ప్రశ్న (జ్యోతిష శాస్త్రము) - వికీపీడియా
వికీపీడియా నుండి
జ్యోతిష
శాస్త్రము లో "'ప్రశ్న"' ఒక ప్రత్యేకమైన విభాగం. మనసులో తలచుకొన్న
ప్రశ్నలకి , సులభంగా, సమాధానాలు చెప్పే శాస్త్రమే ```ప్రశ్న శాస్త్రము. ఆ శాస్త్రంలో ```తీసా యంత్రము చాలా చాలా .ముఖ్యమైనది.
విషయ సూచిక
తీసా యంత్రము
ఈ తీసా యంత్రంలో మూడు భాగాలు ఉన్నాయి. మొదటిది తీసా యంత్రము. రెండవది 30 ప్రశ్న చక్రాలు .ఇక చివరిది 30 సమాధాన చక్రాలు .ప్రశ్న చక్రాలు బ్రహ్మ , విష్ణు, మహేష్’, హనుమాన్’, ఇంకా పంచ భూతాలు ,ద్వాదశ రాశులు, నవ గ్రహాలు ఇత్యాది పేర్లతో మొత్తం 30 చక్రాలు ఉన్నాయి.సమాధాన చక్రాలు కూడా అవే పేర్లతో ఒక్కొక్క చక్రంలో 15 సమాధానాలతో నిండి ఉన్నాయి.ఇక నిర్ణాయక యంత్రమైన తీసాలో , నాలుగు నిలువు , నాలుగు అడ్డుగా ఉండే 16 గళ్ళలో అంకెలు మొత్తం కూడితే 30 వచ్చేలాగ ఉంటాయి ! నిజానికి తీసా అంటేనే 30 అని అర్థం ! హిందిలో “తీస్’’ అంటే ముఫ్ఫై అని అందరికీ తెలిసినదే కదా ! అలాగే సంస్కృతంలో “త్రింశ’’ అంటే ముఫ్ఫై అని అర్థం .అందుకే ఈ యంత్రాన్ని తీసా యంత్రము అని అంటారు. ఈ యంత్రం నమూనా చూడండి.ప్రశ్న చక్రాలు
- హనుమాన్ (1 ) నా మనో వాంఛ పూర్తి అవుతుందా లేదా ?
- అగ్ని (2) నాకు ఈ సంవత్సరం ఎలా గడుస్తుంది ?
- వాయువు (3) ఈ కార్యంలో లాభమా లేక నష్టమా ?
- జలము (4) నాకు ఈ ప్రదేశంలో లాభం కలుగుతుందా లేక అన్య ప్రదేశంలో కలుగుతుందా ?
- పృథ్వి (5) ఈ పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చునా లేదా ?
- ఆకాశము (6) నా నష్ట ద్రవ్యము (పోయిన వస్తువు) దొరుకునా లేదా ?
- మేషము (7) ఈ వ్యక్తిని నమ్మవచ్చా, కూడదా ?
- వృషభము (8) ఈ యాత్ర వలన లాభమా లేక నష్టమా ?
- మిథునము (9) నేను చేయదలచుకున్న పని సఫలమవుతుందా ,లేక విఫలమవుతుందా ?
- కర్కాటకము(10) ఈ వివాహం చేసుకొంటే లాభమా , లేక నష్టమా ?
- సింహము (11) ఈ వ్యాపారంలో భాగస్వామ్యం వల్ల ,లాభమా లేక నష్టమా?
- కన్య (12) ఈ స్త్రీ గర్భంలో శిశువు పురుషుడా లేక స్త్రీ శిశువా?
- తుల (13) ఇతని రోగము బాగవుతుందా , లేదా?
- వృశ్చికము (14) ఈ వ్యాజ్యం (కోర్టు కేసు) నుండి ఈ వ్యక్తికి ముక్తి లభిస్తుందా ,లేదా?
- ధనస్సు (15) ఈ రోజు నాకు ఎలా గడుస్తుంది ?
- మకరము (16) ఈ వ్యక్తి ప్రేత భాధతో పీడింపబడుతున్నాడా , లేక రోగముతోనా?
- కుంభము (17) ఈ స్థలము కొంటే లాభమా , నష్టమా?
- మీనము (18) ఈ వైద్యునితో రోగము నయమగునా , లేదా?
- సూర్యుడు (19) నా నివాస గృహంలో ఏవైనా దోషాలు కలవా?
- చంద్రుడు (20) ఈ కేసు గెలుస్తానా లేదా ?
- కుజుడు (21) ఈ వార్త నిజమగునా , కాదా?
- బుధుడు (22) ప్రస్తుత కష్టము నుండి నాకు విముక్తి కలదా, లేక లేదా?
- గురుడు (23) ఈ ఉద్యోగము వలన నాకు లాభమా, నష్టమా?
- శుక్రుడు (24) ఈ పోటీ పరీక్షలలో నాకు విజయం లభిస్తుందా , లేదా?
- శని (25) ఈ వస్తువు నాకు అచ్చుబాటు అవుతుందా,లేదా ?
- రాహువు (26) ఈ తప్పిపోయిన పశువు ఏ దిక్కుగా వెళ్లింది?
- కేతువు (27) ఈ వ్యక్తి జీవించి ఉన్నాడా, లేక మరణించాడా?
- బ్రహ్మ (28) నాకు అప్పు దొరుకుతుందా, లేదా?
- విష్ణువు (29) ఈ సంవత్సరంలో నాకు ప్రమోషన్’ దొరుకునా, లేదా?
- మహేశ్వరుడు(30) నాకు సమీప భవిష్యత్తులో బదిలీ అవకాశం కలదా, లేదా?
సమాధాన చక్రాలు
- అగ్ని చక్ర ఫలాలు.:
- వాయు చక్ర ఫలితములు :
- జల చక్ర ఫలితములు :
- ప్రుథ్వీ చక్ర ఫలితములు:
- ఆకాశ చక్ర ఫలితములు:
- మేష చక్ర ఫలితములు:
- వృషభ చక్ర ఫలితములు:
- మిథున చక్ర ఫలితములు:
- కర్కాటక చక్ర ఫలితములు:
- సింహ చక్ర ఫలితములు:
- కన్యా చక్ర ఫలితములు:
- తులా చక్ర ఫలితములు:
- వృశ్చిక చక్ర ఫలితములు
- ధనుష్’ చక్ర ఫలితములు:
- మకర చక్ర ఫలితములు:
- కుంభ చక్ర ఫలితములు:
- మీన చక్ర ఫలితములు:
- సూర్య చక్ర ఫలితములు:
- చంద్ర చక్ర ఫలితములు:
- కుజ చక్ర ఫలితములు:
- బుధ చక్ర ఫలితములు:
- గురు చక్ర ఫలితములు:
- శుక్ర చక్ర ఫలితములు:
- శని చక్ర ఫలితములు :
- రాహు చక్ర ఫలితములు:
- కేతు చక్ర ఫలితములు:
- బ్రహ్మ చక్ర ఫలితములు:
- విష్ణు చక్ర ఫలితములు:
- మహేష్’ చక్ర ఫలితములు:
- హనుమాన్’చక్ర ఫలితములు: