శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

24, నవంబర్ 2013, ఆదివారం

సూర్య రత్నధారణ

సూర్య రత్నధారణ

                                    

           

కెంపు 

మాణిక్య రత్నము సూర్యగ్రహానికి అతి ప్రీతిపాత్రము ఎందువల్లననగా సూర్యగ్రహ సంభంధమైన వర్ణ, గుణతత్వములాదిగాగల సమస్తము కెంపునకు కూడా జెంది యుండటమే! పంచమహా భూతాలలో అగ్నితత్వము గల రత్నము కెంపు నవగ్రహములలో అగ్ని తత్వ గ్రహము రవి. ఈ ప్రకారము అన్ని విషయాలలోను సూర్యగ్రహాన్ని బోలిన గుణతత్వాలు కెంపుకున్నవి.ఈ రత్నము త్రిదోషమునందలి పిత్త గణదోషములను శమింపజేయగలదు. సమాన వాయువు దీని సంకేతమై ఉన్నది. పురుషజాతికి చెందిన ఈ కెంపు శరీరమందలి మణిపూర చకమునందు తన కాంతి పుంజములను ప్రసరింపజేసి, కళ్ళదృష్టి, హృదయము, మెదడు అను అవయవములపై తన ప్రభావము చుపగలదు.
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాడ అను నక్షత్రములందు బుట్టినవారు ఏ కాలమునందైనను కెంపును ధరించుటకు అభ్యంతరముండదు. ఇతర నక్షత్ర జాతకులు వారి జన్మకాలీన దశాంతర్దశలు-గోచారము మొదలగు విషయములు గమనించి సూర్యగ్రహము బలహీనుడై దుష్ట
ఫలితములనిచ్చుచున్నప్పుడు స్వచ్ఛమైన కెంపును ధరించిన యెడల వారికి సూర్యగ్రహారిష్టము తొలగి వివిధ శుభఫలితములు కలుగుచుంటవి.
జాతమునందు రవిగ్రహము 6-8-12 ఆధిపత్యములు కల్గుట 6-8-12 అధిపతులతో కలియుట, లేక షష్ఠాష్ట వ్యవస్థానములందు పాపగ్రహ సహితుడై ఉండుట, షడ్వర్గబలము లోపించుట, అష్టక వర్గమునందు హీనబిందువులు కలిగియుండుట, మొదలగు దుర్లక్షణములు సంభవించి బలహీనుగై అతని (రవి)యొక్క దశాంతుర్దశాది కాలములందు వ్యతిరేక, దుష్టఫలితముల నిచ్చుచున్నప్పుడు ఆ దోషపరిహారమునకు కెంపును ధరించవలెను.
కెంపుద్వార కలిగే శుభయోగాలు :
ఉత్తమమైన జాతి కెంపులు శాస్త్రీయ పద్ధతులలో ధరించిన వారికి ముఖ్యంగా శరీర ఆరోగ్యం సక్రమమైన పద్ధతులలో కొనసాగి ఉల్లాసంగా వుంటారు. శరీరంలో కలిగే అనేక విధములైన అనారోగ్యాలను ఈ కెంపు యొక్క కాంతిపుంజాలు నివారణగావించి దేహము యొక్క ఆరోగ్య పరిస్థితిని సక్రమంగా వుంచుతుంది.
మాణిక్య రత్నధారణ వలన మానవుని మేధస్సు అభివృద్ది జెందగలదు. జ్ఞాపకశక్తి అధికంగా లభించి విద్యార్థులకు పరీక్షలలో విజయం చేకూరగలదు. దారుణమైన శిరోవ్యాధులు, హృదయరోగములు, క్షయ, అపస్మారకము మూర్ఛ నివారణమై తేజోవంతులుకాగలరు. ఆత్మస్థైర్యం చేకూరి ప్రజ్ఞావంతులుగాను, ప్రతిభావంతులు గాను మనగలరు. రాజకీయ సంభంధమైన అనేక కార్యాలలో ఎదురయ్యే అవరోధాలు తొలగిపోయి విజయం చేకూరగలదు. యింకా కోర్టు వ్యవహారాలు సులబంగా పరిష్కరించబడి మేలుకలుగగలదు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ కెంపు జాతికి చెందిన కౌస్తుభమణి ధరించి మహాభరతంలో సాటిలేని రాజకీయ చాతుర్యము ప్రదర్శించి విజయాన్ని పొందటం అందరికీ తెలిసిన విషయమే!
