వైడూర్యము :
వైడూర్య రత్నలు కేతు గ్రహానికి సంభంధించినవి. న్యాయాన్యాయ వివేచన, పుణ్యపాప
వివక్షత, ధర్మాధర్మ పరిశీలనలు గల చిత్ర గుప్తుని అంశవల్ల ఈ వైడూర్య
రత్నాలు పుట్టినట్లు కొందరు చెబుతారు. శరత్కాలంలో చంద్రుని యొక్క షోడస కళలు
గల వెన్నెల కిరణలు కొన్ని రసాయన ధాతువులు కలిగిన శిలాభూములయందు ప్రవేశించి
అచ్చట రసధాతువులు గల శిలాభూములయందు ప్రవేశించి అచ్చటి రసధాతువులుగల శిలలకు
చంద్రకిరణములకు కలిగే పరస్పర సంయోగం వలన ఆశిలలు కొంత కాలానికి వైడూర్య
రత్నాలుగా మారతున్నవని కొందరి అభిప్రాయము.
అశ్వని, మఘ, మూల జన్మ నక్షత్రాలుగా కలిగియున్నవారువైడూర్యాన్ని ఏ సమయములో
నైనను ధరించవచ్చును. మిగిలిన నక్షత్రములు గలవారు తమ జన్మ కాలమందలి
గ్రహస్థితి ననుసరించి కేతువు యొక్క దోషప్రదమైన కాలము నందు ఈ రత్నము ధరించుట
ఉత్తమము. జన్మజాతకములందు శుభస్థానములందు కేతువు బలహీనుడై ఉన్నప్పుడు
వైడూర్యధారన చేసిన ఆ కేతువు సకల శుభముల నొసగును. బలవంతుడైన కేతుగ్రహము
6-8-12 స్థానములందుండుట ఆ స్థానాధిపతులతో కలసి చూడబడుట చాలా దోషప్రదము.
పాపగ్రహముల యతి, దృష్టి వేధల వంటి సంబంధములు కలిగియున్న కేతువు అపకారమును
చేయగలడు, లగ్నము నుండి 2 వ స్థానమునందు పాపబలముగల కేతువుండుట, ఆ విధముగా
పంచమ స్థానమందుండుట, ఏడవ స్థాన మునందుండుట 9 వ స్థానమునందుండుట కూడా
దోషప్రదమే!
జన్మ లగ్నము ననుసరించి ఏర్పడిన గ్రహములు బలాబలములందు కేతుగ్రహము పూర్తి
బలవంతుడై దుష్ఠ స్థానములందుండగా అతని మహర్దశ, అంతర్దశలు, ఇతర యోగదశలలో ఇతని
అంతర్దశలు, విదశలు సంభవించినప్పుడుషడ్వర్గబలము, అషటకవర్గ బిందు బలము కలిగి
కేతువు గోచారము నందు దుష్టస్థానములందు సంభవించు గొప్ప భయముతో కూడిన
కష్టములు ప్రాప్తించగలవు. అంతే గాక దోషప్రదమైన కేతు గ్రహానికి సంబంధించిన
కాలంలో పిచ్చి ఉన్మాదము, భిక్షుక వృత్తి, కృరప్రదేశములందు నివాసము సరియైన
ఆహార నిద్రాదులు లేకుండుట, సిరి సంపదలు అకారణముగా తొలగిపోవుట, కృషి నాశనము
ఉద్యోగ భంగము, కుటుంబకలహము విరక్తి, భార్య నష్టము పితృమృతి, సంతాన
కష్టనష్టములు, దుష్కీర్తి, అపజయము, వేదన, శతృభీతి విషజంతువులచే ప్రమాదము,
ధన సంభంధమైన ఇబ్బండులు, కోర్టు వ్యవహారములు కోర్టు వ్యవహారములలో ప్రతికూలత,
మనో వ్యద పిల్లల బాలారిష్టములు కురుపులు మొదలగు చేమ వ్యాదులు కలరా,
విడువని తల నొప్పి, అజీర్ణవ్యాధులు, దురదలు ఆటలమ్మ, తడపర, ఉబ్బాసం కాన్సర్,
ప్రసూతి బాధలు, నొప్పులు సరిగారాక పోవడం, కష్టమైన కాన్పు, గుర్రపు వాతము
తీవ్రమైన దరిద్రము, మొదలగు అనేక విషమ పరిణామములు సంభవించి దుఃఖపెట్టగలవు.
