శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com
పంచాంగ విషయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పంచాంగ విషయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, ఆగస్టు 2013, గురువారం

శకున ఫలితములు

శకున ఫలితములు- తేనెపట్టు,అరటిగెల, మొండిచేయి - దిశాఫలితాలు

తేనెపట్టు :
తూర్పున యజమానికి ధనలాభం, ఆగ్నేయమున అగ్నిభయం, దక్షిణమున మరణము, నైఋతి ధాన్య నాశనము, పడమర మనోపీడ, వాయువ్యం ధననష్టం, ఉత్తరం పుత్రలాభం, ఈశాన్యం బంధుమిత్రలాభం.

అరటిగెల :

తూర్పు శుభం; ఆగ్నేయం శతృవృద్ధి, దక్షిణం బంధుమిత్ర నాశనం, నైఋతి పుత్రలాభం, పడమర విపత్తు, వాయువ్యం నేత్రహాని, ఉత్తరం ఐశ్వర్యం, ఈశాన్యం కీర్తిలాభం

మొండిచేయ్యి :

తూర్పు యజమానికి, నైఋతి పుత్రులకు, వాయువ్యం పశువులకు, ఉత్తరం, ఈశాన్యం భార్యకు కీడు, ఆగ్నేయం అగ్నిభయం, పడమర మరణం కలుగును.

పుట్టు మచ్చల ఫలితములు

ముక్కుమీద - కోపము, వ్యాపార దక్షత
కుడికన్ను - అనుకూల దాంపత్యము
ఎడమకన్ను - స్వార్జిత ధనార్జన
నుదిటి మీద - మేధావి, ధన వంతులు
గడ్డము - విశేష ధన యోగము
కంఠము -ఆకస్మిక ధన లాభం
మెడమీద - భార్యద్వారా ధనయోగం
మోచేయి - వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి
కుడిచేయి మణికట్టునందు- విశేష బంగారు ఆభరణములు ధరించుట
పొట్టమీద -భోజనప్రియులు
పొట్టక్రింద - అనారోగ్యం
కుడి భుజం - త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు
బొడ్డులోపల - ధనలాభములు
కుడితొడ - ధనవంతులు
ఎడమతొడ - సంభోగం
చేతి బ్రొటన వ్రేలు - స్వతంత్ర విద్య, వ్యాపారం
కుడి చేయి చూపుడు వ్రేలు - ధనలాభము, కీర్తి
పాదముల మీద - ప్రయాణములు
మర్మస్థానం - కష్ట సుఖములు సమానం.

బల్లి పడుట వలన కలుగు శుభాశుభములు

పురుషులకు

తలమీదకలహం
పాదముల వెనక ప్రయాణము
కాలివ్రేళ్లు రోగపీడ
పాదములపై కష్టము
మీసముపై కష్టము
తొడలపై వస్త్రనాశనము
ఎడమ భుజము అగౌరవము
కుడి భుజము కష్టము
వ్రేళ్ళపై స్నేహితులరాక
మోచేయి ధనహాని
మణికట్టునందు అలంకారప్రాప్తి
చేతియందు ధననష్టం
ఎడమ మూపు రాజభయం
నోటియందు రోగప్రాప్తి
రెండు పెదవులపై మృత్యువు
క్రింది పెదవి ధనలాభం
పైపెదవి కలహము
ఎడమచెవిలాభము
కుడిచెవిదుఃఖం
నుదురుబంధుసన్యాసం
కుడికన్నుఅపజయం
ఎడమకన్నుశుభం
ముఖముధనలాభం
బ్రహ్మరంద్రమునమృత్యువు

స్త్రీలకు

తలమీద మరణసంకటం
కొప్పుపై రోగభయం
పిక్కలుబంధుదర్శనం
ఎడమకన్నుభర్తప్రేమ
కుడికన్నుమనోవ్యధ
వక్షమున అత్యంతసుఖము,పుత్రలాభం
కుడి చెవి ధనలాభం
పై పెదవి విరోధములు
క్రిందిపెదవి నూతన వస్తులాభము
రెండుపెదవులు కష్టము
స్తనమునందు అధిక దుఃఖము
వీపుయందుమరణవార్త
గోళ్ళయందుకలహము
చేయుయందు ధననష్టము
కుడిచేయి ధనలాభం
ఎడమచేయి మనోచలనము
వ్రేళ్ళపై భూషణప్రాప్తి
కుడిభుజము కామరతి, సుఖము
బాహువులు రత్నభూషణప్రాప్తి
తొడలు వ్యభిచారము,కామము
మోకాళ్ళు బంధనము
చీలమండలు కష్టము
కుడికాలు శత్రునాశనము
కాలివ్రేళ్ళు పుత్రలాభం

రసజ్వలా విషయములు

రసజ్వలకు నక్షత్ర ఫలములు

అశ్వని: భోగభాగ్యములు పొందును. మొదటి సంతానం నష్టం. భరణి :అనారోగ్యము, భీతి, అల్పాయువు. కృత్తిక: కష్టనష్టములు అల్పసంతానం కలది చంచలము. రోహిణి : ధనధాన్యవృద్ధి, పుత్ర సంతావంతురాలు. మృగశిర : సుఖసౌఖ్యాదులు, దైవభక్తి కలది, యోగ్యురాలు. ఆర్ద్ర : నీతినియమములు లేనిది, దురదృష్టవంతురాలు. పునర్వసు : స్వగృహమును విడిచిపెట్టునది. పుష్యమి : పతిభక్తి గలది, సంతానం కలది యోగ్యురాలు. ఆశ్రేష : దుష్టసంతానం కలది పతి సౌఖ్యము తక్కువ కలిగినది. మఘ : తండ్రి యింటి వద్ద ఉండునది, భర్తకు కష్టం తెచ్చునది. పుబ్బ : గర్భస్రావం కలది దీనురాలు అనారోగ్యం కలది. ఉత్తర : సంతానం కలది. మంచిసౌఖ్యముగలది. హస్త : మంచిపుత్రికలు కలది. బందువులను ఆదరించునది. చిత్త : పతిభక్తిగలది. లలితకళల యందు ఆశక్తికలది. స్వాతి : పుత్రసంతానంగలది, పతివ్రత, భోగి. విశాఖ : ధనధాన్యములు లది విలాసవమ్తురాలు, భోగి. అనూరాధ : పుత్రసంతానంకలది పవిత్రురాలు. జ్యేష్ఠ : దుష్ఠ ప్రవర్తనకలది. పతినిపోగొట్టుకొనునది. మూల : పుణ్యక్షేత్రసంచారి, ధర్మంచేయుట యదిష్టతకలది. పూర్వాషాడ : వైధ్యవ్యము పొందునది. హంతకురాలు అగును. ఉతరాషాడ : పుణ్యకార్యములు చేయునది. సంపదలు గలది, భోగి శ్రవణం : దీర్ఘాయుర్దాయం కలది. పుత్రసంతానం కలది. ధనిష్ఠ : ధనధాన్యములు స్త్రీ సంతానం కలది. శతబిషం : సుఖ సౌఖ్యములు, ధన వృద్ధి కలది. పూర్వాభాద్ర : మూర్ఖత్వము కలది. అనారోగ్యము గల భర్త కలది. ఉత్తరాభాద్ర : జ్ఞానము కలది. బంధువర్గము కలది. పవిత్రురాలు. రేవతి : ధనవంతురాలు. పుణ్యకార్యములు చేయునది. మంచిజీవనము చేయునది

శుభస్వప్నములు

ఇష్టదేవతను చూచుట, పుష్పములు, పండ్లు, పశుపు, కుంకుమ, నిధినిక్షేపములు, మంగళకరమగు వస్తువులను చూచుట, పశుపు పచ్చని వనములు మొదలగునవి. గుఱ్ఱములు, ఏనుగులు లేదా పల్లకి మొదలగు వాహనములు ఎక్కినటులయ, తాను ఏదోఒక భాధకు గురైనట్లు, రక్తము చూచినట్లు వేదము చదువుతున్నట్లు, పరస్త్రీని సంభోగించుచున్నట్లు, పాలు పెరుగు పుచ్చుకున్నట్లు, నూత్యన వస్తు, వస్త్ర భూషణములు ధరించినట్లు కలగాంచుట శుభఫలదాయకము.

సుశకునములు

మనఃశ్శాంతి లేని సమయమున ప్రయాణము చేయ రాదు. బ్రాహ్మణులు. అశ్వములు, గజములు, ఫలములు, అన్నము, క్షీరము, గోవు, తెల్ల ఆవులు, పద్మములు, శుభవస్త్రములు, వేశ్యలు, మృదంగాది వాద్యములు, నెమళ్ళు, పాల పక్షి, బద్ధైక పశువు, మాంసము, శుభకార్యము వినుట, పుష్పములు చెరకు, పూర్ణకలశములు, ఛత్రములు, మృత్తిక, కన్య, రత్నములు, తల గుడ్డలు, తెల్లగుడ్డలు, పుత్రసహిత స్త్రీ, అద్దము, రజకులు, మత్స్యములు, నెయ్యి, సింహాసనము, ద్వజము, మేక, తేనె, అస్త్రములు, గోరోచనము, వేదధ్వని, మంగళగానములు యివి ఎదురుగా వచ్చిన సుశకునములని భావించి వెంటనే ప్రయాణము చేయ వలెను.

