శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

28, ఏప్రిల్ 2012, శనివారం

కుజ రత్నధారణ

శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం, రత్నధారణ,

                           


         

పగడము

ముదురు ఎరుపురంగు కలిగి నునుపుగా ఉండి ప్రకాశవంతమైన పగడాలు కుజగ్రహానికి చాలా ప్రీతి. కుజుడు రక్త వర్ణము కలిగి అగ్నితత్వం గల పురుషగ్రహము. పగడముకూడా తేజోతత్వానికి సంబంధించినది. ఎర్రగా నుండుట వల్లనే కుజునుకి ఇష్టప్రదమైనది. ఈ పగడము త్రిదోషమునందలిపిత్తమను దోషమును హరింపగలదు. సమానవాయువు సంకేతముగా గలది, పురుషజాతికి, క్షత్రియత్వమునకు సంభంధించిన దగుటవలన చాలా కఠినముగా నుండి కోతకు స్వాధీనపడదు. శరీరమునందలి మూలాధార చక్రమునందలి వివిధ కాంతి విశేషములన్నియు ఈ పగడమునందు నెలకొని యుండుట వలన, మూలాధార చక్రమునందలి పసుపుపచ్చని రంగుగల కాంతి కిరణాల దేహతత్వంపై ఏ విధంగా పనిచేయగలవో ఈ పగడం ధరించడంవల్లకూడా అదేవిధంగా హరిత కిరణాలు దేహ రంద్రాలగుండా చొచ్చుకుపోయి, రక్త దోషాలు, లివర్, బ్లడ్ ప్రషర్, అల్సరు, జననేంద్రియ సంభంధిత వ్యాధులు, స్ఫోటకం వంటి అనేక అంటువ్యాధులు, కీళ్ళ బాధలు మొదలగు అనేక ఋగ్మతలు పారద్రోలి ఆరోగ్యవంతులను చేయగలదు.
మృగశిర, చిత్త, ధనిష్ఠ అను నక్షత్రములందు బుట్టిన వారు ఏ కాలమునందైనను మంచిపగడాలను ధరించవచ్చును. ఇతర నక్షత్రజాతకులలో ముఖ్యంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రజాతకులు పగడం ధరించి సత్ఫలితలు పొందటం చాలా కష్టము, మిగిలినవారు తమ యొక్క జన్మకాలమునందలి జాతక చక్రము ననుసరించి గ్రహముల యొక్క దశాంతర్దశలను గమనించి కుజగ్రహము దోషప్రమాదముగా నున్న సమయములందే పగడము ధరించవలెను. అట్లు ధరించిన యెడల కుజగ్రహ దోషమువల్ల జీవితంలో సంభవించే అనేక అనర్థాలు, నివారింపబడి శుభము జయము కలుగును.
జన్మ సమయమున లేర్పడిన జాతక చక్రమునందు లగ్నము నుంచి, 6-8-12 స్థానములందు కుజుడుండిన లేక ఆ స్థానాధిపతులతో కలయిక గానీ, దృష్టిగానీ పొందియుండిన యెడల కుజగ్రహ దోషప్రమాదము, కుజునికి ద్వితీయ, సప్తమాధి పత్యములు గల్గుట 2-4-7-8 స్థానములందుట కూడా దోషప్రదమే! షడ్వర్గ బలము, అష్టక బలము, కలిగిన కుజ గ్రహము పైన దెల్పిన స్థానములందుండిన విశేషహాని జేయుటకు దుష్టలక్షణములు కలిగి బలవత్తరుడైయున్న అంగారక గ్రహము యొక్క మహర్దశలు, అంతర్దశలు సంభవించినపుడు మరియు గోచారమునందు కుజునికి దుష్టస్థానమునందు స్తంభనము వ్రక్రత్వము గ్రహయుద్దము, పాపగ్రహవేధలుసంభవించియున్న కాలమునందు శతృవృద్ది, పోట్లాట్లు, దరిద్రము ఉద్రేకము, రక్తహీనత, దీర్ఘరోగములు, శస్త్రచికిత్సలు, ఆకస్మిక ప్రమాదములు, అగ్నిభాధలు, విషపీడ, ఋణబాధ, దాయాది వైరము, భూనష్టము, అవమానము, కాలవిఘ్నము, నీచజన స్నేహము, నిత్యకలహము, దంపతులకెడబాటు, సుఖవ్యాధులచే బాధలు, మెదలగు దుఃఖ ప్రదమైన అనేక ఫలితాలు ప్రాప్తించును. అట్టి సమయమునందు ఉత్తమమైన పగడము ధరించిన అరిష్ట నివారణమై శుభం కలుగుతుంది.