కెంపుకు రవిగ్రహధిపత్యము కలుగుటవలన సూర్య గ్రహము, ఆరోగ్య్టమునకు, శరీరమునకు కీర్తి ప్రతిష్టలకు ప్రధాన గ్రహమగుట వలన, రవి బలంలోపించిన వారికి సామాన్యంగా, అకారణ నిందలు, పరపతి లోపించుట, గౌరవభంగము, శరీర కృశత్వము, అనారోగ్యములు, కుటుంబకలహములు, నేత్రభాధలు, శిరోహృదయ భాధలు తరచుగ కలుగుచుంటవి. రాజకీయంగా సమస్యలు చిక్కులుగలవారు, ఉద్యోగ సంభంధమైన కష్టనష్టములు కలుగుచున్నవారు, దురభ్యాసములకులోనైనవారు, తమ జాతకమునందు సూర్యగ్రహము, బలహీనుడై వున్నాడని గ్రహించి జాతి కెంపును ధరించలి.
కెంపునుధరించే పద్దతి:
ఉత్తమమైన రత్నాన్నైనా పరీక్షించకుండా ధరించకూడదు. వివిధ రకములకు చెందిన కెంపులలో పరీక్షయందు నిలచి ప్రకాశవంతమైన ఉత్తమమైనదిగా నిర్ణయించిన రత్నాన్ని షుమారు 30 దినములు తమ వద్ద నిడివిగా ఉంచుకొనిన అనుభవంలో దాని గుణ ఫలితాలు అనుకూలంగా నున్నచో లేవో గమనించాలి శుభ ఫలితాలనిచ్చే రత్నం ఉంగరంలో ధరించటానికి అభ్యంతర ముండదు.
కెంపులు ఉంగరమునందిమిడ్చి ధరించుట కొరకు గుండ్రని ఆకారము గలవి గానీ లేక నలుచదరపు ఆకారముననున్నవిగానీ శ్రేష్టములు. ఇట్టిరత్నములు 5 రతుల (15 వడ్డగింజల బరువుకు )తగ్గరాదు బంగారంలేక వెండి పంచలోహములలో దేనిచేనైనను ఉంగరము చేయించిన తర్వాత పుష్యమీ నక్షత్ర ఆదివారముగానీ, హస్తానక్షత్రయుక్త ఆదివారమునందుగానీ అమావాస్యా ఆదివారమునందుగానీ మధ్యాహ్నం 1-2 గంటల మధ్యగానీ (ఈ కాలంలో వర్జ్యం ఉండరాదు.)ఉంగరంలో బిగించి ఆ ఉంగరమును ఒక దినము ఆవుపాల యందు, ఆ మరుదినము ధాన్యమునందును, మూడవ దినము మంచినీటి యందును వుంచి నిద్ర గావింపజేసి శుద్దిచేయాలి.
పంచాంగం శుద్ది అనగా ధరించువారికి తారాబలం చంద్రబలములు కలిగి శుభకరమైన తిదులలో ఆది, సోమ, బుధ, గురువారములయందు, మేష సింహ, ధనుర్లగ్నములు గల సమయములందు పూజించి కుడిచేతికి అనామికా వ్రేలికి ధరించాలి ఉంగరమును ధరించుటకు ముందుగా గంధపుష్పాక్షతములచే పూజించి ధూపదీపములర్పించి కొబ్బరికాయ కొట్టి, ఫలక్షీరములు నివేదన గావించి, భక్తిపూరస్సరముగా నమస్కరించి, గురువుని, గణపతిని, సూర్యభగవానుని స్మరించి, ఉంగరమును కుడిభాగమందలి అరచేతిలో పెట్టుకొని సూర్యునికెదురుగా నిలబడి "ఓం హ్రీం శ్రీం క్లీం సః సూర్యాయ నమః స్వాహా" అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించి ఉంగరమును ముమ్మారు కళ్ళకద్దుకొని వ్రెలికి ధరించాలి. ఉంగరములో రత్నానికి అడుగుభాగంగల స్థానంలో రంధ్రం వుండి రత్నమునందలి దివ్యకిరణములు శరీరమునందు ప్రవేశించవలెను.