5, ఆగస్టు 2013, సోమవారం

సంస్కారాలు-- ముహూర్తములు

అక్షరాభ్యాసం : 
  ఉత్తరాయణం శ్రేష్ఠము. హస్త పునర్వసు, స్వాతి, అనూరాధ, అర్ద్ర,రేవతి, అశ్వని, చిత్త, శ్రవణములయందు ఆది మంగళ శని వారములు కాకుండాను చరరాశి లగ్నమందు రిక్తతిధులు షష్ఠి, అష్టమి విడిచి అనధ్యయన దినములు కాకుండ అష్టమ శుద్ది కలిగియుండు లగ్నమునందు అక్షరాభ్యాసం చేయవలెను. కేవలం మధ్యాహ్నం లోపుగా వున్న లగ్నమునందు అక్షరాభ్యాసం చేయ వలెను.

అన్నప్రాసన :

ఆరవమాసం లగాయతు మగపిల్లల విషయంలో సరిమాసములందును, అయిదవ మాసం మొదలు బేసి మాసముల యందు ఆడపిల్లల విషయములో అన్నప్రాసన చేయవలెను. ఆరవనెల ఆరవ రోజు అనేది కుసంస్కారము. అది దుష్టాచారము. అన్నప్రసనతోనే పిల్లల ఆరోగ్యవిషయాలు వుంటాయి. అందువలనే మంచిముహూర్తానికే అన్నప్రసన చేయాలి. అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడం, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్త్రాభాద్ర, రేవతి నక్షత్రములయందు చేయవలెను. ఆది, శని, మంగాళ వారములు నిషేధం. జన్మలగ్నం, అష్టమ లగ్నం కాకుండగను, దశమస్థానం శుద్ధి వున్న లగ్నమున అన్నప్రాసన చేయవలెను.

ఉపనయన కర్తల నిర్ణయం :

"పితైవోపనయే త్పుత్రం తదభావే పితః పితా; తదభావే పితుర్భ్రాతా, తదభావేతు సోదర; తదభావే సగోత్ర సపిండా; తదభావేన నపిండ సగోత్రజా;"
ఉపనయనము చేయుటకు తండ్రి ముఖ్యాధికారి వారులేని యెడల పితామహుడు (తాత) వారు లేని యెడల తండ్రిసోదరుడు (పిన తండ్రి పెద్జతండ్రి) వారు లేని యెడల సోదరుడు, వారు లేని యెడల ముగ్గురు పురుషులలో వున్న జ్ఞాతులు వారు లేనియెడల మేనమామ మొదలగు సపిండులు. వారు లేనిచో దూరపు జ్ఞాతులగు సగోత్రులు ఉపనయనము చేయుటకు అధికారులు వీరిలో ఎవరూ లేనియెడల శ్రాత్రీయుడైన వాని చేత బ్రహ్మోపస్దేశ సంస్కారము పూర్తి చేయవలెను ఉపనయన సంస్కారము చేయువారు తప్పని సరిగా వటువు కంటే పెద్దవారై ఉండాలి.

ఉపనయనం :

గర్భాష్టమంలోను, 11 ,13వ సంవత్సరంలోను కాల ప్రాధాన్యం, కాలతీతం దృష్ట్యా ముహూర్తం బలం లేకపోయినను ఉపనయనం చేయవచ్చును. 16 దాటిన బ్రాహ్మణునికి ఉపనయనం శ్రేష్టం కాదు. 22 దాటిన క్షత్రియులకు 24 దాటిన వైశ్యులకు ఉపనయనం వివాహం కోసమే గానీ సంస్కారం కోసం కాదు.

ఉపనయనమునకు కాలములు :

" వసంతే బ్రాహ్మణ ముపనయిత గ్రేష్మేరాజన్యం శరదివైశ్యం మాఘాధి శుక్రాంతం పంచమాసావా సాధారణా సకలద్విజనాం" అనగా వసంతఋతువు బ్రాహ్మణులకును, గ్రీష్మ ఋతువు క్షత్రియులకును, శరదృతువు వైశ్యులకును ఉపనయనమునకు విశేషము. అయితే వసంతఋతువు అని వాడిన కారణంగాఉత్తరాయణమునందు ఉపనయనము చేయుటకు సంకోచము లేదు. అయితే మాఘాది పంచమాసములు విశేషంగా చెప్పిన కారణంగా మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసములందు ఉపనయనము చేయు విషయమై ఆక్షేపణ అనవసరం. అయితే ప్రత్యేకించి మాఘాది పంచమాసాః అని విధించిన కారణంగా పుష్య మాసం, ఆషాఢ మాసం, ఉత్తరాయణంలో కూడుకున్నవి అయినప్పటికి ఆమాసంలో ఉపనయన వ్రతం చేయరాదు.
తదియ, పంచమి, షష్ఠి, సప్తమి తిధులు విశేషము బుధ, గురు, శుక్ర వారములు విశేషము. అనూరాధ, హస్త, చిత్త, స్వాతి, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి, ఉత్తర, ఉత్త్రాభాద్ర,రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, అశ్వని నక్షత్రములు విశేషములు అష్టమంలోను కేంద్రస్థానములైన 1,4,7,10 స్థానము లందును, పాపగరహములు లేకుండా చూచి ఉపనయనం చేయవలెను. రవి వ్యయం నందు వుండగా ఉపనయనం చేయకూడదు.

ఊయలలో వేయుట :

మంగళ, శని వారములు పనికి రావు. అష్టమి ద్వాదశి, నవమి, అమావాస్య తిధులు పనికిరావు. భారసాల రోజునాయితే ఆరోజు సాయంత్రం వర్జ దుర్ముహర్తములు లేకుండా ఊయలల్లో నూతనముగా శిశువును వుంచవచ్చును. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పుబ్బ, విశాఖ, జ్యేష్ట, పు.షా, పుభా, నక్షత్రములు పనికి రావు.

క్షౌరం + పుట్టు వెంట్రుకలు :

షష్ఠి, అష్టమి, నవమి, చవతి, చతుర్దశి, అమావాస్య, ద్వాదశి, పాడ్యమి తిధులు పనికి రావు. శుక్ర, మంగళ శని వారములు కూడదు. పుష్య, పునర్వసు, రేవతి, హస్త, శ్రవణ, ధనిష్ఠ, మృగశిర, అశ్వని, చిత్ర, శతభిషం, స్వాతి ఇవి ప్రసస్తములు ఉత్తర తూర్పు దిక్కుగా కూర్చొని క్షౌరం చేయించుకోవాలి. నిత్యంలో సోమ, బుధ వార విషయములలో తిధి, నక్షత్రం పట్టింపు లేదు.

గర్భధానం :

అశ్వని, భరణి, ఆశ్రేష, మఘ,మూల, జ్యేష్ఠ, రేవతి నక్షత్రముల పూర్తి నిషేధము. జన్మ, నైధన, తారలు కాకూడదు. ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, మృగశిర, హస్త అనూరాధ,శ్రవణం, ధనిష్టం, శతభిషం, రోహిణి స్వాతీ నక్షత్రములు విశేషములు. రెండు పక్షములలోని షష్ఠి అనధ్యయన దినములు ఏకాదశులు , ఆది మంగళ వారములు సంక్రమణ దినములు శ్రాద్ధ దినములు గర్భదానమునకు నిషేధదినములు వివాహం అయిన 16 రోజులలోపు గర్భదానమునకు ముహూర్తమును చూడనవసరం లేదు అనునది అశాస్త్రీయ విషయము. భార్య భర్తల భవిష్య ఆరోగ్య విషయములో గర్భాధాన ముహూర్తం ముఖ్య భూమిక వహిస్తుంది. వ్రతములు ఆచరించు దినములలో సంగమం నిషేధం.

గర్భిణీపతి ధర్మాలు :

భార్య గర్భవతిగా వున్నప్పుడు "గర్భిణీ వాంఛితం ధర్మం తస్యైదద్యాత్ యధోచితం" భార్య కోరిన ఉచితమైన కోరికలు తీర్చవలెను. విదేశీ ప్రయాణము, చెట్ల నరుకుట, ఏడవ మాసం నుండి క్షౌరము, మైధునము, తీర్ధయాత్ర, శ్రాద్ధ భోజనము, నావప్రయాణము, వాస్తుకర్మలు, ప్రేతకర్మలునిషేధము గర్భిణీపతి స్వపితృకర్మలు చేయవచ్చును.

