తేది. 28-05-2022 న శని త్రయోదశి. ఈ నెలలో పౌర్ణమి ముందు కూడా ఈ శని త్రయోదశి వచ్చినది. అయితే అమావాస్య ముందు వచ్చే శనిత్రయోదశికు ప్రాధాన్యత ఎక్కువ.
ఈ శని త్రయోదశి నాడు శనైశ్చరునకు ప్రీతిని కలిగించినట్లయితే ఆయన బాధించడు. అందువలన ఈ రోజున చేయు అభిషేకమునకు ప్రాధాన్యత ఎక్కువ.
మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మందేశ్వర స్వామిని(శని భగవానుడు) ఆరాధించుట వలన ''శని బాధల'' నుండి విముక్తి కలుగును.
ఏలిన నాటి శని పీడ గల రాశులు
*మీనం*
*కుంభం*
*మకరం*
*అర్ధాష్టమ శని* పీడ గలరాశి
*వృశ్చికము*
*అష్టమ శని* బాధ గల రాశి
*కర్కాటకము*
అలాగే *శని దశలు*, *అంతర్దశలు*, బాగాలేని వారుకూడా ఈ మందేశ్వరుని ఆరాధించవచ్చు.
Shani Trayodashi : రేపు శని త్రయోదశి… ఈ వస్తువులు దానం చేస్తే అంతా శుభమే!
శనీశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామివారికి నువ్వుల నూనె, నల్లటి నువ్వులతో అభిషేకం చేసిన అనంతరం నీలిరంగు పుష్పాలను సమర్పించి పూజించాలి.
ఈ విధంగా స్వామివారికి నీలిరంగు పుష్పాలతో పూజ చేసి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా శని త్రయోదశి రోజు కాకులకు ఆహారం పెట్టడం వల్ల పితృ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇలా కాకులకు ఆహారంగా పెట్టిన అనంతరం నల్లని వస్త్రంలో నువ్వుల నూనె, నల్లటి నువ్వులను దానం చేయడం వల్ల ఏలినాటి శని తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. ఇకపోతే ఈ శని త్రయోదశి కేవలం శనీశ్వరునికి మాత్రమే ప్రీతికరమైనది కాదు ఈ శని త్రయోదశి శివకేశవులకు కూడా ఎంతో ప్రీతికరమైనది. అందుకే పెద్ద ఎత్తున శివకేశవులకు కూడా పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం శివకేశవులు అశ్వత్థ వృక్షంలో కొలువై ఉంటారనే విషయం మనకు తెలిసిందే.అందుకే ఈ శని త్రయోదశి రోజున అశ్వర్థ వృక్షానికి వెళ్లి ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఆ శివకేశవుల అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. అందుకే ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజున పెద్ద ఎత్తున భక్తులు శనీశ్వర ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించడంతో పాటు అశ్వత్థ వృక్షానికి కూడా పూజలు చేస్తారు.