రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592. |
మన సంస్కృతి, సంప్రదాయాలు కొన్ని నమ్మకాలను అలవాటు చేసింది.అటువంటి వాటిలో ఒకటి రుద్రాక్ష. దీనిని ధరిస్తే అందులోని శక్తి ప్రభావితం చేస్తుందన్నది కొంతమంది నమ్మకం. ఆ నమ్మకమే మాకు రక్షని ఆస్తికులు చెబుతుంటారు. యువత కూడా వీటిని ధరించడానికి ఇష్టపడుతున్నారు.యువకులు ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని రుద్రాక్షని కొనుగోలు చేస్తున్నారు.విద్యార్థులు తల్లిదండ్రుల కోరిక మేరకు వీటిని ధరిస్తున్నారు. రుద్రాక్షకి శక్తులు ఉన్నాయని, అరుదైన రుద్రాక్షలు మానసిక ఆందోళన నుంచి విముక్తి కలిగిండంతో పాటు చక్కని ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని రుద్రాక్ష థెరపిస్ట్‌లు అంటున్నారు.
రుద్రాక్షలను చూసినా సరే.. తాకినా సరే..ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ‘శ్రీమద్ దేవీ భాగవతంలో పేర్కొన్నారు. రుద్రాక్ష ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినట్లు సాక్ష్యాలూ ఉన్నాయి. మానవ జీవితంలో రుద్రాక్షల వల్ల కలిగే ప్రయోజనాలు వర్ణించలేనివని ఇంగ్లాండ్‌కు చెందిన పాల్హ్యామ్ తన పరిశోధనలో పేర్కొన్నారంటే వీటి ప్రాధాన్యతను ఊహించుకోవచ్చు.హిమాలయాలలోని ‘ఇలా ఓకార్పస్ గని ట్రస్’ అనే చెట్ల పండ్లు సేకరించి వాటిలోంచి రుద్రాక్షలను అందిస్తు న్నారు. రుద్రాక్షల్లోని శక్తి వాటిని ధరించిన వారిని ప్రభావితం చేస్తాయన్న నమ్మకంతో యువ తరం కూడా వాటిని ధరించేం దుకు ఆసక్తి చూపుతోంది. వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని చక్కగా తీర్చిదిద్దడంలో వివిధ రకాల రుద్రా క్షలు శక్తి స్వరూపిణిలుగా, శివుని మూడో కన్నుగా అద్భు తమైన ఫలితాలనిస్తాయి.
రుద్రాక్షల ప్రభావం...
ఒక్కో రుద్రాక్షకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. వివిధ రకాల దేవతలు, గ్రహాల పరిస్థితులు, ప్రభావాలకు అనుగుణంగా ఒక్కొక్క రుద్రాక్ష పనిచేస్తుంది. తాము అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు వీటిని వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. రుద్రాక్షల ప్రభావంపైనా, ఫలితాలపైనా రుద్రా లైఫ్ అనేక రకాల ప్రయో గాలు చేసి ప్రపంచంలోనే అత్యుత్తమ రుద్రాక్ష సంస్థగా గుర్తింపు పొందింది. నేపాల్‌లో ఉండే రుద్రాక్ష చెట్లను పోలిన త్రయంబకేశ్వర్ ప్రాంతం లోని రుద్రాక్ష చెట్లను రుద్రా లైఫ్ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే అక్కడి చెట్లపై రుద్రాలైఫ్ పరిశోధనలు చేస్తోంది. ఏక ముఖి, ద్విముఖ, త్రిముఖ, చతుర్ముఖ, పంచముఖ, షణ్ముఖ, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి, ఏకాదశముఖి, ద్వాదశ ముఖి, త్రయోదశముఖ, చతర్ధశ ముఖ, గణేష్, గౌరీశంకర రుద్రాక్షలు ఉన్నాయి. అన్ని రకాల రుద్రాక్షలతో కలిసి రూపొందించే ఇంద్రమాల శక్తి ప్రభావం అధికంగా ఉంటుంది.
విద్యార్ధుల కోసం ప్రత్యేక మాలలు...
నేడు విద్యార్ధుల కోసం వివిధ రకాల రుద్రాక్ష మాలలు లభిస్తుండడం విశేషం. వీటిలో సరస్వతీ బంద్ ,గణేష్-లక్ష్మీ బంద్, వస్తు బంద్, రక్షా బంద్, దుర్గా శక్తినిచ్చే బ్రేస్లెట్, ధ్యానయోగమాల, సిద్ధమాల, ఇంద్రమాలలు లభ్యమవు తున్నాయి. సిద్ధమాల ధర్మ, అర్థ, కామ, మోక్ష అంశాలకు ప్రతిబింబంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇందులో ఏకముఖి, 14 ముఖి రుద్రాక్షలను పొందుపరిచారు. సాధారణంగా చతుర్ధశముఖి రుద్రాక్షలే లభిస్తుంటాయి. ఈ ప్రదర్శనలో ఏకముఖి నుంచి ద్విఏకాదశముఖి రుద్రాక్షలు కలిగిన ఇంద్రమాల ఉన్నాయి. రుద్రాక్ష అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది.రుద్రాక్ష ధరించాలని చాలామంది కోరుకుంటారు.కానీ నాణ్యమైన రుద్రాక్షలను ధరిస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయన్న విషయాన్ని ప్రజలు గమనించాలి.
మానసిక ఆందోళన నుంచి విముక్తి
అరుదైన రుద్రాక్షలు మానసిక ఆందోళన నుంచి విముక్తి కలిగించడంతో పాటు చక్కని ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.సుఖమైన జీవనాన్ని ప్రసాదించే రుద్రాక్షను శివుడు మూడో కన్నుగా భావిస్తారు. ఇక ఈ రుద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి. ఏక ముఖి నుంచి ద్వి ఏకాదశముఖి రుద్రాక్షల వరకే గాకుండా గౌరీ శంకర, గణేష్, త్రిజుటి తదితర రకాలు కూడా నేడు లభిస్తు న్నాయి. ఇవేగాకుండా క్రిస్టల్‌తో రూపొందించిన శ్రీ యంత్ర, శివలింగ్ సంబంధిత మాలలకు సైతం ఎన్నో మహిమలు ఉన్నాయి. నేపాల్‌లోని హిమాలయ శ్రేణుల్లో, ఇండోనేషియా, శ్రీలంక, మలేషియా ప్రాంతాలలో లభ్యమయ్యే ఒకో రుద్రాక్షకు ఒకో ప్రాధాన్యత ఉండడం విశేషం.
రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592. |