చెవులు కుట్టుట :

పుట్టిన పన్నెండవ లేదా పదహారవ రోజును లేక ఆరు, ఏడవ, ఎనిమిది నెలలయందైననూ పూర్వాహ్న, మద్యాహ్న కాలములలో సోమ, బుధ, గురు, శుక్ర వారములలో శ్రవణం, అర్ద్ర, హస్త, చిత్త, మృగశిర,రేవతి, ఉత్తర ఉత్తరాషాఢ, ఉత్తరాభాధ్ర, పుష్యమి, పునర్వసు, ధనిష్టయందు కుంభ, వృశ్చిక, సింహ లగ్నములు కాకుండా, అష్టమ శుద్దితో కూడిన లగ్నమునందు చెవులు కుట్టుట శ్రేష్ఠము.  
జలపూజ : బుధ, గురు, శుక్ర, సోమ వారములయందును శ్రవణం పుష్యమి పునర్వసు, మృగశిర, హస్త, మూలా, అనూరాధలలో ఒక నక్షత్రము నందును శుభతిధుల యందును ప్రసవించిన స్త్రీ జలసమీపమునకు వెళ్ళి జలపూజ చేయవలెను. దీనిని ప్రస్తుతం అందరూ ఆచరిస్తూనే వున్నారు. అయితే వీటికి చైత్ర, పుష్య మాసములు, మూఢమి, అధిక మాసములు వర్జ్యములు.

జాతకర్మ :

ప్రసవం అయిన 11 వరోజునుండి బేసి రోజులలో మెదటి నెలలో జాతకర్మ చేయు విషయంలో ఏవిధమైన ముహూర్తం చూడనవసరం లేదని ఆంద్రాలో బాగా ప్రచారంలో ఉన్నది. అష్టమి, చవితి, చతుర్దశి, అమావాస్య, షష్టి వంటి తిధులు కాకుండగను మంగళ, శని వారములు కాకుండగను అశ్వనీ రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి అనూరాధ, ఉషా, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉ.భా, రేవతి ఈ నక్షత్రముల యందు జాతకర్మ ఆచరించ వలెను. జాతకర్మ మధ్యాహ్నం 12.00 లోపల చేయ వలెను.

దత్తతస్వీకారము :

దత్తతునకు దత్తకుని యందు గ్రాహ్య విచారము సోదరులలో ఒకరికి పుత్రులు కలిగినను, ఆ సోదరులందరు పుత్రవంతలు అనబడును. ఇదిమన వచనము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారికి మేనల్లుడును దౌహిత్రుని దత్తత తీసుకొనుట నిషేధము.
సోదర పుత్రులు, దత్త పుత్ర స్వీకార్ధము ముఖ్యులు. వారులేనిచో సవతి సోదరుని పుత్రులు, వారు లేనిచో మేనమామ మేనత్త కులమందు పుట్టిన వారు, వారు లేనిచో స్వగోత్ర పిండులు, గ్రాహ్యులు ఆడపిల్లల కు దత్తత తీసుకొనుట శాస్త్రం కాదు. అయితే దత్తత సమాన వర్ణమునందు జనియించిన వారినే తీసుకోవలెను.
దత్తతకు వెళ్ళిన వారు జనక స్థాన గోత్రమును, దత్తస్థానగోత్రమును విడచి మిగిలిన వారి గోత్రములందు పిల్లలను వివాహము చేసుకోవలెను. వీరి సంతతికి కూడా అదేనియమము. ఈ నియమం అయిదు తరాలవరకని ఏడు తరాల వరకని విభిన్నాభిప్రాయాలున్నాయి.

ధాన్యము నిల్వచేయుటకు :

సాధారణ, ఉగ్ర, ఆర్ద్ర, ఆశ్రేషలను విడచి తక్కిన నక్షత్రముల యందు తుల, మేష, కర్కాటక లగ్నములుగా కాకుండా శుభదినమందు ఆహారము కొరకు ధాన్యము నిల్వచేయుట మంచిది. అట్లుగాక వ్యాపారార్ధము ధాన్యము నిల్వచేయుటకు దృవ, పుష్య, విశాఖ, జ్యేష్ఠ, అశ్వనీ, చర నక్షత్రముల యందు నిల్వచేయుట మంచిది. దిమికా శ్రవన, ధనిష్ఠ, శతభిష, విశాఖ, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, పుష్య, పునర్వసు, స్వాతి, అశ్వనీ, జ్యేష్ఠల యందు ధనధాన్యములు నిల్వవుంచుటకు ప్రశస్తము.

నామకరణం :

జాతకర్మకు వాడు నక్షత్రములు, తిధులు, వారములన్నియు నామకరణమునకు కూడా ఉపయోగించవచ్చును. మగపిల్లలకు సరి సంఖ్య అక్షరములతోను, ఆడపిల్లలకు బేసిసంఖ్య అక్షరములతోను నామకరణం చేయవలెను. నామకరణ జాతకర్మ రెండును మధ్యహనం 12 గం లోపల చేయవలేను లగ్నం నుండి వ్యయస్ధానంలో ఏగ్రహం లేని ముహూర్తం నిర్ణయించవలెను. అలాగే అష్టమ శుద్ది విశేష నామము, దైవసంభంధము మాస సంభంధము వుండునట్లు వచ్చుట మంచిది. అర్ధం లేని పేర్లు పెట్టుట వలన దోషము.

నిష్క్రమణం :

నిష్క్రమణం అనగా శిశువును భూమి మీద యందు కూర్చొండబెట్టుట అనికొందరు - గృహాంతరమునకు గానీ గ్రామాంతరమునకు గానీ అని మరికొందరు చెప్పియున్నారు. శుభతిదులయందు బుధ, గురు, శుక్ర వారముల యందును చేయ వలెను. దీనిని అశ్వనీ, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తరాత్రయం, శ్రవణం, ధనిష్ఠ, శతబిషం, హస్త, అనూరాధ, రేవతి నక్షత్రములు ప్రసస్తములు.

నూతన వస్త్రధారణ :

ఆది, మంగళ, శని వారములు నూతన వస్త్రధారణ చేయ కూడదు. అలాగే షష్టి, ద్వాదశి, నవమి, అమావాస్య తిధులయందు నూతన వస్త్రధారణ పనికి రాదు. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్రలలో నూతన వస్త్ర ధారణ చేయుట మంచిది కాదు. అయితే నిత్యంలో పండుగ రోజులలోనూ వస్త్రధారణ చేయుటకు వర్జ్య దుర్ముహర్తములు లేని సమయంలో చేయ వచ్చును. అంతే కాకుండా నూతనవస్త్రములకు మంగళకరమైన పసుపునకు పెట్టిధరించవలెను.

పశురక్షాముహూర్తం :

అష్టమ శుద్ధితో కూడిన శుభలగ్నము నందును, చరనక్షత్రములందును పశుయోని నక్షత్రములందును పశువులను దొడ్డియందు కట్టి వేయవలెను. మంగళవారం  పశు సంభంధ విషయములుకు మంచిది .

పుంసవనం :

గర్భం నిర్దిష్టంగా తెలిసిన తర్వాత రెండవ మాసంలో కానీ, మూడవ మాసంలో కానీ చేయవలెను. యిది ప్రతి గర్భధారణ యందు గర్భశుద్ది కొరకు చేయుదురు. చవితి, నవమి, చతుర్దశి తిధులు కాకుండాను; సోమ, బుధ, గురు, శుక్ర వారముల యందును; అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుషయమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతీ, అనూరాధ, మూల, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, శతబిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రముల యందు పుంసవన కార్యము చేయవలెను.

పైరుకోయుటకు :

మూల, ఆర్ద్ర, జ్యేష్ఠ, ఆశ్రేష, పూర్వాభద్ర, హస్త, కృత్తిక, ధనిష్ఠ, మృగశిర, స్వాతి, మఘ, ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, భరణి, చిత్త, పుష్యమి, నక్షత్రమందును ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారములందు రిక్తతిధులు కాకుండాను స్థిరలగ్నము లందు పైరు కోయుట మంచిది.