కెంపు
కెంపులు భూమి నుండి లభ్యమవుతాయి. ఉపరితలం నుండి భూమి లోపలికి 150 నుండి 300 కిలో మీటర్ల లోతులో ఇవి తయారయ్యాక భూమి పైపొరలలోకి వెదజల్లబడుతాయి. త్రవ్వకాల ద్వారా, అగ్నిపర్వత శిలలు బ్రద్దలవ్వడం ద్వారా రూపాంతరం చెందిన శిలల నుండి కెంపులు లభిస్తాయి. సాధారణంగా ఎరుపు (దానిమ్మగింజ) రంగులో వున్నప్పటికీ, గులాబీ, నలుపు, పసుపు, స్కై బ్లూ కలర్స్ లోనూ కెంపులు దొరుకుతాయి.

ప్రాచీన సంస్కృతి, పురాణాలననుసరించి కెంపును 'రత్నరాజం', రత్ననాయక' అని పిలుస్తారని తెలుస్తుంది. కెంపుని పద్మారాగమణి గా పిలుస్తారు. పద్మరాగమణిని పూర్వపు గ్రంథాలలో చాలా చక్కగా వర్ణించారు.


అప్పుడే ఉదయించుచున్న సూర్యబింబమువలె ప్రకాశించునది పద్మరాగం. దానిమ్మ – పుష్పంలాగా ప్రకాశించునది. సౌగంధికము. కామ వికారాన్ని పొందిన కోకిల నేత్రమువలె ఉండునది కురువిందము, కుందేలు మానసము ఖండము వలె చక్కని ఎరుపు కాంతి కలది మాంసగంధి, నలుపు ఎరుపు కలిసి కన్పించునది నీలగంధి, లెస్సగా వికసించిన లొద్దుగ పూయవలెను. అశోక పుష్పమువలెను, మంకెన పువ్వు వలెను ప్రకాశించు కెంపులే పూర్ణమైన విలువ కలిగి ఉండును.

కెంపులొ దోషాలు                                                                        ఫలితం
పటలం: తెల్లని రంగులో వున్నవి                                                      దరిద్రం
త్రాస: బీటలు వారి పగుళ్ళువున్నవి                                                 కలహాలు
భిన్న: ముక్కలు ముక్కలుగా వున్నవి                                            కష్టాలు
జర్ఘర: పొరలు పొరలుగా వున్నవి                                                   విరోధాలు
కర్కశ: మొద్దుగా వున్నవి                                                            ప్రాణాపాయం
నీలము: నల్లగా వున్నవి                                                              శతృవృద్ధి, ఉపద్రవాలు

ఇప్పుడు అత్యుత్తమ లక్షణాలతో ఉన్న కెంపులు లభించడం లేదు కెంపులలొ లేత పండురంగు లేదా పర్పల్ ఎరుపు అతి విలువైనది. కెంపు అనేది కోరండమ్ జాతికి చెందినది. అల్యూమినియం కి సంబంధించిన క్రిస్టలైజెడ్ ఆక్సైడ్, ఇందులో కొద్దిపాటి క్రోమియం కలపడం వలన కెంపు ఎరుపు రంగులో వుంటుంది.

బర్మాలోని మోంగాక్ జిల్లాలో మేలిమి జాతికి చెందినా కెంపులు దొరుకుతాయి. అలాగే శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా గనులలో కూడా కెంపులు లభిస్తాయి. భారతదేశంలోను కెంపులు దొరుకుతాయి. కాని క్వాలిటీ కెంపులు మాత్రము లభించడం లేదు.

సరైన జాతి కెంపులు ధరించడం వలన ఆ వ్యక్తికీ సంపద, సంతానం, సంతోషం, ధైర్యం, సంఘంలో పరపతి కలుగుతుంది. వ్యక్తి ఆత్మవిశ్వాసము ఇనుమడిస్తుంది. కెంపును ఆది, సోమ, మంగళ వారాల్లో ధరించవచ్చు. కుడి చెయ్యి ఉంగరం వ్రేలికి ధరించడం మంచిది.

కెంపుకు ఉన్న ఇతర నామాలు:
వ్యాపారనామము - రూబి, స్టార్ రూబి, దేశీయనామం - మానిక్, మానక, రూబి. ఇతరనామాలు - కీలాలము, మాణిక్యము, తామరకెంపు, కుబిల్వము, కురువిందము, కురివిల్లము, కుల్మాషము, నీలగంధి, రోహితము, సౌగంధికము, పద్మరాగమణి, మాణిక్యం.