అటువంటి సందర్భాలలో వైడుర్య రత్నము ధరించడం వలన సత్ఫలితాలు
కలుగును.వైడూర్యాల ద్వారా కలిగే శుభయోగాలు : ఉత్తమ జతికి చెందిన దోషరహితమైన
వైడూర్యమును ధరించిన యెడల జీవితం అభివృద్ది దాయకంగా నుండుటయే గాక ఆర్ధిక
పుష్టి కృషిలో రాణింపు ఉద్యోగ ప్రాప్తి అధికారము జనాదరణ పలుకుబడి, కీర్తి
గౌరవ మర్యాదలు, భోగ భాగ్య సంపదలు వాహన ప్రాప్తి గృహ లబ్ది, కళత్ర సౌఖ్యము,
కుటుంబ సుఖశాంతులు శతృనాశనము, జయము కార్యశిద్ది దేహా రోగ్యము, సకల
వ్యాధినాశనము, ఆయువృద్ది, అరిష్టనివారణ, దుష్టగ్రహ బాధా విముక్తి,
దేవతానుగ్రహము సుఖము శాంతి సద్భావన, సజ్జన స్నేహము, సర్పదోష పరిహారము,
సంతానప్రాప్తి, వంశాభివృద్ది కలుగగలవు.
వైడుర్యము అత్యంత మహిమాన్వితమైనదగుట వలన దీన్ని ధరించెడి వాడికి సకల
క్షేమము కలుగ చేయగలదు. ప్రసవకాలంలో స్త్రీలకు కలుగు అనేక బాధలు నివారించి
సుఖముగా శీఘ్రముగా ప్రసవము జేయింపగలరు. ఈ రత్నమును నీటియందుంచి ఆ నీటిని
ప్రసవ స్త్రీలచే త్రాగించిన శీఘ్రముగా ప్రసవించుటయే గాక ప్రసవానంతరం
సంభవించే దుష్టలక్షణముల నుండి పూర్తిగా రక్షణ కలిగించగలదు.. చర్మ వ్యాధులు
గలవారు ఈ వైడుర్యము ఆదివాసము గావించిన నీటిచే స్నానము చేసిన అనతి కాలంలోనే
చర్మ వ్యాధుల నుండి విముక్తులై ఆరోగ్యవంతులు కాగలరు. గృహము నందలి
సింహద్వారామునకు పైభాగమున వైడూర్యములు తాపటము జేయించిన ఆ గృహమునందు
నివశించే వారికి అమ్మవారు ఆటలమ్మ, తడపర, కలరా, మొదలగు బాధించవు.
వైడూర్య రత్నము అమోఘమైన శక్తి సంపన్నమై యున్నది. ఇది ధరించిన శతృవులు సైతం
మితృలుగా మారిపోగలరు. పగవారు చేయు చేత బడి, ప్రయోగములు మొదలగు కృత్రిమములు
భూత భేతాళ, యక్ష రాక్షస, శాకినీ, కామినీ మొహినీ, గ్రహబాధలు దరిజేరలేవు.
దీని వలన జీవితములో మంచి అభివృద్ది, మేధాశక్తి, ఆలోచనా పటిమను, కర్య సాధన,
జనాకర్షన, జనరంజనలకీ వైడూర్యమును మించిన రత్నము మరొకటి లేదు.