పగడం ధరించడం వలన కలిగే శుభయోగాలు :
బ్రహ్మజాతికి , క్షత్రియ జాతికి సంభంధించిన సంభంధించిన ఉత్తమమైన పగడాలను శాస్త్రీయ పద్ధతులననుసరించి ధరించిన యెడల చాలా శుభం జరుగుతుంది. ఆచరించే ప్రతికార్యంలో కలిగే విఘ్నాలు అంతరించి ఆయా పనులలో విజయం లభిస్తుంది. ఆ కారణముగా శత్రుత్వము తొలగిపోయి జనవశీకరణ లభించగలదు. పగడము అగ్నినుంచి, ఆయుధముల నుంచి కౄరశతృవుల నుంచి తగిన రక్షణ చేకూర్చగలదు. ఆకస్మిక ప్రమాదములు, గండములను తప్పించి క్షేమం కలిగించగలదు. చాలా కాలం బాధిస్తున్న ఋణ బాధలు, సూర్యోదయమునకు చీకట్లు తొలగి పోయినట్లు తొలగిపోవును. వివాహ విషయములో కలిగే వివిధ ఆటంకములు అంతరించి శీఘ్రంగా వివాహం జరుగగలదు. కుజదోషముల వలన కలిగే దాంపత్య జీవితంలో కలిగే కలహాలు, కలతలు కార్పణ్యాలు, పరస్పర వైషమ్యాలు, విడాకులలాంటి దుర్మార్గపు భావనలు, అంతరించి, అన్యోన్యప్రేమ పూరితమైన అనురాగంతో దంపతులు దీర్ఘకాలం సుఖసంసార జీవనం చేసుకొనుటకు తోడ్పడుతుంది. భారీయంత్ర పరిశ్రమలో తరచుగా కలుగుచుండే అనేక ప్రమాదాలు, మోటారు వాహనములకు కలిగే నష్టాలు, శతృవుల కుయుక్తులవల్ల సంభవించే రాజకీయ భాధలు, పోలీస్ కేసులు, ఇతర బాధలు, లివర్ వ్యాధులు, మూలశంక రక్తపోటు, జ్వరము, దేహతాపము, చర్మవ్యాధులు, గడ్డలు వ్రణములు వాపులు కీళ్ళబాధలు జననేంద్రియములకు సంభంధించిన అన్ని రోగాములు. కడుపునొప్పి కాన్సరు మొదలగు యింకా అనేక వ్యాధులను శీఘ్రంగా నివారించి సంపూర్ణ ఆరోగ్యవంతులగుటకు పరిపూర్ణ సంతోషముతో తృప్తిగల సుఖవంతమైన జీవితమును గడుపుటకు పగడము తోడ్పడగలదు. పగడము ధరించిన వారికి జీవితంలో నైరాస్యం బద్దకం సోమరితనం అనేవి ఉండవు. సహనం సాహసం విజృంభణ అధికంగా నుంటవి. అన్యాక్రాంతంలో నున్న భూములు స్వాధీనమగుతవి. పశుసంపద వృద్దినొంది, వ్యవసాయరంగంలో విశేష లాభాన్ని పొందుతారు. మిలటరీ, పోలీస్ శాఖల్లో పనిచేసేవారు క్షత్రియ జాతి పగడాన్ని ధరించడం చాలా మంచిది. వారి వృత్తిలో అసాధారన ప్రతిభగలవారై ప్రతి పనియందు విజయాన్ని పొందుతారు. పగడానికి అధిపతియైన కుజగ్రహం అనుగ్రహం కలిగి శుభగ్రహ స్థానల్లో ఉంటే ఎంత మంచి చేస్తాడో ఆ విధమైన బలం కలవాడై అశుభ స్థానాల్లో ఉంటే అంతటి కీడును కూడా కలిగిస్తాడు. ఆయనకు ప్రీతికరమైన పగడాన్ని ధరించడం వలన కుజగ్రహం ప్రసన్నుడై సకల ఆయురారోగ్యాలతో భోగ భాగ్యాలతో సంపదలతో, రాజ్యపూజ్యతల్ గౌరవం, ఆరోగ్యము, గౌరవం వంశాభివృద్ది, సకలసౌభాగ్యాలు కలుగచేస్తారు. పగడపు పూస మాలలు ధరించడం వలన కూడా పై విధమైన ఫలితాలు కలుగుతాయి. రుద్రాక్ష మాలల యందు ఏడు పగడాలు గానీ కనీసం ఒకటి రెండు పగడాలుగానీ జేర్చి ధరించవలెను.