బాలారిష్టములు :

చంద్రాష్టమంచ ధరణీసుత స్సప్తమంచ రాహు ర్నవంచ శని జన్మ గురు స్తృతీయే అర్కస్తు పంచ భృగుషట్క బుధ శ్చతుర్ధే కేతోవ్యయో స్తు బాలారిష్టానాం
చంద్రుడు జన్మలగ్నమునందు ఎనిమిదవ యింట వున్నా, కుజుడు ఏడవ ఇంట వున్నా, రాహువు తొమ్మిదవ ఇంట వున్నా, శని లగ్నములో వున్నా, గురువు తృతీయం లో వున్నా, రవి పంచమంలో వున్నా, శుక్రుడు ఆరవ ఇంట వున్నా, బుధుడు నాల్గవ ఇంటవున్నా కేతువు నాల్గవ ఇంట వున్నా బాలారిష్టములు, ఆయా గ్రహములకు జపధాన హోమములు మొదటి నెలలోనే జరిపించాలి.
జనకాలమునకు అష్టమాధిపతి దశ అయినచో బాలారిష్టము అగును. జన్మ లగ్నములో షష్ఠాధిపతి వున్నా, భాగ్యాధి పతి అష్టమ వ్యయంలో వున్నా, జన్మ లగ్నాత్ చతుర్ధాతి పతి వ్యయంలో వున్నా అరిష్టమే. జనన కాల దశానాధుడు షష్ఠాధిపతి కలసి వున్నా జననకాల దశనాధుడు వ్యయాధిపతిలో వున్నా బాలారిష్టం అగును. కావున వీటికి శాంతి చేయవలెను. జనకాలమునకు షష్ఠాధిపతి దశకానీ అంతర్ధశ కానీ అయినచో ఆరోగ్య ప్రాప్తి అధికంగా వుండును. అష్టమంలో వ్యయాధిపతి వుండి ఆ వ్యయాధిపతి అంతర్దశ కానీ మహాదశకానీ వున్న ఎడల ఆ గ్రహమునకు శాంతి చేయ వలెను.
తల్లి, తండ్రుల, సోదరుల నక్షత్ర జన్మంలో జననం అయినచో ఏకనక్షత్ర జనన శాంతి చేయవలెను. కవలలు పుట్టిన యమళ జనన శాంతి, పేగు మెడలో వేసుకొని పుట్టిన నాళవేష్టన జనన శాంతి, విషఘడియ మరియు దుష్ట తిధి వార నక్షత్రములో పుట్టిన గ్రహణంలో పుట్టిన గోముఖప్రసవ శాంతి చేయవలెను.

బీజావాపనం :

అశ్వని, హస్త, పుష్యమి, చిత్త,రేవతి, మృగశిర, అనూరాధల యందును, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, స్వాతి, మూల, మఘ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషంలందు విత్తనం చల్లిన ఎడల ఫలప్రదము. మంగళవారము, శని వారము, ఆదివారము రిక్తతిధులు, పంచపర్వములు, వర్జ్యఘడియలు, ప్రదోషకాలమును విడచి వృషభ, మిధున, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనుర్మీన లగ్నములందు విత్తనము వేయవలెను. అనగా రవిచే విడువబడు నక్షత్రము మొదలు మూడు నక్షత్రములు హానిని కలుగచేయును. తర్వాత ఎనిమిది వృద్ధిని కలుగచేయును. ఆతర్వాత తొమ్మిది నక్షత్రములు కర్తకు మృత్యువును, ఆ తర్వాత ఏడు నక్షత్రములు లక్ష్మీప్రధమును కలుగచేయును. ఆశ్రేష నక్షత్రమందును సోమవారమందును, చంద్రుడు లగ్నమందు బలవంతుడై వున్నచో చెఱకు, అరటి, పోక చెట్లను వేయవలెను. అశ్వనీ యందు, సూర్యుడు లగ్నమునందుండగా కొబ్బరిచెట్లు పాతించవలెను. బృహస్పతి లగ్నమందును చంద్రుడు లగ్నాంశమందు వుండగా తమలపాకులతోటలు వేయుట మంచిది.

కృషికర్మ :

అనగా మృదు, స్థిర, క్షిప్ర, చర, మూల, మఘ నక్షత్రముల యందు మొదటిసారిగా కృషికర్మ ప్రారంభించవలెను. ఆది మంగళవారములు విడచి చవితి, షష్ఠి, నవమి, చతుర్ధశి తిధులను దగ్ధతిధుల నుండి విడచి మిగిలిన తిధి, వార యోగకరణ దినములందు కృషి కర్మ ప్రారంభించవలెను. కృషి కర్మ మేష, సింహం కుంభ కర్కట, మకర, తుల యందు ప్రారంభించకూడదు. చంద్ర శుక్రులు బలవంతులై వుండాలి లగ్నమందు గురువు వుండగా కృషికర్మలకు యోగ్యము.

వ్యాపారముహూర్త విషయం :

అశ్వని, హస్త, పుష్యమి, చిత్త రేవతి, అనూరాధ, మృగశిర నక్షత్రములు వ్యాపారమునకు రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రములోయందు మంచిది. రిక్తతిధులు, మంగళ వారము విడచి వ్యాపారం ప్రారంభించుట విశేషము.
వ్యాపార నిమిత్తము వస్తువులు కొనుగోలు చేయుటకు అశ్వనీ, స్వాతి, శ్రవణం, చిత్త, శతభిషం, రేవతి నక్షత్రములు విశేషము. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభద్ర, విశాఖ, ఆశ్రేష, కృత్తిక నక్షత్రములందు వస్తు విక్రయం ప్రారంభించుట విశేషము.
లగ్నద్వితీయ, చతుర్ధ, పంచమ, సప్తమ, నవమ, దశమ, ఏకాదశములందు శుభగ్రహములుండగాను కుంభేతర లగ్నమందు వ్యాపారారంభమునకు లగ్నము నిర్ణయించవలెను. వ్యాపారారంభమునకు రిక్త తిధులు, మంగళవారము పనికిరాదు. అలాగే అష్టమ ద్వాదశ శుద్ధి అవసరము. వ్యాపారమునకు లగ్నమందు చంద్ర శుక్రులు విశేషము. చంద్ర బుధ గురువుల బలము వున్న ముహూర్తము చూడవలెను.

సీమంతం :

పుంసవనమునకు చెప్పబడిన తిధి వార నక్షత్రములు సీమంతమునకు కూడా కావలెను. ప్రధమ గర్భదారణ విషయంలో నాలుగు, ఆరు, ఎనిమిది మాసములలో చేయుట శాస్త్రము. అయితే అయిదు, ఏడు, తొమ్మిది మాసములలో చేయుట ఆచారము. పుంసవనమునకు అష్టమ శుద్ధి కావలెను సీమంతమునకు అష్టమ, నవమ శుద్ధులు రెండూ కావలెను. సీమంతర అనివార్య కార్యముల వలన చేయలేనిచో ప్రాయశ్చిత్తముగా గోదానము చేయవలెను.