వైడూర్యము ధరించే పద్ధతి :
రత్నాలకు గ్రహాలకు చాలా అవినాభావ సంభంధంఉంది. అదే విధంగా మానవ జీవితాలకు
కూడా దగ్గర సంభంధం ఉన్నది.జీవితంలో కలిగే కష్టసుఖాలు, వ్యాధిబాధలు,
దుఃఖసంతోషాలకు, గ్రహాలు మూల కారణమని జోతిష్యశాస్త్రం చెబుతుంది. ఈ
మానవజీవితంలో కలిగే వ్యతిరేక ఫలితాలనుండి తప్పుకొని పూర్తి శుభఫలితాలు
పొందడానికి గ్రహశాంతులతో బాటుగా రత్నములను ధరించే విధానాలు కుడా
జ్యోతిశాస్త్ర పరమైనవే !
దోషరహితమైన ఉత్తమజాతికి చెందిన ప్రకాశవంతమైన వైడూర్యము, బంగారం లేదా
వెండితో లేదా పంచలోహాలతో తయారు చేయ బడిన ఉంగరము నందు ఇమిడ్చి ధరించాలి
ఉంగరము అడుగు భాగం రంద్రమును కలిగి ఉండే విధంగా పైభాగం ద్వజాకారం లేదా
వర్తుల, చతురస్రాకారము గలిగిన పీఠమును ఏర్పరచి దాని మధ్యభాగంలో సూత్రం పైకి
కనిపించే విధంగా వైడూర్యమును బిగించి, శుద్దిగావించిన పిమ్మట
శాస్త్రోక్తముగా షోడశోపచార పూజలు నిర్వర్తించి శుభముహూర్తమున ధరించాలి
కేతుగ్రహస్తమైన సూర్య చంద్రగ్రహణములు సంభవించిన కాలంలో వైడూర్య రత్నాన్ని
ఉంగరంలో బిగించడం చాలా ఉత్తమం మరియు, మూలా, ఉత్తరాషాడ, ధనిష్ఠ అను
నక్షత్రములచే కూడివచ్చిన అమావాస్య ఆదివారం యందు గానీ మృగశిర 1-2 పాదములయందు
గానీ, ఉత్తర నక్షత్రములు గల సోమవారంగానీ శ్రావణమాసంలో శుక్లపంచమి,
పూర్ణిమాతిదులయందుగానీ వర్జ్య దుర్ముహుర్తములు లేకుండా చూచి రవి లేదా చంద్ర
హోరాలు జరిగే సమయంలో వైడూర్య ఉంగరమును బిగించాలి. ఆ తర్వాత దానిని ఒక
దినమంతయు ఉలవ నీటియందుంచి, మరుసటి రోజు పంచ గవ్యములందు, మూడవదినము తేనెను
కలిపిన నీటియందు నిద్ర గావింపజేసి శుద్ధోదకము చేత పంచామృతము చేత స్నానము
గావింపజేసి ఆ ఉంగరమును శాస్త్రోక్తవిధిగా ధూపదీప నైవేద్యములచే షోడశోపచార
పూజలు గావింపజేసిన పిమ్మట అనుకూలమైన శుభముహుర్తాన చేతికి ధరించవలెను.
ధరించెడివాడు తమకు తారాబలం, చంద్రబలం కలిగిన శుభతిదులయందు, కృత్తిక,
రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, చిత్త, శ్రవనం, ధనిష్ఠ, ఉత్తరాషాఢ
నక్షత్రములు గల ఆదివారము, సోమవారము, మంగళవారములందు ధనుర్మీన కుంభరాసులు గల
సమయంలో ఉంగరమును ధరించుట ప్రశస్తము, ధరించుటకు ముందుగా ఉంగరమును తన
కుడిచేతి హస్తమునందుంచుకొని తూర్పు లేక ఉత్తర ముఖముగా నిలబడి గురువును,
గణపతిని ధ్యానించి "ఓం హ్రీం క్రీం ఐం హ్రీం శ్రీం కేతవేఖండ శిరసే స్వాహా "
అను మంత్రమునుగానీ, "సోమోధేనుగం"అను వేద మంత్రమునుగానీ 108 పర్యాయాలు
జపించి ఉంగరమును ముమ్మారు కనుకద్దుకొని కుడిచేతి ఉంగరపు(అనామిక)వ్రేలికి
ధరించాలి. స్త్రీలు ఎడమ చేతికి ధరించినను దోషంలేదు. ఈ వైడూర్యమును
బొటనవ్రేలికి ధరించినను దోషంలేదు. బొటన వ్రేలికి ధరించిన మంత్రసిద్ధులు
చేకూరగలవు. చూపుడు వ్రేలికి ధరించిన ఆద్యాత్మికాభివృద్ది, వైరాగ్యము,
మోక్షము, ప్రాప్తించగలవు.నడిమి వ్రేలికి ధరించకూడదు. చిటికెన వ్రేలికి
ధరించిన వ్యాపారాభివృద్ది, ఉద్యోగప్రాప్తి, విద్యాజయము, కార్యసిద్ధి
కలుగును. హస్తకంకణమునందిమిడ్చి మణికట్టునకు (గాజువలే)ధరించిన సర్వార్థ
సాధనము కలుగును.