ఇతర నవరత్నాలవలె పగడాలు అధిక ధరలుకలిగి యుండక అందుబాటు ధరల్లో లభిస్తాయి.
పగడము ధరించే పద్దతి :
పరిశుభ్రమైన పగడాలు ధారణకు యోగ్యముగానుంటవి. బ్రహ్మ జాతి ప్రవాళం బరువుగా నుండి ప్రకాశవంతముగా నుంటుంది. క్షత్రియజాతికి బరువు మాత్రంలోపించగలదు. ఇట్టి పగడము ఏడు కారెట్లు (21 వడ్డగింజల బరువు)గలదానిని ధరించుట శ్రేష్ఠము. త్రికోణముగా నున్న పగడము విశేషఫలప్రదము, అట్లుకాని యెడల బాదంకాయవలే నున్న దానిని వాడవచ్చు. నలుచదరపు, వర్తులము విల్లువలె నుండునది. నక్షత్రాకారమును పోలిన పగడములు ధారణకు అంతగా ఉపయోగించవు. పగడము చిన్నదైనా దోషరహితంగా వుండాలి. బంతివలెనున్న ప్రవాళాలు మూలలయందు, ఆభరనములందు కూర్చోనుట ఉత్తమము పగడముకూర్చే ఉంగరము బంగారంతో గానీ లేక వెండితో గానీ, లేదా పంచలోహములతో గానీ తయారు చేయించాలి. ఈ ఉంగరం పీట భాగంలో ముక్కోణాకారములో ఉండి దానిచుట్టూ వలయ రేఖలను ఏర్పరచడం చాలా ముఖ్యము. కృష్ణపక్షంలో చదుర్దశీ మంగళవారం వచ్చిన దినమునందుగానీ, లేక కుజుడు మకర రాశిలో ధనిష్ఠా నక్షత్ర సంచారం చేసే కాలంలో గానీ ఏదో ఒక మంగళవారంనాడు గానీ, మధ్యాహ్నం 1గం-2 గం|| మధ్యకాలంలో గానీ లేక రాత్రి 2గం- 3గం మధ్యకాలంలో గానీ దక్షిణముఖంగా కూర్చొని పగడము ఉంగరములో బిగించవలెను. ఆ తర్వాత ఆ ఉంగరమునుఒక దిన మంతయు నవధాన్యాలలో ఉంచి మరుసటి దినమంతయు పంచగవ్యములు (ఆవుపాలు, పెరుగు, ఆవునెయ్యి, ఆవు పంచితం, గోమయం కలిసినది)యందుంచి, మూడవరోజున సుగంధ, ద్రవ్యాలతోడను, ఎర్రచందనపు నీళ్ళచేతను రుద్రాభిషేకం జరిపించి శుద్దిగావించవలెను. ధరించెడివాడు తమకు తారాబలం చంద్రబలం గలిగిన శుభతిదులయందు (శనివారం గాక)మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నములు వర్తించు వేళాలందు ఉంగరము కుడిచేతి ఉంగరపు వేలికి ధరించాలి. ధరించుటకు పూర్వమే షోఢశోపచార పూజలు జరిపి నమస్కరించి గురువులను గణపతిని ధ్యానించి దక్షిణ ముఖముగా నిలువడి ఉంగరము కుడి అరచేతియందుంచుకొని "ఓం లం ఐం హ్రీం శ్రీం మహిపుత్రాయ సకలారిష్ట వివారనాయ క్లీం క్లీం స్వాహా"అనే మంత్రాన్ని నిశ్చలంగా 108 పర్యాయాలు జపించి, ఉంగరము ముమ్మారు కనులకద్దుకొని వ్రేలికి ధరించవలెను. స్త్రీలు మాత్రం ఎడమ చేతికి అనామికా వ్రేలికి ధరించుట శుభప్రదము. మాలలు ఇతర ఆభరణమునందలి పగడములకు కూడా పైవిధంగా శుద్దిని పుణ్యకార్యములను నిర్వర్తించి ధరించుట శాస్త్ర సమ్మతము, ఉంగరము అడుగుభాగాన రంద్రము కలిగి యుండవలెను.