4, ఆగస్టు 2013, ఆదివారం

జ్యోతిష పద్ధతులు

jyothishya methods:-


సాయన విధానం. దీనినే సూర్యమానం అని కూడా అంటారు.ఇది పాశ్చాత్యులు ఎక్కువగా వాడుతారు. ఇందులో ఋతువులు, సూర్య గమనం, రాశులు, గ్రహగతులు, ముఖ్యంగా చూస్తారు. వీరికి దశావిధానం లేదు. Primary and secondary directions వాడతారు. Primary directions లో ఒక డిగ్రీ ఒక సంవత్సరానికి సమానం. Secondary directions లో ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. ఇప్పుడు Tertiary directions కూడా వచ్చింది.యురేనస్,నెప్ట్యూన్,ప్లూటో మొదలైన గ్రహాలను లెక్కిస్తారు.
నిరయన విధానం దీనిని చాంద్రమానం అనీ నక్షత్రమానం అనీ అంటారు.ఇది మన భారతీయ విధానం.ఇందులో నవగ్రహాలను లెక్కిస్తారు. ఉపగ్రహాలున్నప్పటికీ వాటిని పెద్దగా వాడటం లేదు.నక్షత్ర దశలు, గ్రహములకు గల ప్రత్యేక దృష్టులు,యోగములు,గ్రహావస్థలు మొదలైనవి ప్రధానమైన విషయాలు.మన విధానంలో ముఖ్యంగా పరాశర, జైమిని, తాజక,నాడీ విధానాలున్నాయి. భృగు,గర్గ,కశ్యపాదుల పద్దతులున్నాయి. ఇవి కాక అనేక ఇతర విధానాలున్నాయి.
పరాశర విధానం ఇందులో వర్గ చక్రాలు,వివిధ దశావిధానాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. షడ్వరులు, సప్త వర్గులు, దశవర్గులు,షోడశ వర్గులు ముఖ్యమైనవి.గ్రహ యోగాలనూ, దశలనూ,గోచారాన్నీ, అష్టక వర్గులనూ కలిపి ఫలితాలను ఊహించడం జరుగుతుంది. పరాశర మహర్షి ఇంకా ఎన్నో విషయాలను చర్చించినప్పటికీ ముఖ్యంగా వీటినే పరిగణనలోకి తీసుకుంటున్నాము.
జైమిని విధానం ఇందులో కారకాంశ, రాశి దృష్టులు,రాశి దశలు, ఆరూఢ లగ్నాలు,శూల దశ,చరదశ వంటి ప్రత్యేక దశలు ఉంటాయి. ఆయుర్గణనలో విభిన్న పద్దతులు ఈయన ప్రత్యేకత. ఈ విధానాని పరాశర మహర్షి చర్చించినప్పటికీ దీనిని ఒక ప్రత్యేక విధానంగా జైమిని మహర్షి తయారుచేయటం తో ఆయన పేరుమీద చలామణీలోకి వచ్చింది. దీనిని వాడేవారు తక్కువగా ఉంటారు.
తాజక విధానం ఇది సాయన పద్దతికి దగ్గరగా ఉంటుంది. సహమములు, పాత్యాయనీ దశ, ముద్ద దశ, వర్ష ప్రవేశం, ముంధా బిందువు, ఇతశల, ముతశిల యోగం ఇత్యాది ప్రత్యేకతలుంటాయి.ఇందులోని యోగాలన్నీ పాశ్చాత్యుల విధానపు దృష్టులే. దీనిని ఎక్కువగా ప్రశ్న శాస్త్రంలో ఉపయోగిస్తారు.
నాడీ విధానం లేక భృగు సంహితా పద్దతి ఇది చాలా ప్రత్యేకమైన పద్దతి. ఒక రాశిని 150 భాగాలుగా విడగొట్టి దానిని బట్టి సూక్ష్మమైన ఫలితాలను చెప్పేదే నాడీ విధానం. దీనిలో చాలా రకాలైన నాడీ గ్రంధాలున్నాయి. ఫలితాలు కూడా చాలా విచిత్రంగా సరిపోతాయి. ఇందులో రాశి తుల్య నవాంశ పద్దతి, నాడీ అంశలపైన గ్రహాల సంచారం మొదలైనవాటిని బట్టి ఫలితాలు ఊహిస్తారు.ఇవిగాక K.P system ఇంకొక విధానం. భారతీయ పాశ్చాత్య పద్దతులను కలిపి సబ్ లార్డ్ థియరీతో రంగరించి దీన్ని ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు తయారు చేశారు.దీనిలో ఒక్కొక్క నక్షత్రాన్ని వింశోత్తరీ పద్దతిలో విభజించి సబ్ అనబడే సూక్ష్మ విభాగాన్ని తెచ్చారు. దీనిని మళ్లీ ఇదే పద్దతిలో విడగోట్టి సబ్ సబ్ అనే ఇంకా సూక్ష్మ విభాగాన్నితెచ్చారు. పాశ్చాత్యులు వాడే ప్లాసిడస్ హౌస్ సిస్టం ను ఈయన ఉపయోగించారు. హౌస్ కస్ప్ లు, సబ్ లార్డ్స్, సబ్ సబ్ లార్డ్స్, రూలింగ్ ప్లానెట్స్, హౌస్ రెలేషన్ షిప్ మొదలైన విభిన్న పద్ధతులతో ఆశ్చర్య కరమైన ఫలితాలు చెప్పవచ్చు. మిగిలినదంతా పరాశర విధానం వలెనే ఉంటుంది. ఇది ప్రాధమికంగా ప్రశ్న శాస్త్రం. కాని జనన జాతకానికి కూడా బాగా పనిచేస్తుంది.
ఏలినాటి శని వివరము :జన్మరాశికి,నామరాసికి,ద్వాదాశము నందు, లగ్నమునందు, ద్వితియమందు, శని ఉన్నచో ఏలినాటి శని అందురు. శని గ్రహము ఒకొక్క రాశి యందు 2 1/2 సంవత్సరములు కాలసంచారము, మొత్తము కలిపి ఏడున్నర సంవత్సరకాలము ఎల్నాటి శని .ఫలితము: ద్వాదశమున వున్న ధన వ్యయము ,మానసికభాద, కుటుంబ సమస్యలు, వ్యాపార ఉద్యోగ వ్యతిరేకతలు కలుగును .జన్మరాశి యందు ఉన్నప్పుడు, బందుమిత్రవిద్వేషములు, ధన నష్టము, కుటుంబ స్తితి తారుమారుగా ఉండును, కొన్ని సుభగ్రహ వీక్షణచే ప్రయత్నపూర్వక ధన ఆదాయము, మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు ,కలత పీడ, మతి భ్రమణము, దీర్గవ్యాదులు కలుగవచ్చును.ద్వితియమునవున్నప్పుడు, ఆశాజివి అగును,నిందలు పడుట, నిత్య దుఖము కలుగును,మానసికముగా కృంగదీయును. ముఖమునందు 0 3 10 సరిరపడ ధననష్టము దక్షిణభుజము 1 1 00 ఉద్యోగావ్రుత్తులయండు లాభము పాదములయందు 1 8 10 అశాంతి,దిగులు, అవమానములు హృదయస్థానము 1 4 20 ధన ప్రాప్తి,గౌరవము, కీర్తి వామభుజము 1 1 10 వ్యాధిపీడ, ధనవ్యయము శిరోభాగము 0 10 00 సంతోషము, ధనదాయము కన్నులు 0 6 20 మన్నన, కుటుంబ సంతోషం గుదము 0 6 20 ప్రమాదబరితములు, కీర్తి ధననష్టము
  * శని బాధా పరిహారము * 
 శని కి జపము 19000 [వేలు] తర్పణము 1900 [వందలు] హోమము 190 చేసి నువ్వులు బెల్లము నల్లగుడ్డ ఒక నల్లని బ్రాహ్ననునికి దానముఇచ్చట శని త్రయోదసి నాడు శనికి తిలభిషేకము చేయుట వలన కొంత ఉపశాంతి జరుగును పిదతోలగును.
 
నవగ్రహ గోచారఫలము
[జన్మ రాసి నుండి గ్రహము ఉన్న రాసివరకులేక్క చూడవలెను]
[1] రవి :- 3-6-10-11 రాసులలో ,ఉన్న ఉద్యోగలాభం,అదికార ప్రసంసలు, జివనవ్రుద్ది, ఆరోగ్యం, దైర్యం
[2] చంద్ర :- 1-3-6-7-10-11 లలో మంచివార్తలు, వస్తలాభం, గౌరవము,శాంతి
[3] కుజ :- 3-6-10-11 లలో భూ,గృహమూలక, లాభం,శత్రుభయం,శత్రునాసనము,అన్యస్త్రి సుఖములు,సంతోషం
[4] భుదుడు :- 2-6-7-8-10-11 లలొ గౌరవము,మంచి ఆలోచన, సహాయం, క్రయవిక్రయములవల్ల లాభం,నూతనవ్యాపారము
[5] గురుడు :- 2-5-7-9-11 రాసులలో కుటుబ మరియు సంతాన సంతోషములు,లాభం,వివాహాది సుభ కార్యక్రమములు స్నేహలాభములు
[6] శుక్రుడు :- 1-2-3-4-5-8-9-10-12 లలో స్త్రీ సౌఖ్యం, వస్తులాభం, ఆనందం,ఆభరణ లాభం
[7] శని :- 3-6-11 లలో జీవన సౌఖ్యం, వ్యవహారజయలాభం,బందువ్రుద్ది,ఆరోగ్యం
[8] రాహువు [9] కేతువు :- 3-6-11 శత్రుజయం,కార్యసిద్ధి అగుట, పుణ్యక్షేత్ర దర్శనము, గౌరవము,వినోదం.
పరిహారాలకై సంప్రదించండి: 9885 9848 00

గ్రహముల వల్ల వచ్చు వ్యాదులు రవి-గుండె,జఠరము,లాలాజలము,తాపము,తలనెప్పి,కడుపుమంట,నేత్రములు,రక్త పోటు, మొదలగు వ్యాది.