లక్షణాలు:
రసాయన సమ్మేళనం, Al2O3, అల్యూమినియం ఆక్సైడ్, స్పటిక ఆకారం - హెక్సాగొనాల్, మెరుపు (Luster), విట్రియస్, కఠినత్వము - 9 ధృడత్వము - గుడ్,సాంద్రము, (S.G)- 3.99 – 4.00, క్లీవేజ్ - అస్పష్టంగా, ఏక లేక ద్వికరణ ప్రసారం (SR/DR)- DR పగులు (Fracture) శంకు ఆకృతి నుండి అసమానం, అంతర్గత మూలకాలు (Inclusions) లభించు ప్రదేశమును బట్టి అంతర్గత మూలకాలు మారతాయి. ఫింగర్ ప్రింట్స్ సిల్క్ త్రికోణాకారపు సూదులు, క్రిస్టల్స్, ఫెదర్స్ ఉంటాయి. (కాంతి వరవర్తన పట్టిన) R.I.1.762-1.770, అతినీలలోహిత కిరణాల పరీక్ష (U.V. Light) జడం నుండి బలంగా, సాదృశ్యాలు, - జిర్కాన్, స్పినల్, టుర్ములిన్, గార్మెట్, బిక్స్ బైట్, కృత్రిమరూబి. కృత్రిమమైన వాటిని అంతర్గత మలినములను బట్టి గుర్తిస్తారు. వీటిని ప్లక్స్, హైడ్రోథర్మల్ పద్దతులలో తయారు చేస్తారు.



సూర్య గ్రహ దోష నివారణ

సూర్య గ్రహ దోష నివారణకు గాను సూర్యూని పూజించుట, ఆదిత్య హ్రుదయము పారయణ చేయుటకు, కెంపు,(మాణిక్యము) ధరిచుట , సుర్యునకు గోధుములు, బెల్లం, కంచు, గుర్రము,రక్త చందనము,పద్మములు, ఆదివారము, దానము చేసినచో రవి వలన కలిగిన దోషములు తొలగును. మరియు కంచుచే చేయబడినను ఉంగరం ధరించుట వలనను,మంజిష్టము గజమదము,కుంకుమ పువ్వు రక్తచందనములను రాగి పాత్రయందలి నీటిలో కలిపి ఆ రాగి పాత్ర యందలి నీటితో స్నానము చేసిన దోష నివృత్తి కలుగును.రాగి ఉంగరము ధరించిన కూడ మంచిది.
శుభ తిధి గల ఆదివారమునందు సూర్యుని ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః సూర్యాయనమహః అను మూలమంత్రమును 40 రోజులలో 6 వేలు జపము పూర్తి చేసిన సూర్యసంభంధమైన దోషము తొలగును. 




|| అథ ఆదిత్యహృదయమ్||


తతో యుద్ధపరిశ్రాన్తం సమరే చిన్తయా స్థితమ్‌|
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్‌|| ౧||

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్‌|
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః|| ౨||

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్‌|
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి|| ౩||

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్‌|
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్‌|| ౪||

సర్వమఙ్గలమాఙ్గల్యం సర్వపాపప్రణాశనమ్‌|
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్‌|| ౫||

రశ్మిమంతం సముద్యన్తం దేవాసురనమస్కృతమ్‌|
పూజయస్వ వివస్వన్తం భాస్కరం భువనేశ్వరమ్‌|| ౬||

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః|
ఏష దేవాసురగణాఁల్లోకాన్‌ పాతి గభస్తిభిః|| ౭||

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కన్దః ప్రజాపతిః|
మహేన్ద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః|| ౮||

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః|
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః|| ౯||

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్‌|
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః|| ౧౦||

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్‌|
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాణ్డ అంశుమాన్‌|| ౧౧||

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః|
అగ్నిగర్భోऽదితేః పుత్రః శఙ్ఖః శిశిరనాశనః|| ౧౨||

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః|
ఘనవృష్టిరపాం మిత్రో విన్ధ్యవీథీ ప్లవఙ్గమః|| ౧౩||