వైడూర్యం
వైడూర్యంలో దోషాలు:
కర్కరము: రాయి వలె కనిపించునవి
కర్కశము: గరుకుగా వున్నవి
త్రాసము: ముక్కలు ముక్కలుగా కనిపించునవి
దేహము: కాంతి లేకుండా వున్నవి.
కళంకము: నల్లని రంగులో వున్నవి
వైడూర్యమునకు ఇతర నామాలు:
లక్షణాలు:
రసాయన సమ్మేళనం:
కేతు గ్రహ దోష నివారణ
కేతు దోష నివారణకుగాను కేతుగ్రహమును పూజించి సూర్యనమస్కారములు చేయుచు ఉలవలు దానమీయవలెను,వైఢూర్యము,నూనె,శాలువా,కస్తూరి,ఉలవలు వీటిని దానముచేసినను కేతుగ్రహ దోషనివారణ కలుగును.ఖడ్గమృగము కొమ్ముతో చేయబడిన పాత్రయందు గల నీటిలో పర్వతముల యందు పందికొమ్ముచే త్రవ్వబడిన మట్టి,మేకపాలు కలిపి ఆ నీటితో స్నానము చేసినచో కేతుగ్రహ దోష నివారణ కలుగును.పంచలోహముల ఉంగరము ధరించుట సాంప్రదాయము.
శుభతిధిఅ గల మంగళవారము నాటి నుండి ఓం-ప్రాం-ప్రీం-ప్రౌం-సః కేతవే నమః అను మంత్రమును 40 రోజులలో 7 వేలు జపము పూర్తి చేసి 41వ రోజున ఎర్రని వస్త్రములో ఉలవలు పోసి దానమిచ్చినచో కేతుగ్రహ దోష నివారణ కలుగును.
వైడూర్యం
ఈ
రత్నం కేతు గ్రహానికి సమంధించింది. వైడూర్యాన్ని ఇంగ్లిషులో 'క్యాట్స్ ఐ'
(Cats eye) అంటారు. రాత్రివేళ పిల్లి కళ్ళలో హెడ్ లైట్స్ వెలుగు
పడినప్పుడు ఆ కళ్ళలో ప్రతిఫలిచే రంగులు 'వైడూర్యం' లోనూ మనకు కనిపిస్తాయి.
పల్చని హనీబ్రౌన్ మరియు యాపిల్ గ్రీన్ రంగుల్లో వైడూర్యం వుంటుంది.
'క్యాట్స్ ఐ' క్రెసోబెరిల్ ప్యామిలీకి చెందినది. క్రెసోబెరిల్ అనేది
అల్యూమినేట్ బెరీలియం. ఈ రత్నానికి దాని తాలూకు లస్టర్, రంగులోని రిచ్నెస్,
ఐ తాలుకూ షార్ప్ నెస్, క్లారిటీలతో షేప్ ని అనుసరించి విలువ నిర్ణయించడం
జరుగుతుంది. ఇన్ సైడ్ బ్యాండ్ బ్రిలియంట్ గా, స్త్రెయిట్ గా వుంటే
వైడూర్యం సుపీరియర్ క్వాలిటీగా చెప్పబడుతుంది. అలాగే కొన్ని వైడూర్యాలు
'మిల్క్ అండ్ హనీ' ఎఫెక్ట్ వ్ ని ప్రతిఫలిస్తాయి. అంటే ఈ వైడూర్యం మీద
ప్లాష్ లైట్ వేసినప్పుడు సగభాగం తెల్లగా, మిగిలిన సగభాగం తేనె రంగులో
కనిపిస్తాయి. ఇది అంత విలువైన వైడూర్యంగా చెప్పరు. ప్లాష్ లైట్ వేసినపుడు
పసుపు, తేనెరంగుల్లో కనిపించేది బెస్ట్ క్వాలిటీగా చెప్పుకోవచ్చు.
