ఓవర్ హెడ్ ట్యాంక్.....
గృహ నిర్మాణ సమయంలో మనం విధిగా పాటించవలసిన వాస్తు సూత్రాలు... ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. మెదట ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం ఎలా చేయాలో తెల్సుకుందాం.
1. ఓవర్‌హెడ్ ట్యాంక్.... పడమర వైపు లేదా, నైఋతి మూలన ఉండేలా చూసుకోవాలి.
2. ఓవర్‌హెడ్ ట్యాంక్.... పై స్లాబ్‌కు రెండడుగుల ఎత్తులో నిర్మించుకోవాలి. పై స్లాబ్‌ను ఆనుకుని ఉండకూడదు.
3. ఈశాన్యంలో వాటర్ ఉండటం వాస్తురీత్యా సమంజసమే అయినా.. ఓవర్‌హెడ్ ట్యాంక్ వంటి బరువుల్ని ఈశాన్యం వైపు ఉంచకూడదు.
4. అగేయ దిక్కులో ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను ఎట్టి పరిస్ధితిలో నిర్మించ తగదు. చాలా దుష్ప్రభావాలకు కారణం అవుతుంది.
5. పడమరదిక్కున ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నిర్మించుకోవడం వాస్తు సమ్మతమే.
6. వాయువ్య దిశలో ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయకూడదు.
7. బిల్డింగ్ పైన మధ్య భాగంలో ఓవర్‌హెడ్ ట్యాంక్ ఎట్టి పరిస్ధితుల్లో నిర్మించకూడదు.