శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

20, డిసెంబర్ 2013, శుక్రవారం

జ్యోతిషం శాస్తం లో పర్యాలోచన - 3

                                                                    
                                     ఈ విశ్వములో ప్రతి ప్రాణి కోరుకునేది “నిత్యానందము” మాత్రమే. దాని కొరకై ఆరాటపడుతుంది వర్తమాన శరీరము. కానీ ప్రతి శరీరములో గల సూక్ష్మ శరీరము యుగధర్మమును అనుసరించి నీకు ఆనందమైన జీవితాన్ని చూపిస్తూ తన గమ్యాన్ని చేరుకోవచ్చు. లేదా అత్యంత కష్టాలకు గురిచేస్తూ తన గమ్యం చేరుకోవచ్చు. దానికి కారణము సూక్ష్మ శరీర ప్రవర్తనే. ఈ సూక్ష్మ శరీరాన్నే “ఆత్మ” అని అంటారు. ఈ ఆత్మను జ్యోతిష్యశాస్త్ర రీత్యా కర్మసాక్షి ఐనా సూర్యునితో పోలుస్తారు. ఆయనే పుట్టని(unborn) “భగవంతుడు”. అందుకనే ప్రతి జీవిని భగవంతుని అవతారమని చెబుతారు. ఆత్మ అధిరోహించిన వాహనమే వర్తమాన కాలాములో కలిగిన ఈ శరీరము. ఇలా వచ్చే ఆత్మ “సర్వేజనా స్సుఖినోభవంతూ” అను ధర్మసూక్ష్మం మేరకు తప్పు చేసినదైతే సరిదిద్దుకొనుటకు నూతన శరీరములోకి ప్రవేశించి యుగధర్మానుసారముగా ప్రవర్తిస్తుంది. అలా సరిదిద్దుకొనే ప్రయత్నములో ఎన్నో అడ్డంకులు వర్తమాన శరీరమునకు ఎదురవుతుంది. అవన్నియు “కర్మ” ఫలితమే. ఈ వర్తమాన శరీరమును స్టూలమని, ఆత్మను సూక్ష్మమని జ్యోతిష్య పరిభాషలో అంటారు. ఇవి కాక కారణ శరీరము అనునది మూలము. కారణ శరీరము అనగా పై రెండు శరీరాలకు (స్థూల, సూక్ష్మ) హేతువై అంటే సంబందపడి నిర్ణీతమార్గమున నడిపించునది. ఉదాహరణకు ఆత్మ ప్రయాణించే వాహనం శరీరమైతే, ఆ వాహనాన్ని నడిపే డ్రైవరు కారణ శరీరమవుతుంది. ఇలా మానవజన్మ ఎత్తిన మనము మనకు తెలియకుండా మరో మూడు రూపములకు (SPLIT PERSONALITY) మనలో నివాసాన్ని కలిగించి జీవితానికి పరమర్ధాన్ని కలిగిస్తుంది. ఈ రూపాలు వయసును బట్టి మారుతూ ఉంటాయి. అంటే పెళ్లైక భార్య/భర్త లో ఉండే రూపాలకు సంబంధపడుతుంటాయి. అందువలనే ‘MARIAGES ARE MADE IN HEAVEN’ అను నానుడి సార్ధకమైనది. ఎన్ని జన్మలు ఎత్తిన భార్యాభర్తల సంబంధము ఆత్మల రూపములో తిరిగి కలుస్తూనే ఉంటుంది. కేవలం ఎవరి జాతకాలలో లగ్నాత్తూ 7 వ స్థానం వక్రించనంతవరకు ఈ సంబంధము చెడదు/మారాదు. ఇలా మానవజన్మ ఒక అవతారములో అనేక రూపములకు కేంద్ర స్థానమైనందువల్ల మానవ జన్మ అతి ఉన్నతమైనదని అంటారు.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...