వైడూర్యంలో దోషాలు:
కర్కరము: రాయి వలె కనిపించునవి
కర్కశము: గరుకుగా వున్నవి
త్రాసము: ముక్కలు ముక్కలుగా కనిపించునవి
దేహము: కాంతి లేకుండా వున్నవి.
కళంకము: నల్లని రంగులో వున్నవి
వైడూర్యం
అమర్చబడిన ఈజిప్టు దేశము ఆభరణములను బట్టి ఈ రత్నము ఆదేశపు చక్రవర్తులయిన
ఫెరోల కాలము నుండియు ఆ దేశమున వాడుకలో ఉన్నవని స్పష్టమగుచున్నది.
నలుపు,
తెలుపు, కలిసినది విప్రజాతి, వైడూర్యం, తెలుపు, ఎరుపు గలది క్షత్రియజాతి,
ఆకుపచ్చ, నలుపు కలిగినది వైశ్యజాతి, నలుపురంగు కలది శూద్రజాతి.
వైడూర్యమునాకు సుతారము, ధనం అత్యచ్చము, కలిలము, వ్యంగ్యము అనే అయిదు
శ్రేష్ఠ గుణములు ఉన్నాయి. కాంతిని అధికంగా వెలువరించే దాని వలె నున్నది
సుతారము, ఎక్కువ బరువుగాను చూచుటకుచిన్నదిగాను ఉన్నది ధనము, కళంకము లేనిది
అత్యచ్చము, బ్రహ్మాస్త్ర కళాస్వరూపము గల్గి కనిపించునది కలిలము,
స్పస్టముగా వేరుగా కాన్పించు అవయవములు కలది వ్యంగ్యము అని చెప్పుదురు.
వైడూర్యమునకు ఇతర నామాలు:
ఏకసూత్రము, కేతుప్రియము, కైతనము, ఖరాబ్జాంకురము, వైడూర్యము, పిల్లి కన్నురాయి అనే పేర్లున్నాయి.
లక్షణాలు:
జాతి
- క్రైసోబెరిల్; రకాలు - సైమోఫెన్, క్రైసోబెరిల్, కాట్స్ ఐ, వ్యాపారనామం -
క్రైసోబెరిల్, క్యాట్స్ ఐ, దేశీయనామం - లసనియ, వైడూర్యం, కెత్తు,
జిడారక్స్, క్రైసోబెరిన్
రసాయన సమ్మేళనం:
Be,
Al2O3 బెరీలియం ఆక్సైడ్; స్పటిక ఆకారం - ఆర్థోరాంబిక్; స్పటిక లక్షణం -
ట్యూబ్యులార్, సైక్లిన్ ట్విన్నింగ్: వర్ణం -పసుపు, ఆకుపచ్చ, బ్రౌన్ లేదా
వీటి సమ్మేళనం వర్ణం; కారణం - ఐరన్; మెరుపు - విట్రియన్; కఠినత్వము -8.5;
ధృడత్వము - ఎక్సలెంట్; సాంద్రత S.G – 3.71 నుండి 3.72; క్లీవేజ్ -
అస్పష్టంగా ఏక లేక ద్వికిరణ ప్రసారము (SR/DR)-DR; పగులు - శంకు ఆకృతి;
అంతర్గత మూలకాలు -నీడిల్స్, కెనాల్, చిన్నట్యూబ్లు, సమాంతరంగా మరియు నిలువు
అక్షాలలో ఉంటాయి. కాంతి పరావర్తన పట్టిక (R.I)-1.745-1.754; UV light –
జడం; సాదృశ్యాలు -క్వార్జ్, క్రోసిడోలైట్, అపటైట్,మరియు టుర్మలిన్,
క్యాట్స్ ఐ.
