శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

16, జనవరి 2016, శనివారం

Kanuma


16-Jan-2016
ముహూర్తం: సూర్యోదయం: 6.53 గంటలకు
సూర్యాస్తమయం: 5.57 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-పుష్యమాసం
ఉత్తరాయనం-హేమంతరుతువు
శుక్లపక్షం
షష్ఠి రాత్రి 7.57 వరకు
నక్షత్రం: ఉత్తరాభాద్ర రాత్రి 2.31 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 12.57 నుంచి 2.27 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 9.06 నుంచి 9.50 వరకు
తిరిగి మధ్యాహ్నం 12.47 నుంచి 1.31 వరకు
అమృతఘడియలు: రాత్రి 10.00 నుంచి 11.30 వరకు
రాహుకాలం: ఉదయం 10.30 నుంచి 12.00వరకు

మేషం

స్త్రీలు దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత, పనిభారతం. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు.

వృషభం

ఉద్యోగస్తుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యంవల్ల కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబడికి మించిన ఖర్చులు, ఇతరత్రా చెల్లింపుల వల్ల ఇబ్బందులు తప్పవు. ఐరన్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లోని వారికి లాభదాయకం. ఆదాయం పెంచుకునే దిశగా మీ ఆలోచనలుంటాయి. బంధుమిత్రులతో మీ కార్యక్రమాలు, వ్యాపకాలు అధికమవుతాయి.

మిథునం

విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు సంతృప్తి. మీ నూతన ఆలోచనలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.

కర్కాటకం

సన్నిహితుల నుంచి ఆకర్షణీయమైన కానుకలు అందుకూంటారు. ప్రముఖుల సహకారంతో మీ సమస్య పరిష్కారం అవుతుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు తప్పవు. స్త్రీల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు సంతృప్తికరంగా సాగుతాయి.

సింహం

ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ప్రతిఫలం లభించదు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అన్నివిధాలా కలిసివస్తుంది. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.

కన్య

ఉపాధ్యాయులకు గుర్తింపు, వైద్య రంగాల్లోని వారికి చికాకు తప్పదు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాలపట్ల ఆకర్షితులవుతారు. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించటం మంచిది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి.

తుల

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లోని వారికి పురోభివృద్ధి. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం ఎంతో అవసరం. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు, చికాకులు చోటు చేసుకుంటాయి. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం.

వృశ్చికం

అసాధ్యం అనుకున్న ఒక వ్యవహరం మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. వాహనయోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలించవు. మీ దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. ప్రయాణాల ఆశయం నెరవేరుతుంది. నిరుద్యోగులకు సత్కాలం.

ధనస్సు

విద్యార్థులకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. పాత మిత్రుల ద్వారా ఒక సమస్య పరిష్కారం అవుతుంది. నిజాయితీగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు.

మకరం

స్త్రీలకు తల, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదురవుతాయి. అధికారులతో అవగాహన లోపిస్తుంది. రచయితలు, కళాకారులకు సదవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవటం మంచిది. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది.

కుంభం

విదేశీయానం కోసం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఊహించని చికాకులను ఎదుర్కొంటారు. కలప, ఇటుక, ఇనుము వ్యాపారస్తులకు కలిసి రాగలదు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లోనివారికి పురోభివృద్ధి. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. అకాల భోజనం, శ్రమాధిక్యత, ఒత్తిడి తప్పవు.

మీనం

ఆస్థి వ్యవహారాల్లో సోదరులు ఎంతో ఏకీభవిస్తారు. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై యత్నిస్తారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచటం మంచిది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభం అవుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...