పంచాంగ విషయాలు 2
వర్జ్యం : ' వర్జింపుట ' అనగా వదలివేయుట అని అర్ధము. ప్రతి దినము కాలెండరు నందు చెప్పబడు రాహుకాల, దుర్ముహూర్త వర్జ్యాదులలో ఏ కార్యము తల పెట్టినను అది సంపూర్ణ ఫల మందించదు. కావున అట్టి సమయములలో ఏ శుభ కార్యమును ప్రారంబించరాదని ఆర్యుల అభిప్రాయము. మన ఆంధ్ర రాష్ట్రములో ఎక్కువగ పాడిలో నున్నది . వర్జ్యము ( దక్షినాది రాష్ట్రాల వారు రాహు కాలము, యమగండము వంటివి పాటించెదరు ). ప్రతి శని వారము సూర్యోదయంతో ప్రారంబమగునది దుర్ముహూర్తం . సూర్యోదయంతో మొదలయ్యే 5 ఘడియలు అనగా 1 గం . 40 ని .పాటు ఈ దుర్ముహూర్తముండును. కాన ఆ సమయమందును ఏ శుభ కార్యము తల పెట్ట రాదు. రాహు కాల యమగండ కాలములు నిత్యము నిర్దిష్ట సమయములలో ఉండును. అవి చూచుకొని ఆయా సమయములలో కాక మిగిలిన శుభ ఘడియలలో కార్యములు తల పెట్టిన అవి నిర్విఘ్నముగా నెరవేరును.
ఏలినాటి శని : ప్రతి మానవుని జీవిత కాలమందు ముప్పది ఏండ్ల కోక మారు ఏలినాటి శని ప్రవేశించును. జన్మ రాశికి - నామ రాశికి - ద్వాదశమునందు - లగ్నము నందు , ద్వితీయము నందు - శని యున్నచో ఎల్నాటి శని యందురు. శని గ్రహము ఒక్కొక్క రాశి యందు 2 1/2 సంవత్సరముల కాలము సంచారము -మొత్తము కలిపి ఏడున్నర సంవత్సర కాలము ఎల్నాటి శనియున్నదన్నమాట .
ఫలితము: ద్వాదశ రాశి యందున్నప్పుడు -ధన వ్యయము , మానసిక భాద , అందోళనములు , కుటుంబ సమస్యలు, వ్యాపార, వృత్తులందు వ్యతిరేకములు కలుగును.
జన్మరాశి యందున్నప్పుడు - బంధు మిత్ర ద్వేషములు, ధన నష్టము - కుటుంబ స్థితి తారుమారుగా ఉండును. కొన్ని శుభ గ్రహ వీక్షణచే ప్తయత్న పూర్వక ధనాదాయము , మిశ్రమ ఫలితములు ఉండవచ్చును. కళత్ర పీడ, మతి బ్రమణం, దీర్ఘ వ్యాదులు కలుగ వచ్చును .
ద్వితీయము నందున్నప్పుడు - ఆశా జీవి యగును . నిందలు పడుట, నిత్య దు : ఖము కలుగును. మానసికముగా క్రుంగదీయును .పై కాలములందు మాస శివ రాత్రి రోజున శని పూజలు చేయుట మంచిది.
సం నె రో
ముఖము నందు 0 3 10 శరీర పీడ - ధన నష్టాదులు
దక్షిణ భుజము 1 1 00 ఉద్యోగ వృత్తులందు లాభాదులు
పాదములందు 1 8 10 అశాంతి - దిగులు - అవమానములు
హృదయస్థానము 1 4 20 ధన ప్రాప్తి - గౌరవము - కీర్తి
వామ భుజము 1 1 10 వ్యాధి పీడ - ధన వ్యయము