కేతు గ్రహ లక్షణాలు : కేతువు పురుషగ్రహము. చిత్రమైన రంగును రత్నములలో వైఢూర్యము (పిల్లికన్నురాయి) ను సూచించును. మ్లేచ్ఛజాతికి చెందిన తమోగుణ ప్రధానమైన గ్రహము. ఈ గ్రహము సంఖ్య 4. అంతర్వేది ప్రాంతమును సూచించును.
కేతువు అశ్వని, మఖ, మూల, నక్షత్రములకు అధిపతి. కేతుగ్రహదశ 7 సంవత్సరాలు. రవి, చంద్ర, కుజ, గురులు, ఇతనికి మిత్రులు.. బుద, శుక్ర, శని, రాహువులు శత్రువులు. బుద, గురులు సములు.
కేతు గ్రహ కారకత్వములు : కేతువు తాత (తల్లికి తండ్రి), దైవోపాసన, వేదాంతము, తపస్సు, మోక్షము, మంత్రశాస్త్రము, భక్తి, నదీస్నానం, మౌనవ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసము, పరులసొమ్ముతో ఆనందం, పరుల వాహనములు వాడుకొనుట, దత్తత, రాయి, ఆకలి లేకపోవుటను సూచించును. స్ఫోటకము, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గాస్, ఎసిడిటి, వికారములను సూచించును. కోడి, గ్రద్దలను సూచించును. స్నేహము, వైద్యము, జ్వరము, వ్రణములను సూచింఛును.
కేతువు సూచించు విద్యలు : కేతువు ఏ గ్రహంతో సంబంధం కలిగివుంటే ఆ గ్రహానికి సంబంధించిన విద్యలను సూచించును.
కేతువు సూచించు వ్యాధులు : కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహముకు సంబంధించిన అవయవము చెడిపోవునట్లు చేస్తాడు. రోగ నిర్ధారణ కానీయడు. దానివలన సరియైన చికిత్స చేయుటకు అవకాశం ఉండదు. ఇతను మృత్యుకారకుడు. అధికంగా భయపడుట, మతిస్థిమితం లేకపోవుట, రక్తపోటు, ఎలర్జీని సూచించును.
కేతువు సూచించు వృత్తి వ్యాపారాలు : కేతువు ఏదో ఒక సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ లను సూచించును.
కేతువు, కుజునిచే సూచించు వృత్తులను సూచించును.
కేతువునకు మిత్రులు: బుధ శుక్ర శని రాహు
కేతువునకు శత్రువులు: సూర్య చంద్ర మంగళ
కేతువునకు సములు: గురు