కుబేర యంత్రం
|
-: మూల మంత్రం :-
ఓం యక్షాయ కుబేరాయ వ్యైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహాః ||
-: వేరొక మూల మంత్రం :-
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః ||
- మంత్ర మహోదధి
|
శ్రీ కుబేర యంత్రంను
అర్చించు
వారు యంత్రమును రాగి రేకు పై కాని కాగితముపై కాని వ్రాసి పటము
కట్టించి యథా శక్తి గా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్న సర్వ కార్య విజయము ఐశ్వర్య ధన ధాన్య వృద్ధి మనో వాంఛా సిద్ధియు కూడా
పొందగలరు.
శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ కాల మాన
సంకీర్తణాధికముగా త్రి న్యాస పూర్వకముగా , పంచ పూజలొనర్చిన విశేష ఫలము
కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రి ని కూడ జపదశాంశము
గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.
ధ్యానము , మూల
మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు సాధకుడు
పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి మంత్ర
యంత్రములు పని సాధన లందు అనంత ఫల సాధకము లగును.
-: శ్రీ కుబేర గాయత్రి :- యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.// |