శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

నవగ్రహచార ఫలములు - కుజుడు

కుజగ్రహము
కుజుని లక్షణాలు : కుజుడు పురుశ గ్రహం. రుచులలో చేదును, రంగులలో ఎరుపురంగును సూచించును. క్షత్రియజాతికి చెందినవాడు. అధిదేవత పృధ్వి. అగ్నితత్త్వము కలిగి, దక్షిణదిక్కును సూచించును. సన్నని నడుము కలిగి వంకీల జుట్టు, కండలు కలిగిన, ఎరుపు రంగు ఛాయ కలిగిన వారిని సూచించును. 16 సంవత్సరముల వయస్సు కలవారిని సూచించును. పిత్తాధిక్యత కలవాడు. గ్రీష్మఋతువును సూచించును. లోహములలో ఇనుము, ఉక్కును, రత్నములలో పగడమును సూచించును. ఈ గ్రహసంఖ్య 6. దశమభావంలో దిగ్బలము పొందును. ఇతను తమోగుణ ప్రథానుడు. లంకాపట్టణము మొదలు కృష్ణానది వరకు ఇతని దేశమని జాతకపారితాజం తెలుపుతున్నది.
కుజుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రములకు అధిపతి శరీరావయవములలో కండరాలు ఎముకలలోని మజ్జ, బాహ్య జననేంధ్రియములు, కణములను సూచించును. కుజుడు మేషం, వృశ్చిక రాశులకు అధిఅప్తి.. ఉచ్ఛరాశి మకరం. నీచరాశి కర్కటకం. మకరరాశిలో 28 వడిగ్రీ ఇతనికి పరమోచ్ఛ. అలాగే కర్కాటకంలో 28వ డిగ్రీ పరమనీచ. రవి, చంద్ర, గురులు ఇతనికి స్నేహితులు. బుదుడు శత్రువు. శుక్ర, శని ఇతనికి సములు.
కుజుని ప్రభావం :
శారీరక ధారుఢ్యము కలిగియుండి పొట్టిగా యుంటారు. త్వరగా ధనాన్ని సంపాదించగలరు. అంతేవేగంగా ధనాన్ని ఖర్చు పెట్టగలరు. బంధుమిత్రులంటే అపారమైన ప్రేమ. వీరు తమ ఆవేశాన్ని అదుపులో వుంచుకోవాలి. పదవి, అధికారం, సేవకులు కలిగియుంటారు. కోరికలు అధికంగా ఉంటాయి. దానధర్మాలు అధికంగా చేస్తారు. యంత్రములు, ఆయుధములు, మొదలగు శాస్త్రములలో ప్రావీణ్యత పొందుతారు. పోలీసు మిలటరీ వంటి శాఖలలో రాణిస్తారు.
కుజుని కారకత్వములు :
కుజుడు శక్తికి కారకుడు. అక్కాచెల్లెళ్ళు, ఆయుధములు, అగ్ని, వంటగది, శస్త్రచికిత్స, భూమి, బ్లడ్ బ్యాంకులు, ప్రేలుడు సామాను, బాంబులు, రసాయనాలు, అన్నిరకాల యంత్రాలను సూచించును. అసత్యము చెప్పుట, పరస్త్రీలతో సంబంధము, మూర్ఖత్వము, కోపము, కఠినముగా మాట్లాడుట, దోపిడీలు కొట్లాటలు, విప్లవములు, కిడ్నాపులు, కాల్పులను సూచించును. సీసము, క్రిరమృగములు, మశూచి, ఆటలమ్మ, అపెండిసైటిస్, హెమరేజ్ మొదలగు వ్యాధులను సూచించును. న్యాయవాదులు, న్యాయమూర్తులు, స్త్రీవ్యామోహులు, మాంత్రికులు, టెర్రరిస్టులను సూచించును. కాఫీ, టీ, పొగాకు, బీడీ, ఆవాలు, అల్లము, శొంఠి, వెల్లుల్లి, జీడిమామిడిని సూచించును.
కండపుష్టి, యుద్ధము, గాయాలు, హింస, అత్యాచారము, కత్తి, క్రూరత్వము, ధైర్యము, సాముగరిడీలు, సైన్యము, కలహాలు, ఆయుధసామాగ్రి, సాహసము, హంతకుడు, తిరుగుబాటుదారులు, ఫిరంగులు, దోపిడీదొంగ, మండుట, వేడిపరికరములు, కాట్లు, జ్వరాలు, పనులు, కోపము, పెళ్ళి, వంట, పాత్రలు, పగలగొట్టుట, పొయ్యి, బాక్సర్, రేడియేషన్, సలహాలు, సర్జన్ లు, ఇంజనీర్లు, ఆడపంది, కంచగాడిద, టార్పెడోలను సూచించును.
కుజుడు సూచించు విద్యలు :
కుజుడు అగ్రికల్చర్ డిగ్రీ, సివిల్ ఇంజనీరింగ్, మిలటరీ ఇంజినీరింగ్, ఎరోనాటికల్ ఇంజనీరింగ్, రసాయనవిద్య, ఆయుదముల తయారీ, అగ్ని మాపకములు, న్యాయవాదులు, విద్యుతుద్పాదన, బ్లాక్ స్మిత్ లను సూచించును.
కుజుడు సూచించు వ్యాధులు :
గాయములు, అబార్షన్, ఋతుక్రమము సరిగా లేకపోవుట, మశూచికం, ఆటలమ్మవ్యాధి, గవద బిళ్ళలు, అపెండిక్స్ వ్యాధి, హెర్నియలను కుజుడు సూచించును. కుజుడు బుధ్నితో కలసి చర్మరోగాలు, శుక్రునితో కలసి కండరములకు సంబంధించిన వ్యాధులు, హైడ్రోసిల్, రక్తనాళములు పగులుట, పైత్యరోగము, వ్రణములు, సెప్టిక్ అగుటను సూచించును. రాహువుతో కలసి విషప్రయోగము, శక్తి క్షీణించుట, ముసలితనము, విషకీటకముల వలన బాధలు, మెదడులో రక్తనాళములు చిట్లుట, తలనెప్పిలను సూచించును.
కుజుడు సూచించు వృత్తి వ్యాపారాలు :
మందులమ్మువారు, కెమిస్టులు, పోలీసు, మిలటరీవ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులు, కసాయివారు, సర్జనులను సూచించును. వంటవారు, ఇనుము, ఉక్కు సంబంధించిన ఫ్యాక్టరీలలో పనిచేయువారు, లోహములతో వస్తువులు తయారు చేయువారిని సూచించును. పొగాకు, లక్క, కల్లు, సారాయి, బ్రాందీ, విస్కీ, కత్తి, గొడ్డలి, తుపాకి, జీడిపప్పు, వేరుశనగ, వక్క, టీ, కాఫీ, అల్లం మొదలగు వాటికి సంబంధించిన వ్యాపారాలను సూచించును. మోటారు, నిప్పు, గ్యాస్ లతో కూడిన వృత్తులను సూచించును. రవితో కూడిన మిలటరీ హాస్పిటల్ లో రవి, బుధులతో కలసి రక్షణశాఖలో ఆడిటర్, శనితో కలసి స్మశానంలో గుంటలు త్రవ్వేవారిని సూచించును.
కుజుని కి మిత్రులు :సూర్య చంద్ర గురు
కుజుని కి శత్రువులు : బుధ
కుజుని కి సములు: శుక్ర శని రాహు కేతు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...