జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు
మనలో ప్రతిఒక్కరి జీవితంలోనూ కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, సందర్భాలు వున్నాయి, వస్తూ వుంటాయి. అందరం ఎవరి స్థాయిలో వారు ఆ సందర్భాలను జరుపుకుంటూ వుంటాము. చాలాసార్లు ఇటువంటి సమయంలో ఏంచేయ్యవలెనో, ఎలా చేయ్యవలెనో, మన ప్రత్యేకతను ఎలా చాటుకోవాలనో ఆలోచిస్తూవుంటాం. సాంప్రదాయం ప్రకారం పాటించాలని మనసులో వున్నా, శక్తిసామర్ధ్యాలు వున్నా కొన్నిసార్లు పద్దతులు తెలియక, కావలసిన వస్తువులేవో తెలియక, చిన్న చిన్న విషయాలపైన అవగాహన లేకపోవడం వలన 'సరేలే' అని సర్దుకుపోతూ వుంటాం. ముఖ్యంగా, ఉద్యోగరీత్యా విడిగా అయినవారికి దూరంగా వుండేవారికి ఈ పరిస్థితి సాధారణం. ఇంట్లో పెద్దవారు సమయానికి లేకపోతే చాలామందికి ఇలానేవుంటుందికదా? అందుకే ఈ శీర్షిక. మీకోసం, మాకోసం, మన పిల్లల కోసం సందర్భానుసారంగా వీలైనన్ని వివరాలను సేకరించాలనేది మా ఆకాంక్ష.
అక్షరాభ్యాసము నాడు చేయవలసినవి:
డ్రస్సు, వెండి పలక, వెండి బలపము, స్పూను, క్యారేజి, బుట్ట, వాటరుబాటిలు, నాప్కిన్, పిల్లలకు 5 లేక 9 మందికి కాని పలక, బలపములు పంచిపెట్టవలెను, మరమరాలు, వేయించిన శనగపప్పు, బెల్లము కలిపి పిల్లలకు పంచిపెట్టవలెను. ఏదైనా దోషము వున్న యెడల పోవును.