ఏనాటిదీ వాస్తుశాస్త్రం?
వాస్తు ఈనాటిదికాదు.. రాజుల కాలం నుంచే ఉంది. ప్రతి రోజు కొలువులో ఒక జ్యోతిషునితో పాటు ఒక వాస్తు పండితుడు కూడా ఉండేవాడు. మహారాజు ఏ నిర్మాణం చేయాలన్నా వాస్తు పండుతుల సూచనలు పాటించినట్లు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. అంతేకాదు.... వాస్తు వేదకాలం నాటిది అని చెప్పేందుకు ఆధారంగా పలు తాళపత్ర గ్రంథాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. క్రైస్తవ, ముస్లిం మత గ్రంథాలలో కూడా ఇల్లు, దాని నిర్మాణ బాగోగులు గురించిన సమాచారం ఉండడం గమనించదగిన విషయం.