ఆతపీ మణ్డలీ మృత్యుః పిఙ్గలః సర్వతాపనః|
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్‌భవః|| ౧౪||

నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః|
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోऽస్తు తే|| ౧౫||

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః|
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః|| ౧౬||

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః|
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః|| ౧౭||

నమః ఉగ్రాయ వీరాయ సారఙ్గాయ నమో నమః|
నమః పద్మప్రబోధాయ మార్తాణ్డాయ నమో నమః|| ౧౮|| or మార్తణ్డాయ

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే|
భాస్వతే సర్వభక్శాయ రౌద్రాయ వపుషే నమః|| ౧౯||

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే|
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః|| ౨౦||

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే| or హరయే విశ్వకర్మణే
నమస్తమోऽభినిఘ్నాయ రుచయే లోకసాక్శిణే|| ౨౧||


నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః|
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః|| ౨౨||


ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః|
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్‌|| ౨౩||


వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ|
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః|| ౨౪||


|| ఫల శ్రుతిః||
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాన్తారేషు భయేషు చ|
కీర్తయన్‌ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ|| ౨౫||

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్‌పతిమ్‌|
ఏతత్‌ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి|| ౨౬||

అస్మిన్క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి|
ఏవముక్త్వా తదాऽగస్త్యో జగామ చ యథాగతమ్‌|| ౨౭||

ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోऽభవత్తదా|
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్‌|| ౨౮||

ఆదిత్యం ప్రేక్శ్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్‌|
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్‌|| ౨౯||

రావణం ప్రేక్శ్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్‌|
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోऽభవత్‌|| ౩౦||

అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః|
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి|| ౩౧||

|| ఇతి ఆదిత్యహృదయమ్ || 

|| అథ సూర్యమణ్డలాష్టకమ్‌ ||


నమః సవిత్రె జగదెకచక్శుషె జగత్ప్రసూతీ స్థితి నాశ హెతవె|
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణె విరఞ్చి నారాయణ శఙ్కరాత్మన్‌|| ౧||

యన్మణ్డలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాది రూపమ్‌|

దారిద్ర్య దుఖక్శయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరెణ్యమ్‌|| ౨||

యన్మణ్డలం దెవ గణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తి కొవిదమ్‌|

తం దెవదెవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరెణ్యమ్‌|| ౩||

యన్మణ్డలం జ్ఞాన ఘనం త్వగమ్యం త్రైలొక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్‌|

సమస్త తెజొమయ దివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరెణ్యమ్‌|| ౪||

యన్మణ్డలం గుఢమతి ప్రబొధం ధర్మస్య వృద్ధిం కురుతె జనానామ్‌|

యత్సర్వ పాప క్శయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరెణ్యమ్‌|| ౫||

యన్మణ్డలం వ్యాధి వినాశ దక్శం యదృగ్యజుః సామసు సంప్రగీతమ్‌|

ప్రకాశితం యెన భూర్భువః స్వః పునాతు మాం తత్సవితుర్వరెణ్యమ్‌|| ౬||

యన్మణ్డలం వెదవిదొ వదన్తి గాయన్తి యచ్చారణ సిద్ధ సఙ్ఘాః|

యద్యొగినొ యొగజుషాం చ సఙ్ఘాః పునాతు మాం తత్సవితుర్వరెణ్యమ్‌|| ౭||

యన్మణ్డలం సర్వజనెషు పూజితం జ్యొతిశ్చకుర్యాదిహ మర్త్యలొకె|

యత్కాలకల్ప క్శయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరెణ్యమ్‌|| ౮||

యన్మణ్డలం విశ్వసృజం ప్రసీదముత్పత్తిరక్శా ప్రలయ ప్రగల్భమ్‌|

యస్మిఞ్జగత్సంహరతెऽఖిలం చ పునాతు మాం తత్సవితుర్వరెణ్యమ్‌|| ౯||

యన్మణ్డలం సర్వగతస్య విష్ణొరాత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్‌|

