | తెల్ల మద్ది |
| 21. | ఓం కపిలాయ నమః | ఆర్క పత్రం పూజయామి | జిల్లేడు |
వినాయకుని పూజలో ఉపయోగించే రకరకాల ఆకులలో చాల విశేషమైన ఔషధ గుణాలున్నాయి. అవి నేత్ర సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులకు, చర్మ రోగాలకు, మరి కొన్ని ఇతర వ్యాధులకు మంచి మందుగా పని చేస్తాయి. అంటే కాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. ఈ పత్రిలో గల వృక్ష సంబంధమైన రసాయన పదార్థాలు (phytochemicals), పత్రిని మనం చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరం లోకి శోషణం (absorb) చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వినాయకుని పూజ వలన మనకు విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. అందుకే వినాయకుని పూజ అంటే అందరికీ ఇష్టం.

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకమ్ || ౨ ||
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్ || ౪ ||మూషకోత్తమమారుహ్యదేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్ || ౫ ||యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకమ్ || ౮ ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||

నారదౌవాచ :
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.
ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః .
ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.
9, జులై 2022, శనివారం
మేధాదక్షిణామూర్తి - Medha Dakshinamurthy
27, మే 2022, శుక్రవారం
Shani Trayodashi - శని త్రయోదశి
Shani Trayodashi : రేపు శని త్రయోదశి… ఈ వస్తువులు దానం చేస్తే అంతా శుభమే!
17, మే 2022, మంగళవారం
గ్రహవిచికిత్స
గ్రహాల ద్వారా కలిగే అనారోగ్యాల నివారణ ...
గ్రహాల దుష్టకిరణాల ద్వారా వ్యక్తిలో ఏర్పడే శారీరక, మానసిక రుగ్మతలకు గ్రహాల మంచి కిరణాల ద్వారా వృద్ధి చెందిన వృక్ష జాతులు ఔషధాలవుతాయి పరాక్రి జ్యోతిర్వైద్య సిద్ధాంతం.
Copyright content © parakrijaya
వ్యక్తి తగిన ఆహారాన్ని తీసుకోవాలి అని భగవద్గీత వచనం. ఆయుర్వేద సిద్ధాంతం జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయం ఉపనిషోద్ఘోష. .ఈ తగిన అనే పదం చాలా విలువ కలిగి ఉంది. వేదాంతపరంగా మితమైన సాత్వికాహారం ఆయుర్వేదపరంగా వ్యక్తి శరీరానికి తగిన పౌష్టికాహారం అనే అర్థాలు చెప్పినా జ్యోతిర్వైద్యపరంగా వ్యక్తి దశకు గ్రహమిచ్చిన లోపాన్ని పూరించే ఆహారమని చెప్పాల్సి ఉంది. ఈ కోణంలో ఆలోచన చేసినప్పుడు జ్యోతిర్వైద్యం ఆయుర్వేదం కంటే భిన్నమైన సమగ్రతను, ప్రత్యేకతను నిలుపుకుంటోంది.
‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది. ఉదయాన సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఉదయకాలపు నడక ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు. సూర్యుని కాంతిని ప్రత్యేక అద్దం ద్వారా అనారోగ్య ప్రదేశంలో ప్రసరింపజేసి ఆనారోగ్యాన్ని నివారించే పద్ధతిని రష్యన్ శాస్తవ్రేత్తలు నిరూపించారు. వేర్వేరు రోగాలకు వేర్వేరు రంగుటద్దాల ద్వా రా సూర్యకాంతిని ప్రసరింపజేసి అనారోగ్యాలను నివారింపచేసే కలర్ థెరపీ ప్రసిద్ధి చెందుతోంది. రవికి సంబంధించిన ధాన్యం, గో ధుమలు, గోధుమ పాలు, గోధుమ గడ్డి రసం పలువిధాలైన అనారోగ్యాలను నివారిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు వక్కాణించారు. ఇలా రవి లక్షణాలు గల పదార్ధా లు రవి ప్రభావం వలన జనించిన రోగాలన్నీ నయం చేస్తున్నాయి.