చంద్రుడు - స్తనములు,రుతుక్రమ సంబిదిత,మానసిక,పిచ్చి మొదలగు వ్యాదులు. కుజుడు-కోపముగుదము[మర్మస్థాన]కందరములు,ఎర్రకణములుపోవుట[పాడగుట],పేలుడు[మందుగుండు] సంబదిత,శస్త్ర చికిశ్చ మొదలగు వ్యాదులు. భుదుడు - శ్వాస,మెడ గొంతు,ఫిట్స్,వెన్నెముక,నోరు మొదలగు వ్యాదులు. గురుడు - క్రొవ్వు,కాలేయము,మూత్రము,లివర్ సంబందిత వ్యాదులు. శుక్రుడు - మర్మము,మధుమేహము,సుఖ వ్యాదులు,గడవ బిళ్ళలు మొదలగు వ్యాదులు. శని - మూలవ్యాది,చాల రోజులు నిలిచే వ్యాదులు,పిసాచ బాధలు ,ఎముకలకు సంబందితవ్యాదులు. రాహువు - క్షయ,అపరేషన్,కుష్టు,ప్రేగులు మొదలగు వ్యాదులు. కేతువు - తెలియని జబ్బులు,నత్తి,నరముల పోటు మొదలగు జబ్బులు. సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. .సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.
సూర్యుడు మొట్ట మొదటి గ్రహం. సూర్యుడు పురుష గ్రహం.స్వభావమ్ పాప స్వభావం.రాశి చక్రంలో స్థితి లో సింహంలో రాజ్యాధికారంలోను, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు.సూర్యుని జాతి క్షత్రియ, తత్వం అగ్ని,వర్ణం రక్తవర్ణం, గుణం రజోగుణం, స్వభావం పాప స్వభాభావం, స్థిర స్వభావం, కారకత్వం రుచి కారం, స్థానం దేవాలయం, కారకత్వం వహించే జీవులు పక్షులు,గ్రహోదయం :- పృష్టోదయం,ఆధిపత్య దిక్కు :_ తూర్పు,జలభాగం :- నిర్జల,లోహం :- రాగి,పాలనా :- శక్తి రాజు,ఆత్మాధికారం :- ఆత్మ, శరీర ధాతువు :- ఎముక,కుటుంభ సభ్యుడు :- తండ్రి,గ్రహవర్ణం :- శ్యాల వర్ణం,గ్రహ పీడ :- శిరోవేదన, శరీర తాపం,గృహంలో భాగములు :- ముఖ ద్వారం, పూజా మందిరం,గ్రహ వర్గం :- గురువు,కాల బలం :- పగటి సమయం,దిక్బలం :- దశమ స్థానం,ఆధిపత్య కాలం :- ఆయనం,శత్రు క్షేత్రం :- మకరం, కుంభం,విషమ క్షేత్రం :- వృశ్చికం, ధనస్సు, మకరం,మిత్రక్షేత్రం :- మీనము.,సమ క్షేత్రం :- మిధునం, కన్య,శత్రు గ్రహాలు :- శుక్రుడు, శని,సమ గ్రహం :- బుధుడు,నైసర్గిక బల గ్రహం :- శుక్రుడు,వ్యధా గ్రహం, :- శుక్రుడు,దిన చలనం :- 1 డిగ్రీ.ఒక్కొక్క రాశిలో ఉండే సమయం :- 30 రోజులు,రాశిలో ఫలమిచ్చే భాగం :- మొదటి భాగం,ఋతువు :- గ్రీష్మ ఋతువు,గ్రహ ప్రకృతి :- పిత్తము.దిక్బలం :- దక్షిణ దిక్కు.,పరిమాణం :- పొడుగు. చంద్రుడు మనస్సుకు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు డెబ్బై సంవత్సరాలను సూచించును. దిక్కు వాయవ్యం, జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష ఋతువును, లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. చంద్రుడు చతుర్ధ భావంలో దిక్బలం కలిగి ఉంటాడు. గ్రహములలో చంద్రుడు ఏడవ వాడు. సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడు. శుక్ల పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడు, అమావాస్య నుండి కృష్ణ పక్ష దశమి వరకు మద్యమ చంద్రుడు అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలకు అధిపతి. శరీరావయవములలో మగవారి ఏడమ కన్ను, స్త్రీల కుడి కన్ను శరీర మద్య భాగమును సూచించును. చంద్రుడు కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు. వృషభంలో మూడు నుండి ఇరవై ఏడు డిగ్రీల వరకు మూల త్రికోణంలో ఉంటాడు. వృశ్చికంలో మూడు డిగ్రీల వరకు పరమ నీచ స్థితిలో ఉంటాడు. బుధుడు, సూర్యుడు మిత్రులు. చంద్రుడికి శత్రువులు లేరు. అంగారకుడు ఉగ్ర స్వభావుడు. అధిపతి కుమారస్వామి.పురుష గ్రహం,రుచి చేదు, జాతి క్షత్రియ, అధి దేవత పృధ్వి, దిక్కు దక్షిణం, తత్వం అగ్ని, ప్రకృతి పిత్తము, ఋతువు గ్రీష్మం, లోహములలో ఇనుము, ఉక్కు, రత్నము పగడము, గ్రహ సంఖ్య ఆరు, భావరీత్యా దశమస్థానంలో స్థాన బలం కలిగి ఉంటాడు. గుణం తమో గుణం, ప్రదేశం కృష్ణా నది మొదలు లంక వరకు. అంగారకుడు మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాలకు అధిపతి. శరీరావయావలో ఎముకలో మజ్జ, కండరాలు, బాహ్యంలో జ్ఞానేంద్రియాలు. అంగారకునికి సూర్యుడు, చంద్రుడు, గురువు మిత్రులు, శత్రువు బుధుడు, సములు శుక్రుడు, శని. బుధుడు నపుంసక గ్రహం. మిశ్రమ రుచుల కారకత్వం కలిగిన వాడు. ఇరవై వయసున్న వారిని సూచిస్తాడు. వర్ణం ఆకు పచ్చ, జాతి వైశ్య, అధి దేవత విష్ణువు, గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కల వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ, పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య అయిదు, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన వాడు. లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో పదిహేను ఇరవై డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులారాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ పదిహేడు సంవత్సరాలు. బుధుడు ఏడవ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు. బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగాపాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహపీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు. వస్త్రం తడి వస్త్రం, దేవ వ్ర్గం శైవ, గ్రహ వేదం అధ్ర్వణ వేదం, గ్రహ గోత్య్రం ఆత్రేయ, అర్ధశుభుడు, అవతారం బుద్ధావతారం, గ్రహవర్ణం తాళపత్ర వర్ణం, వారం బుధవారం, మన స్థితి సాత్వికం, బలంగా ఉంటే వాక్చాతుర్యం బుద్ధి జ్ఞానం, ఋషి నారాయణుడు. గురువు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో వారాలలో గురువుది అయిదవ స్థానం. అందుకే దానిని బృహస్పతి వారం అని కూడా అంటారు. అత్యంత శక్తి వంతమైన గ్రహం. పురుష గ్రహం, అధి దేవత బ్రహ్మ, రుచులలో తీపికి రుచి కారకుడు, వయసు ముప్పై, ప్రకృతి కఫ ప్రకృతి, హేమంత ఋతువుకు అధిపతి, తత్వం ఆకాశ తత్వం, దిక్కు ఈశాన్య దిక్కును సూచిస్తాడు. లోహములలో బంగారమును, రత్నములలో పుష్యరాగమును సూచిస్తాడు. గురువు లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కటక రాశిలో ఉచ్ఛ స్థితిని, మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు. గురువు ధనస్సు రాశికి, మీనరాశికి ఆధిపత్యం వహిస్తాడు. గురువుకు మిత్రులు రవి, చంద్ర, కుజులు. శత్రువులు బుధ, శుక్రులు. సముడు శని. గురుదశ పదహారు సంవత్సరాలు. స్వభావం మృదు స్వభావం, సత్వగుణం, శుభ గ్రహం, జీవులు ద్విపాదులు, స్థానం ధనాగారం, అత్మాధికారత్వం జ్ఞానం, ధాతువు కొవ్వు, కుటుంబ సభ్యులు పుత్రుడు, గృహ స్థానం పూజ గది, ధన స్థానము, కాల బలం పగలు, స్థాన బలం లగ్నం, కాల ఆధిపత్యం మాసము, దిక్బలం తూర్పు, వర్ణం పసుపు వర్ణం, రాశిలో ఉండే కాలం ఒక సంవత్సరం, సమిధ రావి, మూలిక రావి అరటి వేరు, గోత్రము అంగీరస, వేదము ఋగ్వేదము, అవతారం వామనుడు. శుక్రుడు ఇతడు రాక్షస గురువు, భృగుపుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీగ్రహం. రుచులలో పులుపుకు ప్రతీక, తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. జాతి -బ్రాహణ, అధి దేవత - ఇంద్రాణి. ఏడు సంవత్సరాల వయసును సూచిస్తాడు. మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. శ్లేష్మ, వాత ప్రకృతిని సూచిస్తాడు. తత్వము -జలతత్వం, దిక్కు -ఆగ్నేయము, రత్నము -వజ్రము, లోహము -వెండి, ఋతువు -వసంతం, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము -రజోగుణము, ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థ. వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. రవి, చంద్రులు శత్రువులు. శని, బుధులు మిత్రులు. కుజుడు, గురువులు సములు. శుక్ర దశా కాలం ఇరవై సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు. శని నపుంసక గ్రహం. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు, శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరివాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు. రాహువు స్త్రీ గ్రహం.ఇది ఛాయా గ్రహం. అపసవ్య మార్గాన నడుస్తుంది. అంటే మేషం, తరువాత మీనం ఇలా వెనక్కు నడుస్తుంది. రాహువు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ మూడు నక్షత్ర జాతకులకు మొదటి దశ రాహుదశా శేషంతో ప్రారంభం ఔతుంది. రాహు దశాకాలం పద్దెనిమిది సంవత్సరాలు. సాధారణంగా రాహుదశాకాలంలో మనిషి జీవితంలో ఒడి దుడుకులు అధికం. కాని కొన్ని నక్షత్రాలకు కొంత వెసులు బాటు ఉంటుంది. రాహువుకు రాశిచక్రంలో ఇల్లు లేదు. రాహువు వృషభరాశిలో ఉచ్ఛస్థితి పొందుతాడు. రాహువు వృశ్చిక రాశిలో నీచ స్థితిని పొందుతాడు. కొన్ని ప్రాచీన గ్రంధాలలో జ్యోతిహ శాస్త్ర రాహువు ప్రస్తావన లేదు. కాని ఆధునిక శాస్త్రంలో రాహువుకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. రాహువు పాపగ్రహం. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. రాహువు శరీరం దిగువ భాగం పాము శరీరం ఉంటుంది. అందుకనే రాహువుకు విషముతో అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడూ రోదశీలో ఉండే సూర్యుడిని కొంత కాలం కనిపించకుండా చేస్తాడు కనుక కల్పనా జగత్తుకు ప్రతీకగా జ్యోతిష పండుతులు విశ్వసిస్తారు. కళాకారుల జీవితంలో రాహువు ప్రధాన పాత్ర పోషిస్తాడని జ్యోతిష శాత్ర పండితులు విశ్వసిస్తారు. కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల కాలం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడవ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం ఏడు సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశ కేతు దశ. కేతువుకు అవల, శిఖి, ధూమ, ధ్వజ, మృత్యు పుత్ర అనే ఇతర నామాలు ఉన్నాయి. కేతువు పురుష గ్రహము. గ్రహ స్వభావం పాప గ్రహం, తత్వం వైరాగ్యము, స్వభావం క్రూర స్వభావం, గుణం తమోగుణం, దిక్కు వాయవ్యము, ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. ఆత్మాధికారం మోక్షం, పాలనా శక్తి భటుడు, లోహము ఇనుము, కుటుంబ సభ్యుడు తాత, వర్ణం ధూమ్ర వర్ణం, గ్రహ పీడ అతి తెలివి, గ్రహ వర్గం గురువు, గృహంలోని ఖాళీ ప్రదేశాలను సూచిస్తాడు, కాల బలము పగలు, కాల బలం పగలు, శత్రు క్షేత్రం కటకం, సమ క్షేత్రం మీనము, ఉచ్ఛ క్షేత్రము వృశ్చికము, నీచ క్షేత్రము వృషభము, మిత్రులు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శత్రువులు శని, శుక్రుడు, సములు గురువు, బుధుడు. వయసు ముసలి వయసు, చెట్లు ముళ్ళ చెట్లు, ధాన్యం ఉలవలు, పండ్లు సీతా ఫల, ప్రదేశములు గుహలు, బిలములు. దేశంలో కేతువు ఆధిక్యత ఉన్న ప్రదేశం అంతర్వేధి.ధాన్యము ఉలవలు, పక్షులు రాబందు, గద్ద, కోడి. జంతువులు కుక్క, పంది, గాడిద. మూలికలు తెల్ల జిల్లేడు, పున్నేరు వేరు, సమిధలు దర్భ. దైవ వర్గం వైష్ణవ, గోత్రము పైఠీనస. అవతారం మీనావతారం. గ్రహారూఢ వాహనం గ్రద్ద, రత్నము వైఢూర్యం, రుద్రాక్ష నవ ముఖ రుద్రాక్ష, లోహము కంచు, శుభ సమయం ఉదయ కాలం. వారము ఆదివారం. స్వభావం చంచల స్వభావం. దృష్టి అధోదృష్టి.
***********************************************
మీరు చేస్తున్నప్రయత్నములు అన్ని విఫలమగుట,కార్యములందు
 