కేతు దోష నివారణకుగాను కేతుగ్రహమును పూజించి సూర్యనమస్కారములు చేయుచు ఉలవలు దానమీయవలెను,వైఢూర్యము,నూనె,శాలువా,కస్తూరి,ఉలవలు వీటిని దానముచేసినను కేతుగ్రహ దోషనివారణ కలుగును.ఖడ్గమృగము కొమ్ముతో చేయబడిన పాత్రయందు గల నీటిలో పర్వతముల యందు పందికొమ్ముచే త్రవ్వబడిన మట్టి,మేకపాలు కలిపి ఆ నీటితో స్నానము చేసినచో కేతుగ్రహ దోష నివారణ కలుగును.పంచలోహముల ఉంగరము ధరించుట సాంప్రదాయము.
శుభతిధిఅ గల మంగళవారము నాటి నుండి ఓం-ప్రాం-ప్రీం-ప్రౌం-సః కేతవే నమః అను మంత్రమును 40 రోజులలో 7 వేలు జపము పూర్తి చేసి 41వ రోజున ఎర్రని వస్త్రములో ఉలవలు పోసి దానమిచ్చినచో కేతుగ్రహ దోష నివారణ కలుగును.
||
కేతుపఞ్చవింశతినామస్తోత్రమ్||
కేతుః కాలః కలయితా ధూమ్రకేతుర్వివర్ణకః|
లోకకేతుర్మహాకేతుః సర్వకేతుర్భయప్రదః|| ౧||
రౌద్రో రుద్రప్రియో రుద్రః క్రూరకర్మా సుగన్ధధృక్|
పలాశధూమసంకాశశ్చిత్రయజ్ఞోపవీతధృక్|| ౨||
తారాగణవిమర్దీ చ జైమినేయో గ్రహాధిపః|
పఞ్చవింశతినామాని కేతోర్యః సతతం పఠేత్|| ౩||
తస్య నశ్యతి బాధా చ సర్వకేతుప్రసాదతః|
ధనధాన్యపశూనాం చ భవేద్ వృద్ధిర్న సంశయః|| ౪||
|| ఇతి శ్రీస్కన్దపురాణే కేతోః పఞ్చవింశతినామస్తోత్రం సంపూర్ణమ్||
|| కేతుకవచమ్||
శ్రీగణేశాయ నమః|
కేతుం కరాలవదనం చిత్రవర్ణం కిరీటినమ్|
ప్రణమామి సదా కేతుం ధ్వజాకారం గ్రహేశ్వరమ్|| ౧||
చిత్రవర్ణః శిరః పాతు భాలం ధూమ్రసమద్యుతిః|
పాతు నేత్రే పిఙ్గలాక్షః శ్రుతీ మే రక్తలోచనః|| ౨||
ఘ్రాణం పాతు సువర్ణాభశ్చిబుకం సింహికాసుతః|
పాతు కణ్ఠం చ మే కేతుః స్కన్ధౌ పాతు గ్రహాధిపః|| ౩||
హస్తౌ పాతు సురశ్రేష్ఠః కుక్షిం పాతు మహాగ్రహః|
సింహాసనః కటిం పాతు మధ్యం పాతు మహాసురః|| ౪||
ఊరూ పాతు మహాశీర్షో జానునీ మేऽతికోపనః|
పాతు పాదౌ చ మే క్రూరః సర్వాఙ్గం నరపిఙ్గలః|| ౫||
య ఇదం కవచం దివ్యం సర్వరోగవినాశనమ్|
సర్వశత్రువినాశం చ ధారణాద్విజయీ భవేత్|| ౬||
|| ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే కేతుకవచం సమ్పూర్ణమ్||