కుజ గ్రహ దోష నివారణ

కుజ దోష నివారణకు గాను కుజుని పూజించి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుట వలన గాని,ఎర్రని పగడమును గాని కందులు,మేకలు,బెల్లము,బంగారము,ఎర్రని వస్త్రము,రాగి వీటి యందేదయిన దానము చేయుటకు కాని కుజదోష నివారణ అగును. వెండి పాత్రయందు చండ్రకర్ర గంధము,దేవదారుగంధం ఉసిరికపప్పు కలిపిన నీటితో స్నానముచేసిన అంగారకదోషం నివర్తింపబడును.బంగారు ఉంగరము ధరించు ఆచారము కలదు.
శుభ తిధి గల మంగళవారము నందు ఓం-క్రాం-క్రీం-క్రౌం-సః భౌమాయనమః అను మంత్రమును 7వేలు 40 రోజులలో పూర్తి చేసిన ఎర్రనిరంగు బుట్టలో కందులు వేసి 41 వ రోజున దానము చేయుట మంచిది. 



పగడం

ఇది కుజునకు ప్రతీకగా చెప్పబడినది. సముద్రంలో అడుగు భాగంలో పాలిప్స్ (polyps) అనే నీటి ప్రాణి నివసిస్తున్నది. ఈ ప్రాణి చెట్టు ఆకారంలో 6 నుండి 9 అంగుళాల పొడవు పెరుగుతుంది. ఇది సముద్రపు నీటినుండి కాల్షియం సేకరించి ఒక్కకొమ్మగా లైమ్ స్టోన్ స్కెలిటన్ ని పెంచుకుంటూ పోతుంది. పాలిప్స్ కొమ్మ చివరి భాగాలు గుండ్రంగా ఖాళీగా వుంటాయి. అందులో డిపాజిట్ అయ్యే కాల్షియం కార్బొనేట్ కారణంగా పోలిప్స్ పెరుగుతుంది, అలా పెరిగిన ఆ మొక్కలాంటి జీవి కొమ్మ లేదా ఎముకలనే మనం 'పగడం' గా చెప్పుకుంటున్నాము. ఆ విధంగా 'పగడము' అనేది సముద్రంలో నివసించే ఓ జలచరం తాలూకు ఓ భాగంగా మనం చెప్పుకోవాలి. పగడం అనేది రంగులలో దొరుకుతుంది. ఎరుపు, తెలుపు, గులాబీ, కాషాయం, పసుపు, పచ్చ రంగుల్లో పగడం దొరికినా, జ్యోతిషపరంగా ఎరుపురంగు పగడాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. పగడం ఎప్పటికి అదే రంగులో ఉంటుంది అనే గ్యారంటీ లేదు. అది మంచి పగడమే అయినప్పటికీ ఒక్కసారి రంగు వేలిసిపోవడమూ జరుగుతుంది. అంత మాత్రాన రంగు వెలిసిపోయింది కాబట్టి అది నకిలీ అనుకోవడానికి వీల్లేదు.


“మెఱసి నిద్దంపు గెంపుల మిగులంగదసి
కోరి ధరియించు వారికి గొఱత లేక
సర్వ సౌభాగ్య ప్రశస్త వస్తు
భద్రకారణ సంసిద్ధి విద్రుమంబు"
తా|| దొండపండ్లను, ఉస్తి పండ్లను, ఎర్రటి పండ్లను, దేవదారు పండ్లను, సుందరాంగుల కెంపెదవులను, చిలుక ముక్కులను, రక్తచంద్రన కాష్ఠమును మించి కెంపు వంటి కెంజాయ కలిగియుండెడి పగడములను ధరించు వారలకు కొరత లేక సర్వసౌభాగ్యములు, సర్వయోగ్య వస్తు సమృద్ధియు గలుగును.

పడగములో దోషాలు:

కొమలము: ఆవుపేడ వంటి మరకలు వున్నవి
జర్ఘరము: బుడిపెలు వంటివి వున్నవి.
బొప్పి: సమానముగా లేకుండా వున్నవి.
మలినము: నల్లటి మరకలు వున్నవి
కుందేటి రక్తము వలె ఎర్రగా వున్నది బ్రాహ్మణ జాతి అని, మనోహరమై తేలికగా మంకెనపువ్వు, దాసానిపువ్వు, సిందూరము వీనిలో రంగుకు తీసిపోక గట్టిగాను, నునుపుగాను నుండునది క్షత్రియ జాతి. మోదుగ, పొదిరిపుష్పము వలె విరాజిల్లు నది వైశ్యజాతి, మలినముగా తక్కువ ప్రకాశం కలిగి నునుపుగానున్నది శూద్రజాతి అని చెప్పవచ్చును.