 ఆలస్యము,అనుకోని చిక్కులు ,వివాహ ప్రయత్నములు
 
 ముందుకు సాగక వివాహము ఆలస్యము ,ఉద్యోగ, వృత్తి, 
 
వ్యాపారాలలో సమస్యల కు జ్యోతిష్యపరమైన పరిష్కార 
 
మార్గములకై,పుట్టినతేదీ, పుట్టిన నెల,పుట్టిన సంవత్సరము,

పుట్టిన సమయము, పుట్టిన స్థలము మొదలైన వివరములతో 
 
సంప్రదించండి.
 
 
 
 

13, ఏప్రిల్ 2013, శనివారం

నాభాస యోగాల

నాభాసయోగాలు ముప్పై రెండు. అవి వరుసగా నౌకా, ఛత్ర, కూట, కార్ముక, శృంగాటక, వజ్ర, దామపాళ, వీణ, పద్మ, ముసల, వాసి, హల, శర, సముద్ర, చక్ర, మాల, సర్ప, అర్ధేందు, యవ, కేదార, గద, విహగ, యూప, యుగ, శకట, శూల, దండ, రజ్జు, శక్తి, సల, గోళములు. జాతక చ్రములు అన్ని ఈ యోగాలలో ఎదోఒక యోగంలో ఇమిడి ఉంటుంది. నాభాస యోగములు సంఖ్యా యోగము, దళ యోగము, ఆకృతి యోగములని మూడు విధములు.