సూక్శ్మాన్తరైర్యొగపథానుగమ్యె పునాతు మాం తత్సవితుర్వరెణ్యమ్‌|| ౧౦||

యన్మణ్డలం వేదవిదో విదన్తి గాయన్తి తచ్చారణసిద్ధ సఙ్ఘాః|

యన్మణ్డలం వేదవిదే స్మరన్తి పునాతు మాం తత్సవితుర్వరెణ్యమ్‌|| ౧౧||

యన్మణ్డలం వేదవిదోపగీతం యద్యోగినాం యోగ పథానుగమ్యమ్‌|

తత్సర్వ వోదం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరెణ్యమ్‌|| ౧౨||

 


|| సూర్య నమస్కార మంత్రములు ||

ఔమ్ ధ్యెయః సదా సవితృమణ్డల మధ్యవర్తి|
నారాయణః సరసిజాసన్సంఇవిష్టః|
కెయూరవాన మకరకుణ్డలవాన కిరీటీ|
హారీ హిరణ్మయవపుధృ|ర్తశంఖచక్రః||

ఔమ్ మిత్రాయ నమః|
ఔమ్ రవయె నమః|
ఔమ్ సూర్యాయ నమః|
ఔమ్ భానవె నమః|
ఔమ్ ఖగాయ నమః|
ఔమ్ పూష్ణె నమః|
ఔమ్ హిరణ్యగర్భాయ నమః|
ఔమ్ మరీచయె నమః|
ఔమ్ ఆదిత్యాయ నమః|
ఔమ్ సవిత్రె నమః|
ఔమ్ అర్కాయ నమః|
ఔమ్ భాస్కరాయ నమః|
ఔమ్ శ్రీసవితృసూర్యనారాయణాయ నమః||

ఆదితస్య నమస్కారాన్‌ యె కుర్వన్‍తి దినె దినె|
జన్మాన్తరసహస్రెషు దారిద్ర్‌యం దొష నాశతె|
అకాలమృత్యు హరణం సర్వవ్యాధి వినాశనమ్‌|
సూర్యపాదొదకం తీర్థం జఠరె ధారయామ్యహమ్‌||

యొగెన చిత్తస్య పదెన వాచా మలం శరీరస్య చ వైద్యకెన|
యొపాకరొత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతొऽస్మి||