లభించే ప్రదేశాలు:

అల్జీరియా, ట్యునీషియాలతో పాటు, ఫ్రాన్స్, సిసిలీ, స్పెయిన్, ఆస్ట్రేలియా, మారిషన్, తాలూకు ఎర్ర సముద్రతీరాల్లో తీరం వెంబడి ఐదు నుండి యాభై మీటర్ల దూరంలో పగడపు కొమ్మలు దొరుకుతాయి. సముద్రంలో ఎంతలోతులోకి వెళ్తే అంత తేలికైన పగడాలు దొరుకుతాయి.


పగడం ధరించడం వల్ల నీరసం వదిలి, శారీరక సమర్ధతను, నాయకత్వ లక్షణాలను సంపాదించగలుగుతారు. పగడం ఎరుపురంగు కాస్మిక్ రేస్ ని ట్రాన్స్ మిట్ చేస్తుంది. అది రక్తం మీద నరాల వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఆవిధంగా జ్వరం, బ్రాంకై టిస్, జాండిస్. ఫైల్స్, చికెన్ ఫాక్స్ లాంటి వ్యాధుల నుండి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. పగడ ధారణ మంగళవారం చేయవలెను. పగడాన్ని ఉంగరంలో ధరించేటప్పుడు బంగారం, వెండి, రాగి లోహాలను ఉపయోగించవచ్చును. పగడం చేతివ్రేళ్ళలో అనామిక (ఉంగరం వ్రేలు), చూపుడు వ్రేలికి ధరించవచ్చును.

పగడం వివిధ నామాలు:

వ్యాపారనామం- కొరల్, దేశీయనామం - కొరల్, ముంగా, మంగల్, ప్రవాళము
ఇతర నామాలు - అంగారక మణి, అబ్దిపల్లవము, కుజప్రియము, రక్తాంగము, విద్రుమము
 లక్షణాలు:
రసాయన సమ్మేళనం: CaCO3, కాల్షియం కార్బొనేట్ మరియు 3% MgCO3 స్పటిక ఆకారం కర్బణ సమ్మేళనం. వర్ణము - లేత ఎరుపు, ముదురు ఎరుపు, ఆరెంజ్,నలుపు, బ్లీచింగ్ తరువాత బంగారు వర్ణం, వర్ణమునకు కారణం - ఐరన్, మెగ్నీషియం,మెరుపు - వాక్సిం, కఠినత్వము - 3.5, దృఢత్వము - గుడ్, సాంద్రత(S.G) 2.60 – 2.7, పగులు - అసమానం నుండి స్పింటరి: అంతర్గత మూలకాలు - రంధ్రాలు, పట్టిలు, కాంతి పరావర్తన పట్టిక (RI) 1.486-2.658. U.V.Light – జడం, సాదృశ్యాలు, - పెస్ట్, ప్లాస్టిక్, మైనం, సింథటిక్ గిల్సన్ కొరల్ పెరల్, ఇవరి, మార్బుల్, కాలసైట్ HCL తో చర్యజరిపిన రంగు కోల్పోవును.




|| అఙ్గారకస్తోత్రమ్||

అస్య శ్రీ అఙ్గారకస్తోత్రస్య|
విరూపాఙ్గిరస ఋషిః|
అగ్నిర్దేవతా|
గాయత్రీ ఛన్దః|
భౌమప్రీత్యర్థం జపే వినియోగః|
అఙ్గారకః శక్తిధరో లోహితాఙ్గో ధరాసుతః|
కుమారో మఙ్గలో భౌమో మహాకాయో ధనప్రదః|| ౧||
ఋణహర్తా దృష్టికర్తా రోగకృద్రోగనాశనః|
విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః|| ౨||
సామగానప్రియో రక్తవస్త్రో రక్తాయతేక్షణః|
లోహితో రక్తవర్ణశ్చ సర్వకర్మావబోధకః|| ౩||
రక్తమాల్యధరో హేమకుణ్డలీ గ్రహనాయకః|
నామాన్యేతాని భౌమస్య యః పఠేత్సతతం నరః|| ౪||
ఋణం తస్య చ దౌర్భాగ్యం దారిద్ర్యం చ వినశ్యతి|
ధనం ప్రాప్నోతి విపులం స్త్రియం చైవ మనోరమామ్|| ౫||
వంశోద్ద్యోతకరం పుత్రం లభతే నాత్ర సంశయః|
యోऽర్చయేదహ్ని భౌమస్య మఙ్గలం బహుపుష్పకైః|| ౬||
సర్వా నశ్యతి పీడా చ తస్య గ్రహకృతా ధ్రువమ్|| ౭||
|| ఇతి శ్రీస్కన్దపురాణే అఙ్గారకస్తోత్రం సంపూర్ణమ్||