  1. నౌకా యోగం :- లగ్నము నుండి సప్తమ స్తానము వరకు ఏడు రాశుల అందు గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న నౌకా యోగం అంటారు.
  2. ఫలితం :- నౌకా యోగమున జన్మించిన జాతకుడు జల ఆధారిత సంపద కలిగి ఉంటాడు. లాభాధిఖ్యత కలిగి లోభ గుణం కలిగి ఉంటాడు.
  3. ఛత్ర యోగం :- చతుర్ధ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న ఛత్ర యోగం అంటారు.
  4. ఫలితం :- ఛత్ర యోగమున జన్మించిన జాతకుడు స్వజనులను ఆశ్రయించి ఉండు వాడు, బుద్ధిమంతుడు, దాత, రాజుకు కావలసిన వాడు, బాల్యమున వార్ధఖ్యమున సుఖము, భాగ్యము, అఖండ ఐశ్వైర్యం కలిగి ఉంటాడు.
  5. కూట యోగం :- సప్తమ కేంద్రము మొదలు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న కూట యోగం అంటారు.
  6. ఫలితం :- కూట యోగమున జన్మించిన వాడు చెరసాల కాపలా చేయువాడు, అబద్ధము, జూదము, వంచన, క్రూరత్వం, దారిద్యం మొదలైనవి కలిగి దుర్గములందు నివసించు వ్డుగా ఉంటాడు.
  7. కార్ముఖ యోగం :- దశమ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న కార్ముఖ యోగం యోగం అంటారు.
  8. ఫలితం :- కార్ముక యోగమున జన్మించిన వాడు రహస్యంగా చరించు వాడు, అసత్యం చెప్పు వాడు, దొంగ, జూదరి, అరణ్య సంచారం, మద్య వయసులో దరిద్రుడు అయి ఉంటాడు.
  9. యూప యోగం :- లగ్నము నుండి నాలుగవ స్థానం వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న యూప యోగం అంటారు.
  10. ఫలితం :- ఆత్మ రక్షణ, త్యాగము, ధనము, సౌఖ్యవ్వంతుడు, వ్రతయమము, సాము అందు ఆసక్తుడు ఔతాడు.
  11. శర యోగం :- చతుర్ధ కేంద్రము మొదలు నాలుగు రాశులలో వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్నశర యోగం అంటారు.
  12. ఫలితం :- ఆయుధములను చేయుట, దొంగలను బంధించుట, వేటాడుట, ఉన్మత్తత, క్రూరత్వము, కుశ్చితత్వము, శిల్పములందు ఆసక్తి కల వాడు ఔతాడు.
  13. శక్తి యోగం :- సప్తమ స్థానం నుండి గ్రహములన్నీ నాలుగు స్థానముల ఉపస్థితమై ఉన్న శక్తి యోగం అంటారు.
  14. ఫలితం :- వికలత్వము, ధన హీనత, వికలత్వము, అలసత్వము, అల్పాయుష్షు, సౌందర్యము, యుద్ధ నైపుణ్యము కల వాడు ఔతాడు.
  15. దండ యోగం :- దశమ స్థాన్మం నుండి నాలుగు రాశులందు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న దండ యోగం అంటారు.
  16. ఫలితం :- దండ యోగమున జన్మించిన వాడు హత ధారా పుత్రులు, సర్వ జన ద్వేషం, బంధు విరోధము, దుఃఖము, సేవకము, నీచ గుణము కల వాడు ఔతాడు.
  17. అర్ధ చంద్ర యోగం :- రెండవ లేక మూడవ స్థానం నుండి గ్రహములన్ని ఉపస్థితమై ఉన్న అర్ధ చంద్ర యోగం అంటారు.
  18. ఫలితం :- సేనాధిపతి, రాజాభిమానానికి పాత్రుడు, సౌందర్యవంతుడు, మణులు సువర్ణములు ఆభరణములు పొందు వాడు, సౌందర్యవంతుడుగా ఉంటాడు.
  19. గదా యోగం :- గ్రహములన్నీ సమీపముగా ఉన్న రెండు కేంద్రముల ఉపస్థితమై ఉన్న గదా యోగం అంటారు. అనగా లగ్న, చతుర్ధ స్థానము లేక, చతుర్ధ, సప్యమ స్థానం, సప్తమ, దశమ స్థానం, దశమ, లగ్న స్థానం అందు ఉన్న గదా యోగం అంటారు.
  20. ఫలితం :- గదా యోగమున జన్మించిన వాడు శాస్త్ర పారంగతుడు, యోగ విద్యావంతుడు, యజ్ఞము చేయు వాడు, అభిమానవంతుడు, ధన కనక వస్తు రజ్ఞములు కల వాడు ఔతాడు.
  21. వజ్ర యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు శుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు అశుభ గ్రహములు ఉన్న వజ్ర యోగం అంటారు
  22. ఫలితం :- శౌర్యము, ఆరోగ్యము, చక్కదనము, స్వజనముతో విరోదము కలవాడు, భాగ్యహాని కలుగుట, బాల్యమున వార్ధక్యమున సుఖము కల వాడు ఔతాడు.
  23. యవ యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు ఆశుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు శుభ గ్రహములు ఉన్న యవ యోగం అంటారు.
  24. ఫలితం :- యవ యోగమున జన్మించిన వాడు వ్రత నియమ శుభ కార్యముల అందు ఆసక్తుడు, యౌవనమున సుఖవంతుడు, ధనవంతుడు, దాత్రుత్వం, స్థిరమైన ధనం కలవాడుగా ఉంటాడు.
  25. పద్మక యోగం :- నాలుగు కేంద్రములందు మిశ్రమముగా గ్రహములన్నీ ఉన్న పద్మక యోగం అంటారు. అనగా లగ్న సప్తమాలలో ఒక దానిలో శుభ గ్రములు ఒక దానిలో అశుభ గ్రహములు అశుభులు ఉండ వలసిన చతుర్ధ, దశమ స్థానాలలో ఒక దానిలో అశుభ గ్రహములు మరొక దానిలో శుభ గ్రహములు ఉన్న పద్మక యోగం అంటారు. కాని వజ్ర, యూప, పద్మక యోగములు యోగములు అసంభములని వరాహ మిహిరుని అభిప్రాయం.
  26. ఫలితం :- పద్మ యోగమున జన్మించిన వాడు సౌందర్యము, సద్గుణ సంపత్తి, గొప్ప కీర్తి, భూస్వామిత్వము, చిరాయువు కల వాడు.
  27. వాపీ యోగం :- లగ్ననముకు రెండు లేక మూడు స్థానములలో ఒక దానిలో శుభగ్రహములు మరొక దానిలో అశుభగ్రహములు ఉపస్థితమై ఉన్న వాపీ యోగం అంటారు.
  28. ఫలితం :- వాపీ యోగమున జన్మించిన వాడు సుస్వరూపము, నేత్ర సౌఖ్యము, స్థిరమైన ధన సౌఖ్యములు, ధన నిక్షేపాదుల అందు సమర్ధుడుగా ఉంటాడు.
  29. శకట యోగం :- గ్రహములన్నీ లగ్న సప్తమమున ఉపస్థిమైన శకట యోగం అంటారు.
  30. ఫలితం :- శకట యోగమున జన్మించిన వాడు రోగ పీడితుడు, మూర్ఖుడు, దుష్టురాలైన భార్య కలిగిన వాడు, దరిద్రుడు, బంధు మిత్ర జన హీనుడు, బండి మీద జీవనం సాగిస్తాడు.
  31. విహగ యోగం :- గ్రహములన్నీచతుర్ధ దశములందు ఉపస్థిమై ఉన్న విహగ యోగం అంటారు.
  32. ఫలితం :- విహగ యోగమున జన్మించిన వాడు తిరుగట అందు ఆసక్తుడు, దౌత్యము, కలహ ప్రియత్వము, నీచజీవనము, పొగరు, నీచ స్వభావం కల వాడు ఔతాడు.
  33. వాల యోగం ;- గ్రహములన్నీ లగ్న త్రికోణం వదిలి మిగిలిన త్రికోణములందు ఉపస్థితమై ఉన్న వాల యోగం అంటారు. అంటే రెండవ, ఆరవ, దశమ స్థానాలు లేక మూడవ, ఏడవ, ఏకాదశ స్థానాలు, నాలుగవ, ఎనిమిదవ, పన్నెండవ స్థానముల ఉపస్థితమై ఉండుట.
  34. ఫలితం :-
  35. శృంగాటక యోగం :- గ్రహములన్ని త్రికోణముల అందు ఉన్నఅంటే లగ్నము, పంచమ స్థానము, నవమ స్థానముల ఉన్న శృంగాటక యోగము అంటారు.
  36. ఫలితం :- శృంగాటక యోగమున జన్మించిన వాడు కలహములందు ఆసక్తుడు, యుద్ధమున తెగింపు కలవాడు, సంపన్నుడు, స్త్రీలచే ద్వేషింప బడు వాడు, సుఖవంతుడు, సౌందర్యవంతుడు, రాజాభిమాన పాత్రుడు ఔతాడు.
  37. చక్ర యోగం : - గ్రహములన్నీ బేసి రాశులైన ఆరు రాశులలో ఉప స్థితమై ఉన్న చక్రయోగం అంటారు. అంటే లగ్నం, మూడు, అయిదు, ఏడు, తొమ్మొది, పదకొండు స్థానాలలో ఉపస్థితమై ఉన్న చక్రయోగం అంటారు.
  38. సముద్ర యోగం :- గ్రహములన్నీ రెండవ స్థానం నుండి పన్నెండవ స్థానం వరకు ఉన్న సమ రాశులలో ఉపస్థితమై ఉన్న అంటే రెండవ, నాల్గ్వవ, ఆరవ, ఏనిమిదవ, పదవ, పన్నెండ స్థానాలలో ఉపస్థితమై ఉన్న సముద్ర యోగం అంటారు.
  39. ఫలితం :- సముద్రము అందు పుట్టిన రత్నములు, మణులు వివిధ పధార్ధములు కలవాడు, యోగవంతుడు, జనులను ఆకర్షించు వాడు, భూములకు అధిపతి ఔతాడు.
  40. సల యోగం :- గ్రహములన్నీ ఉభయ చర రాశులందు ఉపస్థితమై ఉన్నసల యోగం అంటారు.
  41. ఫలితం :- సల యోగమున జన్మించిన వాడు తిండి పోతు, దరిద్రుడు, వ్యవసాయము చేత జీవించు వాడు, భయం, భీత స్వభావం కలవాడు, దుఃఖి, బంధు మిత్ర రహితుడు ఔతాడు.
  42. ముసల యోగం :- గ్రహములన్నీ స్థిర చర రాశులందు ఉన్న మసల యోగం అంటారు.
  43. ఫలితం :-
  44. రజ్జు యోగం :- గ్రహములన్నీ చర రాశులందు ఉన్న రజ్జు యోగం అంటారు.
  45. ఫలితం :-
  46. దళాఖ్య మాలా యోగం :- మూడు కేంద్రముల చంద్రుడు కాక మిగిలిన శుభగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య మాలా యోగం అంటారు.
  47. ఫలితం :-
  48. దళాఖ్య సర్పయోగం :- మూడు కేంద్రములందు చంద్రుడు కాక మిగిలిన పాపగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య సర్ప యోగం అంటారు.
  49. ఫలితం :-
  50. గోళ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఒక్క స్థానములోఉపస్థితమై ఉన్న గోళ యోగం అంటారు.
  51. ఫలితం :-
  52. యుగ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ రెండు స్థానములలో ఉపస్థితమై ఉన్న యుగ యోగం అంటారు.
  53. ఫలితం :-
  54. శూల యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ మూడు స్థానములలో ఉపస్థితమై ఉన్న శూలయోగం అంటారు.
  55. ఫలితం :-
  56. కేదార యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ నాలుగు స్థానాలలోఉపస్థితమై ఉన్న కేదార యోగం అంటారు.
  57. ఫలితం :-
  58. పాశ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ అయిదు ఉపస్థితమై ఉన్న పాశ యోగం అంటారు.
  59. ఫలితం :-
  60. దామినీ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఆరు స్థానముల ఉపస్థితమై ఉన్న దామినీ యోగం అంటారు.
  61. ఫలితం :-
  62. వీణా యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఏడు స్థానముల ఉపస్థితమై ఉన్న వీణా యోగం అంటారు.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...