||సూర్య కవచం||


శ్రీభైరవ ఉవాచ
యో దేవదేవో భగవాన్‌ భాస్కరో మహసాం నిధిః|
గయత్రీనాయకో భాస్వాన్‌ సవితేతి ప్రగీయతే|| ౧||
తస్యాహం కవచం దివ్యం వజ్రపఞ్జరకాభిధమ్‌|
సర్వమన్త్రమయం గుహ్యం మూలవిద్యారహస్యకమ్‌|| ౨||
సర్వపాపాపహం దేవి దుఃఖదారిద్ర్యనాశనమ్‌|
మహాకుష్ఠహరం పుణ్యం సర్వరోగనివర్హణమ్‌|| ౩||
సర్వశత్రుసమూహఘ్నం సమ్గ్రామే విజయప్రదమ్‌|
సర్వతేజోమయం సర్వదేవదానవపూజితమ్‌|| ౪||
రణే రాజభయే ఘోరే సర్వోపద్రవనాశనమ్‌|
మాతృకావేష్టితం వర్మ భైరవానననిర్గతమ్‌|| ౫||
గ్రహపీడాహరం దేవి సర్వసఙ్కటనాశనమ్‌|
ధారణాదస్య దేవేశి బ్రహ్మా లోకపితామహః|| ౬||
విష్ణుర్నారాయణో దేవి రణే దైత్యాఞ్జిష్యతి|
శఙ్కరః సర్వలోకేశో వాసవోऽపి దివస్పతిః|| ౭||
ఓషధీశః శశీ దేవి శివోऽహం భైరవేశ్వరః|
మన్త్రాత్మకం పరం వర్మ సవితుః సారముత్తమమ్‌|| ౮||
యో ధారయేద్‌ భుజే మూర్ధ్ని రవివారే మహేశ్వరి|
స రాజవల్లభో లోకే తేజస్వీ వైరిమర్దనః|| ౯||
బహునోక్తేన కిం దేవి కవచస్యాస్య ధారణాత్‌|
ఇహ లక్ష్మీధనారోగ్య-వృద్ధిర్భవతి నాన్యథా|| ౧౦||
పరత్ర పరమా ముక్తిర్దేవానామపి దుర్లభా|
కవచస్యాస్య దేవేశి మూలవిద్యామయస్య చ|| ౧౧||
వజ్రపఞ్జరకాఖ్యస్య మునిర్బ్రహ్మా సమీరితః|
గాయత్ర్యం ఛన్ద ఇత్యుక్తం దేవతా సవితా స్మృతః|| ౧౨||
మాయా బీజం శరత్‌ శక్తిర్నమః కీలకమీశ్వరి|
సర్వార్థసాధనే దేవి వినియోగః ప్రకీర్తితః|| ౧౩||
ఓం అం ఆం ఇం ఈం శిరః పాతు ఓం సూర్యో మన్త్రవిగ్రహః|
ఉం ఊం ఋం ౠం లలాటం మే హ్రాం రవిః పాతు చిన్మయః|| ౧౪||
~ళుం ~ళూం ఏం ఐం పాతు నేత్రే హ్రీం మమారుణసారథిః|
ఓం ఔం అం అః శ్రుతీ పాతు సః సర్వజగదీశ్వరః|| ౧౫||
కం ఖం గం ఘం పాతు గణ్డౌ సూం సూరః సురపూజితః|
చం ఛం జం ఝం చ నాసాం మే పాతు యార్ం అర్యమా ప్రభుః|| ౧౬||
టం ఠం డం ఢం ముఖం పాయాద్‌ యం యోగీశ్వరపూజితః|
తం థం దం ధం గలం పాతు నం నారాయణవల్లభః|| ౧౭||
పం ఫం బం భం మమ స్కన్ధౌ పాతు మం మహసాం నిధిః|
యం రం లం వం భుజౌ పాతు మూలం సకనాయకః|| ౧౮||
శం షం సం హం పాతు వక్షో మూలమన్త్రమయో ధ్రువః|
ళం క్షః కుక్ష్సిం సదా పాతు గ్రహాథో దినేశ్వరః|| ౧౯||
ఙం ఞం ణం నం మం మే పాతు పృష్ఠం దివసనాయకః|
అం ఆం ఇం ఈం ఉం ఊం ఋం ౠం నాభిం పాతు తమోపహః|| ౨౦||
~ళుం ~ళూం ఏం ఐం ఓం ఔం అం అః లిఙ్గం మేऽవ్యాద్‌ గ్రహేశ్వరః|
కం ఖం గం ఘం చం ఛం జం ఝం కటిం భానుర్మమావతు|| ౨౧||
టం ఠం డం ఢం తం థం దం ధం జానూ భాస్వాన్‌ మమావతు|
పం ఫం బం భం యం రం లం వం జఙ్ఘే మేऽవ్యాద్‌ విభాకరః|| ౨౨||
శం షం సం హం ళం క్షః పాతు మూలం పాదౌ త్రయితనుః|
ఙం ఞం ణం నం మం మే పాతు సవితా సకలం వపుః|| ౨౩||
సోమః పూర్వే చ మాం పాతు భౌమోऽగ్నౌ మాం సదావతు|
బుధో మాం దక్షిణే పాతు నై‌ఋత్యా గురరేవ మామ్‌|| ౨౪||
పశ్చిమే మాం సితః పాతు వాయవ్యాం మాం శనైశ్చరః|
ఉత్తరే మాం తమః పాయాదైశాన్యాం మాం శిఖీ తథా|| ౨౫||