కాల్షియంకు ము త్యపు చిప్పలకు, ముత్యాలకు, మంచి గంధానికి, లవణానికి అధిపతి చంద్రుడు. మనస్సు కు చంద్రుడు అది దేవత. రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. శరీరంలోని కాల్షి యం లోపించినపుడు ముత్యపు భస్మం ముందుగా తీసుకోవాలంటుంది ఆయుర్వేదం. పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది. ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉం ది. ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్) ముం దుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తోం ది. మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇ స్తుంది. వెన్నెల ఆ లక్షణం కలదే. ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని జ్యోతిశ్వాస్త్ర సాంప్రదాయం.
ఎర్ర రక్త కణాలకు, రక్త చందనానికి, ఎముకలలోని మజ్జ కు, తుప్పుగల ఇనుముకు, వ్రణాలకు, దెబ్బ సెప్టిక్ అవ్వడానికి, బెల్లంలోని ఐరన్‌కు అధిపతి కుజుడే.కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద తుపపుపై సూర్యకాంతి పడటమే. శరీరంలో ఐరన్ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్ అవుతుంది. బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుం ది. ఎములలో ని మజ్జలో పగ డం కలిసిపోతుందని ఫ్రాన్స్ వైజ్ఞానికుల అభిప్రాయం. పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. అతనికి ధాన్యమైన కందిపప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే.ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్ శాస్తజ్ఞ్రుల కృషి ఫలితం.
బుధుడు నరాలకు సంబం ధించిన గ్రహం. అతని రాశులు మిథున, కన్యలు. ధాన్యం పెస లు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. బుధుడు వ్యాపారస్థుడు. అతని రంగు ఆకుపచ్చ. ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రా యం. పెసల రంగూ ఆకుపచ్చేనని, అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం. బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. అది లోపించడం బుద్ధి మాంద్యం. పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.
గురుడు పసుపుకు, పంచదారకు, షుగర్ వ్యాధికి, శనగలకు సంబంధించిన గ్రహం. పంచదారను జీర్ణించుకుంటే షుగర్ వ్యాధి రాదు. అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్ప డే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి. గురుడు మేధావి. మేధావులు ఆలోచనలు చేస్తారు. వ్యాయామం చేయరు. ఆ రెండు లక్షణాలే షుగర్ వ్యాధిని పుట్టిస్తాయి. పసుపు షుగర్ వ్యాధి తగ్గిస్తుందని, వ్యాయామం షుగర్ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది.చంద్రుడిచ్చే జబ్బులకు శనిచ్చే వాతానికి పసుపు మంచి మందు. టి.బి.కి కూడా చం ద్రుడే అధిపతి. దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది.
శుక్రుడు సౌందర్యానికీ, నిమ్మపండుకు, తేనెకు, చింతపండుకు, చర్మానికి అధిపతి. సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. అది పుష్పాల నుండే వస్తుంది. పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు.
శని- వాత లక్షణం కలవాడు.చర్మం లోని మాలిన్యాలను వెలువరించే శక్తికి ఇతడు అధిపతి. నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతే. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. వాతం అంటే వాయు దోషమే కదా! మాలిన్యాలను వెలువరించే లక్షణం, ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది. నువ్వుల నూనె శరీరానికి పట్టించి అభ్యంగనం చేస్తే రోమకూపాలు శక్తివంతమై చర్మంలోని మాలిన్యాలను తొలగిస్తాయి.
ఇలా గ్రహాలకు చెందిన లేదా పొంత ఉన్న వస్తువులు గ్రహాల వల్ల కలిగే అనారోగ్యాలను తొలగిస్తున్నాయి. విశేషించి ఆయా గ్రహాలు ఉచ్ఛ స్వక్షేత్రాదులలో బలంగా ఉన్నప్పుడు ఆయా పంటలు ఎ క్కువగా పండి దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి. . సప్త గ్ర హాల సామ్రాజ్యాన్ని అర్థం చేసుకుంటే ఆనం ద సామ్రాజ్యాన్ని, ఆరోగ్య సా మ్రాజ్యాన్ని మ నమేలుకోవచ్చు. మనవారి మేలు కోరవచ్చు.
Copyright content © parakrijaya




