||కుజ కవచమ్||

శ్రీగణేశాయ నమః|
అస్య శ్రీ‍అఙ్గారకకవచస్తోత్రమన్త్రస్య కశ్యప ఋషిః,
అనుష్టుప్ ఛన్దః, అఙ్గారకో దేవతా, భౌమప్రీత్యర్థం జపే వినియోగః|
రక్తామ్బరో రక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్|
ధరాసుతః శక్తిధరశ్చ శూలీ సదా మమ స్యాద్వరదః ప్రశాన్తః|| ౧||
అఙ్గారకః శిరో రక్షేన్ముఖం వై ధరణీసుతః|
శ్రవౌ రక్తామ్బరః పాతు నేత్రే మే రక్తలోచనః|| ౨||
నాసాం శక్తిధరః పాతు ముఖం మే రక్తలోచనః|
భుజౌ మే రక్తమాలీ చ హస్తౌ శక్తిధరస్తథా|| ౩||
వక్షః పాతు వరాఙ్గశ్చ హృదయం పాతు రోహితః|
కటిం మే గ్రహరాజశ్చ ముఖం చైవ ధరాసుతః|| ౪||
జానుజఙ్ఘే కుజః పాతు పాదౌ భక్తప్రియః సదా|
సర్వాణ్యన్యాని చాఙ్గాని రక్షేన్మే మేషవాహనః|| ౫||
య ఇదం కవచం దివ్యం సర్వశత్రునివారణమ్|
భూతప్రేతపిశాచానాం నాశనం సర్వసిద్ధిదమ్|| ౬||
సర్వరోగహరం చైవ సర్వసమ్పత్ప్రదం శుభమ్|
భుక్తిముక్తిప్రదం నౄణాం సర్వసౌభాగ్యవర్ధనమ్|
రోగబన్ధవిమోక్షం చ సత్యమేతన్న సంశయః|| ౭||
|| ఇతి శ్రీమార్కణ్డేయపురాణే మఙ్గలకవచం సమ్పూర్ణమ్||


jyothisham, telugu jyothisham, online telugu jyothisham, Teugu Astrology, online telugu astrology predictions,vasthu, Purohit, astrology in telugu, jathakam in telugu, jyothisham in telugu, Online Telugu Astrology, online telugu jyothisham, telugu astrology, Today Panchangam,telugu rasi phalalu, horoscope in telugu, Online Poojalu, Telugu Horoscope, Telugu Panchangam, Vasthu In Telugu, Astrology, Benefic and Malefic Planets Charts,How to read horoscope, chart Jataka Chakram, Planets Rasi Telugu,Jathakam,Horoscope in Telugu, తెలుగు జాతకం, Most accurate and most popular online Telugu Astrology,telugu astrology software, telugu astrology by date of birth, today telugu astrology, telugu astrology by date of birth,telugu astrology, rashi and graha matching,telugu astrology in telugu, telugu astrology software free download, free telugu astrology, telugu astrology 40 pages, telugu astrology horoscope, telugu astrology, jyotish matching, telugu astrology books, telugu astrology free,telugu astrology for marriage, telugu astrology app free download, telugu astrology matching, telugu astrology detail, astrology in telugu, telugu astrology for today, telugu astrology online, telugu astrology today, telugu astrology for this week, telugu astrology paid, twitter jyothisham telugu , jyothisham telugu tutorial , free jyothisham telugu, online jyothisham telugu, jyothisham telugu, Rashi Phalalu now. Jathakam/ Horoscope in Telugu. తెలుగు జాతకం. Most accurate and most popular online Telugu Astrology. Welcome to our online Telugu Jatakam service. Here you can check your horoscope in Telugu తెలుగు జాతకం, వధూవర గుణమేళనం, నవజాత శిశుజాతకం, రాశిఫలములు, పంచాంగం మరియు జ్యోతిష పాఠాలు Telugu Jatakam with predictions. తెలుగు జాతకం ఫలితములతో. with newborn report in Telugu. తెలుగు జాతకం యోగాలు, కాలసర్పదోషం మరియు పరిహారములు మరియు మరిన్ని విశేషాలతో


ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...