ఊర్ధ్వం మాం పాతు మిహిరో మామధస్తాఞ్జగత్పతిః|
ప్రభాతే భాస్కరః పాతు మధ్యాహ్నే మాం దినేశ్వరః|| ౨౬||
సాయం వేదప్రియః పాతు నిశీథే విస్ఫురాపతిః|
సర్వత్ర సర్వదా సూర్యః పాతు మాం చక్రనాయకః|| ౨౭||
రణే రాజకులే ద్యూతే విదాదే శత్రుసఙ్కటే|
సఙ్గామే చ జ్వరే రోగే పాతు మాం సవితా ప్రభుః|| ౨౮||
ఓం ఓం ఓం ఉత ఓంఉ‌ఔమ్ హ స మ యః సూరోऽవతాన్మాం భయాద్‌|
హ్రాం హ్రీం హ్రుం హహహా హసౌః హసహసౌః హంసోऽవతాత్‌ సర్వతః|
సః సః సః సససా నృపాద్వనచరాచ్చౌరాద్రణాత్‌ సంకటాత్‌|
పాయాన్మాం కులనాయకోऽపి సవితా ఓం హ్రీం హ సౌః సర్వదా|| ౨౯||
ద్రాం ద్రీం ద్రూం దధనం తథా చ తరణిర్భాంభైర్భయాద్‌ భాస్కరో
రాం రీం రూం రురురూం రవిర్జ్వరభయాత్‌ కుష్ఠాచ్చ శూలామయాత్‌|
అం అం ఆం వివివీం మహామయభయం మాం పాతు మార్తణ్డకో
మూలవ్యాప్తతనుః సదావతు పరం హంసః సహస్రాంశుమాన్‌|| ౩౦||
ఇతి శ్రీకవచ దివ్యం వజ్రపఞ్జరకాభిధమ్‌|
సర్వదేవరహస్యం చ మాతృకామన్త్రవేష్టితమ్‌|| ౩౧||
మహారోగభయఘ్నం చ పాపఘ్నం మన్ముఖోదితమ్‌|
గుహ్యం యశస్కరం పుణ్యం సర్వశ్రేయస్కరం శివే|| ౩౨||
లిఖిత్వా రవివారే తు తిష్యే వా జన్మభే ప్రియే|
అష్టగన్ధేన దివ్యేన సుధాక్షీరేణ పార్వతి|| ౩౩||
అర్కక్షీరేణ పుణ్యేన భూర్జత్వచి మహేశ్వరి|
కనకీకాష్ఠలేఖన్యా కవచం భాస్కరోదయే|| ౩౪||
శ్వేతసూత్రేణ రక్తేన శ్యామేనావేష్టయేద్‌ గుటీమ్‌|
సౌవర్ణేనాథ సంవేష్ఠ్య ధారయేన్మూర్ధ్ని వా భుజే|| ౩౫||
రణే రిపూఞ్జయేద్‌ దేవి వాదే సదసి జేష్యతి|
రాజమాన్యో భవేన్నిత్యం సర్వతేజోమయో భవేత్‌|| ౩౬||
కణ్ఠస్థా పుత్రదా దేవి కుక్షిస్థా రోగనాశినీ|
శిరఃస్థా గుటికా దివ్యా రాకలోకవశఙ్కరీ|| ౩౭||
భుజస్థా ధనదా నిత్యం తేజోబుద్ధివివర్ధినీ|
వన్ధ్యా వా కాకవన్ధ్యా వా మృతవత్సా చ యాఙ్గనా|| ౩౮||
కణ్ఠే సా ధారయేన్నిత్యం బహుపుత్రా ప్రజాయయే|
యస్య దేహే భవేన్నిత్యం గుటికైషా మహేశ్వరి|| ౩౯||
మహాస్త్రాణీన్ద్రముక్తాని బ్రహ్మాస్త్రాదీని పార్వతి|
తద్దేహం ప్రాప్య వ్యర్థాని భవిష్యన్తి న సంశయః|| ౪౦||
త్రికాలం యః పఠేన్నిత్యం కవచం వజ్రపఞ్జరమ్‌|
తస్య సద్యో మహాదేవి సవితా వరదో భవేత్‌|| ౪౧||
అజ్ఞాత్వా కవచం దేవి పూజయేద్ యస్త్రయీతనుమ్‌|
తస్య పూజార్జితం పుణ్యం జన్మకోటిషు నిష్ఫలమ్‌|| ౪౨||
శతావర్తం పఠేద్వర్మ సప్తమ్యాం రవివాసరే|
మహాకుష్ఠార్దితో దేవి ముచ్యతే నాత్ర సంశయః|| ౪౩||
నిరోగో యః పఠేద్వర్మ దరిద్రో వజ్రపఞ్జరమ్‌|
లక్ష్మీవాఞ్జాయతే దేవి సద్యః సూర్యప్రసాదతః|| ౪౪||
భక్త్యా యః ప్రపఠేద్‌ దేవి కవచం ప్రత్యహం ప్రియే|
ఇహ లోకే శ్రియం భుక్త్వా దేహాన్తే ముక్తిమాప్నుయాత్‌|| ౪౫||
ఇతి శ్రీరుద్రయామలే తన్త్రే శ్రీదేవిరహస్యే
వజ్రపఞ్జరాఖ్యసూర్యకవచనిరూపణం త్రయస్త్రింశః పటలః|| ౩౩||

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...