కిచెన్ - వాస్తు
కిచెన్ నిర్మాణ విషయంలో విధిగా వాస్త నియమాలను పాటించి తీరాలి. కిచెన్‌లో ఏర్పాట్లు ఎలా ఉండాలి.. ఈ విషయంలో వాస్తు ఏమి చెబుతుందో తెల్సుకుందాం.
1. విధిగా కిచెన్‌ను అగ్నేయ ములనే ఏర్పాటు చేసుకోవాలి. వీలుకాని పక్షంలో వాయ్యుంలో మాత్రమే కిచెన్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
2. ఈశాన్యం, నార్త్ మధ్యలో, వెస్ట్ మధ్యలో, నైఋతిలో, దక్షిణం మధ్యలో, ఇంటికి నడుమ... ఎట్టి పరిస్ధితిలోనూ కిచెన్ నిర్మాణినికి అనువైనవి కావు.
3. కిచెన్‌లో అమర్చుకునే కుకింగ్ ప్లాట్‌ఫాం ఎట్టి పరిస్ధిలో తూర్పు గోడను లేదా ఉత్తరపు గోడను తాకుతు ఉండరాదు. ఈ నియమేల్లంఘన ఎల్లెడలా జరుగుతూనే ఉంది. అగ్యేయంలో వంటగది అంటే... ఖచ్చితంగా కిచెన్ ప్లాట్‌ఫాం... ఇంటి తూర్పు గోడకు తాకుతూ ఉంటుంది. కనీసం అంగుళం అయినా ఈ ప్లాట్‌ఫాంకు ఇంటి తూర్పు గోడకు మధ్య ఖాళీ వుంచండి. ఇదే నియమాన్యి ఉత్తరపు గోడ విషయంలో కూడా వాయువ్యంలో కిచెన్ నిర్మించుకునే సమయంలో విధిగా పాటించాలి.
4. వంట చేసే సమయంలో తూర్పు దిక్కును చూస్తూ ఉండేలా కిచెన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి.
. స్టవ్ అతి చేరువగా సింక్, టాప్స్ ఉండకూడదు.
6. కిచెన్‌లో ఈశన్య మూల సింక్ ఏర్పటు చేసుకోవలి.
7. డిష్ వాషర్ ఉన్నట్లాయితే దీన్ని కిచెన్‌లో నైఋతి మూలన ఉంచలి.
8. త్రాగునీరు కిచెన్‌లో ఈశన్య దిశలో ఉంచలి. మైక్రో ఓవెన్,ఫ్రీఙె వంటి అప్లయెన్సెస్...కిచెన్‌లో నైఋతి మూల ఉండడం మంచిది.
9. కిచెన్‌లో క్రస్ వెంటిలేషన్ విషయంలో వాస్తూ నియమాలు పాటించాలి.తూర్పు గోడకు పెద్ద సైజ్ కిటికిలు..దక్షణ గోడకు చిన్న సైజ్ కిటికిలు అమర్చుకోవలి.
10. కిచెన్‌కు అనుకోని, కిచెన్ క్రింద భాగంలో ఎట్టి పరిస్ధీతులో నిర్మాణం చేయకూడదు.
11. కిచెన్‌లో సరుకులు ఉంచుకునేందుకు వినియోగించే షెల్ఫలు అల్‌మరలు...దక్షణ , పడమర గోడలకు అమర్చుకోవాలి.
12. అపార్టుమెంట్స్‌లో ప్రత్యేక పూఙగది నిర్మాణనికి స్ధలం చాలక పూజాగది కిచెన్‌లోనే ఓ మూలన ఏర్పాటు చేయడం ప్రస్తుతం జరుగుతుంది.పలు అపార్టుమెంట్సలో దీన్ని చూస్తూన్నాం.వాస్తుశాస్త్రరీత్య ఇది శాస్త్ర విరుద్ధమైన విషయం.
13. కిచెన్‌లో డైనింగ్ టేబుల్ అమర్చుకోవడం శాస్త్ర విరుద్ధ విషయమే. కిచెన్ దోరకు ఎదురుగా గ్యాస్‌స్టవ్ ఉంచకూడదు.