వాస్తు శాస్త్రము- ఇల్లు
1 మనము కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు
వాస్తు విషయాలను తప్పక పా టింపవలయును. గాలి, వెలుతురు, నీరు మొదలగునవి మన
ఇంటిలో నికి ఆహ్వానించే విధంగా మనము ఇంటి నిర్మాణము చేయవలెను.
2 మనము స్థలము కొనుగోలు చేయునపుడు నలు
చదరముగా గాని, సమకోణ దీర్ఘ చతుర స్రాకారముగ ఉన్న స్థలంగాని ఎంపిక
చేసుకోవాలి. అది తూర్పు, ఉత్తరం పల్లంగా వుండాలి. ఈశాన్యం పల్లంగా ఉన్న
స్థలం చాల మంచిది. 3 ఇంటికి చుట్టు ప్రహరి ఉండుట చాల మంచిది.
4 ఇల్లు కట్టుకొనే ముందు ఇంటికి చూట్టూ ఖాళీ స్థలం వుంచుకోవాలి. తూర్పు, ఉత్తరాలతో ఎక్కువ ఖాళీ స్థలం ఉంచుకొనుట చాలా మంచిది .
5 ఈశాన్యం పెరిగిన స్థలం చాలా మంచిది.
ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది . ఈశాన్యం కాకుండా ఏ మూల పెరిగినా దానిని
తగించే వీలు వుంటెనే ఆ స్థలాన్ని తీసుకోవాలి.
6 స్థలము, గృహాలతో నిగదులు తూర్పు
భాగమునకు పల్లముగా ఉండాలి. మనము వాడిన నీరు తూర్పునకు గాని, ఈశాన్యానికి
గానీ వెళ్ళే విధంగా కట్టుకోవాలి.
7 ఇంటికి ద్వారాలు తూర్పులోనూ,
ఉత్తరములోనూ, ఉత్తరములోనూ, ఈశాన్యాలలోనూ, దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ
వాయువ్యంలో ఉంటె మంచిది. ఉత్తర వాయువ్యాలలో, తూర్పు ఆగ్నేయంలో, దక్షిణ
నైరుతి లో మరియు పశ్చిమ నైరుతి లో ద్వారాలు ఉండకూడదు.
8 . వంటగది నిర్మాణము ఈశాన్య భాగమున
ఉండరాదు. ఈశాన్యం మూల పొయ్యి అసలు ఉండరాదు. ఇంటిలో పొయ్యి ప్రధానంగా
ఆగ్నేయంలో ఉండాలి. అలా వీలు కుదరనప్పుడు నైరుతి భాగములో పెట్టవచ్చును.
మిగతా దిశలు పొయ్యికి పనికి రావు.
9 . ఇంటిలో ఈశాన్య భాగములో పూజా మందిరం నిర్మించుట చాలా మంచిది.
10 .పడక గది నైరుతి భాగములో
కట్టుకోవాలి. దక్షిణం వైపు తల ఉంచి నిదురించుట చాలా మంచిది. ఎట్టి
పరిస్థితులలోను ఉత్తరం వైపు తల ఉంచి నిదురించ కూడదు.
11 . గొయ్యి లేకుండ ఉండేటటువంటి మరుగు
దొడ్డి ఆగ్నేయంలో నిర్మించు కొనుట చాలా మంచిది. సెప్టిక్ టాంకులు తూర్పు,
ఉత్తరాలలో కట్టుకొనవచ్చును. లెట్రిన్ లో తూర్పు ముఖంగాను, పడమర ముఖంగాను
కూర్చోన కూడదు. ఈశాన్యములో మరుగు దొడ్డి అసలు ఉండకూడదు.